Sugarcane
-
చెరుకు నేలచూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణం నానాటికీ పడిపోతుండగా, క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా చెరుకు లభ్యత లేక ఫ్యాక్టరీలు నష్టాల బాట పడుతున్నాయి. పంట గిట్టుబాటు కాక, కూలీల కొరత, ప్రభుత్వం ప్రోత్సాహం కరువు తదితర కారణాలతో రైతులు చెరుకు సాగుకు స్వస్తి చెప్పి ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలోని 12 చక్కెర కర్మాగారాలకు గాను ఇప్పటికే ప్రభుత్వ, సహకార రంగంలోని నాలుగు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.ఇలాంటి సమయంలో చెరు కు సాగులో కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ (బిందు సే ద్యం) పరికరాలను సబ్సిడీపై రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం నామమాత్రపు విస్తీర్ణానికే సబ్సిడీని పరిమితం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అవసరమైన విస్తీర్ణంలో సుమారు 30 శాతం మాత్రమే చెరుకు సాగవుతోంది. ప్రస్తుతం నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ యూని ట్లను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. చెరుకు సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి పెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడో వంతుకు చెరుకు సాగు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న 12 చక్కెర కర్మాగారాల రోజువారీ చెరుకు క్రషింగ్ సామర్థ్యం 37,950 టన్నులు. సీజన్లో ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో క్రషింగ్ చేసేందుకు 4.33 లక్షల టన్నుల చెరుకు అవసరమవుతుంది. ఇందుకోసం 65,780 హెక్టార్లలో చెరుకు పంటను సాగు చేయాల్సి ఉంటుంది. అయితే పదేళ్ల క్రితం సాగైన రీతిలో ప్రస్తుతం చెరుకు సాగవడం లేదు. 2014–15లో 49,183 హెక్టార్లలో చెరుకు సాగవగా, మధ్యలో పెరుగుతూ, తగ్గుతూ ప్రస్తుతం 20,393 హెక్టార్లకు (అధికారుల అంచనా) చేరుకుంది.నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (2015లో మూతపడింది) పరిధిలోని మూడు యూనిట్లతో పాటు నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం పూర్తి స్థాయి క్రషింగ్ సామర్థ్యానికి 14,733 హెక్టార్లలో చెరుకు సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం 951 హెక్టార్లకే పరిమితమైంది. నిజాం షుగర్స్ పరిధిలో ని మం¿ోజిపల్లి, బోధన్ యూనిట్ల పరిధిలో చెరుకు సాగు విస్తీర్ణం దాదాపు శూన్య స్థితికి చేరుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహమేదీ? చెరుకు సాగును ప్రోత్సహించాల్సిన చెరుకు అభివృద్ధి మండళ్లు (సీడీసీ) పాత్ర నామమాత్రంగా తయారైంది. సీడీసీ వాటా కింద రైతులు, ఫ్యాక్టరీలు ఒక్కో టన్నుకు రూ.4 చొప్పున చెల్లిస్తున్నాయి. చెరుకు సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో సీడీసీకి సమకూరుతున్న మొత్తం కూడా అరకొరగా ఉండటంతో రైతులు స్ప్రేయర్ల వంటి పరికరాలను కూడా సొంతంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. మరోవైపు చెరుకు సాగుకు ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న కూలీల కొరతను అధిగమించేందుకు యాంత్రీకరణ అవసరమున్నా ప్రభుత్వ ప్రోత్సాహం అందడం లేదు.‘స్టేట్ నార్మల్ స్కీమ్’కింద 2014కు పూర్వం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తదితరాలను సమకూర్చుకునేందుకు రైతులకు సబ్సిడీ కింద రూ.16 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. తర్వాతి కాలంలో బడ్జెట్ కేటాయింపులు లేక చెరుకు సాగులో యాంత్రీకరణ అటకెక్కింది. మరోవైపు చెరుకు కనీస మద్దతు ధర (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్) టన్నుకు రూ.3,150 ఉండగా, కనీసం రూ.4 వేలు ఎఫ్ఆర్పీ అన్నా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్తున్నారు.గిట్టుబాటు కాక మానేశా నేను ముప్పై ఏళ్లకు పైగా 40 ఎకరాల్లో చెరుకు సాగు చేశా. గాయత్రీ ఫ్యాక్టరీకి ఏటా రెండు వేల టన్నుల చెరుకు సరఫరా చేశా. అయితే రానురానూ పంట సాగుకు, చెరుకు నరకడానికి అయ్యే ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లేకపోవడంతో గిట్టుబాటుకాక వదిలేశా. ఇతర పంటలు వేస్తున్నా. – సాయిరెడ్డి, తిప్పాపూర్, కామారెడ్డి జిల్లాటన్నుకు రూ.500 బోనస్ ఇవ్వాలి ఎకరానికి 30 నుంచి 40 టన్నుల దిగుబడి వచ్చినా చెరుకు సాగు గిట్టుబాటు కావడం లేదు. ఒక్కో ఎకరంలో చెరుకు సాగుకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. చెరుకు సాగు విస్తీర్ణం పెరగాలంటే ఇతర పంటలకు ప్రకటించిన తరహాలోనే టన్నుకు రూ.500 బోనస్ ప్రకటించాలి. రికవరీ శాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించాలి. – రచ్చా నరసింహారావు, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా -
చెరకు గడ్డిజాతికి చెందిన తీయటి మొక్క
-
అక్కడ ఏనుగులకు టోల్ ఫీజు ఇవ్వాల్సిందే! లేదంటే..
-
పెళ్లైన నాలుగు నెలలకే ప్రియుడితో పరార్.. ఆ తర్వాత
యశవంతపుర: భర్తను వదిలేసి ప్రియునితో వెళ్లిపోయిన వివాహిత యువతి కథ విషాదాంతమైంది. చెరుకు తోటలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన హాసన్ జిల్లా హొళెనరసిపుర తాలూకా పరసనహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. పరసనహళ్లికి చెందిన కావ్య (23)కు హాసన్‌కు చెందిన యువకునితో ఏడాదిన్నర క్రితం తల్లిదండ్రులు వైభవంగా పెళ్లిచేశారు. అయితే నాలుగు నెలల క్రితం నాకు భర్త వద్దు, ప్రియుడు అవినాశ్ కావాలంటూ అతనితో కలిసి జీవనం ప్రారంభించింది. అతడు ఏ పనీ చేయకుండా తిరిగేవాడు. అప్పటినుంచి పుట్టింటి వారితో కూడా సరిగా మాట్లాడేది కాదు. నెలరోజుల క్రితం కూతురు ఎక్కడ ఉందోనని తల్లిదండ్రులు ఫోన్‌చేయగా బెంగళూరులో పని చేస్తూ హాస్టల్లో ఉంటున్నట్లు అబద్ధం చెప్పింది. చనిపోయిందని ప్రియుడే చెప్పాడు ఇంతలో మంగళవారం ఆమె ప్రియుడు హొళెనరసీపుర తహసీల్దార్ కృష్ణమూర్తి, పోలీసులను కలిసి కావ్య చెరుకుతోటలో చనిపోయి ఉందని చెప్పారు. అందరూ హుటాహుటిన పరసనహళ్లికి వెళ్లి చూడగా కావ్య మృతదేహం కనిపించింది. కొంతమేర పూడ్చిపెట్టి ఉంది. పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం జరిపించి కుటుంబసభ్యులకు అందించారు. కావ్య మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడే తమ కూతురిని హత్యచేశాడని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కావ్య ప్రియుని మాటలను నమ్మి నాశనమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. (చదవండి: పండ్లరసంలో మద్యం కలిపి తాగించి.వృద్ధుడు అఘాయిత్యం) -
అమ్ముడుపోని చెరకుతో వెనిగర్ తయారీ.. భారీ లాభాలు గడిస్తున్న యూపీ రైతు
చెరకును ఫ్యాక్టరీ వాళ్లు కొనకపోతే రైతుకు ఏం చేయాలో తోచదు. అయితే, అమ్ముడు పోని చెరకుతో వెనిగర్ తయారు చేసి చక్కని ఆదాయం గడిస్తూ ఆశ్చర్యపరుస్తున్నది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రైతు కుటుంబం. సీతాపూర్ జిల్లా చావ్‌బిర్వ గ్రామానికి చెందిన 50 ఏళ్ల రామ్‌కిషోర్ మిశ్రా, ఆయన సోదరులు హిమాంశు మిశ్రా, శ్యాంకిశోర్ మిశ్రాలతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. తమకున్న 50 ఎకరాల్లో చాలా ఏళ్లుగా చెరకుతోపాటు ఇతర పంటల సాగుతోపాటు పశుపోషణ చేస్తున్నారు. గతంలో ఫ్యాక్టరీకి తోలగా మిగిలిపోయిన చెరకు వృథా అయ్యేది. ఇలా మిగిలిన చెరకును ఎలా ఉపయోగించాలా అని కొద్ది నెలల క్రితం ఆలోచిస్తుండగా.. చిన్నప్పుడు తమ బామ్మ తయారు చేసిన ఆరోగ్య పానీయం వెనిగర్ (సిర్కా) గుర్తొచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా వెనిగర్ తయారు చేసి, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నింపి రిటైల్ మార్కెట్లో అమ్మటం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దగ్గరి పట్టణ ప్రాంతాలకే కాకుండా రాజస్థాన్ మార్కెట్ల నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తుండటం విశేషం. ఇప్పటికే 7 వేల లీటర్లు విక్రయించారు. ప్రతి నెలా రూ. 20 వేల వరకు వెనిగర్ ద్వారా ఆదాయం గడిస్తున్నారు. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేస్తున్నారంటే.. చెరకు రసాన్ని పరిశుభ్రమైన ప్లాస్టిక్ డ్రమ్స్లో నింపి, గ్యాస్ బయటకు పోయేందుకు చిన్న బెజ్జం ఉంచి, బిగుతుగా మూత పెట్టేస్తారు. మూడు నెలల తర్వాత మూత తీసి.. అప్పటికే సిద్ధంగా ఉన్న పాత వెనిగర్‌ను ఈ డ్రమ్ముల్లో మజ్జిగ తోడు మాదిరిగా కొద్ది పరిమాణంలో కలుపుతారు. మరో మూడు నెలలకు.. (అంటే మొత్తం ఆర్నెల్లకు) వెనిగర్ వినియోగానికి సిద్ధమవుతుందని హిమాంశు మిశ్రా తెలిపారు. అయితే, దీనికి తేమ చేతులు తగలకూడదు. పరిశుభ్రత పాటించకపోతే మొత్తం పాడై చెడువాసన వచ్చి పనికిరాకుండా పోతుందన్నారు. వెనిగర్‌ను ఏ దశలోనూ మెటల్ కంటెయినర్లలో పోయకూడదు. ఫైబర్ లేదా ప్లాస్టిక్ డ్రమ్ములు, సీసాలు వాడాలి. 600 ఎం.ఎల్. ప్లాస్టిక్ సీసాల్లో నింపి, రూ. 70కి విక్రయిస్తున్నారు. ఖాళీ బాటిల్ రూ.7, స్టిక్కర్ రూ.5తో కలిపి ఒక సీసా వెనిగర్ ఉత్పత్తి ఖర్చు రూ. 25 వరకు అవుతుందని హిమాంశు వివరించారు. వెనిగర్‌ను తీసుకునే వారికి రక్తపోటు తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పొట్ట భాగంలో కొవ్వు కరుగుతుందని, జీర్ణశక్తి పెరుగుతుందని, చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందని మిశ్రా సోదరులు చెబుతున్నారు. తయారైన తర్వాత రెండేళ్లు ఇది నిల్వ ఉంటుందంటున్నారు. -
Recipe: పచ్చి రొయ్యలు... చెరకు ముక్కలు! సుగర్ కేన్ ష్రింప్ తయారీ ఇలా!
పచ్చిరొయ్యలు, చెరకు ముక్కల కాంబినేషన్‌తో సుగర్ కేన్ ష్రింప్ ఎలా వండుకోవాలో తెలుసా? సుగర్ కేన్ ష్రింప్ తయారీకి కావలసినవి: ►పచ్చిరొయ్యలు – అరకేజీ ►వెల్లుల్లి రెబ్బలు – మూడు ►ఉప్పు – రుచికి సరిపడా ►పంచదార – అరటేబుల్ స్పూను ►గుడ్డు తెల్ల సొన – ఒకటి ►తెల్లమిరియాలపొడి – రెండు టేబుల్ స్పూన్లు ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ►తొక్కతీసిన ఐదంగుళాల చెరుకు ముక్కలు – నాలుగు. తయారీ.. ►రొయ్యలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి. ►రొయ్యలు, వెల్లుల్లి, మిరియాలపొడి, పంచదార ఆయిల్‌ను బ్లెండర్లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి. ►ఒక గిన్నెలో గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలపాలి. ►ఈ సొనలో రొయ్యల పేస్టు వేసి చక్కగా కలిపి అరగంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►అరగంట తరువాత రెండు చేతులకు ఆయిల్ రాసుకుని రొయ్యల మిశ్రమాన్ని నాలుగు భాగాలుగా చేసి చెరుకు ముక్కలకు చుట్టూ పెట్టాలి. ►ఈ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Egg Bhurji Balls Recipe: క్యారెట్, బీట్ రూట్ తురుము.. ఎగ్ బుర్జీ బాల్స్ తయారీ ఇలా! Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి! -
Viral Video: చెరుకు ముక్కల్ని ఇలా కూడా తింటారా?
సోషల్ మీడియాలో వింతలు, విశేషాలకు కొదవ ఉండదు. నిరంతరం రక రకాల వీడియోలు, మీమ్స్ సందడి చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నవ్వులు పూయిస్తోంది. మూతికి ప్లాస్టిక్ కవర్ కట్టుకుని మరీ చెరకు ముక్కల్ని ఒక వ్యక్తి వెరైటీగా తింటున్న వైనం నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఈ సమ్మర్లో బ్రాండ్ న్యూ టెక్నిక్ అంటూ ఫిదా అవుతున్నారు. Brand new technique to eat sugarcane this summer 😂🤣 @hvgoenka pic.twitter.com/m0iGCeJvHG — Tarana Hussain (@hussain_tarana) March 28, 2022 సాధారణంగా చెరకు తినాలంటే ఒక టెక్నిక్ ఉండాలి. ఒడుపుగా పైనున్న తోలు తీస్తూ, ముక్కలు కొరికి తినాలి. అలా ఆ జ్యూస్ మింగుతూ ఉంటే వచ్చే ఆ కిక్కే వేరు. ఆ తరువాత ఆ పిప్పిని ఉమ్మడం కూడా పెద్ద పనే అయినా, పళ్లకు చక్కటి ఎక్స్ర్ సైజ్. అయితే చెరుకును తినాలంటే పళ్లకు మాంచి బలం ఉండాలి మరి. కాగా సమ్మర్ వచ్చిందంటే చాలు అందరం చల్లని పానీయాలకోసం తెగ ఆరాటపడతాం. ముఖ్యంగా వేడిని తట్టుకునేందుకు, దాహార్తిని తీర్చుకునేందకు నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగుతాం. అలాగే ఈ వేసవిలో విరివిగా లభించే చెరుకు రసం సమ్మర్లో మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. -
Summer Tips: చెరకురసంలో అల్లం, నిమ్మకాయ, పుదీనా కూడా కలిపి తాగితే..
ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలన్నింటిలోనూ విరివిగా వాడుకలో ఉన్న పానీయం చెరకురసం. భారత ఉపఖండం, దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో చెరకురసం విరివిగా దొరుకుతుంది. ఈ ప్రాంతాల్లో వేసవిలో చెరకురసం వినియోగం మరింత ఎక్కువగా ఉన్నాయి. చెరకురసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అయితే, చెరకురసం తీసే యంత్రం శుభ్రత, చెరకురసం అమ్మేచోట ఉన్న పరిసరాల శుభ్రత వంటివి కాస్త గమనించి తీసుకోవడం మంచిది. చెరుకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ►చక్కెర ఎక్కువగా ఉండే చెరకురసం ఇట్టే సూక్ష్మజీవులను ఆకర్షిస్తుంది. జాగ్రత్తలు తీసుకోకుండా, చెరకురసం తీసుకుంటే లేనిపోని వ్యాధుల బారినపడే ప్రమాదం లేకపోలేదు. ►చాలాచోట్ల చెరకురసం తీసేటప్పుడు అల్లం, నిమ్మకాయ, పుదీనా వంటివి కూడా కలిపి చెరకును నలగ్గొడతారు. వీటివల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ►చెరకురసం తక్షణ శక్తిని, ఎండతాకిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ►చెరకు రసంలోని క్యాల్షియం ఎముకలకు పటుత్వాన్ని ఇస్తుంది. ►ఇందులోని ఎంజైమ్స్ జీర్ణకోశంలోని సమతుల్యతను కాపాడి, కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. ►తియ్యని రుచి కోసం రసాయనాలతో కూడిన కూల్‌డ్రింకుల కంటే సహజమైన తీపితో కూడిన చెరకురసం తీసుకోవడమే మేలు. చదవండి: Thati Munjalu Health Benefits: తాటిముంజెలు ఎక్కువగా తింటున్నారా.. ఇందులో 80 శాతానికి పైగా! -
కోవిడ్ దెబ్బ; చేదెక్కిన చెరకు!
అందరికీ తీపిని పంచే చెరకు రైతన్న చేదును చవిచూస్తున్నాడు. కోవిడ్ దెబ్బకు కుదేలై విలవిల్లాడుతున్నాడు. కనీసం పెట్టుబడి ఖర్చులు రావడం కూడా కష్టంగా మారడంతో నష్టాలకు గురవుతున్నాడు. చెరకు పంట ఏపుగా పెరిగినా మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో బావురుమంటున్నాడు. ఆశగా తయారు చేసిన బెల్లం బుట్టలు అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. కోవిడ్ పరిస్థితుల నుంచి కోలుకునే కాలం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. తాళ్లూరు: కరోనా ప్రభావానికి అల్లకల్లోలంగా మారిన అనేక రకాల మార్కెట్లలో బెల్లం మార్కెట్ కూడా ఉంది. ఆ ప్రభావం చెరకు రైతుపై తీవ్రంగా పడింది. గతంలో ఎన్నడూ తలెత్తని దుర్భర పరిస్థితుల్లోకి వారిని నెట్టేసింది. అమ్ముడుపోని బెల్లం బుట్టలతో పాటు నష్టాలను కూడా మూటగడుతోంది. ప్రకాశం జిల్లాలో సుమారు 3,000 ఎకరాల్లో చెరకు సాగవుతోంది. అందులో అధికంగా 1500 ఎకరాల వరకు తాళ్లూరు మండలంలో సాగవుతోంది. చెరకును బెల్లంగా మార్చేందుకు తాళ్లూరు ప్రాంతంలో ప్రత్యేకంగా బట్టీలు కూడా ఉన్నాయి. సుమారు 15 నుంచి 20 వరకు ఉన్న బట్టీల ద్వారా బెల్లం తయారు చేసి బుట్టల్లో అమర్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. స్థానికంగా కూడా మార్కెట్ చేసుకుంటారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా కూలీలు వస్తుంటారు. వారికి రోజుకు రూ.500కుపైగా కూలి ఇస్తుంటారు. అయితే, కోవిడ్ కారణంగా ప్రస్తుతం బెల్లం మార్కెట్ బాగా పడిపోయింది. ఎగుమతులు సైతం నిలిచిపోయాయి. తయారు చేసిన బెల్లం నిల్వలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. ఫలితంగా రైతులు సాగుచేసిన చెరకుతో పెద్దగా పనిలేకుండా పోయింది. ఆ రైతులంతా నష్టాల బాట పట్టారు. ఖర్చు ఎక్కువ.. మిగిలేది తక్కువ..! తాళ్లూరు పరిసర ప్రాంతాల్లో 33 ఏళ్లుగా చెరకు పంట సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఎకరా పొలంలో చెరకు సాగుచేసేందుకు రూ.లక్ష వరకూ ఖర్చవుతోంది. ఎకరాకు మూడు టన్నుల బెల్లం ఉత్పత్తవుతుంది. కోవిడ్ కారణంగా బెల్లం విక్రయాలు తగ్గడంతో ధర కూడా తగ్గింది. కేజీ రూ.36 మాత్రమే ఉంది. దాని ప్రకారం ఎకరా చెరకుతో తయారు చేసిన బెల్లం విక్రయిస్తే రాబడి రూ.1.08 లక్షలే ఉంది. అంటే.. ఎకరాకు రూ.8 వేలు మాత్రమే మిగులుదల ఉంది. చెరకు సాగు నుంచి బెల్లం తయారు చేయడం, మార్కెట్ చేసుకోవడం వరకూ అష్టకష్టాలుపడితే కనీసం పది వేలు కూడా మిగలడం గగనంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో బెల్లం తయారీ వ్యయం తక్కువ కాగా, ఆదాయం ఆశాజనకంగా ఉండేదని, ఇప్పుడు ఖర్చులు పెరగడంతో పాటు మార్కెట్లో బెల్లం ధరలు తగ్గడం, విక్రయాలపై కరోనా కాటేయడం వలన నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి కోవిడ్ వలన బెల్లం వాడకం, అమ్మకం తగ్గి పెట్టుబడులు కూడా రావడం లేదు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాళ్లూరు ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీ నెలకొల్పి చెరకు రైతులను గట్టెక్కించాలి. లేకుంటే కోలుకోలేము. – లింగారెడ్డి, రైతు, తాళ్లూరు చీడపీడలతో చెరకు రైతుకు వెతలు బల్లికురవ: జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో సాగుచేసిన చెరకు పంటను చీడపీడలు ఆశించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. బల్లికురవ, అద్దంకి మండలాల్లో తిరునాళ్లు, ఉత్సవాల్లో అమ్మే నల్ల చెరకును జూన్ మొదటి వారం నుంచి సాగుచేస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది సాగుచేసిన నెల రోజుల చెరకు పంటను చీడపీడలు ఆశించాయి. బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు, వైదన, రామాంజనేయపురం, ఎస్ఎల్ గుడిపాడు, అంబడిపూడి, అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం, సాధునగర్, చక్రాయపాలెంలో ఇప్పటికే సుమారు 55 ఎకరాల్లో సాగు చేసిన పంటకు నెలరోజులు పూర్తయింది. ప్రస్తుతం మరో 50 ఎకరాల్లో సాగు చేసేందుకు బల్లికురవ మండలంలోని రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో పీక పురుగు, ఎర్రనల్లి ఉధృతంగా పంటపై దాడిచేశాయి. పంటంతా ఎండిపోతుండటంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి తలెత్తలేదని రైతులు గొల్లుమంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు స్పందించి చీడపీడల నివారణకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు. కార్బాపైరాన్ గుళికలు వేసుకోవాలి వర్షాధార పంటను పీకపురుగు ఆశిస్తుంది. పైరు పిలకలు వేసే దశలో మొవ్వలోకి చేరి తినడం వలన ఎండిపోతోంది. పీకపురుగు ఆశించకుండా గడల ముక్కలు నాటే ముందు ఎకరాకు 12 నుంచి 13 కేజీలు కార్బాపైరాన్ గుళికలను చాళ్లలో వేసుకోవాలి. పైరు నెలరోజుల దశలో ఉన్నందున కోరాజన్ 0.3 మిల్లీలీటరును లీటరు నీటికి కలిపి మొవ్వ పూర్తిగా తడిసేలా ఐదు రోజులకోసారి పిచికారీ చేసుకోవాలి. – ఎస్వీపీ కుమారి, వ్యవసాయాధికారిణి, బల్లికురవ -
జన్మంతా గుర్తుంచుకుంటాం..
సాక్షి, పాలకొండ: కష్టకాలంలో అధికారులు చూపిన ఆదరణను వారు మర్చిపోలేకపోతున్నారు.. ఆకలి కాలంలో అన్నం పెట్టి, ఆతిథ్యమిచ్చిన ప్రభుత్వానికి వేనవేల కృతజ్ఞతలు చెబుతున్నారు. పాలకొండ గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహంలో 40 రోజుల కిందట ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన 110 మంది చెరుకు కొట్టేవారు ఆశ్రయం పొందారు. నెల రోజులపైబడి వారికి అధికారు లు అన్నపానాదులిచ్చి జాగ్రత్తగా చూసుకున్నా రు. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో వా రంతా సోమవారం అర్ధరాత్రి స్వగ్రామాలకు పయనమయ్యారు. వీరిని తరలించేందుకు ఆర్డీ వో టి.వి.ఎస్.జి.కుమార్ నేతత్వంలో ఆర్డీసీ మే నేజర్ వై.ఎస్.ఎన్.మూర్తి ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. ఊరుకాని ఊరిలో అధికారులు చూపిన ఆదరణకు వారు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపా రు. అధికారులతో విడదీయలేని బంధం ఏ ర్పడిందని తెలిపారు. నిత్యం వారికి యోగా, క్రీడలు నేర్పిచడం సామూహిక భోజనాలు, వలసదారుల పిల్లలకు చదువు చెప్పడం వంటి పనులతో సిబ్బంది బాగా కలిసిపోయారు. దీంతో వీడ్కోలు చెప్పినప్పుడు అందరి కళ్లు చె మర్చాయి. అధికారులతో ఫొటోలు సెల్ఫీలు తీసుకుని బరువెక్కిన హృదయాలతో వారు స్వగ్రామాలకు వెళ్లారు. జీవితంలో మర్చిపోలేం కష్టకాలంలో ప్ర భుత్వం మాపై చూపించిన ఔదార్యం జీవితంలో మర్చిపోలేం. కు టుంబాలతో సహా దా దాపు నలభై రోజులు ఆశ్రయం పొందాం. అధికారులు సొంత కు టుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు. మా యోగక్షేమాలను నిత్యం దగ్గరుండి పర్యవేక్షించారు. కొత్త బట్టలిచ్చారు. వైద్యసేవలు అందుబాట్లో ఉంచారు. కోరిన భోజనం అందించారు. ఇక్కడ నుంచి వెళ్లాలంటే బాధగా ఉంది. – ఎం.సువర్ణరాజు, చెరుకు కొట్టే కార్మికుడు, ప్రకాశం జిల్లా. వెలుగులు నింపారు పురిటి నొప్పులతో బాధపడుతున్న నన్ను స్థానిక అధికారులే రక్షించారు. అర్ధరాత్రి వారి కారులో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాకు మగ బిడ్డ పుట్టాడు. మా కుటుంబంలో అధికారులే వెలుగులు నింపారు. అధికారుల రుణం తీర్చలేనిది. కలెక్టర్ నాకు రూ.25వేలు నగదు అందించగా ఆర్డీవో మాకు అవసరమైన మందు లు, బట్టలు అందించారు. ఏపీఓ సాగర్ వారి సొంత బిడ్డలా ఆదరించారు. – ఎం.మరియమ్మ, మిట్టపాలెం, ప్రకాశం జిల్లా. -
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే చెరుకు
ఇదివరలో చెరుకుగడలను పిల్లలు సంబరాలు, తిరునాళ్లప్పుడు నములుతూ, తింటూ ఆస్వాదిస్తూ ఉండేవారు. ఒక వయసు దాటాక పెద్దలు కూడా చెరుకుగడలను కాకుండా చెరుకురసాన్ని తాగడం వంటివి చేసేవారు. అయితే ఇటీవల చెరుకును ఆస్వాదించడం తగ్గిపోయింది. పైగా చెరుకురసం స్టాల్స్ దగ్గర ఉండే అపరిశుభ్రమైన వాతావరణం చెరుకురసం తాగేవారి సంఖ్యను తగ్గిస్తోంది. అయితే మురికినీళ్లతో తయారైన ఐస్లాంటివి వాడకుండా, పరిశుభ్రమైన వాతావరణంలో చెరుకురసం తీసి తాగడం లేదా పిల్లలు చెరుకుగడలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. చెరుకుతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే... ♦ చెరుకు వేసవిలో తీసుకుంటే డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది ♦ చెరుకులోని పోషకాలు చర్మానికి మంచి నిగారింపును ఇస్తాయి. చెరుకు ఏజింగ్‌ను నివారించి చాలాకాలం యౌవనంగా ఉండేలా తోడ్పడుతుంది ∙ ♦ చెరుకు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తుంది. వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ♦ చెరుకురసంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. చెరుకురసం ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. గాయాలను త్వరగా మాన్పుతుంది ♦ చెరుకు కాలేయాన్ని సంరక్షిస్తుంది. బిలిరుబిన్ పాళ్లను అదుపులో ఉంచుతుంది. ఈ కారణం వల్లనే సాధారణంగా కామెర్లు వచ్చిన వారికి డాక్టర్లు చెరుకురసాన్ని సిఫార్సు చేస్తుంటారు. పైగా ఇది తేలిగ్గా జీర్ణమవుతూ జీర్ణవ్యవస్థపై ఎలాంటి భారం పడకుండా చూస్తుంది ♦ అసిడిటీ సమస్యను స్వాభావికంగా తగ్గించే శక్తి చెరుకురసానికి ఉంది ∙చెరుకురసం పళ్లు, చిగుర్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా చూస్తుంది ♦ గర్భవతులు పరిశుభ్రమైన, తాజా చెరుకురసాన్ని తాగడం చాలా మంచిది. ఇది గర్భానికి రక్షణ కలిగిస్తుంది ♦ చెరుకు పిల్లల్లో జ్వరాలను నివారిస్తుంది. తగ్గిస్తుంది ♦ ఒంట్లోని విషాలను బయటకు పంపించే సహజ డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్ చెరుకు ♦ చెరుకురసం ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ♦ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. తగ్గిస్తుంది. -
చెరకు టన్ను ధర రూ.2550
► మద్దతు ధర ప్రకటించిన కేంద్రం ► రాష్ట్ర సుగర్ కేన్ కమిషనర్‌కు అందిన ఉత్తర్వులు ► రూ.3వేలైనా ఇవ్వాలంటున్న రైతులు చోడవరం: ఈ ఏడాది చెరకు మద్దతు ధరను కేంద్రం ఇటీవల ప్రకటించింది. టన్నుకు రూ.2550 చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సుగర్ కేన్ కమిషనర్‌కు ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడేళ్లుగా కనీస మద్దతు ధర లేక తీవ్ర నిరాశతో ఉన్న రైతులకు ఇది కొంత ఊరటనిచ్చే పరిణామం.కేంద్ర ప్రభుత్వ ఆహార ఉత్పత్తుల ధరల నియంత్రణ మండలి సమావేశంలో ఇటీవల టన్నుకు రూ.250పెంచుతూ ప్రకటించారు. గతేడాది టన్నుకు రూ.2225లు చెల్లించిన కేంద్ర ఈ ఏడాది మరో రూ.250లు పెంచింది. అన్ని ఫ్యాక్టరీలు టన్నుకు రూ.2475 చెల్లించాల్సి ఉంటుంది. గోవాడ ఫ్యాక్టరీ గతేడాది రూ.2300 ఇవ్వగా ఈఏడాది పెరిగిన ధరతో టన్ను చెరకు ధర రూ.2550 చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా మరో రూ. 60 రవాణా చార్జిగా ఇవ్వాలి. అంటే రానున్న క్రషింగ్ సీజన్లో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ టన్నుకు రూ. 2610 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ ధర కొంత పర్వాలేకపోయినప్పటికీ ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులు రీత్యా టన్నుకు కనీసం రూ.3వేలైనా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇదిలావుంటే చెరకు మద్దతు ధర పెరగడంపై ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పంచదార ధర క్వింటా రూ.3750 ఉంది. ఈ ధర ఇలా ఉన్నా,కాస్త పెరిగినా ఫ్యాక్టరీ పెరిగిన చెరకు ధర ఇచ్చేందుకు ఇబ్బంది ఉండదు. రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చెరకు సాగు పెట్టుబడులు బాగాపెరిగిపోవడం వల్ల ప్రస్తుతం ప్రకటించిన ధర కూడా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం కొంత సాయం చేసి మద్దతు ధర పెంచితే రైతులు చెరకు సాగుపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్యాక్టరీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న 11సహాకార చక్కెర కర్మాగారాల్లో కేవలం నాలుగు ఫ్యాక్టరీలు మాత్రమే క్రషింగ్‌కు సిద్ధమవుతున్నాయి. అవి కూడా మన జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక, తాండవ కాగా పక్కనే ఉన్న విజయనగరం జిల్లా భీమసింగ ఫ్యాక్టరీలు. మిగతా ఫ్యాక్టరీలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోయి మూతబడ్డాయి. అయితే క్రషింగ్‌కు సిద్ధమవుతున్న 4ఫ్యాక్టరీలు కూడా గతేడాది చెరకులేక లక్ష్యంలో కేవలం 60 శాతమే క్రషింగ్ చేసి చతికిలపడ్డాయి. పంచదారకు మంచి ధర ఉన్నప్పటికీ చెరకు పంట లేక ఆశించిన మేర క్రషింగ్ చేయకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాయి. చెరకు విస్తీర్ణం పెంచి ఈ ఏడాది ఆశించిన మేర ఫ్యాక్టరీలు క్రషింగ్ లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పెరిగిన ధర రైతులకు చెల్లించకలేకపోగా ఫ్యాక్టరీలు కూడా మూతపడే ప్రమాదం ఉంది. -
గ్రామీణ ఆవిష్కర్తలకు జేజేలు!
వ్యవసాయదారులు, గ్రామీణుల అభివృద్ధికి తోడ్పడే వినూత్న ఆవిష్కరణలను వెలువరించిన వారిని గుర్తించి, సముచిత రీతిలో ప్రోత్సహించడం అత్యవసరం. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.పి.ఆర్.) ఈ విషయాన్ని గుర్తించి.. గత నెల 23,24 తేదీల్లో తొట్టతొలి సారిగా జాతీయ స్థాయి గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శనను హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇన్నోవేటర్లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పార్వతీపురానికి చెందిన రైతు శాస్త్రవేత్త డి. బాబూరావుకు రూ. 50 వేల బహుమతి లభించింది. గ్రామీణ రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను డిజైన్ పరంగా అభివృద్ధి చేసి, వాటిని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్.ఐ.ఆర్.పి.ఆర్.లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం విశేషం. అక్కడ ప్రదర్శించిన కొన్ని వ్యవసాయ సంబంధిత ఆవిష్కరణల గురించి ఇక్కడ ముచ్చటించుకుందాం.. మొక్కజొన్న ఒలిచే / చెరకు ముచ్చెలు కత్తిరించే యంత్రం రైతు శాస్త్రవేత్త డి. బాబూరావు స్వస్థలం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం. బహుళ ప్రయోజనకారి అయిన స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్‌సీడర్‌ను గతంలో ఆవిష్కరించి పేరుగడించిన ఆయన తాజాగా.. ఒకేసారి నాలుగు మొక్కజొన్న పొత్తుల్లో నుంచి గింజలు ఒలిచే యంత్రాన్ని ఆవిష్కరించారు. ఈ యంత్రానికి చిన్న బ్లేడ్లు మార్చుకొని.. చెరకు ఒంటికన్ను ముచ్చెలను లేదా 3 అంగుళాల ముక్కలను కత్తిరించడానికి కూడా వినియోగించుకోవచ్చు. బరువు 20 కిలోలు కావడంతో ఎక్కడికైనా, కొండల మీదికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. ఖరీదు రూ. 16 వేలు. చెరకు విత్తన మార్కర్ : దీనితోపాటు చెరకు విత్తన మార్కర్‌ను సైతం బాబూరావు రూపొందించారు. చెరకు సాళ్ల మధ్య 3 అడుగుల దూరం ఉంచాలి. చెరకు మొక్కలను విడి విడిగా కాకుండా.. 14 అంగుళాల రింగ్‌లో 4 చెరకు ముచ్చెలను నాటాలి. రింగ్‌కు రింగ్‌కు మధ్య 3 అడుగుల దూరం ఉంచాలి. ఇలా చేయడం వల్ల గాలులకు చెరకు పడిపోకుండా ఉంటుంది. ఎకరానికి కనీసం 300 కిలోల చెరకు విత్తనం సరిపోతుంది. బాబూరావును 94409 40025 నంబరులో సంప్రదించవచ్చు. – సేకరణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : కందల రమేష్‌బాబు, సీనియర్ ఫొటో జర్నలిస్టు మండే ఎండల్లో చెమటను చిందించే మహిళా రైతులకు గొడుగుల ద్వారా నీడ కల్పిస్తే వారి కష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చని అంటున్నారు రేపల్లె షణ్ముఖరావు (94921 13609). మహబూబ్‌నగర్ జిల్లా కంబాలపల్లి ఆయన స్వస్థలం. ఇందుకోసం రెండు రకాల పెద్ద గొడుగులను ఆయన రూపొందించారు. సాళ్ల మధ్యలో ఈ గొడుగును నిలబెట్టి.. దీని నీడలో మహిళలు పనులు చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ముందుకు జరుపుకోవచ్చు. దీని ధర రూ. 1,500. ప్రతిసారీ జరుపుకోనవసరం లేకుండా.. సౌరవిద్యుత్‌తో నడిచే సెన్సర్ల ద్వారా దానంతట అదే ముందుకు జరిగే ఆటోమేటిక్ గొడుగును కూడా ఆయన రూపొందించారు. దీని ధర రూ. 5,000. పురుగు పట్టనివ్వదు! ఎటువంటి రసాయనాలు కలపకుండా వ్యవసాయోత్పత్తులను నిశ్చింతగా భద్రపరచుకునేందుకు ఉపయోగపడే సురక్షితమైన ప్లాస్టిక్ సంచులను మహారాష్ట్ర పుణేకి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ షా రూపొందించారు. 70 మైక్రాన్ల మందాన ఉండే పారదర్శకమైన ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ సంచులలో నింపి బియ్యం, పప్పులు, ఇతర ధాన్యాలను రెండేళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చంటున్నారు. ఇథనాల్ వెనాల్ ఆల్కహాల్ (ఇ.వి.ఓ.హెచ్.) అనే అత్యాధునిక జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని తయారు చేశారు. రెండేళ్లపాటు నిల్వ చేసినా ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలకు పురుగు పట్టదని, పోషకాల నష్టం జరగదని, రుచి, రంగు మారదని షా చెబుతున్నారు. ఇంట్లో, గోదాముల్లో వ్యవసాయోత్పత్తుల నిల్వకు ఈ సంచులు ఉపకరిస్తాయని, ఎన్నేళ్లయినా పునర్వినియోగానికి అనుకూలంగా ఉంటాయన్నారు. ఒక సంచి ధర రూ. 70. తమిళనాడు తంజావూరులోని భారతీయ పంట పరిరక్షణ సాంకేతికతా సంస్థ (ఐ.ఐ.సి.పి.టి.)తోపాటు ఎఫ్.డి.ఎ., సి.ఈ. వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ సంచుల నాణ్యతను నిర్థారించాయని షా చెబుతున్నారు. వివరాలకు 098220 12969, 020672 73830 నంబర్లలో సంప్రదించవచ్చు. -
చెరకు కొనుగోలు పన్ను జీఓ విడుదల
► టన్నుకు 60 రూపాయలు చొప్పున ► చెల్లించాలని ఆదేశం ► రాష్ట్ర వ్యాప్తంగా 35 కోట్లు బకారుులు ► జీఓ రావడంపై రైతుల హర్షం బొబ్బిలి : చెరకు రైతులకు తీపి కబురు.. గత ఏడాది చెరకు క్రషింగు సీజనుకు సంబంధించి కొనుగోలు పన్నును తిరిగి రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. శుక్రవారం విడుదల చేసిన 394 జీఓ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 23 ఫ్యాక్టరీలకు చెరుకును సరఫరా చేసే రైతులకు రూ.35 కోట్ల వరకూ ఆయా ఫ్యాక్టరీలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో గత ఏడాది 58 లక్షల టన్నుల క్రషింగు చేయగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరపై ఫ్యాక్టరీలు రికవరీని ఆధారంగా చేసుకొని పన్ను చెల్లిస్తుంటారు. చెరకు ఫ్యాక్టరీలు టన్నుకు రూ. 60 లను కొనుగోలు పన్నుగా చెల్లించాలి. అరుుతే ప్రభుత్వం మాత్రం ఆ పన్నును తిరిగి రైతులకే వర్తించేలా ఏటా జీఓ విడుదల చేస్తుంటుంది. 2015- 16 సంవత్సరానికి సంబంధించి చెరకును సరఫరా చేసిన రైతులకు జీఓను సకాలంలో విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా సీజను నవంబర్, డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే చెరకు క్రషింగు ప్రారంభమైనా జీఓ రాకపోవడంతో వారంతా ఆందోళన చెందారు. శుక్రవారం ఆ జీఓను ప్రభుత్వం విడుదల చేయడంతో విజయనగరం జిల్లాలో ఉండే లచ్చయ్యపేట, భీమసింగి, శ్రీకాకుళం జిల్లాలోని సంకిలి ఫ్యాక్టరీల పరిధిలోగల దాదాపు 18,500 మంది రైతులకు రూ. 5.90కోట్లు వరకూ అందుతుంది. ఎన్సీఎస్ ఫ్యాక్టరీ పరిధిలో రూ. కోటి 36 లక్షలు, భీమసింగి ఫ్యాక్టరీ పరిధిలో రూ. 54 లక్షల 5 వేలు, సంకలి ఫ్యాక్టరీ పరిధిలో రూ. 3 కోట్ల 95 లక్షల వరకూ చెల్లింపులు చేయాల్సి ఉంది. -
చెరుకులో తీపేది
జిల్లాలో 5 వేల హెక్టార్లలో సాగు ఆందోళనలో రైతులు మద్దతు ధర ప్రకటించని యాజమాన్యం టన్నుకు రూ. 3,600 ధర ఇవ్వాలని విజ్ఞప్తి క్రషింగ్‌కు సిద్ధమైన ఫ్యాక్టరీ అందరికీ తీపిని పంచే చెరుకు రైతుకు మాత్రం చేదు అనుభవాలే మిగులుతున్నాయి. ఏడాదంతా శ్రమించినా.. పంటకు మద్దతు ధర లభించడం లేదు. ఈ ఏడాది క్రషింగ్ సీజన్ సమీపిస్తున్నా.. ఫ్యాక్టరీలు మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర ఇవ్వాలని యాజమాన్యాలను కోరుతున్నారు. నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లాలో అడ్లూర్ ఎల్లారెడ్డి, మాగిలలో గాయత్రి చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. ఈ కార్మాగారాల పరిధిలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో 12 మండలాల్లో 5 వేల హెక్టార్లల్లో చెరుకు పంట సాగవుతోంది. కామారెడ్డి జిల్లాలో 2 వేల హెక్టార్లలో, సంగారెడ్డి జిల్లాలో 3 వేల హెక్టార్లలో చెరుకును సాగు చేస్తున్నారు. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చెరుకు సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత దశకు చేరింది. ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించే మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్నారు. పెట్టుబడులు పెరిగినందున టన్నుకు రూ. 3,600 మద్దతు ధర ఇస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని పేర్కొంటున్నారు. అయితే యాజమాన్యాలు రూ. 2,600 లకు మించి మద్దతు ధర ఇచ్చేలా కనిపించడం లేదు. మద్దతు ధర ప్రకటించకుండానే క్రషింగ్‌కు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల వారీగా చెరుకు నరికివేత, క్రషింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. గానుగ కోసం చెరుకును ఫ్యాక్టరీకి తరలించాలని రైతులకు సూచించింది. నేడు బాయిలర్ పూజలు కామారెడ్డి జిల్లాలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, మాగి గాయత్రి కార్మాగారాల్లో చెరుకు క్రషింగ్ కోసం యాజమాన్యం సిద్ధమైంది. మాగిలోని గాయత్రి కర్మాగారంలో బుధవారం బాయిలర్ పూజలు చేయనున్నారు. పూజల అనంతరం క్రషింగ్ తేదీలు ఖరారు చేయనున్నారు. పూజల్లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సరితారెడ్డి, వైస్ చైర్మన్ సందీప్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారని ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు. -
చెరుకు రైతుల దీక్షకు మద్దతు
– వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి నంద్యాలరూరల్: నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మొండి వైఖరికి నిరసనగా రైతులు చేస్తున్న దీక్షలకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం నంద్యాలకు వచ్చిన గౌరు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి రాజగోపాల్‌రెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ చంద్రబాబుతో కుమ్మక్కై చెరుకు రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రూ.9.60కోట్ల రుణమాఫీ చెరుకు రైతులకు దక్కకుండా బ్యాంకు ద్వారా ఫ్యాక్టరీ చైర్మన్ ఖాతాలోకి జమ అవుతున్నా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఆస్తులను కాపాడి రైతులకు, కార్మికులకు, కూలీలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం యాజమాన్యానికి తొత్తుగా మారి రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సాహంతోనే ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్‌గుప్త రైతులకు అన్యాయం చేస్తున్నారని వివర్శించారు. రైతుల ఆందోళనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని గౌరువెంకటరెడ్డి భరోసా ఇచ్చారు. తక్షణమే ప్రభుత్వం ఫ్యాక్టరీ చైర్మన్‌ను అరెస్ట్ చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని గౌరువెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీ రియల్ ఎస్టేట్ వ్యాపార అనుమతుల రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. -
షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను అరెస్ట్ చేయాలి
- చెరకు రైతుల రిలే దీక్షలు ప్రారంభం నంద్యాల రూరల్: నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్ గుప్తను వెంటనే అరెస్ట్ చేయాలని చెరకు రైతులు డిమాండ్ చేశారు. అఖిల రైతు పక్షాల ఆధ్వర్యంలో గురువారం ఫ్యాక్టరీ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఫ్యాక్టరీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని ఆరోపించారు. చెరకు రైతుల పేరుతో నంద్యాల సిండికేట్ బ్యాంకులో 9.80 కోట్లు రుణం తీసుకున్నారని, రుణమాఫీ రైతులకు దక్కకుండా ఫ్యాక్టరీ ఛైర్మన్‌కు జమ అవుతోందని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల సిద్ధారెడ్డి తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా ప్రజాప్రతినిధులు అడ్డుకోవడం లేదన్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు..ఫ్యాక్టరీ చైర్మన్ చెప్పినట్లు తలాడించడం శోచనీయమని సీపీఎం డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలీ, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహ అన్నారు. నంది రైతు సమాఖ్య అ«ధ్యక్షులు యరబోలు ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. 75 రోజులు 75 గ్రామాల రైతులు దీక్షల్లో పాల్గొంటారన్నారు. దీక్షలకు బీజేపీ నాయకుడు తూము శివారెడ్డి, సీపీఎం మండల కన్వీనర్ సద్ధాం హుసేన్ , కౌలు రైతుల సంఘం నాయకులు పుల్లయ్య, నంది రైతు సమాఖ్య చంద్రశేఖర రెడ్డి, అయ్యలూరు బసవేశ్వర రెడ్డి, చాబోలు బంగారు రెడ్డి నందిపల్లె సాగేశ్వర రెడ్డి, పొన్నాపురం పుల్లయ్య , వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బంగారయ్య తదితరులు సంఘీభావం తెలిపారు. -
ప్రకృతి సేద్య పతాక రెపరెపలు!
- వరి సాగులో మూడేళ్లుగా ఏటేటా పెరుగుతున్న దిగుబడి - బియ్యం విక్రయంతో ఎకరాకు రూ. 65 వేల నికరాదాయం - పెరుమాళ్లు ఆరుతడి పద్ధతిలో వరి సాగుకు శ్రీకారం - చెరకులో తొలి ఏడాదే ఎకరాకు 45 టన్నుల దిగుబడి - నెల్లూరు రైతు లింగారెడ్డి విజయగాథ రసాయనిక ఎరువుల వాడకంతో నిస్సారమైన భూమిలో మూడేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన లింగారెడ్డి దీక్షగా కొనసాగిస్తున్నారు. ఏటేటా దిగుబడులు పెంచుకుంటూ.. అధిక నికరాదాయాన్ని పొందుతున్నారు. చెరకులో తొలి ఏడాదే రసాయన సేద్యంలోకన్నా ఎక్కువ దిగుబడి తీశారు. వరిలో మూడేళ్లకు తోటి రైతులతో సమానంగా దిగుబడి తీస్తున్నారు. వరిని తక్కువ నీటితో సాగు చేయడం అవసరమని భావించి.. పెరుమాళ్లు ఆరుతడి పద్ధతిలో వరి సాగుకు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు.. రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. పొలంలో వానపాముల సంతతి పెరిగితే చాలు అవే వ్యవసాయం చేస్తాయంటున్నారు ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుడు అల్లూరు లింగారెడ్డి. నెల్లూరు రూరల్ మండలం పెద్ద చెరుకూరు ఆయన స్వగ్రామం. 2013 నుంచి వరి, చెరకు, అరటి తదితర పంటలను ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేస్తూ ముందడుగు వేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై 2007లో తిరుపతిలో పాలేకర్ నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో లింగారెడ్డి పాల్గొన్నారు. అప్పట్లో రొయ్యలు సాగు చేస్తుండటంతో ఆసక్తి ఉన్నా దృష్టి పెట్టలేదు. అయితే భూముల ధరలు పెర గటంతో చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. వచ్చిన సొమ్ముతో కొడవలూరు మండలం బసవాయపాళెంలో 2013లో 26 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రకృతి సేద్యం ప్రారంభించారు. ప్రస్తుతం లింగారెడ్డి 15 ఎకరాల్లో వరి, 6 ఎకరాల్లో చెరకు, 2 ఎకరాల్లో అరటి పంటలను బోరు నీటితో సాగు చేస్తున్నారు. చెరకు తొలి ఏడాదే 45 టన్నుల దిగుబడి.. గతేడాది ఫిబ్రవరిలో చెరకు చేనులో 200 కిలోల ఘన జీవామృతం వేశారు. 15 రోజులకోసారి నీటి ద్వారా ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని పారించేవారు. దీంతోపాటు, చెరకును నాటిన మొదటి ఐదు నెలలు నెలకోసారి పైరుపై జీవామృతాన్ని పిచికారీ చేసేవారు. మొదటి నెల 100 లీటర్ల నీటికి 10 లీటర్ల జీవామృతం, రెండో నెలలో 200 లీటర్ల నీటికి 10 లీటర్ల జీవామృతం చొప్పున చల్లారు. చెరకును ఆశించిన మొవ్వు తెగులును నివారించేందుకు దశపత్ర కషాయం, నీమాస్త్రాన్ని 60 రోజుల దశలో పిచికారీ చేశారు. చెరకు సాగులో ఎకరాకు విత్తనానికి రూ. 15 వేలు, కలుపు తీతకు 20 వేలు, ఇతర ఖర్చులు రూ. 5 వే లు కలిపి మొత్తం రూ. 40 వేల ఖర్చయ్యింది. కూలీలతోనే కలుపు తీయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెరకు పంట చేతికొచ్చింది. రసాయన సేద్యంలో ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తుండగా.. లింగారెడ్డి ప్రకృతి సేద్యంలో తొలి ఏడాదే 45 టన్నుల దిగుబడి సాధించటం విశేషం. టన్నుకు రూ. 1,500 చొప్పున ఎకరాకు రూ. 67 వేల ఆదాయం లభించింది. ఖర్చులు పోను ఎకరాకు 25 వేలకు పైగా నికరాదాయం లభించింది. చెరకు ఆకు ఆచ్ఛాదనతో ప్రయోజనాలు.. చెరకు కోత పూర్తయ్యాక ఆకులు తదితర వ్యర్థాలను తగులబెట్టకుండా రెండో పంటలో ఆచ్ఛాదనగా వాడి.. కలుపును సమర్థవంతంగా అరికట్టారు. దీనివల్ల రెండో ఏడాది కలుపు తీత ఖర్చు మిగిలింది. పైగా ఆచ్ఛాదన వల్ల భూమిలో వానపాముల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దీంతో భూమి సారవంతమైంది. రెండో ఏడాది ఎకరాకు 65 టన్నులకు తగ్గకుండా చెరకు దిగుబడి వస్తుందని లింగారెడ్డి భావిస్తున్నారు. ఎకరా చెరకు సాగు ఖర్చు రూ. 10 వేలకు తగ్గిందన్నారు. ప్రకృతి సేద్యంలో చెరకు సాగుపై దృష్టి పెట్టి.. మంచి నికరాదాయం పొందాలని ఆయన తోటి రైతులను కోరుతున్నారు. ఎకరా వరిలో రూ. 65 వేల నికరాదాయం! లింగారెడ్డి గత మూడేళ్లుగా 15 ఎకరాల్లో ప్రకృతి సేద్య పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. నెల్లూరు మొలగొలుకులు, బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048 రకాలను సాగు చేస్తున్నారు. దమ్ములో ఎకరాకు 200 కిలోల ఘన జీవామృతం వేస్తున్నారు. 20 రోజులకోసారి కాలువ నీటితోపాటు ఎకరాకు 200 లీటర్ల జీవామృతం అందిస్తున్నారు. భూమిలో సారం లేకపోవటంతో మొదటి రెండేళ్లు ధాన్యం దిగుబడులు ఆశించిన మేర రాకున్నా.. లింగారెడ్డి తన కృషిని కొనసాగించారు. తొలి ఏడాది ఎకరాకు 16 బస్తాల (బస్తా 75 కిలోలు) దిగుబడి రావడంతో తోటి రైతులు లింగారెడ్డిని ఎగతాళి చేశారు. అయినా నిరుత్సాహపడకుండా ప్రకృతి సేద్యాన్ని కొనసాగించారు. రెండో ఏడాది 22 బస్తాల దిగుబడి వచ్చింది. మూడో ఏడాది రసాయన సేద్యం చేసిన తోటి రైతులతో సమానంగా ఎకరాకు 30 బస్తాల ధాన్యం దిగుబడిని సాధించారు. లింగారెడ్డి తాను పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి.. నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. రసాయనిక అవశేషాల్లేకపోవడం, రుచి బాగుండటంతో బంధువులు, పరిచయస్తులు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎకరాలో ధాన్యాన్ని మరపట్టిస్తే 15 క్వింటాళ్ల బియ్యం వస్తున్నాయి. రూ. 80 వేల ఆదాయం వస్తోంది. ప్రకృతి సేద్యంలో ఎకరా వరి సాగుకు రూ. 15 వేలు ఖర్చవుతుండగా.. ఎకరాకు రూ. 65 వేల నికరాదాయం లభిస్తోందని లింగారెడ్డి తెలిపారు. తన పొలం పరిసరాల్లోని ఇతర రైతులకు రసాయన సేద్యంలో ఎకరా వరిలో 20-30 బస్తాల దిగుబడి వస్తోందన్నారు. సాగుకు రూ. 20-25 వేల ఖర్చు పెడుతున్నారు. ధాన్యాన్ని అమ్ముకోవటం వల్ల లాభం అంతంత మాత్రంగానే ఉంటున్నది. ఈ ఏడాది పెరుమాళ్లు పద్ధతిలో ప్రయోగాత్మకంగా 50 సెం.మీ. దూరంలో వరి నారు నాటారు. నీటిని నిల్వగట్టకుండా ఆరుతడి పద్ధతిని పాటిస్తున్నారు. పంట ఆరోగ్యంగా పెరుగుతోందని లింగారెడ్డి తెలిపారు. రెండెకరాల్లో అరటి.. గతే డాది రెండెకరాల్లో అరటిని ప్రకృతి సేద్య విధానంలో సాగు చేస్తున్నారు. తొలిపంటలో ఖర్చులకు సరిపడా ఆదాయం వచ్చినట్టు లింగారెడ్డి తెలిపారు. కొన్ని కూరగాయ పంటలను సైతం పండిస్తున్నారు. తనలాగానే మరింత మంది రైతులు ప్రకృతి సేద్యం చేపట్టి.. ఏటికేడు రసాయనిక అవశేషాల్లేని మేలైన దిగుబడులు సాధించాలని లింగారెడ్డి ఆకాంక్షిస్తున్నారు. - బిల్లుపాటి నాగేశ్వరరావు, సాక్షి, నెల్లూరు రూరల్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకృతి సేద్యంతో రైతుకు మేలు.. ఒకప్పుడు 50 కిలోలు యూరియా వేసే పొలానికి ఇప్పుడు 500 కిలోలు వేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల సాగు భూములు, ప్రజల ఆరోగ్యం పాడవుతోందనే విషయాన్ని రైతులందరూ గుర్తించాలి. ప్రకృతి సేద్యంలోకి మారితే తొలి రెండేళ్లు దిగుబడి తగ్గినా నష్టం ఉండదు. మూడేళ్లు ఓపిక పడితే.. ప్రకృతి సేద్యంలో మంచి దిగుబడులు పొందవచ్చని స్వానుభవంలో నాకెరుకైంది. భూసారం పెంపొందుతుంది. రైతుకు ఖర్చు తగి,్గ నికరాదాయం పెరుగుతుంది. వినియోగదారుల ఆరోగ్యమూ బాగుపడుతుంది. - అల్లూరు లింగారెడ్డి (94939 49389), పెద్ద చెరుకూరు, నెల్లూరు రూరల్ మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 23, 24 తేదీల్లో ‘పల్లె సృజన’ శోధాయాత్ర! ‘పల్లె సృజన’, హనీబీ నెట్వర్క్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ నెల 23 - 24 తేదీల్లో అనంతపురం జిల్లాలో చిన్న శోధాయాత్రను నిర్వహించనున్నాయి. హనిమిరెడ్డి పల్లి నుంచి కంబాల పల్లి వరకు వివిధ గ్రామాల్లో కాలి నడకన వెళ్లి గ్రామాల్లో సృజనశీలురను కలుసుకొని వారి సంప్రదాయ విజ్ఞానాన్ని నమోదు చేస్తారు. పాల్గొనదలచిన యువతీ యువకులు, రైతులు, ఇతరులు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. రాజు- 95028 55858, సందీప్- 87909 75313లను సంప్రదించవచ్చు. www.pallesrujana.org/ చూడొచ్చు. 2017నవంబర్‌లో అంతర్జాతీయ సేంద్రియ మహాసభ సేంద్రియ సేద్యంపై అంతర్జాతీయ (19వ) మహాసభ- 2017కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది నవంబర్ 9-11 తేదీల్లో నోయిడాలో ఈ మహాసభ జరుగుతుంది. అనేక దేశాలకు చెందిన సేంద్రియ రైతులు, శాస్త్రవేత్తలతోపాటు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు పాల్గొంటాయి. సేంద్రియ రైతులు తమ వినూత్న ఆవిష్కరణల గురించి ప్రతినిధులకు వివరించవచ్చు. శాస్త్రవేత్తలు 2016 సెప్టెంబర్ 30లోగా పరిశోధనా పత్రాలను సమర్పించవచ్చు. 2016 అక్టోబర్ 1 నుంచి ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాలకు www.owc.ifoam.bio చూడండి. 18న జీవన ఎరువుల తయారీపై శిక్షణ సేంద్రియ వ్యవసాయంలో వినియోగించే జీవన ఎరువు మైకోరైజా, పంటలపై తెగుళ్ల నివారణకు ఉపయోగించే ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్లను రైతులు తమ ఇంటి వద్ద తయారు చేసుకునే పద్ధతులపై ఈ నెల 18న గుంటూరు జిల్లా కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. విశ్రాంత వ్యవసాయాధికారి కొసరాజు తిరుమలరావు, సేంద్రియ రైతు నొక్కు అశోక్‌కుమార్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి కలిగిన రైతులు 0863- 2286255, 83744 22599 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. -
విజయవడలో చెరకుతో గణేష విగ్రహం
-
‘కొత్త’ ఆశలు ఆవిరి!
భవిష్యత్తు ప్రశ్నార్థం పాలకులది పాత పల్లవే.. ‘మెదక్’తోనే అభివృద్ధి: మేధావులు సంగారెడ్డితో విడదీయరాని అనుబంధం: స్థానిక నేతలు ‘సాక్షి’ కథనానికి స్పందన పొద్దంతా కాయకష్టం చేసే జనం. సావైనా బతుకైనా ‘సాగే లోకం’. చెమటను పారించి.. దిగుబడి సాధించటమే వాళ్ల వ్యాపకం. నిజాం రాజుల ఏలుబడి నుంచి ఖేడ్‌కు ‘ఎద్దు– ఎవుసమే’ ఆదెరువు. స్వాతంత్య్రం వచ్చి కూడా 70 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి సంగారెడ్డితోనే నారాయణఖేడ్‌కు అనుబంధం. ఈ 70 ఏళ్ల కాలంలో ప్రాథమిక జీవన ఆధారమైన వ్యవసాయం రంగం ఏనాడూ ‘బాల్య’దశ దాటలేదు. ఈ ఏడాది మొదటి పాదం వరకు కనీసం నియోజకవర్గం కేంద్రంలోనే వ్యవసాయ మార్కెట్ లేదు. ఇక్కడి రైతును బీదర్, లాతూర్, ఉద్గీర్ వ్యవసాయ మార్కెట్లు చేరదీశాయి. కానీ సొంత జిల్లా మార్కెట్ ఏనాడూ దగ్గరకు రానివ్వలేదు. పునర్విభజనతోనైనా కొత్త ఆశలు చిగురిస్తాయకుంటే.. పాలకులు మళ్లీ పాత పల్లవినే ఎత్తుకోవడంతో ఖేడ్ రైతాంగం భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోందని వ్యవసాయ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ నియోజకవర్గం వ్యవసాయంపైనే ఆధారపడిన ప్రాంతం. పట్టా, ప్రభుత్వ, అటవీ భూములు కలుపుకుని మొత్తం 2.50 లక్షల ఎకరాలున్నాయి. దాదాపు 75 వేల రైతు కుటుంబాలున్నాయి. ఇందులో 1.85 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూములున్నప్పటికీ సాగు నీళ్లు లేక 1.20 లక్షల ఎకరాల్లో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పంట పండుతోంది. నల్లవాగు ప్రాజెక్టు కింద కలే్హర్ మండలంలో 6 వేల ఎకరాలు, 200 కుంటలు, 50 చెరువుల ద్వారామరో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. నియోజకవర్గం వ్యాప్తంగా చిన్న కమతాలు కలిగిన సన్న చిన్న కారు రైతులే ఎక్కువగా ఉన్నారు. ఉన్న కొద్దిపాటి భూమికి సాగునీటి వసతి చేసుకోలేక భూములను బీడు పెట్టి వలస బాట పడుతున్నారు. నియోజకవర్గం నుంచి యోటా కనీసం 75 వేలకు మందికి పైగా రైతులు, రైతు కూలీలు వలస పొతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో ప్రధానంగా పెసర, మినుము, కంది, జొన్న, పత్తి, సోయా, వరి, మొక్కజొన్న, ఉల్లి పంటలను సాగుచేస్తారు. కలే్హర్, పెద్దశంకరంపేట మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు అధికంగా సాగవుతాయి. చెరువులు, కుంటలు, బోరు బావుల కింద వరి, మొక్కజొన్న, చెరకు, సాగుచేస్తారు. నియోజకవర్గం నుంచి ఏడాదికి సగటున 1352.37 టన్నుల వివిధ రకాల పంట దిగుబడి వస్తోంది. ఇందులో సోయా11094హెక్టార్లకు గాను 221.88 టన్నులు,పత్తి 13427హెక్టార్లులో 268.54 టన్నులు, వరి 25,368 హెక్టార్లకు గాను 203 టన్నులు, మొక్కజొన్న 4587 హెక్టార్లలో 321.09 టన్నులు దిగుబడితో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో ఉల్లి, పప్పుధాన్యాలున్నాయి. గడిచిన పదేళ్ల మార్కెట్ విక్రయాలను రికార్డును పరిశీలిస్తే.. నారాయణఖేడ్ రైతులు పండించిన ధాన్యంలో కేవలం 5 శాతం మాత్రమే సంగారెడ్డి, జోగిపేట మార్కెట్‌కు వచ్చాయి. 20 శాతం పంటను కర్ణాటకలోని బీదర్ మార్కెట్‌కు, తరువాత వరుసగా ఔరాద్, మహారాష్ట్రలోని ఉద్గీర్, లాతూర్, దెగులూర్ మార్కెట్‌కు ధాన్యం విక్రయించినట్టు రికార్డులు చెప్తున్నాయి. భౌగోళికంగా... సాగు జలాల లభ్యతను బట్టి చూస్తే నారాయణఖేడ్ ప్రాంతం భూమలు వ్యవసాయం కంటే పారిశ్రామికంగానే అనుకూలమైనవి, చవకైన భూములు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రాలేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల మీదనే దృష్టి పెట్టారు. ఎగుమతి, దిగుమతులకు హైదరాబాద్ అనుకూలం. మంచి రవాణా సౌకర్యంతో పాటు నాణ్యమైన పారిశ్రామిక ఉత్పత్తుల దిగుబడిని ప్రోత్సహించే వాతావరణం ఉండటంతో పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఇక నారాయణఖేడ్ ప్రాంత ఆర్థిక పరిపుష్టికి వ్యవసాయమే మూలం. నీటి వనరులు అభివృద్ధి పరుచుకొని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకోవటమే మార్గం. అది జరగాలంటే సంగారెడ్డి జిల్లా ఎలా అనుకూలం అవుతుంది అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో మెదక్‌జిల్లా వ్యవసాయక జిల్లాగా గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఘణపురం ఆయకట్టు కింద దాదాపు 20 వేల ఎకరాల్లో భూమి సాగు అవుతుంది. ఆనకట్ట ఎత్తు పెంచి మరో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు కదులుతోంది. అదే జరిగితే మెదక్ జిల్లా దక్షిణ తెలంగాణ ధాన్యాగారంగా మారడం ఖాయం. ఈ క్రమంలో జిల్లాకు మరిన్ని వ్యవసాయ రాయితీలు, ప్రోత్సాహకాలు వచ్చే అవకాశం ఉంది. పంట విధానాలపై, మేలైన వంగడాల సృష్టి కోసం విస్తృతమైన ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ఈ సంక్షేమ, ప్రయోగా ఫలాలు సహజంగానే జిల్లా అంతటికీ విస్తరించి వ్యవసాయ రంగం మెరుగుపడే అవకాశాలు అద్భుతంగా ఉంటాయని వ్యవసాయ పరిశోధకులు అంచనా వేస్తున్నాయి. సాక్షి కథనం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. మొదటి కథనంతోనే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు ‘సాక్షి’ కార్యాలయానికి ఫో¯ŒS చేసి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షట్కర్ సాక్షి కథనాలను ఖండించగా.. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్టు ఆర్ సత్యనారాయణ, మేధావులు, విద్యావంతులు, అధికారులు కథనాలను సమర్థించారు. -
చెరకు టన్నుకు రూ.4 వేలు ఇవ్వాలి
హనుమాన్‌జంక్షన్ రూరల్ : కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధర టన్నుకు రూ. 4 వేలు ప్రకటించేలా సీఎం చంద్రబాబు చొరవ చూపాలని చెరకు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి సత్యవెంకటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతిపత్రాన్ని తపాలా ద్వారా పంపినట్లు ఆయన శుక్రవారం విలేకరులకు చెప్పారు. చెరకు పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన వాపోయారు. దీంతో చెరకు సాగు విస్తీర్ణం రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోతోందని అందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరకు అదనంగా మరో రూ. 1000 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని నండూరి డిమాండ్ చేశారు. చెరకు కొనుగోలు పన్ను టన్నుకు రూ. 60ని నేరుగా రైతులకు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతులతో త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
చెరకు రైతుకు అండ
నెలాఖరులోగా బకాయిలు ఇవ్వకుంటే ఆందోళన మంత్రుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ చోడవరం: చెరకు రైతులకు ఈనెలాఖరులోగా బకాయిలు ఫ్యాక్టరీలు చెల్లించకపోతే జిల్లా కలెక్టరేట్ వద్ద రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగుతుందని వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ ప్రతినిధి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఇక్కడ మంగళవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను మోసం చేస్తూ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కిందస్థాయి వరకు అంతా దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గోవాడ ఫ్యాక్టరీని రూ.25 కోట్లు లాభాల్లో ఉంచితే ఇప్పుడు పూర్తిగా నష్టాల్లోకి తెచ్చి చివరికి రైతులకు సకాలంలో పేమెంట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి తేవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. టన్నుకు రూ.175చొప్పున ఇవ్వాల్సిన బకాయి పేమెంట్ ఈనెల 31లోగా ఇవ్వకపోతే వచ్చే నెలలో జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగుతుందని, ఈ విషయమై శాసనసభలో కూడా పార్టీ తరపున ప్రస్తావిస్తామని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఇది పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి మాట అని బొత్స చెప్పారు. గతంలో కూడా ఇందిరమ్మ కమిటీలను గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిందని, అయితే ఎవరైనా అర్హులు పథకాలకు ఉండిపోతే సూచించడానికే ఆ కమిటీ పరిమితమయ్యేదని గుర్తుచేశారు. కాని ఇప్పుడు జన్మభూమి కమిటీలు అర్హులైన వారిని కూడా తీసేయడంతోపాటు దోపిడీలకు పాల్పడతున్నాయని ఆరోపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ ఇష్టారాజ్యం: రాష్ర్ట శాసనసభలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బొత్స పేర్కొన్నారు. శాసనభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం సంప్రదాయమని, అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే ప్రతి మాటకు మంత్రులు అడ్డుపడి ఇష్టారాజ్యంగా మాట్లాడటం, పది మంది మంత్రులు ఒకేసారి మాటల దాడికి దిగడం అధికార పార్టీ దౌర్జన్యపూరిత విధానాలకు అద్దంపడుతోందన్నారు. శాసనసభలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ప్రజలు చూస్తున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులతో సహా అధికార పార్టీ తీరు, వారు వాడుతున్న పదజాలం చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న ప్రసుత్త శాసనసభకు వెళ్లకపోవడమే మంచిదని కొందరు సీనియర్ నేతలు అనుకునే స్థాయిలో సభ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ రాజధాని నిర్మించినా తమ పార్టీకి అభ్యంతరం లేదని, అయితే రాజధాని పేరుతో జరుగుతున్న భూదందా,దోపిడీలకు వ్యతిరేకంగానే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని బొత్స స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందు మంత్రులకు, తన సన్నిహితులకు సీఎం చెప్పి రైతుల నుంచి అన్యాయంగా భూములు తీసుకొని, వారికి పంట దక్కకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ భూ దోపిడీపై విచారణ చేయించాలని బొత్స డిమాండ్ చేశారు. తమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి శాసనసభలో మాట్లాడుతున్న తీరు చాలా దారుణంగా ఉందన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం: జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాధ్ మాట్లాడుతూ పార్టీ కమిటీలు నెలకు ఒకసారి సమావేశాలు నిర్వహించుకొని గ్రామస్థాయి ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. విశాఖకు రైల్వేజోన్‌ను ఏప్రిల్ 14లోగా ఇవ్వకపోతే ఆమరణదీక్షకు దిగుతానని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు పరిశీలిస్తున్నారని, టీడీపీకి త్వరలోనే బుద్ధిచెబుతారన్నారు. సమస్యలు గాలికొదిలేసిన ఎమ్మెల్యే: నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గం అనేక మంది అర్హులకు పింఛన్లు సైతం ఇవ్వలేదని, స్థానిక ఎమ్మెల్యే ప్రజాసమస్యలు వదిలేసి మూడు క్వారీలు, ఆరు క్రషర్లుగా సొంత పనులు చేసుకోవడానికే అధికారాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. గోవాడ సుగర్స్‌లో రైతుల సొమ్ముతో ఎమ్మెల్యే, సుగర్స్ చైర్మన్ పేరుతో విరాళాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రతినిధులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, గొల్ల బాబూరావు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, మాజీలు ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు, తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు, తిప్పలనాగిరెడ్డి , కర్రి సీతారాం, పార్టీ నాయకులు జాన్ వెస్లీ, సత్తిరామకృష్ణారెడ్డి, వీసం రామకృష్ణ, బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి‘వలస’
పొట్టకూటికి ఇల్లు, వృద్ధులు, పిల్లల్ని వదిలి వెళ్లిన వారంతా తిరిగి ఇంటిముఖం పట్టారు. కంగ్టి మండలంలోని ఆరు వేల మందికిపైగా కూలీలు బోధన్, కామారెడ్డి,మాగి, సంగారెడ్డి , మెదక్ చెరకు కర్మాగారాల పరిధిలోని చెరకు నరికే పనులకు వెళ్లారు. గత సెప్టెంబరులో వలసబాట పట్టిన వీరంతా శుక్రవారం తిరిగి ఒక్కొక్కరే ఇంటిముఖం పట్టారు. ఎడ్లబండ్లపై సరంజామా సర్దుకుని స్వగ్రామాలకు చేరారు. - కంగ్టి -
చెరకు పంటను తగలబెట్టిన దుండగులు
-
అన్నదాత కుదేలు
యలమంచిలి సబ్‌డివిజన్‌లో 16వేల ఎకరాల్లో నీటమునిగిన వరి 8,500 ఎకరాల్లో చెరకుకు నష్టం యలమంచిలి : వరుస విపత్తులతో అన్నదాత కుదేలవుతున్నాడు. హుదూద్ తుపాను రూపంలో వరుసగా మూడో ఏడాది యలమంచిలి నియోజకవర్గంలో పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఈసారి పెనుగాలుల బీభత్సానికి పంటలతో పాటు మహావృక్షాలు నేలకొరగడంతో రైతులు మరింత ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చింది. యలమంచిలి వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో దాదాపు 25వేలకుపైగా ఎకరాల్లో పంటలు నీటమునిగినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 16వేల ఎకరాల్లో వరి, 8,500 ఎకరాల్లో చెరకు, 515 ఎకరాల్లో పత్తి, కంది, మినుము, పెసలు, నువ్వు పంటలు ముంపులో ఉన్నట్టు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. యలమంచిలి వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో 25,015 ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్టు యలమంచిలి అసిస్టెంట్ డెరైక్టర్ డి.మాలకొండయ్య గురువారం చెప్పారు. ప్రస్తుతం పంట పొలాల్లో వర్షపునీరు మెల్లగా బయటకు వస్తోందని, రెండు మూడు రోజుల్లో పూర్తి నష్టం అంచనా తెలుస్తుందని చెప్పారు. నీటమునిగిన పొలాల్లో నీరు తొలగిన వెంటనే వరిపంటకు ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని, చెరకు తోటల్లో ఎకరానికి 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ కలిపిన ద్రావణాన్ని వినియోగిస్తే తెగుళ్లు సోకకుండా పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని ఏడీ సూచించారు. ఎక్కువ చెరకు తోటల్లో గెడలు విరిగిపోవడంతో వాటిని ఎత్తికట్టడానికి కూడా వీలులేని పరిస్థితి ఉందన్నారు. పెనుగాలుల ధాటికి చెరకు పంటకు భారీగా నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ విస్తరణాధికారులు చెబుతున్నారు. మరోవైపు రైతులు రెండేళ్ల క్రితం నీలం తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలకే ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదని, ఈసారైనా త్వరితగతిన పరిహా రం అందించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. ఉద్యానపంటలకూ నష్టం... యలమంచిలి వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో సంప్రదాయ పంటలతో పాటు ఈసారి ఉద్యానపంటలకూ తీవ్ర నష్టం సంభవించింది. హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలుల తాకిడికి మామిడి, జీడితోటల్లో చెట్లు నేలకొరిగాయి. కొబ్బరిచెట్లు తలలు తెగినట్లు మోడువారాయి. పంటచేతికందే సమయంలో హుదూద్ తుపాను రూపంలో తమకు నష్టం చేకూర్చిందని యలమంచిలి ప్రాంతంలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేలాది ఎకరాల్లో సంవత్సరాలు సంరక్షిస్తున్న మామిడి, జీడి, కొబ్బరి తోటలు నిర్జీవంగా మారిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. ప్రభుత్వం తమపై దయచూపి మెరుగైన నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు. -
చెరుకు బకాయిలు రూ. 200 కోట్లు!
సీజన్ ముంచుకొస్తుండడంతో అన్నదాత ఆందోళన పట్టించుకోని సర్కార్ బొబ్బిలి: అన్నదాతకు అన్నివిధాల అన్యాయమే జరుగుతోంది. ప్రకృతి ఒకవైపు పగపడుతుంటే...మరోవైపు పండించిన పంటకు రావలసిన సొమ్ములు చేతికిరాక నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా చెరుకు పంటకు సంబంధించి రాష్ట్రంలో రైతులకు అందాల్సిన బకారుులు రూ.200 కోట్లు వరకు ఉన్నాయంటే పరిస్థితి అర్థం అవుతుంది. రాష్ట్రంలో 42 చక్కెర కర్మాగారాలు ఉండగా 29 ఫ్యాక్టరీలు రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపాన లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం రైతులకు బకారుుల చెల్లించని నేపథ్యంలో ఫ్యాక్టరీ డెరైక్టర్లు జైలు పాలు కావడంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్సీఎస్ గ్రూపునకు నెల్లూరు వద్ద కూడా మరో ఫ్యాక్టరీ ఉండగా... అక్కడా కోట్ల రూపాయల్లో బకారుు పడడంతో అక్కడి రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సహకార రంగంలో నాలుగు చక్కెర కర్మాగారాలున్నారుు. వాటి పరిధిలో సుమారు రూ.40 కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో మూడు మిల్లులు ఉండగా రెండింటిని ప్రైవేటు యూజమాన్యం నిర్వహిస్తుండగా, ఒకటి సహకార రంగంలో నడుస్తోంది. ఆ జిల్లాలో కూడా రూ.26 కోట్లు వరకు బిల్లులు రైతులకు చెల్లించాల్సి ఉంది. విశాఖ జిల్లాలో నాలుగు సహకార రంగానికి చెందిన మిల్లులు ఉండగా రూ.20 కోట్ల వరకు బకారుులున్నారుు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నాలుగు కర్మాగారాలు ఉండగా ఆమదాలవలస కర్మాగారర ఎప్పుడో మూతపడింది. భీమసింగి మిల్లు సహకార రంగంలో, సంకిలి, లచ్చయ్యపేట కర్మాగారాలు ప్రైవేటు యూజమాన్యాల చేతిలో ఉన్నారుు. చెరుకు పంటకు ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు మదుపులైతే సరాసరి 25 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వీటికి కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు గిట్టుబాటు ధర కల్పిస్తే, రాష్ట్ర ప్రభుత్వం, మిల్లులు కలిపి మిగిలిన డబ్బులు రైతులకు ఇవ్వాలి. 2002 వరకూ కేంద్రం ప్రకటించిన మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం సలహా ధరను ఇచ్చేది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం దానిని ఎత్తేయడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయూరై యూజమాన్యం ఆడిందే ఆటగా మారింది. 12 ఏళ్లుగా రాష్ట్రం ధరను ప్రకటించని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర ఇవ్వాలని సుప్రీం కోర్టు సైతం సూచించినా ఇప్పటికీ అమలు కాలేదు. మిగిలిన రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది. ప్రైవేటు ఇష్టారాజ్యం... గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చక్కెర కర్మాగారాలు నడిచేటప్పుడు వారిచ్చిన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు, మద్దతు ధర వల్ల ప్రైవేటు ఫ్యాక్టరీలు దిగి వచ్చేవి. అప్పట్లో 20 ఫ్యాక్టరీలను సహకార రంగం, ప్రభుత్వం కలిపి నడపగా 20 ఫ్యాక్టరీలు ప్రైవేటు యూజమాన్యంలో నడిచేవి. ఇప్పుడు 11 ప్రభుత్వ ఫ్యాక్టరీలు మూతపడగా, కో ఆపరేటివ్ రంగానికి చెందిన ఏడు మాత్రమే మిగిలారుు. వీటిలో తక్కువ సామర్థ్యం కలిగిన పాత యంత్రాలు ఉండడంతో క్రషింగ్ అంతంతమాత్రంగా సాగుతోంది. దీంతో ప్రైవేటు యజమాన్యాల ఇష్టారాజ్యం సాగుతోంది. రాష్ట్రంలో అత్యంత తక్కువగా లచ్చయ్యపేట ఎన్సీఎస్ కర్మాగారంలోనే రూ.2350 ధర ఉంది. ఈ మిల్లు పరిధిలో సుమారు 16 వేల మంది రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటించినా చెల్లింపులు లేవు. -
మేఘమా మురిపించకే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గత ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు 2014 ఖరీఫ్ సీజన్‌కు కార్యాచరణను రూపొందించారు. 3,20,761 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు వేస్తారని అంచనా వేశారు. జిల్లాలో ప్రధానంగా వరి, సోయా సాగు అధికంగా ఉంటుంది. ఆ తర్వాత పసుపు, చెరుకును పండిస్తారు. ఈ నేపథ్యంలో 3.21 లక్షల హెక్టా ర్లకుగాను 12,4625 హెక్టార్లలో వరి, 70910 హెక్టార్లలో సోయా, 57,630 హెక్టార్లలో మొక్కజొన్న, 11508 హెక్టార్లలో పసుపు వేయనుండగా.. మిగతా హెక్టార్లలో కందులు, పెసర, చెరకు తదితర పంటలు వేస్తారని అంచనా వేశారు. ఇందుకోసం ఏపీ సీడ్స్, హాకా, ఏపీ అయిల్‌ఫెడ్ ద్వారా 70 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు, 3,650 క్వింటాళ్ల మొక్కజొన్నలతోపాటు మొత్తం 79,800 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 2,42,685 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముంటాయని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న వ్యవసాయశాఖ ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే అందుకు భిన్నంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సాగును కొనసాగించలేక, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లలేక రైతులు అయోమయంలో ఉన్నారు. తగ్గిన వర్షపాతం.. ప్రాజెక్టులపైనే భారం గతేడాదితో పోలిస్తే జిల్లాలో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ వర్షపాతం, గత రెండేళ్లలో నమోదైన వర్షపాతంతో పోల్చితే పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో వరి, సోయా తదితర పంటలకు స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపాలనుకున్నా ప్రాజెక్టులపై భారం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఆశాజనకంగానే ఉన్నా ఆయకట్టు రైతులు భవిష్యత్ పరిణామాలకు భయపడుతు న్నారు. సాధారణ వర్షపాతం జిల్లాలో 849 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు 233.6 మి.మీటర్లు నమోదు కావాల్సి ఉంది. 2012లో ఇదే సీజన్లో 178.70 మి.మీటర్లు, 2013 సంవత్సరంలో 301.90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 91.80 మి.మీ. నమోదైంది. 59 శాతం వర్షపాతం మైనస్‌గా ఉం డటం రైతులకుఆందోళన కలిగిస్తోంది. ఇదిలా వుంటే శ్రీరాంసాగర్‌లో 1091 ఫీట్లకు 1067.60 ఫీట్ల వరకు నీరు ఉన్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. నిజాంసాగర్‌లో1405 ఫీట్లకు 1392.78 ఫీట్లుగా నమోదు కాగా.. ప్రత్యామ్నాయ పంటలకు ప్రాజెక్టుల నీరు ఏ మేరకు వినియోగం అవుతుందన్న చర్చ జరుగుతోంది. -
4% పెరగనున్న చక్కెర ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది చెరకు సాగు రెండు శాతం తగ్గినా పంచదార ఉత్పత్తిలో మాత్రం నాలుగు శాతం వృద్ధి నమోదవుతుందని ఇండియన్ షుగర్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రాథమికంగా అంచనా వేసింది. 2014-15 (అక్టోబర్-సెప్టెంబర్) ఏడాదికి పంచదార ఉత్పత్తి నాలుగు శాతం పెరిగి 2.43 కోట్ల టన్నుల నుంచి 2.53 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే 75 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉండటం, ఉత్పత్తి పెరగనుండటంతో డిమాండ్‌కు ఇబ్బంది ఉండదని అంచనా వేసింది. దేశంలో ఈ ఏడాది 2.4 కోట్ల టన్నుల పంచదార అవసరమవుతుందని అంచనా. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాదిలో వర్షాలు సరిగా కురవకపోవడంతో చెరకు సాగు విస్తీర్ణం రెండు శాతం తగ్గే అవకాశం ఉందని ఐఎస్ఎంఏ చెపుతోంది. ఉపగ్రహ మ్యాప్‌లు ఆధారంగా చూస్తే గతేడాది కంటే రెండు శాతం తక్కువగా 52.3 లక్షల హెక్టార్లలో చెరకు సాగు అవుతుందని లెక్కకట్టింది. -
తీపి చేసేవారికి చేదు
=నాలుగు నెలలుగా పస్తులు =జీతానికి నోచుకోని ‘తుమ్మపాల’ కార్మికులు =రూ. కోటికి పైగా బకాయిలు =నేటి నుంచి క్రషింగ్ అందరికీ తీపిని పంచుతారు.. చెరకు నుంచి చక్కెర తయారు చేస్తారు.. వారు మాత్రం చేదు దిగమింగి బతుకంతా ఉసూరం టారు. శ్రమించి చక్కెరను ఉత్పత్తి చేసే తుమ్మపాల సుగర్స్ ఉద్యోగులు చేదును చవి చూస్తున్నారు. పనిచేస్తున్న కర్మాగారం భవితవ్యంపై నీలినీడలు అలుముకుంటూ ఉండడంతో బితుకుబితుకుగా కాలం గడుపుతున్నారు. జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ అష్టకష్టాలతో నెట్టుకొస్తున్నారు. అనకాపల్లి, న్యూస్‌లైన్: సుదీర్ఘ చరిత్ర గల తుమ్మపాల సుగర్స్ అనేక రకాల సమస్యలతో సతమతమవుతోంది. ఆర్థిక భారంతో కుంగిపోతోంది. దాంతో ఉద్యోగులు కర్మాగారం భవితవ్యంపై కలవరపడుతున్నారు. మరోవైపున నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం కాలం గడపడంతో విలవిలలాడుతున్నారు. కర్మాగారం పరిధిలో 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 120 మంది ఎన్ఎంఆర్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ నాలుగు నెలలుగా జీతాలు లేవు. యాజమాన్యం రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంది. మరో మూడు రోజులు గడిస్తే బకాయిలు ఐదు నెలలకు చేరుతాయి. దీంతో ఉద్యోగుల కుటుంబాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. మరోవైపున శనివారం నుంచి క్రషింగ్ ప్రారంభిస్తున్నారు. మరో 302 మందిని సీజనల్ ఉద్యోగులుగా విధుల్లోకి తీసుకుంటారు. వీరికీ జీతాలివ్వాలి. గానుగాట చేపట్టాక ఉత్పత్తయిన పంచదార బస్తాలను తాకట్టు పెట్టి ఆప్కాబ్ ద్వారా రుణం తీసుకుని ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు యాజమాన్యం యోచిస్తోంది. సుమారు రూ. 40 కోట్లకు పైబడిన అప్పుల్లో యాజమాన్యం ఇప్పటికే కూరుకుపోయింది. రుణం చెల్లించాలంటూ ఏపీఐడీసీ, ఆప్కాబ్ ఒత్తిడి తెస్తున్నాయి. మిల్లు ఆధునికీకరణకు రూ.7.54 కోట్లు రుణంగా ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినా ఆ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. గతేడాది రూ. 63 లక్షల బకాయిలను రైతులకు ఇప్పటికీ చెల్లించలేదు. నేటి నుంచి గానుగాట 99వేల టన్నుల గానుగాట లక్ష్యంగా తుమ్మపాల సుగర్స్ శనివారం నుంచి గానుగాట ప్రారంభించబోతోంది. ఉదయం 8-41 గంటలకు క్రషింగ్ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు టన్నుకు రూ. 2100 మద్దతు ధర చెల్లించాల్సి ఉంది. పురాతన యంత్రాల కారణంగా రికవరీ తగ్గిపోవడంతో బస్తా పంచదార ఉత్పత్తికి రూ.3,200 ఖర్చవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో బస్తా పంచదార రూ. 2650 మాత్రమే ధర పలుకుతోంది. క్రషింగ్ చేపట్టినా నష్టాలు తప్పని పరిస్థితుల్లో రైతుల మనోభావాలు దెబ్బతినకుండా గానుగాటకు యాజమాన్యం సిద్ధమైంది. జాతీయ చక్కెర సహకార సమాఖ్య సూచనల మేరకు రుణం మంజూరయితే మరో పదేళ్ల వరకు గానుగాట జరపొచ్చుననేది అధికారుల అభిప్రాయం -
చెరకు రైతుకు ‘కొత్త’ కానుక
రాష్ర్ట అన్నదాతలకు కొత్త సంవత్సర కానుకగా చెరకు మద్దతు ధర టన్నుకు రూ.2650గా నిర్ణయించారు. కేంద్రం రూ.2100 ప్రకటించగా, రవాణా ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.550ను అదనంగా చేర్చారు. శ్రీలంక, భారత నావికాదళం సంయుక్తంగా చేపట్టనున్న ఉమ్మడి శిక్షణను ఖండిస్తూ సీఎం జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని చెరకు రైతులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. టన్ను చెరకుకు 2,650 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం మంత్రి మండలి సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, విభాగాల వారీగా ప్రగతి, నిధుల కేటాయింపులు, కలెక్టర్ల మహానాడులో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలపై చర్చించారు. వ్యవసాయ ఉత్పత్తులు, రాష్ర్టంలో సాగవుతున్న పంటల ఉత్పత్తి తది తర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చెరకు మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టన్నుకు రూ. 2650 : రాష్ర్టంలో 8.65 లక్షల ఎకరాల్లో చెరకు సాగువుతోంది. చెరకు రైతులకు ప్రతి ఏటా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తోందని సీఎం జయలలిత గుర్తుచేశారు. పభుత్వం కల్పిస్తున్న రాయితీలు, రుణాల పంపిణీ గురిం చి విశదీకరించారు. చక్కెర ఉత్పత్తి పెంపు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం చెరకు మద్దతు ధర ప్రకటించినప్పుడల్లా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కొంత మొత్తాన్ని చేరుస్తూ, అన్నదాతకు అందజేస్తోందని గుర్తు చేశారు. ఈ ఏడాది టన్నుకు రూ.2100 కేంద్రం నిర్ణయించగా, రవాణా ఖర్చు రూ.100తో పాటుగా రూ.550ను రాష్ట్ర ప్రభు త్వ వాటాగా పెంచామన్నారు. టన్ను మద్దతు ధర రూ.2650గా నిర్ణయించామన్నారు. 2013-14 సం వత్సరానికి మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించినా, రాష్ర్ట వాటాలో చడీచప్పుడు కాకుండా రూ.వంద కోత పెట్టడం గమనార్హం. శిక్షణ వద్దు: శ్రీలంక, భారత నావికాదళం సంయుక్తంగా చేపట్టనున్న ఉమ్మడి శిక్షణను రద్దు చేయాలని కేంద్రాన్ని సీఎం జయలలిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆమె లేఖాస్త్రం సంధించారు. ఈలం తమిళుల సంక్షేమం విషయంలో, తమిళ జాలర్లపై దాడుల వ్యవహారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక ఆర్మీ సేనకు ఇక్కడ శిక్షణ ఇప్పించేం దుకు జరిగిన ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు రాజుకున్న విషయం గుర్తు చేశారు. ప్రస్తుతం త్రికోణ మలై వేదికగా సంయుక్త శిక్షణకు నిర్ణయించినట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ శిక్షణ ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారత నావికాదళాన్ని వెనక్కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని, తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా తరచూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రక్షణ శాఖ తీరుకు కళ్లెం వేయాలని డిమాండ్ చేశారు. -
జాన్‌డీర్ నుంచి చెరకు కోత యంత్రం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫార్మ్ ఎక్విప్మెంట్ కంపెనీ జాన్ డీర్ కొత్తగా షుగర్‌కేన్ హార్వెస్టర్(చెరకు కోత యంత్రం), సీహెచ్330ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ యంత్రం ధరను రూ.1.4 కోట్లుగా నిర్ణయించామని జాన్ డీర్ ఇండియా ఎండీ, సీఈవో సతీష్ నాడిగర్ చెప్పారు. ఈ యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిక్ అన్వర్ ఇక్కడ జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో ఆవిష్కరించారు. 198 హార్స్‌పవర్‌తో పనిచేసే ఈ యంత్రం హెక్టార్‌కు 150 టన్నుల చెరకును కోత కోస్తుందని, భారత్‌లో ఉండే చిన్న చెరుకు కమతాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా దీనిని రూపొందించామని సతీష్ వివరించారు. వ్యవసాయ కూలీల వ్యయాలు పెరుగుతుండడంతో ఇలాంటి యంత్రాలకు డిమాండ్ పెరుగుతుందని, రానున్న సంవత్సరాల్లో ఈ యంత్రాల అమ్మకాలు పెరగగలవని ఆయన అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది 20 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ యంత్రాల కొనుగోళ్లకు వినియోగదారులకు రుణాలివ్వడానికి వివిధ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామని పేర్కొన్నారు.