మధుసూదన్‌గుప్తపై చీటింగ్‌ కేసు | cheating case on madhu sudhan gupta | Sakshi
Sakshi News home page

మధుసూదన్‌గుప్తపై చీటింగ్‌ కేసు

Published Sat, Oct 22 2016 11:29 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

cheating case on madhu sudhan gupta

 నంద్యాల: బ్యాంకు రుణం పేరిట రైతు వెంకటరామిరెడ్డిని దగా చేసిన చక్కెర ఫ్యాక్టరీ ఎండీ, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తపై టూటౌన్‌ పోలీసులు శనివారం చీటింగ్‌ కేసు నమోదు చేశారు. గడివేముల మండలం బూజనూరు గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డికి స్థానిక సిండికేట్‌ బ్యాంకులో బ్యాంకు రుణాన్ని మధుసూదన్‌గుప్త ఇప్పించారు.  వెంకటరామిరెడ్డి  తిరిగి ఆ డబ్బు మధుసూదన్‌గుప్తకు ఇచ్చాడు. అయితే, ఈ డబ్బును ఆయన బ్యాంకులో జమ చేయకపోవడంతో వెంకటరామిరెడ్డికి  బ్యాంకు రుణం కట్టాల్సిందిగా నోటీసులు అందాయి.  తనకు జరిగిన మోసంపై బాధితుడు వెంకటరామిరెడ్డి టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో  ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మధుసూదన్‌గుప్త, ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ వెంగళరెడ్డి, ఉద్యోగులు కృష్ణ, గంగాధర్‌లపై చీటింగ్‌ను నమోదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement