నమ్మించి..మోసం చేస్తున్నారు!
సాలూరు: టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతులు, డ్వాక్రా మహిళలను నమ్మిం చి మోసం చేస్తోందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర ఆరోపించారు. ఎ న్నికలకు ముందు అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక రోజుకో ప్రకటన చేస్తూ..లేనిపోని నిబంధనలు విధిస్తున్నారన్నా రు. మాఫీకి సంబంధించి అసలు రైతులకు అర్హత లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను మాఫీ చేస్తామం టున్నారని, దీని వల్ల పంట విస్తీర్ణం ప్రకారం ఎంత మొత్తంలో బ్యాంకు లు రుణాలు ఇస్తున్నాయో..అంతే మొ త్తాన్ని మాఫీ చేస్తారని తెలిపారు.
అలాగే ఒక ఇంటిలో ఒకరికే మాఫీ వర్తింపజేయడం సరికాదన్నారు. బంగారు రుణాలకు ఒకసారి మాఫీ వర్తించదని, మ రోసారి వర్తిస్తుందని, అది కూడా విస్తీర్ణం మేరకేనని ఇలా రోజుకో నిబంధన పెట్టి రైతులకు మాఫీ పొందే అర్హత, అవకాశం లేకుం డా చేస్తున్నారన్నారు. అరటి రైతులకు కూడా మాఫీ వర్తిస్తుందని చెప్పి.. ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ జీఓలో అరటి రైతులకు మాఫీ వర్తించదని ఎక్కడా పేర్కొలేదని తెలిపారు. అరటి రైతుల బ్యాంకు ఖాతాల్లోని నగదును బ్యాంకు అధికారులు మినహారుుంచుకుంటున్నట్టు తమ తనదృష్టికి వచ్చిందన్నారు. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక చర్య అని అభిప్రాయపడ్డారు. దీనిపై అరటి రైతులంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతుల తరఫున తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. ఇదే విషయమై డిసెంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవసరమైతే న్యాయ పోరాటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.