రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి
తెర్లాం రూరల్:టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పటిలో గా పూర్తి చేస్తారన్న దానిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉందని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. శనివారం ఆయన తెర్లాం మండలంలోని కుసుమూరులో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీపై మాయ మాటలు చెప్పి రైతులు, మహిళలను మో సం చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ వర్తింపజేయకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని చెప్పారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయూల్సి వస్తోందన్నారు.
బ్యాంకులు గతంలో మహిళలకు పిలిచి రుణాలిచ్చేవ ని, ప్రస్తుతం రుణమాఫీ అనడంతో బ్యాంకులు మహిళలకు అప్పులు ఇవ్వడం మానేశాయని తెలిపారు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో మంజూరు చేసిన ఇళ్లపై దర్యాప్తు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. పింఛన్ల పెంపుపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని చెప్పారు. బొబ్బిలి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు కోట్లాది రూపాయలు బకాయి చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎన్‌సీఎస్ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే అక్షయ గోల్డ్ ఆస్తులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని వాటిలో అమ్మకాలతో వచ్చిన సొమ్మును బాధితులకు ఇవ్వాలన్నారు. వీటన్నింటిపై అసెం బ్లీలో ప్రస్తావిస్తానన్నారు. అలాగే నియోజకవర్గం లోని కుసుమూరు-వంతరాం, నంది గాం-కుసుమూరు రోడ్డు పనులకు నిధుల మంజూరు విషయమై కలెక్టర్‌తో మాట్లాడుతానని చెప్పారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు నర్సుపల్లి వెంకటేశ్వరరావు, తెంటు సత్యంనాయుడు, గులివిందల శ్రీనివాసరావు ఉన్నారు.
ఎందుకింత నిర్లక్ష్యం..?
నందిగాం (తెర్లాం రూరల్): మూడేళ్ల క్రితం వచ్చిన తుపానుకు పాడైన రోడ్డు, కల్వర్టుకు ఇంతవరకు మరమ్మతులు చేయకపోతే ఎలా అని బొ బ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు అధికారులను ప్రశ్నించారు. శని వారం ఆయన నంది గాం-కుసుమూరు రోడ్డులో నీలం తుపానుకు కోరుకుపోయిన కల్వర్టు, కోతకు గురైన రోడ్డును పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎందుకు మరమ్మతులు చేయలేదని పీఆర్ డీఈఈ కృష్ణాజీని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయ న మూడేళ్లుగా కల్వర్టు, రోడ్డు పనులు చేపట్టేందుకు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని, కానీ నిధులు మంజూరు కాకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నామని చెప్పారు.
సందర్భంగా మాజీ జెడ్పీటీసీ తెంటు సత్యంనాయుడు కల్వర్టు, రోడ్డు లేకపోవడంతో రైతులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే, అధికారులకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాదైనా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నందిగాం సర్పంచ్ ఆర్నిపల్లి సత్య ంనాయుడు, పీఆర్ ఏఈ ఆదిమూర్తి, డీఈఈ తవిటిరాజు, మండల ఇంజనీరింగ్ అధికారి రామనాధం, తదితరులు పాల్గొన్నారు.