భాషణం: సూపు తాగితే సాఫీగా గొంతు దిగాలి | Make no bones about it | Sakshi
Sakshi News home page

భాషణం: సూపు తాగితే సాఫీగా గొంతు దిగాలి

Published Sun, Sep 8 2013 2:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

భాషణం: సూపు తాగితే సాఫీగా గొంతు దిగాలి

భాషణం: సూపు తాగితే సాఫీగా గొంతు దిగాలి

Make no bones about it.ఇదొక ఇడియమ్. నానుడి. విషయాన్ని నేరుగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా, సంకోచం లేకుండా చెప్పడమని దీని అర్థం. మన వాడుకలో ‘కుండ బద్దలు కొట్టడం’. ఈ మాట 14, 15 శతాబ్దాల మధ్య ఇంగ్లండ్‌లో పుట్టిందని చెబుతారు. ఎలా పుట్టిందనేదానికి ఒక కథ ఉంది. ఎముకల సూప్ తయారు చేసేటప్పుడు అందులో ఎముక ముక్కలు ఉండిపోకుండా, జాగ్రత్తగా వడగడతారు. సూప్ అనేది మెత్తగా, సాఫీగా గొంతు దిగాల్సిన పదార్థం. అలాంటిది సూప్‌లో ఎముకలు వస్తే, తాగేటప్పుడు అవి గొంతుకు అడ్డం పడితే ఇంకేమైనా ఉందా? అందుకే సూప్‌ని సూప్‌లా తెమ్మనడానికి make no bone about itఅనే వారట. కాలక్రమేణ ఈ వ్యక్తీకరణ ‘ఉన్నదున్నట్టు చెప్పడం’ అనే అర్థానికి ప్రత్యామ్నాయం అయింది. ఈ వాక్యాలు  గమనించండి. 1. He made no bones about how bad he thought the food was. 2. She makes no bones about her dislike of her husband.
 ఇలాగే ఛౌ్ఛ అనే మాటతో మరికొన్ని పదబంధాలు ఉన్నాయి. Have a bone to pick with (someone)అంటే ఒక విషయంపై వాదనకు సిద్ధమవడం. (I have got a bone to pick with you, - you have been using my shaver again).
 ఇక ఖీౌ ్టజ్ఛి ఛౌ్ఛ అంటే... పూర్తిగా, మొత్తంగా, చివరవరకు... అని అర్థం. 1) I was chilled to the bone after waiting so long for the bus.బస్సుకోసం ఎదురు చూసి, చూసి నడుములు పడిపోయాయని.  2) I have cut my expenses to the bone. ఖర్చులు పూర్తిగా తగ్గించుకున్నాడని.
 అలాగే bone up  అనే మాట ఉంది. అంటే సంసిద్ధం కావడం. She bone up on economics before applying for the job.
 ఆౌ్ఛ ఝ్ఛ్చ అంటే ఎరువు. ఎముకల పొడి కలిపి తయారుచేసే ఈ ఎరువును మొక్కలు ఏపుగా పెరగడానికి పాదుల్లో వేస్తారు.
 Funny boneఅంటే మోచేయి ఎముకకు కాస్త పక్కగా ముడిపెలా బయటికి పొడుచుకొచ్చినట్లు ఉండే ఏముక భాగం. ఈ భాగానికి చిన్న ఒత్తిడి తగిలినా షాక్ కొట్టినట్లు ఉంటుంది.
 Rag and bone manఅంటే వీధుల్లో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని తక్కువ ధరకు కొంటూ తిరిగే వ్యక్తి. పాత బట్టలు, పాత ఫర్నీచరు... ఇలా.
 Bone dry అంటే... పూర్తిగా ఆరిపోవడం లేదా ఎండిపోవడం.
 Bone lazy అంటే... పరమ సోమరి.
 Close to the bone అంటే... resque and indecent.మొరటుగా, అసభ్యంగా. Resqueని ‘రిస్కే’ అని పలకాలి. కొందరు వేసే జోక్‌లు మొరటుగా, అసభ్యం గా ఉంటాయి. నవ్వురాకపోగా, షాక్‌కు గురవుతాం. ఇబ్బందిగా పీలవుతాం. అలాంటివాటిని close to the bone jokes అంటారు. (His jokes are rather close to the bone).
 గిౌటజు డౌఠట జజీజ్ఛటట ౌ్ట ్టజ్ఛి ఛౌ్ఛ అంటే.. రెక్కలు ముక్కలు చేసుకోవడం. (She worked her fingers to the bone to provide a home and food for eight children.)A bone of contention అంటే... ఇద్దరు, లేదా అంతకంటే ఎక్కుమంది వ్యక్తుల మధ్య ఎడతెగని తీవ్రమైన వాదనకు కారణమైన అంశం. ఉదా: రాష్ట్ర విభజన అంశం ఇప్పుడు మన రాజకీయనాయకుల ఛౌ్ఛ ౌజ ఛిౌ్ట్ఛ్టజీౌ. ఈ వాక్యం చూడండి. We have fought for so long that we have forgotten what the bone of contention is.వాళ్లెవరో వాదులాడుకునీ, కునీ, కునీ... అసలెందుకు వాదులాడుకుంటున్నారో మర్చిపోయారట! చాలా సందర్భాలలో ఇలాగే విషయం పక్కన పడి, చివరికి వాదులాటే మిగులుతుంది.
 
 
 Point the bone...
 మధ్య, ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాలలోని ఆదిమజాతుల నుంచి ఈ మాట వచ్చిందంటారు. వారి మతాచార్యుడు ‘కడిచ్చా’ (kaditcha) తన ఆధీనంలోని గూడేలలో ఏదైనా పాపపు కార్యం జరిగినప్పుడు దోషి ఎవరో తీర్పు చెప్పేందుకు ఒక ఎముక పుల్లను సంకేతంగా చూపిస్తాడట. అలా ఏ వ్యక్తి వైపు చూపుతాడో ఆ వ్యక్తికి శిక్ష పడినట్లే. అలా ఆదిమ జాతుల నుంచి... ఆధునాతన ప్రపంచంలోకి ఈ విధానం pointing the boneఅనే వ్యక్తీకరణగా ప్రవేశించిందంటారు. దీనర్థం అంతాన్ని సూచించడం. అంతుచూస్తానని బెదిరించడం కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement