తిండి ఉంగరాలు | Different Types Of Food Prepared With Prawns | Sakshi
Sakshi News home page

తిండి ఉంగరాలు

Published Sat, Oct 12 2019 3:10 AM | Last Updated on Sat, Oct 19 2019 6:32 PM

Different Types Of Food Prepared With Prawns - Sakshi

ఒలిచిన రొయ్యలు వెండి ఉంగరాల్లా ఉంటాయి. ముల్లు లేని, ఎముక లేని, మెత్తటి ఉంగరాలు. రుచికరమైన ఉంగరాలు. చెరువుల్లో పెంచినవి... సముద్రంలో పట్టినవి... ఎగుమతితో సిరులు కురిపించేవి... వంటగదిలో ఘుమఘుమలు నింపేవి ఇవే. ఎలా వండినా బాగుంటాయి. వండిన వారికి ప్రశంసలు తెస్తాయి. ఈ ఆదివారం రొయ్యకు సై అనండి. మరీ మరీ లాగించండి.

రొయ్యల ఇగురు
కావలసినవి: ప్రాన్స్‌ – 500 గ్రా; ఉల్లితరుగు – రెండు కప్పులు ఏలకులు – ఆరు; దాల్చినచెక్క – కొద్దిగా; నూనె – కప్పు పచ్చిమిర్చి – ఆరు (పొడవుగా కట్‌ చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు జీడిపప్పు  – 10 పలుకులు; కొత్తిమీర తరుగు – రెండు టీ స్పూన్లుపసుపు – చిటికెడు; గరంమసాలా – రెండు టీ స్పూన్లు గ్రేవీ కోసం:గసగసాలు – రెండు టీ స్పూన్లు; జీడిపప్పు – 10 పలుకులుపుచ్చపప్పు – రెండు టీ స్పూన్లు; కొబ్బరిముక్కలు – అర కప్పు వీటికి నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

తయారి:
ముందుగా ప్రాన్స్‌ను శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి
స్టౌ మీద పాన్‌ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి దోరగావేయించాలి
అందులో ఉడికించిన ప్రాన్స్, జీడిపప్పు, పావు కప్పు నీరు, గసగసాల మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి తక్కువ సెగ మీద పది నిమిషాల సేపు ఉడికించాలి
ఇప్పుడు కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపిమిశ్రమం దగ్గరగా వచ్చే వరకు సన్న సెగ మీద ఉడికించాలి
ఇప్పుడు సర్వింగ్‌బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి.

రొయ్యల వేపుడు
కావలసినవి: రొయ్యలు: పావుకేజీ (పొట్టు ఒలిచిన తర్వాత), టొమాటో : ఒకటి (తరగాలి), అల్లం : 50 గ్రా, వెల్లుల్లి : ఒకటి, ఉల్లిపాయ : ఒకటి, పచ్చిమిర్చి : నాలుగు, జీడిపప్పు : 25 గ్రా, గసాలు : 5 గ్రా, కొబ్బరి : చిన్న ముక్క, ధనియాల పొడి : ఒక టేబుల్‌ స్పూన్, ఉప్పు : రుచికి తగినంత, పసుపు : చిటికెడు, కారం: ఒక టేబుల్‌ స్పూన్, కొత్తిమీర : ఒక కట్ట, పుదీన: నాలుగు రెమ్మలు, నెయ్యి: రెండు టేబుల్‌ స్పూన్లు,

నూనె : ఒక టేబుల్‌ స్పూన్, లవంగాలు: నాలుగు, దాల్చిన చెక్క: చిన్న ముక్క, ఏలకులు : నాలుగు

తయారి:
పాత్రలో నూనె వేసి అందులో శుభ్రం చేసిన రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి
అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను మెత్తగా పేస్టు చేయాలి
ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూను తీసుకుని రొయ్యలలో వేసి కలిపి (నీటిని వేయకుండా) సన్న మంట మీద వేడి చేయాలి
ఇవి ఇగిరే లోపు కొబ్బరి, ధనియాలపొడి, జీడిపప్పు, గసాలు, రెండు ఏలకులు, రెండు లవంగాలు వేసి మెత్తని పేస్టు చేయాలి
బాణలిలో నెయ్యి వేసి కాగిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకుల పొడి, అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని, టొమాటో ముక్కలను వేసి దోరగా వేయించాలి
అది వేగిన తర్వాత కొబ్బరి, జీడిపప్పు మిశ్రమం వేయాలి
మసాలా వేగిన తర్వాత ఇగరపెట్టిన రొయ్యలను వేసి తగినంత నీటిని వేసి ఉడికించాలి
ఉడికేటప్పుడు కొత్తిమీర, పుదీన ఆకులను వేయాలి
మసాలా మొత్తం రొయ్యలకు పట్టేసి ఇగిరే వరకు వేయించి దించేయాలి.
గమనిక: ఫ్రైడ్‌ మసాలాను ఇష్టపడే వాళ్లు పైన చెప్పిన కొలతలు వేయాలి. తక్కువ మసాలా ఇష్టపడే వాళ్లు అన్నీ సగం వేస్తే చాలు.

ప్రాన్స్‌ బిర్యానీ
కావలసినవి: బిర్యానీకి...బాస్మతి రైస్‌ – అర కిలో; డాల్డా – 100 గ్రా.ఉల్లితరుగు – కప్పు; ఉప్పు – తగినంతఏలకులు – ఆరు; బిర్యానీ ఆకులు – ఆరుషాజీరా – రెండు టీ స్పూన్లునూనె – 100 గ్రా; నెయ్యి – 50 గ్రా.పుదీనా – కట్ట (కాడల్లేకుండా ఆకులు తీసుకోవాలి)అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – రెండు టీ స్పూన్లుపచ్చిమిర్చి – ఆరు (నిలువుగా కట్‌ చేయాలి)కూరకోసం...ప్రాన్స్‌ – 200 గ్రాషాజీరా – రెండు టీ స్పూన్లుఅనాసపువ్వు – ఒకటి; బిర్యానీ పువ్వు – ఒకటిబిర్యానీ ఆకు – ఒకటి; ఉల్లి తరుగు – కప్పుజీడిపప్పు  – 20 పలుకులుగసగసాల పేస్ట్‌ – నాలుగు టీ స్పూన్లుపుచ్చపప్పు పేస్ట్‌ – రెండు టీ స్పూన్లుటొమాటో పేస్ట్‌ – కప్పు; దాల్చినచెక్క – రెండు అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – రెండు టీ స్పూన్లుఏలకులు – ఆరు; పసుపు – చిటికెడుఉప్పు – తగినంత; కారం – రెండు టీ స్పూన్లుగరంమసాలా – రెండు టీ స్పూన్లుకొత్తిమీర తరుగు – రెండు టీ స్పూను

తయారి:
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి20 నిమిషాలపాటు నానబెట్టాలి
ప్రెషర్‌ కుకర్‌లోనూనె, డాల్డా, నెయ్యివేసి వేడయ్యాక షాజీరా, బిర్యానీ ఆకులు, ఏలకులు, ఉల్లితరుగు, అల్లంవెల్లుల్లిపేస్ట్, పుదీనా, ఉప్పు వేసి దోరగా వేయించాలి
అవివేగాక బియ్యానికి సరిపడా నీరు పోసి మరిగాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కుకర్‌ మూతపెట్టిఉడికించి పక్కన పెట్టుకోవాలి

కర్రీ తయారి:
పాన్‌లో నూనె వేసి వేడెక్కాక సాజీర, ఏలకులు, అనాస పువ్వు, బిర్యాని ఆకు, బిర్యాని పువ్వు, ఉల్లిపాయ తరుగు, జీడిపప్పు పలుకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలపేస్ట్, పుచ్చపప్పు పేస్ట్, ఉడికించిన ప్రాన్స్, పసుపు,ఉప్పు, కారం అన్నిటినీ కలిపి వేయించాలి
దగ్గరగాఅయిన తర్వాత గరంమసాలా, కొత్తిమీర వేసి బౌల్‌లోకి తీసుకోవాలి
ఇప్పుడు పెద్ద పాత్ర తీసుకునిఅందులో బిర్యానీ రైస్‌ను ఒక వరుస, ప్రాన్స్‌ కర్రీ ఒకవరుస... ఇలా మొత్తం రైస్, కర్రీని ఒకదాని మీదఒకటి సర్దాలి
అంతే వేడివేడి ప్రాన్స్‌ బిర్యానీ రెడీ.

ప్రాన్స్‌ మంచూరియా
కావలసినవి: ప్రాన్స్‌ – 200 గ్రా; అజినమోటో – టీ స్పూన్‌ఉప్పు – తగినంత; మిరియాల పొడి – రెండు టీ స్పూన్లుకోడిగుడ్డు – ఒకటి; కార్న్‌ఫ్లోర్‌ – అర కప్పు; మైదాపిండి – పావు కప్పునూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; పచ్చిమిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు అల్లంవెల్లుల్లి తరుగు –నాలుగు టీ స్పూన్లు; పసుపు – చిటికెడుకారం – టీ స్పూన్‌; కొత్తిమీర – కట్ట (సన్నగా తరగాలి)

తయారి:
ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి
ఒక గిన్నెలో అర టీ స్పూన్‌ అజినమోటో, ఉప్పు, అర టీ స్పూన్‌ మిరియాల పొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగా కలుపుకోవాలి
ఆ మిశ్రమంలో ఉడికించిన ప్రాన్స్‌ వేసి కలపాలి
పాన్‌లో నూనె పోసి వేడయ్యాక కలిపిపెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడువేరొక పాన్‌ పెట్టుకుని పావు కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్‌ అజినమోటో, అర టీ స్పూన్‌ మిరియాలపొడి, ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించాలి
ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్‌పకోడీని కూడా కలిపి తక్కువ సెగ మీద అయిదారు నిమిషాలు తిప్పి సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే ప్రాన్స్‌ మంచూరియా రెడీ.

థాయ్‌ ప్రాన్‌ కేక్‌
కావలసినవి: రొయ్యలు – 300 గ్రా.పండు మిరప పేస్ట్‌ – 2 టీ స్పూన్లు లెమన్‌ గ్రాస్‌ – 3 టీ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్‌ – 3 టీ స్పూన్లు కారం – 2 టీ స్పూన్లు నిమ్మరసం – 2 టీ స్పూన్లు ఉప్పు – 2 టీ స్పూన్లు ఫిష్‌ సాస్‌ – 2 టీ స్పూన్లు తులసి ఆకులు – 2 టీ స్పూన్లునూనె – 2 టీ స్పూన్లు చిల్లీ ఆయిల్‌ – 2 టీ స్పూన్లుఉల్లికాడలు – 25 గ్రా.కార్న్‌ ఫ్లోర్‌– 30 గ్రా.అల్లం పేస్ట్‌ – 2 టీ స్పూన్లు నిమ్మ ఆకులు – 2

తయారి:
రొయ్యలను శుభ్రపరిచాలి
చిల్లీపేస్ట్, లెమన్‌ గ్రాస్, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, ఉప్పు, ఫిష్‌ సాస్, తులసి ఆకులు,చిల్లీ ఆయిల్, ఉల్లికాడలు, కార్న్‌ఫ్లోర్, అల్లంపేస్ట్‌ రొయ్యలలో వేసి కలపాలి
తర్వాత చిన్న చిన్న ముద్దలుచేసి, చేత్తో అదమాలి
వీటినినాన్‌స్టిక్‌ పాన్‌పై కొద్దిగానూనె వేసి, వేడయ్యాక రెండు వైపులా కాల్చి, తీయాలి
గార్లిక్‌ సాస్‌తో తయారుచేసుకున్న థాయ్‌ ప్రాన్‌కేక్‌లను వేడి వేడిగా సర్వ్‌చేయాలి.

చెట్టినాడు ప్రాన్స్‌
కావలసినవి: రొయ్యలు (తోక ఉంచాలి) – 8; ధనియాల పొడి– 25 గ్రా.; జీలకర్ర పొడి – 20గ్రా.; మిరియాల పొడి – 16 గ్రా.; స్టార్‌ అనైజ్‌ (మార్కెట్లో లభిస్తుంది) – 25 గ్రా.; కల్పసి (మార్కెట్లో లబిస్తుంది) – టీ స్పూన్‌; మరాఠీమొగ్గ్గ (మార్కెట్లో లభిస్తుంది) – చిటికెడు;జాజికాయ – 1 (పొడి చేయాలి); ఏలకులు – 2  (పొడి చేయాలి);దాల్చిన చెక్క – చిన్న ముక్క (పొడి చేయాలి); లవంగాలు – 3 (పొడి చేయాలి); సోంపు (వేయించి పొడి చేయాలి) – 8 గ్రా.; హంగ్‌ కర్డ్‌ (ఒక పలుచనివస్త్రంలో పెరుగు వేసి, వడకట్టి, నీరు తీసేసినది) – 50 గ్రా.; నిమ్మకాయ – 1; పసుపు– చిటికెడు; ఆవనూనె – టీ స్పూన్‌; అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; ఉప్పు – తగినంత

తయారి:
ఒక వెడల్పాటి గిన్నెలో శుభ్రపరిచిన రొయ్యలను వేసి, అల్లం వెల్లుల్లిపేస్ట్, నిమ్మరసం వేసి, కలిపి, కొద్దిసేపు మ్యారినేట్‌ చేయాలి
మరొక గిన్నెలో ధనియాల పొడి, జీలకర్ర,మిరియాల పొడి, స్టార్‌ అనైజ్, కల్పసి,మరాఠీమొగ్గ, జాజికాయ పొడి, బిర్యానీ ఆకు, ఏలకుల పొడి, దాల్చిన చెక్క పొడి చేయాలి
సోంపు పొడి,ఉప్పు వేసి కలపాలి
దీంట్లో ఆవనూనె, నిమ్మరసం కలిపి పేస్ట్‌ చేయాలి
ఈ మిశ్రమాన్ని రొయ్యలకుపట్టించి అరగంట ఉంచాలి
కొబ్బరి పుల్లలకు మ్యారినేట్‌ చేసిన ప్రాన్స్‌ను గుచ్చి, గ్రిల్‌ చేయాలి
వీటిని వేడివేడిగా నచ్చిన చట్నీ కాంబినేషన్‌తో సర్వ్‌ చేయాలి.

చిల్లీ ప్రాన్స్‌
కావలసినవి: ప్రాన్స్‌ – 200 గ్రాఅజినమోటో – అర టీ స్పూన్‌; ఉప్పు – తగినంత మిరియాలపొడి – టీ స్పూన్‌; కోడిగుడ్డు – ఒకటి కార్న్‌ఫ్లోర్‌ – అర కప్పు మైదాపిండి – పావు కప్పునూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా పొడవుగా తరిగిన క్యాప్సికం – కప్పు పొడవుగా తరిగిన ఉల్లిపాయ – కప్పుæపొడవుగా తరిగినపచ్చిమిర్చి – ఆరు అల్లం వెల్లుల్లి తరుగు – నాలుగు టీ స్పూన్లు; చిల్లీ సాస్‌ – టీ స్పూన్‌ సోయా సాస్‌ – టీ స్పూన్‌ ఉల్లికాడలు – నాలుగు (సన్నగా తరగాలి)

తయారి:
ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి
ఒక గిన్నెలో అజినమోటో, ఉప్పు, మిరియాలపొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగాకలుపుకోవాలి
ఈ మిశ్రమంలో సగంసగం ఉడికించిన రొయ్యలను వేసి కలపాలి
పాన్‌లో నూనెవేడయ్యాక ప్రాన్స్‌ని పకోడీల్లా వేసి దోరగావేయించాలి
వేరొక పాన్‌లో పావు కప్పు నూనెవేసి వేడయ్యాక క్యాప్సికం తరుగు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చితరుగు వేసిదోరగా వేయించాలి
అవి వేగాక అందులో రెడ్‌చిల్లీ సాస్, సోయా సాస్, ఫ్రై చేసిన ప్రాన్స్, ఉల్లికాడలను కూడా కలిపి తక్కువ సెగమీద అయిదారు నిమిషాలు బాగా కలిపి సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకోవాలి.

జింజర్‌ ప్రాన్స్‌
కావలసినవి: ప్రాన్స్‌ – 200 గ్రాఉల్లిపాయ పేస్ట్‌ – కప్పుఅల్లంవెల్లుల్లి పేస్ట్‌ – అరకప్పు  అజినమోటో– టీ స్పూన్‌ఉప్పు – తగినంతమిరియాల పొడి – టీ స్పూన్‌కారం – రెండు టీ స్పూన్లునూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా టొమాటో సాస్‌ – టీ స్పూన్‌సోయా సాస్‌ – టీ స్పూన్‌ఫుడ్‌ (రెడ్‌) కలర్‌ – చిటికెడుకొత్తిమీర తరుగు – రెండు టీ స్పూన్లు

తయారి:
ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగాకడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించిపక్కనపెట్టుకోవాలి
పాన్‌లో అరకప్పు నూనెపోసి వేడయ్యాక  ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లిపేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం,ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి
తర్వాత గ్లాస్‌ నీరు పోసి ఉడికించాలి
మిశ్రమం దగ్గర పడేటప్పుడు టొమాటో సాస్,సోయా సాస్, ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి
ఇందులోఉడికించిన రొయ్యలను కలిపి నూనెలో డీప్‌ ఫ్రైచేయాలి
దోరగా వేగిన జింజర్‌ ప్రాన్స్‌ను సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌చేయాలి.

హక్కా ప్రాన్స్‌
కావలసినవి: రొయ్యలు – 250 గ్రా.కార్న్‌ ఫ్లోర్‌ – 30 గ్రా.మైదా – 30 గ్రా.పొట్టు తీసిన వెల్లుల్లి – 40 గ్రా.ఉల్లికాడలు – 20 గ్రా.డార్క్‌ సోయా సాస్‌ – 20 గ్రా.పచ్చిమిర్చి – 20 గ్రా.ఎమ్‌.ఎస్‌.జి (మోనో సోడియమ్‌ గల్టమేట్‌ ఇది మార్కెట్లో లభిస్తుంది)– చిటికెడు ఉప్పు – తగినంతపంచదార – టీ స్పూన్‌నూనె – 40 మీ.లీ; తెల్ల మిరియాలపొడి – చిటికెడు రెడ్‌ చిల్లీ ఆయిల్‌ (మార్కెట్లో లభిస్తుంది) – 20 మీ.లీ; చికెన్‌ బ్రోత్‌ పౌడర్‌  (మార్కెట్లో లభిస్తుంది) – 2 టీ స్పూన్లు

తయారి:
రొయ్యలను శుభ్రపరుచుకొని, పక్కన ఉంచాలి
మైదా, కార్న్‌ ఫ్లోర్, ఉప్పు, నీళ్లు కలిపి పిండిని జారుగా కలుపుకోవాలి
కడాయిలో నూనె పోసి, కాగనివ్వాలి
రొయ్యలను మైదా పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించి, తీయాలి
విడిగా మరొక పాన్‌లో బటర్‌ వేసి, వేడయ్యాక.. వెల్లుల్లి తరుగు,పచ్చిమిర్చి తరుగు, ఉల్లికాడలు వేయించాలి
వేయించిన రొయ్యలను వేగుతున్న బటర్‌ మిశ్రమంలో వేసి కలిపి, రెండు నిమిషాలు వేయించాలి
చక్రాలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వేయించిన వెల్లుల్లిరెబ్బలతో ఈ హక్కా ప్రాన్స్‌ను వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement