Harvest
-
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
కలర్‌ఫుల్ ఓనమ్
పంటలు ఇంటికి వచ్చిన వేళ..వంటలు ఘుమఘుమలాడిన వేళ..ఇంట్లో పండగ వేళ... ఇలా ఓనమ్ పండగను ఘనంగా జరుపుకున్నారు కొందరు తారలు.కేరళప్రాంతంలో పంటలు వచ్చే ఈ మాసంలో ఓనమ్ పండగ జరుపుకుంటారు. మంగళవారం పండగ సందర్భంగా పలువురు కథానాయికలు అందంగా ముస్తాబై, మెరిసిపోయారు. ఓనమ్ సాద్య పేరుతో దాదాపు 26 రకాల వంటకాలను అరిటాకులో వడ్డించుకుని, ఆరగించారు. పండగ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ∙మిర్నా మీనన్ ∙మాళవికా మోహనన్ ∙కల్యాణి ∙అపర్ణా దాస్ అదా శర్మ -
అర్బన్ కౌలు రైతుల పాట్లు!..కొద్దిపాటి స్థలంలోనే సిటీ ఫార్మింగ్!
అర్బన్ కౌలు రైతుల పాట్లు కనెక్టికట్.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటి. కనెక్టికట్ రాష్ట్రంలో అధిక జనసాంద్రత గల నగరం బ్రిడ్జ్‌పోర్ట్. జీవన వ్యయం దేశంలోనే అత్యధికంగా ఉండే కనెక్టికట్‌లో.. తాజా కూరగాయలు, పండ్లు అందుబాటులో లేని ప్రాంతాలకు ఆహారాన్ని స్థానికంగానే పండించి అందించడానికి అర్బన్ ఫార్మర్స్ కృషి చేస్తున్నారు. నగరీకరణ కారణంగా వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలుగా మార్చటం వల్ల నగరంలో పావు ఎకరం చోటు కౌలుకు దొరకటమే గగనంగా ఉందని బ్రిడ్జ్‌పోర్ట్ నగర రైతులు వాపోతున్నారు. అందుబాటులో ఉన్న చిన్న పాటి స్థలాలతోనే సిటీ ఫార్మింగ్ చేసే వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు సరిపెట్టుకుంటున్నారు. బ్రిడ్జ్‌పోర్ట్ యువరైతు ట్రావిస్ స్టీవర్ట్ 20 సెంట్ల పెరటి స్థలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. భారలోహాలతో కలుషితమైన నేల కావటంతో ఎత్తు మడుల్లో కూరగాయలను పండిస్తున్నాడు. అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ హైడ్రోపోనిక్ పద్ధతిలోనూ పంటలు పండించటంతో పాటు గుడ్లు పెట్టే కోళ్లను, చిన్నపాటి ట్యాంకుల్లో తిలాపియా వంటి చేపలను సైతం పెంచుతున్నాడు. ‘ఒకప్పుడు సరదాగా కూరగాయలు పెంచేవాడిని. ఇప్పుడు అదే నాకు ఉపాధిగా మారింది. ఇదొక జీవన విధానం అని నమ్ముతున్నా. దీంతో పాటు పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నా’ అన్నాడు స్టీవర్ట్. షాన్ జోసెఫ్ అనే మరో యువ సిటీ ఫార్మర్ తన భాగస్వామి రిచర్డ్ మేయర్స్‌తో కలసి నగరంలోనే కౌలుకు తీసుకున్న అరెకరంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు ఏడేళ్ల ప్రాయం నుంచే తోట పని అలవాటుంది. అలాగని చదువుకోలేదనుకునేరు సుమా! నోగటక్ వ్యాలీ కమ్యూనిటీ కళాశాల నుంచి హార్టికల్చర్ డిగ్రీ పొందాడు. కార్పొరేట్ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే మానుకోవాల్సి వచ్చింది. ఏడేళ్ల క్రితం ఒకామె తన ఇంటి పక్కన ఖాళీగా ఉన్న అరెకరం స్థలాన్ని కౌలుకు ఇవ్వటంతో అక్కడ ‘పార్క్ సిటీ హార్వెస్ట్’ పేరుతో సిటీ ఫార్మింగ్ మొదలుపెట్టారు. బ్రిడ్జ్పోర్ట్లో 20 సెంట్ల పెరటి స్థలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న అర్బన్ రైతు ట్రావిస్ స్టీవర్ట్ తమ ఉత్పత్తులను స్థానిక రైతు మార్కెట్లలో విక్రయిస్తుంటారు. అక్కడ ఏడాదికి 7 నెలలే ఆరుబయట పంటల సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. అందుకని, ఇంట్లోనే చిన్న కంటెయినర్లలో ఏడాది పొడవునా పెరిగే మైక్రోగ్రీన్స్‌తో పాటు ఆలివ్ ఆయిల్, కొవ్వొత్తులు, మసాలా మిశ్రమాలు, హెర్బల్ టీ, హాట్ సాస్, ఊరగాయలు, దుస్తులను కూడా తమ వెబ్సైట్ ద్వారా అమ్ముతూ ఈ నల్లజాతి యువ సిటీ ఫార్మర్స్ ఆదాయం పొందుతున్నారు. జాతీయ వ్యవసాయ గణాంకాల సంస్థ ప్రకారం కనెక్టికట్ ప్రజల్లో మూడో వంతు మంది నల్లజాతీయులు, ఆదివాసులే. అయితే, అర్బన్ ఫార్మర్స్ సహా మొత్తం రైతుల్లో వీళ్లు 2 శాతం మంది మాత్రమే ఉన్నారు. భూ లభ్యత, శిక్షణ, వనరుల లేమి పెద్ద సవాళ్లుగా నిలిచాయి. వీరికి న్యాయబద్ధమైన వాటా మేరకు తాజా ఆహారాన్ని స్థానికంగా పండించి అందుబాటులోకి తేవడానికి అర్బన్ అగ్రికల్చర్, ఫుడ్ జస్టిస్ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అమెరికా వ్యవసాయ శాఖ పట్టణ వ్యవసాయానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కనెక్టికట్ వ్యవసాయ వ్యవస్థలో అర్బన్ ఫార్మర్స్ కీలకమైన భాగమని అందరూ అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో పండించే పంటల్లో అద్భుతమైన వైవిధ్యం ఉంది. ఆయా పంటలను సాగు చేసే వారి సంఖ్యను పెంపొందించాలి అని ప్రభుత్వమూ భావిస్తోంది. ఇష్టమైన పని.. ఆదాయం.. భారంగా అనిపించని ఇష్టమైన పనిని ఎంపిక చేసుకున్నాను. నాకు ముగ్గురు అబ్బాయిలు. వారికి నేను చూపించాలనుకున్నది, చెప్పాలనుకున్నది ఏమిటంటే.. తాము ఆనందంగా చేయగలిగిన పని ఏదో ఎవరికి వారు కనుగొనగలగాలి. ఆ పని ద్వారా ఆదాయం పొందే ఉపాయమూ చేయాలి. – షాన్ జోసెఫ్, అర్బన్ ఫార్మర్, బ్రిడ్జ్‌పోర్ట్ పతంగి రాంబాబు Prambabu.35@gmail.com (చదవండి: దేశీ వరి పరిరక్షకుడు డా.దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం!) -
పంటకు ముందే ‘మద్దతు’!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అంకాపూర్.. ఇదో ఆదర్శ గ్రామం. గ్రామస్తుల ఐకమత్యంతో ఎన్నో అద్భుతాలు సృష్టించి.. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొని మార్గదర్శకంగా నిలుస్తోంది. అనేక స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్న ఈ గ్రామంలో ఈసారి రైతులు సంఘంగా ఏర్పడి పంటకు ముందే మద్దతు ధర నిర్ణయించారు. ‘ఇక పంటకు మద్దతు ధర నిర్ణయించేది వ్యాపారులు కాదు.. మేమే’అంటూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పైగా పండించబోయే (మార్చిలో చేతికందే) పంటకు ముందే ధర ప్రకటించారు. ఈ మేరకు వ్యాపారులను గ్రామాలకు పిలిచి ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఎర్రజొన్న (గడ్డి విత్తనం) ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సాగవుతుంది. ఏటా తమ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ కష్టాలను అధిగమించేందుకు అంకాపూర్ లో రైతులంతా ఏకమయ్యారు. ఈ రబీ సీజనులో సుమారు 1,300 ఎకరాల్లో ఎర్రజొన్న పంటను సాగు చేయాలని నిర్ణయించారు. సుమారు 1,400 టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనాకొచ్చిన రైతులు.. విత్తన వ్యాపారులతో సంప్రదింపులు జరిపారు. తమ పంటకు వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. 15 మంది విత్తన వ్యాపారులు, సీడ్ కంపెనీలు ఈ గ్రామానికి వచ్చి వేలంలో పాల్గొనగా.. 200 టన్నుల చొప్పున ఏడుగురు వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చిలో చేతికందే తమ ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు రూ.2,600 చొప్పున కొనుగోలు చేసేలా విత్తన వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. పంట విలువలో పది శాతం మొత్తాన్ని అడ్వాన్సు రూపంలో తీసుకుని పంటను సాగు చేస్తున్నారు. తీరా పంట పండిన తర్వాత మార్కెట్లో ఆ ధర లేదంటూ వ్యాపారులు చేతులెత్తేయకుండా ముందు జాగ్రత్తగా పేరున్న వ్యక్తుల జమానతు తీసుకున్నారు. -
మనకు తగ్గ పంటలు వేయాలి
► అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ► క్రాప్ కాలనీలపై అధ్యయనానికి ఆదేశం సాక్షి, హైదరాబాద్: సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు, పంటకు మంచి ధర రావడానికి వినూత్న పద్ధతులు అవలంభించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇందుకు అధికారులు కార్యాచరణ రూపొందించాలని, రైతులకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేయాలని కోరారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, సీనియర్ అధికారులతో సీఎం గురువారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘మన అవసరాలకు తగ్గట్లు పంటలు పండించాలి. కోళ్లు, పశువులు, చేపల దాణా తదితరాలనూ అధ్యయనం చేయాలి. తెలంగాణలో ఏ ఆహారం ఎంత అవసరమో కచ్చితమైన అవగాహనకు రావాలి. దాన్ని బట్టే పంటలు పండించాలి. ఇక్కడ పండించడానికి అనువుగా ఉండి, ఎగుమతి చేయగలిగే పంటలను గుర్తించాలి. వాటిని సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి. సాస్, గంజి, పల్ప్, తయావైన్ రీ తదితర ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే విషయంలో రైతులకు సూచనలివ్వాలి. పండ్లు, కూరగాయలు తెలంగాణకు ఎన్ని కావాలి, ఎన్ని పండిస్తున్నాం, వేటికి మార్కెట్ ఉందనే విషయాలను అధ్యయనం చేసి పండించాలి. దశేరి, హిమాయత్ వంటి మంచి డిమాండున్న మామిడి రకాలను పండించాలి. ఊరూరా రైతులు తమ భూములను క్రాప్ కాలనీలుగా మార్చుకోవాలి. కొందరు కూరగాయలు వేసుకోవాలి. ఆ ఊళ్లో వాటినే తినాలి’’ అని సూచించారు. -
వేలల్లో కాసే ఆక్టోపస్ టమాటా చెట్లు..!
ఒకే ఒక్క చెట్టుకు సుమారు 32,000 టమాటాలు వరకూ కాయడం ఎక్కడైనా చూశారా? 40 నుంచి 50 చదరపు మీటర్ల పరిథిలో విస్తరించే ఆ అరుదైన హైబ్రీడ్ టమాటా మొక్కలు ప్రతి సీజన్ లోనూ వేలాదిగా కాయడం వాల్డ్ డిస్నీవరల్డ్ రిసార్ట్ లో అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే ఆ ఆక్టోపస్ చెట్లు ఏ ప్రాంతానికి చెందినవి అన్న వివరాలు మాత్రం పూర్తిగా అందుబాటులో లేకపోయినా.. ఇంటర్నెట్ ఆధారంగా తెలిసిన వివరాలను బట్టి అవి చైనాకి చెందినవిగా తెలుస్తోంది. మొదటిసారి ఆక్టోపస్ టమోటా చెట్లను ఫోటోల్లో చూసిన ఓ వ్యక్తి.. వాటిపై అధ్యయనం మొదలు పెట్టాడు. ఒకే ఒక్క చెట్టు వేలల్లో కాయలు కలిగి ఉండటం బూటకం అనుకున్నానని, అయితే ఆఫోటోలు ఎంతో ఆకట్టుకోవడంతో ఆచెట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు కొన్ని గార్డెనింగ్ సైట్లలో తీవ్రంగా వెతికినా వాటి పెరుగుదల, విత్తనాలు, ఎక్కడ దొరుకుతాయి అన్నఇన్ఫర్మేషన్ పెద్దగా దొరకలేదని తెలిపాడు. అనంతరం ఓ ట్రావెల్ బ్లాగ్ ద్వారా అటువంటి ఆక్టోపస్ టమాటో చెట్లు వాల్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ లో అందర్నీ ఆకట్టుకుంటున్నాయని తెలియడంతో అవి నిజమైన చెట్టుగా నమ్మకం కుదిరిందని తెలిపాడు. కానీ ఆ ఆక్టోపస్ టమాటా చెట్లను ఎలా పొందాలో తెలుసుకునేందుకు ఈబే, అలి ఎక్స్ ప్రెస్ వంటి మరిన్ని వెబ్ సైట్లలో వెతికిన అతడు.. అక్కడ కొందరు ఆ మొక్కల అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియడంతో.. ఆ అద్భుతమైన ఆక్టోపస్ టమాటా చెట్ల ఉనికి గురించి తెలియనివారికి కూడా చెప్పాలనుకున్నాడు. తనకు తెలిసిన కొద్దిపాటి సమాచారం ప్రకారం అవి చైనాకు చెందినవిగా తెలుస్తోందని, దాన్ని నిర్థారించలేకపోతున్నట్లు తెలిపాడు. వాల్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ థీమ్ పార్కుల్లో ఒకటైన ఎప్కాట్ కు చెందిన వ్యవసాయ శాస్త్ర మేనేజర్ యాంగ్ హాంగ్ ద్వారా ఆక్టోపస్ టమాటా చెట్లు చైనా బీజింగ్ కు చెందినవిగా తెలిసిందని..., ఫ్లోరిడా ఎంటర్ టైన్మెంట్ పార్కులో వాటిని ప్రదర్శనకు ఉంచిన సందర్భంలో అక్క్డడినుంచీ కొన్ని గింజలను తెచ్చిన యాంగ్.. వాటిని నాటి, కొంతమంది సహాయంతో పెంపకం చేపట్టినట్లు తెలుస్తోంది. ఆక్టోపస్ టమాటో మొక్కలు పూర్తిశాతం పెరగడానికి సుమారు ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది. అయితే ఆ మొక్కలు మొదటి 7-8 నెలల వరకూ ఎటువంటి ఫలాలను ఇవ్వవు, పరిపక్వతకు చేరిన అనంతరం సగటున ఒక్కో కాపుకు 14,000 టమాటోల వరకూ పంట వస్తుంది. ప్రస్తుతం ఎప్ కాట్ లోని రెండు మొక్కల్లో ఒకటి ఇంచుమించుగా 522 కేజీల బరువైన 32,000 టమాటాలకు వరకూ కాసి, భారీ పంటను ఇచ్చిన మొక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించింది. ఈ మొక్కలు ఒక్కోటి సుమారు 40-50 చదరపు మీటర్లలో వ్యాపించి ఉండటం విశేషం. అయితే ఇటువంటి మొక్కలు పెంచుకోవాలనుకునేవారు వాల్ డిస్నీ రిసార్ట్ కు టూర్ వెళ్ళి, అక్కడి గ్రీన్ హౌస్, ల్యాబ్ లలో ఓ గంటపాటు కాలినడకన తిరుగుతూ వాటిని దగ్గరగా చూస్తూ గడపొచ్చు. అంతేకాదు.. వాటి కేర్ టేకర్లతో మొక్కల గురించిన వివరాలను మాట్లాడే అవకాశం కూడా ఉంది. అయితే వాల్ డిస్నీ రిసార్ట్ లో పండించే ఈ ఆక్టోపస్ టమాటాలు ఎప్ కాట్ లోని రెస్టరెంట్లలో కూడా విరివిగా వాడటం ఆసక్తికరంగా ఉంటుంది. -
ఎండుతున్న ఆశలు
♦ చిత్తవుతున్న బత్తారుు రైతులు ♦ నీరులేక ఎండుతున్న వేల ఎకరాల పంట ♦ ఈ సీజన్లో 5 వేల ఎకరాల్లో చెట్ల నరికివేత ♦ వంట చెరకుగా వాడుతున్న వైనం ఒకప్పుడు సిరులు పంచిన బత్తారుు సాగు నేడు రైతుకు కన్నీరు మిగులుస్తోంది. వర్షాలు అరకొరగానే పడుతున్నాయి. పాతాళగంగ అదఃపాతాళానికి చేరింది. 900 అడుగుల బోరు వేసినా నీటి చెమ్మ తగలడం లేదు. నెలకు ఒక్క తడికి కూడా నోచుకోక వేల ఎకరాల్లో బత్తారుు చెట్లు నిలువునా ఎండిపోతున్నారుు. ఒక్క ఈ సీజన్లోనే 5 వేల ఎకరాల్లో చె ట్లను నరికేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. అర్ధవీడు: జిల్లాలో బత్తాయి తోటలకు గిద్దలూరు నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది. నిత్యం 50 నుంచి 100 లారీల బత్తాయి కాయలు హైదరాబాద్, విజయవాడ, పూనా, నాగపూర్, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై తదితర ప్రాంతాలకు తరలించేవారు. తోటలో పూతదశ వచ్చినపుడే రైతుకు వడ్డీ లేకుండా బత్తాయి వ్యాపారులు ఎకరాకు లక్ష దాకా అడ్వాన్సులిచ్చేవారు. ఎకరాకు రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా ఏడాదికి ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. చెట్లను కాపాడుకోలేక చేతికి వచ్చిన చెట్లను నరికేస్తున్నారు. భూగర్భ జలం అడుగంటడంతో వేల ఎకరాలు ఎండిపోయూరుు. ఎండిన చెట్లను నరికి వంట చెరకుగా అమ్ముకుంటున్నారు. నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో 40 వేల ఎకరాల్లో బత్తారుు సాగు చేస్తున్నారు. నీరందక ఈ సీజన్లోనే సుమారు 5 వేల ఎకరాల్లో చెట్లను కొట్టేశారు. బత్తాయి సాగు ఇలా ఎకరానికి 100 బత్తాయి మొక్కలు నాటి, ఐదేళ్లు సంరక్షించిన తర్వాత పంటకొస్తాయి. రైల్వే కోడూరు నుంచి నాణ్యమైన శ్రీరంగాపూర్ మొక్కలు తెప్పించి నాటుతారు. ఎకరాకు 4 నుంచి 8 టన్నుల దాకా కాపు వస్తుంది. సంవత్సరంలో రెండు సీజన్లుగా పంట చేతికొస్తుంది. ఏప్రిల్ నెల నుంచి వచ్చే కాపును చిత్తకాపు అంటారు. ఇటీవల టన్ను ధర రూ.42 వేలు పలికింది. జూలై నెలలో వచ్చే పంటను సీజన్ కాపు అంటారు. సీజన్ కాపు టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా ధర పలుకుతుంది. ఒకప్పుడు మోతుబరి రైతులుగా ఉన్న బత్తాయి రైతులు నేడు కూలి పనులకు వెళ్తున్నారు. చెట్లను కాపాడుకునేందుకు బోర్లు వేయడం, నీరు పడకపోవటంతో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు. గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట, కొమరోలు, రాచర్ల మండలాల్లో వేల ఎకరాల్లో బత్తాయి సాగు చేశారు. నేడు చెట్లన్నీ ఎండిపోవటంతో అక్కడక్కడా బత్తాయి తోటలు కొన్ని మాత్రమే మిగిలాయి. ఒక్కొక్క రైతు చెట్లను కాపాడుకొనేందుకు 600 నుంచి 900 అడుగుల లోతు వరకు బోర్లు వేశారు. అయినా చుక్క నీరు పడకపోవటంతో చెట్లను కాపాడుకోలేక అప్పులు కట్టలేక నేడు వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి: 2007-2008 సంవత్సరంలో వచ్చిన కరువుకు బత్తాయి తోటలు ఎండిపోయినపుడు ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసింది. అప్పుటి కడప జిల్లా కలెక్టర్ అజయ్‌జైన్ బత్తాయి రైతుల పరిస్థితి చూసి నష్ట పరిహారం అందేలా నివేదిక తయారు చేసి పంపడంతో స్పందించిన ప్రభుత్వం బత్తాయి రైతులకు నష్ట పరిహారం అందజేసింది. ఈ ఏడాది కూడా ఎండిపోయిన బత్తాయి రైతులకు పరిహారం అందించాలని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎండిన తోటలకు నష్ట పరిహారం అందించాలి 5 ఎకరాల బత్తాయి సాగు చేశాను. 10 బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. ఐదేళ్లు సంరక్షించి, పంట దశ కొచ్చిన బత్తాయి తోట నిలువునా ఎండిపోయింది. పసిపిల్లలను సాకినట్లు కాపాడుకున్నా ఫలితం లేదు. మండలంలో చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. ప్రభుత్వం స్పందించి ఎండిపోయిన బత్తాయి తోటల రైతులకు నష్టపరిహారం అందించాలి. - వీరారెడ్డి, బత్తాయి రైతు బత్తాయి రైతులను ఆదుకోవాలి బత్తాయి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో తోటలపై లాభాలు ఆర్జించిన రైతులు నేడు అప్పులపాలయ్యారు. ప్రభుత్వం స్పందించి ఎండిపోయిన బత్తాయి తోటల రైతులకు నష్ట పరిహారం అందజేయాలి. - ఎస్.ఎం.బాషా -
పంటలు పండించుకున్నారని...విద్యుత్ తొలగింపు
వైఎస్సార్ జిల్లా: సింహాద్రిపురం మండలం పైడిపాలెం ప్రాజెక్టు కింద ఖాళీగా ఉన్న భూముల్లో కుమ్మరాంపల్లెకు చెందిన ఎస్సీ, ఎస్టీ రైతులు పంటలు పండించుకున్నారన్న నెపంతో విద్యుత్ అధికారులు ఆ గ్రామాలకు విద్యుత్ తీగలు తొలగించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే తమ గ్రామానికి, పంట పొలాలకు విద్యుత్ తొలగించారని రైతులు వాపోతున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతులు స్థానిక ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డిని సంప్రదించగా రైతులకు మద్దతుగా ఆయన రైతుల సమస్యలపై పైడిపాలెం ప్రాజెక్టు వద్ద విద్యుత్ అధికారులు, పోలీసులతో చర్చిస్తున్నారు. -
రైతుల రుణాలు రూ.1994 కోట్లు
4 లక్షల 31 వేల మంది లబ్ధిదారులు క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీ రేపు ప్రభుత్వానికి నివేదిక వరంగల్ : జిల్లాలో రైతుల రుణాలు రూ.1994 కోట్లుగా తేలింది. 4,31,179 మంది రైతులు బకాయి ఉన్నట్లు స్పష్టమైంది. ఇందులో రూ.లక్ష వరకు రుణం పొందిన రైతుల వివరాలు 5వ తేదీ వరకు తేలనున్నాయి. ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో జిల్లాలోని సహకార, వాణిజ్య, జాతీయ బ్యాంకులు రైతులకు ఇచ్చిన పంట, బంగారు రుణాల వివరాలు బ్యాంకుల వారీగా లీడ్ బ్యాంకుకు అందజేశాయి. గత నెల 31వ తేదీ వరకే ఈ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ఆదేశించినప్పటికీ రుణాల లెక్కలు, జాబితా తయారీలో జాప్యం జరిగింది. బ్యాంకర్లు, అధికారుల వినతి మేరకు ఈ నెల 5వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు అవకాశం కల్పించారు. దీంతో మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా రైతుల రుణాలు రూ.1994కోట్లుగా తేలినట్లు లీడ్‌బ్యాంకు మేనేజర్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం బ్యాంకుల వారీగా రూ.లక్ష లోపు రుణగ్ర హీతల వివరాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ కసరత్తు చేపట్టిన తర్వాత రుణగ్రహీతల జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించాలని నిర్ణయించారు. క్షేత్ర స్థాయిలో సామాజిక తనిఖీ వల్ల అనర్హులను తొలగించేందుకు అవకాశం ఉంటుందని భావిం చారు. తాజాగా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన 1,632 మంది రైతులు బంగారు రుణాల కింద రూ.8కోట్లు రుణం తీసుకున్నప్పటికీ తమను రుణమాఫీ కింద అర్హులుగా గుర్తించి జాబితాలో చేర్చకపోవడంపై నిరస న వ్యక్తం చేశారు. కురవి మండలం గుండ్రాతి మడుగులో తమ భూమిపై ఇతరులు రుణం తీసుకున్న విషయం, మృతుని పేర రుణం తీసుకున్న తీరు ఈ సందర్భంగా వెలుగు చూస్తున్నాయి. సామాజిక తనిఖీతో మరి కొన్ని లొసుగులు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారుల సహకారంతో సామాజిక తనిఖీ పూర్తి చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఇంకా ఈ పని పూర్తి కాలేదు. ఈనెల 5వ తేదీలోపు ఈ పనులన్నీ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. సామాజిక తనిఖీలు, లక్ష మేరకు పరిగణనలోకి తీసుకుంటే రుణాల మొత్తం కొంత తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొంత మంది రూ.లక్ష కంటే ఎక్కువ రుణాలున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరికి లక్ష మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తే మిగిలిన రుణాన్ని రైతులు చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుందని భావిస్తున్నారు. -
వేప నూనెతో ఎన్నో ప్రయోజనాలు
వేపనూనె... వేప పిండి... ఇవి రెండూ రైతులకు సుపరిచితమే. వీటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా అవగాహన ఉంది. అయితే వినియోగంలో మాత్రం అంతగా చొరవ చూపడంలేదు. వేపనూనె వినియోగిస్తే పైరును చీడపీడలు ఆశించవు. రసాయన మందుల వాడకం తగ్గుతుంది. సాగు ఖర్చులు కలిసొస్తాయి. వేపనూనె వినియోగం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు కంకిపాడు ఏవో లంక శ్రీనివాస్ మాటల్లో.. వేపనూనెలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చేదుగా ఉంటుంది. దీనిని వాడితే మొక్కలు కూడా చేదెక్కుతాయి. దీని వల్ల మొక్కలను తినేందుకు పురుగులు ఆశించవు. వేప నూనె, వేపపిండి వినియోగిస్తే పైరులను ఆశించే చీడపీడలను నివారించొచ్చు. దీంతో పురుగు మందుల వినియోగం ఖర్చు తగ్గుతుంది. వేపనూనె ద్వారా పంటకు అవసరమైన చేవ సమృద్ధిగా అందుతుంది. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గడంతో రైతుకు పెట్టుబడులపై వ్యయం ఆదా అవుతుంది. గతంలో వేపనూనె వినియోగం తక్కువగా ఉండేది. ప్రస్తుతం రైతుల్లో అవగాహన పెరగటంతో వినియోగం కొద్దిగా పెరిగింది. వేపనూనె వినియోగం, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. - కంకిపాడు ఇలా వాడుకోవాలి.. వేప నూనెను పంట పొలంలో నేరుగా కానీ, యూరియా, పురుగు మందుల్లో కానీ కలిపి వినియోగించాలి. పంట ఏదైనా సరే, ఏ సమయంలో నైనా వేప నూనె వాడితే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, పురుగు మందు, సూక్ష్మధాతు మిశ్రమాల్లో వేపనూనె కలిపి వాడుకోవచ్చు. యూరియా 50 కిలోల బస్తాకు అర లీటరు నుంచి లీటరు వరకూ వేప నూనె, వేప పిండి అయితే 50 కిలోల బస్తాకు 10 కిలోల వరకూ కలిపి వాడుకోవాలి. యూరియా భూమిలో త్వరగా కరిగిపోకుండా చూస్తుంది. నత్రజని మొక్కకు ఎక్కువ సమయం అందే విధంగా చూడటం వేప నూనె ద్వారానే సాధ్యం. నత్రజని వృథా కాకుండా నిరోధిస్తుంది. పంటలకు కీడుచేసే పురుగు సంతతిని నివారిస్తుంది. పురుగుకు చెందిన గుడ్లు పొదగకుండా వాటిని నిర్వీర్యం చేయటంలో దోహదపడుతుంది. దీని వల్ల అధికంగా పురుగు మందులు వినియోగించాల్సిన అవసరం ఉండదు. వేప నూనె వాడకంతో నత్రజని ఎరువులు వినియోగం తగ్గుతుంది. వ్యవసాయ పెట్టుబడుల్లో ఖర్చులో 20 శాతం, పురుగు మందుల వినియోగం ఖర్చులో 40 శాతం తగ్గుతుంది. నత్రజని వృథా కాకుండా ఉండటమే కాకుండా, మొక్క చేదు ఎక్కటం వల్ల పురుగు వ్యాప్తి నిరోధించటానికి దోహదపడుతుంది. పండ్ల తోటల్లో వినియోగం ఇలా.. పండ్ల తోటల్లో అయితే వేప నూనెను చిన్న ప్లాస్టిక్ సంచుల్లో నింపి మొక్క వేరుకు తగిలించాలి. వేరు ద్వారా నూనె మొక్కకు నేరుగా చేరుతుంది. దీని వల్ల పురుగును నివారించుకోవచ్చు. గానుగ నుంచి తెచ్చిన వేప పిండి పండ్ల తోటలకు పనికిరాదు. వేపనూనెనే వినియోగించాలి. అరటి, పసుపు, కంద, మిర్చి తోటల్లో ఆముదపు పిండి, గానుగ పిండి, పొగాకు పిండితో పాటుగా వేప పిండి కలిపి చల్లుకుంటే పంటకు ఉపయుక్తంగా ఉంటుంది. మొక్క ఎదుగుదలకు, పురుగు నియంత్రణకు పిండి దోహదపడుతుంది. వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై వేపనూనె అందిస్తుంది. లీటరు రూ.100 చొప్పున విక్రయిస్తోంది. వేప పిండి మాత్రం వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా లేదు. బయటి మార్కెట్లో 40 కిలోల వేప పిండి బస్తా రూ.600 నుంచి రూ.800 వరకూ ధర పలుకుతోంది. లంక శ్రీనివాస్ 88866 13370 -
జాన్‌డీర్ నుంచి చెరకు కోత యంత్రం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫార్మ్ ఎక్విప్మెంట్ కంపెనీ జాన్ డీర్ కొత్తగా షుగర్‌కేన్ హార్వెస్టర్(చెరకు కోత యంత్రం), సీహెచ్330ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ యంత్రం ధరను రూ.1.4 కోట్లుగా నిర్ణయించామని జాన్ డీర్ ఇండియా ఎండీ, సీఈవో సతీష్ నాడిగర్ చెప్పారు. ఈ యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిక్ అన్వర్ ఇక్కడ జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో ఆవిష్కరించారు. 198 హార్స్‌పవర్‌తో పనిచేసే ఈ యంత్రం హెక్టార్‌కు 150 టన్నుల చెరకును కోత కోస్తుందని, భారత్‌లో ఉండే చిన్న చెరుకు కమతాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా దీనిని రూపొందించామని సతీష్ వివరించారు. వ్యవసాయ కూలీల వ్యయాలు పెరుగుతుండడంతో ఇలాంటి యంత్రాలకు డిమాండ్ పెరుగుతుందని, రానున్న సంవత్సరాల్లో ఈ యంత్రాల అమ్మకాలు పెరగగలవని ఆయన అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది 20 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ యంత్రాల కొనుగోళ్లకు వినియోగదారులకు రుణాలివ్వడానికి వివిధ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. -
రైతు గుండె జారెన్!
=భయం గుప్పెట్లో తీరప్రాంతాలు =జిల్లాకు ఏడు రెస్క్యూ బోట్లు, ప్రత్యేక బృందం రాక =కంట్రోల్ రూంల ఏర్పాటు =ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులు = కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08672-252572, టోల్‌ఫ్రీ నంబర్ 1077 తుపాను పేరెత్తితే చాలు అంతా హడలిపోతున్నారు. మరీ ముఖ్యంగా అన్నదాతల గుండెలు జారిపోతున్నాయి. గత నెలలో ఫై-లీన్ తుపాను, ఆ తర్వాత వాయుగుండం ఏర్పడి కుండపోతగా కురిసిన భారీవర్షాలకు రైతులు అతలాకుతలమయ్యారు. తీవ్ర పంట నష్టాలను చవిచూశారు. మళ్లీ ఇప్పుడు తాజాగా హెలెన్ తుపాను వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వరిపంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో వస్తున్న తుపాను వార్త అన్నదాతలను గజగజ వణికిస్తోంది. సాక్షి, మచిలీపట్నం/న్యూస్‌లైన్, చల్లపల్లి : హెలెన్ తుపాను ప్రభావం వల్ల 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనే అధికారుల హెచ్చరికలు తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వరి పంట చేతికొచ్చిన తరుణంలో తుపాను వల్ల ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సివస్తుందోనని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. గత నెలలో 23 నుంచి 27 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో 1.94 లక్షల ఎకరాల్లో పంట నష్టాలు జరిగినట్టు ఇటీవల అధికారులు నివేదికలు తయారుచేశారు. రూ.683 కోట్ల మేర జరిగిన నష్టాన్ని తలచుకుని గుండెలు బాదుకుంటున్నారు. ఆ భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న జిల్లా రైతాంగం ఈ హెలెన్ తుపాను ఎలాంటి బీభత్సాన్ని సృష్టిస్తుందోనని భయపడిపోతున్నారు. పంట చేతికొచ్చేనా.. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తుపానుగా మారింది. దీనికి అధికారులు హెలెన్ అని పేరుపెట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు చేస్తున్న హెచ్చరికలు రైతులను వణికిస్త్తున్నాయి. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 6.43 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. మరో నాలుగు రోజుల్లో ముమ్మరమవుతాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది సాగు తలకుమించిన భారమైంది. ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.25 వేలు ఖర్చు చేశారు. ఈదురుగాలులు వీస్తే కోతకొచ్చిన పంట పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనిక, పాలుపోసుకునే దశలో ఉన్న పంట దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక.. ఇప్పటికే తీరప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. మచిలీపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. నాగాయలంక మండలం సొర్లగొందిలో మూడురోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వస్తుండగా బోట్లలో ఆయిల్ అయిపోవడంతో మూడు గంటలు సముద్రంలో వారు నరకం చవిచూశారు. ప్రస్తుతం నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లోని తీరప్రాంతాల్లో సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని తీరప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. అంతటా అప్రమత్తం : డీఆర్వో జాతీయ విపత్తుల కమిషన్ ఇచ్చిన సమాచారం మేరకు హెలెన్ తుపానుపై జిల్లాలో అప్రమత్తమైనట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయచందర్ బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాల మేరకు తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. ఆర్డీవో, తహశీల్దార్, గ్రామస్థాయి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజ లను సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 127 తుపాను షెల్టర్లు సిద్ధం చేసి వాటిని ఆయా ప్రాంతాల్లోని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏడు రెస్క్యూబోట్లను సిద్ధం చేసి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్(ఎన్టీఆర్ఎఫ్) టీంకు చెందిన 40 మందిని గురువారం ఉదయానికి జిల్లాకు రప్పిస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కిరావాలని, ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08672-252572, టోల్‌ఫ్రీ నంబర్ 1077ను ఏర్పాటు చేశారు. కాగా ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. డిస్కమ్ పరిధిలో.. తుపాను ప్రభా వం జిల్లాల్లో విద్యుత్ వినియోగదారులకు అత్యవసర సేవలు అందించేందుకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు ఏపీఎస్పీడీసీఎల్ (డిస్కమ్) సీఎండీ హెచ్‌వై దొర ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ రూంల వివరాలను ఎస్ఈ మోహన్‌కృష్ణ సాక్షికి తెలిపారు. విజయవాడ సర్కిల్ ఆఫీసు, విజయవాడ టౌన్, రూరల్, గుణదల ప్రాంతాలకు 0866-2575620, 9440817561, నూజివీడు డివిజన్‌కు 08656-232746, 9490615606, గుడివాడ డివిజన్‌కు 08674-242703, 9440817573, మచిలీపట్నం డివిజన్‌కు 08672-222294, 9440812104, ఉయ్యూరు డివిజన్‌కు 08676-233718, 9491054708 కంట్రోల్ రూం నంబర్లు అందుబాటులో ఉంటాయి.