John Deere
-
ఆశావహంగా ట్రాక్టర్ల మార్కెట్
ముంబై: వ్యవసాయంలో ట్రాక్టర్ల వినియోగం పెరిగేలా సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ పరిశ్రమ పనితీరు ఆశావహంగా ఉండగలదని జాన్ డీర్ ఇండియా ఎండీ సాహిలేంద్ర జగ్తప్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ స్థాయిలో ట్రాక్టర్ల అమ్మకాలు 9,00,000 యూనిట్ల పైచిలుకు ఉండవచ్చని ఆయన చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు ఇదే స్థాయి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. 1998లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన జాన్ డీర్‌కు ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణెలోను, మధ్యప్రదేశ్‌లోని దేవాస్లోనూ చెరో ప్లాంటు ఉంది. వీటి వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 1.32 లక్షల ట్రాక్టర్లుగా ఉంది. -
సొంతంగా దున్నేస్తుంది
రైతన్న కాయకష్టాన్ని తగ్గించేందుకు శాస్త్ర విజ్ఞానం తొలినుంచి కృషి చేస్తూనే ఉంది. సైన్సు కృషి వల్లనే నాగలి నుంచి ట్రాక్టర్ల వరకు అనేక ఆవిష్కరణలు రైతుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే రైతుకు మరింత సాయం చేసే నూతన ఆవిష్కరణను జాన్ డీర్ కంపెనీ తీసుకువచ్చింది. డ్రైవర్‌తో అవసరం లేని ట్రాక్టర్‌ను కంపెనీ రూపొందించింది. 8–ఆర్ ట్రాక్టర్‌గా పిలిచే ఈ ఆధునిక వాహనాన్ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శించింది. కేవలం పొలం దున్నడమే కాకుండా ఇందులో పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్కడినుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చని, ఇప్పటికే ఉన్న ట్రాక్టర్‌ను ఈ ట్రాక్టర్లాగా అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలిపింది. దీని ధరను ఇంకా నిర్ణయించలేదు, ఈ ఏడాది చివరకు మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. తొలుత యూఎస్‌లో 20 కొత్త ట్రాక్టర్లను విడుదల చేయాలని, వీటికి లభించే స్పందన ఆధారంగా ఉత్పత్తి పెంచాలని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్‌లో ఒక్క ఆపరేటర్ వేలాది రోబోలతో సాగుపని చేయించే దిశలో.. ఇది ముందడుగని యూకే జాతీయ రైతు సంఘం నేత టామ్ కొనియాడారు. ప్రత్యేకతలు.. ► ఈ వాహనం కృత్రిమ మేథ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6 స్టీరియో కెమెరాలు, జీపీఎస్ ఉంటాయి. ► కెమెరాల్లో ట్రాక్టర్‌కు ముందు 3, వెనుక 3 ఉంటాయి. ప్రతి 100 మిల్లీ సెకన్లకు ఒకమారు వీటిని ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. ► పొలం దున్నే సమయంలో ఏవైనా జంతువులు ట్రాక్టర్‌కు దగ్గరకు వచ్చినా సెన్సర్ల ఆధారంగా గుర్తించి వెంటనే దానంతటదే ఆగిపోతుంది. ► దీంతో పాటు అంగుళం దూరంలో ఏదైనా తగిలే అవకాశం ఉన్నట్లు తెలిస్తే వెంటనే ట్రాక్టర్ నిలిచిపోతుంది. ► ఈ కెమెరాలను, కంప్యూటర్ను మామూలు ట్రాక్టర్‌కు అమర్చడం ద్వారా ఒక్కరోజులో సాధారణ ట్రాక్టర్‌ను 8–ఆర్గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ► రైతు చేతిలోని స్మార్ట్ ఫోన్లో వీడియో ద్వారా ట్రాక్టర్ కదలికలను పర్యవేక్షించవచ్చు. ► దున్నాల్సిన భూమి కోఆర్డినేషన్స్ను (జీపీఎస్ ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలను గుర్తించి నిర్ధారించిన కమతం హద్దులను), డైరెక్షన్స్‌ను ముందుగా ఫీడ్ చేయాలి, అనంతరం తదనుగుణంగా ట్రాక్టర్ పని చేస్తుంది. ► దున్నడమే కాకుండా వరుసలో విత్తనాలు చల్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ► ధరపై అధికారిక ప్రకటన రాకున్నా, సుమారు 50 వేల డాలర్లు (రూ. 37 లక్షలు) ఉండొచ్చని అంచనా. -
జాన్‌డీర్ నుంచి కొత్త 55హెచ్‌పీ ట్రాక్టర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండో తరానికి (సెకండ్ జనరేషన్)చెందిన 55హెచ్‌పీ ట్రాక్టర్ 5310 మోడల్‌ను జాన్‌డీర్ వూర్కెట్లోకి విడుదల చేసింది. రైతులు అవసరాలకు తగ్గట్టుగా పవర్ స్టీరింగ్, డిస్క్ బ్రేక్స్, సైడ్ షిప్ట్ గేర్స్, సేఫ్టీ షీల్డ్స్ వంటి అదనపు సౌకర్యాలతో రూపొందించిన ఈ ట్రాక్టర్లో ఇన్లైన్ ఫ్యూయుల్ ఇన్జెక్షన్ పంప్ కూడా కలిగి ఉంది. హైదరాబాద్ ఎక్స్ షోరూం ధర రూ. 8.21 లక్షలుగా నిర్ణరుుంచారు. రైతులు, వ్యవసాయు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వచ్చిన సూచనలతో దీర్ఘకాలం పనిచేసే విధంగా దీన్ని రూపొందించినట్లు జాన్‌డీర్ ఇండియూ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ నాదిగర్ తెలిపారు. తొలిసారిగా 5310 మోడల్‌ను 2000లో విడుదల చేయుగా ఇప్పుడు దీన్ని ఆధునీకరించి రెండోతరం ట్రాక్టర్‌ను వూర్కెట్లోకి విడుదల చేశారు. -
జాన్‌డీర్ నుంచి చెరకు కోత యంత్రం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫార్మ్ ఎక్విప్మెంట్ కంపెనీ జాన్ డీర్ కొత్తగా షుగర్‌కేన్ హార్వెస్టర్(చెరకు కోత యంత్రం), సీహెచ్330ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ యంత్రం ధరను రూ.1.4 కోట్లుగా నిర్ణయించామని జాన్ డీర్ ఇండియా ఎండీ, సీఈవో సతీష్ నాడిగర్ చెప్పారు. ఈ యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిక్ అన్వర్ ఇక్కడ జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో ఆవిష్కరించారు. 198 హార్స్‌పవర్‌తో పనిచేసే ఈ యంత్రం హెక్టార్‌కు 150 టన్నుల చెరకును కోత కోస్తుందని, భారత్‌లో ఉండే చిన్న చెరుకు కమతాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా దీనిని రూపొందించామని సతీష్ వివరించారు. వ్యవసాయ కూలీల వ్యయాలు పెరుగుతుండడంతో ఇలాంటి యంత్రాలకు డిమాండ్ పెరుగుతుందని, రానున్న సంవత్సరాల్లో ఈ యంత్రాల అమ్మకాలు పెరగగలవని ఆయన అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది 20 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ యంత్రాల కొనుగోళ్లకు వినియోగదారులకు రుణాలివ్వడానికి వివిధ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామని పేర్కొన్నారు.