honest
-
Ram Mandir Ayodhya: పాలనలో రాముడే స్ఫూర్తి: మోదీ
షోలాపూర్/: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీరాముని స్ఫూర్తితో నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సోమవారం అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను చరిత్రాత్మక సందర్భంగా అభివరి్ణంచారు. ఆ రోజున దేశమంతటా ఇంటింటా రామజ్యోతిని వెలిగించాలని మరోసారి పిలుపునిచ్చారు. అది పేదరిక నిర్మూలనకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రధానిగా తాను మూడోసారి విజయం సాధించాక ‘మోదీ హామీ’ల దన్నుతో భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రూ.2,000 కోట్ల విలువైన 8 అమృత్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 90 వేలకు పైగా ఇళ్లను లాంఛనంగా పేదలకు అందజేశారు. పీఎం స్వానిధి పథకం కింద 10 వేల మంది లబ్ధిదారులకు ఒకటో, రెండో వాయిదాల చెల్లింపుకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘దేశమంతటా గొప్ప ఆధ్యాతి్మక వాతావరణం నెలకొని ఉంది. నాసిక్‌లో గత వారం అనుష్టానం మొదలు పెట్టాను. మీ ఆశీస్సులతో అయోధ్య వెళ్తున్నా’’ అని ప్రకటించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులను చూస్తుంటే తన హృదయం ఆనందంతో నిండిపోతోందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. బాల్యంలో తనకిలాంటి ఇంట్లో ఉండే అవకాశం లేకపోయిందని చెమర్చిన కళ్లతో గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రజల కలలు నెరవేరినప్పుడే నిజమైన ఆనందం. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద పెట్టుబడి. గత ప్రభుత్వాల్లో పేదల సంక్షేమానికి కావాల్సిన నియత్ (ఉద్దేశం), నీతి (విధానం), నిష్ట (చిత్తశుద్ధి) లోపించాయి. పేదల సంక్షేమం, శ్రామికుల గౌరవం కోసం 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు, 10 కోట్లకు పైగా టాయ్లెట్లు నిర్మించాం’’ అని చెప్పారు. బోయింగ్ క్యాంపస్ ప్రారంభం దొడ్డబళ్లాపురం/సాక్షి, చెన్నై: భారత్ శరవేగంగా సాధిస్తున్న ప్రగతిని అందిపుచ్చుకోవాల్సిందిగా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మోదీ పిలుపునిచ్చారు. పాతికేళ్లలో సంపన్న భారత నిర్మాణమే ప్రతి భారతీయుని లక్ష్యంగా మారిందన్నారు. ఆ దిశగా 25 కోట్ల భారతీయులను గత తొమ్మిదేళ్లలో పేదరికం నుంచి బయటికి తీసుకొచి్చనట్టు చెప్పారు. వైమానిక రంగంలోనూ దేశం శరవేగంగా ప్రగతి సాధిస్తోందని హర్షం వెలిబుచ్చారు. బెంగళూరు శివార్లలో దేవనహల్లి హైటెక్ డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ క్యాంపస్‌లో రూ.1,600 కోట్లతో నిర్మించిన బోయింగ్ నూతన గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. భారత సామర్థ్యంపై ప్రపంచం పెట్టుకున్న నమ్మకానికి ఈ క్యాంపస్ తాజా నిదర్శనమన్నారు. భారత్ గత కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశీయ వైమానిక మార్కెట్‌గా ఎదిగిందని గుర్తు చేశారు. అనంతరం మూడు రోజుల తమిళనాడు పర్యటన నిమిత్తం మోదీ చెన్నై చేరుకున్నారు. అభిమానులు, బీజేపీ మద్దతుదారుల స్వాగతం నడుమ నెహ్రూ స్టేడియం దాకా 4 కిలోమీటర్ల మేర రోడ్ షో జరిపారు. అక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2023ను ప్రారంభించారు. 2029 యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు వేదికగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ప్రధాని ప్రకటించారు. మహిళలే వృద్ధి సారథులు భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల సారథ్యానికి పెద్దపీట వేస్తున్నట్టు మోదీ చెప్పారు. వైమానిక రంగంలోనూ మహిళలకు నూతన అవకాశాలు కలి్పంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందుకుద్దేశించిన ‘బోయింగ్ సుకన్య’ పథకాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. భారత పైలట్లలో 15 శాతం మహిళలేనని మోదీ గుర్తు చేశారు. అంతర్జాతీయ సగటు కంటే ఇది మూడు రెట్లు ఎక్కువన్నారు. సుకన్య పథకం కింద సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) తదితరాల్లో విద్యాభ్యాసానికి అమ్మాయిలకు అవకాశం కలి్పంచి వైమానిక రంగ ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దుతామని బోయింగ్ ప్రకటించింది. పైలట్ శిక్షణకు మహిళలకు స్కాలర్íÙప్లు ఇస్తామని పేర్కొంది. సిద్ధూ, అది సహజం! ‘మోదీ.. మోదీ’ నినాదాలపై ప్రధాని బెంగళూరు బోయింగ్ క్యాంపస్ ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని ప్రసంగిస్తుండగా సభికులంతా మోదీ, మోదీ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఆయన కాసే పు ప్రసంగాన్ని ఆపేసి వింటూ ఉండిపోయారు. వేదికపై కూర్చు ని దీనంతటినీ తిలకిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వైపు తిరిగి, ‘‘ముఖ్యమంత్రీ జీ! ఐసా హోతా రహతా హై (అలా జరుగుతూంటుంది) అంటూ చమత్కరించారు. దాంతో సీఎంతో పాటు వేదికపై ఉన్న గవర్నర్ తదితరులు చిరునవ్వులు చిందించారు. -
పార్క్ చేసి ఉన్న బైక్‌పై డబ్బుల బ్యాగ్.. తర్వాత ఏం జరిగిందంటే..
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన చదల అమరేశ్వరరావు రిటైర్డ్ ఉద్యోగి. సోమవారం గవర్నర్‌పేట బకింగ్ హామ్ పోస్టాఫీసులోని తన ఖాతా నుంచి రూ. 5లక్షలు డ్రా చేశాడు. ఇంటికి తిరిగి వెళ్తూ అక్కడ పార్క్ చేసి ఉన్న బైక్‌పై నగదు బ్యాగ్ ఉంచాడు. ఈ లోగా ఫోన్ రావడంతో మాట్లాడుకుంటూ బ్యాగ్ మరచిపోయి వెళ్లిపోయాడు. చదవండి: మాదాపూర్: ‘ఓయో’పై దాడి.. 8 మంది అరెస్ట్ కొద్ది సేపటికి బైక్ యజమాని కాగిత నరసింహారావు వచ్చి చూడగా తన బైక్‌పై క్యాష్ బ్యాగ్ కనిపించింది. వెంటనే అతను బకింగ్‌హామ్ పోస్టాఫీసు లోపలికి వెళ్లి బ్యాగ్ విషయం అక్కడ ఉన్న సిబ్బందికి తెలిపాడు. అప్పటికే అమరేశ్వరరావు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పోస్టాఫీసు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి క్యాష్ బ్యాగ్‌ను పరిశీలించి అమరేశ్వరరావుకు చెందినదని నిర్ధారించి అతనికి అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన కాగిత నరసింహారావును పోలీసులు, పోస్టాఫీసు సిబ్బంది అభినందించారు. -
వినయమే రక్షణ కవచం
విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు మతం లేదు. అతడు ఏ మతానికీ చెందిన వాడు కాదు. అతడు కాలానికి అతీతుడు. జనన మరణ చక్రానికి మించినవాడు. సృష్టికర్త ఈ విశ్వంలో ప్రతి ఒక్కరికీ ఆహారమూలాన్ని సృష్టించాడు. రాతిలోని పురుగుకు కూడా ఆహారాన్ని ఉంచాడు. మనిషికి పుట్టుక ఎంత సహజమో మరణమూ అంతే సహజం. ఈ ప్రపంచం తాత్కాలిక నివాసం... అని సృష్టికర్త తత్వాన్ని బోధించాడు గురు నానక్. గురు నానక్ దేవుడిలో ఏకత్వాన్ని విశ్వసించాడు. నానక్ గొప్ప కవి, సంగీతకారుడు, తత్వవేత్త, శాస్త్రాలను ఔపోశన పట్టిన వాడు.నానక్ హిందూ కుటుంబంలో పుట్టాడు. అయితే ఆయన తనను తాను ఒక మతానికి పరిమితం చేసుకోలేదు. అన్ని మతాలలో ఉన్న మంచి బోధనలను స్వీకరించి తనను తాను మహోన్నతమైన వ్యక్తిగా మలుచుకున్నాడు. తాను నమ్మిన మంచిని ఇతరులకు బోధించాడు. ‘మనం తినే దాన్ని ఇతరులతో పంచుకోవాలి. అవసరమైన వ్యక్తికి సహాయం చేయాలి. మనిషి తాను బతకడానికి డబ్బు సంపాదించాలి. అయితే అది దోపిడీ, మోసాలతో కూడుకున్నది కాకూడదు. నిజాయితీతో కూడిన సంపాదనతోనే జీవించాలని చెబుతూ... మానవులందరూ సమానమే. కులం, మతం, మత వివక్ష ఉండరాదని గురు నానక్ బోధించాడు. వివిధ వర్గాల ప్రజలను కలిసి కూర్చోమని ప్రోత్సహించాడు. సమసమాజాన్ని ఆకాంక్షించాడు. తాను నమ్మిన విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం జీవితాన్ని అంకితం చేశాడు. సృష్టికర్తను నిత్యం ప్రార్థించాలి మనిషి తన సొంత ప్రయోజనం కోసం తోటి వ్యక్తిని మోసం చేయకూడదు. అందం, యవ్వనం పట్ల మితిమీరిన మక్కువను పెంచుకోరాదు. అలా మక్కువ పెంచుకున్నవాడు మలమూత్రపు పురుగుగా పుడతాడని హెచ్చరించాడు నానక్. మనిషి తన సంపద, బలం, శక్తి సామర్థ్యాలను చూసుకుని గర్వించరాదని కూడా చెప్పాడు గురునానక్. అలా అహంకరించిన మనిషి విషయంలో అతడి అహంకారమే అతడిని మింగేసే రాక్షసునిగా మారుతుందని చెప్పాడు. నిత్యం సృష్టికర్తను ప్రార్థిస్తూ వినయంగా జీవించాలి.ఆ వినయమే మనిషిని కాపాడే రక్షణ కవచమవుతుందని కూడా బోధించాడు. మనిషి గురువును ఎంచుకోవడంలో విజ్ఞత చూపించాలి. ఇక ఆ గురువే అతడిని నడిపిస్తాడు. సామాన్యుడికి సృష్టికర్తను బోధపరచగలిగిన వాడు గురువు. మనిషి గొప్ప మార్గంలో నడవడానికి, ‘దేవుడు ఉన్నాడు’ అని అనుకోవటానికి అవసరమైన విశ్వాసాన్ని మనిషిలో పాదుకొల్పగలిగిన వాడే గురువు అని గురువు ప్రాధాన్యతను వివరించాడు గురునానక్. – రవీందర్ కౌర్ -
నిజాయతీ ఇంకొంచెం పెరగాలోయ్!
సాక్షి, హైదరాబాద్ : ‘విక్రమ్ తన ఇంటి సమీపంలో ఉన్న పార్క్‌లో వాకింగ్ చేస్తున్నారు. అక్కడ తనకు ఓ పర్సు కనిపించింది. అందులో డబ్బులు.. క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు. అక్కడ వాకర్స్‌ను వాకబు చేసినా తమది కాదని చెప్పేశారు. ఆ పర్సును తీసుకెళ్లి పోలీసులకు అప్పజెప్పి తన నిజాయతీని చాటు కున్నాడు’ఈ విషయంలో మన హైదరాబాద్ కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఎందు కంటే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో పౌర నిజాయతీపై ఓ అంతర్జాతీయ సంస్థ జరి పిన అధ్యయనంలో హైదరాబాద్ చివరి స్థానం(7)లో ఉంది. పార్కులు, బహి రంగ ప్రదేశాలు, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బ్యాం కులు, ప్రజోపయోగ ప్రభుత్వ, ప్రైవేటు కార్యా లయాల వద్ద దొరికిన వస్తువులను కంటికి రెప్పలా కాపాడి.. అపరిచితులకు చెందిన వస్తువులు దొరికితే నిజాయతీగా పోలీసులకు అప్పజెబుతున్న వారిపై ‘గ్లోబల్ రీసెర్చ్ ఇనిషి యేటివ్’అనే సంస్థ తాజాగా ఓ అధ్యయనం నిర్వహించింది. విశ్వవ్యాప్తంగా 30 దేశాల్లోని 355 నగరాలపై ఈ సంస్థ పరిశోధక బృందం సభ్యులు అధ్యయనం చేశారు. ఈ విషయంలో డెన్మార్క్ దేశం 82% పౌర నిజాయతీతో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. మన దేశంలో ఏడు ప్రధాన నగరాలపై ఈ అధ్యయనం జరపగా.. బెంగళూరు 66.7% స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కోయంబత్తూర్ (57.1%), మూడో స్థానంలో కోల్‌కతా (46.7%), నాలుగో స్థానంలో ఢిల్లీ (43.8%) ఐదోస్థానంలో అహ్మదాబాద్ (40%) ఉన్నాయి. ఇక రాజస్తాన్ రాజధాని జైపూర్ 38.5 శాతంతో ఆరోస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో హైదరాబాద్ (28.6 శాతం) ఉంది. మన సిటీలో ఈ విషయం మరింత పురోగతి సాధించాల్సిన అవసరముందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు, పార్కుల్లో విలువైన వస్తువులను పలువురు ఆటోడ్రైవర్లు, నగర పౌరులు తమకు జాగ్రత్తగా అప్పజెబుతూ నిజాయితీ చాటుకుంటున్నారని సిటీ పోలీసులు చెబుతున్నారు. మహిళల్లోనే నిజాయితీ అత్యధికం.. పౌరనిజాయితీ విషయంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో పరిస్థితిని గమనిస్తే పురుషుల కంటే మహిళలే అత్యంత నిజాయితీగా ఉన్నారట. 56.4 శాతం మంది మహిళలు నిజాయితీపరులు ఉండగా.. పురుషుల్లో 40.6 శాతం మాత్రమే నిజాయితీ పరులున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అన్ని అంశాలు కాకపోయినా.. కనీసం బహిరంగ ప్రదేశాల్లో తమ కంటపడిన విలువైన వస్తువులను జాగ్రత్తగా పోలీసులకు అప్పజెబుతున్న వారి శాతం ఇటీవల పెరుగుతుండటంపై సామాజిక శాస్త్రవేత్తలు, పోలీసులు గొప్ప విషయంగా అభివర్ణిస్తుండడం విశేషం. నగదుకు ఆశపడని నిజాయితీ పరులు.. మెట్రో నగరాల్లో క్షణం తీరకలేకుండా బిజీగా గడిపే సిటీజన్లు తరచూ.. తమ ల్యాప్‌టాప్‌లు, పర్సులు, బంగారు ఆభరణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇందులో అత్యధికంగా పర్సులే ఉంటున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఇక పౌరనిజాయితీ విషయానికి వస్తే పర్సుల్లో వేల రూపాయలు.. క్రెడిట్, డెబిట్ కార్డులున్నప్పటికీ నిజాయితీపరులు వాటివైపు కన్నెత్తిచూడకుండా యథావిధిగా ఆయా పర్సులను పోలీసులకు అప్పజెబుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. పౌరనిజాయితీలో దేశంలోని నగరాల పరిస్థితి.. నగరం స్థానం పౌరనిజాయితీ శాతంలో బెంగళూరు 1 66.7 కోయంబత్తూర్ 2 57.1 కోల్‌కతా 3 46.7 ఢిల్లీ 4 43.8 అహ్మదాబాద్ 5 40 జైపూర్ 6 38.5 హైదరాబాద్ 7 28.6 పౌరనిజాయితీలో టాప్ 5 దేశాలు.. దేశం నిజాయితీ శాతం డెన్మార్క్ 82 స్వీడన్ 81.5 న్యూజిల్యాండ్ 80 స్విట్జర్లాండ్ 79 నార్వే 78.7 -
అమ్మ..ది గ్రేట్
మా అమ్మ కడుపులో తొమ్మిది నెలలు అపురూపంగా పెరిగిన నేను ఓ రోజు ఉదయాన్నే ఈ లోకంలోకి వచ్చాను. పనిలో పనిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేసేశారు మాయమ్మకు. వీడు నా బిడ్డ కాదు మరోసారి గట్టిగా ఏడుస్తూనే చెప్పింది మాయమ్మ.ఉహూ మా అవ్వ విన్లే. క్యాగే దివానీ..తెరాబేటా నహీతో కిస్కావునే? మూ మూచ్లేకో దూద్ పిలా..బచ్చా రోతాహై (నీ కేమైనా పిచ్చా ..నీ కొడుక్కాకుంటే ఎవరి కొడుకు..నోర్మూసుకుని పాలు తాపు)పిల్లాడు పాల కోసం ఏడుస్తున్నాడు. అమ్మ మాత్రం పాలు ఇవ్వడంలేదు. పిల్లాడి ఏడుపు తల్లి మనసును పిండేస్తోంది. కానీ పాలు తాపించావు గదా ఎక్కడ నీకు పుట్టిన పిల్లోడే అంటారని భయంతో పాలివ్వనని మొండికేసింది. ఈ దృశ్యం...1963లో జమ్మలమడుగు మిషన్ ఆస్పత్రిలోనిది. ఆ రోజు మాతృత్వానికి అగ్ని పరీక్ష!ఉపోద్ఘాతం అర్థం కావాలంటే అంతకు ముందు ఏం జరిగిందనేది చెప్పాలి...మా అమ్మ కడుపులో తొమ్మిది నెలలు అపురూపంగా పెరిగిన నేను ఓ రోజు ఉదయాన్నే ఈ లోకంలోకి వచ్చాను. పనిలో పనిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేసేశారు మాయమ్మకు. మత్తు మందు కారణంగా స్పృహలో లేదు. మధ్యాహ్నం తర్వాత అమ్మ కళ్లు తెరిచింది. ఈలోగా బాబు పాల కోసం ఏడుస్తుంటే మాయవ్వ ఊయల్లో ఉన్న బాబును మా అమ్మ పక్కన పడుకోబెట్టి పాలు ఇవ్వమంది. బాబును చూసి మా అమ్మ షాకైంది. బిడ్డ పుట్టంగానే చూసిన పిల్లోడికి, ఈ పిల్లోడికి రూపురేఖల్లో పోలికేలేదు. దాంతో ఏ మేరా బేటా నై (వీడు నా బిడ్డ కానేకాదు) అని ఏడ్వడం మొదలుపెట్టింది.వార్డులో ఉన్న బాలింతలు, వారికి తోడుగా వచ్చిన మహిళలు మా అమ్మ వైపు ఈమెకేమైనా పిచ్చా కడుపున పుట్టిన బిడ్డను కాదంటోంది అని ..అదోరకంగా చూస్తున్నారు.కాన్పయ్యాక చూసింది కొద్ది క్షణాలే అయినా నా రూపం అమ్మ మదిలో ముద్రపడిపోయింది. ఆపరేçషన్ తర్వాత ఆమె మగతలోకి జారి పోయింది. స్పృహలో లేదు కానీ బిడ్డ ముఖం బాగా గుర్తుండిపోయింది. అందుకే ఇప్పుడు తన ఒడిలో ఉన్న బిడ్డ తన బిడ్డ కాదని గట్టిగా వాదించడమే కాదు పిల్లాడికి పాలు కూడా ఇవ్వనని మొండికేసింది. ఎవరు ఎన్ని చెప్పినా వినడంలేదు. ఈ తతంగం ఇలా నడుస్తున్నప్పుడే మాయమ్మ దృష్టి తన బెడ్ పక్కన ఉన్న బాలింతపైనా..ఆమె ఒడిలోని బిడ్డపైనా పడింది. అంతే... మేరబచ్చా ఉదర్ హై (నా పిల్లోడు అక్కడుండాడు) అంటూ మళ్లీ ఏడ్వటం మొదలుపెట్టింది. ఈమెకు కచ్చితంగా మెంటలే అని నిర్ధారణకు వచ్చేశారంతా.హిస్టీరియా వచ్చినట్లు మిస్సమ్మకు బులావ్ (పిలవండి)..అని గట్టిగా అరవసాగింది మాయమ్మ. మిస్సమ్మపై అమ్మకు చాలా నమ్మకం. మొదటి కాన్పు తప్ప మిగతా మూడు కాన్పులు మిషన్ ఆస్పత్రిలోనే అయ్యాయి.పక్కనున్న బాలింత కూడా ముస్లిమే. ఆమె ఒడిలో ఉంది నా బిడ్డే అని మాయమ్మ చెపుతుంటే ఆమె.. మేరే బేటేకు తేరా బేటా కర్కో బోల్తీ క్యా (నాబిడ్డను నీ బిడ్డనిఅంటున్నావు) అని తిట్టడం మొదలుపెట్టింది. గొడవ ఎక్కువయ్యేసరికి ఈ సమస్యకు మిస్సమ్మే పరిష్కారం చూపిస్తుందని నర్సు ఆమెను తోడ్కొని వచ్చింది.మిస్సమ్మ ఆస్పత్రి ఇన్చార్జి. ఆమె అంటే ఆస్పత్రిలో అందరికీ గౌరవం. మిస్సమ్మ దగ్గరికి వచ్చాక ..మా అమ్మ బిడ్డను చూపిస్తూ ఈ బిడ్డ నాబిడ్డ కాదంటే వినడంలేదు అని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పింది. బూమ్మా...బాగా చూడు నీ బిడ్డ కాదని ఎలా అంటావు? మిస్సమ్మ అనునయించే ప్రయత్నం చేసింది. నాకు బాగా గుర్తు ఆ పక్క బెడ్‌పై ఉన్న బాలింత ఒడిలో ఉన్న బిడ్డే నా బిడ్డ అని ఏడుస్తోంది.అమ్మ కన్నీటి ధారల్లో నిజాయితీ మిస్సమ్మ గుండెను తాకిందేమో!పసిపిల్లలిద్దర్నీ చెరో చంకలోకి తీసుకుని ...నిజం చెప్పు ఈ పిల్లాడు నిజంగా నీ పిల్లాడేనా? పోలీసులను పిలవమంటావా? పక్క బెడ్ బాలింతను గద్దించింది మిస్సమ్మ.దేవుడి సాక్షిగా నాబిడ్డే మిస్సమ్మా..నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది.మధ్యమధ్యలో ఏడుస్తోంది. ఆమే ఒక తల్లే!ఆ కన్నీటిలో పుత్రవాత్సల్యం ఉంది. కానీ అమ్మతనం కనిపించినట్లు లేదు మిస్సమ్మకు.అప్పటికే మా నాయన, పక్క బెడ్ బాలింత భర్త అక్కడికి చేరారు. వారిద్దరి ముఖాలను, పిల్లల ముఖాలను మార్చిమార్చి చూసింది మిస్సమ్మ. ఆఖరిసారి చెపుతున్నా నీ బిడ్డ నీకు కావాలంటే నిజం చెప్పుఅనేసరికి భయపడిపోయిన బాలింత ..పిల్లోడు బాగుండాడనినా బిడ్డను పక్కనున్న ఊయల్లో పడుకోబెట్టి అక్కడ ఉన్న బిడ్డను తీసుకున్నానని ఒప్పుకుంది.అప్పటిదాకా అమ్మను దోషిలాగా చూసినవారు ముక్కున వేలేసుకున్నారు. బాలింతకుచీవాట్లు పెట్టారు. లౌక్యం ప్రదర్శించిన మిస్సమ్మను పొగడ్తలతో ముంచెత్తారు. మా అమ్మా,నాయనయితే సంతోషం పట్టలేకపోయారు.ఆస్పత్రిలో శుభం కార్డు పడ్డాక అమ్మ ఒడిలో నేను..వాళ్లమ్మ ఒడిలో వాడు వెచ్చగా బజ్జున్నాం. కానీ..నన్ను చూసింది ఒకట్రెండు నిమిషాలే ..అయినా అమ్మ నాతో కనెక్టు అవడమే ఓ అద్భుతం. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అంటే ఇదేనేమో? అమ్మకు అమ్మేసాటి అనేది అందుకేనేమో? డీఎన్ఏ పరీక్షలు, సీసీ కెమెరాల్లేని రోజులు.. పోలీసు కేసులు, కోర్టు తీర్పుల్లేకుండా..ఓ క్లిష్టమైన సమస్య కేవలం ఓ తల్లి ‘నమ్మకం’ పునాదిపై పరిష్కారం అయిందంటేనమ్మశక్యం కాని విషయం. ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. ఓ తల్లి హృదయ స్పందనే సాక్షిగా అప్పటి మిస్సమ్మ ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఈ తరం వైద్యరంగానికి గొప్పపాఠం.(నాకు ఊహ తెలిశాక అమ్మ చెపుతుంటే కలిగిన ఉద్వేగాన్ని ఇప్పుడు మాటల్లో చెప్పలేను.కానీ..అమ్మ మాటలు అలా నా జ్ఞాపకాల దొంతరలో భద్రంగా నిలిచిపోయాయి. నన్ను అపహరించిన ఆవిడ భర్త అప్పట్లో వీధుల్లోతిరిగి గాజులమ్మేవారని..నేను అక్కడే పెరిగి పెద్దయి ఉంటే గాజులోయ్..అంటూ వీధులు పట్టుకుని తిరిగేవాడినని నన్ను ఇంట్లో ఆటపట్టించేవారు) – నజీర్ రైల్వే కొండాపురం, వైఎస్ఆర్ కడప జిల్లా -
తప్పయిపోయింది స్వామీజీ..!
ఆయన ఒక స్వామీజీ. నీతి, నిజాయితీ, ఓర్పు, సత్యవాక్పాలన, అహింసల విశిష్టతలను, వాటిని పాటించడం వల్ల సమాజానికి కలిగే మంచిని చక్కగా వివరిస్తున్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఓ ఆకతాయికి కొంటె బుద్ధి పుట్టింది. భక్తి ఉన్నవాడిలా నటిస్తూ, స్వామీజీ దగ్గరకు వెళ్లి వినయంగా నమస్కరించాడు. చిరునవ్వుతో ఏమిటన్నట్టు చూశారు స్వామీజీ. ‘‘స్వామీ, నాదో సందేహం. దయచేసి తీరుస్తారా?’’ అనడిగాడు. ‘‘చెప్పు నాయనా’’ అన్నారు స్వామీజీ చల్లగా. ‘‘ముక్కోటి దేవతలు అని అంటూ ఉంటారు కదా, వారి పేర్లు చెబుతారా’’ అన్నాడు. స్వామీజీకి అతని ఉద్దేశ్యం అర్థమైనా కోపం తెచ్చుకోలేదు. ‘‘అలాగే నాయనా! తప్పకుండా చెబుతాను. అయితే ఒక నిబంధన. నేను ఏకబిగిన చెప్పుకుని పోతూ ఉంటాను.నువ్వు నిద్రాహారాలను వదిలేసి మరీ స్వయంగా రాసుకోవాలి. పూర్తయిన తర్వాత తిరిగి నాకు చదివి వినిపించాలి.సిద్ధమేనా మరి?’’అనడిగారు స్వామీజీ. అతనికి దిమ్మ తిరిగినట్లయింది. ‘ఇంటి దగ్గర తన తాత, నాయనమ్మ రామకోటి, శివకోటి కొన్ని ఏళ్లుగా రాస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. కోటి నామాలకే అంత సమయం పడితే, మూడు కోట్ల నామాలను పూర్తి చేసేసరికి నేను ముసలివాడిని కావడం ఖాయం. ఆయన్నేదో ఇరుకున పెట్టాలనుకుంటే చివరకు నేనే ఇరుక్కుపోయేలా ఉన్నానే, తప్పయిపోయింది.’ అనుకున్నాడు. వెంటనే చెంపలు వేసుకుంటూ, ‘క్షమించండి స్వామీ, కొంటెతనం కొద్దీ అలా అడిగాను. మీరు ముక్కోటి నామాలనూ చెప్పినా, రాసుకునేంత ఓపిక గానీ, ఆసక్తి గానీ లేవు నాకు’’ అన్నాడు. స్వామీజీ చిరునవ్వుతో ‘‘నాయనా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులను అనేక అంశలుగా భావించి వివిధ నామాలతో, రూపాలతో పూజిస్తుంటారు. నిజానికి ముక్కోటి దేవతలు అని మాట వరసకుఅనేదేకానీ, నిజంగా మూడుకోట్ల మంది దేవతలున్నారని కాదు. నువ్వు నిజంగా తెలుసుకునేందుకు అడిగి ఉంటే నువ్వు పెరుగుతావని సంతోషించేవాడిని. కానీ నన్నేదో ఇబ్బంది పెట్టాలనుకుని అడిగావు. ఇంకొకరిని తక్కువ చేయడానికి నీ తెలివితేటలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. అర్థమైందా?’’ అన్నారు. అర్థమైందన్నట్లుగా మరోసారి లెంపలు వేసుకుంటూ, ఈసారి భక్తితో మనస్ఫూర్తిగా స్వామీజీకి నమస్కరించాడు. డి.వి.ఆర్. -
ఓహో.. గులాబీ బాలా!
నీకెందుకో అనిపిస్తుంది – మంచి టైలరనేవాడు నిజమైన ప్రేమ, నీతి నిజాయితీ లాంటి కావ్యవస్తువు అని. అందరూ వాడి గురించి మాట్లాడతారు, సినిమాలు తీస్తారు, స్తోత్రాలు చదువుతారు – కానీ తుచ్ఛమైన ఐహిక ప్రపంచంలో వాడి షాపు తాలూకు దారం పోగు కూడా నీకెక్కడా కనబడదు. వెతకాలని నిశ్చయించుకుంటావ్. ఆల్కెమిస్ట్ పుస్తకంలో గుంటడు శాంటియాగోని ఆదర్శంగా తీసుకుని, మీ ఊరి ‘‘జగ్గయ్యాక్లాష్టోరూం’’ వాళ్ళ కర్రల సంచీలో ఎంతో ఇష్టంగా కొనుక్కున్న నీ రెండు పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్సు కుక్కి ఊరిమీద పడతావు.అనుకున్నది పొందటానికి నీలోపల కఠోరమైన దీక్షా, హరితేజా, అర్చనా, పట్టుదలా ఉండాలని ఎనిమిదవ శతాబ్దపు చైనా కవి ఒకాయన రాసిన వ్యక్తిత్వవికాస హైకూ నీ మదిలో గంగానమ్మ స్టైల్ డ్యాన్సు చేస్తూ ఉంటుంది. తిరిగీ తిరిగీ శోషొచ్చి పడే దశలో ఒకానొక షాపు ముందు అరుగు మీద కూర్చుంటావు. ఇక నీవల్ల కాక ఇంటికి వెళ్దామనుకునేసరికి ఎవరో నిన్ను పిలిచినట్టు వినబడుతుంది. తిరిగి చూస్తే చింకిబట్టల్లో ఒక బారుగడ్డం ముసలాయన నీ వైపు వెర్రిగా, వింతగా చూస్తుంటాడు. నువ్వు అజ్ఞానివై పర్సులో చిల్లరకోసం వెదుకుతావు. అతను వికటాట్టహాసంచేసి ‘‘ఎందుకొరకొచ్చావే చిలకా! నీకేమి దొరికినాదే చిలకా!’’ అని ఏదో పాడుతూ వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి బోర్డు పైన పేరు చదూతావు. ఆకృతీ ఫ్యాషన్ టైలర్స్. ముసలాయన జాడ కనబడదు. నీ బాల్యావస్థలో చూసిన రాడాన్ వారి డబ్బింగ్ సీరియళ్ళలో ఇలా మిస్టీరియస్ ముసలాళ్ళొచ్చి జ్ఞానోపదేశాలూ వగైరా చెయ్యడం కద్దే అని గుర్తొచ్చి కాస్త కంగారు తగ్గుతుంది. కోరమంగళాలో ఉండే మీ కొలీగ్ వాళ్ళ వదిన కజిన్ బెస్ట్ ఫ్రెండ్‌కి భువనైకమోహనమైన సల్వార్లు కుట్టిన టైలర్ షాప్ పేరు కూడా ఆకృతీ ఫ్యాషన్సే అని నీకు వెలుగుతుంది. ఆ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందేమో అనే ఆశతో ఆ గడప తొక్కుతావు. అక్కడ తగిలించివున్న నమూనా డ్రెస్సులుచూసి పైన వ్రాయబడ్డ విశేషణంలోని ‘భు’, ‘వ’, ‘నై’, ‘క’, ‘మో’ అక్షరాలు విసుగ్గా గదిలోకెళ్ళి నీ మొహమ్మీదే ధభీమని తలుపేసేస్తాయి. ముక్కు పగలనందుకు సంతోషిస్తూ ఓ మోస్తరు హనంగా అయినా ఉన్నాయిలెమ్మని లోపలికెళ్తావు. అయినా బట్టల అందం వేసుకునేవాళ్ళల్లో ఉంటుందనే సూక్తి నీ స్ఫురణకొస్తుంది. నీ చిన్నప్పుడు మీ ఊరి కాశీ టైలరు మీ అమ్మ షిఫాన్ చీరతో నీకు కుట్టిన ‘‘స్టెప్స్ ఫ్రాక్’’ అనే వస్త్ర విశేషం తొడుక్కున్నపుడు మీ అమ్మమ్మ తాతయ్యా ‘‘విక్టోరియా మహారాణిలా ఉన్నావే!’’ అని మురిసిపోవటం గుర్తుతెచ్చుకుంటావు. దాన్ని ఒక శనివారం మీ స్కూలుకు వేసుకెళ్లినప్పుడు నిన్ను చూసి స్కూల్‌బస్‌లో కొందరు కెవ్వుమని అరిచి కిటికీ అద్దాలు బద్దలుకొట్టి దూకబోవటం మాత్రం నీ మనసు లోతుల్లోకి ఎన్నడో తోసేశావు. షాపులో కమ్మటి గ్రీజు వాసనకొడుతూ ఉంటుంది. నాలుగైదు మిషను చక్రాలు గిరగిర తిరుగుతూ ఉంటాయి. కత్తిరించిన గుడ్డ పీలికలు రంగురంగులుగా కుప్ప పోసి ఉంటాయి. నీ మనసు ఉప్పొంగుతుంది. ఏ వృత్తికావృత్తి ఎంత ప్రత్యేకమైనది! ప్రతీ పని తాలూకు సౌండ్‌స్కేప్, కలర్స్కేప్ దానికే ప్రత్యేకం కాదూ? శ్రమలో ఎంత జీవనమాధుర్యముంది! ఈ విధంగా శ్రమని రొమాంటిసైజ్ చేస్తూ, శ్రమ దోపిడీని హైలైట్ చేస్తూ చక్కటి అవార్డ్ విన్నింగ్ అభ్యుదయ కవిత ఒకదాన్ని మనసులో పేర్చుకుంటూ ఓనరు లా కనిపిస్తున్న వ్యక్తిని వెళ్ళి అడుగుతావు–‘‘సల్వార్ కుట్టాలి. పార్టీ వేర్. ఎంతౌతుంది?’’అతడి జవాబు విన్నాక నీ కవితా సౌధం కుప్పకూలుతుంది. లేకపోతే! మీ ఊరిలో ఇచ్చేదానికన్నా డెబ్భైరూపాయలు ఎక్కువ అడిగాడు! ఇందాకటి కూలిపోయిన కవితాసౌధపు కాంక్రీట్ రద్దుముక్క ఒకదాన్ని తెచ్చి కాసేపు దాంతో గీకి గీకి బేరమాడతావు. శాల్తీ ఒక్కింటికి కనీసం యాభైరూపాయలు తగ్గిస్తావ్. ఊరుకుంటే ఈ టైలర్లు దోచేస్తారు మరీని!బేరమయ్యాక సంచీలోంచి రెండు జతల మెటీరియల్సూ తీస్తావ్. నీ మెదడులో ఇందాక ముసలాయన చేసిన జ్ఞానోదయం ఇప్పుడు జ్ఞానమధ్యాహ్న దశకు చేరుకుంటుంది. అందుకు ఒకటే జత ముందర కుట్టడానికిచ్చి అది బావుంటే ఆనిక్కి రెండోది ఇద్దామనుకుంటావు. రెండిట్లో కాస్త తక్కువగా నచ్చిన గులాబీ తెలుపు కాంబినేషన్ డ్రెస్సును ప్రయోగానికి సిద్ధం చేస్తావ్. అప్పటిదాకా క్యాఫెటేరియాలో పునుగులు తింటున్న నీలోని నీతా లుల్లా, రీతూ కుమార్‌లు రంగంలోకి దిగుతారు.‘‘మంచి క్వాలిటీ అనార్కలి మెటీరియల్ ఇది. ప్యూర్ క్రేప్. ఈ వైట్ కలర్ పీస్ చెస్ట్ దగ్గరికి రావాలి. దుపట్టా (తెలుగువాళ్ళలాగా చున్నీ అంటే పరువు తక్కువ లుల్లాజీ దగ్గర) పింక్ కలర్ కదా.. కాంట్రాస్ట్ బాగా కనబడుతుంది. అన్నట్టు దుపట్టాకి వైట్ కలర్ ముత్యాల లేస్ బోర్డర్ వెయ్యండి. ప్లెయిన్ జిగ్ జాగ్ బాగోదు. నెక్ ‘‘వీ’’ కాదు, ‘‘యూ’’ కాదు, ఇంగ్లిష్ లెటర్ ‘‘క్యూ’’ ఆకారంలో రావాలి. నీ మనసులోని అంతులేని ఆశలకి అక్షర రూపమిచ్చి అతనికి చేరవేస్తావు. ‘‘క్యూ?’’ అన్నట్టు చూస్తాడు టైలరు.‘‘అంటే ఆ బాటం క్లాత్‌ని డోరీ లాగ డిజైన్ చేసి, ఏటవాలుగా అటాచ్ చేసి, కింద సిల్వర్ కలర్ టాస్సెల్స్ పెట్టాలి. అది రైట్సైడ్కి రావాలి. లెఫ్టైతే మళ్ళీ దుపట్టా కింద కనబడదు. ఇంకా బాటమేమో చూడీ చెయ్యండి.’’టైలరు మౌనంగా మడతేసుకుంటాడు.‘‘ఏవండీ! గుర్తుంటాయా అన్నీ? లేదంటే రాసుకుంటారా?’’ ఆరాటంకొద్దీ అడుగుతావు.‘‘అక్కర్లేదు మేడం. నేనూ డిగ్రీ చదివాను. ఐ కెన్ రిమెంబర్. మీరు చెప్పినట్టే కుడతాను. మీకు నాపైన భరోస లేదా?’’ అంటాడతను.అతని ఉనికిని ప్రశ్నించి ఈగోని దెబ్బతీసినందుకు నీపైన నీకే కోపమొస్తుంది.‘‘సారీ అండీ. నాకు దివాలీ లోపు కావాలి. ఇవ్వగలరుగా?’’‘‘అప్పటిదాకా అక్కర్లేదండీ! వచ్చే శనివారం ఇచ్చేస్తాగా!’’ఆనందభాష్పాలు తుడుచుకుంటూ చీటీ తీసుకుని ఇల్లు చేరుకుంటావు.ఆ రోజు రాత్రి టీవీలో తమన్నా గులాబీ, తెలుపు రంగుల్లో ఉన్న సల్వార్ వేసుకుని కనబడుతుంది. లుల్లాజీ ఆ డ్రెస్సు కన్నా నీదే బాగొస్తుందని వక్కాణిస్తుంది. రెండ్రోజులాగి ఇంట్లో జనం ఏదో సినిమా చూస్తుంటే డైలాగు వినబడుతుంది– ‘‘తెల్లని దుస్తులు ధరించినది. పై వస్త్రము గులాబీ రంగు’’. నీ డ్రెస్సు ఎలా తయారవ్వబోతోందో తలుచుకుని రోమాలు నిక్కబొడుచుకుంటాయి.శనివారం ఉదయం టైలరుకు ఫోన్ చేస్తావు. స్విచాఫ్! సాయంకాలమూ అదే పరిస్థితి. మర్నాడు ఎలాగో ఆదివారం కొట్టుకు సెలవు. సోమవారమూ మనిషి పత్తా ఉండడు. నీకు మెల్లిగా గుబులు మొదలౌతుంది. ఒకవేళ అతను సరుకంతా తీసుకుని పారిపోయుంటే? అతని నంబరు పోలీసులకిచ్చి లొకేషన్ ట్రేస్ చెయ్యిద్దామా అనే విపరీతాలోచనలతో నీలో నువ్వే మదనపడుతుంటావు.మంగళవారం మధ్యాహ్నం అతనే ఫోన్ చేస్తాడు– ‘‘మేడం! అర్జెంటు పని మీద మాండ్య వెళ్ళాను. డ్రెస్సు అద్భుతంగా వస్తోంది. ఇంకొక్క రెండురోజులు.. శుక్రవారం నేనే డెలివర్ చేయిస్తాను. నా పైన భరోసా ఉంచండి.’’ అని.తరువాతి మంగళవారం ఉదయం మొహానికి మంకీటోపీ, కూలింగ్ గ్లాసులూ ధరించిన ఒక ఆగంతకుడు బెదురుగా మీ ఇంటి గుమ్మంలోకొచ్చి గేటుమీంచి మీ వరండాలోకి ఓ ప్యాకెట్ విసిరేసి అదేపోతపోతాడు.ఏముందో తెరిచి చూస్తావు. దాదాపు ఒక గంటపాటు మాటా పలుకూ లేకుండా పడివున్నావని మీ ఇంట్లో జనం చెప్తారు. తిరిగి ఆ ప్యాకెట్ వైపు చూసే ధైర్యం చేస్తావు. దుఃఖం గొంతులో పారసెటమోల్ ఎంజీ మాత్ర లాగా అడ్డుపడుతుంది. ‘‘పోనీ ఓసారి వేసుకుని చూడు. బాగానే ఉంటే ఇంట్లో వేసుకోవచ్చు, లేకపోతే పోయే..’’ మీ అమ్మమ్మ ఊరడించటానికి ప్రయత్నిస్తోంది.ఏమి జరిగిందో నీకు చెదురుమొదురుగా గుర్తొస్తూ ఉంటుంది.నువ్వు పైన వెయ్యమన్న తెల్లటి క్రేప్ క్లాత్ స్థానంలో మస్తు నీలం పెట్టిన దళసరి లోపల్లంగా క్లాతు ఉంటుంది. దానికేవో ముత్యాలు కుట్టి మేకప్పేసి అందంగా చూపించే ప్రయత్నం కూడా చేయబడిందని గ్రహిస్తావు. దుపట్టాకి ఒక మూల దట్టంగా అంటుకున్న గ్రీజు వాసన చూస్తావు. కూలిపోయిన సౌధాల విషాధ గా«థలు వినబడతాయి. చూడీ పైజమా, మీ ఇంట్లో మొక్కలకి నీళ్లు పెట్టే ట్యూబూ ఒకే వ్యాసంతో ఉన్నాయని తెలుసుకుంటావు. ఏలాగోలా ప్లాస్టిక్ కవరేసి దాన్ని మడమలమీంచి ఎక్కించే ప్రయత్నం చేస్తావు. చూడి పైజమా కనిపెట్టినవాడికి గరుడపురాణం ప్రకారం ‘‘సూచీముఖం’’ కరెక్టా లేక ‘‘కుంభీపాకం’’ శ్రేష్టమా? అనే మీమాంసలో పడతావు. కుర్తా నిత్యా మీనన్‌కి ఇలియానా కొలతలతో కుట్టినట్టు ఉంటుంది. నెక్లైన్ అక్షరాలా నీ గొంతు కోస్తూ ఉంటుంది. నీ కుడి చెయ్యి భూమికి సమాంతరంగా ఉంటుంది. ఎడమ మోచేతికి టెన్నిస్ ఎల్బో వస్తుంది.మిగిలున్న కాస్త జీవశక్తినీ కూడగట్టుకుని షాపుకు వెళ్తావు. వాడు వెకిలిగా నవ్వుతూ ‘‘మీ మెషర్మెంట్స్కి క్లాత్ సరిపోలేదు మేడం.. అందుకే ఎగష్ట్రా క్లాత్ కొనివేశాను. బాగా వచ్చిందా?’’ అంటూ వేరే కస్టమర్ దగ్గర బలిబట్టలు మడతేస్తుంటాడు. నీ ఆకృతి పట్ల నీకున్న అపోహలకి ఆజ్యం పోసినట్టౌతుంది. కాళ్ళకింద భూమి కుంగిపోతుంది.లోపలినించి ఒక ఆరేడేళ్ళ పిల్ల వస్తుంది. టైలరు పిల్లవంక మురిపెంగా చూస్తూ ఉంటాడు. ‘‘ఆంటీ ఇవాళ నా హ్యాపి బర్త్‌డే! చాక్లెట్ తీసుకోండి’’ అని ఒక ఆల్ఫెన్లీబే నీ చేతిలో పెడుతుంది. ఈ చాక్లెట్టు పేరు ఏనాడూ ఇంగ్లిష్‌లో సరిగా రాయలేనందుకు నీపైన నీకు అసహ్యం కలుగుతుంది. నువ్వెందుకూ పనికిరావనే భావన నిన్ను నిలువునా ముంచేస్తుంది. నువ్వు ఈ అనంతవిశ్వంలో కేవలం ఒక ధూళికణానివనిపిస్తూ ఉంటుంది. అయినా నీకే ఇన్ని ఆలోచనలూ ఉద్వేగాలూ ఎందుకుండాలనిపిస్తుంది. దీన్నే మేధావి పరిభాషలో ‘ఎక్జిస్టెన్షియల్ క్రైసిస్‘ అంటారని నీ ఇంటలెక్చువల్ ఫేస్బుక్ ఫ్రెండొకాయన చెప్పటం గుర్తొస్తుంది.ఆటో పిలిచి ఎక్కబోతూ ఉంటావు.అప్పుడు గమనిస్తావు. ఆ పిల్ల తెల్లని గౌను ధరించినది. పైన కుచ్చులు గులాబీ రంగు. · - సాంత్వన చీమలమర్రి -
నిజాయితీ చాటుకున్న ప్రయాణికుడు
రామగుండం: ఏదైనా ఒక వస్తువు పోయిందంటే ఇకా మనది కాదని మరచిపోవాల్సిందే. కానీ తన తొటి ప్రయాణికుడు మరిచిపోయిన వస్తువులను అతని బంధువులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడో ఓ ప్రయాణికుడు. హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్ళే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రామగుండంలో సీ అండ్ డబ్ల్యూ(రైల్వే)లో పనిచేస్తున్న రవి అనే వ్యక్తి రైలులో ప్రయాణిస్తున్నాడు. అతనికి ఎదురు సీటులో కూర్చున్న వ్యక్తి జమ్మికుంట దాటిన తర్వాత కవర్‌ను సీటుపై ఉంచి వెళ్లిపోయాడు. ఆ కవర్లో సెల్‌ఫోన్, చార్జర్, రూ.2700 నగదు ఉన్నాయి. అతను బాత్ రూమ్‌కు వెళ్లి ఉండవచ్చని రవి భావించాడు. అతను అరగంట గడిచినా రాలేదు. రామగుండం స్టేషన్ రావడంతో ఆ కవర్‌ను తీసుకుని రవి అక్కడి జీఆర్పీ పోలీసులకు అప్పగించాలని ఈ విషయాన్ని రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడు మోజెస్‌కు తెలిపాడు. అంతలో ఆ సెల్‌కి ఫోన్ రావడంతో మోజెస్ మాట్లాడి ఆ మహిళకు జరిగిన విషయాన్ని తెలిపారు. ఆమె ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే తన సమీప బంధువైన శ్రీనివాస్ అనే వ్యక్తి విషయం చెప్పింది. దీంతో ఆయన రైల్వే స్టేషన్లో వీరిని కలిసి సెల్‌ఫోన్, నగదు మరిచిపోయిన వ్యక్తి ఉప్పల్‌కు చెందిన జవ్వాజి మోహన్‌గా తెలిపాడు. రవి,మోజెస్‌లు ఆ కవర్‌ను శ్రీనివాస్‌కు అప్పగించారు. తమ బంధువు మరిచిపోయిన వస్తువులను నిజాయితీతో అప్పగించడం పట్ల అతను వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
నిజాయితీతో పనిచేస్తే ఏదైనా సాధ్యమే
పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం నిర్దేశిం చిన లక్ష్యం మేరకు పనిచేస్తే కచ్చితంగా గుర్తింపు లభిస్తుందన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉత్తమ సేవలు అందించినందుకు గాను సీఎం కె.చంద్రశేఖరరావు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ‘ఎక్సలెన్స్’ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ, సంస్థ, లీగల్ మెట్రాలజీ ఉద్యోగులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం కమిషనర్‌ను కలసి అభినందించారు. ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని, ఈ అవార్డు ఒక్కరి విజయం కాదు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఆనంద్ అన్నారు. -
ఆటో డ్రైవర్ నిజాయితీ ..
దొరికిన నగల బ్యాగు అప్పగింత పరకాల: దారిలో తనకు దొరికిన బ్యాగును ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు అప్పగించి శభాష్ అనిపించుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన కొంగొండ సాంబరాజు, అనూష దంపతులు రూ.80 వేల విలువైన నెక్లెస్‌ను బ్యాగులో పెట్టుకొని బైక్‌కు తగిలించారు. మార్గమధ్యలో బ్యాగ్ వాహనం నుంచి కిందపడిపోయింది. కొద్దిసేపటి తర్వాత బ్యాగు కనిపించ డం లేదని చూసుకొని లబోదిబోమంటూ పరకాల పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే కనిపర్తి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తనకు బ్యాగు దొరికిందని ఇందులో విలువైన బంగారు గొలుసు ఉందంటూ పరకాలకు పోలీసులకు అందజేశారు. విషయం తెలుసుకున్న బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు సీఐ జాన్ నర్సింహులు నెక్లెస్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుకొని సన్మానించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థి నిజాయతీ
– దొరికిన డబ్బు హెచ్ఎంకు అందజేత కోయిలకొండ(కృష్ణగిరి): రహదారిలో పడిపోయిన డబ్బులను నిజాయితీతో హెచ్ఎం అందజేసి ఈ విద్యార్థి ఔనత్యాన్ని చాటుకున్న సంఘటన మండల పరిధిలోని కోయిలకొండ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగింది. చిట్యాల గ్రామంలో తాత లాలుస్వామి ఉరుసు సందర్భంగా ఇదే గ్రామానికి చెందిన రంగవేణి డోన్‌లో సరుకులు తెచ్చుకునేందుకు రూ.7వేలతో ఆటోలో బయలుదేరింది. అయితే మార్గమద్యంలో కోయిలకొండ పాఠశాల సమీపంలో ఆమె డబ్బులు పడిపోయాయి. ఇంతలో పాఠశాల నుంచి పాస్‌కు బయటకు వచ్చిన ఆరో తరగతి విద్యార్థి రమేష్ కంటపడ్డాయి. వెంటనే వాటిని హెచ్ఎం చంద్రావతికి అప్పగించారు. డోన్‌లో ఆటో దిగిని తర్వాత డబ్బులు లేకపోవడంతో రంగవేణి తిరిగి రహదారి వెంట కనపడిన వారందరినీ అడుగుతూ పాఠశాలకు చేరుకుంది. జరిగిన విషయాన్ని తెలిపి బాధితురాలికి హెచ్ఎం చంద్రావతి నగదును అందజేసి ఔçనత్యాన్ని చాటిన విద్యార్థి రమేష్‌ను ఉపాధ్యాయబృందం అభినందించారు. -
409 మందికి నేడు ప్రశంసాపత్రాల ప్రదానం
కర్నూలు(అగ్రికల్చర్): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో సమర్థవంతంగా పని చేసి çమంచి ఫలితాలను రాబట్టిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు గురువారం జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలతో సత్కరించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన 409 మందిని ఎంపిక చేశారు. వీరికి పోలీసు పెరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ఉత్తమ సేవకుల్లో 24 మంది జిల్లా అధికారులు ఉన్నారు. -
దుర్మార్గులను సన్మార్గంలో పెడతాం..
న్యూఢిల్లీ: నవంబరు 8 పెద్ద నోట్ల రద్దుతరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. సుమారు 42 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో నల్లధనం, అవినీతిపై పోరాటాన్ని కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు. దేశ ప్రజలకు కొత్త పథకాలను ప్రకటించారు. సత్యం అన్నది భారతీయులకు ముఖ్యమైంది. అవినీతి దేశానికి చీడలాంటిది. వీటిపై యుద్ధంలో ప్రజలనుంచి అపూర్వ మద్దతు లభించడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. కానీ నల్లకుబేరులకు చెక్ పెట్టే క్రమంలో నిజాయితీపరులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. సర్కార్ సజ్జనోంకీ మిత్ర్ హే, దుర్జనోకీ శత్రు హే అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.ఉగ్రవాదులు, నక్సలైట్లు నల్లధనంపై ఆధారపడి ఉన్నారన్నారు ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు సంఘ విద్రోహ కారులను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఈ విషయంలో చట్టం తన పని చేసుకుపోతుంది. చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. తప్పు చేసిన వారిని వదిలి పెట్టేప్రసక్తి లేదు. కానీ అమాయకులను రక్షించడంఎలా? అదే ప్రభుత్వ తపన. అమాయకులను ఎలాంటి కష్టం కలగకుండా చూడడమే తమ లక్ష్యం. నిజాయితీ పరులను ఏవిధంగా రక్షించాలనే తమ ఆలోచన. తమ ప్రభుత్వం సజ్జనులకు స్నేహితుడు లాంటిది. అలాగే దుర్జనులను సక్రమమార్గంలో పెట్టుందేకు కృషి చేస్తుంది. టెర్రరిస్టులు, ఆటంకవాదులు, మత్తుమందు వ్యాపారులు, హత్యకారులు అందరూ నల్లధనంపై మాత్రమే ఆధారపడతారు. మనం జాగ్రత్తగా ఉంటే, హింసావాదనుంచి మన పిల్లలను బయట పడే అవకాశం ఉంది. తన ప్రసంగంలో వివిధ వర్గాలకోసం కొన్ని పథకాలను ప్రకటించారు. . -
ఆటోడ్రైవర్ నిజాయితీ
రూ 2లక్షలు విలువైన బంగారు నగలు అప్పగింత అభినందించిన అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి రాజమహేంద్రవరం క్రైం : ఆటోలో ప్రయాణికులు మరచిపోయిన రూ. 2 లక్షల విలువైన బంగారు నగలను వారికి తిరిగి అప్పగించి ఆ ఆటోడ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. అతనిని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజకుమారి అభినందించారు. వివరాల్లోకి వెళితే.. గాంధీపురానికి చెందిన అరుణ, శ్రీనివాస్ వారి బంధువులు ఆదివారం రాత్రి జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్దగల ఆటో స్టాండ్ వద్ద ఆటో ఎక్కి గోదావరి గట్టున ఉన్న శ్రీకన్య హోటల్ వద్ద ఆటో దిగి హోటల్లోకి వెళ్లిపోయారు. వారు పైకి వెళ్లాక ఆటోలో హ్యాండ్ బ్యాగ్ మరచిపోయిన సంగతి గుర్తించి కిందకు వచ్చేసరికి ఆటో కనిపించలేదు. దాంతో వారు త్రీ టౌన్ ఏఎస్సై శంకరరావు ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆటోలో ప్రయాణికులు హ్యాండ్ బ్యాగ్‌ను మరచిపోయిన విషయాన్ని తిరిగి ఆటోస్టాండ్‌కు వచ్చిన అనంతరం ఆటో డ్రైవర్ కె. భూషణం గుర్తించాడు. ఆయన ఆ బ్యాగ్‌ను ప్రకాష్‌నగర్ పోలీసులకు అప్పగించాడు. మంగళవారం ఆ హ్యాండ్ బ్యాగ్ ను త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు ఆటో డ్రైవర్ తీసుకురాగా ఆ బ్యాగ్‌ను అర్బన్‌జిల్లా ఎస్పీ బి. రాజకుమారి చేతుల మీదుగా బాధితులకు అప్పగించారు. ఆటో డ్రైవర్ భూషణం నిజాయితీని గుర్తించిన ఎస్పీ అతనికి నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటో డ్రైవర్ భూషణం ఆటోడ్రైవర్లందరికీ ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు. రాజమహేంద్రవరం సెంట్రల్ డీఎస్పీ కులశేఖర్, త్రీటౌన్ సీఐ శ్రీ రామ కోటేశ్వరరావు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. -
నిజాయితీగా ఉంటేనే న్యాయం చేయగలం
వరంగల్ : నీతి, నిజాయితీతో కేసుల పరిశోధన చేపడితే ప్రజలకు తప్పకుండా న్యాయం చేయగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు అన్నారు. కమిషనరేట్ పరిధిలో వినూత్న తరహాలో ‘అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల మేళా’ను Ô¶ నివారం కేయూ క్రాస్‌రోడ్‌లోని గోల్డెన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈమేళాలో కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోలీసు స్టేషన్ల వారిగా దర్యాప్తు స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఈమేళాను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. విధి విధానాలు రూపొందించేందుకు మేళా భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఏదైనా నేరం జరిగి కేసు నమో దు మొదలుకొని కేసులోని నిందితులకు న్యాయస్థానం శిక్ష విధించే వరకు పోలీసు అధికారులు తీసుకోవాల్సిన చర్యల విధి విధానాలను రూపొందించేందుకు ఈ మేళా ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. ఈమేళాలో పోలీసు అధికారుల సూచనలతో 16పాయింట్ల విధి విధానాలను అనుసరించి పోలీస్‌స్టేçÙన్ పరిధిలో కానిస్టేబుల్ నుంచి స్టేషన్ అధికారి వరకు కేసుల దర్యాప్తులను పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించడంతో పాటు కేసుల్లో నిందితులకు శిక్ష పడేందుకు ఉపయోగ పడుతాయన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారం ఎక్కువ కాలం పెండింగ్, దర్యాప్తులో ఉన్న కేసులను ఈసందర్భంగా పరిష్కరించినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదైన ప్రతీ కేసుకు సంబంధించిన సీడీ ఫైల్లో ప్లా న్ ఆఫ్ యాక్షన్ ప్లాన్‌ను స్టేషన్ అధికారి చేతి రాతతో రాయాలని, దీన్ని ఏసీపీలు ఆప్రూవల్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాయడం వల్ల దర్యాప్తు వేగవంతంగా జ రిగి దోషులకు తొందరగా శిక్ష పడే అవకాశాలున్నాయన్నారు. ప్రజల కు మనపై ఉన్న నమ్మకాన్ని రెట్టిం పు చేసుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. కమిషనరేట్‌కు రాష్ట్రం లోనే మంచి పేరు తీసుకువచ్చేలా ప్రతి పోలీస్ శ్రమించాలని ఆయన కోరారు. ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్థన్, మహేందర్, సురేంధ్రనాథ్, రవీందర్రావు, ఈశ్వర్రావుతో పాటు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నిలువెత్తు నిజాయతీ
వేములవాడ : పైసా కోసం ప్రాణం తీసే కర్కోటకులున్న సమాజం.. ఆస్తి కోసం అన్నదమ్ములను హతమార్చుతున్న వైనం.. పుక్యానికి వస్తే ఫినాయిల్ తాగే తత్వం.. తామే దేశోద్ధారకులమని డాంబికాలు చెప్పే కాలం.. అవినీతి, అక్రమాలంటే ఏంటో తెలియనే తెలియమంటూనే భారీగానే సొమ్ము చేసుకునే జనం.. అవినీతి, అక్రమాలు, బంధు, కులప్రీతితో కుమ్ములాడుకుంటూ.. మానవత్వాన్నే విస్మరిస్తున్న సమాజంలో కళ్లెదుటే రూ.వేలకు వేలు కనిపించినా ‘ఇది నాది కాదు.. అభాగ్యులెవో పోగొట్టుకున్నారు.. వారిని వెతికి ఇది అప్పగించాల’నే నిజాయతీతో సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు ఆటోడ్రైవర్ రాజు. శ్రీరాముల రాజు ట్రాక్టర్‌పై రోజూవారీ కూలీ. తర్వాత ట్రాక్టర్ డ్రైవర్‌గా మారాడు. వేములవాడ విద్యానగరంలో నివాసం. ఏడేళ్లపాటు ట్రాక్టర్ నడపి కుటుంబాన్ని పోషించుకున్నాడు. ట్రాక్టర్ నడపడంతో అనారోగ్యం బారినపడ్డాడు. రూ.60 వేలు అప్పు చేసి ఆటో కొనుగోలు చేశాడు. కుటుంబ నేపథ్యమిది... రాజవ్వ– రాజయ్య దంపతులు. రాజవ్వ రోజూవారీ కూలీ. రాజయ్య గొర్రెలకాపరి. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అక్క ఎల్లవ్వ. అన్నయ్య నరేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తమ్ముడు నవీన్ ట్రాక్టర్ డ్రైవర్. మధ్యలో రాజు. ఈయనకు భార్య లత, కుమారుడు స్వాత్విక్, కుమార్తె దీక్షిత. ఎములాడ సర్కారు బడిలో ఎనిమిదో తరగతి వరకు చదివాడు. చదువు ఇష్టంలేక ట్రాక్టర్‌పై లేబర్‌గా.. తర్వాత డ్రైవర్‌గా పనిచేశాడు. ఆటో నంబర్ ఏపీ 15 టీబీ–7670, పోలీసులిచ్చిన టాప్ నంబర్ వీఎండీ–278. డ్రైవింగ్ లైసెన్సు నంబర్ 8483/ 2012. ఆధార్‌కార్డు నంబర్ 3502–9324– 5498. ఐదువేలు పోగొట్టుకుని.. రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ సమయంలో రూ.5వేలు వేతనం. జీతం తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఆ సొమ్మున్న బ్యాగు ఎక్కడో పోయింది. వెతికినా దొరకలేదు. అసలే పేదకుటుంబం. నెలంతా కష్టపడితే వచ్చిన సొమ్ము పోవడంతో ఆ నెల కుటుంబపోషణ ఎంతో కష్టమైంది. అదే టర్నింగ్ పాయింటయ్యింది. ఎవరైనా డబ్బులేకాదు.. ఇతర విలువైన వస్తువులు పోగొట్టుకున్నా బాధితుల చిరునామా తెలుసుకుని మరీ వారికి అందజేస్తున్నాడు. ఇటీవల వరంగల్‌కు చెందిన ఇద్దరు వేములవాడ రాజన్నను దర్శించుకుని రాజు ఆటోలో బస్టాండ్‌కు బయలు దేరారు. ఆటోలోనే రూ.15 వేలు ఉన్న బ్యాగు మర్చిపోయారు. తర్వాత గమనించిన రాజు.. వాళ్లకి సొమ్ము ఇచ్చేంత వరకూ ఆటో నడపలేదు. సమీపంలోని పోలీసు ఔట్‌పోస్టులో బ్యాగు అప్పగించాడు. అందులోని కాగితాలు, ఆధార్ ఇతరత్రా ఆనవాళ్ల ఆధారంగా బాధితులకు ఫోన్ చేసిన పోలీసులు.. వాళ్లు స్టేషన్‌కు రాగానే బ్యాగు, రూ.15వేలు అందజేశారు. ఉదయం 6 గంటలకే రోడ్డుపైకి.. రోజూ ఉదయం 6 గంటలకే ఆటోతో రోడ్డుపైకి చేరుకుంటాడు. అతడికి చాలామంది పరిచయస్తులున్నారు. ఏ అవసరం ఏర్పడినా ఫోన్ నంబరు ద్వారా ఇంటికి పిలిపించుకుంటారు. ఆపద సమయాల్లో ఆస్పత్రులకు ఏ వేళలోనైనా వెళ్తాడు. రాత్రి 9 గంటలకు ఆటోతో ఇంటికి చేరితే మిగిలేది రూ.300– రూ.400 ఆదాయం. సాయం చేయడంతోనే గుర్తింపు ఇతరులకు సాయంచేయడంతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. వక్రమార్గంలో సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేసినా.. మంచి గుర్తింపు మాత్రం రాదు. ప్రజల్లో ఇట్లాంటి గుర్తింపు రావడమే నాకు ఆనందం. ఓ వ్యక్తి నా ఆటోలో మర్చిపోయిన బ్యాగును పోలీసుల ద్వారా బాధితుడికి ఇచ్చిన. నా నిజాయతీకి మెచ్చిన సీఐ శ్రీనివాస్ సార్ నాకు వెయ్యిరూపాయలు ప్రోత్సాహకంగా అందించడం జీవితంలో మర్చిపోలేను. నాలాగేనే నా పిల్లలను కూడా క్రమశిక్షణతో పెంచుతున్న. -
నిజాయితీ చాటుకున్న యువకుడు
అఫ్జల్‌గంజ్: ఏటీఎం సెంటర్లో దొరికిన సొమ్మును పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడో యువకుడు. అఫ్జల్‌గంజ్ సీఐ అంజయ్య కథనం ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన మల్లయ్య, సత్తమ్మ దంపతులు గౌలిగూడ చమన్ ప్రాంతంలో కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈనెల 23న గౌలిగూడలోని శంకర్‌షేర్ హోటల్ సమీపంలో ఉన్న ఏటీఎం నుంచి సత్తమ్మ పేరున ఉన్న ఎస్బీహెచ్ ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా చేసేందుకు మల్లయ్య యత్నించాడు. అయితే, డబ్బు రాకపోవడంతో పక్కనే ఉన్న ఐసీఐసీఐ ఏటీఎం నుంచి రూ.5 వేలు డ్రా చేశాడు. అదే సమయంలో మొదటి ఏటీఎంలోకి వెళ్లిన యాకుత్‌పురాకు చెందిన ఇమ్రాన్‌కు అక్కడ ఏటీఎంలో రూ.10 వేలు దొరికాయి. ఆ డబ్బుకు సంబంధించిన వారు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేçÙన్లో అందజేశాడు. ఆ తర్వాత పాస్‌బుక్ అప్డేట్ చేయించుకొనేందుకు బ్యాంకుకు వెళ్లిన మల్లయ్యకు సత్తమ్మ అకౌంట్లో రూ.15 వేలు డ్రా చేసినట్టు బ్యాంక్ సిబ్బంది చెప్పారు. దీంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఏటీఎం సెంటర్లో దొరికిన నగదు స్టేషన్లో ఉండటంతో ఇన్స్పెక్టర్ అంజయ్య ఆ డబ్బు వారిదేనని నిర్ధారించుకొని వారికి అప్పగించారు. దొరికిన డబ్బును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న ఇమ్రాన్‌ను సీఐ అభినందిచారు. -
చొక్కారావు సేవలు చిరస్మరణీయం
ఘనంగా చొక్కారావు జయంతి నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ : మాజీ ఎంపీ, స్వర్గీయ జువ్వాడి చొక్కారావు 93వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహేశ్‌కుమార్‌గౌడ్, గొడుగు గంగాధర్, మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ చొక్కారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జువ్వాడి ఎంపీగా.. మంత్రిగా.. తెలంగాణ ప్రాంత బోర్డు సభ్యులుగా పనిచేసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ ఆధ్వర్యంలో చొక్కారావు విగ్రహానికి టీపీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప్పరి రవి, దిండిగాల మధు, చెర్ల పద్మ, గందె మాధవి, వాల రమణారావు, అజిత్‌రావు, వేదం, మాదాసు శ్రీనివాస్, మూల జైపాల్, వెన్న రాజమల్లయ్య, కల్వల రాంచందర్, గడ్డం విలాస్‌రెడ్డి, ప్రశాంత్‌దీపక్, బాశెట్టి కిషన్, పోతారపు సురేందర్, ఇమ్రాన్, వీరస్వామి, తాళ్లపెల్లి అంజయ్యగౌడ్, బాలరాజు, నాయక్, చంద్రయ్య, శ్రావణ్‌నాయక్, సతీష్‌రావు, రమేశ్, శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో... యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జువ్వాడి నిఖిల్ చక్రవర్తి ఆధ్వర్యంలో వివేకానంద డిగ్రీ కళాశాలలో జయంతిని నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు ‘నేటి భారతదేశ రాజకీయాలలో నీతి, నిజాయతీ–నిరాడంబరత’ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వంద మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్ ఆరెపల్లి మోహన్, అసెంబ్లీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. నాయకులు పోతారపు సురేందర్, బండి సంపత్, శ్రావణ్, ఇమ్రాన్, హరీష్, అరుణ్, రమేశ్, తిరుపతి, స్వామి, ప్రశాంత్, సుధీర్, సునీల్, స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
నిజాయతీ చాటుకున్న ఆటోడ్రైవర్
రామగుండం : పట్టణానికి చెందిన బొడ్డుపల్లి చందు అనే ఆటోడ్రైవర్ విధి నిర్వహణలో ఆదివారం గోదావరిఖని నుంచి రామగుండంకు ఆటోలో ప్యాసింజర్లను తీసుకువస్తున్నాడు. ఎఫ్‌సీఐ ఎక్స్‌రోడ్ వద్ద రోడ్డుపై పర్సు పడి ఉండడంతో ఆటో నిలిపి పర్సును తీసుకున్నాడు. అందులో ఉన్న గుర్తింపు ఆధారంగా జెన్కో సివిల్ కాంట్రాక్టర్ రంగుల ప్రశాంత్ పర్సుగా గుర్తించి సమాచారమందించాడు. దీంతో సదరు బాధితుడు మజీద్ కార్నర్ వద్దకు రాగా అందరి సమక్షంలో పర్సును ప్రశాంత్‌కు అందజేశాడు. అందులో గుర్తింపు కార్డుతో పాటు రూ.4,610 నగదు, చెక్కులు, ఏటీఎం కార్డు, పాన్‌కార్డు, ఆధార్ కార్డుతోపాటు కీలక రశీదులు ఉన్నాయి. నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్ చందును ప్రశాంత్‌తోపాటు జెన్కో ఉద్యోగులు అబ్దుల్ తఖీ, ఆడెపు శ్రీనివాస్, నూనె రాజేందర్ అభినందించారు. -
ఆటోడ్రైవర్ నిజాయితీ
► ఎస్పీ విశాల్ గున్నీ అభినందన ► రూ. 5 వేల నగదు బహుమతిగా అందజేత నెల్లూరు : ఆటోలో మరిచిపోయిన విలువైన ఆభరణాల బ్యాగును ప్రయాణికుడికి అందించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. చింతారెడ్డిపాళెం యల మవారిదిన్నెకు చెందిన ఆటోడ్రైవర్ కాయల రఘును ఎస్పీ విశాల్‌గున్నీ శుక్రవారం అభినందించారు. రఘు వీఆర్సీ సెంటర్లో ఆటో స్టాండ్‌లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గూడూరు ఇందిరానగర్‌కు చెందిన గునపాటి మురహరిరెడ్డి తన పనిమనిషితో కలిసి ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చాడు. శుక్రవారం ఉదయం మినీబైపాస్‌లోని పీటీ రంగరాజన్ పెట్రోల్ బంకు వద్ద బస్సు దిగి చిల్డ్రన్స్‌పార్కు వద్దనున్న పుండరీ కాంక్షయ్య వీధిలోని స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు రఘు ఆటో ఎక్కారు. నాలుగు బ్యాగులను ఆటోలో తన వద్ద పెట్టుకున్న ఆయన నగల బ్యాగును మాత్రం వెనుక పెట్టాడు. స్నేహితుడి ఇంటి వద్ద దిగి తన వద్దనున్న నాలుగు బ్యాగులను తీసుకుని, నగల బ్యాగును పని మనిషి తెస్తుందని భావించి లోనికి వెళ్లాడు. ఆటోడ్రైవర్ వారిని దింపి వెళ్లిపోగా, పని మనిషి ఇంట్లోకి ఖాళీ చేతులతో రావడం గుర్తించిన మురహరిరెడ్డి నగల బ్యాగు ఎక్కడాని ప్రశ్నించాడు. ఆమె నివ్వెరపోవడంతో ఇంట్లో నుంచి పరుగులు తీసి ఆటో కోసం గాలించారు. జరిగిన విషయాన్ని బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ చెంచురామారావు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాగులో రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, డైమండ్ రింగ్‌లు, లాప్టాప్, సెల్‌ఫోన్, రూ.40 వేల నగదు ఉందని బాధితుడు పేర్కొనడంతో ఆటోడ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. కాగా ప్రయాణికులను దించి కొద్దిదూరం వెళ్లిన రఘు వెనుక బ్యాగు ఉండటాన్ని గమనించి బాధితులకు ఇచ్చేందుకు వెనక్కి వచ్చాడు. గమనించిన బాధితుడు, పోలీసులు ఆటో వద్దకు రాగా బ్యాగు అప్పగించాడు. ఆటోడ్రైవర్, పోలీసుల సమక్షంలో బాధితుడు బ్యాగును తెరచి చూసి అందులో అన్ని వస్తువులు పక్కాగా ఉండటంతో ఆటోడ్రైవర్‌ను అభినందించాడు. నగర డీఎస్పీ వెంకటరాముడి ద్వారా తెలుసుకున్న ఎస్పీ విశాల్‌గున్నీ నిజాయితీ పరుడైన ఆటోడ్రైవర్‌ను తన చాంబర్లో అభినందించారు. రఘును సహచర ఆటోడ్రైవర్లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మురహరిరెడ్డి ఆటోడ్రైవర్‌కు ఎస్పీ ద్వారా మీదుగా రూ.5 వేలు నగదును బహూకరించారు. -
నిజాయితీ చాటిన ఆటో డ్రైవర్
ఘట్కేసర్(రంగారెడ్డి): ఓ మహిళ ఆటోలో ప్రయాణిస్తుండగా పర్సు అందులో పడిపోయింది. ఆమె దిగిపోయిన తర్వాత డ్రైవర్ గమనించి అందులో ఉన్న రూ.27 వేలు సురక్షితంగా తిరిగివ్వడంతో అందరూ అభినందించారు. వివరాలు.. ఘట్‌కేసర్‌కుచెందిన జి.గోపాల్ వృత్తిరీత్యా డ్రైవర్. నిత్యం తన ఆటోను నగరంలోని ఈసీఐఎల్‌కు నడుపుతూ ప్రయాణికులకు చేర వేస్తుంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 11 గంటలకు మండలంలోని మైసమ్మగుట్టకాలనీకి చెందిన మైసమ్మతోపాటు మరికొందరు కలిసి ఘట్కేసర్లో అతని ఆటోలో ఎక్కారు. కొద్దిసేపటికి మిగతా ప్రయాణికులతో కలిసి ఆమె ఈసీఐఎల్‌లో దిగింది. అనంతరం సీటు కింద చిన్నపర్సు ఉండటాన్ని డ్రైవర్ గమనించాడు. అందులో ఉన్న రూ.27 వేలను నేరుగా ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అందజేశాడు. మధ్యాహ్నం మూడు గంటలకు బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన పర్సు ఆటోలో పోగొట్టుకున్నానని చెప్పింది. దీంతో ఆటో డ్రైవర్ గోపాల్‌తోపాటు సంఘం నాయకుడు సుధాకర్‌ను పిలిపించారు. పోలీసుల సమక్షంలో డబ్బులున్న పర్సును మైసమ్మకు ఇవ్వడంతో అతని నిజాయితీని అందరూ అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐలు వీరభధ్రం, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రూ.లక్ష తిరిగిచ్చారు
సిరిసిల్ల : బ్యాంకులో డ్రా చేసిన డబ్బులకంటే ఎక్కువగా వచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చి నిజాయతీ చాటుకున్నారు మహిళలు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన సాయి స్లమ్ సమాఖ్యలోని శ్రీసాయి మహిళా సంఘం సభ్యులు సోమవారం సిరిసిల్ల ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.4 లక్షలు రుణంగా తీసుకున్నారు. క్యాషియర్ లెక్క చూసుకోకుండా వీరికి రూ.5 లక్షలు చెల్లించారు. ఇంటికి చేరిన మహిళలు డ బ్బులు లెక్కించగా, ఒక లక్ష ఎక్కువగా ఉండడంతో నిజాయతీగా బ్యాంకుకు తిరిగి చెల్లించి శభాష్ అనిపించుకున్నారు. డబ్బులు తిరిగి ఇచ్చిన మహిళా సంఘం రిసోర్సు పర్సన్ గాజుల వీణ, బూర్ల రేవతిని బ్యాంకు అధికారులు శభాష్ అని అభినందించారు. -
ఆటోవాలా నిజాయితీ!
-
అలుపెరుగని ప్రజా న్యాయవాది కంఠంనేని
‘జ్ఞానమనే పుస్తకంలో మొదటి అధ్యాయం నిజాయితీ’ అని ఒక సూక్తి. నిజాయితీ అనే జ్ఞానాన్ని జీవిత కాలమంతా ప్రదర్శించిన అరుదైన మాన వీయ వ్యక్తిత్వం కలవారు కంఠంనేని రవీంద్రరావు గారు. ఆయన 11.1.2015 ఆదివారం నాడు తన 79వ ఏట, తుదిశ్వాస విడిచారు. వారికి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్) ఉద్యమ నివాళులర్పిస్తోంది. 1975, మే 31న నిర్మా ణ రూపం పొందిన నాటి నుండీ ఓపీడీఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, కృష్ణాజిల్లా శాఖకు బాధ్యు లుగా 20 ఏళ్లపాటు ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమంలో రవీంద్రరావు కృషి సల్పారు. 14.3.1935న మోపిదేవి గ్రామంలో జన్మిం చిన కంఠంనేని, 1952లో అవనిగడ్డలో హైస్కూలు విద్యను పూర్తిచేసుకొని, బందరు హిందూ కళాశా లలో డిగ్రీని, విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాల యంలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. విద్యార్థి ఉద్యమ (స్టూడెంట్ ఫెడరేషన్) కార్యకలా పాల్లో పాల్గొన్నారు. 1962లో అవనిగడ్డలో న్యాయ వాద వృత్తిని చేపట్టిన నాటి నుండీ పీడిత ప్రజల న్యాయవాదిగా ఆయన నిలిచారు. తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వర రావు లాంటి ప్రముఖ విప్లవ కమ్యూనిస్టులపై, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కుట్రకేసును బనాయించినప్పుడూ, శ్రీకాకుళ గిరిజన, రైతాంగ ఉద్యమంపై ఒకవైపు క్రూర అణచివేతలకు మరొక వైపు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడి నప్పుడూ, పోలీసుల చట్ట వ్యతిరేక అణచివేత విధానాలను అన్యాయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో రవీం ద్రరావు పోరాడారు. ‘పార్వతీపురం కుట్రకేసు సహాయనిధి’కి విరాళాలు సేకరించి తోడ్పాటునందించారు. సాధారణ ప్రజలపై రోజు వారీగా సాగే అనేక రకాల చట్టవ్యతిరేక నిర్బం ధాలను న్యాయస్థానాలలో ప్రశ్నిస్తూ న్యాయం కోసం బాధితుల పక్షాన నిలిచారు. శ్రీకాకుళం గిరిజనోద్యమాన్ని అణచటానికి జరిపిన ‘బూటకపు ఎదురు కాల్పుల‘పై ఓపీడీఆర్ నియమించిన అఖిలభారత స్థాయి వాస్తవ సేకరణ కమిటీకి 1977-78లలో సహకరించి వారి నివేదిక వెలువడ్డానికి కృషి చేశారు. 1977 నవంబర్ 19న దివిసీమలో సంభవించిన భయంకర ఉప్పెన సందర్భంగా అనేకానేక ఈతిబాధ లకు గురైన ఆ ప్రాంత ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన రాష్ర్ట ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపు తూ, ఏర్పడిన ‘దివి తాలూకు తుపా ను బాధితుల సహాయ కేంద్రం’కు సమన్వయకర్తగా రవీంద్రరావుగారే వ్యవహరించారు. ఏనాడో 1926లో బ్రిటిష్ పాల కులు దక్షిణ చిరువోల్లంకలోని వడుగువారిపాలెం గ్రామస్థులకు లీజుకిచ్చిన 45 ఎకరాల భూమిని 1959లో చల్లపల్లి జమీందారు స్వాధీనపరుచు కుంటే 1978లో తిరిగి ఆక్రమించుకుని సాగు చేసు కోవటానికై సాగించిన పోరాటానికి, నైతిక చట్టబద్ధ మద్దతును సహకారాన్నీ అందించారు. కృష్ణా జిల్లా ఓపీడీఆర్లో ప్రముఖ సీనియర్ నేతలతో కలిసి పలు హక్కుల అణచివేత సంఘటనలపై, మమే కమై రవీంద్రరావు కృషి చేశారు. తన పార్థివ దేహం కూడా వైజ్ఞానిక అవసరాలకు, సామాజిక ప్రయోజ నాలకు తోడ్పడాలనే ఆయన సంకల్పం స్పూర్తి దాయకం. న్యాయవాద వృత్తిలో నిజాయితీని నిల బెట్టుకుంటూ, నైపుణ్య బలంతో రాణించటం కత్తి మీద సాములాంటిది. ఈ విషయంలో ‘జెంటిల్మన్ ఆఫ్ ది బెజవాడ బార్’గా రవీంద్రరావు ప్రశంసలు అందుకోవటం, ఆయన నిశ్శబ్ద ప్రజాతంత్ర జీవితా నికి కొసమెరుపులాంటిది. విద్యార్థి దశ నుంచీ అధ్యయన శీలి అయిన రవీంద్రరావు మార్క్సిస్టు తాత్త్విక, సిద్ధాంత, రాజ కీయ గ్రంథాలనే కాక ఉత్తమ సాహిత్యాన్ని కూడా నిరంతరాయంగా అధ్యయనం చేశారు. ఊసుపోని కబుర్లకూ, పనికిరాని కాలక్షేపానికీ ఆయన దూరం గా ఉన్నారు. స్నేహితులకు ప్రేమను, జూనియర్లకు జ్ఞానాన్ని పంచారు. న్యాయవాద వృత్తి, ఔన్నత్యా న్నీ కాపాడారు. నిబద్ధ ప్రజాతంత్రవాదిగా చివరి వరకు జీవించిన, ఓపీడీఆర్ వ్యవస్థాపక సభ్యులు, నాయకులు అయిన కంఠంనేని రవీంద్రరావుకి ఇవే మా ఉద్యమ జోహార్లు. (నేడు విజయవాడ అమ్మ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు కంఠంనేని రవీంద్రరావు సంస్మరణ) - కె.ఏసు రాష్ట్ర అధ్యక్షులు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్), విజయవాడ -
జీతాలు పెంచితేనే నిజాయతీకి భరోసా
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలపై సీఎం కేసీఆర్ అభిప్రాయం 2 లక్షలు చేయాలని ప్రతిపాదన.. మంత్రులకు కూడా పెంచే యోచన మాజీలకు పెన్షన్ పెంపు. సాక్షి, హైదరాబాద్: చట్టసభల సభ్యులకు వేతనాల పెంపు అనివార్యమని సీఎం చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. వారు నిజాయతీగా పనిచేయాలంటే సరిపోను వేతనాలు అందాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాప్రతి నిధులకు వేతనాల పెంపు ప్రతిపాదనపై సీఎం సోమవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో సమీక్షిం చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు రూ. 95 వేల వరకు జీతభత్యాలు అందుతున్నాయని..పెరిగిన ఖర్చులకు ఇవే మాత్రం సరిపోవని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ప్రజాప్రతినిధులు నిజాయతీగా పనిచేయాలని తాను కోరుకుంటున్నానని, అలాంటప్పుడు వారికి సరిపోయేంత జీతం కూడా ఇవ్వాలని సీఎం అన్నారు.ప్రస్తుతం తెలంగాణలో 120 ఎమ్మెల్యేలు, 40మంది ఎమ్మెల్సీలు ఉండగా... అందులో సీఎం, మంత్రులు, ఇతర కేబినెట్ హోదా కలిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 36 మంది వరకు ఉన్నారని చెప్పారు. మిగతా 124 మందికి నెలకు రూ. రెండు లక్షలు వేతనం చెల్లిస్తే.. ప్రతినెలా రూ. 2.5 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 30 కోట్లు, ఐదేళ్లకు రూ. 150 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఏటా రూ. 75 కోట్లు చెల్లిస్తున్నారని, పెంపుతో అదనంగా రూ. 75 కోట్ల వ్యయం అవుతుందని... ఐదేళ్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ఆమోదించే బడ్జెట్లో ఇది 0.14 శాతం మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు. మంత్రులకు కూడా వేతనాలు రెట్టింపు చేసే అంశాన్ని పరిశీలించాలని... మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే పెన్షన్‌ను కూడా పెంచాలని సీఎం నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అలవెన్సులు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సీఎస్‌ను ఆదేశించారు. -
నిజాయితీగా ఉండాలి
పోలీసులకు హోంమంత్రి సూచన సాక్షి, సిటీబ్యూరో: పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే పోలీసులు నిజాయితీగా ఉండాలని ఆయన కోరారు. బాలానగర్‌లోని ఉషా పరిశ్రమలో బుధవారం నగర ఇన్స్పెక్టర్లకు నిర్వహించిన ఐదు సూత్రాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు, ప్రజలకు మరింత సేవలందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు శాఖకు కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.350 కోట్లతో 1500 ఇన్నోవా కార్లు, 2050 ద్విచక్ర వాహనాలు ఇచ్చారన్నారు. ట్రాఫిక్ పోలీసులకు 35 శాతం అలవెన్స్ ఇచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. పోలీసులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రజలకు సేవలందించేందుకు పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. బంజారాహిల్స్‌లో 8 వేల గజాలలో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అత్యాధునికంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ... పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన సదుపాయాలు కల్పించారని, పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి శాంతిభద్రతలను కాపాడాలని అన్నారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఇక నుంచి హోంగార్డులకు నెలనెలా జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐదు సూత్రాలను పాటిస్తే తప్పకుండా పోలీస్ వ్యవస్థలో మార్పు వచ్చి ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ శివప్రసాద్, డీసీపీ సత్యనారాయణ. బాలానగర్ ఏసీసీ నంద్యాల నర్సింహారెడ్డి, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్‌రెడ్డితో పాటు నగరంలోని అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. ఎస్హెచ్ఓలకు ఉషా కంపెనీ ఈడీ రవిరాజుతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. -
శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా
- ‘సాక్షి’తో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ వెల్లడి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా’నని టీటీ డీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టీకరించారు. టీటీడీ ఈవో పోస్టు పొందేందుకు తానెవరి సహాయం కోరలేదని.. కొనసాగేం దుకూ ఎవరి సహాకరం అడగలేదని స్పష్టీకరించారు. గురువారం తిరుపతిలో తన క్యాంప్ ఆఫీసులో ఈవో ఎంజీ గోపాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే తనను శ్రీవేంకటేశ్వరస్వామే టీటీడీ ఈవో పదవి ఇచ్చేలా చేశారని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భక్తులకు స్వామివారిని మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నించానన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినా.. తెలంగాణలో పెరిగానన్నారు. ఐఏఎస్‌ల విభజనలో కేంద్ర ప్రభుత్వం తనను తెలంగాణకు కేటాయించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను వ్యహరిస్తానని స్పష్టీకరించారు. టీటీడీ ఈవోగా కొనసాగేందుకు తానెవరి సహాయం కోరలేదన్నారు. శ్రీవారి ఆజ్ఞతో పనిచేస్తానని స్పష్టీకరించారు. -
ఆ పిల్లలే వారికి దేవుళ్లు
ఉన్నత విద్యావంతుడు గణేశ్... స్పెషల్ టీచర్ విశాలాక్షి. దేవుడికిచ్చిన మాట కోసం... ఉద్యోగాలు మానుకున్నాడతడు. చుట్టూ ఉన్న పిల్లల్లోనే దేవుడున్నాడని... విదేశీ అవకాశాలను వదులుకున్నారామె. వీరిద్దరూ శ్రమిస్తున్నది ప్రత్యేకమైన పిల్లల సంక్షేమం కోసమే. అదే వీరి ప్రయాణాన్ని ఒకే గమ్యం వైపు నడిపిస్తోంది. ఒక లక్ష్యం కోసం పాటుపడుతున్న ఈ స్నేహితులు ఎందరికో జీవన నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. చెన్నై నగరంలో నుంగంబాక్కంలోని నాగేశ్వర రోడ్డులో ఉంది కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్. నరాల బలహీనత, బుద్ధిమాంద్యం, జన్యులోపాలతో పుట్టిన పిల్లలకు అక్కడ వైద్యం జరుగుతోంది. డాక్టరు నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు గణేశ్. అతడి కళ్లలో దైన్యం... ప్రపంచంలోని నైరాశ్యమంతా గూడుకట్టుకుని ఉన్నట్లుంది ముఖం. అతడి చేతుల్లో ఉన్న ఎనిమిదిరోజుల పాపాయి శ్వేతకు ఇవేవీ తెలియదు. తనను బతికించుకోవడానికి తండ్రి జీవితాన్ని ధారపోస్తాడని ఆ బిడ్డకే కాదు ఆ క్షణంలో గణేశ్‌కి కూడా తెలియదు. ఏ క్షణాన ఫిట్స్ వస్తుందో బిడ్డ మెలికలు తిరిగిపోతూ కళ్లు తేలేస్తుందోనని ఒకటే ఆందోళన. కళ్లు మూసుకుని కళ్ల ముందు మెదిలిన దేవుళ్లందరికీ మొక్కుతున్నాడు. ఇది జరిగి పద్ధెనిమిదేళ్లవుతోంది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘భగవంతుడా! నా బిడ్డను ఆరోగ్యవంతురాలిని చేయి. నేను నా జీవితమంతా ఇలాంటి బిడ్డలకు సేవ చేసి నీ రుణం తీర్చుకుంటాను - అని మొక్కాను. ఏ దేవుడు కరుణించాడో తెలియదు. కానీ నా బిడ్డ కోలుకుంది. తర్వాత నేను పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలో ‘హృదయాలయ’ అనే హోమ్ ప్రారంభించాను. ఇప్పుడు దానిని నిడదవోలుకు మార్చాం. మా హోమ్‌లో బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లలను సంరక్షిస్తున్నాం. తప్పిపోయిన పిల్లలకు ఆశ్రయమిస్తున్నాం. జెమిని టీవీ కార్యక్రమంలో మా హోమ్‌లో ఉన్న పిల్లలను చూసి వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు గణేశ్. దేవుడికిచ్చిన మాట కోసం... భగవంతుడిని నమ్మే వారిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో దేవుడిని వరమడిగే ఉంటారు. వారిలో చాలామంది కోరిక నెరవేరిన తర్వాత చాలా సౌకర్యంగా మొక్కు సంగతి మర్చిపోతారు. అలా మర్చిపోకపోవడం గణేశ్‌లో నిజాయితీ. కుమార్తె వైద్యం కోసం అతడు సికింద్రాబాద్‌లోని స్వీకార్ ఉప్కార్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్లో గడిపాడు. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న ఠాకూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పడంలో శిక్షణ పొందుతున్న విశాలాక్షి పరిచయమయ్యారు. మాటల్లో మాటగా దేవుడికిచ్చిన మాటను ఆమెతో పంచుకున్నారు గణేశ్. వారిద్దరిలో ప్రత్యేకమైన పిల్లల కోసం ఏదైనా చేయాలనే తపన ఉంది. గణేశ్ ప్రయత్నానికి భార్య విజయలక్ష్మి సహకరించారు. ‘‘హృదయాలయ ఆవిర్భావానికి ఆ తపనే కారణం’’ అంటారాయన. నిర్వహణ కష్టమే అయినా... హోమ్ నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఒడుదొడుకులు అన్నీ ఇన్నీ కావు. ఆ విషయాలను పక్కన పెట్టి తమకు సహాయం అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు గణేశ్. ‘‘కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి గారి కోడలు రాధమ్మ బియ్యం, పప్పు దినుసులు పంపిస్తున్నారు. గణేశ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో సంపాదించిన డబ్బులో ఎక్కువ ఈ హోమ్‌కే ఖర్చు చేశారు. ఉన్న రెండెకరాలూ అమ్మేశారు. అతడి స్నేహితులు మంచి స్థితిలో ఉన్న వాళ్లు అప్పుడప్పుడూ సహాయం చేస్తున్నారు. నా బంగారం, గణేశ్ గారి భార్య బంగారమూ తాకట్టుకెళ్లింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పిల్లలను ఏ రోజూ పస్తు పెట్టలేదు’’ అన్నారు విశాలాక్షి. చిత్తశుద్ధితో చేస్తే... గణేశ్ నమ్మే దేవుడు ఇతడికి స్పందించే మనసిచ్చాడు. అలాగే గంపెడంత కష్టాన్నీ ఇచ్చాడు. పాపాయిని ఏ క్షణాన ఫిట్స్ భూతం మింగేస్తుందోనని కంటి మీద రెప్పవేయకుండా గడిపారు గణేశ్. ఇప్పుడు అలాంటి ఎందరో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పిల్లల్లో దేవుడుంటాడని నమ్మడంలో ఒక సంతోషం ఉంటుంది. ప్రత్యేకమైన పిల్లలు ఎప్పటికీ పిల్లలే. కాబట్టి దేవుడు వీరిలో ఎప్పటికీ ఉంటాడు- అంటారు గణేశ్. నిజమే... వారికి ఆ పిల్లలే దేవుళ్లు. - సాక్షి ఫ్యామిలీ ఫొటోలు : రాజేశ్, శేఖర్, న్యూస్‌లైన్ నిడదవోలు ప్రతిరోజూ ... నేర్పించాల్సిందే! మాది పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి. గణేశ్‌గారు స్పెషల్ చిల్డ్రన్ కోసం హోమ్ పెట్టాలని చెప్పినప్పుడు మా ఊరే సరైన ప్రదేశం అని సూచించాను. ఈ పిల్లలకు పళ్లు తోముకోవడం నుంచి ప్రతిదీ ప్రతిరోజూ నేర్పించాల్సిందే. తమ పేరు, స్కూల్ పేరు, ఊరి పేరు రోజూ డ్రిల్ చేయిస్తాం. ఫోన్ నంబరు పలికిస్తున్నాం. పిల్లల్లో ఏకాగ్రత, మైండ్ - హ్యాండ్ కో ఆర్డినేషన్ అలవడడానికి పేపర్ కవర్ల తయారీ నేర్పించాను. వాళ్ల మూడ్‌ని బట్టి వారంలో రెండు లేదా మూడు రోజులు కూర్చోబెడతాను. పిల్లలు నాతో ఎంతగా అల్లుకుపోయారంటే ఒక్కరోజు నేను కనిపించకపోతే బెంగపెట్టుకుంటారు. - విశాలాక్షి, స్పెషల్ టీచర్ -
నిజాయితీగల నాయకుడు జగన్
ప్రజల బలహీనతలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బాబు రాష్ట్ర విభజనకు సహకరించి చరిత్రహీనుడిగా మిగిలిన కిరణ్ బాబు, కిరణ్ చిత్తూరు జిల్లాలో పుట్టడం దురదృష్టకరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పులిచెర్ల (కల్లూరు): రాజకీయాల్లో నిజాయితీ కలిగిన ఏకైక నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పులిచెర్లలో సోమవారం ఎంపీపీ మురళీధర్ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అమలుకు సాధ్యంకాని హామీలను గుప్పించి అడ్డదారిలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని దుయ్యబట్టారు. నాడు అధికారం కోసం పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన మాదిరిగానే నేడు ప్రజలను వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం రుణమాఫీపైనే చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు దానిపై కమిటీ వేసి కాలయాపన చేస్తున్నాడన్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ మేనిఫెస్టోలో రుణమాఫీని చేర్చాలని తనతో పాటు మరికొంత మంది అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుపోగా అందుకు ఆయన స్పందిస్తూ అది సాధ్యమయ్యే పనికాదని, అధికారంలోకి వచ్చిన తరువాత చేయకపోతే ప్రజల మనసులో మాట నిలుపుకోలేని వ్యక్తులుగా మిగిలిపోవాల్సి వస్తుందని చెప్పినట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర విభజనకు సహకరించి చరిత్ర హీనుడుగా మారాడని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరూ చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తెలుగుదేశానికి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఆ పార్టీ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు అశోక్, ఎంపీపీ మురళీధర్, మండల పార్టీ కన్వీనర్ మురళీమోహన్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షులు రెడ్డీశ్వర్‌రెడ్డి, నాయకులు నాదమునిరెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, ఎన్ఎస్ రెడ్డిప్రకాష్, నాగిరెడ్డి, వెంకటరెడ్డెప్ప, డీఎస్.గోవింద్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్వీ రమణ, కోదండయ్య, ముర్వత్బాషా, రాయల్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాయతీ చాటుకున్న హైదరాబాద్ ఆటోడ్రైవర్
హైదరాబాద్: తన ఆటోలో విదేశీ ప్రయాణికులు మరిచిపోయిన డాలర్ల కట్టను తిరిగి అప్పగించి నిజాయతీని చాటుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్మెట్కు చెందిన ఆటోడ్రైవర్ పి.వి.శంకర్రావు మంగళవారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రి వద్ద కెన్యాకు చెందిన రోగి గాడ్‌ఫ్రె కిషాహ్ గగన్‌ను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. పేషంట్‌తోపాటు అటెండెంట్ ఫిలిప్స్ కోబా ఆల్ఫ్రెడ్ కూడా ఆటో ఎక్కాడు. వీరిని బంజారాహిల్స్‌లో దింపాక ఆటో తీసుకుని శంకర్రావు వెళ్లిపోయాడు. సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో వెనుకసీటులో డాలర్ల బండిల్‌ను గమనించాడు. అది విదేశీయులదేనని భావించిన శంకర్రావు వెంటనే అపోలో ఆస్పత్రికి వెళ్లాడు. సెక్యూరిటీ మేనేజర్ యాదగిరిరెడ్డిని కలిసి డాలర్ల బండిల్‌ను అప్పగించి.. విదేశీయులకిమ్మని చెప్పాడు. రాత్రి 7.30 గంటలకు కెన్యా దే శీయులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక డాలర్ల బండిల్ పోయిన విషయాన్ని గుర్తించారు. ఆటోలో మర్చిపోయి ఉంటామని భావించిన వారు.. విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చి విచారించగా డాలర్ల బండిల్‌ను ఆటోడ్రైవర్ అప్పగించిన విషయం తెలిసింది. వీటి విలువ రూ.3.50 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు. నిజాయతీగా తమ సొమ్మును అప్పగించిన ఆటోడ్రైవర్‌ను అభినందించి.. పారితోషికంగా 200 డాలర్లు ఇచ్చారు. ఆటోడ్రైవర్‌ను బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.మురళీకృష్ణ కూడా అభినందించారు. -
విశ్లేషణం: ఆ తిక్కకున్న లెక్కేంటట?
ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా అంచనా వేయాలంటే పరీక్షలు నిర్వహించాలి. అయితే అన్ని సందర్భాల్లోనూ, అందరి విషయంలోనూ అది సాధ్యంకాదు... ప్రముఖుల విషయంలో అసలే సాధ్యంకాదు. అయితే వారు మాట్లాడే తీరు, వాడే పదాలు, బాడీ లాంగ్వేజ్, జీవన విధానం, వివిధ సందర్భాల్లో వారి ప్రవర్తన, స్పందనను గమనించడం ద్వారా కూడా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అలాంటి ప్రయత్నమే ఈ ‘విశ్లేషణం’. కొంచెం తిక్కుంది.. దానికి లెక్కుంది... పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో పవర్ ప్రవహిస్తుంది. ఆయన మనుషుల్లో/ మనుషులతో కలవడు... కలిసినా పెద్దగా మాట్లాడడు... కానీ అభిమానులకు ఆయనో వ్యసనం. ఎందుకంటే ఆయన మాటల్లో మనిషి కనిపిస్తాడు... ఆ మనిషిలో నిజాయితీ కనిపిస్తుంది. పవన్‌కళ్యాణ్ అనగానే మెడమీద చెయ్యి రుద్దుకుంటూ కోపంగా చూసే యాంగ్రీ యంగ్‌మ్యాన్ ‘బద్రి’ గుర్తొస్తాడు. అయితే అది సినిమాలకు సంబంధించిన మేనరిజమ్ మాత్రమే. బాహ్యప్రపంచంలో ఆ మేనరిజమ్ కనిపించదు... కళ్లలో అంత కోపమూ కనిపించదు. అసలాయన కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తే కదా. పక్కకు లేదా కిందకు చూస్తుంటారు. మాట్లాడేతీరు కూడా తనతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది. స్వరం కూడా మంద్రస్థాయిలో ఉంటుంది. వాడే పదాల్లో భావోద్వేగాలకు, మనసుకు సంబంధించిన పదాలు ఎక్కువగా ఉంటాయి. వీటినిబట్టి ఆయనో అంతర్ముఖుడని, కెనైస్థటిక్ పర్సన్ (ఫీలింగ్స్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి) అని చెప్పవచ్చు. వీరికి భావోద్వేగాలు, స్పందనలు ఎక్కువగా ఉంటాయి. పలు సందర్భాల్లో పవన్ అలా స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆయన మనుషులతో అంతగా కలవక పోయినా వాళ్లు ఆయనతో అంతగా కనెక్ట్ అవుతుంటారు. మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఎవరైనాసరే కాస్త మంచి డ్రస్ వేసుకుంటారు.. కాస్త జాగ్రత్తగా ఉంటారు. పద్ధతిగా కూర్చుంటారు. కానీ పవర్‌స్టార్‌ను గమనించండి. చాలా క్యాజువల్ డ్రెస్‌లో వస్తారు.. మరింత క్యాజువల్‌గా ఒక కాలు మడిచి దానిమీద మరో కాలు వేసుకుని కూర్చుంటారు. ఇలా కూర్చోవడం అతని బిడియపు స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది. అతని శరీరం పైభాగం ఎంత రిలాక్స్డ్గా కనిపిస్తున్నా, అతనెంతగా నవ్వుతున్నా... అతనింకా తన కవచంతో తను ఉన్నాడనే విషయం తెలుస్తుంది. ఆయనెంత హీరో అయినా పదిమందిలో మాట్లాడాలంటే, ముఖ్యంగా మీడియాతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. చేతిలో ఓ పెన్ పెట్టుకుని కదుపుతూ తన నెర్వస్‌నెస్‌ను, యాంగ్జయిటీని రిలీజ్ చేసుకుంటారు. ఇక ఎవరైనా పొగుడుతుంటే ఫక్కున నవ్వేసి తనలోని ఇబ్బందిని, ఒత్తిడిని వదిలించుకుంటారు. సినిమా పరిశ్రమ అంటేనే వెలుగు జిలుగులు. కానీ పవన్ జీవనశైలి వాటిని దూరంగా ఉంటుంది. షూటింగ్ అయిపోగానే తన ఫాంహౌస్‌కు వెళ్లిపోవడం, మొక్కలతో తన ప్రేమను పంచుకోవడం, పుస్తకాల్లో మునిగిపోవడం, మౌనాన్ని ఆస్వాదించడం... ఇవన్నీ చూస్తే పవన్‌లో మనకో తాత్వికుడు కనిపిస్తాడు. పలు సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటల్లో అలాగే వినిపిస్తాడు. ‘‘నేను మాస్టర్ అనుకుంటే గ్రోత్ ఆగిపోతుంది. విద్యార్థిగా ఉంటే నిరంతరం నేర్చుకోవచ్చు’’, ‘‘ఏమీ తెలియనప్పుడు మనకంతా తెలుసనుకుంటాం. నేర్చుకోవడం మొదలుపెట్టాక మనకు ఏమీ తెలియదని తెలుసు కుంటాం’’, ‘‘రియల్ యు అనేది ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అయినా ఎప్పటికీ తెలియదు. చనిపోయాక తెలుస్తుందేమో’’, ‘‘సినిమాకన్నా జీవితం ఎక్కువ డ్రమటిక్‌గా ఉంటుంది’’... ఇవన్నీ ఆయన మాటలే. సమాజం పట్ల తనకున్న అభిప్రాయాలను పవన్ ప్రతి సినిమాలో ఒక పాట ద్వారా వ్యక్తం చేయడం మనకు తెలుసు. అయితే అది సినిమాలకు మాత్రమే పరిమితం కాదు... అది ఆయన మనసు భాష. పవన్ మిగతా విషయాలు మాట్లాడేటప్పటికీ, సమాజం గురించి మాట్లాడేటప్పటికీ స్వరంలో తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. సమాజం గురించి మాట్లాడాలంటే ఆయన గొంతు గంభీరంగా మారిపోతుంది. మాటల్లో ఏదో తెలియని ఆవేదన ధ్వనిస్తుంది. అన్యాయాలపై కోపం కనిపిస్తుంది. ఏదో చేయాలనే భావం వినిపిస్తుంది. అందుకేనేమో ‘పవనిజం’ అభిమానుల మతమైంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తన ప్రపంచంనుంచి బయటకువచ్చి పదిమందిలో కలవడం మొదలుపెట్టారు. ఆయన దీన్నే కొనసాగిస్తే, కాస్తంత కుదురుగా కూర్చుని మాట్లాడితే, మాట్లాడేటప్పుడు కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే... ఆయన మరిన్ని మనసుల్ని దోచుకోగలడు.. మరింతమంది మనుషులకు ఆత్మీయుడు కాగలడు. - విశేష్, సైకాలజిస్ట్ -
మనోగళం: అంత గొప్ప ప్రశంసను ఎవరూ ఇవ్వలేరు!
ఎదుటివారిలో మీకు నచ్చేది? ఆప్యాయంగా మాట్లాడేవాళ్లను, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లను ఇష్టపడతాను. ఎదుటివారిలో నచ్చనిది? నిజాయతీ లేనివాళ్లు అస్సలు నచ్చరు. మీలో మీకు నచ్చేది? నాది చిన్నపిల్ల మనస్తత్వం. చిన్నవాటికే సంబరపడిపోతాను. వీలైనంత హ్యాపీగా ఉంటాను. అనవసరమైన టెన్షన్లు మనసులోకి రానివ్వను. మీలో మీకు నచ్చనిది? కొంచెం పంక్చువాలిటీ తక్కువ. ఒక్కోసారి లేటైపోతుంటాను. మీ ఊతపదం? ఎవరేం చెప్పినా ‘రియల్లీ?’ అంటాను. ప్రతి చిన్నదానికీ ‘కూల్’ అన్నమాట వాడుతుంటాను. మీ గురించి ఎవరికీ తెలియని మూడు విషయాలు? నేను చాలా మొండిదాన్ని. పట్టు పడితే అనుకున్నది పూర్తయ్యే వరకూ వదలను. పుస్తకాలు విపరీతంగా చదువుతాను. ఎంత అలసిపోయినా సరే, తెల్లవారుజామునే లేస్తాను. మీ గురించి ఎదుటివాళ్లు తప్పుగా అనుకునేది? నేనేంటో నాకు తెలుసు. ఇతరులు నా గురించి ఏమనుకుంటారన్నది వాళ్లనే అడగాలి. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి? మా అమ్మమ్మ, అమ్మ. ఈ ఇద్దరి ప్రభావం నా మీద చాలా ఎక్కువ. ముఖ్యంగా మా అమ్మ. అన్నింటినీ పద్ధతిగా చక్కబెట్టుకుంటుంది. అసలు విసుగనేదే ఉండదు. అంతేకాదు... ఎలాంటి పరిస్థితుల్లోనైనా గుండె నిబ్బరంగా ఉంటుంది. అలా ఎలా ఉండగలదా అని ఆశ్చర్యం వేస్తుంది నాకు! మనసుకు నచ్చిన పాట? రఘుపతి రాఘవ రాజారాం...! చిన్నప్పుడు నన్ను ఒళ్లో పడుకోబెట్టుకుని మా అమ్మ ఈ పాట పాడేది. అప్పట్నుంచీ నాకా పాటంటే చాలా ఇష్టం. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాగే ‘జన గణ మన’ ఎప్పుడు విన్నా, చిన్నప్పుడు స్కూల్లో పాడిన సందర్భాలు గుర్తొస్తుంటాయి. సంతోషపెట్టిన ప్రశంస? మా అమ్మ నన్నెప్పుడూ ‘డాళింగ్’ అంటూ ఉంటుంది. దాన్నే నేను ప్రశంసలా ఫీలవుతాను. నాకు తెలిసి అంతకన్నా గొప్ప ప్రసంశను నాకెవరూ ఇవ్వలేరు. స్పోర్టివ్‌గా ఉంటారా? చాలా...! అన్నీ లైట్ తీసుకుంటాను. ఎవరో నాతో పోటీపడుతున్నారని కంగారుపడను. నేను ఎవరితోనో పోటీ పడాలని అనుకోను. నేను నేనే. నా పని నాదే. ఇలా చేయకుండా ఉండాల్సింది అనుకునేది ఏదైనా ఉదా? నాకు తెలిసి అలాంటివేమీ లేవు. ఏం చేసినా ఆలోచించుకునే చేస్తాం కదా! ఒకవేళ ఫలితం వ్యతిరేకంగా వచ్చినా దాని గురించి బాధపడి చేసేదేమీ లేదు. ఇంకోసారి అలా జరక్కుండా చూసుకుంటే సరిపోతుంది. అందుకే నేను దేని గురించీ పెద్దగా బాధపడను. మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? నేనెప్పుడూ సారీలు బ్యాంకులో వేసుకోను. సాధారణంగా ఎవరినీ బాధపెట్టను. కనీసం కోపంగా కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడుతుంటాను. పొరపాటున ఎవరినైనా నొప్పిస్తే, వెంటనే క్షమాపణ చెప్పేస్తాను. మీరు నమ్మే సిద్ధాంతం? ఫలితం గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుపోవాలి. వచ్చినదాన్ని వచ్చినట్టు స్వీకరించాలి. దీని ప్రకారమే నడుచుకుంటాను నేను. మన కంట్రోల్లో లేనిదాని గురించి కంగారుపడటం అనవసరం అన్నది నా ఉద్దేశం. మీ మనసుకు నచ్చిన ప్రదేశం? యూరోప్. అక్కడుంటే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. కాలం గిర్రున వెనక్కి తిరిగి, మీరు హీరోయిన్ కాకపోయి ఉంటే... ఏం చేస్తుండేవారు? కచ్చితంగా డ్యాన్సర్ గా స్థిరపడి ఉండేదాన్ని. డ్యాన్స అంటే ప్రాణం నాకు. ఒక వేళ అది వీలు కాకపోయినా ఏదో ఒక క్రియేటివ్ ఫీల్డ్‌లోనే ఉండేదాన్ని! ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? చిన్నప్పుడు మా స్కూలు ఎదురుగా ఉన్న బ్లైండ్ స్కూల్ చూసి, అంధుల కోసం ఎప్పటికైనా ఏదైనా చేయాలని అనుకున్నాను. అది నెరవేరింది. నేను చేయగలిగింది చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా అవసరంలో ఉన్నవారికి చేతనైనంత చేయగలిగితే చాలు. దేవుడు మీకేదైనా ప్రత్యేకమైన శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు? ఏదయినా సాధించాలంటే దేవుడు మనకి ప్రత్యేక శక్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. అంటే, అంత శక్తి మన లోలోపల ఉన్నట్టే. కాబట్టి మనం తలచుకోవాలే గానీ, ఏదైనా సాధించగలుగుతాం. కాకపోతే గట్టిగా తలచుకోవాలంతే! మీ జీవితంలో ఒకే ఒక్కరోజు మిగిలివుందని తెలిస్తే, ఆ రోజును ఎలా గడుపుతారు? దేని గురించీ ఆలోచించకుండా, చావు ముందు ఉందని భయపడకుండా... నా ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతాను. - సమీర నేలపూడి -
భాషణం: సూపు తాగితే సాఫీగా గొంతు దిగాలి
Make no bones about it.ఇదొక ఇడియమ్. నానుడి. విషయాన్ని నేరుగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా, సంకోచం లేకుండా చెప్పడమని దీని అర్థం. మన వాడుకలో ‘కుండ బద్దలు కొట్టడం’. ఈ మాట 14, 15 శతాబ్దాల మధ్య ఇంగ్లండ్‌లో పుట్టిందని చెబుతారు. ఎలా పుట్టిందనేదానికి ఒక కథ ఉంది. ఎముకల సూప్ తయారు చేసేటప్పుడు అందులో ఎముక ముక్కలు ఉండిపోకుండా, జాగ్రత్తగా వడగడతారు. సూప్ అనేది మెత్తగా, సాఫీగా గొంతు దిగాల్సిన పదార్థం. అలాంటిది సూప్‌లో ఎముకలు వస్తే, తాగేటప్పుడు అవి గొంతుకు అడ్డం పడితే ఇంకేమైనా ఉందా? అందుకే సూప్‌ని సూప్‌లా తెమ్మనడానికి make no bone about itఅనే వారట. కాలక్రమేణ ఈ వ్యక్తీకరణ ‘ఉన్నదున్నట్టు చెప్పడం’ అనే అర్థానికి ప్రత్యామ్నాయం అయింది. ఈ వాక్యాలు గమనించండి. 1. He made no bones about how bad he thought the food was. 2. She makes no bones about her dislike of her husband. ఇలాగే ఛౌ్ఛ అనే మాటతో మరికొన్ని పదబంధాలు ఉన్నాయి. Have a bone to pick with (someone)అంటే ఒక విషయంపై వాదనకు సిద్ధమవడం. (I have got a bone to pick with you, - you have been using my shaver again). ఇక ఖీౌ ్టజ్ఛి ఛౌ్ఛ అంటే... పూర్తిగా, మొత్తంగా, చివరవరకు... అని అర్థం. 1) I was chilled to the bone after waiting so long for the bus.బస్సుకోసం ఎదురు చూసి, చూసి నడుములు పడిపోయాయని. 2) I have cut my expenses to the bone. ఖర్చులు పూర్తిగా తగ్గించుకున్నాడని. అలాగే bone up అనే మాట ఉంది. అంటే సంసిద్ధం కావడం. She bone up on economics before applying for the job. ఆౌ్ఛ ఝ్ఛ్చ అంటే ఎరువు. ఎముకల పొడి కలిపి తయారుచేసే ఈ ఎరువును మొక్కలు ఏపుగా పెరగడానికి పాదుల్లో వేస్తారు. Funny boneఅంటే మోచేయి ఎముకకు కాస్త పక్కగా ముడిపెలా బయటికి పొడుచుకొచ్చినట్లు ఉండే ఏముక భాగం. ఈ భాగానికి చిన్న ఒత్తిడి తగిలినా షాక్ కొట్టినట్లు ఉంటుంది. Rag and bone manఅంటే వీధుల్లో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని తక్కువ ధరకు కొంటూ తిరిగే వ్యక్తి. పాత బట్టలు, పాత ఫర్నీచరు... ఇలా. Bone dry అంటే... పూర్తిగా ఆరిపోవడం లేదా ఎండిపోవడం. Bone lazy అంటే... పరమ సోమరి. Close to the bone అంటే... resque and indecent.మొరటుగా, అసభ్యంగా. Resqueని ‘రిస్కే’ అని పలకాలి. కొందరు వేసే జోక్‌లు మొరటుగా, అసభ్యం గా ఉంటాయి. నవ్వురాకపోగా, షాక్‌కు గురవుతాం. ఇబ్బందిగా పీలవుతాం. అలాంటివాటిని close to the bone jokes అంటారు. (His jokes are rather close to the bone). గిౌటజు డౌఠట జజీజ్ఛటట ౌ్ట ్టజ్ఛి ఛౌ్ఛ అంటే.. రెక్కలు ముక్కలు చేసుకోవడం. (She worked her fingers to the bone to provide a home and food for eight children.)A bone of contention అంటే... ఇద్దరు, లేదా అంతకంటే ఎక్కుమంది వ్యక్తుల మధ్య ఎడతెగని తీవ్రమైన వాదనకు కారణమైన అంశం. ఉదా: రాష్ట్ర విభజన అంశం ఇప్పుడు మన రాజకీయనాయకుల ఛౌ్ఛ ౌజ ఛిౌ్ట్ఛ్టజీౌ. ఈ వాక్యం చూడండి. We have fought for so long that we have forgotten what the bone of contention is.వాళ్లెవరో వాదులాడుకునీ, కునీ, కునీ... అసలెందుకు వాదులాడుకుంటున్నారో మర్చిపోయారట! చాలా సందర్భాలలో ఇలాగే విషయం పక్కన పడి, చివరికి వాదులాటే మిగులుతుంది. Point the bone... మధ్య, ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాలలోని ఆదిమజాతుల నుంచి ఈ మాట వచ్చిందంటారు. వారి మతాచార్యుడు ‘కడిచ్చా’ (kaditcha) తన ఆధీనంలోని గూడేలలో ఏదైనా పాపపు కార్యం జరిగినప్పుడు దోషి ఎవరో తీర్పు చెప్పేందుకు ఒక ఎముక పుల్లను సంకేతంగా చూపిస్తాడట. అలా ఏ వ్యక్తి వైపు చూపుతాడో ఆ వ్యక్తికి శిక్ష పడినట్లే. అలా ఆదిమ జాతుల నుంచి... ఆధునాతన ప్రపంచంలోకి ఈ విధానం pointing the boneఅనే వ్యక్తీకరణగా ప్రవేశించిందంటారు. దీనర్థం అంతాన్ని సూచించడం. అంతుచూస్తానని బెదిరించడం కూడా. -
ఉపలోకాయుక్త కృష్ణాజీరావు పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: ఉపలోకాయుక్త ఎంవీఎస్ కృష్ణారావు మంగళవారం పదవీ విరమణ చేశారు. అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వహించిన కృష్ణాజీరావు న్యాయవ్యవస్థకు వన్నె తెచ్చారని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్‌లోని లోకాయుక్త ఆవరణలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కృష్ణాజీరావు జిల్లాల్లో పర్యటిస్తూ ఫిర్యాదులు స్వీకరించేవారని చెప్పారు. అన్యాయానికి గురైన అట్టడుగువర్గాల వారికి మేమున్నామంటూ భరోసా ఇచ్చేవారన్నారు. ఆప్యాయతకు కృష్ణాజీరావు మారుపేరని ఆయనకు సమీప బంధువు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. రిజిస్ట్రార్ దయాకర్‌రెడ్డి, డెరైక్టర్ (దర్యాప్తు) నర్సింహారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు న్యాయాన్ని చేరువచేసి ప్రాంతీయ స్థాయిలో లోకాయుక్తకు కృష్ణాజీరావు గుర్తింపు తెచ్చారని అన్నారు. అనంతరం కృష్ణాజీరావును జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డెరైక్టర్ (లీగల్) ఐజాక్ ప్రభాకర్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీ పార్థసారథి, అధికారులు రమేష్, శేఖర్‌రెడ్డి, దర్యాప్తు అధికారి తాజుద్దీన్, లక్ష్మీనారాయణ, జయరామ్, అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.