Prawns Recipes: How To Prepare Royyalu Mulakkada Kura In Telugu, Step-by-Step Process Inside - Sakshi
Sakshi News home page

Royyalu Mulakkada Kura In Telugu: రుచికరమైన రొయ్యల ములక్కాడ కూర.. తయారీ ఇలా!

Published Thu, May 26 2022 1:49 PM | Last Updated on Thu, May 26 2022 4:48 PM

Recipes In Telugu: How To Make Royyalu Mulakkada Kura - Sakshi

 రుచికరమైన రొయ్యల ములక్కాడతో కూర ఇలా సులువుగా తయారు చేసుకోండి.

కావలసినవి:  
►పచ్చి రొయ్యలు – పావు కేజీ(శుభ్రంచేసి నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలి)
►ములక్కాయలు – రెండు
►పచ్చిమామిడికాయ – ఒకటి(తొక్కతీసి ముక్కలు తరగాలి)
►పచ్చిమిర్చి – నాలుగు, ఉల్లిపాయ – పెద్దది ఒకటి
►కరివేపాకు – నాలుగు రెమ్మలు, ఉప్పు – రుచికి సరిపడా
►ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – అరటీస్పూను
►ఉల్లికాడలు – నాలుగు (సన్నగా తరగాలి)
►వెల్లుల్లి రెబ్బలు – మూడు (సన్నగా తరగాలి), ఎండు మిర్చి – మూడు.

కొబ్బరి పేస్టు: పచ్చికొబ్బరి తురుము – కప్పున్నర, పసుపు – టీస్పూను, కారం – అరటీస్పూను, జీలకర్ర పొడి – అరటీస్పూను. 

తయారీ..
►ముందుగా కొబ్బరి పేస్టుకోసం తీసుకున్న పదార్థాలను బ్లెండర్‌లో వేసి పేస్టులా రుబ్బుకోని పక్కనపెట్టుకోవాలి
►ఒక గిన్నెలో ములక్కాయలను ముక్కలు చేసి వేయాలి.
►దీనిలో పచ్చిమామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి పదినిమిషాలు పాటు మూతపెట్టి ఉడికించాలి
►ఈ ముక్కలన్నీ ఉడికిన తరువాత రొయ్యలను వేసి బాగా ఉడికించాలి.
►రొయ్యలు ఉడికిన తరువాత కొబ్బరి పేస్టు వేసి తిప్పి, ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి
►మరోపాన్‌లో ఆయిల్‌ వేసి వేడెక్కిన తరువాత, ఆవాలు, ఉల్లికాడల తరుగు, ఎండు మిర్చి, మిగిలిన కరివేపాకు వేసి బాగా వేయించాలి.
►ఈ తాలింపుని ఉడికించి పెట్టుకున్న రొయ్యల మిశ్రమంలో వేసి తిప్పితే, కూర రెడీ.

చదవండి: Chepala Iguru In Telugu: ఘుమఘుమలాడే చేపల ఇగురు చేసుకోండిలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement