How To Make Cauliflower Badam Bread Recipe - Sakshi
Sakshi News home page

తక్కువ క్యాలరీస్‌ కోసం కాలిఫ్లవర్‌ బ్రెడ్‌ ట్రై చేయండి

Published Wed, Jul 26 2023 4:54 PM | Last Updated on Wed, Jul 26 2023 5:24 PM

How To Make Cauliflower Badam Bread Recipe - Sakshi

కాలీఫ్లవర్‌ బాదం బ్రెడ్‌ తయారీకి కావల్సినవి:

కాలీఫ్లవర్‌ – 1 (వేడి నీళ్లతో బాగా శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టుకోవాలి)
బాదం తురుము – ఒకటింపావు కప్పులు, గుడ్లు – 6
ఆలివ్‌ నూనె  – పావు కప్పు, ఉప్పు – కొద్దిగా
ఓరెగాన్‌ , బేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్‌ చొప్పున

తయారీ విధానమిలా..
ముందుగా ఒక పెద్ద బౌల్లో గుడ్లు పగలగొట్టుకుని.. హ్యాండ్‌ బ్లెండర్‌తో నురుగు వచ్చేలా బాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో కాలీఫ్లవర్‌ తురుము, ఆలివ్‌ నూనె, బాదం తురుము, ఓరెగాన్‌ , బేకింగ్‌ పౌడర్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బ్రెడ్‌ మేకర్‌లో వేసుకుని బేక్‌ చేసుకుంటే సరిపోతుంది. సర్వ్‌ చేసుకునే ముందు ముక్కలుగా కట్‌ చేసుకోవచ్చు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement