పార్క్‌ చేసి ఉన్న బైక్‌పై డబ్బుల బ్యాగ్‌.. తర్వాత ఏం జరిగిందంటే.. | Man Honestly Handed Over The With Rs 5 Lakh Cash In Vijayawada | Sakshi
Sakshi News home page

పార్క్‌ చేసి ఉన్న బైక్‌పై డబ్బుల బ్యాగ్‌.. తర్వాత ఏం జరిగిందంటే..

Published Tue, Feb 22 2022 9:14 AM | Last Updated on Tue, Feb 22 2022 9:37 AM

Man Honestly Handed Over The With Rs 5 Lakh Cash In Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన చదల అమరేశ్వరరావు రిటైర్డ్‌ ఉద్యోగి. సోమవారం గవర్నర్‌పేట బకింగ్‌ హామ్‌ పోస్టాఫీసులోని తన ఖాతా నుంచి రూ. 5లక్షలు డ్రా చేశాడు. ఇంటికి తిరిగి వెళ్తూ అక్కడ పార్క్‌ చేసి ఉన్న బైక్‌పై నగదు బ్యాగ్‌ ఉంచాడు. ఈ లోగా ఫోన్‌ రావడంతో మాట్లాడుకుంటూ బ్యాగ్‌ మరచిపోయి వెళ్లిపోయాడు.

చదవండి: మాదాపూర్‌: ‘ఓయో’పై దాడి.. 8 మంది అరెస్ట్‌  

కొద్ది సేపటికి బైక్‌ యజమాని కాగిత నరసింహారావు వచ్చి చూడగా తన బైక్‌పై క్యాష్‌ బ్యాగ్‌ కనిపించింది. వెంటనే అతను బకింగ్‌హామ్‌ పోస్టాఫీసు లోపలికి వెళ్లి బ్యాగ్‌ విషయం అక్కడ ఉన్న సిబ్బందికి తెలిపాడు. అప్పటికే అమరేశ్వరరావు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పోస్టాఫీసు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి క్యాష్‌ బ్యాగ్‌ను పరిశీలించి అమరేశ్వరరావుకు చెందినదని నిర్ధారించి అతనికి అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన కాగిత నరసింహారావును పోలీసులు, పోస్టాఫీసు సిబ్బంది అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement