దక్షిణ భారతీయ సూప్‌గా పేరుగాంచిన 'ముల్లిగటావ్నీ సూప్' రెసిపీని తీసుకొచ్చింది బ్రిటిష్ అధికారులట. వాళ్ల కారణంగా మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు ఈ సూప్ తయారీని కనుగొన్నారట. అంతకముందు వరకు ఈ సూప్ తయారీ గురించి ఎవ్వరికి తెలియదట. కాలక్రమేణ అదే అందరూ ఇష్టంగా ఆరగించే ఫేవరెట్ సూప్‌గా మన భారతీయ వంటకాల్లో భాగమయ్యిందని చెబుతున్నారు పాకశాస్త నిపుణులు. భారతదేశంలో బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో ఈ సూప్ ఉద్భవించిందట. అదెలా? బ్రిటిష్ వాళ్లు మనలా మసాలాలు, పప్పు, కూరగాయలు అంతగా తినరు కదా..మరీ వాళ్లెలా ఈ సూప్ తయారీకి కారణమయ్యారంటే..
ముల్లిగటావ్నీ సూప్ని బ్రిటిష్ వలస రాజ్యల పాలనా కాలంలో ఉద్భవించిందట. చెప్పాలంటే ఈ రెసిపీని సాంస్కృతిక మార్పిడిగా పేర్కొనవచ్చు. తమిళ పదాలు మియాగు(మిరియాలు, టాన్నీర్(నీరు) మీదుగా దీని పేరు వచ్చింది. దీన్ని దక్షిణ భారతీయ పులసుగా చెప్పొచ్చు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం కోసం వచ్చి మనపై పెత్తనం చెలాయించే స్థాయికి చేరి భారతీయులను నానా బాధలకు గురిచేసిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో ఇక్కడ ఉండే కొందరు బ్రిటిష్ అధికారులు వారి సంప్రదాయ భోజనం అనుసరించి ముందుగా ఏదో ఒక సూప్‌తో భోజనం ప్రారంభించేవారు. అలాంటి భోజనశైలి భారత్‌లో ఉండదు. దీంతో వాళ్లు తినేందుకు సూప్ కోసం అని మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు కూరగాయాలతో చేసే పులుసునే వాళ్ల కోసం కొద్దిపాటి మాంసం వంటి వాటిని చేర్చి సూప్ మాదిరిగా తయారు చేసి అందించారు. దీని రుచికి ఫిదా అయిన బ్రిటిష్ అధికారులు..వాళ్ల పబ్‌లోనూ, రెస్టారెంట్‌లలోనూ ఈ వంటకం ఉండేలా ఏర్పాటు చేశారు. అంతలా ఈ సూప్‌ని బ్రిటిష్ వాళ్లు అమితంగా ఇష్టపడేవారట. అయితే ఈ సూప్‌ని తయారు చేసింది ఆంగ్లో ఇండియనే అని చెబుతుంటారు.
తయారీ విధానం
తేలిక పాటి కూరగాయలు, అన్నం, మిరియాలు, మాంసాలతో తయారు చేస్తారు. చివరగా క్రీమ్ మాదిరిగా అందంగా కనిపించేలా చివర్లో కొబ్బరి పాలు వేసి సర్వ్ చేస్తారు. దీనిలో జీలకర్ర, కొత్తిమీర, కరివేపాలకు వంటి వాసనతో ఘుమఘమలాడుతూ ఉంటుంది. చెప్పాలంటే భారతదేశంలో శాకాహారులు ప్రోటీన్ల కోసం చేసుకునే ఈ కూరగాయ పులుసునే ఇలా కొద్దిపాటి మార్పులతో బ్రిటిష్ వాళ్ల రుచికి అనుగుణంగా ఈ సూప్‌ని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత అదే అందరికీ ఇష్టమైన సూప్‌గా ప్రజాధరణ పొందడం విశేషం.
(చదవండి: ఏడు ఖండాలను చుట్టువచ్చిన వందేళ్ల బామ్మ..!)
Comments
Please login to add a commentAdd a comment