prawns
-
ప్రాన్స్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం..
ప్రాన్స్ అంటే ఇష్టపడని వారుండారు. సీ ఫుడ్స్ బలవర్థకమైనవి రొయ్యలే. అలాంటి రొయ్యలు ఏ కూరగాయలతో వేసి వండినా..వాటి రుచే వేరు. తలుచుకుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అంత టేస్టీ..టేస్టీ రొయ్యలను వండకునేటప్పుడు జాగ్రత్త! అంటున్నారు నిపుణులు. ఆరోగ్యానికి ఎంత మేలు చేసే ఈ రొయ్యలను గనుక అలా తింటే ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే అంటున్నారు వైద్యులు. రోయ్యలు రుచి పరంగానే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాటి రొయ్యలు సరిగా క్లీన్ చేసి తినకపోతే అలెర్జీలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అదేలా అంటే.. ఆ పార్ట్‌ని తొలగించకుంటే.. రొయ్యల వీపుపై ఉండే నల్లని రక్తనాళాలు తొలగించకపోతే తీవ్రమైన సమస్యలు రావచ్చు. వాటిని ఉన్నప్పుడు తినడం వల్ల మరణం కూడా సంభవించొచ్చు. అందుకే వాటిని వండుకునే ముందు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.రొయ్యల మీద ఉండే నల్లటి రక్తనాళాలు తప్పనిసరిగా తొలగించాలి. ఇది వ్యర్థాలు, విషపదార్థాలను మోసే ఈ సముద్ర ఆహారాల పేగు మార్గం. ఈ సిరలను తొలగించకపోవడం లేదా పాక్షికంగా వాటిని తొలగించడం వలన తీవ్రమైన ఫుడ్ అలెర్జీ రావడమే కాదు, అదే సమయంలో ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే అలాంటి అలర్జీలు రాకుండా ఉండాలంటే ఈ రక్తనాళాలని తప్పకుండా తొలగించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నల్లని రక్తనాళాలు తొలగించకుండా తినడం వల్ల ఆహార అలర్జీకి దారి తీస్తుంది. అయితే అది తిన్న వెంటనే ఒక్కోసారి మీకు కనిపించకపోవచ్చు. అది పేగుల్లో వ్యర్థాలు, టాక్సిన్స్, రసాయనాలు రూపంలో ఉంటుంది. ఇవి మన జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని తొలగించకుండా వండుకుని తినడం వల్ల సడెన్‌గా చర్మంపై దద్దుర్లు రావాడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, గొంతులో ఇబ్బంది తలెత్తవచ్చు. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే ఇవి తినడం వల్ల ప్రాణాలకి హాని జరుగుతుందనే విషయం తేల్చడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు నిపుణులు. అందువల్ల రొయ్యలు తినేటప్పుడు ఈ నల్లటి రక్తనాళాన్ని తొలగించటం వంటి జాగ్రత్తలు తీసుకుని తినడం మంచిదని చెబుతున్నారు. రొయ్యల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు నియంత్రణలో.. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా తమ డైట్లో రొయ్యలను చేర్చుకోవాలి. ఎందుకంటే రొయ్యలు సులువుగా జీర్ణమవడంతో పాటు. శరీరంలో అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా రొయ్యలతో లభిస్తాయి. అందువల్ల వారానికి ఒకసారైన రొయ్యల్ని తీసుకోవడం మంచిది. కేన్సర్‌కి చెక్.. వీటిలో సెలీనియం కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను శరీరంలోకి చొరబడకుండా నివారిస్తుంది. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ నియంత్రణకు రొయ్యలు మంచి ఆహారం. పుష్కలంగా పోషకాలు అలాగే దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. రొయ్యలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఎముకలు, కండరాలు బలపడతాయి. చర్మ సౌందర్యానికి.. చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇతడే..ఆరోగ్య రహస్యమిదే..!) -
రొయ్య రైతుల ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: ఏపీలో 100 కౌంట్ రొయ్యలకు ప్రభుత్వం నిర్దేశించిన ధర కిలో రూ.210. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాసెసింగ్ యూనిట్లు చెల్లిస్తున్న ధర రూ.245. ఇదే కౌంట్ రొయ్యలను గుజరాత్, తమిళనాడులో రూ.230కు కొనుగోలు చేస్తుండగా.. ఒడిశాలో రూ.210కు మించి కొనడం లేదు. 30 కౌంట్ రొయ్యలకు ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.380 కాగా.. ప్రాసెసింగ్ ఆపరేటర్లు కొనుగోలు చేస్తున్న ధర రూ.470. ఇదే కౌంట్ రొయ్యలను ఒడిశాలో రూ.370, గుజరాత్లో రూ.380, తమిళనాడులో రూ.430కు కొనుగోలు చేస్తున్నారు. ఏపీలో దక్కుతున్న గిట్టుబాటు ధర దేశంలో మరే రాష్ట్రంలోనూ రొయ్యల రైతులకు దక్కడం లేదు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషే ఇందుకు ప్రధాన కారణమని ఆక్వా రైతులే చెబుతున్నారు. ఫలించిన ప్రభుత్వ చర్యలు ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు విస్తీర్ణంలో చెరువులు కలిగిన ప్రతి రైతుకూ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందిస్తూ.. పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర కల్పన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. సంక్షోభ సమయంలో ఏ ఒక్క రైతు ఆర్థికంగా నష్టపోకూడదన్న సంకల్పంతో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్‌తో ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ ప్రతి నెలా సమావేశమవుతూ రైతులకు ఏ మాత్రం నష్టం కలుగకుండా క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు, మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ధరలను సమీక్షిస్తూ ప్రతి రైతుకు మద్దతు ధర దక్కేలా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తోంది. మరోవైపు అప్సడా ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులతో పాటు ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా ధరలు పతనమైన సందర్భంలో కూడా స్థానికంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇలా అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలుస్తుండడంతో రాష్ట్రంలో ఆక్వా రైతులకు అన్ని విధాలుగా భరోసా లభిస్తోంది. మంచి ధర వస్తోంది ఆక్వా రైతులకు మంచి ధర లభిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ రైతులకు గిట్టుబాటు ధర దక్కుతోంది. గడచిన ఐదేళ్లలో ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచింది. – వత్సవాయి లక్ష్మీకుమార్రాజా, ఆక్వా రైతు, అరిపిరాల, కృష్ణా జిల్లా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి 10 రోజులకు ఒకసారి రొయ్యల ధరలను సమీక్షిస్తున్నాం. మార్కెట్లో హెచ్చుతగ్గులను గమనిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధర రైతులకు దక్కేలా చూస్తున్నాం. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకుండా ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా నిలిచింది. మూడుసార్లు పెంచిన ఫీడ్ ధరలను కంపెనీలు ఉపసంహరింపజేశాం. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నాం. – వడ్డి రఘురామ్, కో–వైస్ చైర్మన్, అప్సడా -
రొయ్యలు డోర్ డెలివరీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రొయ్యల వినియోగం పెంచేందుకు ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఎగుమతులకే పరిమితమైన ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను ఇక నేరుగా వినియోగదారుల చెంతకు చేర్చాలని సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ ప్రక్రియను అమలుచేసేందుకు ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్ సైతం ముందుకొచ్చింది. సాధారణంగా.. స్థానికంగా సాగై మార్కెట్లోకి వచ్చే 80–120 కౌంట్ రొయ్యలు కాకుండా మిగిలిన కౌంట్ రొయ్యలు వివిధ రూపాల్లో ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ హైకౌంట్ రొయ్యలను కూడా వివిధ రూపాల్లో డోర్ డెలివరీ చేయనున్నారు. ఇందులో భాగంగా.. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలుచేస్తున్నారు. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణ ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో సగటు వినియోగం 1.5 కిలోలే.. రొయ్యల వినియోగంలో ప్రపంచంలో చైనా నంబర్–1 అని చెప్పాలి. ఇక్కడ సగటున ప్రతిఒక్కరూ ఏటా 10–12 కిలోల రొయ్యలు తింటారు. అమెరికాలో 8–10 కిలోలు.. యూరోపియన్ దేశాల్లో 8 కిలోలకు పైగా తీసుకుంటారు. కానీ, రొయ్యల ఉత్పత్తిలో రారాజుగా ఉన్న మనదేశంలో మాత్రం వీటి వినియోగం సగటున 800 గ్రాములకు మించడంలేదు. అలాగే, రొయ్యల సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో నెం.1గా ఉన్న మన రాష్ట్రంలో ఇది 1.5 కిలోలు మాత్రమే. ఈ నేపథ్యంలో.. రొయ్యల తలసరి వినియోగం పెంచడమే లక్ష్యంగా ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రాన్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ వాటిలో ఉండే పోషకాలపై విస్తృత ప్రచారం చేస్తూనే మరోవైపు ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను సామాన్య వినియోగదారులకూ అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ కౌంట్ రొయ్యలకు విదేశాల్లో గిరాకీ.. సాధారణంగా.. 20–60 కౌంట్ రొయ్యలు స్థానిక మార్కెట్లలో పెద్దగా అందుబాటులో ఉండవు. ఇవన్నీ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రధానంగా హోల్ష్రింప్స్ (ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా తల, తోక భాగాలతో సహా), హెడ్‌లెస్ షెల్ఆన్ (తలభాగం తీసినవి), పీల్డ్ టేల్ఆన్ (పూర్తిగా వలిచిన రొయ్యపప్పు), పీల్డ్ డీవియండ్ టేల్ఆన్ (తల, షెల్, శరీరంలోని భాగాలను తీసివేసి), బటర్‌ఫ్లై టేల్ఆన్ (తల, ఇతర వ్యర్థపదార్థాలను తీసేసి తోకతో సహా బటర్‌ఫ్లై ఆకారంలో కట్ చేస్తారు), బటర్‌ఫ్లై టేల్ఆఫ్ (తల, తోక, ఇతర వ్యర్థపదార్థాలను తీసేసి బటర్‌ఫ్లై ఆకారంలో కట్ చేస్తారు) రూపాల్లో విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. నెలరోజులకు పైగా నిల్వ ఉండేలా.. రొయ్యల దేశీయ వినియోగం పెంచేందుకు వండుకోవడానికి సిద్ధంగా ఉన్న వనామీ రొయ్య పప్పును విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎగుమతి చేసేందుకు ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో అదే రీతిలో పూర్తిస్థాయిలో ప్రాసెస్ చేసిన రొయ్యలను కనీసం నెలరోజులకు పైగా నిల్వ ఉండేటట్లుగా వివిధ రూపాల్లో ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో సరఫరా చేయనున్నారు. సాధారణంగా ప్రాసెస్ చేసిన కిలో రొయ్య పప్పు అంటే 800 గ్రా. పప్పు, 200 గ్రా. ఐస్‌తో ఉంటుంది. కానీ, ఐస్‌తో సంబంధం లేకుండా రొయ్యపప్పు నికర బరువు ఆధారంగానే ధర చెల్లించే ఏర్పాటుచేశారు. పైగా ఏరోజుకారోజు వలిచిన పప్పునే డోర్ డెలివరీ చేస్తారు. ముందుగా వీటిని ప్రయోగాత్మకంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉచితంగా డోర్ డెలివరీ చేస్తారు. ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాలతో పాటు రవాణా సౌకర్యం ఉన్న అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఇలా ఆర్డర్‌పై సప్లైచేసే రొయ్యపప్పు ధరలను కౌంట్, క్వాంటిటీ, వెరైటీ, దూరాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఆర్డర్‌పై రెండ్రోజుల వ్యవధిలో ఎంత పరిమాణం కావాలన్నా సరఫరా చేస్తారు. మరోవైపు.. రొయ్యలతో పాటు అందుబాటులో ఉండే అన్ని రకాల చేపలను కూడా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యం.. రొయ్య కౌంట్‌ను బట్టి కిలో రూ.600 నుంచి రూ.850 ధరగా నిర్ణయించారు. మార్కెట్ రేటు హెచ్చుతగ్గులను బట్టి ధరల్లో మార్పులుంటాయి. అదే 20 కిలోలకు పైబడి ఆర్డర్లకు కిలోకు రూ.50 నుంచి రూ.100 వరకు డిస్కౌంట్ ఇస్తాం. ఆర్డర్ ఇవ్వాలనుకునే వారు ఫెడరేషన్‌కు చెందిన: 9661664779లో ఆర్డర్ ఇవ్వొచ్చు. ముఖ్యంగా.. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేస్తున్నాం. – జీవీ సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య -
రొయ్య.. 100 కౌంట్ కిలో 240 రూ.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంద కౌంట్ రొయ్యలకు కిలో రూ. 240గా రేటు ఖరారు చేశామని, ఇంతకన్నా తక్కువకు కొనడానికి వీల్లేదని ఆక్వా సాధికారత కమిటీ స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే తక్కువకు కొనే వారిపై ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్రంలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు, అప్సడా కో వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, అధికారులు పాల్గొన్నారు. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో ఫిష్ ఆంధ్రా అవుట్‌లెట్స్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు చెప్పారు. ఫలితంగా ప్రతి నెలా స్థానిక వినియోగం వెయ్యి టన్నులకు పెరిగిందన్నారు. దీనిని మరింత పెంచాలని చెప్పారు. అప్సడా ద్వారా 10 రోజులకోసారి రొయ్య రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ధరల స్థిరీకరణకు కృషి చేస్తున్నట్లు వడ్డి రఘురాం మంత్రులకు వివరించారు. రాష్ట్రంలో రొయ్య రైతులందరితో కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యకు ఇటీవలే తాడేపల్లిలో కార్యాలయాన్ని కూడా ప్రారంభించామన్నారు. నగరాలు, ప్రధాన పట్టణాల్లో ప్రాన్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ స్థానిక వినియోగాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి కొత్త కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ సీఎం వైఎస్ జగన్ నియమించిన సాధికారత కమిటీ కృషి ఫలితంగా ఇప్పటి వరకు 6 సార్లు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్ల పెరుగుదలను నియంత్రించగలిగామని మంత్రులు చెప్పారు. గతంలో ఫీడ్, సీడ్ రేట్లను నియంత్రించే విధానం లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయే వారని, రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు. ఆక్వా జోన్ పరిధిలో 4.65 లక్షల ఎకరాలు సాగవుతుండగా, దాంట్లో విద్యుత్ సబ్సిడీకి అర్హత పొందిన (10 ఎకరాల్లోపు ) విస్తీర్ణం 3.26 లక్షల ఎకరాలుగా గుర్తించామన్నారు. తొలుత ఈ–ఫిష్ సర్వే ద్వారా 46,433 ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు అండగా నిలవాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతుల దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మరో 4,230 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్తగా అర్హత పొందిన వారికి నవంబర్ 1 నుంచి సబ్సిడీ విద్యుత్ అందించాలని డిస్కంలను మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మత్స్య శాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు, అడిషనల్ డైరెక్టర్ అంజలి తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యలతో స్ప్రింగ్‌రోల్స్.. భలే రుచిగా ఉంటాయి
రొయ్యలు–పీనట్ రోల్స్ తయారీకి కావల్సినవి: రొయ్యలు – 15 లేదా 20 (పెద్దవి, శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. అభిరుచిని బట్టి తోక ఉంచుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు) స్ప్రింగ్‌రోల్ రేపర్స్ – 8 పైనే (మడతలు వేసుకుని.. క్రాస్‌గా ముక్కల్లా కట్ చేసుకోవాలి) టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు చిల్లీ సాస్ – అర టీ స్పూన్ పీనట్ సాస్ –3 టేబుల్ స్పూన్లు తులసి ఆకులు – గుప్పెడు (తాజావి తీసుకుని కడిగి, చిన్నచిన్నగా తరిగి పెట్టుకోవాలి. అభిరుచిని బట్టి వాడుకోవచ్చు) నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా రొయ్యల్లో టొమాటో సాస్, చిల్లీ సాస్, పీనట్ సాస్ అన్నీ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. అనంతరం ఒక్కో స్ప్రింగ్‌రోల్ రేపర్స్ ముక్క పరచుకుని.. మధ్యలో రొయ్యను ఉంచుకుని.. తోక కిందకు వచ్చేలా చేసుకుని.. పైన తులసి ఆకు ముక్కలు కొద్దిగా వేసుకుని.. రోల్స్‌లా చుట్టుకోవాలి. చివరిగా తడి చేత్తో రేపర్స్ని ఒత్తి.. ఊడిపోకుండా నొక్కాలి. కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని.. దోరగా వేయించి టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
మహారాష్ట్ర పాపులర్: రొయ్యలతో పోహా, భలే రుచిగా ఉంటుంది
ప్రాన్స్ పోహ తయారీకి కావల్సినవి: కావలసినవి: రొయ్యలు – 10 (మీడియం సైజ్ లేదా పెద్దవి.. తల, తోక తొలగించి.. శుభ్రం చేసుకోవాలి) అటుకులు – 3 కప్పులు (నీళ్లల్లో కడిగి.. నీళ్లు పోయేలా వడకట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నగా కట్ చేసుకోవాలి), బంగాళదుంప›– 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు తరగాలి), పచ్చి బఠాణీ – అర కప్పు (నానబెట్టి, ఉడికించుకోవాలి) వేరుశనగలు – అర కప్పు, అల్లం తురుము – అర టీ స్పూన్ కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము – కొద్దిగా కరివేపాకు – కొద్దిగా, ఆవాలు – 1 టీ స్పూన్ పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత నూనె – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – పావు టీ స్పూన్ తయారీ విధానమిలా: ముందుగా నూనెలో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని.. అర నిమిషం పాటు గరిటెతో తిప్పుతూ.. దోరగా వేయించుకోవాలి. అందులో వేరుశనగలు, బంగాళదుంప ముక్కలు వేసుకుని తిప్పుతూ ఉడికించుకోవాలి. బంగాళదుంప ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తిప్పాలి. తర్వాత రొయ్యలు, బఠాణీలు వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉప్పు రొయ్యలు ఉడికాక.. కొబ్బరి కోరు, కొత్తిమీర తురుము వేసుకుని తిప్పాలి. ఇక చివరిగా అటుకులు వేసి ఇటూ అటూ గరిటెతో తిప్పాలి. అనంతర స్టవ్ ఆఫ్ చేసుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా అల్లం ముక్కను తురిమి.. నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందీ డిష్. -
‘బ్రౌన్’ హంగామా!
సాక్షి, విశాఖపట్నం: మత్స్యకారుల వలకు రొయ్యలు ఆశాజనకంగా చిక్కుతున్నాయి. వీటిలో బ్రౌన్ రకం రొయ్యలు అధికంగా ఉంటున్నాయి. గతేడాది కంటే ఇటీవల రొయ్యల లభ్యత బాగుండడంతో మత్స్యకారుల మోములు వికసిస్తున్నాయి. మత్స్యకారులు సాధారణంగా 10–15 రోజుల పాటు రొయ్యల వేట సాగిస్తుంటారు. రొయ్యల కోసం బోటులో సముద్రంలో దూరంగా వెళ్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే రొయ్యలు లభ్యమవుతున్నాయి. దీంతో నాలుగైదు రోజులకే ఒక్కో బోటుకు అర టన్ను నుంచి టన్ను వరకు దొరుకుతున్నాయి. దీంతో వేట సమయాన్ని నాలుగైదు రోజులకే కుదించుకుని హార్బర్‌కు చేరుకుంటున్నారు. దీనివల్ల రొయ్యలు తాజాగా ఉంటూ మంచి ధర కూడా లభిస్తోంది. అదే పది రోజులకు పైగా వేట కొనసాగిస్తే వలకు చిక్కిన రొయ్యలను ఐస్‌లో రోజుల తరబడి బోట్లలోనే నిల్వ ఉంచాల్సి వస్తోంది. దీనివల్ల రొయ్యల రంగు మారిపోయి, తాజాదనం కోల్పోయి తక్కువ ధర పలుకుతోంది. ఇది మత్స్యకారులకు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో రొయ్యలు పుష్కలంగా లభిస్తున్నందున తక్కువ రోజుల వేటకే మొగ్గు చూపుతున్నారు. విరివిగా బ్రౌన్ రొయ్యలు కొన్నాళ్లుగా లభిస్తున్న రొయ్యల్లో బ్రౌన్ రకం రొయ్యలే అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం వీటికి కిలో రూ.350 ధర పలుకుతోంది. ఎగుమతి చేసే రొయ్యల తలలు తీసివేస్తారు. వీటిని హెడ్‌లెస్ ష్రింప్గా పేర్కొంటారు. వీటికి కిలోపై రూ.100 వరకు ధర అధికంగా ఉంటుంది. గత సంవత్సరం ఈ సీజనులో వీటి ధర ఒకింత బాగున్నా తక్కువగా లభ్యమయ్యేవి. కానీ ఈ సీజనులో ఇవి విరివిగా దొరుకుతుండడంతో ఊరటనిస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో రొయ్యలు, చేపలను బాస్కెట్ల లెక్కన కొనుగోలు చేస్తుంటారు. రొయ్యల్లో టైగర్, ఫ్లవర్, గోల్డ్/వైట్, బ్రౌన్/పింక్ తదితర రకాలుంటాయి. ప్రస్తుతం కిలో టైగర్ రొయ్యలు రూ.1,100, ఫ్లవర్ రకం రూ.500, గోల్డ్/వైట్ రూ.300, బ్రౌన్ రకం రూ.350 చొప్పున ధర పలుకుతోంది. రొయ్యల కొనుగోలుదారులు, ఎగుమతిదారులు ఆశించినంతగా వీటిని కొనుగోలు చేయకపోయినా స్థానికంగానే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 70 శాతానికి పైగా బోట్లు సమీపంలోనే రొయ్యల వేట సాగిస్తున్నారని, దీంతో నాలుగైదు రోజులకే తీరానికి చేరుకుంటున్నారని వైశాఖి డాల్ఫిన్ బోట్ ఆపరేటర్ల సంక్షేమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సూరాడ సత్తిబాబు ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల రొయ్యలు తాజాగా ఉండడంతో స్థానికంగా విక్రయాలు బాగా జరుగుతున్నాయని తెలిపారు. -
చేపలు సరే.. రొయ్యల జాడేది ?
పాల్వంచరూరల్ : మత్స్యసంపద పెంపుతో పాటు మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆయా సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. అయితే చేపల కంటే రొయ్యల పెంపకంతో అత్యధిక లాభాలు గడించవచ్చనే ఉద్దేశంతో ఆ పిల్లలను కూడా పెంచాలని నిర్ణయించింది. రొయ్యలకు ధర, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో గణనీయమైన ఆదాయం వస్తుందని మత్స్యకారులు కూడా ఆనందపడ్డారు. అయితే ఈనెల 26 నుంచి చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తుండగా.. రొయ్య పిల్లల జాడే లేకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మత్స్యసిరి పెంచేలా.. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధితో పాటు మత్స్య సంపదను పెంచేందుకు 2016 – 17 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను పెంచుతోంది. వంద శాతం సబ్సిడీపై రెండు రకాల చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. చేపలను పట్టడం, విక్రయించడం, రవాణాకు అవసరమైన పరికరాలు, ద్విచక్ర వాహనాలు కూడా మత్స్యకారులకు సబ్సిడీపై అందిస్తోంది. జిల్లాలో 734 చెరువులు, 3 జలాశయాల్లో ఈ ఏడాది 1.77 కోట్ల చేప పిల్లలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న మత్స్యశాఖ.. ఇందుకు అనుగుణంగా చేప పిల్లల పంపిణీకి ఈనెల 26న శ్రీకారం చుట్టనుంది. మంచినీటి చెరువుల్లో రొయ్యలు.. జిల్లాలోని 14 మంచినీటి చెరువుల్లో ఈ సంవత్సరం రొయ్యలు కూడా పెంచాలని మత్స్యశాఖ అధికారులు నిర్ణయించారు. గతేడాది సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో 1.38 లక్షలు, బూర్గంపాడు మండలం నకిరపేట చెరువులో 38 వేల రొయ్యల ఉత్పత్తి కోసం మత్స్య పారిశ్రామిక సొసైటీలకు రూ.6 లక్షలు మంజూరు చేశారు. గతేడాది రొయ్యల ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది వాటి ఉత్పత్తిని మరింతగా పెంచాలని నిర్ణయించారు. బూర్గంపాడు, అశ్వాపురం, అశ్వారావుపేట, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, సుజాతనగర్, చండ్రుగొండ, చర్ల, మణుగూరు మండలాల్లో వీటిని ఉత్పత్తి చెయ్యాలని భావించారు. అయితే ఈ ససంవత్సరం రొయ్యల ఉత్పత్తిపై మత్స్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఇటు మత్స్య పారిశ్రామిక సొసైటీ సభ్యులు, అటు అధికారులు ఎదురుచూస్తున్నారు. రొయ్య ల పంపిణీలో ఇంకా జాప్యం జరిగితే ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఐదు నెలల్లో దిగుబడి.. రొయ్యల్లో రెండు రకాలు ఉంటాయి. ఇందులో ఉప్పునీటిలో పెరిగే రొయ్యలు (టైగర్ రొయ్యలు), మంచినీటిలో పెరిగే రొయ్యలు ఉన్నాయి. జిల్లా వాతావరణ పరిస్థితులకు మంచినీటి రొయ్యలే అనుకూలంగా ఉండడంతో ఆ రకాలనే పెంచాలని అధికారులు నిర్ణయించారు. రొయ్య పిల్లలు చెరువుల్లో పోసిన ఐదు నెలలకు సరైన దిగుబడి వస్తుంది. ఈ రొయ్యలను మత్స్య సొసైటీ సభ్యులు విక్రయించుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ రూ.300 ఉండగా, డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 14 చెరువులకు పంపిణీ చేస్తాం జిల్లాలో రొయ్యల ఉత్పత్తి పెంపునకు 14 చెరువుల్లో 20, 84, 250 రొయ్య పిల్ల లను పంపిణీ చేయాలని ప్రతిపాదనలు పంపించాం. అన్నపురెడ్డిపల్లి మండలం ఆనందవనం ప్రాజెక్టు, అశ్వాపురంలోని తుమ్మల చెరువు, అశ్వారావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టు, అంకమ్మచెరువు, బూర్గంపాడు మండలం దోమలవాగు ప్రాజెక్టు, చండ్రుగొండలోని వెంగళరావుసాగర్ ప్రాజెక్టు, చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు, జూలూరుపాడులో ఎర్రవాగు ప్రాజెక్టు, మణుగూరులో పెద్దచెరువు, పేరంటాల చెరువు, సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువు, టేకులపల్లిలోని పరకలవాగు, ఇల్లెందు మండలం రాఘబోయినగూడెం, సుదిమళ్ల చెరువుల్లో రొయ్యలు పెంచాలని నిర్ణయించాం. అయితే దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – వీరన్న, జిల్లా మత్స్యశాఖాధికారి -
ఒక్క క్లిక్... రెడీ టు కుక్
బతికిన చెరువు చేపలు, రొయ్యలు... తాజా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు... ఎండుచేపలు, రొయ్యల పచ్చళ్లు... నేరుగా వండుకుని తినేలా స్నాక్ ఐటమ్స్‌తోపాటు ‘రెడీ టు కుక్’ పేరిట మసాలా అద్దిన (మారినేట్) మత్స్య ఉత్పత్తులు... కనీసం వారం రోజులు నిల్వ చేసుకునేలా వ్యాక్యూమ్డ్ ప్యాకింగ్‌తో ఐస్‌లో భద్రపర్చిన కటింగ్ ఫిష్, రొయ్యలు... ఇలా 60 రకాల మత్స్య ఉత్పత్తులలో ఏది కావాలన్నా ఇక నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు క్షణాల్లో డోర్ డెలివరీ ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర’ బ్రాండింగ్‌తో హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థను విస్తరిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం... మరో అడుగు ముందుకేసి స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా మత్స్య ఉత్పత్తులను డోర్ డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఏటా 50లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం... తలసరి వినియోగంలో కేవలం 8.07 కేజీలు మాత్రమే ఉంది. దీనిని వచ్చే ఐదేళ్లలో కనీసం 30 శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లాకు ఒక ఆక్వా హబ్, దానికి అనుబంధంగా రిటైల్ అవుట్లెట్లతోపాటు ఈ–మొబైల్ 3 వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ వెహికల్స్ డెయిలీ (ఫిష్ కియోస్‌్క), సూపర్ (లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్స్), లాంజ్ (వాల్యూ యాడెడ్) యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా 1,826 స్టోర్స్ అందుబాటులోకి రాగా, మరో 2వేల యూనిట్లను త్వరలో ప్రారంభించనుంది. తాజాగా ఒక్కో కేటగిరీలో 20 చొప్పున ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, మెరైన్ కేటగిరీల్లో 60కి పైగా మత్స్య ఉత్పత్తుల డోర్ డెలివరీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న రకాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే కూడా చేస్తున్నారు. తొలి దశలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో, రెండో దశలో రాష్ట్రమంతా అమలు చేయాలని నిర్ణయించారు. డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నారు. ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ వారు సొంతంగా డోర్ డెలివరీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం ఫిష్ ఆంధ్ర బ్రాండింగ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (డీఎం–సీఆర్ఎం)ను అందుబాటులోకి తెచ్చారు. యూ ట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విస్తృత ప్రచారానికి ప్రణాళిక సిద్ధంచేశారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వినియోగదారుల ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్ కూడా అందుబాటులోకి తీసుకువస్తారు. డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎం సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ప్రత్యేకంగా వెబ్సైట్ మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ‘ఫిష్ ఆంధ్ర’ ఆన్లైన్ అమ్మకాలకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ఇటీవల రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆవిష్కరించారు. రిటైల్ అవుట్‌లెట్స్, ఇతర యూనిట్లను ఈ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయడానికి మ్యాపింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. స్విగ్గీ, జొమాటో తరహాలో ఫిష్ ఆంధ్ర వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తారు. త్వరలో డోర్ డెలివరీకి శ్రీకారం ఫిష్ ఆంధ్ర పేరిట దాదాపు 2వేల అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశాం. ఇంత పెద్దఎత్తున చైన్ వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. మరో అడుగు ముందుకేసి కోరుకున్న మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో తరహా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటాం. – కూనపురెడ్డి కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ -
'మీసం లేని రొయ్య' అడవిలో ఉంటుందయ్యా..
దట్టమైన అడవుల్లో ఈత దుబ్బుల మాటున లభ్యమయ్యే అడవి రొయ్యల కోసం ఆదివాసీలు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు. వాటి కోసం వాగులు.. వంకలు.. కొండలు.. గుట్టలు దాటుకుని దట్టమైన అరణ్యాల్లోకి వెళ్తారు. ఈత దుబ్బుల్లో కనిపించగానే ఒడిసిపట్టి బుట్టలో వేసుకుంటారు. ఇంటికి తెచ్చి కమ్మగా వండుకుని ఆబగా తింటారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే లభించే ఈ జీవులను బొడ్డెంగులు అని పిలుస్తారు. ఆదివాసీలు మాత్రం వీటిని అడవి రొయ్యలుగా ముద్దుగా పిలుచుకుంటారు. బొడ్డెంగులకు రొయ్యల మాదిరిగా మీసాలుండవు కానీ.. సేమ్ టు సేమ్ రొయ్యల్ని పోలి ఉంటాయి. సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మన్యంలో దొరికే బొడ్డెంగులు (అడవి రొయ్యలు) గిరిజనులకు ఎంతో ప్రీతి. వాటిని మన్యం ప్రజలు లొట్టలేసుకుని మరీ తింటారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ మాత్రమే ఇవి లభిస్తాయి. గిరిజన గ్రామాలను ఆనుకుని ఉండే అటవీ ప్రాంతంలో ఈత దుబ్బులున్న చోట ఇవి పెరుగుతాయి. ఈత మొదలును తవ్వితే మట్టిలో రొయ్యల మాదిరిగా ఉండే పురుగులు లభిస్తాయి. వీటి శరీరం పూర్తిగా కొవ్వుతో కూడి ఉంటుంది. వీటిని రొయ్యల వేపుడు, ఇగురు తరహా కూరలతోపాటు ఇతర వంటకాలను తయారు చేస్తుంటారు గిరిజనులు. ఎలా సేకరిస్తారంటే.. ఆదివాసీ యువకులు అటవీ ప్రాంతంలో చాలా శ్రమకోర్చి వీటిని సేకరిస్తుంటారు. సేకరించిన తర్వాత ఒక రాత్రి మాత్రమే ఇవి బతికి ఉంటాయి. ఈత చెట్టు కాపు పూర్తయ్యాక చెట్టు ఎండి అంతరించిపోయే క్రమంలో వాటి అడుగు భాగాన బొడ్డెంగులు పుట్టుకొస్తాయని ఆదివాసీలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వీటి సేకరణ గిరిజన యువతకు ఉపాధి వనరుగా మారింది. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో మాత్రమే ఈత చెట్ల పెంపకం ఉంది. మంగళవారం పాడేరు మార్కెట్‌కు బతికి ఉన్న బొడ్డెంగుల్ని గిరిజనులు తీసుకు రాగా.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. 30 బొడ్డెంగుల్ని రూ.100 చొప్పున విక్రయించగా, గంటలో ఎగరేసుకుపోయారు. బొడ్డెంగుల్ని విక్రయిస్తున్న గిరిజనులు రక్తహీనతకు తగ్గించే మందులా.. రక్తహీనత ఉన్న వారు బొడ్డెంగులను వేపుడు లేదా కూర వండుకుని తింటే ఆ సమస్య తగ్గుతుందని గిరిజనులు చెబుతుంటారు. బొడ్డెంగులు రక్తపుష్టిని కలగజేస్తాయని వైద్యులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉండే వీటిని సహజసిద్ధంగా దొరికే పౌష్టికాహారంగా అభివర్ణిస్తుంటారు. ఇవి దొరికిన రోజున బంధువులను పిలిచి మరీ గిరిజనులు విందులు ఏర్పాటు చేస్తుంటారు. జీలుగ కల్లు, మద్యం తాగేవారు నంజు (స్టఫ్)గా వీటిని ఆస్వాదిస్తారు. మంచి ఆదాయం వీటి కోసం దాదాపు వారం రోజులుగా తిరిగాం. పెదబయలు మండలం మారుమూల కుంతర్ల ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈత దుబ్బుల్లో సేకరించాం. తెచ్చిన గంటలోనే అమ్ముడయిపోయాయి. మంచి ఆదాయం వచ్చింది. వీటి వేపుడు ముందు రొయ్యల వేపుడు దిగదుడుపే. – బోనంగి కుమార్, కుంతర్ల, ఏఎస్సార్ మన్యం జిల్లా -
రొయ్యలు తింటే గుండెకు ప్రమాదమా?.. ఇందులో నిజమెంత?
సాక్షి, అమరావతి: రొయ్యల్లో కొవ్వుశాతం ఎక్కువగా ఉంటుందని, తింటే పక్షవాతం వస్తుందని, గుండె జబ్బులొస్తాయని వింటుంటాం. కానీ ఇవేమి నిజం కాదని.. ఇతర మాంసాహారాలతో పోల్చుకుంటే రొయ్యల్లో ఉండే పోషకాలు చాలా ఎక్కువని, తింటే ఆరోగ్యానికి ఎంతోమేలని వైద్యనిపుణులు చెబుతున్నారు. రొయ్యల వినియోగాన్ని పెంచేందుకు కాకినాడ తరహాలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రాన్స్ ఫెస్టివల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశీయ సగటు వినియోగం 800 గ్రాములే రొయ్యల వినియోగంలో ప్రపంచంలో చైనా నంబర్ వన్ అని చెప్పాలి. ఇక్కడ సగటున ప్రతి ఒక్కరు 10–12 కిలోల రొయ్యలు తింటారు. అమెరికాలో సగటున 8–10 కిలోలు తింటారు. యూరోపియన్ దేశాల్లో సగటున ఎనిమిది కిలోలకు తక్కువ కాకుండా తింటుంటారు. రొయ్యల ఉత్పత్తిలో రారాజుగా ఉన్న మనదేశంలో మాత్రం రొయ్యల వినియోగం తక్కువే. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సగటున 1.5 కిలోలు తింటున్నారు. దేశవ్యాప్తంగా సగటున రొయ్యల వినియోగం 800 గ్రాములకు మించడంలేదు. తలసరి వినియోగం పెంచడమే లక్ష్యంగా రొయ్యరైతు సంఘాలు, హేచరీలు, ప్రాసెసింగ్ కంపెనీలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. దేశంలోనే తొలిసారి ప్రాన్స్ ఫెస్టివల్స్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కాకినాడలో విజయవంతం కావడంతో ఇతర నగరాలపై దృష్టి సారించింది. రొయ్యలతో దీర్ఘకాలిక జబ్బులకు కళ్లెం రొయ్యల్లో అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్ పుష్కలంగా ఉండటం వల్ల మానవులకు అవసరమైన అన్ని అమైనోయాసిడ్స్తో సమతుల్యంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. మనిషికి బరువును బట్టి కిలోకి 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరం. క్రీడాకారులకైతే కిలోకి 1.4 గ్రాముల ప్రొటీన్ కావాలి. రోజూ వందగ్రాముల రొయ్యలు తింటే శరీరానికి అవసరమైన ప్రొటీన్ లభిస్తుంది. రొయ్యల్లోని పిండి పదార్థాలు, కొవ్వుల ద్వారా వచ్చే కేలరీలు తక్కువ. ఇవి బరువు పెరగకుండా ఉండటానికి దోహదపడతాయి. చదవండి: అమ్మ కడుపు చల్లగా.. ఏపీలో రెండేళ్లుగా తగ్గిన మాతా, శిశు మరణాలు ఇతర మాంసాల కంటే టోటల్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్‌తో పాటు గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఈ కారణంగా గుండె జబ్బులు, టైప్–2 మధుమేహంతోపాటు రక్తపోటును నియంత్రిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో కనీసం 0.54 కంటే ఎక్కువ నిష్పత్తిలో ఉండే పుఫా (పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్«), ఎస్ఎఫ్ఏ (సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాల సమృద్ధిని సూచిస్తుంది. ఇవి రొయ్యల్లో 1.5 నిష్పత్తిలో ఉండడం వలన రక్తంలో కొలె్రస్టాల్ ఆరోగ్యకరమైన రీతిలో ఉంటుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి వృద్ధి రొయ్యల్లోని లైఫోఫిలిక్ కేరోటీనోయిడ్స్ (ఎల్ఎఫ్సీ) అనే యాంటి ఆక్సిడెంట్ మిగిలిన వాటికంటే 10 నుంచి 100 రెట్లు శక్తిమంతంగా ఉంటాయి. ఇది కణాల వాపును తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం ద్వారా వృద్ధాప్యఛాయలను తగ్గిస్తుంది. ధమనులను బలోపేతం చేస్తుంది. రొయ్యల్లోని డీహెచ్ఏ (డెకోసా హెక్సానోక్ యాసిడ్) మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆస్తాక్సన్తిన్ యాసిడ్స్ వల్ల వృద్ధుల్లో అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంతోపాటు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. రొయ్యల్లోని మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, అయోడిన్, జింక్, కాపర్, ఐరన్, సెలీనియం, విటమిన్లు ఏ, బీ, డీ, ఈ.. ఎముకల బలాన్ని, రోగనిరోధకశక్తిని పెంచడమేగాక థైరాయిడ్ గ్రంధుల పనితీరును మెరుగుపరుస్తాయి. అంతర్గత అవయవాలవాపు తగ్గించడం, నరాలు, మెదడు పనితీరు మెరుగుపర్చడంతోపాటు క్యాన్సర్ వ్యాధిని తగ్గించడంలో తోడ్పడతాయి. ఇలా అన్ని విధాలుగా రొయ్యల్లో ఉండే పోషకాలు మానవాళికి ఉపయోగపడతాయి. రొయ్యల్లో పోషక విలువలు అపారం మాంసాహారంలో రొయ్య అత్యంత విలువైన పోషకాహారం. వీటిలో ఉండే పోషక విలువలు వేటికి సాటిరావు. వాటి వినియోగంపై నెలకొన్న అపోహలు తొలగించేందుకు ప్రాన్స్ ఫెస్టివల్స్ ఎంతగానో దోహదపడతాయి. కాకినాడలో నిర్వహించినట్టుగా ప్రధాన నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తే సత్ఫలితాలనిస్తాయి. – డాక్టర్ రావు నారాయణరావు, ప్రముఖ దంత వైద్యనిపుణులు, కాకినాడ దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తినొచ్చు రొయ్యలు తినడం వలన మంచి పోషకాహారం లభిస్తుంది. షుగర్, బీపీ ఉన్నా సరే తగినంతగా తీసుకుంటే మంచిఫలితాలు వస్తాయి. దీనివల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది. స్కిన్, హెయిర్, నెయిల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇన్ని ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం ప్రకృతిలో చాలా అరుదు. ప్రాన్స్ తింటే దద్దుర్లు, ఎలర్జీ వస్తుందనేవారు వాటికి దూరంగా ఉండడం మంచిది. – డాక్టర్ వాడ్రేవు రవి, అధ్యక్షుడు, రాంకోసా ప్రాన్స్ ఫెస్టివల్స్‌తో అపోహలు దూరం కాకినాడలో ప్రాన్స్ ఫెస్టివల్ విజయవంతమైంది. థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల నుంచి చెఫ్‌లను తీసుకొచ్చి 27 రకాల రొయ్య వంటకాలను రుచిచూపించాం. రొయ్యల వినియోగం పట్ల నెలకొన్న అపోహలను తొలగించేలా వైద్యులతో అర్ధమయ్యేలా వివరించగలిగాం. ఇదే తరహాలో జాతీయస్థాయిలో న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నిర్వహించేందుకు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. – ఐ.పి.ఆర్.మోహనరాజు, జాతీయ రొయ్యరైతుల సంఘం అధ్యక్షుడు -
రొయ్య రైతుకు వెన్నుదన్ను: దేశంలో అత్యధిక రేట్లు ఏపీలోనే
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా రొయ్యల ధరలు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తూ, వారికి మద్దతు ధర లభించేలా అహరహం కృషి చేస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా రొయ్య రైతులకు దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ దక్కనంత ధర ఒక్క ఏపీలోనే లభిస్తోంది. ఓ పక్క అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. వివిధ కారణాలతో ఎగుమతులు తగ్గుతున్నాయి. మరో పక్క మేత ధరలు పెరిగిపోతున్నాయి. వీటన్నింటినీ తట్టుకోవడం రాష్ట్రంలో రొయ్య రైతుకు కష్టంగా ఉంది. ఈ సమయంలో ఏ ఒక్క రైతూ ఆర్థికంగా నష్టపోకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల సీనియర్ మంత్రులతో ఆక్వా సాధికారత కమిటీని నియమించారు. రొయ్య రైతులకు మేలు చేయడానికి చర్యలు చేపట్టారు. పెరిగిన ఫీడ్ ధరలను నియంత్రించడంతోపాటు రొయ్య ధరలను క్రమబద్ధీకరించేందుకు కమిటీకి పూర్తిస్థాయి అధికారాలను అప్పగించారు. కమిటీ నిర్ణయాలు, చర్యలపై సీఎం వైఎస్ జగన్ నిరంతరం సమీక్షిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కృషి ఫలితంగా రెండుసార్లు పెంచిన ఫీడ్ ధరలను కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇటీవల టన్నుకు రూ.2,600 చొప్పున పెంచగా, సీఎం ఆదేశాలతో సాధికారత కమిటీ ఆ కంపెనీలతో చర్చలు జరిపింది. ఫలితంగా పెంచిన ధరలను కంపెనీలు తగ్గించాయి. ఇది రైతులకు చాలా మేలు చేసింది. నెల రోజులుగా ప్రభుత్వ ధరకే కొనుగోలు ప్రాసెసింగ్ యూనిట్లతోనూ మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. రొయ్య రైతులకు గిట్టుబాటు అయ్యేలా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో ధరలను నిర్ణయించారు. వంద కౌంట్ రొయ్యలను రూ.210కు, 30 కౌంట్ రూ.380కు తక్కువ కాకుండా కొనాలని కమిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులుగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఫలితంగా ఇంతటి తీవ్ర సంక్షోభ సమయంలో కూడా దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే రొయ్యల ధరలు నిలకడగా ఉన్నాయి. రోజూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు, మార్కెట్లో రేట్లను సమీక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రభుత్వం నియమించింది. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ధరల క్రమబద్ధీకరణకు ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టం ద్వారా «ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) రూపొందిస్తున్నారు. 14న మరోసారి భేటీ... ఆక్వా రైతులను ఆదుకునే క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులతో సాధికారత కమిటీ మరోసారి భేటీ కానుంది. సమీప భవిష్యత్‌లో ధరల క్రమబద్ధీకరణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుంది. రైతులకు మేలు చేసే అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనుంది. . నాడు జోన్లుగా విభజించి... నేడు రాజకీయాలు టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉండగా ఆక్వా రంగాన్ని, రైతులను ఏనాడూ పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్‌గా విభజిస్తూ 2018, ఏప్రిల్ 20వ తేదీన జీవో ఎంఎస్ నం.16 జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ఆహారం పండిస్తున్న భూములను కాపాడుకోవడం, కాలుష్యాన్ని నివారించడం, లవణీయత (సెలనిటీ) పెరగడం వల్ల భూములు నిరుపయోగంగా కాకుండా చూడడం, పర్యావరణ పరిరక్షణ తదితర కారణాలతో ఈ జోన్ల వర్గీకరణ జరిగింది. ఆక్వా జోనింగ్ చేయకపోతే భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లడమే కాదు, ఆహార ఉత్పత్తులు పండించే భూములు తగ్గిపోయి, ఆహారం కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పరిస్థితుల్లో వచ్చిన మార్పులేమిటి? అప్పట్లో చంద్రబాబు చేతిలో దగా పడ్డ ఆక్వా రైతులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలతో మరింత మేలు పొందుతున్నారు. చంద్రబాబు జోన్ వ్యవస్థను మధ్యలోనే వదిలేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జోన్ వ్యవస్థను పూర్తిచేసి, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉండగా జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ రూ.3.86కు విద్యుత్‌ను సరఫరా చేసిన చంద్రబాబు, మళ్లీ అధికారంలోకి వస్తే తగ్గిస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు. వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత మూడున్నరేళ్లుగా ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు విద్యుత్ ధరలు తగ్గించి, యూనిట్ రూ.1.50కే సరఫరా చేస్తోంది. నాన్ ఆక్వాజోన్‌లో అప్పటి నుంచి ఉన్న రేట్లు యథాతథంగా కొనసాగిస్తోంది. చంద్రబాబు హయాంలో ఉన్న మాదిరిగా ఇప్పుడూæ యూనిట్ రూ.3.86కే విద్యుత్ సరఫరా చేస్తోంది. పైగా, రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్ తక్కువకు దొరికేలా చూస్తోంది. ఇంకోపక్క రైతులకు ఎక్కువ ధర దక్కేలా చర్యలు తీసుకుంటోంది. ఈ వాస్తవాలను మరిచిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో రాజకీయాలు చేయడానికి దీన్ని అజెండాగా తీసుకున్నారు. అబద్ధాలతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. -
రొయ్యల కొనుగోళ్లు: కోతేస్తే.. కొరడా
అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా ఆక్వా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ధరల పతనంతో రొయ్య రైతులు దిగాలు పడ్డారు. ఈ సమయంలో ప్రభుత్వం అండగా నిలబడింది. గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకొచ్చింది. ధరల స్థిరీకరణకు ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని ప్రాసెసింగ్ కంపెనీలపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేసింది. మరో వైపు ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, సీడ్, ఫీడ్ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు చేపట్టింది. ఎప్పుటికప్పుడు ధరలను సమీక్షిస్తూనే రైతుల కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లు : 9392905878, 9392905879 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 16 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రధానంగా రొయ్యల సాగు చేపడుతున్నారు. రొయ్యల సాగును మూడు విడతల్లో చేపడతారు. ప్రధాన రెండు సీజన్లలో అధిక సంఖ్యలో రైతులు అధిక మొత్తంలో దిగుబడి సాధిస్తారు. ఒక్కో సీజన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 30 వేల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఈ మొత్తాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు కొనుగోలు చేయాల్సిందే. జిల్లాలో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు దేవీ సీ ఫుడ్స్, జీవీఆర్ ఆక్వా, మున్నంగి ఆక్వా, సదరన్ ఆక్వా, కళ్యాణి ఆక్వా, నీలా ఆక్వా, క్రిస్టల్ ఆక్వా, రాయల్ ఆక్వా, ఆక్వా టీకాలు కొనుగోలు చేయాలి. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభంతో రొయ్యల ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనిని సాకుగా చూపి వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, ఎగుమతిదారులు కుమ్మక్కై కూడబలుక్కుని రొయ్యలు సాగు చేస్తున్న రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో నీలివిప్లవానికి పెట్టింది పేరైన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రొయ్యల రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఈ దశలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. గత నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు కలిసి రొయ్యల రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. అయినా వారిలో మార్పురాలేదు. రైతుల పక్షాన ప్రభుత్వం... ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలిచింది. వ్యాపారులు, ఎగుమతిదారులతో మంత్రుల సబ్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం ఎగుమతులు లేవని, అందుకోసం తగ్గించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వ్యాపారులు, ఎగుమతిదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన మంత్రుల సబ్ కమిటీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లింది. రొయ్యలు పచ్చి సరుకు కాబట్టి ప్రభుత్వమే ఒక మెట్టు దిగి గతంలో నిర్ణయించిన ధరను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధరలు సవరించిన ప్రభుత్వం... వ్యాపారులు, ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయనడంతో ప్రభుత్వం ఆక్వా రైతులతో చర్చించిన మీదట ధరల్లో కొంత మార్పు చేసింది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ముందు నిర్ణయించిన ధరలను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నూతన ధరలను ప్రకటించింది. ఆ ధరలకు కొనుగోలు చేస్తున్నామంటూనే నూతనంగా నిర్ణయించిన ధరలను కూడా పెడచెవిన పెట్టి మరీ తక్కువకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. బుధవారం మరోసారి రాష్ట్ర మంత్రులు సాధికారిత కమిటీతో సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు స్థానిక మార్కెట్లో ధరలను సమీక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లకు కొనుగోలు చేయకపోతే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ విషయంపై రైతులకు ఆవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ పండించిన పంట ఉత్పత్తులను ఇదే ప్రాంతంలో విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా ఆక్వా రైతు కమిటీలు గురువారం జూమ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకునేలా తీర్మానం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల రైతులకు అండగా ఉంది. అందుకే అటు వ్యాపారులతో, ఇటు రైతులతో విరామం లేకుండా చర్చలు జరుపుతోంది. అయినా రొయ్యల ధరల విషయంలో వ్యాపారుల్లో మార్పు లేదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – దుగ్గినేని గోపీనా«థ్, రొయ్యల రైతు సంఘ నాయకుడు వ్యాపారులు, ఎగుమతిదారులు తీరు మార్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగుకు పూర్తి భరోసానిస్తోంది. కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా వ్యాపారులతో రొయ్యలు కొనుగోలు చేయించింది. 10 ఎకరాల్లోపు సాగు చేసే రైతులకు విద్యుత్ చార్జీ యూనిట్‌కు కేవలం రూ.1.50గా నిర్ణయించింది. ఇటీవల రొయ్య మేత ధరలను టన్ను రూ.2,600కు తగ్గించింది. ప్రస్తుతం ఆక్వా వ్యాపారులు ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం 100 కౌంట్ రూ.210గా నిర్ణయించి వ్యాపారులచే కొనుగోలు చేయిస్తోంది. – మాలె రంగారెడ్డి, ఆక్వా రైతు, మూలగుంటపాడు ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యల ఎగుమతి ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యలు ఎగుమతి చేయడం వలన మన దేశం రొయ్యల ధర దిగజారింది. యూరప్ కంట్రీస్‌లో ఉన్న ఈక్విల్యాండ్ దేశంలో రొయ్యలు 100 కౌంట్ రూ.140కు విక్రయిస్తున్నారు. అక్కడ ఏడాది క్రితం రొయ్యల కల్చర్ మొదలుపెట్టారు. ఎకరానికి 5 టన్నులకు తగ్గకుండా తీస్తారు. మన దేశంలో 2 టన్నుల్లోపే వస్తుంది. వారికి ఎగుమతి ఖర్చులు, రొయ్యల యూనిట్లు దగ్గర ఉండటం వలన చార్జీలు తక్కువ. అందుకే తక్కువ ధరకు ఇస్తారు. మనదేశంలో రొయ్యల రైతులకు 100 కౌంట్ ధర రూ.250కు తగ్గకుండా ఇస్తేనే గిట్టుబాటవుతుంది. – గాదె కోటిరెడ్డి, రొయ్యల రైతు, గాదెపాలెం -
రొయ్యో.. అయ్యయ్యో.. భారీగా ధర పతనం!
కాజులూరు(కాకినాడ జిల్లా): రొయ్యల ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రొయ్యల సాగు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు ఏరియేటర్లు పెడుతూ.. అవసరమైన మందులు వాడుతూ రైతులు రొయ్యల సాగును ముందుకు నెట్టుకొస్తున్నారు. ఏదో ఒకవిధంగా కనీసం 30 కౌంట్ వరకూ అయినా రొయ్యలను పెంచితే గత ఏడాది నష్టాలను పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో వైట్‌స్పాట్, రెడ్గ్రిల్ వంటి వ్యాధులకు గురై చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు 150, 120 100, 90 వంటి తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. ఇదే అదునుగా కంపెనీలు ధరను అమాంతం తగ్గించేశాయి. వారం క్రితం 100 కౌంట్ ధర రూ.270 ఉండగా ప్రస్తుతం రూ.210కి మించి రావడం లేదు. దీనికి తోడు పట్టుబడి పట్టిన రొయ్యలు పీలింగ్, గుళ్లకొట్టులో ఉన్నాయంటూ నాణ్యత లోపం పేరుతో మరికొంత కోత విధిస్తున్నారు. ఎకరం చెరువులో సగటున రెండు టన్నుల దిగుబడి వస్తే కేజీకి రూ.60 చొప్పున రూ.1.20 లక్షల వరకూ రైతు నష్టపోవాల్సి వస్తోంది. తగ్గిపోయిన ధర రూపంలో కష్టార్జితమంతా కోల్పోతున్నామని వారు వాపోతున్నారు. ఈక్వెడార్ వంటి దేశాల నుంచి ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూండటంతో ఇక్కడి రొయ్యలకు డిమాండ్ తగ్గి, ధర పడిపోతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. అయితే అది వాస్తవం కాదని, వాతావరణ మార్పులతో వ్యాధులు సోకి రొయ్యలు చనిపోతుండటంతో అందరూ ఒకేసారి పట్టుబడి పట్టాల్సి వస్తోందని, ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు రావడంతో కంపెనీలు ధర తగ్గించేస్తున్నాయని ఆక్వా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగే ఆక్వా మార్కెట్‌కు ఆ స్థాయిలో డిమాండ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులుంటాయని.. అయితే స్థానిక కంపెనీలన్నీ సిండికేటుగా మారి సరుకు ఎక్కువగా వచ్చే సమయానికి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేతలు, మందుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండగా పట్టుబడి సమయానికి రొయ్యల ధరలు తగ్గిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ధరలను ప్రభుత్వం స్థిరీకరించాలని కోరుతున్నారు. అదును చూసుకుని.. రైతుల నుంచి ఒకేసారి సరకు వస్తుంటే కంపెనీలన్నీ ఏకమై ధర తగ్గించేస్తున్నాయి. వ్యాధుల బారిన పడి చెరువుల్లో రొయ్యలు తేలిపోతుండటంతో తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. రొయ్య కేజీ 150 కౌంట్ కంటే చిన్నదిగా ఉంటే కంపెనీలు కొనటం లేదు. డైలీ మార్కెట్లో కేజీ రూ.50కి అమ్ముకోవాల్సి వస్తోంది. – పిల్లి కృష్ణమూర్తి ఆక్వా రైతు, కుయ్యేరు ఇలాగే ఉంటే సాగు కష్టమే మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గుతున్నాయి. పైగా పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే. – వీరవల్లి గణపతి, ఆక్వా ట్రైనీ టెక్నీషియన్, గొల్లపాలెం -
Recipe: పచ్చి రొయ్యలు... చెరకు ముక్కలు! సుగర్ కేన్ ష్రింప్ తయారీ ఇలా!
పచ్చిరొయ్యలు, చెరకు ముక్కల కాంబినేషన్‌తో సుగర్ కేన్ ష్రింప్ ఎలా వండుకోవాలో తెలుసా? సుగర్ కేన్ ష్రింప్ తయారీకి కావలసినవి: ►పచ్చిరొయ్యలు – అరకేజీ ►వెల్లుల్లి రెబ్బలు – మూడు ►ఉప్పు – రుచికి సరిపడా ►పంచదార – అరటేబుల్ స్పూను ►గుడ్డు తెల్ల సొన – ఒకటి ►తెల్లమిరియాలపొడి – రెండు టేబుల్ స్పూన్లు ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ►తొక్కతీసిన ఐదంగుళాల చెరుకు ముక్కలు – నాలుగు. తయారీ.. ►రొయ్యలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి. ►రొయ్యలు, వెల్లుల్లి, మిరియాలపొడి, పంచదార ఆయిల్‌ను బ్లెండర్లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి. ►ఒక గిన్నెలో గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలపాలి. ►ఈ సొనలో రొయ్యల పేస్టు వేసి చక్కగా కలిపి అరగంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►అరగంట తరువాత రెండు చేతులకు ఆయిల్ రాసుకుని రొయ్యల మిశ్రమాన్ని నాలుగు భాగాలుగా చేసి చెరుకు ముక్కలకు చుట్టూ పెట్టాలి. ►ఈ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Egg Bhurji Balls Recipe: క్యారెట్, బీట్ రూట్ తురుము.. ఎగ్ బుర్జీ బాల్స్ తయారీ ఇలా! Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి! -
Recipe: పెద్ద రొయ్యలతో ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ తయారీ ఇలా!
రొయ్యలు ఇష్టంగా తినేవారు రొటీన్‌గా కర్రీ కాకుండా ఇలా ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ ట్రై చేసి చూడండి. ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ తయారీకి కావలసినవి: ►బ్రెడ్ ముక్కలు – 8 లేదా 10 ►పెద్ద రొయ్యలు – 15 (మెత్తగా ఉడికించి, ముక్కలుగా కట్ చేసుకోవాలి) ►గుడ్లు – 1 (ఉడికించి, ముక్కలుగా కట్ చేసుకోవాలి) ►వెన్న – 2 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – తగినంత, నూనె – కొద్దిగా ►చీజ్ తురుము – 5 టేబుల్ స్పూన్ల పైనే ►మిరియాల పొడి – చిటికెడు ►కారం – అర టీ స్పూన్ ►టొమాటో తరుగు, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్ల చొప్పున తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో గుడ్ల ముక్కలు, రొయ్య ముక్కలు, వెన్న, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి గరిటెతో కలపాలి. ►అనంతరం ఒక్కో బ్రెడ్ పీస్ తీసుకుని.. దానిపై ఈ మిశ్రమాన్ని వేయాలి. ►అదే విధంగా కొద్దిగా టొమాటో తరుగు, ఉల్లిపాయ తరుగు, చీజ్ తురుము ఇలా అన్నీ వేసుకుని.. మరో బ్రెడ్ పీస్ పెట్టుకోవాలి. ►త్రిభుజాకారంలో కట్ చేసుకుని, అన్ని వైపులా తడి చేత్తో గట్టిగా నొక్కి పక్కన పెట్టుకోవాలి. ►ఆపైన బ్రష్‌తో ప్రతి బ్రెడ్‌కి నూనె పూసుకుని, ఓవెన్లో లేదా.. పాన్ మీద ఇరువైపులా దోరగా వేయించుకుని సర్వ్ చేసుకోవచ్చు. చదవండి: Royyalu Mulakkada Kura In Telugu: రుచికరమైన రొయ్యల ములక్కాడ కూర.. తయారీ ఇలా! -
Recipe: రుచికరమైన రొయ్యల ములక్కాడ కూర.. తయారీ ఇలా!
రుచికరమైన రొయ్యల ములక్కాడతో కూర ఇలా సులువుగా తయారు చేసుకోండి. కావలసినవి: ►పచ్చి రొయ్యలు – పావు కేజీ(శుభ్రంచేసి నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలి) ►ములక్కాయలు – రెండు ►పచ్చిమామిడికాయ – ఒకటి(తొక్కతీసి ముక్కలు తరగాలి) ►పచ్చిమిర్చి – నాలుగు, ఉల్లిపాయ – పెద్దది ఒకటి ►కరివేపాకు – నాలుగు రెమ్మలు, ఉప్పు – రుచికి సరిపడా ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు – అరటీస్పూను ►ఉల్లికాడలు – నాలుగు (సన్నగా తరగాలి) ►వెల్లుల్లి రెబ్బలు – మూడు (సన్నగా తరగాలి), ఎండు మిర్చి – మూడు. కొబ్బరి పేస్టు: పచ్చికొబ్బరి తురుము – కప్పున్నర, పసుపు – టీస్పూను, కారం – అరటీస్పూను, జీలకర్ర పొడి – అరటీస్పూను. తయారీ.. ►ముందుగా కొబ్బరి పేస్టుకోసం తీసుకున్న పదార్థాలను బ్లెండర్లో వేసి పేస్టులా రుబ్బుకోని పక్కనపెట్టుకోవాలి ►ఒక గిన్నెలో ములక్కాయలను ముక్కలు చేసి వేయాలి. ►దీనిలో పచ్చిమామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి పదినిమిషాలు పాటు మూతపెట్టి ఉడికించాలి ►ఈ ముక్కలన్నీ ఉడికిన తరువాత రొయ్యలను వేసి బాగా ఉడికించాలి. ►రొయ్యలు ఉడికిన తరువాత కొబ్బరి పేస్టు వేసి తిప్పి, ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి ►మరోపాన్‌లో ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత, ఆవాలు, ఉల్లికాడల తరుగు, ఎండు మిర్చి, మిగిలిన కరివేపాకు వేసి బాగా వేయించాలి. ►ఈ తాలింపుని ఉడికించి పెట్టుకున్న రొయ్యల మిశ్రమంలో వేసి తిప్పితే, కూర రెడీ. చదవండి: Chepala Iguru In Telugu: ఘుమఘుమలాడే చేపల ఇగురు చేసుకోండిలా! -
ఆక్వా రంగంలో విప్లవం.. ఏపీలోకి కొత్త రకం రొయ్య రంగ ప్రవేశం
సాక్షి, కాకినాడ: ఆక్వా రంగంలోకి సరికొత్త రకం రొయ్య(స్కాంపీ) రంగ ప్రవేశం చేయనుంది. దేశంలో తిరిగి మంచినీటి రొయ్యల సాగును ప్రోత్సహించాలని కేంద్రం మంచి నీటి రొయ్యల సాగుకు సంస్థ (సీఐఎఫ్ఏ) ఆదేశించింది. రైతులకు నాణ్యమైన సీడ్ అందించేందుకు సీఐఎఫ్ఏ తోడ్పాటు అందించనుంది. ఈ మేరకు పిల్ల ఉత్పత్తికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు హేచరీలకు అనుమతులు మంజూరు చేసింది. అందులో కాకినాడలో ఓ హెచరీ ఉంది. ఇప్పటికే హేచరీలో సీడ్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఏప్రిల్ నాటికి రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక లాభాలు వస్తాయన్న ఆశతో ఎనిమిదేళ్లుగా వనామీ సాగుకే పరిమితమైన రైతులు వైరస్లు తట్టుకునే, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ రకం సాగుదిశగా అడుగులు వేస్తున్నారు. అసలేంటీ స్కాంపీ.. స్కాంపీ మంచినీటిలో పెరిగే రొయ్య. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రకం రొయ్యల ఉత్పత్తిలో మన దేశం అగ్రస్థానంలో ఉండేది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా రెండు వేల ఎకరాల్లో ఈ రకం రొయ్యలు పండించేవారు. కొన్నాళ్లు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. రాను రాను ఆశించిన స్థాయిలో దిగుబడులు, లాభాలు రావడం లేదని భావించిన రైతులు సాగుకు దూరమయ్యారు. వాటి స్థానంలో టైగర్, వనామీ రొయ్యల వైపు వెళ్లారు. ప్రస్తుతం వనామీ పెంపకంలో అనేక అసమానతలు, నష్టాలు వస్తుండటంతో కేంద్రం నూతన పద్ధతుల ద్వారా తెగుళ్లు తక్కువగా ఉండే స్కాంపీ సాగును ప్రోత్సహించాలని భావించింది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసే సీఐఎఫ్ఏ శాస్త్రవేత్తలు స్కాంపీ బ్రూడ్ బ్యాంకును అభివృద్ధి చేస్తున్నారు. మేకిన్ ఇండియా రొయ్యల బ్రూడ్ బ్యాంకు నినాదంతో ముందుకు వెళుతున్నారు. నాలుగు హేచరీలకు అనుమతులు స్కాంపీ పిల్ల ఉత్పత్తికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు హేచరీలకు అనుమతులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన మహారాజా ఆక్వాటిక్స్, బీకేఎంఎస్ స్కాంపీ హెచరీ, ఏఎస్ఆర్ స్కాంపీ హేచరీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎంఎస్ఆర్ స్కాంపీ హేచరీతో ఒప్పందం చేసుకుంది. సీఐఎఫ్ఏ–జీఐ స్కాంపీ పిల్లలను సంస్థ హేచరీలకు అందజేసింది. హేచరీలు రొయ్య సీడ్ ఉత్పత్తి చేపట్టి రానున్న ఏప్రిల్ నెల నుంచి రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పలువురు రైతులకు ఇప్పటికే ఆక్వా నిపుణులను సంప్రదించి స్కాంపీ రొయ్యలు సాగు చేయడానికి చెరువులను సిద్ధం చేసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి: ► వనామీ రొయ్యల సాగుతో పోలిస్తే స్కాంపీ సాగుకు పెట్టుబడి తక్కువ. ► ఎకరాకు రూ.2 లక్షలు సరిపోతుంది. వైరస్‌లను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ► మందుల అతి వినియోగం ఉండదు. రొయ్య పిల్ల ధర రూపాయి. 50,000 పిల్లలు కొనుగోలు చేసి అర ఎకరా చెరువులో పోయాలి. ► 50 రోజుల అనంతరం ఐదు గ్రాముల బరువు ఉండే రొయ్యలు తీసి పది వేలు చొప్పున రెండు ఎకరాల చెరువుల్లో పోయాలి. ► ఈ సమయంలోనే ఆడ, మగ రొయ్య పిల్లలను వేరు చేయాల్సి ఉంటుంది. ► నాలుగు నెలల్లో రెండు టన్నుల మేత అవసరం అవుతుంది. మగ రొయ్య 140 గ్రాములు, ఆడ రొయ్య 80 గ్రాముల బరువు పెరుగుతుంది. ► రెండు టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ.4 లక్షల చొప్పున ఆదాయం లభిస్తుంది. ఖర్చులకు పోను రైతుకు రెండు లక్షల వరకు మిగులుతుందని ఆక్వా నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ► నీటిలో లవణీయత సున్నా నుంచి ఐదు వరకు ఉన్నా ఎలాంటి ఇబ్బంది రాదంటున్నారు. ► ఏడు నుంచి పదిహేను కౌంట్ రొయ్యలు వస్తాయని భావిస్తున్నారు. ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాం స్కాంపీ సీడ్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాం. ఇందుకు అవసరమైన అనుమతులు వచ్చాయి. సీఐఎఫ్ఏ సంస్థ 110 బ్రూడర్స్(తల్లి రొయ్య)ను సరఫరా చేసింది. వాటి ద్వారా పిల్లల ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ప్రక్రియ మార్చి మొదటి వారం వరకు ఉంటుంది. ఏప్రిల్ మాసంలో రైతులకు సీడ్ అందించేందుకు కృషి చేస్తున్నాం. రైతుల నుంచి మంచి డిమాండ్ ఉంది. కొత్త రకం తమకు కావాలని సంప్రదిస్తున్నారు. - ఎం.వెంకటరమణ, డైరెక్టర్ ఎంఎస్ఆర్ హేచరీస్ చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది -
ఏపీ రొయ్య.. మీసం మెలేసింది!
సాక్షి, అమరావతి: దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. 2020–21 ఆరి్థక సంవత్సరంలో దేశ రొయ్యల ఉత్పత్తిలో ఏపీ 75.84% వాటాతో దూసుకుపోయినట్లు మెరైన్ ప్రోడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంపెడా) తెలిపింది. 2020–21లో దేశవ్యాప్తంగా 8,43,633 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే అందులో ఏపీలోనే 6,39,894 టన్నులు ఉత్పత్తి అయినట్లు ఎంపెడా జాయింట్ డైరెక్టర్ జయబాల్ తెలిపారు. ఇందులో అత్యధికంగా వనామి రకం రొయ్యలు 6,34,672 టన్నులు ఉత్పత్తి అయ్యిందని, బ్లాక్ టైగర్ రొయ్యలు వాటా 5,222 టన్నులని చెప్పారు. సముద్ర ఉత్పత్తుల్లో కూడా ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. 2021లో రాష్ట్రం నుంచి 2,90,859 టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని వీటి విలువ రూ.16,733.81 కోట్లని వివరించారు. పెరిగిన సాగు, ఉత్పత్తి... అంతకుముందు ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో రొయ్యల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2019–20తో పోలిస్తే రాష్ట్రంలో సాగు విస్తీర్ణంలో 15.41%, ఉత్పత్తిలో 24.91% వృద్ధి నమోదైంది. 2019–20లో 64,559.94 హెక్టార్లలో సాగు చేయడం ద్వారా 5,12,244.4 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే 2020–21లో సాగు విస్తీర్ణం 74,512 హెక్టార్లకు పెరిగి ఉత్పత్తి 6,39,894 టన్నులకు చేరింది. దేశవ్యాప్తంగా రొయ్యల సాగు విస్తీర్ణంలో రాష్ట్ర వాటా 44.69%గా ఉన్నట్లు ఎంపెడా పేర్కొంది. రాష్ట్రంలో 188 మండలాల్లో 1,553 గ్రామాల్లో 53 వేల చెరువుల్లో ఆక్వా చెరువు సాగు జరుగుతోంది. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతుదారులు 154 మంది ఉండగా, 97 ప్రోసెసింగ్ యూనిట్లు, 97 శీతల గిడ్డంగులు ఉన్నట్లు ఎంపెడా పేర్కొంది. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతులు ప్రోత్సహించడానికి ఎంపెడా కృషి చేస్తోందని, ఇందుకోసం కాల్‌సెంటర్ నంబర్ 18004254648ను కేటాయించినట్లు తెలిపారు. -
భలే రుచిగా బీట్రూట్ రొయ్యల కబాబ్స్.. ఎలా చేయాలంటే..
బీట్రూట్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక రొయ్యలు సంగతి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఈ రెండింటి కాంబినేషన్లో రుచి కరమైన కబాబ్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు: ►పెద్ద రొయ్యలు – అర కప్పు (శుభ్రం చేసి, ఉప్పు, కారం, పసుపు పట్టించి కుకర్‌లో 3 విజిల్స్ వేయించి పెట్టుకోవాలి) ►కిడ్నీ బీన్స్ (రాజ్మాగింజలు) – 1 కప్పు (నానబెట్టి, మిక్సీ పట్టుకోవాలి) ►బీట్రూట్ ముక్కలు – అర కప్పు (ముక్కలు కట్ చేసుకుని, మిక్సీ పట్టుకోవాలి) ►అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ చొప్పున, మిరియాల పొడి – కొద్దిగా, ఉప్పు – తగినంత, శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు ►ఆల్మండ్ పొడి – 1 టేబుల్ స్పూన్ ►కారం – 2 టీ స్పూన్లు, బంగాళదుంప – 1 (ఉడికించి గుజ్జులా చేసుకోవాలి) ►రోజ్ వాటర్ – 1 టీ స్పూన్, నువ్వులు – గార్నిష్‌కి ►చీజ్ – పావు కప్పు(ముక్కలుగా) ►నూనె – సరిపడా తయారీ విధానం: ముందుగా ఉడికిన రొయ్యలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. అందులో కిడ్నీ బీన్స్ మిశ్రమం, బీట్రూట్ గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, శనగపిండి, ఆల్మండ్ పొడి, కారం, బంగాళదుంప గుజ్జు, రోజ్ వాటర్ వేసుకుని గరిటెతో బాగా కలపాలి. మూతపెట్టి 20 నిమిషాల పాటు చిన్న మంటపైన మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గనివ్వాలి. అనంతరం చల్లారనిచ్చి.. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, మధ్యలో చిన్న చీజ్ ముక్క పెట్టుకుని మళ్లీ బాల్లా చేసుకుని కట్లెట్ మాదిరి ఒత్తుకుని.. ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి.. కొద్దిగా నూనె పూసిన చేతులతో ప్రతి కట్లెట్కి నువ్వులు అతికించి బేక్ చేసుకుంటే భలే రుచికరంగా ఉంటాయి. చదవండి: నోరూరించే స్వీట్ పాన్ లడ్డూ.. ఇలా తయారు చేసుకోవాలి.. -
తస్సాదియ్య.. రొయ్య దూకుడు మామూలుగా లేదయ్యా!
సముద్రంలో వేటకు వెళ్లాలంటే మత్స్యకారుల్లో ఏదో తెలియని నైరాశ్యం. నాలుగైదు రోజుల పాటు నడి సంద్రంలో వేటాడినా కూలి డబ్బులు కూడా దక్కక డీలా పడేవారు. రెండు నెలల నుంచి ఈ పరిస్థితి మారింది. సముద్రంలో వల విసిరితే చాలు నిండా రొయ్యల సంపద వచ్చిపడుతోంది. వేటకు వెళ్తున్న మత్స్యకారులు రెండు రోజులకే బోట్లను రొయ్యలతో నింపుకుని తీరం బాట పడుతున్నారు. ఆ వెంటనే వేటకు సిద్ధమైపోతున్నారు. బాపట్ల(గుంటూరు):మూడేళ్లుగా వరుస తుఫాన్లతో సముద్రంలో వేట సక్రమంగా సాగక డీలాపడిన తీరప్రాంత మత్స్యకారులు ఇప్పుడు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు.రొయ్యల వేట వారికిప్పుడు పండుగ వాతావరణం తెచ్చింది. ఈ ఏడాది రెండు నెలలుగా వేట బాగా కలిసి వస్తోంది. కోనమ్.. సందువాలు.. మొయ్య.. పండు చేపలకే పరిమితమైన సముద్రపు వేట కాస్తా ఇప్పుడు రొయ్యలు పుష్కలంగా పడుతుండటంతో మత్స్యకారుల పంట పండుతోంది. సాధారణంగా ఆక్వా సాగులో 40 నుంచి 25 కౌంట్ సైజు రొయ్యల్ని చూడాలంటే రైతులకు ఎంతో కష్టంగా ఉంటుంది. అది కూడా బాగా ఖర్చుతో కూడుకున్న పని. అయితే, ఇటీవల సముద్రంలో 20 కౌంట్ రొయ్యలు కూడా పడుతుండటంతో మత్స్యకారుల ఆనందం అవధులు దాటింది. వల వేస్తే చాలు నిండా రొయ్యలే వస్తుండటంతో సముద్రంలో కనీసం నాలుగైదు రోజుల పాటు వేట చేసే మత్స్యకారులు ఇప్పుడు రెండు రోజులకే ఇళ్లకు చేరుతున్నారు. ధర బాగు.. బాగు బాపట్ల మండలంలోని అడవి పల్లెపాలెం, కృపానగర్, దాన్వాయ్‌పేట, ఓడరేవు ప్రాంతాల్లో రొయ్యల వేట వేగవంతంగా సాగుతోంది. ఈ ప్రాంతంలో 3 వేల మత్స్యకార కుటుంబాలు ఉండగా.. వేటకు వెళ్లే బోట్లు 800 వరకు ఉన్నాయి. చేపల వేటకు ఉపయోగించే వలలు కాకుండా రొయ్యలకు డిస్కో వలలను ఉపయోగించటం వలన రొయ్యల వేట సంతృప్తికరంగా ఉంటోందని మత్స్యకారులు చెబుతున్నారు. ఒక్కొక్క బోటులో 8 నుంచి 10 మంది వేటకు వెళ్తున్నారు. ఎక్కువగా వనామీ, టైగర్ రొయ్యలు వలలకు చిక్కుతున్నాయి. 400 కేజీల వనామీ రొయ్యలు పడితే వాటిలో 40 నుంచి 50 కేజీలు టైగర్ రొయ్యలు పడుతున్నాయి. అదికూడా 20 నుంచి 40లో కౌంట్ ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వనామీ 40 కౌంట్ రొయ్యల ధర రూ.480 నుంచి 500 ఉండగా.. టైగర్ రొయ్య 20 కౌంట్ ధర రూ.500 నుంచి రూ.600 వరకు పలుకుతోంది. తక్కువ దూరంలోనే.. వాతావరణం అనుకూలంగా ఉండటంతో సముద్ర తీరం నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే మత్స్య సంపద దొరుకుతోంది. దీనివల్ల ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. ఒక్కసారి వేటకు వెళితే గతంలో రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు రూ.20 వేల లోపే ఖర్చవుతోంది. – జి.అప్పలరాజు, మత్స్యకారుడు ఓడరేవులోనే మార్కెట్ రొయ్యలు ఎక్కువగా పడుతుండటంతో చీరాల ఓడరేవుకే కొనుగోలుదారులు వస్తున్నారు. కొనుగోలు చేసిన రొయ్యలకు వారం రోజుల్లోపు నగదు చెల్లిస్తున్నారు. ఐస్, సబ్సిడీపై డీజిల్ అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. – చొక్కా సత్యనారాయణ, మత్స్యకారుడు చదవండి: భద్రతకు ‘దిశ’ నిర్దేశం -
కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్ చేశారా
మర్యాదలకు, మంచి ఆతిథ్యానికి పెట్టింది పేరు ఉభయగోదావరి జిల్లాలు.. ఇక మన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పసందైన విందు భోజనాలు, సంక్రాంతి కోడిపందేలు, నాన్ వెజ్ వంటల రుచుల గొప్పతనం అందరికీ తెలిసిందే. అలాంటి భీమవరంలో తయారైన నాన్‌వెజ్ పచ్చళ్లు ఇప్పుడు దేశ విదేశాల్లోని తెలుగువారి నోరూరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లోని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు నాన్‌వెజ్ పచ్చళ్లు పంపించాలంటే వెంటనే గుర్తుకొచ్చేవి భీమవరం పచ్చళ్లే. సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 50 మంది వరకు ఈ నాన్‌వెజ్ పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొందరు నిత్యం ఈ పచ్చళ్ల వ్యాపారంలో ఉంటే.. మరికొందరు తమకు వచ్చిన ఆర్డర్ మేరకు పచ్చళ్లు తయారు చేస్తారు. నాజ్‌వెజ్ పచ్చళ్ల వ్యాపారం ఈ ప్రాంతంలో వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. నాణ్యత, రుచిలో రాజీ పడకుండా పచ్చళ్లు తయారు చేయడంతో వీటికి మంచి పేరు దక్కింది. చూస్తేనే నోరూరించేలా నాణ్యతతో వీటిని తయారుచేస్తుంటారు. భీమవరం వచ్చే రాజకీయ నాయకులు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ నాన్‌వెజ్ పచ్చళ్లు రుచి చూడాల్సిందే. వాటి రుచి చూసిన వారు తప్పకుండా తమతో తీసుకెళ్తుంటారు. ఎందరో ప్రముఖులు ఇక్కడి పచ్చళ్లకు ఫ్యాన్స్‌గా మారిపోయారు. దాదాపు 40 దేశాలకు ఎగుమతి భీమవరం ప్రాంతంలోని నాన్‌వెజ్ పచ్చళ్లు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాండ్, దుబాయ్, కువైట్, సింగపూర్, రష్యా తదితర 40 దేశాలకు వెళ్తుంటాయి. అక్కడ ఉన్న బంధువులు, స్నేహితులకు ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. అలాగే విదేశాల్లోని తెలుగువారు ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటారు. నాన్‌వెజ్ పచ్చళ్ల వ్యాపారం భీమవరం ప్రాంతంలో ఏడాదికి సుమారు రూ.కోటి వరకూ జరుగుతుందని అంచనా. నాన్‌వెజ్ పచ్చళ్లు ఆయా రకం బట్టి కిలో రూ.600 నుంచి రూ.1500 వరకు ఉంటాయి. పావుకిలో ప్యాకెట్ల దగ్గర నుంచి విక్రయిస్తుంటారు. మన ఆర్డర్ల మేరకు పెద్ద ఎత్తున కూడా తయారుచేస్తుంటారు. ► చేపలో రకాలు : శీలావతి, కొరమీను, పండుగొప్ప, మెత్తళ్లు, బెత్తుల పచ్చళ్లు లభిస్తాయి. ► చికెన్ వెరైటీలు : బోన్, బోన్‌లెస్, నాటు కోడి, పందెం పుంజు పచ్చళ్లు ప్రత్యేకం ► రొయ్యలో రకాలు : రొయ్య(చిన్నవి), రొయ్య (పెద్దవి), శాక రొయ్య పచ్చళ్లు ఫేమస్ ► అలాగే పీత, మటన్ బోన్‌లెస్, మటన్ ఖీమా పచ్చళ్లు కూడా ఆర్డర్ల మేరకు సరఫరా చేస్తారు. ► పీత సమోసా ప్రత్యేకం.. ఇక్కడ తయారు చేసే పీత సమోసా ప్రత్యేకమైంది. మామూలుగా సమోసా అంటేనే వెంటనే తినాలనిపిస్తుంది. ఇక ఇక్కడ తయారైన పీత సమోసా రుచి చూస్తే వదిలిపెట్టరు. ► చికెన్ పచ్చడి ► రొయ్యల పచ్చడి ► నాటుకోడి పచ్చడి ► పీతల సమోసా -
ఆంధ్ర రొయ్యా మజాకా.. అక్కడ మీసం మెలేస్తోందండి!
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీసం మెలేస్తోంది. నాణ్యమైన, అత్యంత రుచికరమైన రొయ్యలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందటంతో ప్రపంచంలోని 61 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి ఎగుమతుల విలువ అక్షరాలా రూ.16,183 కోట్లు. డీజీసీఐఎస్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలోని ఏ రాష్ట్రాలు వేటిని ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేస్తున్నాయో 2020 సంవత్సర నివేదికలో డీజీసీఐఎస్ పేర్కొంది. రొయ్యలతోపాటు ఫెర్రో–సిలికా, మాంగనీస్ మన రాష్ట్రం నుంచి 69 దేశాలకు ఎగుమతి చేశారు. రాష్ట్రం నుంచి 45 దేశాలకు బియ్యం ఎగుమతి కాగా.. వాటి విలువ రూ.3,015.9 కోట్లుగా నివేదిక వెల్లడించింది. పొగాకు, క్యాప్సికం వంటివి కూడా మన రాష్ట్రం నుంచి భారీగానే ఎగుమతి అయ్యాయని తెలిపింది. కేరళ నుంచి బంగారం.. హరియాణ నుంచి బాస్మతి రైస్ కేరళ నుంచి ఎక్కువ స్థాయిలో బంగారం ఎగుమతి అయినట్టు వెల్లడైంది. ఎనిమిది దేశాలకే ఇది ఎగుమతి అయినా దీని విలువ అక్షరాలా రూ.43,233.83 కోట్లు. కేరళ నుంచి జీడిపప్పు 47 దేశాలకు ఎగుమతి అయింది. బిర్యానీకి ప్రసిద్ధి గాంచిన బాస్మతి రకం బియ్యం హరియాణ నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యాయి. 121 దేశాలకు రూ.16,443.09 కోట్ల విలువైన బాస్మతి బియ్యాన్ని హరియాణ ఎగుమతి చేసింది. గుజరాత్ నుంచి 48 దేశాలకు రూ.77,325.1 కోట్ల విలువైన హైస్పీడ్ డీజిల్‌ను ఎగుమతి చేశారు. మన దేశం నుంచి అయ్యే ఎగుమతుల్లో అతిపెద్ద విలువ కలిగినది డైమండ్స్ కాగా.. మహారాష్ట్ర నుంచి 77 దేశాలకు డైమండ్స్ ఎగుమతి అయ్యాయి. వీటి విలువ 1.70 లక్షల కోట్లు. ఢిల్లీ నుంచి టర్బో జెట్స్ పెద్దఎత్తున ఎగుమతి కాగా.. వీటి విలువ రూ.11,600 కోట్లుగా డీజీసీఐఎస్ తేల్చింది. జమ్ముకశ్మీర్ నుంచి ఉన్ని, సిక్కిం పాస్తాను, త్రిపుర ఉల్లిగడ్డలను ఎక్కువగా ఎగుమతి చేశాయి. -
రొయ్యల ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
కావలసినవి: రొయ్యలు – 15 నుంచి 20 (లైట్‌గా ఉప్పు, కారం, చిటికెడు పసుపు దట్టించి కుకర్‌లో ఉడికించుకోవాలి), గ్రీన్ పీస్ లేదా గ్రీన్ సోయాబీన్స్ – 100 గ్రాములు (నానబెట్టి, ఉడికించినవి), గుడ్లు – 3 (పెద్ద సైజ్), కారం, మిరియాల పొడి – కొద్దికొద్దిగా, సోయాసాస్ – 1 టీ స్పూన్, నువ్వుల నూనె – సరిపడా, కొత్తిమీర తురుము, పుదీనా తురుము – గార్నిష్‌కి (అభిరుచిని బట్టి మరిన్ని), ఉల్లికాడలు – 2 (చిన్నగా కట్ చేసుకోవాలి), ఉప్పు – తగినంత తయారీ: ముందుగా ఒక చిన్న బౌల్లో గుడ్లు, చిటికెడు ఉప్పు, కారం, మిరియాల పొడి, అర టీ స్పూన్ సోయాసాస్ వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మీడియం మంటపైన, ఒక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేడి చేసుకుని, ఉల్లికాడ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఉడికించి పక్కనపెట్టుకున్న సోయాబీన్స్ లేదా బఠాణీలు వేసుకుని గరిటెతో తిప్పాలి. వెంటనే రొయ్యలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని, పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, ఆమ్లెట్ వేసుకుని.. దానిపైన రొయ్యల–బఠాణీ మిశ్రమాన్ని పరచుకోవాలి. ఆమ్లెట్‌ని జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకుని.. గార్నిష్ కోసం కొద్దిగా నూనె, మిగిలిన సోయాసాస్ వేసుకుని కొత్తిమీర, పుదీనా తురుముని ఓ వేపు వేయించి తీసుకుంటే సరిపోతుంది. కొర్ర లు–కీమా గారెలు కావలసినవి: మటన్ కీమా – అర కప్పు (శుభ్రం చేసుకుని, ఉప్పు, కారం, మసాలా వేసుకుని ఉడికించుకోవాలి), కొర్రలు – 1 కప్పు (6 గంటలు నానబెట్టుకోవాలి), పెరుగు – 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి), అల్లం – చిన్న ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా నానబెట్టిన కొర్రలను మిక్సీలో వేసుకుని, అందులో పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, అల్లం ముక్క, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో మటన్ కీమా వేసుకుని బాగా కలుపుకోవాలి. నూనె కాగిన తర్వాత గారెలుగా వేసుకుని, వాటిని మజ్జిగ ఆవడ వేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ గారెలు. ఆపిల్–ఎగ్ కేక్ కావలసినవి: ఆపిల్ – 4 (మీడియం సైజ్‌వి తీసుకుని, తొక్క, గింజలు తొలగించి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పంచదార – పావు కప్పు, నిమ్మతొక్కల తురుము – కొద్దిగా, నిమ్మరసం – 1 టీ స్పూన్, గుడ్లు – 2, వెజిటబుల్ ఆయిల్ – 100 గ్రాములు, మైదా పిండి – పావు కప్పు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్ తయారీ: ముందుగా మిక్సీలో ఆపిల్ ముక్కలు, పంచదార, నిమ్మతొక్కల తురుము, నిమ్మరసం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గుడ్లు, వెజిటబుల్ ఆయిల్ వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని.. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని కేక్ మేకర్లో వేసుకుని.. ఓవెన్లో బేక్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు నచ్చిన విధంగా క్రీమ్స్, బిస్కెట్స్, ఆపిల్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. -
రొయ్య ధరల్ని తగ్గిస్తే చర్యలు
సాక్షి, అమరావతి: రొయ్యల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, ఎగుమతిదారులను ప్రభుత్వం ఆదేశించింది. 100 కౌంట్ రొయ్యలను ఇక నుంచి కిలో రూ.200కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని పేర్కొంది. మిగిలిన కౌంట్ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చెల్లించాలని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏపీలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 59,335.73 టన్నుల రొయ్యలను ప్రాసెసింగ్ యూనిట్లు సేకరించాయి. ప్రస్తుతం రోజుకు 2 వేల టన్నుల రొయ్యలు మార్కెట్‌కు వస్తున్నాయి. విశాఖ, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల మీదుగా ఇప్పటివరకు ఎగుమతికి 86,292 టన్ను రొయ్యల్ని ప్రాసెస్ చేశారు. సెకండ్ వేవ్‌ను సాకుగా చూపి.. కోవిడ్ సెకండ్ వేవ్‌ను సాకుగా చూపి మార్కెట్లో ధర పడిపోయిందంటూ కొందరు దళారీలు, ట్రేడర్లు కిలో రొయ్యలకు రూ.20 నుంచి రూ.30 చొప్పున ధర తగ్గించారు. ఏప్రిల్‌లో రైతులు, ట్రేడర్స్‌తో సమావేశం నిర్వహించిన ప్రభుత్వం ధరలు నిలకడగా కొనసాగేలా చర్యలు తీసుకుంది. కానీ.. 10 రోజులుగా ధరలు మళ్లీ పతనమవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తమిళనాడు, ఒడిశా, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వంద కౌంట్ రొయ్యలను కిలో రూ.220కి కొనుగోలు చేస్తుంటే.. ఏపీలో మాత్రం రూ.170 నుంచి రూ.180కి కొనుగోలు చేస్తున్నారని, మిగిలిన కౌంట్ ధరలు కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నాయని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్య శాఖ అధికారులు రొయ్య రైతులు, ట్రేడర్స్, ఎక్స్‌పోర్టర్స్‌తో సమీక్ష నిర్వహించారు. ఇకనుంచి ప్రతి వారం రొయ్యల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా కౌంట్ల వారీగా నిర్ధేశించిన ధరలను ఇకనుంచి ప్రతి వారం పత్రికాముఖంగా రైతులకు తెలియజేసి.. ధరలపై వారికి విస్తృత అవగాహన కల్పిస్తామని ప్రకటించింది. 100 కౌంట్‌కు కిలో రూ.200 కంటే తక్కువగా కొనుగోలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించగా, ఆ ధరకు తప్పకుండా కొనుగోలు చేస్తామని ఎక్స్‌పోర్టర్స్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ మేరకు పెంచేందుకు అవకాశం ఉందో పరిశీలించేందుకు అంతర్గతంగా సమావేశమై ధరల పెంపు విషయమై నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. ధరలపై నియంత్రణ అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా ప్రాసెసింగ్ ప్లాంట్స్, సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ నిర్ధేశించిన ధరలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇకనుంచి 100 కౌంట్ కిలో రూ.200కు తక్కువ కాకుండా కొనుగోలు చేసేలా ఆదేశించాం. తక్కువ ధరకు కొనుగోలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
Prawns Price: నిలకడగా రొయ్యల ధరలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ కోవిడ్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని తక్కువ ధరలకు రొయ్యలు కొనుగోలు చేస్తున్న దళారులు, వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దళారుల ఉచ్చులో పడి అయినకాడికి అమ్ముకోవద్దని ఆక్వా రైతులను కోరుతోంది. సీ ఫుడ్ ఎగుమతిదారుల అసోసియేషన్ నిర్ధారించిన ధరలకే అమ్ముకోవాలని సూచిస్తోంది. రాష్ట్రంలో మొదటి పంట ప్రస్తుతం మార్కెట్లోకి వస్తోంది. రోజుకు ఐదు నుంచి ఆరువేల టన్నుల రొయ్యలు జూన్ వరకు మార్కెట్‌కు వస్తాయి. ప్రస్తుతం కౌంట్‌ను బట్టి కిలో రూ.200 నుంచి రూ.340 వరకు ధర పలుకుతోంది. రోజుకు 15–20 టన్నుల చొప్పున కృష్ణపట్నం, విశాఖ, కాకినాడ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌ను సాకుగా చూపి మార్కెట్లో రేటు పడిపోయిందని, లాక్డౌన్ విధిస్తే ఎగుమతులు నిలిచిపోతాయంటూ కొంతమంది దళారులు, వ్యాపారులు దుష్ప్రచారం చేస్తూ రైతుల వద్ద కిలోకి రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గించి కొంటున్నారు. దీంతో దళారులు, వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సర్కార్ నిర్ణయించింది. ఇదే సమయంలో ఆందోళనకు గురికాకుండా రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మీడియా ద్వారా ధరలపై విస్తృత ప్రచారం: కమిషనర్ కన్నబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు ఆదివారం ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, కోస్తా జిల్లాల ఆక్వా రైతులు, మత్స్యశాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు కౌంట్ వారీగా నిర్ధారించే ధరలను మీడియా ద్వారా సీఫుడ్ ఎగుమతిదారుల అసోసియేషన్ విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. తక్కువ ధరలకు కొనుగోలు చేసే వ్యాపారుల సమాచారం జిల్లా మత్స్యశాఖాధికారులకు ఇవ్వాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు నిలకడగా ఉన్నాయని, తగ్గే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. -
ఇళ్ల ముందుకే చేపలు, రొయ్యలు
సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. నగరాలు, పట్టణాలతో పాటు మారుమూల పల్లెవాసులకు సైతం ఏరోజుకారోజు తాజా చేపలు, రొయ్యలను సరసమైన ధరలకు అందుబాటులో తీసుకెళ్లాలని సంకల్పించింది. తోపుడు బండ్ల ద్వారా కూరగాయలు ఇంటివద్దకు తీసుకెళ్తున్న తీరులో మొబైల్ వాహనాల్లో చేపలు, రొయ్యలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. ప్రొటీన్లు, విటమిన్లు, క్యాల్షియం దండిగా ఉండే మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచడం ద్వారా ప్రజల్లో వ్యాధినిరోధకశక్తిని పెంపొందింప చేయాలని, మత్స్యకారులు, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో తలసరి వినియోగం ఎనిమిది కిలోలే.. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయి. తీరం వెంబడి 31,147 ఫిషింగ్ క్రాప్ట్స్ ద్వారా సముద్ర మత్స్యవేట సాగుతోంది. రాష్ట్రంలో 2,64,774 ఎకరాల్లో చేపలు, 2,25,406 ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నాయి. ఆక్వా, మెరైన్ ఉత్పత్తులు కలిపి ఏటా 31,50,486 మెట్రిక్ టన్నుల దిగుబడులొస్తాయి. వీటిలో 24,02,610 టన్నులు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, 3,49,842 టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మిగిలిన 3,98,034 టన్నులు (12.63 శాతం) మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. ఆక్వా ఉత్పత్తుల తలసరి వినియోగం అంతర్జాతీయంగా 20 నుంచి 30 కిలోలు, జాతీయంగా 7.5 నుంచి 10 కిలోలు ఉండగా మన రాష్ట్రంలో 8 కిలోలు మాత్రమే. మన రాష్ట్రంలో తలసరి వినియోగాన్ని 20 కిలోలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలిదశలో 25 హబ్‌లు చేపలు, రొయ్యల స్థానిక వినియోగం పెంపునకు రాష్ట్రవ్యాప్తంగా వంద ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రతి హబ్ పరిధిలో రూ.20 లక్షల విలువైన ఐదు, రూ.10 లక్షల విలువైన 10, రూ.మూడులక్షల విలువైన 10 వంతున మొత్తం 25 స్పోక్స్ (కియోస్క్‌లు) ఏర్పాటు చేస్తారు. రూ.75 వేల నుంచి రూ.లక్ష వ్యయంతో గ్రామ/వార్డు సచివాలయానికి ఒకటి వంతున ఆక్వా ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలు (మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లు) ఏర్పాటు చేస్తారు. తొలుత డిమాండ్ ఉన్న చోట వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి అక్కడి అమ్మకాలను బట్టి దశలవారీ విస్తరిస్తారు. హబ్‌లతో పాటు ఈ కేంద్రాలకు బ్రాండింగ్ చేయడంతో పాటు నాణ్యమైన తాజా చేపలు, రొయ్యలను ఒకేచోట నిర్దేశించిన ధరలకు విక్రయించేలా ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్న జనతా బజార్ల ద్వారా మారుమూల పల్లె వాసులకు సైతం కోరుకున్న తాజా మత్స్య ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. ఒక్కో హబ్ పరిధిలో 200 మందికి ఉపాధి హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఆక్వా రైతుల నుంచి సేకరించే మత్స్య ఉత్పత్తులను జిల్లాస్థాయిలో ఏర్పాటైన ఆక్వా ఫార్మర్స్ సొసైటీ ద్వారా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే ఆక్వా హబ్‌లకు చేరవేస్తారు అక్కడినుంచి ప్రధాన నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఏర్పాటు చేసే స్పోక్స్‌కు, మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లకు తరలించి.. బతికిన, తాజా చేపలు, రొయ్యలు విక్రయిస్తారు. తద్వారా ప్రతి హబ్ పరిధిలో కనీసం 200 మందికి తక్కువ కాకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. చేయూత లబ్ధిదారులకు బ్యాంకు లింకేజ్ మినీ ఫిష్ వెండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు రూ.56,250 చొప్పున బ్యాంకు లింకేజ్ కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా.. నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 1,301 మంది, పట్టణ ప్రాంతాల్లో 1,060 మంది చేయూత లబ్ధిదారులు ముందుకొచ్చారు. వీరితోపాటు ఇతరులెవరైనా ఆసక్తి చూపితే బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణపరపతి కల్పిస్తారు. -
నిర్దేశించిన రేట్లకు రొయ్యలు కొనాల్సిందే
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం ఎగుమతిదారులు రొయ్యలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీనేత, వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి, ఎంపెడా చైర్మన్ కేఎస్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు, రైతుల ఇబ్బందులపై చర్చించారు. ఆక్వా రైతులెవరూ నష్టపోకూడదని ఎంపెడా చైర్మన్‌కు సీఎం స్పష్టం చేశారు. కరోనా వైరస్ పేరుతో రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఎగుమతిదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపెడా చైర్మన్ సీఎం దృష్టికి తెచ్చారు. రాష్ట్రం నుంచే భారీగా ఎగుమతులు ఆక్వా సాగు చేసే ప్రాంతాల్లో పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకోవాలని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, ఎంపెడా చైర్మన్, అధికారులను సీఎం ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తుల్లో అధికభాగం రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న నేపధ్యంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ధరలు తగ్గినప్పుడు రైతులు నేరుగా కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేసుకునేలా ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందేలా చూడాలని సీఎం సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ తరహాలోనే ఆక్వాజోన్లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈనాం వ్యవస్థను తెచ్చి సచివాలయాలను, సిబ్బంది వినియోగించుకోవాలన్నారు. ఆక్వా రైతులను ఆదుకోవడం, ఆర్థిక సహాయం, కోల్డ్ స్టోరేజీలు, ఎగుమతులు తదితర అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డికి సూచించారు. గత ఐదురోజుల్లో 2,832 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు జరగగా 2,070 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు. -
ఈ పాన్కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా?
బాదం – బనానా పాన్‌కేక్స్ కావలసినవి: బాదం – పావు కప్పు (నాబెట్టి పైతొక్క తొలగించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి), ఆపిల్ గుజ్జు – పావు కప్పు, మొక్కజొన్న పిండి, గోధుమ పిండి, బియ్యప్పిండి – అర కప్పు చొప్పున, పంచదార – 8 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, చిక్కటి పాలు – 2 కప్పులు, గుడ్లు – 2, అరటిపండ్లు – 4 (రెండింటిని మెత్తగా గుజ్జు చేసుకుని, మరో రెండింటిని గుండ్రటి ముక్కల్లా కట్ చేసుకోవాలి), నూనె – సరిపడా, డ్రైఫ్రూట్స్ – గార్నిష్ కోసం.. తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మొక్కజొన్న పిండి, గోధుమపిండి, బియ్యప్పిండి, పంచదార, బేకింగ్ పౌడర్, బాదం పేస్ట్, అరటి పండు గుజ్జు, ఆపిల్ గుజ్జు, చిక్కటి పాలు, గుడ్లు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని రొట్టెల పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెనంపైన నూనె వేసుకుని, పాన్‌కేక్స్ వేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు అరటిపండు ముక్కలు, డ్రైఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. రైస్ పుడ్డింగ్ కావలసినవి: అరటి పండ్లు – 2 (నచ్చిన షేప్ కట్ చేసుకోవాలి), బెల్లం కోరు – 5 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, అన్నం – ఒకటిన్నర కప్పులు, నీళ్లు – ఒక కప్పు, కొబ్బరి పాలు – 1 కప్పులు, చిక్కటి పాలు – 1 కప్పు, పంచదార – 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం – 5(గింజలు తొలగించి పేస్ట్ చేసుకోవాలి), ఆపిల్ – 1 (తొక్క తొలగించి, గుజ్జు చేసుకోవాలి), దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయ పొడి – పావు టీ స్పూన్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూన్. ఉప్పు – తగినంత తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరటి పండ్ల ముక్కలను కూడా అదే నేతిలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో బెల్లం, నీళ్లు, ఏలకుల పొడి వేసుకుని ముదురు పాకం పెట్టుకుని, అందులో అరటిపండు ముక్కలు వేసుకుని, పాకం పట్టించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక పెద్ద బౌల్ తీసుకుని.. స్టవ్ మీద పెట్టుకుని.. చిక్కటి పాలు, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కొద్ది సేపటికి అన్నం, ఆపిల్ గుజ్జు, జాజికాయ పొడి, వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ దగ్గర పడేలా చెయ్యాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, ఖర్జూరం పేస్ట్, దాల్చిన చెక్కపొడి వేసుకుని దగ్గర పడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్‌కి తీసుకుని.. దానిపైన పాకం పట్టించిన అరటి ముక్కలు, నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. రొయ్యల పకోడా కావలసినవి: రొయ్యలు – 25 (వ్యర్థాలు తొలగించి, శుభ్రం చేసుకుని, మెత్తగా ఉడికించుకోవాలి), శనగపిండి – పావు కప్పు, బ్రెడ్ పౌడర్ – 4 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు చొప్పున, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, జీలకర్ర – 1 టీ స్పూన్, నీళ్లు – కొద్దిగా, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, నూనె – సరిపడా, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా.. ఒక బౌల్లో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, నిమ్మరసం, అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో నూనె వేడి కాగానే.. ఒక్కో రొయ్యకు శనగపిండి మిశ్రమాన్ని బాగా పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అభిరుచిని బట్టి రొయ్యలను మిక్సీ పట్టుకుని, ఆ మిశ్రమాన్ని, శనగపిండి మిశ్రమంలో కలిపి కూడా పకోడా వేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
తిండి ఉంగరాలు
ఒలిచిన రొయ్యలు వెండి ఉంగరాల్లా ఉంటాయి. ముల్లు లేని, ఎముక లేని, మెత్తటి ఉంగరాలు. రుచికరమైన ఉంగరాలు. చెరువుల్లో పెంచినవి... సముద్రంలో పట్టినవి... ఎగుమతితో సిరులు కురిపించేవి... వంటగదిలో ఘుమఘుమలు నింపేవి ఇవే. ఎలా వండినా బాగుంటాయి. వండిన వారికి ప్రశంసలు తెస్తాయి. ఈ ఆదివారం రొయ్యకు సై అనండి. మరీ మరీ లాగించండి. రొయ్యల ఇగురు కావలసినవి: ప్రాన్స్ – 500 గ్రా; ఉల్లితరుగు – రెండు కప్పులు ఏలకులు – ఆరు; దాల్చినచెక్క – కొద్దిగా; నూనె – కప్పు పచ్చిమిర్చి – ఆరు (పొడవుగా కట్ చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు జీడిపప్పు – 10 పలుకులు; కొత్తిమీర తరుగు – రెండు టీ స్పూన్లుపసుపు – చిటికెడు; గరంమసాలా – రెండు టీ స్పూన్లు గ్రేవీ కోసం:గసగసాలు – రెండు టీ స్పూన్లు; జీడిపప్పు – 10 పలుకులుపుచ్చపప్పు – రెండు టీ స్పూన్లు; కొబ్బరిముక్కలు – అర కప్పు వీటికి నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. తయారి: ►ముందుగా ప్రాన్స్‌ను శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ►స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగావేయించాలి ►అందులో ఉడికించిన ప్రాన్స్, జీడిపప్పు, పావు కప్పు నీరు, గసగసాల మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి తక్కువ సెగ మీద పది నిమిషాల సేపు ఉడికించాలి ►ఇప్పుడు కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపిమిశ్రమం దగ్గరగా వచ్చే వరకు సన్న సెగ మీద ఉడికించాలి ►ఇప్పుడు సర్వింగ్‌బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. రొయ్యల వేపుడు కావలసినవి: రొయ్యలు: పావుకేజీ (పొట్టు ఒలిచిన తర్వాత), టొమాటో : ఒకటి (తరగాలి), అల్లం : 50 గ్రా, వెల్లుల్లి : ఒకటి, ఉల్లిపాయ : ఒకటి, పచ్చిమిర్చి : నాలుగు, జీడిపప్పు : 25 గ్రా, గసాలు : 5 గ్రా, కొబ్బరి : చిన్న ముక్క, ధనియాల పొడి : ఒక టేబుల్ స్పూన్, ఉప్పు : రుచికి తగినంత, పసుపు : చిటికెడు, కారం: ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర : ఒక కట్ట, పుదీన: నాలుగు రెమ్మలు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, నూనె : ఒక టేబుల్ స్పూన్, లవంగాలు: నాలుగు, దాల్చిన చెక్క: చిన్న ముక్క, ఏలకులు : నాలుగు తయారి: ►పాత్రలో నూనె వేసి అందులో శుభ్రం చేసిన రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి ►అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను మెత్తగా పేస్టు చేయాలి ►ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూను తీసుకుని రొయ్యలలో వేసి కలిపి (నీటిని వేయకుండా) సన్న మంట మీద వేడి చేయాలి ►ఇవి ఇగిరే లోపు కొబ్బరి, ధనియాలపొడి, జీడిపప్పు, గసాలు, రెండు ఏలకులు, రెండు లవంగాలు వేసి మెత్తని పేస్టు చేయాలి ►బాణలిలో నెయ్యి వేసి కాగిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకుల పొడి, అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని, టొమాటో ముక్కలను వేసి దోరగా వేయించాలి ►అది వేగిన తర్వాత కొబ్బరి, జీడిపప్పు మిశ్రమం వేయాలి ►మసాలా వేగిన తర్వాత ఇగరపెట్టిన రొయ్యలను వేసి తగినంత నీటిని వేసి ఉడికించాలి ►ఉడికేటప్పుడు కొత్తిమీర, పుదీన ఆకులను వేయాలి ►మసాలా మొత్తం రొయ్యలకు పట్టేసి ఇగిరే వరకు వేయించి దించేయాలి. గమనిక: ఫ్రైడ్ మసాలాను ఇష్టపడే వాళ్లు పైన చెప్పిన కొలతలు వేయాలి. తక్కువ మసాలా ఇష్టపడే వాళ్లు అన్నీ సగం వేస్తే చాలు. ప్రాన్స్ బిర్యానీ కావలసినవి: బిర్యానీకి...బాస్మతి రైస్ – అర కిలో; డాల్డా – 100 గ్రా.ఉల్లితరుగు – కప్పు; ఉప్పు – తగినంతఏలకులు – ఆరు; బిర్యానీ ఆకులు – ఆరుషాజీరా – రెండు టీ స్పూన్లునూనె – 100 గ్రా; నెయ్యి – 50 గ్రా.పుదీనా – కట్ట (కాడల్లేకుండా ఆకులు తీసుకోవాలి)అల్లంవెల్లుల్లి పేస్ట్ – రెండు టీ స్పూన్లుపచ్చిమిర్చి – ఆరు (నిలువుగా కట్ చేయాలి)కూరకోసం...ప్రాన్స్ – 200 గ్రాషాజీరా – రెండు టీ స్పూన్లుఅనాసపువ్వు – ఒకటి; బిర్యానీ పువ్వు – ఒకటిబిర్యానీ ఆకు – ఒకటి; ఉల్లి తరుగు – కప్పుజీడిపప్పు – 20 పలుకులుగసగసాల పేస్ట్ – నాలుగు టీ స్పూన్లుపుచ్చపప్పు పేస్ట్ – రెండు టీ స్పూన్లుటొమాటో పేస్ట్ – కప్పు; దాల్చినచెక్క – రెండు అల్లంవెల్లుల్లి పేస్ట్ – రెండు టీ స్పూన్లుఏలకులు – ఆరు; పసుపు – చిటికెడుఉప్పు – తగినంత; కారం – రెండు టీ స్పూన్లుగరంమసాలా – రెండు టీ స్పూన్లుకొత్తిమీర తరుగు – రెండు టీ స్పూను తయారి: ►ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి20 నిమిషాలపాటు నానబెట్టాలి ►ప్రెషర్ కుకర్లోనూనె, డాల్డా, నెయ్యివేసి వేడయ్యాక షాజీరా, బిర్యానీ ఆకులు, ఏలకులు, ఉల్లితరుగు, అల్లంవెల్లుల్లిపేస్ట్, పుదీనా, ఉప్పు వేసి దోరగా వేయించాలి ►అవివేగాక బియ్యానికి సరిపడా నీరు పోసి మరిగాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కుకర్ మూతపెట్టిఉడికించి పక్కన పెట్టుకోవాలి కర్రీ తయారి: ►పాన్‌లో నూనె వేసి వేడెక్కాక సాజీర, ఏలకులు, అనాస పువ్వు, బిర్యాని ఆకు, బిర్యాని పువ్వు, ఉల్లిపాయ తరుగు, జీడిపప్పు పలుకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలపేస్ట్, పుచ్చపప్పు పేస్ట్, ఉడికించిన ప్రాన్స్, పసుపు,ఉప్పు, కారం అన్నిటినీ కలిపి వేయించాలి ►దగ్గరగాఅయిన తర్వాత గరంమసాలా, కొత్తిమీర వేసి బౌల్లోకి తీసుకోవాలి ►ఇప్పుడు పెద్ద పాత్ర తీసుకునిఅందులో బిర్యానీ రైస్‌ను ఒక వరుస, ప్రాన్స్ కర్రీ ఒకవరుస... ఇలా మొత్తం రైస్, కర్రీని ఒకదాని మీదఒకటి సర్దాలి ►అంతే వేడివేడి ప్రాన్స్ బిర్యానీ రెడీ. ప్రాన్స్ మంచూరియా కావలసినవి: ప్రాన్స్ – 200 గ్రా; అజినమోటో – టీ స్పూన్ఉప్పు – తగినంత; మిరియాల పొడి – రెండు టీ స్పూన్లుకోడిగుడ్డు – ఒకటి; కార్న్‌ఫ్లోర్ – అర కప్పు; మైదాపిండి – పావు కప్పునూనె – డీప్ ఫ్రైకి సరిపడా; పచ్చిమిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు అల్లంవెల్లుల్లి తరుగు –నాలుగు టీ స్పూన్లు; పసుపు – చిటికెడుకారం – టీ స్పూన్; కొత్తిమీర – కట్ట (సన్నగా తరగాలి) తయారి: ►ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి ►ఒక గిన్నెలో అర టీ స్పూన్ అజినమోటో, ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగా కలుపుకోవాలి ►ఆ మిశ్రమంలో ఉడికించిన ప్రాన్స్ వేసి కలపాలి ►పాన్‌లో నూనె పోసి వేడయ్యాక కలిపిపెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి ►ఇప్పుడువేరొక పాన్ పెట్టుకుని పావు కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్ అజినమోటో, అర టీ స్పూన్ మిరియాలపొడి, ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించాలి ►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్పకోడీని కూడా కలిపి తక్కువ సెగ మీద అయిదారు నిమిషాలు తిప్పి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ప్రాన్స్ మంచూరియా రెడీ. థాయ్ ప్రాన్ కేక్ కావలసినవి: రొయ్యలు – 300 గ్రా.పండు మిరప పేస్ట్ – 2 టీ స్పూన్లు లెమన్ గ్రాస్ – 3 టీ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్లు కారం – 2 టీ స్పూన్లు నిమ్మరసం – 2 టీ స్పూన్లు ఉప్పు – 2 టీ స్పూన్లు ఫిష్ సాస్ – 2 టీ స్పూన్లు తులసి ఆకులు – 2 టీ స్పూన్లునూనె – 2 టీ స్పూన్లు చిల్లీ ఆయిల్ – 2 టీ స్పూన్లుఉల్లికాడలు – 25 గ్రా.కార్న్ ఫ్లోర్– 30 గ్రా.అల్లం పేస్ట్ – 2 టీ స్పూన్లు నిమ్మ ఆకులు – 2 తయారి: ►రొయ్యలను శుభ్రపరిచాలి ►చిల్లీపేస్ట్, లెమన్ గ్రాస్, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, ఉప్పు, ఫిష్ సాస్, తులసి ఆకులు,చిల్లీ ఆయిల్, ఉల్లికాడలు, కార్న్‌ఫ్లోర్, అల్లంపేస్ట్ రొయ్యలలో వేసి కలపాలి ►తర్వాత చిన్న చిన్న ముద్దలుచేసి, చేత్తో అదమాలి ►వీటినినాన్స్టిక్ పాన్‌పై కొద్దిగానూనె వేసి, వేడయ్యాక రెండు వైపులా కాల్చి, తీయాలి ►గార్లిక్ సాస్‌తో తయారుచేసుకున్న థాయ్ ప్రాన్కేక్లను వేడి వేడిగా సర్వ్‌చేయాలి. చెట్టినాడు ప్రాన్స్ కావలసినవి: రొయ్యలు (తోక ఉంచాలి) – 8; ధనియాల పొడి– 25 గ్రా.; జీలకర్ర పొడి – 20గ్రా.; మిరియాల పొడి – 16 గ్రా.; స్టార్ అనైజ్ (మార్కెట్లో లభిస్తుంది) – 25 గ్రా.; కల్పసి (మార్కెట్లో లబిస్తుంది) – టీ స్పూన్; మరాఠీమొగ్గ్గ (మార్కెట్లో లభిస్తుంది) – చిటికెడు;జాజికాయ – 1 (పొడి చేయాలి); ఏలకులు – 2 (పొడి చేయాలి);దాల్చిన చెక్క – చిన్న ముక్క (పొడి చేయాలి); లవంగాలు – 3 (పొడి చేయాలి); సోంపు (వేయించి పొడి చేయాలి) – 8 గ్రా.; హంగ్ కర్డ్ (ఒక పలుచనివస్త్రంలో పెరుగు వేసి, వడకట్టి, నీరు తీసేసినది) – 50 గ్రా.; నిమ్మకాయ – 1; పసుపు– చిటికెడు; ఆవనూనె – టీ స్పూన్; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ఉప్పు – తగినంత తయారి: ►ఒక వెడల్పాటి గిన్నెలో శుభ్రపరిచిన రొయ్యలను వేసి, అల్లం వెల్లుల్లిపేస్ట్, నిమ్మరసం వేసి, కలిపి, కొద్దిసేపు మ్యారినేట్ చేయాలి ►మరొక గిన్నెలో ధనియాల పొడి, జీలకర్ర,మిరియాల పొడి, స్టార్ అనైజ్, కల్పసి,మరాఠీమొగ్గ, జాజికాయ పొడి, బిర్యానీ ఆకు, ఏలకుల పొడి, దాల్చిన చెక్క పొడి చేయాలి ►సోంపు పొడి,ఉప్పు వేసి కలపాలి ►దీంట్లో ఆవనూనె, నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి ►ఈ మిశ్రమాన్ని రొయ్యలకుపట్టించి అరగంట ఉంచాలి ►కొబ్బరి పుల్లలకు మ్యారినేట్ చేసిన ప్రాన్స్‌ను గుచ్చి, గ్రిల్ చేయాలి ►వీటిని వేడివేడిగా నచ్చిన చట్నీ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి. చిల్లీ ప్రాన్స్ కావలసినవి: ప్రాన్స్ – 200 గ్రాఅజినమోటో – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత మిరియాలపొడి – టీ స్పూన్; కోడిగుడ్డు – ఒకటి కార్న్‌ఫ్లోర్ – అర కప్పు మైదాపిండి – పావు కప్పునూనె – డీప్ ఫ్రైకి సరిపడా పొడవుగా తరిగిన క్యాప్సికం – కప్పు పొడవుగా తరిగిన ఉల్లిపాయ – కప్పుæపొడవుగా తరిగినపచ్చిమిర్చి – ఆరు అల్లం వెల్లుల్లి తరుగు – నాలుగు టీ స్పూన్లు; చిల్లీ సాస్ – టీ స్పూన్ సోయా సాస్ – టీ స్పూన్ ఉల్లికాడలు – నాలుగు (సన్నగా తరగాలి) తయారి: ►ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి ►ఒక గిన్నెలో అజినమోటో, ఉప్పు, మిరియాలపొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగాకలుపుకోవాలి ►ఈ మిశ్రమంలో సగంసగం ఉడికించిన రొయ్యలను వేసి కలపాలి ►పాన్‌లో నూనెవేడయ్యాక ప్రాన్స్‌ని పకోడీల్లా వేసి దోరగావేయించాలి ►వేరొక పాన్‌లో పావు కప్పు నూనెవేసి వేడయ్యాక క్యాప్సికం తరుగు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చితరుగు వేసిదోరగా వేయించాలి ►అవి వేగాక అందులో రెడ్‌చిల్లీ సాస్, సోయా సాస్, ఫ్రై చేసిన ప్రాన్స్, ఉల్లికాడలను కూడా కలిపి తక్కువ సెగమీద అయిదారు నిమిషాలు బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. జింజర్ ప్రాన్స్ కావలసినవి: ప్రాన్స్ – 200 గ్రాఉల్లిపాయ పేస్ట్ – కప్పుఅల్లంవెల్లుల్లి పేస్ట్ – అరకప్పు అజినమోటో– టీ స్పూన్ఉప్పు – తగినంతమిరియాల పొడి – టీ స్పూన్కారం – రెండు టీ స్పూన్లునూనె – డీప్ ఫ్రైకి సరిపడా టొమాటో సాస్ – టీ స్పూన్సోయా సాస్ – టీ స్పూన్ఫుడ్ (రెడ్) కలర్ – చిటికెడుకొత్తిమీర తరుగు – రెండు టీ స్పూన్లు తయారి: ►ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగాకడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించిపక్కనపెట్టుకోవాలి ►పాన్‌లో అరకప్పు నూనెపోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లిపేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం,ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ►తర్వాత గ్లాస్ నీరు పోసి ఉడికించాలి ►మిశ్రమం దగ్గర పడేటప్పుడు టొమాటో సాస్,సోయా సాస్, ఫుడ్ కలర్ వేసి కలపాలి ►ఇందులోఉడికించిన రొయ్యలను కలిపి నూనెలో డీప్ ఫ్రైచేయాలి ►దోరగా వేగిన జింజర్ ప్రాన్స్‌ను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్చేయాలి. హక్కా ప్రాన్స్ కావలసినవి: రొయ్యలు – 250 గ్రా.కార్న్ ఫ్లోర్ – 30 గ్రా.మైదా – 30 గ్రా.పొట్టు తీసిన వెల్లుల్లి – 40 గ్రా.ఉల్లికాడలు – 20 గ్రా.డార్క్ సోయా సాస్ – 20 గ్రా.పచ్చిమిర్చి – 20 గ్రా.ఎమ్.ఎస్.జి (మోనో సోడియమ్ గల్టమేట్ ఇది మార్కెట్లో లభిస్తుంది)– చిటికెడు ఉప్పు – తగినంతపంచదార – టీ స్పూన్నూనె – 40 మీ.లీ; తెల్ల మిరియాలపొడి – చిటికెడు రెడ్ చిల్లీ ఆయిల్ (మార్కెట్లో లభిస్తుంది) – 20 మీ.లీ; చికెన్ బ్రోత్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది) – 2 టీ స్పూన్లు తయారి: ►రొయ్యలను శుభ్రపరుచుకొని, పక్కన ఉంచాలి ►మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నీళ్లు కలిపి పిండిని జారుగా కలుపుకోవాలి ►కడాయిలో నూనె పోసి, కాగనివ్వాలి ►రొయ్యలను మైదా పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించి, తీయాలి ►విడిగా మరొక పాన్‌లో బటర్ వేసి, వేడయ్యాక.. వెల్లుల్లి తరుగు,పచ్చిమిర్చి తరుగు, ఉల్లికాడలు వేయించాలి ►వేయించిన రొయ్యలను వేగుతున్న బటర్ మిశ్రమంలో వేసి కలిపి, రెండు నిమిషాలు వేయించాలి ►చక్రాలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వేయించిన వెల్లుల్లిరెబ్బలతో ఈ హక్కా ప్రాన్స్‌ను వేడి వేడిగా సర్వ్ చేయాలి. -
ఖిచడీచప్పుడు లేకుండా గుటుక్కు!
ఆకేసి పప్పేసి నెయ్యేసీ బువ్వపెట్టి... అంటూ రకరకాలు కలిపి ఆకుమీద వేశాకే అది మృష్టాన్నం అవుతుంది. కానీ ఖిచిడీ అలా కాదు... పప్పు నెయ్యి బియ్యం... ఇంకా ఎన్నెన్నో సంభారాలన్నీ కలిపి గిన్నెలో వేసేసి వండేస్తే చాలు... అన్నీ కలగలిసి అదే ఖిచిడీ అవుతుంది. ఆ ఆహారం సంపూర్ణమవుతుంది. అప్పుడే అన్నప్రాశన చేసిన పిల్లాడి నుంచి మొదలుకొని అర్జెంటుగా ఆఫీసుకెళ్లాల్సిన పెద్దాళ్ల వరకు... పచ్చడీ కూరా చెట్నీ ఉన్నా బెంగలేదు... లేకున్నా పర్వాలేదు. విడివిడిగానైనా, కలివిడిగానైనా కలుపుకోకుండానూ, కలుపుకొనైనా రుచిరుచిగా వడివడిగా తినగలిగేది ఖిచిడీ! అన్నట్టు... మామూలు ఖిచిడీలే ఎందుకు...? చూడగానే మింగాలి అనిపించే పాలక్, బెంగాలీ... తినేసి బ్రేవున త్రేన్చాలనిపించే సాబుదానా, చెనాదాల్!! వీటన్నింటినీ వండేద్దాం...! (ఖి)చడీచప్పుడూ లేకుండా గుటుక్కుమనిపిద్దాం!! రండి... ముందుగా వంట దినుసులు అందుకోండి. సాబుదానా ఖిచిడీ కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; బంగాళ దుంపలు – 2 (మీడియం సైజువి); వేయించిన పల్లీలు – అర కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – అర టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి, ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి ►మరుసటి రోజు నీటిని వడ కట్టి సగ్గుబియ్యాన్ని పక్కనుంచాలి ►బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసేసి, చేతితో మెత్తగా మెదపాలి ►వేయించిన పల్లీలను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి ►ఒక పాత్రలో సగ్గుబియ్యం, ఉడికించిన మెదిపిన బంగాళ దుంప, పంచదార, ఉప్పు వేసి కలపాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర వేసి వేయించాలి ►కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి ►తయారుచేసి ఉంచుకున్న సగ్గు బియ్యం మిశ్రమాన్ని జత చేసి ఐదారు నిమిషాల పాటు వేయించాలి ►బాగా ఉడికిన తరువాత దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి ప్లేట్లలో వేడివేడిగా అందించాలి. బెంగాలీ ఖిచిడీ కావలసినవి: బాస్మతి బియ్యం – ఒక కప్పు; పొట్టు పెసర పప్పు – ఒక కప్పు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఏలకులు – 2; లవంగాలు – 3; బిర్యానీ ఆకు – 1; జీలకర్ర – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉడికించిన బంగాళ దుంపలు – 2; క్యాలీఫ్లవర్ తరుగు – అర కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; క్యారట్ తరుగు – పావు కప్పు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – 5 కప్పులు. తయారీ: ►బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి ►స్టౌ మీద పాన్‌లో పొట్టు పెసర పప్పును వేసి బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా కలుపుతూ వేయించి, దింపి చల్లారాక, తగినన్ని నీళ్లు జత చేసి బాగా కడిగి నీరు వడ కట్టేయాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ►దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి ►అల్లం తురుము, పసుపు, మిరప కారం, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి టొమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి ►బంగాళ దుంప తరుగు, క్యాలీఫ్లవర్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి బాగా మెత్తబడేవరకు కలుపుతుండాలి ►వేయించిన పొట్టు పెసర పప్పు జత చేసి మరోమారు వేయించాలి ►వడ కట్టిన బియ్యం జత చేయాలి ’ ఐదు కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి, ఉప్పు, పంచదార జత చేసి బాగా కలియబెట్టి, మూత పెట్టాలి ’ ఉడికిన తరవాత దింపేయాలి ’ పెరుగు, అప్పడాలతో వేడివేడిగా సర్వ్ చేయాలి. పాలక్ ఖిచిడీ కావలసినవి: పాలకూర తరుగు – 2 కప్పులు; వేయించిన పల్లీలు – పావు కప్పు; పెసర పప్పు – అర కప్పు; బాస్మతి బియ్యం – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; బంగాళ దుంప తరుగు – పావు కప్పు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ ఆకు – ఒకటి; లవంగాలు – 2; ఏలకులు – 2; జీలకర్ర – అర టీ స్పూను; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 4 కప్పులు. తయారీ: ►ఒక పాత్రలో బియ్యం, పెసర పప్పు వేసి శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి సుమారు అర గంట సేపు నానబెట్టాలి ►పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ►జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి ►బాగా వేగిన తరవాత ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి టొమాటో ముక్కలు మెత్తబడేవరకు వేయించాలి ►పసుపు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాక, పాలకూర పేస్ట్ వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ►నానబెట్టిన బియ్యం, పెసర పప్పు వేసి, బాగా కలిపి, నాలుగు కప్పుల నీళ్లు జత చేయాలి ►ఉప్పు కూడా వేసి బాగా కలియబెట్టి, కుకర్ మూత ఉంచాలి ►నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙ఆనియన్ రైతా, సింపుల్ వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి. ఓట్స్ ఖిచిడీ కావలసినవి: నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి; బిర్యానీ ఆకు – 1; టొమాటో తరుగు – పావు కప్పు; క్యారట్ తరుగు – పావు కప్పు; బంగాళదుంప తరుగు – పావు కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; పొట్టు పెసర పప్పు – అర కప్పు (శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేయాలి); ఓట్స్ – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; నీళ్లు – రెండున్నర కప్పులు; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు జత చేసి కొద్దిసేపు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►తరిగిన కూరగాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మెత్తబడే వరకు వేయించాలి ►పెసర పప్పు జత చేసి, మరోమారు వేయించాలి ►ఓట్స్ జత చేయాలి ∙పసుపు, మిరప కారం వేసి, బాగా కలిపి, రెండున్నర కప్పుల నీళ్లు జత చేయాలి ►ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ►నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►మూత తీసి కొత్తిమీరతో అలంకరించి, రైతా లేదా ఏదైనా ఊరగాయతో వేడివేడిగా అందించాలి. (ఈ విధంగా జొన్నలు, సజ్జలు, రాగులతో కూడా తయారుచేసుకోవచ్చు) తామర గింజలు – గోధుమరవ్వ ఖిచిడీ కావలసినవి: తామర గింజలు – పావు కప్పు; గోధుమ రవ్వ – అర కప్పు.; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 8; కొత్తిమీర – చిన్న కట్ట; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; జీలకర్ర – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను తయారీ : ►ముందుగా రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►రవ్వ వేసి బాగా కలియబెట్టి ఉడికించాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి వేయించాలి ►ఉప్పు, నిమ్మ రసం జత చేయాలి ►ఒక పాత్రలో ఉడికించిన రవ్వ, వేయించిన మసాలా మిశ్రమం వేసి బాగా కలపాలి ►చివరగా తామర గింజలు జత చేసి కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ ఖిచిడీ కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు – మూడు కప్పులు (మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి) ; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి ; పాలు – ఒక కప్పు; పంచదార – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి ►స్వీట్‌కార్న్ ముద్ద వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి ►పాలు, పంచదార, ఉప్పు, పావు కప్పు నీళ్లు జత చేసి, సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు కార్న్ మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి ►నిమ్మ రసం జత చేసి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. సెనగ పప్పు ఖిచిడీ కావలసినవి: బాస్మతి బియ్యం – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – అర కప్పు; ఇంగువ – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; నూనె లేదా నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ►పచ్చి సెనగ పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి లేదంటే వేడి నీళ్లలో అర గంట సేపు నానబెట్టాలి ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి అర గంట సేపు నానబెట్టాలి ►కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక, మిరప కారం, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి ►సెనగ పప్పు జత చేసి బాగా కలిపి, ఒక కప్పుడు నీళ్లు పోసి, మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి (పప్పు పొడిపొడిలాడేలా ఉడికించాలి) ►బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిగా పొడిపొడిలా ఉండేలా ఉడికించాలి ►ఉడికించిన పదార్థాలను ఒక పాత్రలోకి తీసి కలపాలి ►ఆనియన్ రైతాతో లేదా సాంబారుతో అందిస్తే రుచిగా ఉంటుంది. నాన్–వెజ్ అవధి గోష్ కుర్మా కావల్సినవి: మటన్ ముక్కలు – 250 గ్రా.లు; దాల్చిన చెక్క – చిన్నముక్క; లవంగాలు – 6; యాలకులు – 6; చిరోంజి పప్పు – 3 టేబుల్ స్పూన్లు; బాదంపప్పు (నానబెట్టి, పొట్టు తీయాలి) – పావు కప్పు; నెయ్యి – 6 టేబుల్ స్పూన్లుక; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్; కారం – టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; గరం మసాలా – టీ స్పూన్; పచ్చిమిర్చి – 3 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ తరుగు – ముప్పావు కప్పు; రోజ్ వాటర్ – టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రం చేసి పక్కన ఉంచాలి ►తగినన్ని నీళ్లు పోసి చిరోంజిçపప్పు, బాదంపప్పు వేసి, పది నిమిషాలు ఉడికించి, మెత్తగా నూరి పక్కన ఉంచాలి ►మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి ►మటన్ ముక్కలు వేసి 5–6 నిమిషాలు ఉడికించాలి. దీంట్లో కప్పు టొమాటో గుజ్జు కలిపి ఉడికించి, బాదాంపప్పు మిశ్రమం, కారం, ఉప్పు, కప్పు నీళ్లు పోసి, సన్నని మంట మీద ఉడికించాలి ►చివరగా రోజ్ వాటర్, గరం మసాలా వేసి మరికొన్ని నిమిషాలు ఉంచి, మటన్ ముక్క ఉడికిందా లేదా సరిచూసుకోవాలి ►వేడి వేడిగా పులావ్ లేదా పరాటాలోకి వడ్డించాలి. రొయ్యల కూర కావల్సినవి: రొయ్యలు – పావుకేజీ; నూనె – 3 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి – అర టీ స్పూన్; అల్లం – టీ స్పూన్; ఉల్లిపాయ – 1 (తరగాలి); పసుపు – పావు టీ స్పూన్; కరివేపాకు – రెమ్మ; ఉప్పు – తగినంత; పేస్ట్ కోసం.. జీలకర్ర – టీ స్పూన్; కొబ్బరి తరుగు పాలు – అర కప్పు; మిరియాలు – 15; కారం – టీ స్పూన్; వెనిగర్ – అర టీ స్పూన్; అల్లం – అర టీ స్పూన్; వెల్లుల్లి – అర టీ స్పూన్ తయారీ: ►ఉల్లిపాయలను, వెల్లుల్లిని గ్రైండ్ చేసి పేస్ట్ కోసం తీసుకున్న దినుసులన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి. దీంట్లో వెనిగర్ కలపాలి ►రొయ్యలను శుభ్రపరచి, కడాయిలో నూనె వేసి వేడి చేయాలి ►దీంట్లో వెల్లుల్లి వేయించి, తరిగిన ఉల్లిపాయలు వేయాలి. కరివేపాకు, నూరిన మిశ్రమం కూడా కలపాలి ►దీంట్లో రొయ్యలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి. సీమకోడి వేపుడు కావల్సినవి: బోన్‌లెస్ చికెన్ – 200 గ్రాములు; అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; నిమ్మకాయ – సగం ముక్క; గరం మసాలా – అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి – టీ స్పూన్; కారం – టీ స్పూన్; మైదా – టీ స్పూన్; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెమ్మ; నూనె – తగినంత; పసుపు – అర టీ స్పూన్ తయారీ: ►చికెన్‌ను కడిగి, వడకట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మకాయ రసం పిండి కలిపి 5 నిమిషాలు పక్కనుంచాలి. ►తర్వాత చికెన్‌లో కారం, పసుపు, గరం మసాలా, మొక్కజొన్నపిండి, మైదా.. వేసి కలపాలి. ►కడాయిలో తగినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చికెన్ ముక్కలను బాగా వేయించాలి. -
ఆక్వా సాగులో నష్టాలెందుకు వస్తున్నాయ్?
ఈ చిత్రంలో వ్యక్తి.. సతీష్. కృష్ణా జిల్లా బందరు మండలంలో 20 ఎకరాల విస్తీర్ణంలోని చెరువుల్లో వనామీ సాగు చేస్తున్నాడు. ఎకరానికి లక్ష చొప్పున 20 లక్షల రొయ్యి పిల్లలు వదిలాడు. గత మూడు రోజులుగా వాతావరణ మార్పులతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఆక్సిజన్ లోపించి రొయ్య పిల్లలు చెరువుల పై భాగానికి వచ్చేశాయి. ఇది గమనించి అప్పటికప్పుడు ఎకరానికి కిలో చొప్పున 20 కిలోల ఆక్సిజన్ బిళ్లలు చల్లడంతో రొయ్యి పిల్లలు బతికిపోయాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పిల్లలకు వెచ్చించిన రూ.6 లక్షలు నష్టపోవాల్సి వచ్చేది. ఇది.. ఆక్వా రైతు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించే ఘటన. ఈ చిత్రంలో వ్యక్తి.. కల్లూరు బాబు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరులో రొయ్యల సాగు చేస్తున్నాడు. ఒక ఎకరా చెరువులో రూ.45 వేలు ఖర్చు చేసి లక్ష రొయ్య పిల్లలను వదిలాడు. అప్పటి నుంచి రొయ్యలు పట్టే వరకూ కరెంట్ బిల్లు రూ. 50 వేలు వచ్చింది. రొయ్యలకు రెండు టన్నుల ఫీడ్ వాడాడు. దీనికి రూ.1.60 లక్ష అయింది. అలాగే చెరువులో ఆక్సిజన్ కోసం ఏరేటర్స్, జనరేటర్‌కు అద్దె, దాని ఇంధనం, కాపలాదారు కూలీకి రూ.50 వేలు ఖర్చు చేశాడు. ఇలా అన్నిటికి కలిపి రూ.3.5 లక్షలు వ్యయమైంది. దిగుబడి.. 80 కౌంట్ రొయ్యలు టన్ను వచ్చింది. వాటిని విక్రయించగా రూ. 1.90 లక్షల రాబడి వచ్చింది. దీంతో రూ.1.15 లక్షల నష్టం వాటిల్లింది. ఇవి.. సతీష్, కల్లూరు బాబు బాధలు మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులందరూ ఇలాంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా సాగులో రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, మచిలీపట్నం: డాలర్ల పంటగా పిలిచే ఆక్వా రంగంలో ఎన్నో కన్నీటి కష్టాలు ఉన్నాయి. సాగు ప్రారంభం నుంచి దిగుబడి వరకూ రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటేనే పంట చేతికి దక్కేది.. లేకపోతే తీవ్ర నష్టాలు తప్పవు. ఆక్వా సాగుకు వైరస్ సోకడంతోపాటు ధరలు తగ్గిపోతే నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సిందే. రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆక్వా రంగం విస్తరించి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో అధికారికంగా, 1.20 లక్షల ఎకరాల్లో అనధికారికంగా సాగు జరుగుతోంది. సీడ్ నుంచే కష్టాలు ప్రారంభం చెరువును బాగుచేసి రొయ్య పిల్లలు (సీడ్) వేయడం నుంచి ఆక్వా సాగు ప్రారంభమవుతుంది. చెరువు లోతును బట్టి లక్ష నుంచి లక్షన్నర వరకు పిల్లలను వదులుతారు. పిల్లల్ని వదిలిన క్షణం నుంచి ప్రతిరోజూ చెరువు వద్ద అప్రమత్తంగా ఉండాలి. రోజూ మూడు, నాలుగు పర్యాయాలు వాటికి మేత (ఫీడ్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కపూట మేత ఇవ్వకపోయినా రొయ్య దిగుబడిపై ప్రభావం పడుతుంది. రాత్రిళ్లు సైతం పిల్లల పరిస్థితిని పరిశీలిస్తుండాలి. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణ పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక ఉష్ణోగ్రతలు, శీతల వాతావరణంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి పిల్లలు ఎక్కువగా చనిపోతుంటాయి. ఈ సందర్భంలో ఆక్సిజన్ బిళ్లలను ఎకరానికి కిలో చొప్పున చల్లాలి. ఏరేటర్లు క్రమంగా తిరుగుతున్నాయో? లేదో? గమనిస్తుండాలి. ఎకరం చెరువులో లక్ష వరకు పిల్లలకు రూ.30 నుంచి రూ.40 వేలు, మేత (ఫీడ్), మందులు, చెరువు లీజుకు మొత్తం రూ.4–5 లక్షలు వెచ్చించాలి. ఎకరం చెరువుకు విద్యుత్ బిల్లు నెలకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు వస్తుంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే ఏరేటర్ను వినియోగించాల్సి ఉంటుంది. ఎకరానికి రెండు ఏరేటర్లు వినియోగిస్తారు. అంటే.. రోజుకు రూ.500 డీజిల్ రూపంలో అదనపు భారం పడుతోంది. పంట దిగుబడి ఆశించిన మేర అందితేనే లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హేచరీల నుంచి నాసిరకం పిల్లలు దిగుమతి అవుతుండటంతో లక్ష పిల్లలను చెరువులో వేస్తే 30 నుంచి 40 శాతం వరకు చనిపోతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుస్థితి. వైరస్‌లతో తీవ్ర నష్టం వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో వైరస్లు (వైట్‌స్పాట్, విబ్రియో), ఈహెచ్‌పీ (ఎండ్రోజోవన్ హెపటోపినై) అనే ప్రొటోజోవా విజృంభిస్తున్నాయి. వీటి నియంత్రణకు మందులు, మినరల్స్ చెరువులో చల్లాల్సి ఉంటుంది. లేని పక్షంలో రొయ్యల్లో నాణ్యత లోపిస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వెనామీ రొయ్యలు గతేడాది 30 కౌంట్ (కిలోకి 40 రొయ్యలు) రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.380కు మించడం లేదు. గతేడాదితో పోల్చితే టన్నుపై రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకూ ధరలు పడిపోయాయి. పంట బాగా వచ్చిందంటే.. ఎకరానికి టన్ను నుంచి టన్నున్నర దిగుబడి వస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే రాబడి రూ. 5–6 లక్షల మధ్య ఉంటుంది. పెట్టుబడి రూ.4–5 లక్షల వరకు అవుతోంది. వ్యయప్రయాసల కోర్చి పగలనక, రాత్రనక పనిచేస్తే.. మూడు నెలల కష్టానికి కేవలం రూ.లక్ష ఆదాయం మాత్రమే లభిస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏదైనా తేడా వస్తే.. పెట్టుబడి మొత్తం బూడిదలో పోసినట్లే. 60 కౌంట్ వరకు రొయ్యి పెరిగితే.. పెద్దగా నష్టం లేకుండా పెట్టుబడులు అయినా వస్తాయి. కౌంట్ 60 దాటితే... రైతు నష్టపోయినట్లే. కౌంట్ 100 దాటితే... పెట్టుబడి దాదాపు పోయినట్లే. 100 కౌంట్ దాటితే ఎగుమతికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. స్థానికంగా అమ్ముకోవాల్సిందే. స్థానికంగా విక్రయిస్తే పెద్దగా ధరలు ఉండవు. రొయ్యలకు దేశీయంగా పెద్దగా ధర వచ్చే మార్కెటింగ్ లేదు. అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన కొనుగోలుదారులు సిండికేటై ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు. గత పక్షంలో ధరల పతనం ఇలా.. పక్షం క్రితం 100 కౌంట్ రొయ్యలు టన్ను ధర రూ. 2.30 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.2 లక్షలే ఉంది. అలాగే 90 కౌంట్ టన్ను రూ.2.50 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.2.20 లక్షలే పలుకుతోంది. ఇలా ప్రతి కౌంట్‌పై టన్నుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ధరలు పతనం అయ్యాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పతనమవుతాయనే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆక్వా రైతుల డిమాండ్లు ఇవీ.. ►రైతుల చేతికి పంట వచ్చే సమయానికి వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. నెక్.. రోజూ కోడిగుడ్డు ధరలను ప్రకటించినట్టే దేశీయంగా, అంతర్జాతీయంగా రొయ్యల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి. ►రొయ్యల మందులు, మేతలు, రొయ్య పిల్లల ఉత్పత్తి మీద దేశంలో ఎలాంటి నియంత్రణ లేదు. నాణ్యత లేనివి మార్కెట్లోకి రాకుండా ప్రభుత్వం నియంత్రించాలి. నాణ్యత లేని సరుకు అమ్మితే చర్యలు తీసుకొనే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ►నష్టాల పాలవుతున్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రొయ్య పిల్లల నాణ్యత చాలా ముఖ్యం రొయ్యల సాగులో రొయ్య పిల్లల నాణ్యత చాలా ముఖ్యం. నాణ్యత లేని పిల్లలు మార్కెట్లోకి వస్తున్నాయి. తల్లి రొయ్యకు కనీసం 100 రోజులు ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని తీసుకుని మన ప్రాంతానికి అలవాటుపడేలా మరో 20–30 రోజుల పాటు హేచరీల్లో వేయాలి. ఇక్కడి నీరు, వాతావరణం, నేలను అలవాటు చేసిన తర్వాత చెరువులో వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. – పట్టపు శ్రీనివాసరావు, చెరుకుమిల్లి, కృత్తివెన్ను మండలం, కృష్ణా జిల్లా ధరల తగ్గుదలతో నష్టాలు వాతావరణం అనుకూలించకపోవడం, వైట్‌కట్, వైరస్‌లతో పిల్లలు చనిపోతున్నాయి. డ్రెయిన్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉంది. నాణ్యత లేమితోపాటు దాణా ధరలు పెరగడంతో ఖర్చులు పెరిగి నష్టాలొస్తున్నాయి. – పులగం శీను, చెరుకుమిల్లి, కృత్తివెన్ను మండలం, కృష్ణా జాగ్రత్తలు పాటించాలి రొయ్యల సాగులో జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులు సాధ్యమే. నేను మూడెకరాల్లో వనామీ రొయ్యల సాగు చేసి ఇటీవల మూడున్నర టన్నుల దిగుబడిని సాధించాను. ఎకరం చెరువులో 60 వేల పిల్లలను మాత్రమే వేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. – నారాయణ, రుద్రవరం, బందరు మండలం, కృష్ణా అవగాహన ఉంటే ఆక్వా లాభదాయకం రైతుల్లో అవగాహన, వాతావరణ అనుకూలత ఉంటే ఆక్వాకల్చర్ లాభదాయకమే. అయితే కనీస మెలకువలు, అవగాహన లేక నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, భౌతిక, రసాయనిక మార్పులతో రొయ్యలు మనుగడ సాగించలేకపోవడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. చేపలు చనిపోతే నీటిలో పైకి తేలతాయి. కానీ రొయ్యలు చనిపోతే చనిపోయినట్లు కూడా తెలియదు. రొయ్య పిల్లలు చనిపోతే చెరువులో కిందకు చేరి వ్యర్థాలుగా మారి విషపూరిత రసాయనాలుగా మారతాయి. ఎగువ భాగంలో ఉండే చెరువు నీటిలో వైరస్ ఉంటే.. అది దిగువన ఉన్న చెరువులకు కూడా సోకుతుంది. దీన్ని ఆక్వా రైతులు గ్రహించలేకపోతున్నారు. లాభాలు అధికంగా వస్తాయనే ఆశతో ఎకరానికి వేయాల్సిన రొయ్యల పిల్లల సంఖ్య కంటే రెట్టింపు వేస్తున్నారు. దీంతో అవి పెరిగేందుకు చెరువు సరిపోవడం లేదు. అంతేకాకుండా కృత్రిమ ఆహారం, రసాయనిక ఆహారాలను రెట్టింపు వేస్తున్నారు. ఆహారం మొత్తం పిల్లలకు చేరకుండా సగం నీటిలో కలిసి అడుగున విషపదార్థంగా మారుతుంది. ఈ వాతావరణంలో పెరిగిన రొయ్యలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి రొయ్యలనే విదేశాలు తిప్పిపంపేస్తున్నాయి. – ఆచార్య కె.వీరయ్య, కోఆర్డినేటర్, మ్యాట్రిక్స్ ఆక్వాకల్చర్ సెంటర్, ఏఎన్‌యూ -
జలాశయాల్లోకి 4 కోట్ల రొయ్యలు
సాక్షి, హైదరాబాద్: నీలకంఠ రొయ్యల ఉత్పత్తి మత్స్యకారులకు మంచి లాభాలు తెచ్చిపెడుతుండటంతో ఈ సారి దాదాపు 4.07 కోట్ల రొయ్యలను వదిలేందుకు మత్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 23 రిజర్వాయర్లలో వీటిని వదలాల్సి ఉండగా ఇప్పటికే పలు జలాశయాల్లో వదిలారు. గతేడాది రూ.కోటి పెట్టుబడితో రొయ్యలను వదలగా ఏకంగా ఏడింతలు రూ.8 కోట్ల పైన లాభాలు రావడం విశేషం. గతేడాది పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ పథకం మత్స్యశాఖకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టింది. గత నవంబర్‌లో పైలట్ ప్రాజెక్టు కింద 11 రిజర్వాయర్లలో రూ.1.39 కోట్లతో 1.08 కోట్ల నీలకంఠ రొయ్యలను వదిలారు. ఒక్కో రొయ్య పిల్లకు రూ.1.28 చొప్పున 1.08 కోట్ల రొయ్య పిల్లలకు మొత్తం రూ.1.39 కోట్లు ఖర్చయ్యాయి. వీటికి రూ. 8.06 కోట్లు పైన లాభాలు వచ్చాయి. 10 వేల మంది మత్స్యకారులకు మంచి ఆదాయం సమకూరింది. కాగా ఈ సారి నిజాంసాగర్ ప్రాజెక్టు, సింగూర్ ప్రాజెక్టు, కడెం, ఎస్సార్ఎస్పీ, ఎల్ఎండీ, ఎగువ మానేరు, పోచారం ప్రాజెక్టు, సతనాల, మత్తడివాగు, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీ కొమురం భీం ప్రాజెక్టు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మూíసీ ప్రాజెక్టు, దిండి, కోయిల్ సాగర్, పాలేరు, వైరా, లంకసాగర్, పెద్దవాగు ప్రాజెక్టు, తాలిపేరు, ఘన్పూర్ ములుగు ప్రాజెక్టు, శనిగరం ప్రాజెక్టుల్లో రొయ్యలు వదులుతున్నారు. యూరోపియన్ దేశాలకు ఎగుమతి.. నీలకంఠ రొయ్య (స్కాంపి) నీలంరంగులో రెండు పొడువైన కాళ్లు కలిగి ఉంటుంది. 1.5 అంగుళాల సైజులో ఉండే ఈ రొయ్య పిల్లలు 4 నుంచి 6 నెలల్లో దాదాపు 100గ్రా. వరకు బరువు పెరుగుతాయి. వీటికి మార్కెట్ ధర కిలోకు రూ.240 వరకు ఉంటుంది. ఈ రొయ్యలు ఎక్కువగా యూరోపియన్ దేశాలకు ఎగుమతవుతాయి. -
స్వీట్లు, రొయ్యలంటే ప్రాణం!
న్యూఢిల్లీ: అటల్జీ మంచి భోజన ప్రియుడని వాజ్‌పేయి సన్నిహితులు, విలేకరులు గుర్తు చేసుకున్నారు. ఆయనకు స్వీట్లు, రొయ్యలంటే మహా ఇష్టమని చెప్పారు. సీనియర్ జర్నలిస్టు రషీద్ కిద్వాయ్ మాట్లాడుతూ.. ‘ప్రధానిగా ఉన్న సమయంలో ఓ అధికారిక కార్యక్రమం తర్వాత భోజనం కోసమని నేరుగా ఫుడ్ కౌంటర్ వద్దకు వెళ్లారు అటల్జీ. ఆప్పుడు ఆయన ఆహార నియమాలు పాటిస్తున్నారు. దీంతో అతని సిబ్బంది ఓ ఆలోచన చేశారు. వెంటనే అక్కడున్న బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌ను పరిచయం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ సినిమాల గురించి మాట్లాడుతుండగా.. అక్కడున్న స్వీట్లను సిబ్బంది దాచేశారు’అని చెప్పారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడి స్థానికంగా లభించే ఆహార పదార్థాలను తింటానని పట్టుబట్టేవారని అటల్జీతో పని చేసిన అధికారులు గుర్తు చేసుకున్నారు. ‘కోల్‌కతాలో పుచ్‌కాస్, హైదరాబాద్‌లో బిర్యా నీ, హలీమ్, లక్నోలో గలోటి కబాబ్స్ ఆయన తినేవారు. చాట్ మసాలా దట్టించిన పకోడాలు, మసాల టీ కాంబినేషన్ ఆయనకు భలే ఇష్టం’ అని ఓ అధికారి చెప్పారు. ‘ఎన్నోసార్లు అటల్‌జీనే స్వయంగా మాకు వండిపెట్టారు. మాంసాహారం గానీ, స్వీట్‌గానీ ఏదో ఒకటి మా కోసం వండేవారు’ ఓ జర్నలిస్టు అన్నారు. కేబినెట్ భేటీల్లో వేరుశనగలు తినేవారు ‘కేబినెట్ సమావేశాల సమయంలో అటల్జీ ఉప్పుతో దట్టించిన వేరుశనగ కాయాలు తినేవారు. ఖాళీ అయినాకొద్దీ తీసుకురమ్మనేవారు’అని అటల్జీతో పనిచేసిన ఓ సిబ్బంది చెప్పారు. ‘అటల్ తన సన్నిహితుడు లాల్జీ లాండన్‌ను లక్నోలోని చౌక్ నుంచి కబాబ్స్ తీసుకురమ్మనేవారు. కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ ఆయన కోసం ఢిల్లీ నుంచి బెడ్నీ ఆలూ, చాట్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యలు తీసుకొచ్చేవారు’అని మరో సన్నిహితుడు చెప్పారు. వాజ్‌పేయితో ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓ జర్నలిస్టు మాట్లాడుతూ.. ‘నేను చూసిన వారిలో చాలా రిలాక్స్డ్ ప్రధాని’అన్నారు. ఆయన అనారోగ్యంగా ఉన్నా కాజూ, సమోసాలు తినేవారని మరో సన్నిహితుడు చెప్పారు. -
రొయ్యలు తినొద్దు.. అది చెడ్డ ఆహారం
సాక్షి, హైదరాబాద్ : మాంసాహారంలో ప్రత్యేకంగా నిలిచే రొయ్యలను ఇకపై ముస్లింలెవరూ తినకూడదంటూ ప్రఖ్యాత ఇస్లామిక్ విద్యాసంస్థ జామియా నిజామియా ఫత్వా జారీచేసింది. ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన రొయ్యలు.. చేపజాతికి చెందినవి కావని, తేళ్లు, సాలెపురుగుల వంటి కీటకాలని ఫత్వాలో పేర్కొన్నారు. అవి అతిదుష్టమైనవి కాబట్టే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహారంగా తీసుకోరాదని ఆదేశించారు. జామియా నిజామియా ప్రధాన గురువు ముఫ్తీ మహమ్మద్ అజీముద్దీన్ ఈ మేరకు జనవరి 1న జారీచేసిన ఫత్వా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 142 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోన్న జామియా నిజామియా.. దేశంలో సుదీర్ఘకాలంగా నడుస్తోన్న ఇస్లామిక్ డీమ్డ్ యూనివర్సిటీల్లో ఒకటన్న సంగతి తెలిసిందే. ముక్రూ తహరీమ్ అంటే.. : ఇస్లామిక్ ధర్మశాస్త్రం ప్రకారం ఆహారాన్ని మూడు విధాలుగా పేర్కొంటారు. సమ్మతించిన(హలాల్), నిషేధించిన(హరామ్), హేయమైన(ముక్రూ) ఆహారం. మూడో విభాగమైన ముక్రూలో ఇంకోరెండు అంతర్విభాగాలుంటాయి. ముక్రూ(హేయమైనదే కానీ తినొచ్చు), ముక్రూ తహరీమ్(దుష్టమైనది, తినకూడదు). జామియా నిజామియా ఇచ్చిన ఫత్వాలో రొయ్యలను ముక్రూ తహరీమ్‌గా పేర్కొంది. కాగా, సంస్థ ఇచ్చిన ఆదేశాలపై ముస్లిం వర్గాల నుంచే వ్యతిరేకత వస్తుండటం గమనార్హం. రొయ్యలను నిషేధిత ఆహారంగా పేర్కొనడాన్ని పలువురు ముస్లిం విద్యావేత్తలు నిరసిస్తున్నారు. -
వంట చెరుకు
పొయ్యిలో పెట్టేది... కాదండోయ్! ప్లేట్లో పెట్టుకునేది. చెరుకును పీకండి చెరుకును ముక్కలు చేయండి చెరుకును రసం తీయండి చెరుకును పీల్చి పిప్పి చేయండి ఎంజాయ్ ఐ సే!! చెరుకు రసం రొయ్యలు కావల్సినవి రొయ్యలు పెద్దవి – 12 (పైన పొట్టు తీసి, శుభ్రపరిచినవి); చెరుకు రసం – పావు కప్పు;నిమ్మరసం – పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ; ఉప్పు తక్కువగా ఉండే సోయా సాస్ – పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ; ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్; గోధుమరంగు పంచదార – టీస్పూన్; పొట్టు తీసిన వెల్లుల్లి తరుగు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; నల్లమిరియాలు – 5;పైనాపిల్ ముక్కలు – 24 (2 అంగుళాల పరిమాణం); చెరుకు ముక్కలు – 12 (8 అంగుళాల పొడవు) తయారీ రొయ్యలను పెద్ద గిన్నెలో వేయాలి. మరో గిన్నెలో చెరుకురసం, నిమ్మరసం, సోయా సాస్, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి వేసి కలపాలి. తర్వాత దీంట్లో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఒక ప్లాస్టిక్ కవర్లో రొయ్యలను, సిద్ధం చేసుకున్న చెరుకు రసం మిశ్రమాన్ని పోయాలి. కవర్ చివరలను ముడేసి, అటూ ఇటూ తిప్పాలి.కనీసం పది–పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. దీంతో రొయ్యలకు మిశ్రమం బాగా పడుతుంది. తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసుకున్న చెరుకు పుల్లలకు ఒక పైనాపిల్ ముక్క, తర్వాత రొయ్య తర్వాత పైనాపిల్ ముక్క తర్వాత రొయ్య ఇలా గుచ్చాలి. పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేసి రొయ్యలను 3–5 నిమిషాలు వేయించాలి. నోట్: పైనాపిల్ ముక్కలు లేకుండా కేవలం రొయ్యలతోనూ ఇలా చేసుకోవచ్చు. చెరుకు రసం జ్యూస్ దోసె కావల్సినవి బియ్యం – 2 కప్పులు; మినప్పపు – కప్పు; చెరుకు రసం – కప్పు; కొబ్బరి తురుము – అర కప్పు ; బెల్లం – అర కప్పు; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ బియ్యం, పప్పు కలిపి నాలుగు గంటలు నానబెట్టాలి. నీళ్లు వడకట్టి, పిండి రుబ్బాలి. దీంట్లో నీళ్లకు బదులు చెరుకురసం, బెల్లం, కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు వేసి మరొక్కసారి రుబ్బాలి. ఈ మిశ్రమం జారుగా కలుపుకోవాలి. దోసెల పెనం పొయ్యి మీద పెట్టి వేడయ్యాక గరిటెతో పిండి తీసుకొని దోసె వేయాలి. దోసె చుట్టూ నూనె వేసి, రెండువైపులా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. తియ్యగా ఉండే ఈ దోసెను ఏదైనా సాస్ లేదా చట్నీతో సర్వ్ చేయాలి. చెరుకు రసంఅల్లం జ్యూస్ కావల్సినవి అల్లం తరుగు – టేబుల్ స్పూన్ చెరుకురసం – 5 కప్పులు పంచదార – అర కప్పు నిమ్మరసం – అర టేబుల్ స్పూన్ఉప్పు – అర టీ స్పూన్ లేదా తగినంత తయారీ ఒక గిన్నెలో పై పదార్థాలన్నీ వేసి కలపాలి. వెడల్పాటి అల్యూమినియమ్ పాత్రలో ఈ మిశ్రమం పోసి, డీప్ ఫ్రిజ్‌లో కనీసం 5 గంటలసేపు ఉంచాలి. తర్వాత బయటకు తీసి, మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసి, గ్లాసులో పోసి వెంటనే సర్వ్ చేయాలి. చిలగడ దుంప చెరుకురసం హల్వా కావల్సినవి చిలగడదుంపలు – 2; చెరుకు రసం – 2 కప్పులు; పంచదార – టేబుల్ స్పూన్; నెయ్యి – 6టేబుల్ స్పూన్లు; యాలకులు – 4 (పొడి చేయాలి); కుంకుమ పువ్వు – 5 రేకలు; జీడిపప్పు – 10 పలుకులు తయారీ చిలగడ దుంపలను ఉడికించాలి. వేడి తగ్గాక పై తొక్క తీసి, గరిటెతో గుజ్జు చేయాలి. మూకుడు పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో జీడిపప్పులు వేసి వేయించి, తీయాలి. అదే నూనెలో చిలగడ దుంప గుజ్జు వేసి 3–4 నిమిషాలు కలపాలి. దీంట్లో పంచదార, చెఱకురసం పోసి, కలిపి 4–5 నిమిషాలు ఉడికించాలి. దీంట్లో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి. మిశ్రమం గట్టిగా అయ్యాక పైన కొద్దిగా నెయ్యి , జీడిపప్పులు వేసి మూత పెట్టాలి. ఈ హల్వాని వేడిగానూ, చల్లగానూ వడ్డించవచ్చు. చెరుకురసం ఖీర్ కావల్సినవి చెరుకు రసం – లీటరు బియ్యం – పావు కేజీ పాలు – పావు కప్పు జీడిపప్పు, బాదంపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు తయారీ బియ్యం కడిగి, అర గంటసేపు నానబెట్టాలి. మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టి వేడి చేసి దీంట్లో చెరుకురసం పోయాలి. చెరుకు రసం మరిగించి, దీంట్లో పాలు పోసి కలపాలి. పైన నురుగులాగ వచ్చిందాన్ని తీసేయాలి. దీంట్లో బియ్యం వడకట్టి మరుగున్న చెరుకు రసంలో పోసి కలపాలి. సన్నని మంట మీద బియ్యం ఉడికేంతవరకు ఉంచాలి. మిశ్రమం ఉడికి చిక్కగా అయ్యాక దీంట్లో టేబుల్ స్పూన్ నెయ్యి, వేయించిన జీడిపప్పు, బాదంపప్పు పలుకులు వేసి మూత పెట్టి దించాలి. తర్వాత స్వీట్ కప్పులోకి తీసుకొని సర్వ్ చేయాలి. చెరుకు రసం వడ కావల్సినవి చెరుకు రసం – కప్పు ఆవపొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత మినపప్పు – పావు కప్పు (నానబెట్టాలి) నూనె – వేయించడానికి తగినంత నెయ్యి – టేబుల్ స్పూన్ జీలకర్ర – టీ స్పూన్ ఇంగువ – పావు టీ స్పూన్ కారం – టీ స్పూన్ తయారీ ఒక గిన్నెలో చెరుకు రసం, నాలుగు కప్పుల నీళ్లు, ఆవపొడి వేసి, ఉప్పు వేసి కలపాలి. సూర్యకాంతి అంటే ఎండ తగిలేలా ఒక నాలుగు గంటలు ఉంచాలి. నాలుగు గంటలు నానబెట్టిన మినపప్పును నీళ్లు వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో ఉప్పు కలపాలి. కడాయిలో నూనె పోసి వేడయ్యాక మినప్పిండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని నూనెలో వేసి వేయించాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. ఈ వడలు చల్లారాక సిద్ధంగా ఉంచుకున్న చెరుకు రసంలో వేయాలి. మరొక మూకుడు పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, ఇంగువ, కారం వేసి కలిపి చెరుకు రసంలో కలపాలి. దీనిని వెంటనే సర్వ్ చేయాలి. చెరుకు రసం చికెన్ డ్రమ్ స్టిక్స్ కావల్సినవి చెరుకు ముక్కలు – 8 చికెన్ బ్రెస్ట్ – పావు కేజీ (ఖీమా చేయాలి) బ్రెడ్ క్రంబ్స్ – కప్పు వెల్లుల్లి తరుగు – పావు టీ స్పూన్ అల్లం తరుగు – పావు టీ స్పూన్ సోయాసాస్ – 2 టేబుల్ స్పూన్లు పైనాపిల్ జ్యూస్ – టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత మిరియాల పొడి – తగినంత తయారీ చెరుకు ముక్కల చివరకు కట్ చేసి, తీయాలి. తర్వాత చెరుకు ముక్కలను మందపాటి పుల్లలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్ ఖీమా, వెల్లుల్లి, అల్లం, పంచదార, సోయా సాస్, పైనాపిల్ రసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. పాన్ మీద నూనె వేసి వేడి చేయాలి. చికెన్ మిశ్రమం చెరుకు ముక్కకు లాలీపాప్‌లా అతకాలి. ఈ చికెన్ పట్టీలను పాన్ మీద ఒక్కోవైపు 5–6 నిమిషాలు వేయించుకోవాలి. -
రొయ్యల ఘాటు.. చేపకు చేటు
ఆకివీడు : చేపలపై రొయ్యలు ఉప్పు ఘాటు పంజా విసురుతున్నాయి. నిన్నటివరకు వరి చేలకే పరిమితమైన ఉప్పు శాతం ఇప్పుడు చేపల చెరువుల్నీ నిండా ముంచుతోంది. మొత్తానికి రొయ్యల చెరువులు అటు వరి సాగును.. ఇటు చేపల పెంపకాన్ని తీవ్రంగా ఆటంకపరుస్తున్నాయి. రొయ్యల సాగు విస్తరించడంతో నీటిలో సెలినిటీ (ఉప్పు) శాతం పెరిగిపోతోంది. ఇది చేపల చెరువుల్లోకి ప్రవేశించడంతో మత్స్యాలు ఎదుగుదల లేక గిడసబారిపోతున్నాయి. టన్నుల కొద్దీ మేత వేసిపెంచినా చెరువుల్లోని చేపలు తగిన స్థాయిలో ఎదగక దిగుబడి తగ్గిపోతోంది. ఫలితంగా చేపల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉప్పు ముప్పే కారణం అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించిది. ఇందులో 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. రొయ్యల చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనేది అధికారిక లెక్కలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వడం.. రొయ్యల చెరువుల్లోని నీటిని పంట కాలువలు, మురుగు బోదెల్లోకి విచ్చలవిడిగా వదిలేయడం పరిపాటిగా మారింది. రొయ్యల చెరువుల్లో ఉపయోగించే నీటిలో ఉప్పు (సెలినిటీ) శాతం 20 వరకూ ఉంటుంది. ఈ నీరు కాలువల్లోకి చేరడం వల్ల అందులోనూ సెలినిటీ పెరిగిపోతోంది. చేపలు మహా అయితే 2నుంచి 4శాతం లోపు సెలినిటీని మాత్రమే తట్టుకోగలవు. చేపల చెరువుల్లోకి చేరే నీటిలో ఈ శాతం 10నుంచి 15 శాతం వరకు ఉండటంతో తట్టుకోలేకపోతున్నాయి. దీనివల్ల రోగాల బారిన పడటం, పెరుగుదల క్షీణించడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఫలితంగా దిగుబడి గణనీయంగా పడిపోయి చేపల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొల్లేరు తీర ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొల్లేరు సరస్సులోకి సముద్రపు నీరు ప్రవేశించడం, మరోవైపు రొయ్యల చెరువుల నీరు పంట, మురుగు కాల్వల్ని ముంచెత్తడంతో చేపల పెంపకం ఇబ్బందిగా మారింది. సెలినిటీ వల్ల చేపల్లో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోయి వ్యాధులు విజృంభిస్తున్నాయి. తెల్లమచ్చ, శంకు లోపం, డీఓ (నీటిలో ఆక్సిజ¯ŒS శాతం) తగ్గిపోవడం వంటి పరిస్థితులతో చెరువుల్లోని చేపలు చనిపోతున్నాయి. ఏడాదిపాటు టన్నులకొద్దీ మేతలు వేసి పెంచినా చేపల్లో ఎదుగుదల ఉండటం లేదు. 100 గ్రాముల బరువైన చేపను పెంచడం మొదలుపెడితే 6 నెలలకు కేజీ వరకు పెరగాలి. కనీసం అరకేజీ కూడా పెరగటం లేదని చెబుతున్నారు. ఎదుగుదల క్షీణిస్తోంది ఉప్పు శాతం పెరిగిపోవడంతో చేపల ఎదుగుదల క్షీణిస్తోంది. 100 గ్రాముల చేప పిల్లల్ని పెంపకం నిమిత్తం చెరువుల్లో వేస్తే 6 నెలల్లో కేజీకి పైబడి ఎదుగుదల ఉండాలి. ఆ పరిస్థితి లేదు. కట్రెడ్డి మోహన్, ఆక్వా రైతు, పెదకాపవరం రొయ్యల చెరువుల నీటితో తీవ్ర ఇబ్బంది ఒకప్పుడుయ కొల్లేరు సరస్సు ప్రాంతంలోని చెరువుల్లో చేపలు పెంచితే ఎదుగుదల బాగుండేది. త్వరితంగా ఎదిగి రైతుకు లాభాలు వచ్చేవి. ఉప్పునీటి ప్రభావంతో చేపల పెంపకం తీవ్ర నష్టానికి గురిచేస్తోంది. మేత ఎంత వేసినా చేపల్లో ఎదుగుదల కనిపించడం లేదు. కొల్లి రాంబాబు, కొల్లేరు రైతు, కొల్లేటి కోట సెలినిటీ సున్నా ఉండాలి చేపల చెరువుల్లోని నీటిలో సెలినిటీ శాతం సున్నా ఉండాలి. నీటిలో ఉప్పు శాతం ఏ మాత్రం పెరిగినా చేపల ఎదుగుదలలో లోపం వస్తుంది. వ్యాధులొస్తాయి. రైతు ఆర్థికంగా నష్టపోతాడు. మంచినీరు లభించక చేపల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.రామారావు, ఆక్వా ల్యాబ్ టెక్నీషియన్, ఆకివీడు -
ఆక్వా రైతుల కోసం నూతన ఉత్పత్తులు
-
వైట్‌గట్‌పై అప్రమత్తంగా ఉండాలి
కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంసీ ఓబయ్య నెల్లూరు రూరల్ : రొయ్యలకు సోకే వైట్‌గట్ వైరస్‌పై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంసీ ఓబయ్య సూచించారు. ముత్తుకూరు మండలం పొట్టెంపాడు లో ఎన్ఎఫ్డీబీ సహకారంతో కేవీకే ఆధ్వర్యంలో రొయ్యల సాగు, సాంకేతిక ప్రక్రియలపై ఆక్వా రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కల్చర్ మొదలు పెట్టిన 20–30 రోజులకు వైట్‌గట్ లక్షణాలు కనబడతాయన్నారు. ఈ వైరస్ సోకిన ఐదు రోజులకే రొయ్య చనిపోతుందన్నారు. కల్చర్ ప్రారంభానికి ముందుగా చెరువులను ఎండబెట్టాలని, అలా చేయకపోవడంతో బాక్టీరియా లేదా ఫంగస్, నీటి టర్బిడిటి ఎక్కువగా ఉండటం ముఖ్య కారణాలన్నారు. రైతులు చెరువుల తయారీ పద్ధతుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి టర్బిడిటిని రోజుకు 20 శాతం నీటితో మార్పిడి ద్వారా వాంఛనీయ స్థాయిలో నిర్వహించుకోవాలన్నారు. వాటితో పాటు వైట్గట్కు ప్రోబయోటిక్స్ వాడుతూ ఉంటే కొంత వరకు నియంత్రించవచ్చన్నారు. కేవీకే మత్స్యవిభాగ శాస్త్రవేత్త ఝాన్సీలక్ష్మీబాయి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జేఆర్ఎఫ్ వెంకటేశ్వర్లు, ఆక్వా రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
నాసి సీడ్ వలలో.. వెనామీ సాగు
* పుట్టగొడుగుల్లా వెలస్తున్న అనధికార హేచరీలు * నాణ్యత లేని రొయ్యపిల్లలకు వైరస్ వ్యాధులు * పెద్ద ఎత్తున నష్టపోతున్న ఆక్వా రైతులు * అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినతి కాట్రేనికోన: కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) అనుమతులు లేకుండా తీరం వెంబడి పుట్టగొడుగుల్లా వెలసిన వెనామీ హేచరీల్లో ఉత్పత్తవుతున్న నాణ్యత లేని రొయ్య సీడ్ (పిల్లలు) రైతులను దెబ్బ తీస్తోంది. వెనామీ రొయ్య ధర బాగున్నా సీడును యధేచ్ఛగా ఉత్పత్తి చేస్తున్నారు.రైతులు ఆశించిన స్థాయిలో వెనామీ రొయ్యలు ధరలు ఉన్నప్పటికీ సీడ్ నాసిరకం కావడంతో వైరస్ వ్యాధులు సోకి, నష్టాల పాలవుతున్నారు. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ పరిధిలో 2016కి సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, ఒడిశా, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో 254 వెనామీ హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతి ఉంది. అనుమతి ఉన్న హేచరీలకు వాటి సామర్థ్యాన్ని బట్టి 400 నుంచి 10 వేలకు పైగా వ్యాధిరహిత (ఎస్పీఎఫ్) తల్లి రొయ్యలను సీఏఏయే సరఫరా చేసింది. రాష్ర్టంలో 189 హే చరీలకు మాత్రమే అనుమతి ఉండగా నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలో అనధికారిక హేచరీలు విస్తృతంగా ఉన్నాయి. తీరం వెంబడి ఉన్న హేచరీల్లో సగానికి పైగా సీఏఏ అనుమతి లేనివే. జిల్లావ్యాప్తంగా తీరంలో 200లకు పైబడి హేచరీలుండగా 63 హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 15 హేచరీలుండగా అల్లవరం మండలంలోని ఐదింటికే అనుమతి ఉంది. వెనామీ రొయ్యల పెంపకం చెరువులు, హేచరీలకు సీఏఏతో పాటు సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ అనుమతి తప్పనిసరి. అనుమతికి సంబంధించి కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీలో మ త్స్యశాఖ డీడీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయశాఖ అధికారులు సభ్యులుగా ఉంటా రు. ఈ కమిటీ పరిశీలన అనంతరం సంబంధిత అధికారులు పర్యవేక్షించి నిబంధనల ప్రకారం ఉంటే అనుమతి ఇస్తారు. సీడ్ నాసిదైనా రేటు ఎక్కువే.. మత్స్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 6 వేల హెక్టార్లలో వెనామీ సాగు జరుగుతోంది.అనుమతులు లేకుండా అనధికారికంగా మరొక 4 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నట్టు అంచనా. సీఏఏ అనుమతులు లేని హేచరీలతో పాటు అనుమతి ఉన్న హేచరీలు కూడా ఒక అనుమతితో మరికొన్ని ఏర్పాటు చేసి, స్థానికంగా దొరికే తల్లిరొయ్యల తోనే సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారుు. సీఏఏ అనుమతి ఉండి , నిబంధనల ప్రకారం నాణ్యైమైన రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేస్తున్న హేచరీలు పిల్లను 35 పైసల నుంచి 40 పైసల వరకు విక్రయిస్తుంటే అనుమతులు లేని హేచరీలు కూడా అదే ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారుు. అనుమతులు లేని హచరీల్లో నాసిరకం సీడ్ ఉత్పత్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వైరస్ రహిత సీడ్‌ను అందించేలా చూడాలి సీఏఏ అనుమతులు లేని హేచరీలు ఉత్పత్తి చేస్తున్న నాణ్యత లేని రొయ్య సీడు ఎదుగుదల లేక, వైరస్ వ్యాధులుతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నాం. వైరస్ రహిత ఎస్పీఎఫ్ సీడ్‌నే హేచరీలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. - భూపతిరాజు సుబ్రమణ్యంరాజు(బులిరాజు), రైతు, ఎదుర్లులంక అనుమతి ఉన్న హేచరీల్లోనే సీడ్ తీసుకోవాలి జిల్లాలో 63 హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతులు ఉండగా 80 హేచరీలకు అనుమతులు లేవు. 20 హేచరీలు నిర్మాణంలో ఉన్నట్టు గుర్తించాం. అనుమతులు లేకుండా సీడ్ ఉత్పత్తి చేయడం నేరం. అనుమతులు లేని హేచరీలు దరఖాస్తు చేసుకోవాలని, పాత హేచరీలు రెగ్యులర్ చేసుకోవాలని నోటీసులు జారీ చేశాం. సీఏఏ అనుమతి ఉన్న హేచరీల నుంచే రైతులు సీడ్ తీసుకోవాలి. - టి.కళ్యాణం, మత్స్యశాఖ డిప్యూటీ డెరైక్టర్ -
కుళాయి నీటిలో వానపాములు, రొయ్యపిల్లలు!
కరప (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా కరప మండలం ఎస్వీపేటలోని వీధి కుళాయి నుంచి నీటితోపాటు వానపాములు, రొయ్యపిల్లలు వచ్చాయి. తాళ్లరేవు మండలం జి.వేమవరంలోని సామూహిక రక్షిత నీటి పథకం నుంచి ఆరు గ్రామాలకు మంచి నీరు సరఫరా అవుతుంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం విడుదలైన నీటిని కరప మండలం ఎస్వీపేట వాసులు పట్టుకుంటుండగా వానపాములు, రొయ్య పిల్లలు వచ్చాయి. దీంతో జనం ఆందోళన చెందారు. కొద్దిసేపటి తర్వాత శుభ్రమైన మంచి నీరు రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు రంగంలోకి దిగారు. మంచి నీటి పథకం నిర్వహణను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. -
రొయ్యో.. మొర్రో!
భీమవరం: మండుతున్న ఎండలకు వనామి రొయ్య ఎదురీదుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చెరువుల్లోని రొయ్యలు విలవిల్లాడుతున్నాయి. దీంతో ఆక్వా రైతులకు ప్రస్తుత పరిస్థితి దడపుట్టిస్తోంది. ఆక్వా సాగు అధికంగా ఉండే ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 45వేల ఎకరాల్లో వనామి రొయ్యలు సాగు చేస్తున్నారు. పదిహేను రోజులుగా ఉష్ణోగ్రత తీవ్రం కావడంతో చెరువుల్లోని నీళ్లు వేడెక్కి రొయ్యలు తేలియాడుతున్నాయి. వనామి రొయ్యలకు వైట్కాట్ (తెల్లమచ్చ) వ్యాధి సోకి మేత తినలేక కళ్లు తేలే సి మృత్యువాత పడుతున్నాయి. ఐదారు రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వా చెరువుల్లో ఎండ దెబ్బకు రన్నింగ్ మెటాలిటీ సిలికాం(ఆర్ఎంఎస్) వ్యాధికి గురై రోజుకు సుమారు 2వేల 500 నుంచి 3 వేల ఎకరాల్లో రొయ్యలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీంతో సరైన ధర లేనప్పటికీ రైతులు ఎంతోకొంత దక్కుతుందనే ఆశతో పట్టుబడులు సాగిస్తూ ప్రతిరోజూ 600 నుంచి 700 టన్నుల రొయ్యలను ఈ జిల్లాల నుంచి ఎగుమతి చేస్తున్నారు. అయినకాడికి అమ్ముకుంటూ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. విద్యుత్ కోతలతో పెరుగుతున్న వెతలు ఒక పక్క వేసవి ఉష్ణోగ్రతలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వనామి రొయ్యలు సాగుచేస్తున్న రైతులను విద్యుత్ కోతలు మరింత కుంగదీస్తున్నాయి. వేళాపాళాలేని విద్యుత్ కోతలతో చెరువుల్లోని ఏరియేటర్ల తిరిగే పరిస్థితి కనిపించడంలేదు. ప్రకృతితో పాటు ప్రభుత్వం కూడా తమకు సహకరించటంలేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. విద్యుత్ కోతలకు ఏరియేటర్ల తిరగక చెరువు నీటిలో ఆక్సిజన్ శాతం లోపించటం రొయ్యలకు మరో విఘాతంగా పరిణమించిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పడిపోతున్న ధర వ్యాధి భారిన పడుతున్న చెరువుల్లోని రొయ్యలను ముందుగానే పట్టుబడులు పట్టలేక, అలాగే వాటిని చెరువుల్లో వదిలేయలేక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం 40 కౌంటు కిలో రూ.350, 50 కౌంట్ రూ.300 చొప్పున ఉన్న ధరలు గిట్టుబాటు కాకపోయినా గత్యంతరం లేక తెగనమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు. -
పాలేరు నీట..బతుకు ‘వేట’
కూసుమంచి, న్యూస్‌లైన్: పాలేరు రిజర్వాయర్‌లో సోమవారం నుంచి జలపుష్పాలవేట ప్రారంభమైంది. వేకువజామునే వందలాది మంది మత్స్యకారులు జలాశయంలోకి దిగారు. చేపలు, రొయ్యల వేట సాగించారు. తొలిరోజు వేట సందర్భంగా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. పాలేరులో చేపలవేట ప్రారంభమైందని తెలుసుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది. కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం, పాలేరు, ఎర్రగడ్డ, కొత్తూరు, నర్సింహులగూడెం, కిష్టాపురం తదితర గ్రామాలకు చెందిన మత్స్యకారులతో పాటు రిజర్వాయర్ పరిసర ప్రాంతమైన నల్లగొండ జిల్లా మోతె మండలంలోని నర్సింహాపురం, అన్నారుగూడెం, ఉర్లుగొండ, నేరడవాయి, నాగాయిగూడెం, తుమ్మగూడెం గ్రామాలకు చెందిన వందలాది మంది మత్స్యకారులు వేటలో పాల్గొన్నారు. వలలకు చిక్కిన చేపలను వీరు ఒడ్డుకు తీసుకొచ్చారు. వీరి కుటుంబసభ్యులు చేపలను కాంట్రాక్టర్ వద్దకు తీసుకెళ్లి విక్రయించారు. ఒప్పందం ప్రకారం కిలో చేపలను రూ.30 చొప్పున కాంట్రాక్టర్‌కు అమ్మారు. బయటివారికి మాత్రం కిలో రూ. 50 చొప్పున విక్రయించారు. రొయ్యలు ఏ గ్రేడ్ కిలో రూ.250, బీ గ్రేడ్ 100 చొప్పున కాంట్రాక్టర్‌కు అమ్మారు. కాంట్రాక్టర్‌కు దక్కని చేప... పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యకారులు పట్టే చేపలను ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్‌కు విక్రయించాలి. ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ ఏడాది మాత్రం ఎక్కువ మొత్తం చేపలను కాంట్రాక్టర్‌కు కాకుండా బయటివారికి అమ్మారు. మొత్తం 50 టన్నుల చేపలు దొరకగా కాంట్రాక్టర్‌కు కేవలం 15 టన్నులను మాత్రమే విక్రయించారు. 30 టన్నులకు పైగా చేపలను మత్స్యకారులు బయటి వ్యక్తులకు విక్రయించారని, తమకు నష్టం మిగిల్చారని కాంట్రాక్టర్ విలేకరుల ఎదుట వాపోయాడు. తొలిరోజు జోరు.. రిజర్వాయర్‌లో తొలిరోజు వేట ఆశాజనకంగా సాగింది. సుమారు 50 టన్నుల చేపలు, పది టన్నుల వరకు రొయ్యలు మత్స్యకారుల వలలకు చిక్కాయి. రవ్వ, బొచ్చె చేపలు ఎక్కువగా దొరికాయి. రొయ్యలను ఎప్పటి కాంట్రాక్టరే కొనుగోలు చేయగా, చేపలను మాత్రం హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ కొనుగోలు చేశాడు. గతేడాది కంటే ఈ ఏడాది చేపల పరిమాణం భారీగా పెరిగింది. ఒక్కో చేప సుమారు ఐదు కిలోల వరకు తూగింది. తొలిరోజు ఒక్కో మత్స్యకారుడు చేపలు, రొయ్యల వేట ద్వారా సగటున రూ.5 వేల వరకు ఆదాయాన్ని పొందాడు. గత సంవత్సరం తొలిరోజే మత్స్యకారులు వంద టన్నులకు పైగా చేపలు పట్టడంతో ఒక్కరోజుతోనే రిజర్వాయర్‌లో అడుగంటిన విషయం విదితమే. -
రొయ్య పెంకుతో.. ప్లాస్టిక్!
రొయ్యలు తినేందుకు రుచిగా ఉండవచ్చుగానీ.. వీటితో ఇప్పుడు ఇంకో ప్రయోజనమూ చేకూరబోతోంది. ఫొటోలో కనిపిస్తున్న రంగురంగుల ప్లాస్టిక్ వస్తువులన్నీ రొయ్యల పైభాగంలోని పెంకుతో తయారయ్యాయి! సాధారణ ప్లాస్టిక్‌తో పోలిస్తే ఎంతో గట్టిగా ఉంటుంది. అంతేకాదు చాలా త్వరగా భూమిలో శిథిలమైపోతుంది. ముడిచమురు నుంచి తయారయ్యే సాధారణ ప్లాస్టిక్ వెయ్యేళ్లపాటు శిథిలం కాకుండా పర్యావరణానికి చేటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తగిన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఇప్పటికీ దీన్నే వాడుతున్నాం. హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమాని రొయ్య పెంకులతో తయారయ్యే ప్లాస్టిక్ అందుబాటులోకి వస్తే పర్యావరణ సమస్యలను అధిగమించవచ్చు. -
రొయ్య పొలుసుల నుంచి గ్రీన్ ప్లాస్టిక్!
ప్లాస్టిక్.. ఎన్నో రకాలుగా ఉపయోగపడే, అతి చవ కైన పదార్థం. ఇది ఎంత ఉపయోగకరమైనదో, పర్యావరణానికి అంత హానికరమైనది కూడా. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా భూమిలో సులభంగా కరిగిపోయే పర్యావరణ హిత ప్లాస్టిక్ తయారీ కోసం రకరకాల పద్ధతులు కనిపెడుతున్నారు. హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన విస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు కూడా తాజాగా రొయ్య పొలుసుల్లో ఉండే ఖీటోసన్ పదార్థంతో బయోప్లాస్టిక్‌ను తయారు చేశారు. ఖీటోసన్ లక్షణాలు మారిపోకుండానే దాని నుంచి ప్లాస్టిక్ లాంటి ‘ష్రిల్క్’ను తయారు చేసే పద్ధతిని వీరు ఆవిష్కరించారు. దీనితో ప్లాస్టిక్ మాదిరిగానే క్యారీబ్యాగులు, బొమ్మలు, వివిధ వస్తువులు తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రొయ్య, ఇతర క్రస్టేషియన్ జీవుల్లో, సీతాకోక చిలుక, ఇతర కీటకాల రెక్కల్లో ఖైటిన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి.. ఈ ప్లాస్టిక్ తయారీకి ముడిసరుకు కొరత ఉండదంటున్నారు. అలాగే వాడి పారేసిన కొన్ని వారాలకే ఇది ఎరువుగా మారి మొక్కల పెరుగుదలకూ తోడ్పడుతుందని చెబుతున్నారు. -
అన్వేషణం: షాక్‌కి గురిచేసే షాంఘై ఫుడ్ మార్కెట్!
ఫుడ్ మార్కెట్లో ఏముంటాయి? రకరకాల కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, రొయ్యలు, ఇతరత్రా తినుబండారాలు... ఇవేగా! కానీ మీరింతవరకూ చూసి ఉండని ఓ విచ్రితమైన మార్కెట్ షాంఘైలో ఉంది. దాన్ని చూడటం సంగతి తర్వాత... దాని గురించి వింటేనే షాకయిపోతాం మనం! షాంఘైలోని గ్వాండాంగ్ ప్రావిన్స్‌లో ఉండే ఓ ఫుడ్ మార్కెట్ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ మార్కెట్లో ప్రపంచంలో ఎక్కడా చూడలేనంత నాన్‌వెజ్ దొరుకుతుంది. ఎవరూ తినలేనన్ని రకాల మాంసాలు అక్కడ ఉంటాయి. చేపలు, రొయ్యలు, పీతలు, చికెన్, మటన్ మామూలే. కానీ వాటితో పాటు మొసలి మాంసం, ఆక్టోపస్ మాంసం, స్టార్‌ఫిష్‌లు, తేళ్లు, జైలు, పాములు, ఎలుకలు, పురుగులు... దొరకని జీవి అంటూ ఏదీ ఉండదక్కడ. పచ్చివి, ఎండబెట్టినవి అంటూ వేరు చేసి మరీ అమ్ముతుంటారు. అంతేనా! తేళ్లతో చేసిన క్యాండీలు, ఫ్రూట్ పీసెస్ బదులు చిన్ని చిన్ని పురుగులను అద్దిన ఐస్‌క్రీములు, వేయించిన ఎలుకలు... అబ్బో, తినాలే గానీ బోలెడన్ని! మనకి వినడానికే వెగటుగా ఉంటుంది కానీ... షాంఘై వారికి ఆ మార్కెట్లో దొరికే ఐటెమ్స్ అంటే మహా ప్రీతి. ఎంత ఖరీదైనా పెట్టి వాటిని కొనేసుకుంటారు. ఏమాత్రం సంకోచం లేకుండా రకరకాల జీవుల్ని వండుకుని స్వాహా చేసేస్తుంటారు. వారికవి తినడం అలవాటు మరి! మీకేమైనా వాటి మీద ఇంటరెస్ట్ ఉంటే... ఎప్పుడైనా షాంఘై వెళ్లినప్పుడు చక్కగా టేస్ట్ చేసి రావచ్చు! ఆకాశంలో చందమామ ఎంత హుందాగా కనబడుతుందో... దుబాయ్‌లోని జుమేరియా బీచ్‌లో అంతకంటే ఠీవిగా కనిపిస్తుంది బుర్జ అల్ అరబ్ హోటల్. ప్రపంచంలోని అతి ఎత్తయిన హోటళ్లలో నాలుగో స్థానంలో ఉన్న ఈ స్టార్ హోటల్ అందాన్ని వర్ణించి లాభం లేదు. స్వయంగా చూడాల్సిందే! బుర్జ అల్ అరబ్ ఏర్పాటు కోసం ముందుగా సముద్రపు నీటిలో ఓ ఆర్టిఫీషియల్ దీవిని ఏర్పరిచారు. దాని మీద హోటల్‌ను నిర్మించారు. దీని ఆకారం చాలా విచిత్రంగా ఉంటుంది. అటు పూర్తిగా అర్థ చంద్రాకారంలో కాకుండా, ఇటు పూర్తి నిటారుగా కాకుండా... ఓ విచిత్రమైన ఆకృతిలో ఉంటుంది. ఓడల రాకపోకలకు ఆటకం కలుగకుండా, ఓడల కారణంగా హోటల్‌కి నష్టం వాటిల్లకుండా ఉండేలా నిర్మించేందుకే ఈ ఆకారాన్ని ఎంచుకున్నారు. మొదట్లో దీనిని దుబాయ్ చికాగో బీచ్ హోటల్ అనేవారు. కానీ 1997లో బుర్జ అల్ అరబ్‌గా పేరు మార్చారు. జుమేరియన్ గ్రూప్ వారిది కావడంతో దీనికి జుమేరియన్ బీచ్ హోటల్ అనే పేరు కూడా వచ్చింది. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో, విలాస వంతంగా ఉండే ఈ హోటల్లో విడిది చేస్తే స్వర్గంలో ఉన్నట్టేనంటారు సందర్శకులు! టామ్ రైట్, అట్కిన్స అనే ఇద్దరు ఆర్కిటెక్టులు కలిసి ఈ హోటల్‌కు రూపకల్పన చేశారు. కెనడాకు చెందిన ఇంజినీర్ రిక్ గ్రెగరీ 1994లో దీన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. 1999లో నిర్మాణం పూర్తయ్యింది. ఆ యేడు డిసెంబర్లో హోటల్‌ను తెరిచారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఇది లక్షలాది మందిని ఆకర్షించింది. దుబాయ్‌లో ప్రతిష్టాత్మకమైన, సుందరమైన నిర్మాణాలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ హోటల్లో మొత్తం 202 సూట్స్ ఉన్నాయి. రాయల్ సూట్ పేరుతో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వీటిలో విడిది చేయాలంటే ఒక్క రాత్రికి 18,776 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, మన కరెన్సీలో దాదాపు 12లక్షల పైమాటే. మామూలు సూట్ కూడా తక్కువేమీ ఉండదు. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పదిహేను హోటళ్లలో ఒకటిగా పేర్కొంటారు. సామాన్యుడు ఇందులో అడుగు పెట్టడం కల్లే. అందుకే బడా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు మాత్రమే ఇందులోకి వెళుతుంటారు.