రొయ్యలు–పీనట్ రోల్స్ తయారీకి కావల్సినవి:
రొయ్యలు – 15 లేదా 20
(పెద్దవి, శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. అభిరుచిని బట్టి తోక ఉంచుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు)
స్ప్రింగ్‌రోల్ రేపర్స్ – 8 పైనే
(మడతలు వేసుకుని.. క్రాస్‌గా ముక్కల్లా కట్ చేసుకోవాలి)
టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు
చిల్లీ సాస్ – అర టీ స్పూన్
పీనట్ సాస్ –3 టేబుల్ స్పూన్లు
తులసి ఆకులు – గుప్పెడు (తాజావి తీసుకుని కడిగి, చిన్నచిన్నగా తరిగి పెట్టుకోవాలి. అభిరుచిని బట్టి వాడుకోవచ్చు)
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా: ముందుగా రొయ్యల్లో టొమాటో సాస్, చిల్లీ సాస్, పీనట్ సాస్ అన్నీ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. అనంతరం ఒక్కో స్ప్రింగ్‌రోల్ రేపర్స్ ముక్క పరచుకుని.. మధ్యలో రొయ్యను ఉంచుకుని.. తోక కిందకు వచ్చేలా చేసుకుని.. పైన తులసి ఆకు ముక్కలు కొద్దిగా వేసుకుని.. రోల్స్‌లా చుట్టుకోవాలి. చివరిగా తడి చేత్తో రేపర్స్‌ని ఒత్తి.. ఊడిపోకుండా నొక్కాలి. కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని.. దోరగా వేయించి టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment