టీడీపీ వంద రోజుల పాలన రిజల్ట్స్ | TDP's 100-day rule aflop show | Sakshi
Sakshi News home page

టీడీపీ వంద రోజుల పాలన రిజల్ట్స్

Published Tue, Sep 16 2014 1:17 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

టీడీపీ వంద రోజుల పాలన రిజల్ట్స్ - Sakshi

టీడీపీ వంద రోజుల పాలన రిజల్ట్స్

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : వందబాల్స్ ఆడి ఒక్క రన్నూ చేయని విధంగా తయారైంది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. టీడీపీ అధికారంలోకి వచ్చి వంద రోజులైంది. కానీ జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ కనిపించడం లేదు. గత ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాల వెలికితీత, విచారణలు, సర్వేలు, ఆధార సీడింగ్‌తో కాలం వెళ్లదీసింది. పాత హామీల అమలకు తిలోదకాలిచ్చి కొత్తవాటితో అర చేతిలో వైకుంఠం చూపిస్తోంది.   
 
  రుణ మాఫీ...
 ఓట్లు వేసి గెపించిన రైతులు డ్వాక్రా మహిళలపై ప్రభుత్వం కనీస కరుణ చూపించడం లేదు. బకాయిలు రాబట్టుకోడానికి బ్యాంకు లు బంగారాన్ని వేలం వేస్తున్నా, పొదుపు ఖాతాల నుంచి సొమ్మును మళ్లిస్తున్నా పట్టించుకోలేదు. చివరకు రుణమాఫీ ఒక ప్రహసన ంలా తయారైంది. మాఫీ చేసేందేమీ లేదు గాని నిబంధనలు, మార్గదర్శకాలు పేరుతో హడావుడి చేసి లబ్ధిదారులను గందర గోళంలో పడేసింది. వారికి కొత్తగా రుణాలు పుట్టక, బకాయిలు చెల్లించుకోలేక, సాగు స్వయం సమృద్ధి సాధించలేక అష్టకష్టాలు ప డుతున్నారు. జిల్లాలో 3.5 లక్షల మంది రైతులకు రూ.1036 కోట్లు, 29 వేల డ్వాక్రా సంఘాలకు రూ.400 కోట్లు మేర మాఫీ చేయాల్సి ఉంది. కానీ ఇదిగో అదిగో అని కాలయాపన చేయడం తప్ప వారికి చేసిందేమి కనిపించడం లేదు.
 
 జాబు గోవిందా...
 బాబు వస్తేనే జాబు అన్నారు. అధికారంలోకి వచ్చేంతవరకు ప్రసంగాలతో ఊదరగొట్టారు. అధికారంలోకి రాగానే  ‘ఏరు దాటాక బోడి మల్లన్న’ చందంగా తూచ్ అనేసి ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి రోడ్డున పడేస్తున్నా రు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మునుపెన్నడూ లేని విధంగా మానసిక వేదనకు గురవుతున్నారు. ఇక రూ.2వేల నిరుద్యోగ భృతి హమీకి అతీగతీలేదు. విద్యార్థుల ఫీజు రీ యింబర్స్‌మెంట్ పరిస్థితి కూడా అంతే. తామొస్తే ప్రశాంతంగా చదువుకోవచ్చని హామీలిచ్చిన టీడీపీ సర్కార్ తీరా ఫీజులు చెల్లించకుండా విద్యార్థులను మనోవేదనకు గురిచేస్తోంది. జిల్లాలో సుమారు రూ.50 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సి ఉంది. ఇక వసతి విద్యార్థులకు కనీసం యూనిఫారాలు, నోటు పుస్తకాలు కూడా అందలేదు.    
 
 ప్రాజెక్టులదీ అదే పరిస్థితి..
 సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేసేస్తామని గొప్పలు పలికిన టీడీపీ పాలకులు అధికారంలోకి రాగానే  మడత పేచీ పెట్టారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ. 200 కోట్లు కావల్సి ఉండగా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 20కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టుకు రూ. సుమారు రూ.300 కోట్లు అవసరం కాగా కంటితుడుపుగా రూ.80 లక్షలు కేటాయించారు. ఇక, పెద్దగెడ్డ, జంఝావతి ప్రాజెక్టుల పరిస్థితి కూడా అంతే. తమది మాటల ప్రభు త్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని ఈ కేటాయింపుల ద్వారా నిరూపించుకున్నారు. ఇక పేదల ఇళ్లు, ఫించన్లు, రేషన్‌కార్డులు గురి ంచైతే మాట్లాడనవసరం లేదు. సర్వేలు, ఆధార్ సీడింగ్ పేరుతో అవస్థలకు గురిచేస్తున్నారు. కొత్తగా లబ్ధి చేకూర్చే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు.
 
 ఎంత దారుణమంటే గతంలో నిర్మించుకున్న ఇళ్ల లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.30కోట్లు బకాయిల జోలికే పోవడం లేదు. వచ్చే మార్చి వరకు వాటి కోసం ఆశించవద్దని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వం మంజూరు చేసిన, విడుదల చేసిన అభివృద్ధి పనులు, నిధులపైనా కూడా పెత్తనం చెలాయిస్తూ అభివృద్ధికి విఘాతం కల్గిస్తున్నారు. ఆంక్షలు పేరుతో ఆ నిధులను వెనక్కి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అవి ఇటీవల ఇచ్చిన పది హామీలే. స్మార్ట్ సిటీ, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, మెడికల్ కళాశాల, పోర్ట్, లలిత కళల అకాడమీ, గిరిజన యూనివర్సిటీ, హార్డ్‌వేర్ పార్క్, ఫుడ్‌పార్క్ ,పారిశ్రామిక నగరం పేర్లతో ప్రజలను ఊహా ల్లోకి తీసుకెళ్లింది. అయితే ఇవి కార్యరూపం దాల్చేదెలాగో చెప్పకుండా మసిపూసే ప్రయత్నం చేసింది. వీటిని ఊహించుకుని సంతృప్తి చెందడం తప్ప టీడీపీ వంద రోజుల పాటనలో జిల్లాకు గాని, ప్రజలకు గాని ఒరిగిందేమీ లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement