soop
-
ఈ సూప్ తయారీకి మూలం బ్రిటిష్ అధికారులట..!
దక్షిణ భారతీయ సూప్‌గా పేరుగాంచిన 'ముల్లిగటావ్నీ సూప్' రెసిపీని తీసుకొచ్చింది బ్రిటిష్ అధికారులట. వాళ్ల కారణంగా మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు ఈ సూప్ తయారీని కనుగొన్నారట. అంతకముందు వరకు ఈ సూప్ తయారీ గురించి ఎవ్వరికి తెలియదట. కాలక్రమేణ అదే అందరూ ఇష్టంగా ఆరగించే ఫేవరెట్ సూప్‌గా మన భారతీయ వంటకాల్లో భాగమయ్యిందని చెబుతున్నారు పాకశాస్త నిపుణులు. భారతదేశంలో బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో ఈ సూప్ ఉద్భవించిందట. అదెలా? బ్రిటిష్ వాళ్లు మనలా మసాలాలు, పప్పు, కూరగాయలు అంతగా తినరు కదా..మరీ వాళ్లెలా ఈ సూప్ తయారీకి కారణమయ్యారంటే..ముల్లిగటావ్నీ సూప్‌ని బ్రిటిష్ వలస రాజ్యల పాలనా కాలంలో ఉద్భవించిందట. చెప్పాలంటే ఈ రెసిపీని సాంస్కృతిక మార్పిడిగా పేర్కొనవచ్చు. తమిళ పదాలు మియాగు(మిరియాలు, టాన్నీర్(నీరు) మీదుగా దీని పేరు వచ్చింది. దీన్ని దక్షిణ భారతీయ పులసుగా చెప్పొచ్చు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం కోసం వచ్చి మనపై పెత్తనం చెలాయించే స్థాయికి చేరి భారతీయులను నానా బాధలకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇక్కడ ఉండే కొందరు బ్రిటిష్ అధికారులు వారి సంప్రదాయ భోజనం అనుసరించి ముందుగా ఏదో ఒక సూప్‌తో భోజనం ప్రారంభించేవారు. అలాంటి భోజనశైలి భారత్‌లో ఉండదు. దీంతో వాళ్లు తినేందుకు సూప్ కోసం అని మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు కూరగాయాలతో చేసే పులుసునే వాళ్ల కోసం కొద్దిపాటి మాంసం వంటి వాటిని చేర్చి సూప్ మాదిరిగా తయారు చేసి అందించారు. దీని రుచికి ఫిదా అయిన బ్రిటిష్ అధికారులు..వాళ్ల పబ్‌లోనూ, రెస్టారెంట్లలోనూ ఈ వంటకం ఉండేలా ఏర్పాటు చేశారు. అంతలా ఈ సూప్‌ని బ్రిటిష్ వాళ్లు అమితంగా ఇష్టపడేవారట. అయితే ఈ సూప్‌ని తయారు చేసింది ఆంగ్లో ఇండియనే అని చెబుతుంటారు. తయారీ విధానంతేలిక పాటి కూరగాయలు, అన్నం, మిరియాలు, మాంసాలతో తయారు చేస్తారు. చివరగా క్రీమ్ మాదిరిగా అందంగా కనిపించేలా చివర్లో కొబ్బరి పాలు వేసి సర్వ్ చేస్తారు. దీనిలో జీలకర్ర, కొత్తిమీర, కరివేపాలకు వంటి వాసనతో ఘుమఘమలాడుతూ ఉంటుంది. చెప్పాలంటే భారతదేశంలో శాకాహారులు ప్రోటీన్ల కోసం చేసుకునే ఈ కూరగాయ పులుసునే ఇలా కొద్దిపాటి మార్పులతో బ్రిటిష్ వాళ్ల రుచికి అనుగుణంగా ఈ సూప్‌ని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత అదే అందరికీ ఇష్టమైన సూప్‌గా ప్రజాధరణ పొందడం విశేషం.(చదవండి: ఏడు ఖండాలను చుట్టువచ్చిన వందేళ్ల బామ్మ..!) -
అందాన్ని పెంచే గాడిద పాలు
అందాన్ని పెంచే సౌందర్యసాధనాలెన్నో మార్కెట్లో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రస్తుతం వీటి సరసన గాడిద పాలు కూడా చేరనున్నాయి. గాడిద పాలేంటీ అనుకుంటున్నారా? సాధారణంగా సబ్బులు, అందాన్ని పెంచే క్రీముల్లో పాలు, పాలమీగడ కలిపితయారు చేస్తారు. అయితే సరికొత్తగా ఆ పాల స్థానంలో గాడిద పాలను ఉపయోగించి సబ్బులు తయారు చేస్తుంది ఓ సంస్థ. ఈ సబ్బులు చర్మానికి మరింత అందాన్ని తెస్తాయని సంస్థ చెబుతుండడంతో చాలామంది వీటిని కొనుక్కుంటున్నారు. మరి గాడిద పాల సబ్బు వివరాలేంటో తెలుసుకుందాం... ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అన్నాడు వేమన. కానీ.. ఇప్పుడు ఆ గాడిద పాలే.. అందాన్ని పెంచనున్నాయి. గాడిద పాలు కూడా ఆవు పాలతో సమానమైన పోషకాలు కలిగి ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. గాడిద పాలల్లో.. యాంటీ ఏజింగ్ గుణాలు బోలెడన్ని ఉన్నాయని ఢిల్లీ సైంటిస్టులు చేసిన ప్రయోగాల్లో వెల్లడైంది. అందుకే.. గాడిద పాలతో సబ్బులను తయారుచేసి ఓ స్టార్టప్ కంపెనీ అమ్మకాలు కూడా ప్రారంభించింది. ఆర్గానికో కంపెనీ... ఢిల్లీలోని ఆర్గానికో అనే కంపెనీ గాడిద పాలతో అందాన్ని పెంచే సబ్బులు తయారుచేస్తూ అమ్మకాలు చేపట్టింది. సబ్బుల అమ్మకం మొదలుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మార్కెట్లో మంచి పేరు కూడా సంపాదించింది. గాడిద పాలతో స్నానంచేస్తే.. చర్మం మృదువుగా మారుతుంది. చర్మం కూడా సంరక్షించబడుతుందట. గాడిద పాల వల్ల చర్మానికి అంత త్వరగా కూడా వృద్ధాప్య ఛాయలు రావు. ఎక్కువకాలం చర్మం యవ్వనంగా ఉంటుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారి నిగనిగలాడుతుంది. గాడిద పాలలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను, మొటిమలను తగ్గిస్తాయని ఆర్గానికో కంపెనీ చెబుతోంది. లీటరు పాలు రూ.వెయ్యి... ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గాడిద పాలతో తయారుచేసిన సబ్బులకు మంచి డిమాండ్ ఉంది. సబ్బుతో పాటు.. గాడిద పాలకు కూడా ఉన్నపళంగా డిమాండ్ పెరిగింది. అందుకే లీటర్ గాడిద పాల ధర రూ.వెయ్యికి పైగా పలుకుతోంది. గాడిద పాలను తాగితే.. ఆస్తమా, ఆర్థరైటీస్, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట. గాడిద పాలతో చేసిన సబ్బులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడంతో.. ఈ పాలతో చేసిన ఒక్కో సబ్బు రూ. 500 వరకు పలుకుతుంది. ప్రస్తుతం గాడిద పాలతో తయారైన సబ్బులకు ఆన్లైన్లో కూడా ఆర్డర్లు వస్తుండడం విశేషం. పూర్వీకుల నుంచే.. గాడిద పాలు తాగితే... ఆరోగ్యానికి చాలా మంచిదని పూర్వీకుల నమ్మకం. ఆస్తమా, జలుబు, దగ్గు తగ్గుతాయని పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. దీనిని నమ్మేవారు ఎక్కువమందే ఉన్నారు. గాడిద పాలు... మనిషి పాలలాగే ఉంటాయని, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలతో పాటూ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్వం గ్రామాల్లో చంటి పిల్లలకు తల్లి పాలకు బదులు గాడిద పాలు పట్టేవారు. అంతేగాక ఈజిప్టును పరిపాలించిన అందమైన మహారాణి క్లియోపాత్ర గాడిద పాలతోనే స్నానం చేసేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 2017 నుంచే... ఈ ఏడాది జనవరిలో చండీగడ్‌లో జరిగిన ‘ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గా్గనిక్ ఫెస్టివల్’లో మొదటిసారిగా గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘ఆర్గా్గనికో’ సంస్థ స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ సబ్బులను విక్రయించింది.దీంతో చాలా మంది సందర్శకులు వాటిని కొనేందుకు ఆసక్తిని చూపారు. అయితే ఈ సబ్బు ధర అంత తక్కువేమీ కాదు. 100 గ్రాముల సబ్బును రూ.499లకు విక్రయించారు. ‘ఆర్గా్గనికో’ వ్యవస్థాపకురాలు పూజా కౌల్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 2017 నుంచి ఈ సబ్బులను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ‘‘గాడిద పాలలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని.. పెరిగే వయస్సు, చర్మంపై ముడతలను నియంత్రించే శక్తి దీనికి ఉందన్నారు. గాడిద రోజుకు ఒక లీటరు పాలు మాత్రమే ఇవ్వడం వల్ల లీటరు పాలు ధర రూ.2000 పలుకుతుందని వివరించారు. అందువల్లే సబ్బు ధర ఎక్కువగా ఉందన్నారు. మాకు ఢిల్లీ, జైపూర్లలో మాత్రమే ఔట్లెట్స్ ఉన్నాయని, త్వరలో గాడిద పాల ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్ క్రీమ్‌లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. -
ఘుమఘుమల ఫ్లవర్ బొకే
షెజ్వాన్ స్టైల్ కావలసినవి: క్యాలీఫ్లవర్ ముక్కలు - 2 కప్పులు, ఉప్పు+మిరియాలపొడి - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ - 4 టేబుల్ స్పూన్లు, సోయాసాస్ - 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లితరుగు - టీ స్పూను, అల్లం తురుము - టీ స్పూను, మిరప్పొడి - టీ స్పూను, ఉల్లికాడల తరుగు - అర కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు (పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేయాలి) తయారి: ఉప్పు వేసిన వేడి నీళ్లలో క్యాలీఫ్లవర్‌ను సుమారు 5 నిముషాలు ఉడికించి, నీరు వడకట్టి, పక్కన ఉంచాలి బాణలిలో నూనె కాగాక క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి అదే బాణలిలో వెల్లుల్లి తరుగు, అల్లం తురుము వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి మిగతా పదార్థాలను (ఉల్లికాడల తరుగు తప్ప) జత చేసి మంట తగ్గించి వేయించాలి వేయించి ఉంచుకున్న క్యాలీఫ్లవర్, సోయా సాస్, టొమాటో సాస్ వేసి కలిపి, ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేసి, దించేయాలి. చదవేస్తే కూరగాయకైనా బుద్ధి వికసిస్తుందట! ఈ మాటనే మార్క్ ట్వెయిన్ ఇంకోలా అంటారు. క్యాబేజీని కాలేజీకి పంపిస్తే క్యాలీఫ్లవర్ అవుతుందని!! అయితే, చదువయ్యాక మళ్లీ... క్యాలీఫ్లవర్‌ను ఎక్కడికి పంపించాలి? ఇంకెక్కడికి? పాఠాలు చెప్పొద్దా మనకీ, మన పిల్లలకీ! పాఠాలు రుచించనట్లే... మనలో చాలామందికి క్యాలీఫ్లవర్ రుచించకపోవచ్చు. అలాగని వదిలేస్తామా?! రుచిగా ఉన్నా, లేకున్నా... క్యాలీఫ్లవర్‌లోని ఔషధగుణాలను ‘వంట’ పట్టించుకోవాల్సిందే. ఆకులు అలముల్ని కూడా నోరూరించేలా మార్చుకోవడం ఎటూ మన చేతిలో పనే కాబట్టి.. భోజనంలోకి క్యాలీఫ్లవర్ని బొకేలా అందుకుందాం! సూప్ కావలసినవి: క్యాలీఫ్లవర్ - 1 (చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బటర్ - 2 టీ స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, బంగాళదుంప తురుము - పావుకప్పు, లవంగాలు + దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, వెల్లుల్లి పేస్ట్ - పావు టీ స్పూను, నీరు - 2 కప్పులు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, పాలు - కప్పు, కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు + మిరియాలపొడి - తగినంత, కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు తయారి: ఒక పాత్రలో బటర్ వేసి కరిగాక వెల్లుల్లి పేస్ట్, ఉల్లి తరుగు వేసి వేయించాలి ఒకటిన్నర కప్పుల నీరు, బంగాళదుంప తురుము, కొత్తిమీర తరుగు, క్యాలీఫ్లవర్ జత చేసి మరిగించి, మంట తగ్గించి, దాల్చినచెక్క + లవంగాల పొడి వే సి, అన్ని పదార్థాలూ మెత్తగా అయ్యేలా గరిటెతో మెదపాలి కార్న్‌ఫ్లోర్‌ను చల్లటి నీళ్లలో కలిపి, ఉడుకుతున్న గిన్నెలో వేసి, మిశ్రమం బాగా చిక్కబడేవరకు కలపాలి ఉప్పు, మిరియాలపొడి, పాలు వేసి బాగా కలిపి దించేయాలి. రొయ్యల కూర కావలసినవి: రిఫైన్డ్ ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 2, అల్లం తురుము - టేబుల్ స్పూను, మిరప్పొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, మసాలాపొడి - టీ స్పూను, క్యాలీఫ్లవర్ తరుగు - 4 కప్పులు, రొయ్యలు - 2 కప్పులు తయారి: బాణలిలో నూనె కాగాక ఉల్లితరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి మగ్గిన తర్వాత, అల్లం తురుము, వెల్లుల్లి రేకలు, మిరప్పొడి, ఉప్పు, ఉడికించుకున్న రొయ్యలు (శుభ్రం చేసుకున్న రొయ్యలు, పసుపు స్టౌ మీద ఉంచి నీరు ఇగిరే వరకు ఉడికించి పక్కన ఉంచాలి) వేసి సుమారు 3 నిముషాలు వేయించాక, తగినంత నీరు పోసి ఉడికించాలి మసాలాపొడి వేసి కలిపి దించేయాలి. అమ్మమ్మ చేతి వంట కావలసినవి: క్యాలీఫ్లవర్ తురుము - 3 కప్పులు, బఠాణీలు - పావుకప్పు, టొమాటో తరుగు - అర కప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, మిరప్పొడి - అర టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను, మిరియాలపొడి - టీ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారి: ఉప్పు వేసిన వేడినీటిలో క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడగాలి బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి క్యాలీఫ్లవర్ తురుము, బఠాణీలు, జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి, టొమాటో తరుగు జతచేసి సుమారు ఏడు నిముషాలు ఉంచాలి ఉప్పు, మిరప్పొడి వేసి బాగా కలిపి, కొత్తిమీర, మిరియాల పొడులతో గార్నిష్ చేసి దించేయాలి. పాన్‌కేక్స్ కావలసినవి: సజ్జలు - 200 గ్రా., క్యాలీఫ్లవర్ - 1, కొత్తిమీర తరుగు -2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్లు - 4, చీజ్ - 10 గ్రా., ఓట్స్ - 100 గ్రా, రిఫైన్డ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - అర టీ స్పూను తయారి: ఒక పాత్రలో అరలీటరు నీరు, ఉప్పు, సజ్జలు వేసి ఉడికించి ఉంచుకోవాలి క్యాలీఫ్లవర్‌ను ఉప్పు నీటితో కడిగి, బియ్యపుగింజ పరిమాణంలో తురమాలి ఒక పాత్రలో ఉడికించిన సజ్జలు, గిలక్కొట్టిన కోడిగుడ్డు, ఓట్స్, చీజ్ వేసి కలిపి, ఫ్రిజ్‌లో సుమారు 30 నిముషాలు ఉంచి తీసేయాలి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వడల మాదిరిగా ఒత్తి, కాగిన నూనెలో, ఒక్కొక్కటిగా వేసి, బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి. -
భాషణం: సూపు తాగితే సాఫీగా గొంతు దిగాలి
Make no bones about it.ఇదొక ఇడియమ్. నానుడి. విషయాన్ని నేరుగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా, సంకోచం లేకుండా చెప్పడమని దీని అర్థం. మన వాడుకలో ‘కుండ బద్దలు కొట్టడం’. ఈ మాట 14, 15 శతాబ్దాల మధ్య ఇంగ్లండ్‌లో పుట్టిందని చెబుతారు. ఎలా పుట్టిందనేదానికి ఒక కథ ఉంది. ఎముకల సూప్ తయారు చేసేటప్పుడు అందులో ఎముక ముక్కలు ఉండిపోకుండా, జాగ్రత్తగా వడగడతారు. సూప్ అనేది మెత్తగా, సాఫీగా గొంతు దిగాల్సిన పదార్థం. అలాంటిది సూప్‌లో ఎముకలు వస్తే, తాగేటప్పుడు అవి గొంతుకు అడ్డం పడితే ఇంకేమైనా ఉందా? అందుకే సూప్‌ని సూప్‌లా తెమ్మనడానికి make no bone about itఅనే వారట. కాలక్రమేణ ఈ వ్యక్తీకరణ ‘ఉన్నదున్నట్టు చెప్పడం’ అనే అర్థానికి ప్రత్యామ్నాయం అయింది. ఈ వాక్యాలు గమనించండి. 1. He made no bones about how bad he thought the food was. 2. She makes no bones about her dislike of her husband. ఇలాగే ఛౌ్ఛ అనే మాటతో మరికొన్ని పదబంధాలు ఉన్నాయి. Have a bone to pick with (someone)అంటే ఒక విషయంపై వాదనకు సిద్ధమవడం. (I have got a bone to pick with you, - you have been using my shaver again). ఇక ఖీౌ ్టజ్ఛి ఛౌ్ఛ అంటే... పూర్తిగా, మొత్తంగా, చివరవరకు... అని అర్థం. 1) I was chilled to the bone after waiting so long for the bus.బస్సుకోసం ఎదురు చూసి, చూసి నడుములు పడిపోయాయని. 2) I have cut my expenses to the bone. ఖర్చులు పూర్తిగా తగ్గించుకున్నాడని. అలాగే bone up అనే మాట ఉంది. అంటే సంసిద్ధం కావడం. She bone up on economics before applying for the job. ఆౌ్ఛ ఝ్ఛ్చ అంటే ఎరువు. ఎముకల పొడి కలిపి తయారుచేసే ఈ ఎరువును మొక్కలు ఏపుగా పెరగడానికి పాదుల్లో వేస్తారు. Funny boneఅంటే మోచేయి ఎముకకు కాస్త పక్కగా ముడిపెలా బయటికి పొడుచుకొచ్చినట్లు ఉండే ఏముక భాగం. ఈ భాగానికి చిన్న ఒత్తిడి తగిలినా షాక్ కొట్టినట్లు ఉంటుంది. Rag and bone manఅంటే వీధుల్లో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని తక్కువ ధరకు కొంటూ తిరిగే వ్యక్తి. పాత బట్టలు, పాత ఫర్నీచరు... ఇలా. Bone dry అంటే... పూర్తిగా ఆరిపోవడం లేదా ఎండిపోవడం. Bone lazy అంటే... పరమ సోమరి. Close to the bone అంటే... resque and indecent.మొరటుగా, అసభ్యంగా. Resqueని ‘రిస్కే’ అని పలకాలి. కొందరు వేసే జోక్‌లు మొరటుగా, అసభ్యం గా ఉంటాయి. నవ్వురాకపోగా, షాక్‌కు గురవుతాం. ఇబ్బందిగా పీలవుతాం. అలాంటివాటిని close to the bone jokes అంటారు. (His jokes are rather close to the bone). గిౌటజు డౌఠట జజీజ్ఛటట ౌ్ట ్టజ్ఛి ఛౌ్ఛ అంటే.. రెక్కలు ముక్కలు చేసుకోవడం. (She worked her fingers to the bone to provide a home and food for eight children.)A bone of contention అంటే... ఇద్దరు, లేదా అంతకంటే ఎక్కుమంది వ్యక్తుల మధ్య ఎడతెగని తీవ్రమైన వాదనకు కారణమైన అంశం. ఉదా: రాష్ట్ర విభజన అంశం ఇప్పుడు మన రాజకీయనాయకుల ఛౌ్ఛ ౌజ ఛిౌ్ట్ఛ్టజీౌ. ఈ వాక్యం చూడండి. We have fought for so long that we have forgotten what the bone of contention is.వాళ్లెవరో వాదులాడుకునీ, కునీ, కునీ... అసలెందుకు వాదులాడుకుంటున్నారో మర్చిపోయారట! చాలా సందర్భాలలో ఇలాగే విషయం పక్కన పడి, చివరికి వాదులాటే మిగులుతుంది. Point the bone... మధ్య, ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాలలోని ఆదిమజాతుల నుంచి ఈ మాట వచ్చిందంటారు. వారి మతాచార్యుడు ‘కడిచ్చా’ (kaditcha) తన ఆధీనంలోని గూడేలలో ఏదైనా పాపపు కార్యం జరిగినప్పుడు దోషి ఎవరో తీర్పు చెప్పేందుకు ఒక ఎముక పుల్లను సంకేతంగా చూపిస్తాడట. అలా ఏ వ్యక్తి వైపు చూపుతాడో ఆ వ్యక్తికి శిక్ష పడినట్లే. అలా ఆదిమ జాతుల నుంచి... ఆధునాతన ప్రపంచంలోకి ఈ విధానం pointing the boneఅనే వ్యక్తీకరణగా ప్రవేశించిందంటారు. దీనర్థం అంతాన్ని సూచించడం. అంతుచూస్తానని బెదిరించడం కూడా.