చెరకు టన్నుకు రూ.4 వేలు ఇవ్వాలి
Published Fri, Aug 5 2016 7:51 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
హనుమాన్‌జంక్షన్ రూరల్ :
కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధర టన్నుకు రూ. 4 వేలు ప్రకటించేలా సీఎం చంద్రబాబు చొరవ చూపాలని చెరకు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి సత్యవెంకటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతిపత్రాన్ని తపాలా ద్వారా పంపినట్లు ఆయన శుక్రవారం విలేకరులకు చెప్పారు. చెరకు పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన వాపోయారు. దీంతో చెరకు సాగు విస్తీర్ణం రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోతోందని అందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరకు అదనంగా మరో రూ. 1000 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని నండూరి డిమాండ్ చేశారు. చెరకు కొనుగోలు పన్ను టన్నుకు రూ. 60ని నేరుగా రైతులకు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతులతో త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement