ఘుమఘుమల ఫ్లవర్ బొకే | health benefits of Cauliflower | Sakshi
Sakshi News home page

ఘుమఘుమల ఫ్లవర్ బొకే

Published Sat, Jan 18 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

ఘుమఘుమల ఫ్లవర్ బొకే

ఘుమఘుమల ఫ్లవర్ బొకే

 షెజ్వాన్ స్టైల్
 కావలసినవి: క్యాలీఫ్లవర్ ముక్కలు - 2 కప్పులు, ఉప్పు+మిరియాలపొడి - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ - 4 టేబుల్ స్పూన్లు, సోయాసాస్ - 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లితరుగు - టీ స్పూను, అల్లం తురుము - టీ స్పూను, మిరప్పొడి - టీ స్పూను, ఉల్లికాడల తరుగు - అర కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు (పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేయాలి)

 తయారి:  ఉప్పు వేసిన వేడి నీళ్లలో క్యాలీఫ్లవర్‌ను సుమారు 5 నిముషాలు ఉడికించి, నీరు వడకట్టి, పక్కన ఉంచాలి  బాణలిలో నూనె కాగాక క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి  అదే బాణలిలో వెల్లుల్లి తరుగు, అల్లం తురుము వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి  మిగతా పదార్థాలను (ఉల్లికాడల తరుగు తప్ప) జత చేసి మంట తగ్గించి వేయించాలి  వేయించి ఉంచుకున్న క్యాలీఫ్లవర్, సోయా సాస్, టొమాటో సాస్ వేసి కలిపి, ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేసి, దించేయాలి.
 
 చదవేస్తే కూరగాయకైనా బుద్ధి వికసిస్తుందట!
 ఈ మాటనే మార్క్ ట్వెయిన్ ఇంకోలా అంటారు.
 క్యాబేజీని కాలేజీకి పంపిస్తే క్యాలీఫ్లవర్ అవుతుందని!!
 అయితే, చదువయ్యాక మళ్లీ...
 క్యాలీఫ్లవర్‌ను ఎక్కడికి పంపించాలి?
 ఇంకెక్కడికి? పాఠాలు చెప్పొద్దా మనకీ, మన పిల్లలకీ!
 పాఠాలు రుచించనట్లే...
 మనలో చాలామందికి క్యాలీఫ్లవర్ రుచించకపోవచ్చు.
 అలాగని వదిలేస్తామా?!
 రుచిగా ఉన్నా, లేకున్నా...
 క్యాలీఫ్లవర్‌లోని ఔషధగుణాలను ‘వంట’ పట్టించుకోవాల్సిందే.
 ఆకులు అలముల్ని కూడా నోరూరించేలా మార్చుకోవడం
 ఎటూ మన చేతిలో పనే కాబట్టి..
 భోజనంలోకి క్యాలీఫ్లవర్‌ని బొకేలా అందుకుందాం!
 
 సూప్

 కావలసినవి: క్యాలీఫ్లవర్ - 1 (చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బటర్ - 2 టీ స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, బంగాళదుంప తురుము - పావుకప్పు, లవంగాలు + దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, వెల్లుల్లి పేస్ట్ - పావు టీ స్పూను, నీరు - 2 కప్పులు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, పాలు - కప్పు, కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు + మిరియాలపొడి - తగినంత, కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు

 తయారి:  ఒక పాత్రలో బటర్ వేసి కరిగాక వెల్లుల్లి పేస్ట్, ఉల్లి తరుగు వేసి వేయించాలి  ఒకటిన్నర కప్పుల నీరు, బంగాళదుంప తురుము, కొత్తిమీర తరుగు, క్యాలీఫ్లవర్ జత చేసి మరిగించి, మంట తగ్గించి, దాల్చినచెక్క + లవంగాల పొడి వే సి, అన్ని పదార్థాలూ మెత్తగా అయ్యేలా గరిటెతో మెదపాలి  కార్న్‌ఫ్లోర్‌ను చల్లటి నీళ్లలో కలిపి, ఉడుకుతున్న గిన్నెలో వేసి, మిశ్రమం బాగా చిక్కబడేవరకు కలపాలి  ఉప్పు, మిరియాలపొడి, పాలు వేసి బాగా కలిపి దించేయాలి.
 
 రొయ్యల కూర
 
 కావలసినవి: రిఫైన్‌డ్ ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 2, అల్లం తురుము - టేబుల్ స్పూను, మిరప్పొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, మసాలాపొడి - టీ స్పూను, క్యాలీఫ్లవర్ తరుగు - 4 కప్పులు, రొయ్యలు - 2 కప్పులు
 తయారి:  బాణలిలో నూనె కాగాక ఉల్లితరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి  క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి మగ్గిన తర్వాత, అల్లం తురుము, వెల్లుల్లి రేకలు, మిరప్పొడి, ఉప్పు, ఉడికించుకున్న రొయ్యలు (శుభ్రం చేసుకున్న రొయ్యలు, పసుపు స్టౌ మీద ఉంచి నీరు ఇగిరే వరకు ఉడికించి పక్కన ఉంచాలి) వేసి సుమారు 3 నిముషాలు వేయించాక, తగినంత నీరు పోసి ఉడికించాలి  మసాలాపొడి వేసి కలిపి దించేయాలి.
 
 అమ్మమ్మ చేతి వంట
 
 కావలసినవి: క్యాలీఫ్లవర్ తురుము - 3 కప్పులు, బఠాణీలు - పావుకప్పు, టొమాటో తరుగు - అర కప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, మిరప్పొడి - అర టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను, మిరియాలపొడి - టీ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు

 తయారి:  ఉప్పు వేసిన వేడినీటిలో క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడగాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి  క్యాలీఫ్లవర్ తురుము, బఠాణీలు, జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి, టొమాటో తరుగు జతచేసి సుమారు ఏడు నిముషాలు ఉంచాలి  ఉప్పు, మిరప్పొడి వేసి బాగా కలిపి, కొత్తిమీర, మిరియాల పొడులతో గార్నిష్ చేసి దించేయాలి.
 
 పాన్కేక్స్
 కావలసినవి: సజ్జలు - 200 గ్రా., క్యాలీఫ్లవర్ - 1, కొత్తిమీర తరుగు -2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్లు - 4, చీజ్ - 10 గ్రా., ఓట్స్ - 100 గ్రా, రిఫైన్‌డ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - అర టీ స్పూను

 తయారి:  ఒక పాత్రలో అరలీటరు నీరు, ఉప్పు, సజ్జలు వేసి ఉడికించి ఉంచుకోవాలి  క్యాలీఫ్లవర్‌ను ఉప్పు నీటితో కడిగి, బియ్యపుగింజ పరిమాణంలో తురమాలి  ఒక పాత్రలో ఉడికించిన సజ్జలు, గిలక్కొట్టిన కోడిగుడ్డు, ఓట్స్, చీజ్ వేసి కలిపి, ఫ్రిజ్‌లో సుమారు 30 నిముషాలు ఉంచి తీసేయాలి  మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వడల మాదిరిగా ఒత్తి, కాగిన నూనెలో, ఒక్కొక్కటిగా వేసి, బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్ నాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement