పచ్చిరొయ్యలు, చెరకు ముక్కల కాంబినేషన్‌తో సుగర్ కేన్ ష్రింప్ ఎలా వండుకోవాలో తెలుసా?
సుగర్ కేన్ ష్రింప్ తయారీకి కావలసినవి:
►పచ్చిరొయ్యలు – అరకేజీ
►వెల్లుల్లి రెబ్బలు – మూడు
►ఉప్పు – రుచికి సరిపడా
►పంచదార – అరటేబుల్ స్పూను
►గుడ్డు తెల్ల సొన – ఒకటి
►తెల్లమిరియాలపొడి – రెండు టేబుల్ స్పూన్లు
►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు
►తొక్కతీసిన ఐదంగుళాల చెరుకు ముక్కలు – నాలుగు.
తయారీ..
►రొయ్యలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి.
►రొయ్యలు, వెల్లుల్లి, మిరియాలపొడి, పంచదార ఆయిల్‌ను బ్లెండర్‌లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి.
►ఒక గిన్నెలో గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలపాలి.
►ఈ సొనలో రొయ్యల పేస్టు వేసి చక్కగా కలిపి అరగంటపాటు రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి.
►అరగంట తరువాత రెండు చేతులకు ఆయిల్ రాసుకుని రొయ్యల మిశ్రమాన్ని నాలుగు భాగాలుగా చేసి చెరుకు ముక్కలకు చుట్టూ పెట్టాలి.
►ఈ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Egg Bhurji Balls Recipe: క్యారెట్, బీట్ రూట్ తురుము.. ఎగ్ బుర్జీ బాల్స్ తయారీ ఇలా!
Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment