జాన్‌డీర్ నుంచి చెరకు కోత యంత్రం | John Deere launches sugarcane harvester designed for India | Sakshi
Sakshi News home page

జాన్‌డీర్ నుంచి చెరకు కోత యంత్రం

Published Fri, Dec 6 2013 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

జాన్‌డీర్ నుంచి చెరకు కోత యంత్రం

జాన్‌డీర్ నుంచి చెరకు కోత యంత్రం

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫార్మ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ జాన్ డీర్ కొత్తగా షుగర్‌కేన్ హార్వెస్టర్(చెరకు కోత యంత్రం), సీహెచ్330ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ యంత్రం ధరను రూ.1.4 కోట్లుగా నిర్ణయించామని జాన్ డీర్ ఇండియా ఎండీ, సీఈవో సతీష్ నాడిగర్ చెప్పారు. ఈ యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిక్ అన్వర్ ఇక్కడ జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
 
  198 హార్స్‌పవర్‌తో పనిచేసే ఈ యంత్రం హెక్టార్‌కు 150 టన్నుల చెరకును కోత కోస్తుందని, భారత్‌లో ఉండే చిన్న చెరుకు కమతాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా దీనిని రూపొందించామని సతీష్ వివరించారు. వ్యవసాయ కూలీల వ్యయాలు పెరుగుతుండడంతో ఇలాంటి యంత్రాలకు డిమాండ్ పెరుగుతుందని, రానున్న సంవత్సరాల్లో ఈ యంత్రాల అమ్మకాలు పెరగగలవని ఆయన అంచనా వేస్తున్నారు.  వచ్చే ఏడాది 20 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ యంత్రాల కొనుగోళ్లకు వినియోగదారులకు రుణాలివ్వడానికి వివిధ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement