Viral Video: చెరుకు ముక్కల్ని ఇలా కూడా తింటారా? | Did you try this technique to eat sugarcane this summer | Sakshi
Sakshi News home page

Viral Video: చెరుకు ముక్కల్ని ఇలా కూడా తింటారా?

Published Mon, Mar 28 2022 4:38 PM | Last Updated on Mon, Mar 28 2022 5:39 PM

Did you try this technique to eat sugarcane this summer - Sakshi

సోషల్‌ మీడియాలో వింతలు, విశేషాలకు కొదవ ఉండదు.  నిరంతరం  రక  రకాల వీడియోలు, మీమ్స్‌ సందడి చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో  ఒకటి నవ్వులు పూయిస్తోంది.  మూతికి ప్లాస్టిక్‌ కవర్‌ కట్టుకుని మరీ చెరకు ముక్కల్ని  ఒక వ్యక్తి వెరైటీగా తింటున్న వైనం నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఈ సమ్మర్‌లో బ్రాండ్‌ న్యూ  టెక్నిక్‌ అంటూ   ఫిదా అవుతున్నారు.

సాధారణంగా  చెరకు తినాలంటే ఒక టెక్నిక్‌  ఉండాలి. ఒడుపుగా పైనున్న తోలు తీస్తూ, ముక్కలు కొరికి తినాలి. అలా   ఆ జ్యూస్‌ మింగుతూ  ఉంటే వచ్చే ఆ  కిక్కే వేరు. ఆ తరువాత ఆ పిప్పిని ఉమ్మడం  కూడా పెద్ద  పనే అయినా, పళ్లకు చక్కటి  ఎక్స్‌ర్‌ సైజ్‌.  అయితే చెరుకును  తినాలంటే పళ్లకు మాంచి బలం ఉండాలి మరి.

కాగా  సమ్మర్‌ వచ్చిందంటే చాలు  అందరం చల్లని పానీయాలకోసం తెగ ఆరాటపడతాం. ముఖ్యంగా  వేడిని  తట్టుకునేందుకు, దాహార్తిని తీర్చుకునేందకు  నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లను  ఎక్కువగా తాగుతాం. అలాగే ఈ వేసవిలో  విరివిగా లభించే చెరుకు రసం సమ్మర్‌లో మంచి  రిఫ్రెష్‌మెంట్‌ ఇస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement