షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను అరెస్ట్ చేయాలి
షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను అరెస్ట్ చేయాలి
Published Thu, Oct 13 2016 10:14 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- చెరకు రైతుల రిలే దీక్షలు ప్రారంభం
నంద్యాల రూరల్: నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్ గుప్తను వెంటనే అరెస్ట్ చేయాలని చెరకు రైతులు డిమాండ్ చేశారు. అఖిల రైతు పక్షాల ఆధ్వర్యంలో గురువారం ఫ్యాక్టరీ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఫ్యాక్టరీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని ఆరోపించారు. చెరకు రైతుల పేరుతో నంద్యాల సిండికేట్ బ్యాంకులో 9.80 కోట్లు రుణం తీసుకున్నారని, రుణమాఫీ రైతులకు దక్కకుండా ఫ్యాక్టరీ ఛైర్మన్‌కు జమ అవుతోందని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల సిద్ధారెడ్డి తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా ప్రజాప్రతినిధులు అడ్డుకోవడం లేదన్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు..ఫ్యాక్టరీ చైర్మన్ చెప్పినట్లు తలాడించడం శోచనీయమని సీపీఎం డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలీ, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహ అన్నారు. నంది రైతు సమాఖ్య అ«ధ్యక్షులు యరబోలు ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. 75 రోజులు 75 గ్రామాల రైతులు దీక్షల్లో పాల్గొంటారన్నారు. దీక్షలకు బీజేపీ నాయకుడు తూము శివారెడ్డి, సీపీఎం మండల కన్వీనర్ సద్ధాం హుసేన్ , కౌలు రైతుల సంఘం నాయకులు పుల్లయ్య, నంది రైతు సమాఖ్య చంద్రశేఖర రెడ్డి, అయ్యలూరు బసవేశ్వర రెడ్డి, చాబోలు బంగారు రెడ్డి నందిపల్లె సాగేశ్వర రెడ్డి, పొన్నాపురం పుల్లయ్య , వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బంగారయ్య తదితరులు సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement