Bone
-
ఎదిగే పిల్లలకు ఎముకల సమస్య వస్తుందా..?
సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు వచ్చి, అవి గట్టిగా మారడాన్ని ‘ఆర్థరైటిస్’గా వ్యవహరిస్తుంటారు. మామూలుగానైతే పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య, పిల్లల్లోనూ కనిపిస్తుంది. ఇటీవల ఈ ధోరణి కాస్త ఎక్కువగానే ఉంది. పదహారేళ్ల లోపు పిల్లల్లో కారణమేమిటో తెలియకుండా వచ్చి, ఎదిగే ఎముకల్ని ప్రభావితం చేసే ఈ ఆర్థరైటిస్‌ను ‘జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్’ అనీ, ‘పీడియాట్రిక్ రుమాటిక్ డిసీజ్’ అని కూడా అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసం... చిన్నారుల వ్యాధినిరోధక వ్యవస్థ తమ సొంత ఎముకల కీళ్ల కణాలను దెబ్బతీయడంతో వస్తుంది కాబట్టి ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ (జేఐఏ)లో అనేక రకాలు ఉండటంవల్ల లక్షణాలూ వేర్వేరుగా ఉంటాయి. జేఐఏలోని రకాలు: సిస్టమిక్ ఆన్సెట్ జేఐఏ : ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్లను ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒంటిమీద ర్యాష్‌తో కొన్నిసార్లు గుండె, కాలేయం, స్లీ్పన్, లింఫ్నోడ్స్ను ప్రభావితం చేయవచ్చు. ఆలిగో ఆర్టిక్యులార్ జేఐఏ : మొదటి ఆరు నెలల్లో ఇది ఒకటి నుంచి నాలుగు రకాల కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఆర్నెల్లు దాటాక ఇంక ఏ కీలునూ ప్రభావితం చేయక΄ోతే దీన్ని ‘పర్సిస్టెంట్’ రకంగా పిలుస్తారు. ఒకవేళ ఆర్నెల్ల తర్వాత మరిన్ని కీళ్లను ప్రభావితం చేస్తే దీన్ని ‘ఎక్స్టెండెడ్’ రకంగా చెబుతారు. లీ ఆర్టిక్యులార్ జేఐఏ : మొదటి ఆర్నెల్లలో ఇది 5 లేదా అంతకంటే ఎక్కువ కీళ్లను ప్రభావితం చేస్తుంది. రుమటాయిడ్ ఫ్యాక్టర్ (ఆర్.ఎఫ్.) అనే రక్తపరీక్ష రిజల్ట్‌లో ఇది ఆర్ఎఫ్ పాజిటివ్‌గా లేదా ఆర్ఎఫ్ నెగెటివ్‌గా ఇలా ఎలాగైనా కనిపించవచ్చు. ఎంథసైటిస్ జేఐఏ : ఇందులో చిన్నారికి ఆర్థరైటిస్తోపాటు ఎంథసైటిస్ సమస్య కూడా ఉంటుంది. అంటే టెండన్ లేదా లిగమెంట్‌తో ఎముక కలిసే చోట వాపు కనిపిస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ : ఇందులో ఆర్థరైటిస్తోపాటు చర్మవ్యాధి అయిన సోరియాసిస్ కూడా కనిపిస్తుంది లేదా ఆర్థరైటిస్తోపాటు చేతి వేలు / కాలి బొటనవేలి ఇన్ఫ్లమేసన్ లేదా ఆర్థరైటిస్తోపాటు చేతి గోళ్ల మీద చిన్న చిన్న గుంటల్లా / గ్రూవ్స్లా రావచ్చు.చికిత్స: పిల్లల్లో సగం మందికి చికిత్స తర్వాత దాదాపుగా పూర్తిగా కోలుకునే అవకాశాలుంటాయి అయితే రుమటాలజిస్ట్ ఆధ్వర్యంలో నిశితమైన చికిత్స అందించాలి. చికిత్సలో భాగంగా... నొప్పులూ, వాపు, మంట తగ్గించడానికి నాన్‌స్టెరాయిడల్ యాంటీ–ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) జేఐఏను అదుపులో పెట్టడానికి డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ మెడిసిన్స్ (డిఎమ్ఏఆర్డీ) డాక్టర్ నిర్ణయించిన మోతాదులో కార్టికోస్టెరాయిడ్స్ మిగతా మందులు అంతగా ప్రభావం చూపనప్పుడు‘బయాలజిక్స్’ అనే పేరున్న అధునాతన మందులు. మందులతోపాటు కండరాలు, కీళ్లను సక్రమంగా పనిచేయించడం కోసం ఫిజియోథెరపీ, మంచి ఆహారం కోసం న్యూట్రిషనల్ కౌన్సెలింగ్, క్రమం తప్పని వ్యాయామాలు, కంటి పరీక్షలు కూడా అవసరమవుతాయిలక్షణాలు : మోకాలు, చేతి /పాదాల, మడమ, భుజాలు, మోచేయి లేదా ఏ ప్రదేశంలోని కీళ్లలో వాపు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం వేళ లేదా నిద్రలేవగానే ఈ కీళ్లవాపు కనిపించవచ్చు కళ్లు ఎర్రబారడం, మంట, వాపు కీళ్ల ఎర్రబారడంతోపాటు వేడిగా అనిపించడంకదలికలకు కీళ్లు సహకరించక΄ోవడం ∙తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ ఆకలి మందగించడం, బరువు అలాగే ఎత్తు వయసుకు తగినట్లుగా పెరగకపోవడం లింఫ్‌నోడ్స్ వాపు.నిర్ధారణ : యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ (ఏఎన్ఏ) పరీక్షతోపాటు ఇతర యాంటీబాడీ పరీక్షలు కంప్లీట్ బ్లడ్ కౌంట్ ∙ఎరిథ్రోసైటిస్ సెడిమెంటేషన్ రేట్ (ఈఎస్ఆర్) పరీక్ష సీ రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్పీ) పరీక్ష ∙క్రియాటినిన్ (కిడ్నీలు సరిగా పనిచేస్తున్నాయా అని తెలిపే పరీక్ష) హిమాటోక్రిట్ (రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను తెలిపే పరీక్ష. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతతో బాధపడటం ఎక్కువ) రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష అలాగే ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, బోన్ స్కాన్ వంటి కొన్ని ఇమేజింగ్ పరీక్షలతోపాటు మూత్ర పరీక్ష, కీళ్లలోని కందెన వంటి ద్రవాన్ని పరీక్షించే ‘ఆర్థ్రోసెంటైసిస్ పరీక్ష... ఇంకా పూర్తిస్థాయి కంటి పరీక్షలు అవసరం. -డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్(చదవండి: అర్లీ మెనోపాజ్ ప్రమాదమా..?) -
Hathras Incident: ఊపిరాడక కొందరు.. ఎముకలు విరిగి మరికొందరు..
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 121 మంది మృతిచెందారు. వీరికి సంబంధించిన పోస్ట్‌మార్టం నివేదికలలో వీరంతా ఎలా మృతి చెందినదీ తెలియవచ్చింది. ఈ వివరాలు ఎవరినైనా కంటతడి పెట్టించేలా ఉన్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం అలీఘర్‌లో 37 మందికి పోస్టుమార్టం నిర్వహించగా, వారిలో 10 మంది ఊపిరాడక మృతి చెందారని వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయాలు కావడం, ఎముకలు విరిగిపోవడం, బ్రెయిన్ హెమరేజ్ మొదలైనవి పలువురి మృతికి కారణంగా నిలిచాయి. 12 నుంచి 15 మంది కాలేయం, ఊపిరితిత్తులు పగిలిపోవడంతో మృతి చెందారు. తల, భుజం, మెడ, వెన్నెముకపై తీవ్రమైన గాయాల కారణంగా మరికొందరు మృతి చెందారు.జిల్లా ఆస్పత్రిలోని పోస్ట్‌మార్టం హౌస్‌కు మృతదేహాలు చేరుకోగానే.. అప్పటికే అక్కడికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తమ వారిని చూసుకుని బిగ్గరగా రోదించారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా కంటతడి పెట్టుకున్నారు. పోస్టుమార్టం హౌస్ వద్దకు అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల్లో మృతదేహాలను వరుసగా తీసుకువస్తుండటంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. మృతదేహాలను ఉంచేందుకు జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ, పోస్ట్‌మార్టం హౌస్ సరిపోలేదు. దీంతో వాటిని తెల్లటి వస్త్రాలలో చుట్టి, ఆస్పత్రి ఆవరణలోనే ఉంచారు. -
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
హైదరాబాద్, మే 14, 2024: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు సుమారు నెల రోజుల క్రితం ఓ పెళ్లిలో మటన్ తింటూ, పళ్లు లేకపోవడంతో పొరపాటున ఓ ఎముక మింగేశారు. ఆహారనాళంలో ఇరుక్కుపోయిన ఆ ఎముక.. లోపల రంధ్రం చేసి, తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమైంది. ఎదభాగం మధ్యలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆ వృద్ధుడు.. ఎట్టకేలకు ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి వచ్చారు.తొలుత నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి ఎముక ఉందన్న విషయాన్ని గుర్తించి, ఎల్బీనగర్ ఆస్పత్రికి పంపారు. ఇక్కడ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాధిక నిట్టల నేతృత్వంలోని వైద్యబృందం ఆయనను క్షుణ్నంగా పరిశీలించి, తగిన పరీక్షలు కూడా చేసి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కొపిక్ ప్రొసీజర్తోనే ఎముకను అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డాక్టర్ రాధిక తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేన్ గ్రామానికి చెందిన 66 ఏళ్ల శ్రీరాములుకు దవడ పళ్లు లేవు. దానివల్ల నమలలేరు. కానీ ఒక పెళ్లికి వెళ్లి, అక్కడ మటన్ ఉండటంతో తినాలనుకున్నారు. పళ్లు లేకపోవడం వల్ల నమలకుండా నేరుగా మింగేశారు. అలా మింగినప్పుడు దాదాపు 3.5 సెంటీమీటర్ల పొడవున్న ఒక ఎముక ముక్క కూడా లోపలకు వెళ్లిపోయింది. వెళ్లిన విషయం కూడా తొలుత ఆయనకు తెలియలేదు. రెండు మూడు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి అనిపించింది. స్థానికంగా వైద్యులకు చూపిస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని మందులు ఇచ్చారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. దాంతో తర్వాత నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి చూసి, లోపల ఎముక ఇరుక్కుందన్న విషయం చెప్పారు. అక్కడినుంచి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి పంపారు.సాధారణంగా ఇలా ఇరుక్కున్న ఎముకలను ఎవరైనా తీసేస్తారు. కానీ, నెల రోజులుగా అది ఇరుక్కుపోవడం వల్ల ఆహారనాళానికి రంధ్రం చేసిసింది. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి, పుండ్లు కూడా పడ్డాయి. కొంత చీము చేరింది. దానికితోడు ఇదంతా గుండెకు బాగా దగ్గరగా ఉంది. అలాంటప్పుడు తీసే సమయంలో ఏమాత్రం కొంత అటూ ఇటూ అయినా ఆహారనాళానికి పూర్తిగా రంధ్రం పడిపోయి, అది గుండెకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని అత్యంత జాగ్రత్తగా ఎండోస్కొపీ ప్రొసీజర్‌లోనే తొలగించాం. లేనిపక్షంలో అక్కడ పెర్ఫొరేషన్ లాంటి మరిన్ని సమస్యలు వచ్చేవి.ఈ ప్రక్రియ చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా జాగ్రత్తలు చెప్పాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అన్నం తింటే ఆ మెతుకులు మళ్లీ ఇన్ఫెక్షన్ అయిన పుండ్ల వద్దకు చేరి, అక్కడ ఆగిపోయి మళ్లీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. అందుకే ఆయనకు కొంతకాలం పూర్తిగా ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పాం. కొబ్బరినీళ్లు, మంచినీళ్ల లాంటివి తీసుకోవాలన్నాం. ఇప్పుడు ఎముక వల్ల వచ్చిన నొప్పి ఆయనకు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడే కొద్దిగా జొన్న అన్నం, పెరుగు అన్నం తినగలుగుతున్నారు.ఏ వయసువారైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఇక కాస్త పెద్దవయసు వచ్చి, పళ్లు ఊడిపోయిన తర్వాత అయితే ఏదైనా బాగా ఉడకబెట్టుకుని, మెత్తగా అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఎముకలను ఎవరైనా యథాతథంగా తినకూడదు. కానీ ఈ కేసులో ఆయనకు పళ్లు లేకపోవడంతో తెలియక, పొరపాటున మింగేశారు. అది సమయానికి తియ్యకపోతే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఆహారనాళానికి రంధ్రం కూడా పెద్దది అయిపోతుంది. అప్పుడు తప్పనిసరిగా మేజర్ సర్జరీ చేయాలి. చీము పడుతుంది. ఇలా ఒక నెల రోజుల పాటు ఎముక లోపల ఉండిపోవడం ఎప్పుడూ చూడలేదు” అని డాక్టర్ రాధిక నిట్టల వివరించారు. -
'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!?
'దేహ నిర్మాణంలోనూ, దారుఢ్యంలోనూ ఎముకలది కీలక పాత్ర. ఎముకలు బలంగా ఉంటేనే మనిషి బలంగా ఉంటాడు. ఆరోగ్యంగానూ ఉంటాడు. చిన్న వయసులో ఎముకలు చాలా ఫ్లక్సిబుల్గా ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకల్లోకి క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు నిండుతూ పోతుంటాయి. ఫలితంగా ముప్ఫయిల వయసు నాటికి ఎముకల సాంద్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే ఆ గరిష్ఠ స్థాయికి చేరాక మళ్లీ ఎముక సాంద్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇలా తగ్గడాన్ని ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ అంటారు. మెల్లగా తగ్గుతూపోతుంటే చాలాకాలం బలంగా ఉంటుంది. లేదంటే బలహీనపడుతుంది. ఈ 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ కథా కమామిషు చూద్దాం.' 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలంటే...? మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సిమెంటు అనుకుంటే... సూర్యరశ్మి నుంచి దొరికే విటమిన్ ‘డి’ ఈ కాంక్రీటును కలిపే నీరుగా భావిస్తే.. ఇదంతా ఎముకలో బలంగా కూరేలా చేసేది మనం చేసే వ్యాయామం. ఈ మూడు గరిష్ఠంగా కలగలిసి ఎంత బలంగా కూరినట్లు అయితే ఎముక అంత బలంగా మారుతుంది. అలా రూపొందే ఎముక సాంద్రత మీద ఎముక బలం ఆధారపడి ఉండటంతో.. ఎముక ఆరోగ్యానికి ‘బోన్ మినరల్ డెన్సిటీ’ అన్నది ఓ సూచికగా ఉంటుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఈ బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతూ పెరుగుతూ 30వ ఏటికి వచ్చేసరికి దాదాపుగా గరిష్టంగా కొంతకాలం పాటు ఉండి, మళ్లీ అప్పటి నుంచి క్రమంగా తగ్గుతుంటుంది. ప్రోగ్రెసివ్ బోన్ లాస్ మహిళల్లో మరింత ఎక్కువ. ఎముకలు తమ సాంద్రత కోల్పోయే కండిషన్ పురుషుల కంటే మహిళల్లో చాలా వేగంగా జరుగుతుంది. సాధారణంగా వాళ్లలో వ్యాయామం చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉండటం, అదీగాక 45 ఏళ్లు దాటాక రుతుస్రావం ఆగిపోవడం, దాంతో మెనోపాజ్ తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. ఈ కారణంగానే మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ. ఎముక సాంద్రత తగ్గడానికి కారణాలు.. మన ప్రమేయం లేనివి.. కొందరికి జన్యుపరంగానే ఎముక సాంద్రత ఎక్కువగా ఉంటుంది. వారిలో వంశపారం పర్యంగానే చాలా పెద్దవయసు వచ్చేవరకు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది పుట్టుకతో వచ్చే మార్చలేని అంశం. ∙కొందరిలో కుషింగ్ సిండ్రోమ్, హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తిలేకపోవడంతో ఆహారానికి దూరంగా ఉండటం), మాల్ అబ్షార్‌ప్షన్ సిండ్రోమ్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గి, ఆ తర్వాత ఇది సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. కొందరు తరచూ కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడుతుండటం, అవి తగ్గడం కోసం గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్ వంటి మందులు వాడుతుండటం... ఎముక సాంద్రతను తగ్గిస్తాయి. జెండర్ కారణాలు.. మహిళల విషయంలో.. అందునా వాళ్లలో మెనోపాజ్ తర్వాత ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ. ఎత్తు తక్కువగా ఉన్న మహిళల్లో రిస్క్ ్రపోగ్రెసివ్ బోన్లాస్ ముప్పు మరింత ఎక్కువ. (అంటే.. బరువు అరవై కిలోల లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). మన చేతుల్లో/ నియంత్రణలో ఉండే అంశాల విషయానికి వస్తే.. మన నియంత్రణలో ఉండే కొన్ని అంశాలు పాటించడం ద్వారా ప్రోగ్రెసివ్ బోన్ లాస్‌ను నివారించవచ్చు. అదెలాగంటే.. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పాలు, నట్స్ వంటి ఆహారాలు తీసుకుంటూ ఉండటం. దేహానికి విటమిన్–డి సమకూరేలా లేత ఎండలో వ్యాహ్యాళిగా తగినంత వ్యవధి పాటు తిరగడం. (నేరుగా పడే, తీవ్రమైన ఎండలో తిరగకూడదు). రోజుకు 30 – 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయడం. మన జీవనశైలి మార్చుకోవడం అంటే కాఫీ వంటివి పరిమితంగా తీసుకోవడం. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం. కంటినిండా తగినంతగా నిద్రపోవడం. ఒకవేళ కౌమార, యౌవన దశల్లో వ్యాయామానికి దూరంగా ఉండటం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లకు లోనైతే ఎముక సాంద్రత తగ్గిపోవడంలో వేగం పెరుగుతుంది. ఎముకలు త్వరగా గుల్లబారిపోయి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు త్వరగా వచ్చేందుకు అవకాశం పెరుగుతుంది. ఎముక సాంద్రత తెలిసేదెలా..? ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్షియోమెట్రీ’ అనే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ పరీక్షే ఎముక సాంద్రత తెలుసుకోవడానికీ ఉపయోగపడుతుంది. బాధితుల వయసు ఆధారంగా ఎముక సాంద్రతను లెక్కగడతారు. దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దాంతో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలూ అవసరం పడవచ్చు. ఎముక సాంద్రత పెంచుకోవడం కోసం.. ప్రోగ్రెసివ్ బోన్లాస్ నివారణకు మన చేతిలో ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తే... ఎముక సాంద్రత పెంచుకోడానికి దోహదపడుతుంది. యుక్తవయసు పిల్లల్ని ఆరుబయట ఎండలో ఆడేలా ్రపోత్సహించడం. పెరిగే వయసు నుంచే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలతోపాటు బ్రాకలీ వంటివి ఎక్కువగా తీసుకునేలా చూడటం. చిన్న వయసు నుంచి లేత ఎండలో ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల దేహంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. అది ఆహారాన్ని ఎముకల్లోకి ఇంకిపోయేలా చేయడంతో సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా ఎంత చిన్న వయసు నుంచి ఈ అలవాట్లు నేర్పితే.. అంత సుదీర్ఘకాలం సాంద్రత నిలిచి ఉండి, ప్రోగ్రెసివ్ బోన్ లాస్ తగ్గుతుంది. దాంతో వృద్ధాప్యంలో పడిపోవడం (ఫాల్), ఇతర ఎముకలతో పాటు ప్రధానంగా తుంటి ఎముకల వంటివి విరగడాన్ని నివారించవచ్చు. — డాక్టర్ సుధీర్‌రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. -
చిక్కిన చిరుత.. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు
మహబూబ్‌నగర్: రెండేళ్ల నుంచి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత పులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో శనివారం రాత్రి చిక్కింది. రెండు నెలల నుంచి మరికల్ మండలం రాకొండ శివారులోని గుట్టపై ఓ చిరుత రెండు పిల్లలకు జన్మనించి అక్కడే ఉంటుంది. నిత్యం రాత్రి కాగానే వ్యవసాయ పొలాల వద్ద కట్టేసిన పశువులపై ఎక్కడో ఒక చోట దాడి చేసి ఆకలి తీర్చుకుంటుంది. చిరుత పులిని పట్టుకోవాలని పది రోజుల కిందట గ్రామస్తులు నారాయణపేట అటవీ శాఖ అధికారులను సంప్రందించారు. మూడు రోజుల కిందట రాకొండ గుట్ట సమీపంలో బోనులో మేకపిల్లను ఉంచి చిరుతను పట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు తల్లి చిరుత బోనులో చిక్కడంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆదివారం మేకపిల్లను బయటకు పంపించి క్రేన్ సాయంతో బొలెరొ వాహనంలో శ్రీశైలం అడవిలోకి తరలించారు. బోనులో చిక్కిన చిరుత మండలంలో రాకొండ, పూసల్‌పహాడ్, మాద్వార్ తదితర గ్రామాల్లోని పశువులపై దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. ఈ చిరుతకు సంబంధించిన రెండు చిరుత పిల్లలు తప్పించుకోవడంతో వాటిని కూడా పట్టుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. లేకుంటే తమ వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో వన్యప్రాణులు సంచరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ అధికారి వీణావాణి తెలియజేశారు. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు పట్టుబడిన చిరుతను ఆదివారం అటవీ శాఖ వారు బోనులో బంధించి నల్లమల అటవీ ప్రాంతంలోని లింగాల మండలం గిరిజ గుండాల బేస్ క్యాంపు సమీపంలో అడవిలోకి వదిలిపెట్టారు. -
విమర్శలకు భయపడం.. భక్తుల భద్రతే ముఖ్యం: టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రెండు నెలల కాలంలో 5 చిరుతలను పట్టుకున్నామని తెలిపారు. నడక దారిలో ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. విమర్శలకు భయపడమని, చిత్తశుద్ధితో భక్తులకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. చిరుత చిక్కుకున్న ప్రదేశానికి టీటీడీ చైర్మన్ భూమన చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ చిరుత కొనసాతుందని పేర్కొన్నారు. రాత్రి పన్నెండు.. ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని, తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని భూమన అన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని, ఈ కారణంగానే నేడు అయిదో చిరుతను పట్టుకున్నట్లు చెప్పారుజ నడక దారిలో వస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించాలని, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో చుక్కెదురు భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం వారికి చేతి కర్రలు కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు. కర్రలు ఇస్తామని ప్రకటించగానే దానిమీద ఇష్టం వచ్చినట్టుగా తమ ఎన్నో అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని విమర్శించారు. కర్రలు ఇస్తామని చెప్పిన తర్వాత నాలుగు చిరుతలు దొరికాయని, అంతకు ముందు ఒక చిరుత బోనులో చిక్కిందని గుర్తు చేశారు. భక్తుల భద్రత విషయంలో టీటీడీ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో తెలియజేసేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే అని చైర్మన్ పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారి అధికారుల పర్యవేక్షణలో రెండు మూడు వందల మంది సిబ్బంది అధునాతన బోనులతో ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారని తెలిపారు. విమర్శలకు, జడిసి.. ఆపరేషన్ చిరుతను ఆపేసే ప్రసక్తి లేదని విమర్శకులను హెచ్చరించారు. కాగా తిరుమలలో కాలిబాటన వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా మరో చిరుతపులిని బంధించారు అధికారులు. తిరుమల ఘాట్ రోడ్డు నరసింహ స్వామి ఆలయం ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. వేకువజామున 12 నుంచి 1 గంట మధ్యలో బోన్లో చిక్కుకున్నట్లు అటవీశాఖ అధికారుల చెప్పారు. గత వారం రోజులుగా ఈ చిరుత సంచారం గుర్తించిన అధికారులు పట్టుకోవడానికి బోన్ పెట్టగా.. నేడు చిక్కుకుంది. దానిని ఎస్వీ జూపార్క్ తరలించారు. -
గొంతులో ఇరుక్కున్న లెగ్ పీస్.. వైద్యుని వింత సలహాకు కంగుతిన్న మహిళ..!
ఒక మహిళకు ఎదురైన వింత అనుభవం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ తాను చికెన్ తింటున్న సమయంలో తన గొంతులో ఒక చిన్నపాటి ఎముక ఇరుక్కుపోయిందని తెలిపింది. దీంతో తనకు గొంతునొప్పి తలెత్తడంతో వైద్యుని దగ్గరకు వెళ్లానని, ఆయన సర్జరీ చేసేందుకు బదులు ఇచ్చిన ఒక సలహా అద్భుతంగా పనిచేసిందన్నారు. దీంతో తనకు నొప్పి నుంచి ఉపశమనం లభించిందని తెలిపారు. ఈ ఉదంతం న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. ఇచ్ మీడియా కంపెనీ స్టఫ్ తెలిపిన వివరాల ప్రకారం బెథ్ బ్రెష్ అనే మహిళ గత వారంలో వెల్లింగ్టన్లోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఆమె చికెట్ డిష్ ఆర్టర్ చేసింది. అప్పుడు వెయిటర్ ఆమెను ఎముకలతో కూడిన చికెన్ కావాలా లేదా బోన్‌లెస్ చికెన్ కావాలా అని అడిగాడు. దీనికి ఆమె బోన్‌తో కూడిన చికెన్ కావాలని తెలిపింది. ఆ చికెన్ తింటున్న సమయంలో ఆమె గొంతులో చిన్నపాటి ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఆమెకు కొంచెం నొప్పిగా అనిపించినప్పటికీ, రెస్టారెంట్‌తో ఎటువంటి ఫిర్యాదు చేయకుండానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే రెండుమూడు రోజుల పాటు ఆ నొప్పి కొనసాగడంతో తన ఇంటికి సమీపంలోని వైద్యుని దగ్గరకు వెళ్లి, తన సమస్య వివరించింది. వైద్యుని పరీక్షలో ఆమె గొంతులో చిన్నపాటి బోన్ ముక్క ఉందని స్పష్టమయ్యింది. దీంతో ఆమె తనకు సర్జరీ చేస్తారని అనుకుంది. అయితే ఆ వైద్యుడు సర్జరీకి బదులుగా ఒక విచిత్ర ఉపాయం తెలిపారు. వైద్యుని సలహా గురించి బెథ్ బ్రెష్ మాట్లాడుతూ ఆ వైద్యుడు తనను కొద్ది రోజులు కూల్‌డ్రింక్ తాగాలని, అప్పుడు తన గొంతులోని బోన్ పీస్ దానంతట అదే కరిగిపోతుందని తెలిపారన్నారు. ఆమెకు ఆ సలహా పనిచేయదేమోనని అనిపించినా దానిని అనుసరించింది. ఫలితంగా ఆమె గొంతు రెండు రోజులలో మునుపటి మాదిరిగా సవ్యంగా మారిపోయింది. ఈ ఘటన గురించి డచ్ మెడికల్ ఎక్స్పర్ట్ డాక్టర్ బ్రాయన్ బెట్టీ మాట్లాడుతూ గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోతే ఇది పరిష్కారం కాదన్నారు. ఎసిడిక్ డ్రింక్ కారణంగా ఎముక ముక్క కరిగిపోయే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విధంగా బాధితులకు కూల్ డ్రింక్ తాగాలంటూ సలహా ఇవ్వడం సరికాదన్నారు. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్‌లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. -
Medak: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మహిళ మృతి
సాక్షి, మెదక్ : చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన సంతోషి(30) అనే మహిళ కూలి పనుల కోసం వలస వచ్చింది. ముసాయిపేట్ మండలం కొప్పులపల్లి గ్రామ శివారులో ని ఇటుక బట్టీలలో పని చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం తూప్రాన్ సంతకు వెళ్లిన మహిళ.. మద్యం సేవించి ఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లో చికెన్ వండుకుని తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు -
అమ్మ బాబోయ్!.. రెండు భుజాలు ఒక్క చోటుకు.. అదెలా సాధ్యం?
యూకేకు చెందిన డ్యానియల్లె అనే మహిళ తనకున్న ప్రత్యేక ‘ప్రతిభ’తో ప్రజలను అవాక్కు చేస్తోంది. ఎముకలు, పుర్రె, పళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపే క్లీడోక్రేనియల్ డిస్ప్లేసియా (సీసీడీ) అనే అరుదైన జన్యు సంబంధ పరిస్థితితో పుట్టిన డ్యానియల్లే.. తనకున్న లోపాన్నే అవకాశంగా మార్చుకుంది. సాధారణ శరీరాకృతితో పుట్టిన మనుషులకు సాధ్యంకాని రీతిలో విన్యాసాలు చేసి చూపుతూ అందరి మన్ననలు పొందుతోంది. ఇంతకీ ఆమె చేస్తున్న ఆ విన్యాసాలు ఏమిటో తెలుసా? తన రెండు భుజాలను పరస్పరం తాకేలా చేయడమే! అంటే చేతులను లోపలకు ముడుస్తూ మొండేన్ని నిలువుగా రెండు భాగాలుగా కలిపిందన్నమాట!! ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? తన రెండు భుజాల వద్ద ఎముకలు (కాలర్ బోన్స్) లేకపోవడం వల్లే తాను ఈ ట్రిక్‌ను చేయగలుగుతున్నట్లు డ్యానియల్లే తెలిపింది. ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఈ తరహా జన్యు లోపం ఉంటుందని.. అలాంటి అదృష్టం తనకు లభించిందని గర్వంగా చెబుతోంది డ్యానియల్లే. తన ‘ట్రిక్’లను నెటిజన్లకు చూపుతూ వారి మన్ననలు పొందుతోంది. చదవండి: ‘నోరె’ళ్లబెట్టే రికార్డు! 4 మెక్‌డొనాల్డ్స్ చీస్ బర్గర్లను అవలీలగా.. -
ప్రోస్టేట్ కేన్సర్ ముందస్తు లక్షణాలివే! ఈ జాగ్రత్తలు పాటించారంటే పురుషుల్లో ఆ సమస్య..
Leading Cause Of Cancer Deaths In Men Is Prostate Cancer And Risk Factors For Prostate Cancer: మన దేశంలో గత కొన్నేళ్లుగా పురుషుల్లో వెలుగు చూస్తున్న కేన్సర్ కేసుల్లో అత్యధిక శాతం ప్రోస్టేట్ కేన్సర్స్ ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. రకరకాల కారణాల వల్ల ప్రోస్టేట్ కేన్సర్ వ్యాధి గ్రస్థులు పెరుగుతున్న నేపధ్యంలో అపోలో ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్–యూరాలజిస్ట్ డా.ప్రియాంక్ సలేచా ఈ వ్యాధికి సంబంధించిన పలు విశేషాలు, నివారణ మార్గాలు సూచిస్తున్నారు. అవగాహన కీలకం.. ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడం, అపోహలు కూడా ప్రోస్టేట్ పరీక్షల కోసం వైద్యుని దగ్గరకు వెళ్లే విషయంలో వెనుకాడేలా చేస్తున్నాయి. ప్రోస్టేట్ కేన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత ఎక్కువగా చికిత్స విజయవంతం అయే అవకాశాలు ఉన్నాయి.అలా జరగాలంటే ప్రోస్టేట్ కేన్సర్ బారినపడేందుకు ముందుగా శరీరంలో సంభవించే హెచ్చరిక సూచికలను గమనించాల్సి ఉంటుంది. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో ఉండే ఒక అవయవం ప్రోస్టేట్. ఇది శరీరపు మూత్ర విసర్జన విధులకు అనుసంధానించి ఉంటుంది. అన్ని వయసుల వారికీ ప్రోస్టేట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే 50 ఏళ్లు పై బడిన పురుషులు ఈ లక్షణాల పట్ల అవగాహన పెంచుకుని, ముందస్తు సూచికలను పసిగట్టగలగాలి. అదే విధంగా తరచుగా ప్రోస్టేట్ పరీక్షలు చేయిస్తూ ఉండడం కూడా ప్రోస్టేట్ ఆరోగ్యం సవ్యంగా ఉంచేందుకు, తొలిదశలోనే ఏ వ్యాధినైనా అడ్డుకునేందుకు అవసరం. చదవండి: Wild Facts About Octopuses: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!! ప్రోస్టేట్‌కు అనుబంధంగా వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఇన్ఫ్లమేషన్, ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ (బిపిహెచ్)... ప్రోస్టేట్ కేన్సర్ వరకూ దారితీస్తాయి. తొలి దశలోనే కేన్సర్‌ను గుర్తించిన కేసుల్లో అది ప్రోస్టేట్ అవయవం వరకూ మాత్రమే పరిమితమై, చికిత్స, కోలుకోవడం మరింత సులభంగా, ప్రభావవంతంగా సాధ్యపడుతోంది. లక్షణాలను గుర్తించేలోగానే ఒకవేళ కేన్సర్ ఇతర అవయవాలకు కూడా విస్తరించినట్లయితే చికిత్స సంక్లిష్టంగా మారడం అలాగే కోలుకునేందుకు పట్టే సమయం కూడా పెరగడం వంటివి జరుగుతాయి. లక్షణాలివే... ►రాత్రి సమయంలో తరచు మూత్ర విసర్జన అవుతుంటుంది. ప్రొస్టేట్ అవయవం ఎన్లార్జ్ అవడం వల్ల యురేత్రా మీద అదనపు ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది. తద్వారా మూత్ర విసర్జన సరఫరాకి అడ్డంకులు ఏర్పడి మూత్ర కోశం గోడల ఇరిటేషన్‌కు కారణమవుతుంది. ఈ పరిస్థితి తరచుగా రాత్రి సమయంలో చోటు చేసుకుంటుంది. ►కేన్సర్ సోకి వృద్ధి చెందే దశలో ఇది పలు రకాల గుర్తించదగిన లక్షణాలు వెల్లడయేలా చేస్తుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, నుంచుని మూత్ర విసర్జన చేసేందుకు ఇబ్బంది పడడం, ధార బలహీనంగా పోవడం... వంటివి ఉంటాయి. ►మూత్రంలో రక్తం కనపడడం అనేది రకరకాల వ్యాధులకు సూచిక అలాగే ప్రోస్టేట్ కేన్సర్‌కి కూడా. ఈ లక్షణం కనపడిందంటే.. కేన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌కి చేరినట్టు అర్ధం. ►పురుషుల పునరుత్పత్తి కి సంబంధించి కీలకమైన అవయవం కాబట్టి, ప్రోస్టేట్... స్కలన సమయంలో నొప్పితో పాటు రకాల ఇబ్బందికర భావనలు వచ్చేందుకు కేన్సర్ కారకమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది అంగస్తంభన వైఫల్యాలకు కూడా దారి తీస్తుంది. ►కేన్సర్ పెరుగుతున్న కొద్దీ... ప్రోస్టేట్ గ్లాండ్ మరింత ఎన్లార్జ్ అయి పురీష నాళంపై నిర్విరామంగా ఒత్తిడి కలిగిస్తుంది. పైన పేర్కొన లక్షణాలు మాత్రమే కాకుండా మరే విధమైన అసాధారణ మార్పులు కనపడినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం తప్పనిసరి. కేన్సర్ స్టేజ్ మీద ఆధారపడి రేడియేషన్ థెరపీ, శస్త్ర చికిత్సలను నిపుణులు సూచిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, హైడ్రేషన్ వంటివి శరీరానికి అవసరం లేని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. - డా.ప్రియాంక్ సలేచా కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్–యూరాలజిస్ట్ అపోలో ఆసుపత్రి చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..! -
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి.. చివరకు
Man Last Breath After Chicken Bone Stuck in Throat At Chennai చెన్నై: అందియూరు సమీపంలో చికెన్ తింటున్న సమయంలో గొంతులో ఎముక ఇరుక్కుని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈరోడ్ జిల్లా అందియూరు సమీపం కుచ్చి కల్లూరుకు చెందిన సుబ్రమణ్యన్ (56) తాపీ మేస్త్రి. శుక్రవారం మధ్యాహ్నం అదే ప్రాంతంలో ఉన్న స్నేహితుడు మునిరాజు ఇంటిలో కోడి మాంసం తిన్నాడు. ఆ సమయంలో ఓ చికెన్ ఎముక గొంతులో చిక్కుకుని ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతన్ని హుటాహుటిన అందియూరు ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకపోయింది. అక్కడ పరిశోధించిన వైద్యులు సుబ్రమణ్యన్ అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. చదవండి: (త్వరలో పునీత్ సమాధి వద్దే పెళ్లి చేసుకొంటాం: గురురాజ్, గంగా) -
సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ సర్జరీ విజయవంతం
-
గొంతులో ఇరికిన ఎముక..
సాక్షి, సిటీబ్యూరో: భోజనం చేస్తుండగా గొంతులో ఇరికిన ఎముకను కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. లేజర్ సహాయంతో ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా మటన్బోన్ను తొలగించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకోవడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు (30) ఇటీవల ఓ విందుకు హాజరయ్యాడు. విందులో మాంసాహారం భోజనం చేస్తుండగా మాంసం ఎముక గొంతు మధ్యలో ఇరుక్కుని అన్న వాహికకు అడ్డుపడింది. ఎముక ముక్క గొంతు లోపలి భాగంలో రెండు వైపులా గుచ్చుకోవడంతో గాయమైంది. అన్నవాహిక వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో బాధ పడటమే కాకుండా ఇటు మింగలేక.. అటు కక్కలేని పరిస్థితుల్లో ఉన్న అతడిని బంధువులు చికిత్స కోసం ఈ నెల 12న బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈఎన్టీ నిపుణుడు డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ భవానీరాజు, యూరాలజిస్ట్ వంశీకృష్ణల నేతృత్వంలోని వైద్య బృందం బాధితుడికి చికిత్స చేసింది. తొలుత ఎండోస్కోపీ సహాయంతో తొలగించాలని వైద్యులు భావించారు. అది కుదరక పోవడంతో లేజర్ సాంకేతిక పరిజ్ఞానంతో.. గొంతుకు అడ్డుగా ఉన్న ఎముకను రెండు ముక్కలుగా కట్ చేసి, ఆ తర్వాత వాటిని తొలగించారు. సాధారణంగా ఈ లేజర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో ఉపయోగిస్తారు. గొంతులో ఇరికిన ఎముకను తొలగించడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కేర్ వైద్యులు ఉపయోగించడం విశేషం. -
సిగరెట్‌తో ఎముకలూ దెబ్బ తింటాయా?
నా వయసు 35 ఏళ్లు. రోజుకు రెండు పాకెట్ల సిగరెట్లు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. ఫ్రెండ్స్ మాట్లాడుతూ సిగరెట్లతో ఎముకలు కూడా బలహీనమవుతాయని అంటున్నారు. సిగరెట్ దుష్ప్రభావం ఎముకలపైన కూడా ఉంటుందా? – ఆర్. సమీర్, హైదరాబాద్ పొగతాగే అలవాటు అన్ని అవయవాల మాదిరిగానే ఎముకలపైనా దుష్ప్రభావం చూపుతుంది. సిగరెట్ల కారణంగా అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకలు క్యాల్షియమ్‌ను గ్రహించడం కూడా తగ్గుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ప్రభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... ∙పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ మార్పులు వచ్చి క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి. పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది. పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ. పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ప్రభావం చూపుతాయి. ∙ఎముకలలోని బంతిగిన్నె కీలుతోపాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామి ప్యాసివ్ స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి. సన్నగా ఉన్నాను... ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలా? నా వయసు 29 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. బరువు కేవలం 48 కేజీలు మాత్రమే. నా ఫ్రెండ్స్ అంతా నన్ను చాలా ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు. – ఎ. సిద్ధార్థ, కర్నూలు కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... ∙జన్యుపరమైనవి ∙సరిగా తినకపోవడం ∙చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం ∙అవి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపకరమైన రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్) ఉండటంతో కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... ∙మీలో ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ౖహె పర్ థైరాయిడిజమ్) ∙మీరు తీసుకునే ఆహరంలో పోషకాలు పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు ∙ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు. మీకు కొన్ని సూచనలు: ∙మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి ∙మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హైప్రోటీన్ డైట్ వద్దు ∙మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి ∙ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి ∙ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి ∙వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి ∙మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్‌ను వాడండి ∙అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానినిక ఉపయోగపడతాయంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఏసీఎల్ టేర్ అంటే ఏమిటి?
నా వయసు 27 ఏళ్లు. నేను మంచి స్పోర్ట్స్ పర్సన్‌ను. ఇష్టంగా ఆటలాడుతుంటాను. ఏడాది కిందట ఒకసారి హైజంప్ చేసే సమయంలో మోకాలిలో తీవ్రమైన నొప్పివచ్చింది. డాక్టర్‌ను కలిస్తే ‘పార్షియల్ ఏసీఎల్ టేర్’ జరిగిందని వివరించారు. కొన్ని రోజులు ఫిజియోథెరపీ తీసుకొమ్మనీ, ఆ తర్వాత ఎప్పట్లాగే ఆటలాడవచ్చని చెప్పారు. నాకు ఇప్పటికీ నాకు అప్పుడప్పుడూ ఇంకా నొప్పిగానే ఉంటోంది. అసలీ ఏసీఎల్ టేర్ అంటే ఏమిటి? నాకు తగిన సలహా ఇవ్వండి. ఆటలు ఆడే సమయంలో మీరు చెప్పిన యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయపడటం చాలా సాధారణంగా జరిగేదే. పాశ్చాత్యదేశాల వారు స్పోర్ట్స్ సమయంలో దీనికి ఏసీఎల్‌కు లోనవుతుంటారు. కానీ మనదేశంలో సాధారణంగా టూవీలర్ నడిపేవారు యాక్సిడెంట్‌కు గురైనప్పుడు ఈ లిగమెంటు దెబ్బతింటుంది. ఇది మోకాలిలో ఉండే కీలకమైన లిగమెంటు. ఒకసారి ఇది గాయపడితే దీనికి రక్తసరఫరా జరగదు కాబట్టి ఇది ఒక శాశ్వతనష్టం చేకూర్చే ప్రమాదంగా పరిణమిస్తుంది. ఈ లిగమెంట్ దెబ్బతిన్న వారు... అంటే ఏసీఎల్‌కు గాయం అయిన వారు సరిగా నిలబడలేకపోవడం మామూలే. కొన్నేళ్ల తర్వాత అది ఆర్థరైటిస్‌గా మారడం కూడా జరుగుతుంది. సాధారణంగా 50 ఏళ్ల కంటే పెద్ద వయసు ఉన్న వారిలో ఏసీఎల్ గాయపడితే సాధారణ సంప్రదాయ చికిత్స చేస్తూ, మోకాలి కదలికలు తగ్గించుకొమ్మని చెబుతూ, వ్యాయామాలను సూచిస్తుంటాం. కానీ చిన్న వయసు వారిలో అంటే... 40 ఏళ్ల కంటే తక్కువ వారికి మాత్రం శస్త్రచికిత్స సూచిస్తుంటాం. ఇందులో కొత్త లిగమెంటు పునర్నిర్మాణం చేస్తుంటాం. దీనివల్ల వారిలో ఆర్థరైటిస్ రాకుండా నివారించడం సాధ్యమవుతుంది. మీరు ఎమ్మారైను బట్టి పార్షియల్ టేర్ అంటున్నారనుకుంటాను. కానీ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే ఆ లిగమెంట్ పూర్తిగా చిరిగిపోయి ఉంటుందని ఊహించవచ్చు. కాబట్టి మీరు ఇప్పట్లో జంపింగ్స్, రన్నింగ్ వంటి వ్యాయామాలు, స్పోర్ట్స్ మొదలుపెట్టకండి. మీ పరిస్థితిని పూర్తిగా సమీక్షించేలా ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ నిపుణుడిని కలిసి, తగిన సలహా తీసుకోండి. ఇంత చిన్న వయసులోనేమోకాళ్లనొప్పులా? నా వయసు 29 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలారకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా మోకాళ్ల నొప్పులు రావడం ఆందోళన కలిగిస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. మీ సమస్యను నిశితంగా విశ్లేషించాక మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి అతిగా ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. పిల్లాడి పాదంలోఉండాల్సినఒంపు లేదు...ప్రమాదమా? మా బాబు వయసు నాలుగున్నరేళ్లు. వాడి ఎదుగుదల, ఆకృతి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంతమంది వాడి పాదాలు చూసి... పాదంలో సహజంగా ఉండే ఒంపు లేదనీ, పాదం పూర్తిగా ఫ్లాట్‌గా ఉందని అన్నారు. భవిష్యత్తులో నడకగానీ, ఆటలాడటం గానీ కష్టమవుతుంది అన్నారు. దాంతో మేము ఆందోళనతో డాక్టర్‌కు చూపించాం. బాబును చూసి, డాక్టర్‌గారు ప్రత్యేకమైన షూ సూచించారు. భవిష్యత్తులో సర్జరీ అవసరం కావచ్చని కూడా చెప్పారు. మా బాబుకు ఆ ప్రత్యేకమైన షూ తొడిగించాలని ప్రయత్నించాం. కానీ వాడు ఆ షూస్ తొడుక్కోడానికి ఇష్టపడటం లేదు. పైగా అవి లేకుండానే మామూలుగా నడవడం, పరుగెత్తడం చేస్తున్నాడు. వాడికి భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందేమోనంటూ ఇప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దయచేసి మాకు తగిన సలహా ఇవ్వగలరు. మీరు పాదం మధ్యలో ఒంపు లేకుండా ఉంటే ఫ్లాట్ ఫీట్ గురించి పూర్తిగా అపోహపడుతున్నారు. అలా పాదం మధ్య ఒంపు ఉండాలన్నది కేవలం ఒక దురభిప్రాయం మాత్రమే. మన జనాభాలోని 6 – 8 శాతం మందిలో పాదంలో ఒంపు (ఆర్చ్) ఉండదు. పైగా అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో పాదం మధ్యలో ఉండాల్సిన ఒంపు సరిగా కనిపించదు. మూడు నుంచి ఐదేళ్ల వయసు నుంచి ఆ ఒంపు పెరుగుతూ పోతుంటుంది. కేవలం కొద్దిమంది పిల్లల్లోనే పాదంలో ఉండాల్సిన ఎముకలన్నీ కలిసిపోయి, అది చాలా బాధాకరమైన సమస్యగా పరిణమిస్తుంది. కానీ ఇలా జరగడం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఒంపు లేని పాదాలు (ఫ్లాట్ ఫీట్) ఉన్న చాలామందికి ఎలాంటి చికిత్స లేకుండానే ఆ సమస్య సరైపోతుంది. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో ఆటలాడలేరన్నది కూడా పూర్తిగా తప్పుడు అభిప్రాయం. వాళ్లు కూడా అందరు పిల్లల్లాగానే ఆడుకోగలరు. ఉదాహరణకు సయీద్ ఓవుటా అనే మొరాక్ ఆటగాడు ఒలిపింక్స్‌లో 1984లో ఒలిపింక్స్‌లో బంగారు పతకం సాధించాడు. అలాన్ వెబ్ అనే అమెరికన్ అథ్లెట్ పరుగులో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వాళ్లంతా ఫ్లాట్ ఫీట్‌తో పుట్టిన వాళ్లే. కాబట్టి మీరు మీ బాబు గురించి ఆందోళనపడటం మానేయండి. అతడు బాగా నొప్పి అని ఫిర్యాదు చేస్తే తప్ప... సాధారణంగా అతడికి ఎలాంటి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. మీకు ఉన్న దురభిప్రాయమే చాలాకాలం కిందట చాలమందిలో ఉండేది. ఇప్పటి ఆధునిక వైద్యవిజ్ఞాన పరిశోధనల్లో అది తప్పు అని తేలింది. -
ఈ లుకేమియా గురించి తెలుసుకోండి...
తెల్లరక్తకణాలు సైనికుల్లాగా మన దేహాన్ని కాపాడుతుంటాయి. అవన్నీ మన ఎముకలోని మూలగలో పుడుతుంటాయి. ఇలా పుట్టే క్రమంలో ఒక కణం రెండు కావాలి. ఆ రెండూ మళ్లీ మరో రెండుగా మారాలి. ఇదీ దేహధర్మం. విభజనలో కణాల పాటించాల్సిన ధర్మం ఇది. అయితే లుకేమియా వచ్చినప్పుడు మాత్రం ఒకటి రెండు కావాల్సినవి కాస్తా... వందలవుతాయి. దాంతో దేహంలో 5,000 నుంచి 11,000 ఉండాల్సిన తెల్లరక్తకణాలు కాస్తా ఒక లక్షా, రెండు లక్షలకు పెరుగుతాయి. ఇది రక్తానికి వచ్చే ఒక క్యాన్సర్. ఈ క్యాన్సర్‌నే లుకేమియా అంటారు. లుకేమియాలో రెండు రకాలు... ఈ లూకేమియాలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది అక్యూట్ లుకేమియా. అంటే ఇందులో కణాల విభజన తక్షణం కనిపిస్తుంది. లక్షణాలు వెంటనే బయటపడతాయి. అంటే కణవిభజన చాలా వేగంగా త్వరత్వరగా జరుగుతుంది. క్రానిక్ లుకేమియాలో ఒక రకం క్రానిక్ మైలాయిడ్ లుకేమియా. ఇది దీర్ఘకాలిక క్యాన్సర్. చాలాకాలం పాటు ఈ క్యాన్సర్ ఉంటుంది. ఇది మెల్లగా పెరుగుతుంది. రక్తానికి సంబంధించిన ఈ క్రానిక్ మైలాయిడ్ లుకేమియా వ్యాధిపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. ఈరోజే ఎందుకు...? ఈ రోజును ‘సీఎమ్‌ఎల్–డే’ గా నిర్ణయించడానికి ఒక కారణం ఉంది. ఈ కారణాన్ని తెలుసుకోవాలంటే నిజానికి సీఎమ్‌ఎల్ ఎలా వస్తుందో, అలా రావడానికి దేహంలో ఎలాంటి ప్రక్రియలు జరుగుతాయో కాస్త అర్థం చేసుకోవాలి. మన ఒంట్లో నిత్యం రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. రక్తంలో అనేక రకాల అంశాలు ఉన్నప్పటికీ ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్స్‌లెట్స్ అనేవి చాలా ప్రధానమైనవి. ఇందులో తెల్లరక్తకణాలు మన దేహంలో రక్షణ కల్పించే సైనికుల భూమిక నిర్వహిస్తాయి. ఇవి మన ఒంట్లోకి ప్రవేశించే అనేక హానికారక సూక్ష్మజీవులు, వాటి వల్ల వచ్చే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాయి. ఇవి ఎముక మధ్య భారంలో ఉండే మూలుగ/మజ్జలో నిత్యం పుడుతూ ఉంటాయి. పాతవి నశిస్తూ... వాటి స్థానంలో కొత్తవి పుడుతూ ఉండటం వల్ల వాటి సంఖ్య ఎప్పుడూ తక్కువలో తక్కువ 5,000 నుంచి గరిష్టంగా 11,000 వరకు ఉండాల్సిన వాటి సంఖ్య అపరిమితంగా పెరిగి దాదాపు రెండు లక్షలకు చేరుకుంటుంది. అలాంటప్పుడు అవి వాటి రక్షణ బాధ్యతలు నిర్వహించకపోవడంతో తరచూ ఇన్ఫెక్షన్లు సోకడం, జ్వరాలు రావడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. మనిషిలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అంటే... మొత్తం 46 అన్నమాట. ఆ క్రోమోజోముల్లోని 9వ, 22వ క్రోమోజోముల్లో తేడాలు వస్తాయి. అంటే తొమ్మిదో క్రోమోజోములోని కొంత భాగం 23వ క్రోమోజోముకూ, అదే విధంగా 23వ క్రోమోజోములోని మరికొంత భాగం 9వ క్రోమోజోముకు వెళ్తాయి. దీన్నే క్రోమోజోమల్ ట్రాన్స్‌లొకేషన్ అంటారు. ఈ ట్రాన్స్‌లొకేషన్ కారణంగా ‘ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అనేది çరూపొందుతుంది. (అమెరికన్ పద్ధతిలో చెబితే) ఈ రోజు తేదీ 9 / 22 కాబట్టి... ఈ క్రోమోజోమల్ మార్పునూ 9 : 22 అంటారు కాబట్టి ఈ తేదీని ‘క్రానిక్ మైలాయిడ్ లుకేమియా’ డే గా చెబుతారు. ప్రతి ఏడాదీ ఈ తేదిని క్రానిక్ మైలాయిడ్ లుకేమియా (సీఎమ్‌ఎల్) అవగాహన దినంగా వ్యవహిరిస్తుంటారు. లక్షణాలు: సీఎమ్‌ఎల్ వచ్చిన రోగుల్లో అన్ని వయసులో వారు ఉంటారు. ముఖ్యంగా పెద్దల్లో ఇది 50, 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించడం సహజమే అయినా చిన్న పిల్లల్లోనూ ఇది చాలా సాధారణం. చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్లలో లుకేమియాలే ఎక్కువ. చిన్నపిల్లల్లో వచ్చే సీఎమ్ఎల్ను జువెనైల్ లుకేమియా అంటారు. ఇది వచ్చిన వారిలో తెల్లరక్తకణాలు సరిగా పనిచేయకపోవడంతో తరచూ ఇన్ఫెక్షన్లు సోకడం, జ్వరం రావడం, నిస్సత్తువగా, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పిల్లల్లోనైతే వారు పాలిపోయినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలుమచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తస్రావం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే లుకేమియాను అనుమానించాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు: సాధారణంగా జ్వరం లేదా ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ వస్తున్నప్పుడు చేయించే సాధారణ రక్తపరీక్షలోనే (పెరిఫెరల్ స్మియర్) అసాధారణంగా పెరిగిపోయిన తెల్లరక్తకణాల సంఖ్య (కౌంట్)తో ఇది బయట పడుతుంది. కొన్నిసార్లయితే జనరల్ చెకప్‌లో భాగంగా చేయించిన రక్తపరీక్షలలో బయటపడవచ్చు. అప్పుడు నిర్ధారణ కోసం బోన్ మ్యారో పరీక్ష అనే నిర్దిష్టమైన పరీక్ష చేయించాలి. సైటోజెనిక్ టెస్ట్‌గా పేర్కొనే ఆ పరీక్షలో మూలకణంలో వచ్చిన మార్పుల కారణంగా రూపొందిన ‘ఫిలడెల్ఫియా క్రోమోజోమ్’ ఉనికితో సీఎమ్ఎల్ను నిర్ధారణ చేయడం జరుగుతుంది. దశలు: తీవ్రతను అనుసరించి ఇందులో స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3 అనే దశలు ఉంటాయి. మొదటిదాన్ని క్రానిక్ దశ అని, రెండో దశను యాక్సిలరేటెడ్ దశ అని, మూడోదాన్ని బ్లాస్ట్ క్రైసిస్ అని అంటారు. అయితే ఇటీవల స్టేజ్–1లోనే చాలా ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. పైగా ఈ దశలో కనుకొన్నప్పుడు దాని నియంత్రించడం కూడా తేలిక. చికిత్స: ఒకప్పుడు అంటే... 1990లలో క్రానిక్ మైలాయిడ్ లుకేమియా వస్తే గరిష్ఠ ఆయుఃప్రమాణం ఐదేళ్లు, బతికి బయటపడేవారు కేవలం 30% మాత్రమే ఉండేది. కానీ 1990లలో వచ్చిన ఇమాటనిబ్ మిసైలేట్ అనే ఒకే ఒక టాబ్లెట్‌తో దీన్ని చాలా సమర్థంగా అదుపు చేయవచ్చు. దాంతో ఇప్పుడు ఈ జబ్బు వచ్చిన ప్రతివారు దాదాపుగా నార్మల్ వ్యక్తిలాంటి ఆయుప్రమాణం తోనే జీవించవచ్చు. ఫలితంగా ఇప్పుడు బతికి బయటపడేవారు దాదాపు 80% – 90% వరకు ఉంటున్నారు. అయితే ఈ ఇమాటనిబ్ మిసైలేట్ అనే మాత్రతో జబ్బు పూర్తిగా నయం కాదు... కానీ అదుపులో ఉండి, వ్యక్తులు సాధారణ ప్రజల్లాగే నాణ్యమైన జీవితం గడపగలుగుతారు. అయితే జబ్బు పూర్తిగా లేకుండా పోవాలంటే మాత్రం ‘బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేన్’ చేయించాలి. కానీ ఇటీవల కేవలం మాత్రలతోనే జబ్బు ఎప్పటికీ నియంత్రణలో ఉండటం వల్లనూ, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు ఆరోగ్యశ్రీ లోనూ ఇవి ఉచితంగా లభిస్తూ ఉండటం వల్ల ఇమాటనిబ్ మిసైలేట్ను వాడుతూ వ్యాధిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడమే జరుగుతోంది. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఎండీ,, డీఎమ్, మెడికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, కర్నూలు. ఫోన్ నెం. 08518273001 నుంచి 008 వరకు -
కృత్రిమ ఎముక మజ్జ సిద్ధమవుతోంది...
ఎముక మజ్జ కణజాలాన్ని కృత్రిమంగా సృష్టించడంలో బేసల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. గతంలోనూ ఇలాంటి కృత్రిమ మజ్జను సృష్టించినప్పటికీ దానికి సహజమైన మజ్జకు ఉన్న లక్షణాలు తక్కువగా ఉండేవి. ఉదాహరణకు మజ్జ ద్వారానే రక్తకణాలు పుడతాయన్నది మనకు తెలుసు. ఈ లక్షణం కృత్రిమ మజ్జకూ అలవడితే లుకేమియా వంటి కేన్సర్లకు మెరుగైన చికిత్స అందించవచ్చు. రక్తం ఏర్పడేందుకు వెనుక ఉన్న యంత్రాంగాన్ని అర్థం చేసుకునేందుకు బేసల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ఉపయోగపడుతుంది. తద్వారా రక్త సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స లభిస్తుందని అంచనా. పింగాణీతో చేసి త్రీడీ చట్రానికి మెసెన్కైమల్ స్టోమల్ కణాలను చేర్చి తాము ఈ కృత్రిమ మజ్జ కణజాలాన్ని తయారుచేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఇవాన్ మార్టిన్ తెలిపారు. మూలకణాల్లాంటి వాటిని చేర్చడం ద్వారా ఈ కణజాలం రక్తకణాలను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టిందని, మరిన్ని పరిశోధనల తరువాత ఈ కృత్రిమ మజ్జ కణజాలాన్ని వాస్తవ పరిస్థితుల్లో వాడటం సాధ్యమవుతుందని ఇవాన్ వివరించారు. -
పాదం తొక్కేస్తోందా?
ముందడుగు వేసేది పాదమే ముందంజలో ఉంచేదీ పాదమే పాదానికి ప్రాబ్లమ్ వస్తే వెనకబడిపోతాం అవును... పడిపోతాం పాదాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఆరోగ్యాన్నే తొక్కేస్తుంది. పాదం... పదిలం! కాలు లేకపోతే కదలిక లేదు. పాదం కదలకపోతే పురోగతి లేదు. అంతెందుకు పాదంలో ఏదైనా సమస్య ఉండి కాళ్లను కదిలించలేక పోతే మన క్యాలరీల ఖర్చు తగ్గుతుంది. దాంతో మొత్తం ఆరోగ్యమే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కాళ్లు కదలాలి. కదలిక ఉండాలి. అంటే వ్యాయామ రూపంలోనన్నమాట. అప్పుడే ఆరోగ్యం ఉంటుంది. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాదు... మానసిక ఆరోగ్యానికి కూడా. పిల్లల్లో ఏమాత్రం కదలికలు లేకుండా ఇంటికే పరిమితమయ్యేవారు, ఏవో కారణాలతో కాళ్లు కదలికలు మందగించి మంచానికే అంటిపెట్టుకుని ఉండేవారిలో కొన్ని మానసిక సమస్యలూ కనిపించవచ్చు. తాము బయటికి వెళ్లకపోవడం, నలుగురిలో కలవకపోవడంతో డిప్రెషన్ వంటి సమస్యలూ రావచ్చు. అంతేకాదు... పోటీతత్వం మందగించి మందకొడిగానూ మారిపోవచ్చు. పిల్లల్లో ఆ పరిస్థితి రానివ్వకుండా చూసుకుంటే చదువుల్లో, ఆటల్లో, ఎదిగాక సమాజంలోనూ వారిది క్రియాశీల భూమిక. అంత కీలకమైనది కాలు. చలనశీలమైనది పాదం. ఆ పాదం గురించి కొన్ని విషయాలు ఆపాదం నుంచి మస్తకంలోకి వెళ్లడానికి ఈ కథనం. పాదాల నిర్మాణం: మానవ పాదంలో 26 ఎముకలు ఉంటాయి. మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అంటే రెండు పాదాల్లోనూ కలుపుకుంటే 52 కాబట్టి... ఒక వ్యక్తిలో ఉండే మొత్తం ఎముకల్లోని నాలుగో వంతు పాదాల్లోనే ఉంటాయన్నమాట. 107 లిగమెంట్లు, 19 కండరాలు ఉంటాయి. ఒక వ్యక్తి బరువంతా మోయడానికి వీలుగా పాదం విశాలంగా రూపొందింది. మొదటి నష్టం షూస్ లేదా పాదరక్షలతోనే... ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల వయసు వచ్చే వరకూ పాదం పూర్తిగా రూపొందే ప్రక్రియ పూర్తి కాదు. కానీ మారుతున్న జీవనశైలి ప్రకారం చిన్నప్పట్నుంచే ప్రతివారి పాదాలనూ షూలతో బిగించి ఉంచడం సాధారణమైంది. బుడిబుడి అడుగులు వేసే బుడతల పాదాలను సైతం రంగురంగుల సాక్స్ లేదా షూలతో బిగిస్తుంటారు. దీనివల్ల వచ్చే చిన్న చిన్న లోపాలే పెద్దయ్యాక నడకలో నష్టం కలిగించే అవకాశం ఉంది. హైహీల్ వల్ల నష్టాలు ఎందుకంటే... జీవులు తమ నాలుగు కాళ్ల మీద నడవడానికి అనువుగా రూపొందాయి. కానీ మనిషి తన రెండు కాళ్ల మీదే మొత్తం బరువు మోపేలా ముందు వైపు లింబ్స్‌ను చేతులుగా రూపొందించుకుంటూ నిటారుగా నిలబడ్డాడు. దాంతో మనిషి బరువంతా రెండు కాళ్ల మీద వెన్ను మీద పడటం ప్రారంభమైంది. మన వీపు భాగం ఇంగ్లిష్ అక్షరమైన ‘ఎస్’ అనే ఆకృతితో ఉంటుంది. వెన్నెముక ఉన్న జీవులన్నీ నడిచే సమయంలో పడే ఒత్తిడిని గణనీయంగా తగ్గించడానికి ఈ ‘ఎస్’ ఆకృతి ఉపకరిస్తుంది. హైహీల్స్ తొడగడం వల్ల నడుం భాగంలో ఉండే వీపు (లంబార్) ప్రాంతం తన ఒంపును కోల్పోయి నిటారుగా అవుతుంది. ఆపైన ఉండే ఛాతీ భాగంలోని వెనకభాగపు వీపు (థొరాసిక్ లేదా మిడ్ బ్యాక్), మెడ, తల... ఇవన్నీ సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్’ ఆకృతి ఒంపు కాస్తా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్మెంట్లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది. హైహీల్స్ ఇష్టపడేవారికి టిప్స్ ⇒రోజంతా హైహీల్స్ మాత్రమే వేసుకోకండి ⇒మధ్యాహ్నం లేదా సాయంత్రాలే షాపింగ్ చేయండి. ఆ సమయంలో మీ పాదాల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. ⇒మీ హైహీల్ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా... రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి. (ఒక్కోసారి హీల్ నిడివిలోనూ మార్పు ఉండవచ్చు. రెండింటినీ ఒకేసారి వేసుకుంటే ఆ తేడా తెలిసేందుకు అవకాశం ఎక్కువ) ⇒ మీ మడమ వెడల్పులో మడమ ఎత్తు సగం ఉంటే అది సరైన ఆరోగ్యకరమైన హీల్ అని గుర్తుంచుకోండి. ⇒ మీరు హైహీల్స్ తొడిగే ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గితే మీకు దాని వల్ల వచ్చే నొప్పులూ అంతగా తగ్గుతాయి ఠి పాయింటెడ్ హైహీల్స్ లేదా మరీ బిగుతుగా ఉండే షూస్ వేసుకోవద్దు ⇒మీరు హైహీల్స్ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాల వల్ల అసలు పాదరక్షలే తొడగలేని పరిస్థి తి కూడా తలెత్త వచ్చని గుర్తుంచుకోండి ⇒హైహీల్స్ వేసుకునే ముందు మీ మోకాలి కింద వెనక భాగంలో ఉండే కాఫ్ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ వార్మప్ మసాజ్‌లా చేయండి. కాఫ్ మజిల్స్‌కు ప్రతిరోజూ తగినంత వ్యాయామాన్ని, స్ట్రెచింగ్‌ను ఇవ్వండి ⇒ మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్ వేసుకుంటే... అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి పాదాలు నేలకు ఆనేట్లుగా ఉంచి కాసేపు అలాగే నిలబడండి. ఈ సమయంలో ముందుకు వంగి మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ను చేయండి ⇒హైహీల్స్ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి. పాదాలలో పగుళ్లు పాదాల పగుళ్లకు అలర్జీలు మొదలుకొని చాలా కారణాలు ఉండవచ్చు. శరీరానికి తగిన నీరు అందకపోతే కూడా కాళ్లకు పగుళ్లు ఏర్పడతాయి. మనం వాడే సబ్బు, తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ పాళ్లు తక్కువగా ఉండటమూ కారణం కావచ్చు. కాళ్ల పగుళ్లకు బ్యాక్టీరియా/ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణమైతే ఒక్కోసారి అవి పగుళ్ల నుంచి పుండ్లుగా మారొచ్చు. అందుకే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్నిసార్లు డయాబెటిస్/థైరాయిడ్ /ఒబేసిటీ లాంటివీ కాళ్ల పగుళ్ల సమస్యకు కారణం కావచ్చు. పాదాల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది సూచనలు పాటించాలి. మంచినీటిని ఎక్కువగా తాగాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పొడిబట్టతో శుభ్రంగా, తడిలేకుండా తుడవాలి. మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని సాక్సులను ధరించాలి. రాత్రంతా సాక్స్‌లు ధరించడం మంచిది. కాలికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో... పాదాలకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యమైన కొన్ని సమస్యలివే... ఆనెకాయలు: షూ వల్ల ఒకేచోట నిరంతరం ఒత్తిడి పడుతుండటం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దాంతో అక్కడ మృతకణాలు చేరుతూ పోవడం వల్ల ఈ ఆనెకాయలు వస్తుంటాయి. కొందరు ఆనెకాయలను బ్లేడుతో కోసేస్తుంటారు. మరికొందరు ఆనెకాయలపై కొన్ని చుక్కల యాసి పోస్తూంటారు. కానీ ఆనెకాయలు వస్తే దాని చుట్టూ ప్లాస్టర్ వేసి డాక్టర్‌కు చూపించాలి. బ్యూనియన్: కొందరికి షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమసయను ‘బ్యూనియన్’ అంటారు. కొందరిలో ఇది వారసత్వంగానూ కనిపిస్తుంది. షూ వల్ల మరింత పెరుగుతుంది. షూ ఒరుసుకుపోతున్న చోట... పాదం తనను తాను రక్షించుకునేందుకు మరో అదనపు కణజాలాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సమస్య ఉన్నవారు డాక్టర్‌ను కలిసి, అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. అథ్లెట్స్ ఫుట్ : ఈ సమస్య ఫంగస్ కారణంగా వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ ఎప్పుడూ పాదాలపై ఉండే ఉంటుంది. కానీ పాదం నిత్యం తేమ, తడిలో ఉన్నప్పుడు ఆ ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథుల స్రావంతోనూ పాదం చెమ్మబారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ ఉన్న వాష్లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే పాదం ఆరోగ్యంగా ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి రావచ్చు. బొటనవేలి గోరు లోపలికి పెరగడం : కొందరికి బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంది. ఇలా జరగకుండా చూసుకోవాలంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లో మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకుంటే ఈ సమస్యను ఎప్పటికీ రాకుండా చూసుకోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు పట్టడం : పాదానికి తిమ్మిర్లు పట్టి, పాదం మొద్దుబారినట్లుగా ఉండటం చాలా మందిలో కనిపించే సాధారణ లక్షణమే. ఇలాంటి లక్షణం కనిపించినవారిలో షుగర్ వ్యాధి లేకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే షుగర్ వ్యాధి ఉండి తిమ్మిర్లతో పాదం మొద్దుబారి స్పర్శ తెలియకపోతే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. పాదాల వ్యాయామం: పాదాల కోసం చేయాల్సిన వ్యాయామాలు చాలా రకాలుగా ఉంటాయి. చిన్న వయసులో అయితే స్కూలు ఆవరణలో ఆడే అనేక రకాల ఆటలు పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. స్కిప్పింగ్ లాంటివి కాళ్ల ఆరోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన ఎదుగుదలకూ తోడ్పడతాయి. ఇక టీనేజ్ దాటాక జిమ్‌కు వెళ్లే యువకులు స్క్వాట్స్ మొదలుకొని, వారికి అనువుగా ఉండే అనేక రకాల వ్యాయామాలు చేస్తారు. పిక్కలు మనకు గుండెలాంటివి కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్తపడటం వల్ల కాళ్ల ఆరోగ్యం బాగుటుంది. అయితే ఏ వయసు వారిలోనైనా బ్రిస్క్ వాకింగ్ చేయడం అన్ని విధాలా ఆరోగ్యకరం. అది కాళ్లతో పాటు సమస్త అవయవాలకూ ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తుంది. పాదరక్షల ఎంపిక ఎలా ఉండాలంటే... పాదరక్షల ఎంపికలో మొదట రెండు పాదాల పొడవును కొలిచి, రెండింటికీ సౌకర్యంగా ఉండే జోడునే ఇవ్వమని చెప్పాలి. మనం తొడుక్కునే షూస్ పాదం చివరే ముగియకుండా... మరో రెండు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండాలి. అలా ఖాళీ ఉందో లేదో నొక్కి చూసుకోవాలి. పాదంలో వెడల్పులగా ఉండే భాగం ముడుచుకోకుండా, సౌకర్యంగా పరచుకునేలా షూ ఉండాలి. ఈమధ్య చాలామంది పొట్టిగా ఉండే ‘షార్ట్ సాక్స్’ తొడుగుతున్నారు. అవి కాలిని బాగా బిగుతుగా మడిచినట్లుగా చేసే టైట్ షూ అంత ప్రమాదకరం. సాక్స్ కాస్త సాగుతూ ఉండేవి అయితేనే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు పాదాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... మిగతావారితో పోలిస్తే డయాబెటిస్తో బాధపడేవారు పాదాలను మరింత శుభ్రంగా ఉంచుకోవాలి. అందునా ఐదు నుంచి పదేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నవారు తమ కాళ్లను ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించుకుంటూ ఉండాలి. వారు పాదాల పరిరక్షణ కోసం పాటించాల్సిన సూచనలివి... ⇒ తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండాలి. పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏవిధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్ని కూడా నిశితంగా పరీశించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు. అది భవిష్యత్తులో కాలిని తొలగించేంత ప్రమాదకరంగా కూడా మారేందుకు అవకాశం ఉంటుంది. అందుకే పొక్కు చిన్నగా ఉన్నప్పుడే పూర్తిగా మానిపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి. ⇒కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి. ⇒ వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్‌తో కాళ్లకు కాపడం పెట్టుకోక పోవడమే మంచిది. ⇒పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్‌తో కాళ్లను రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగానూ మారేలా శుభ్రం చేసుకోవాలి. ⇒కాళ్లమీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా అవసరం. ⇒కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరుమూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో ప్రమాదం. ⇒ఇంట్లోకూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి. ⇒ఏడాదికోసారి డాక్టర్‌కు చూపించుకుంటూ ఉండాలి. ఇవన్నీ పాదాల సంరక్షణకు ఉపయోగపడే మార్గాలు. చివరగా... పాదాలు మన ప్రతి కదలికనూ నిర్ణయిస్తాయి... నియంత్రిస్తాయి. ప్రగతి పథాన ఉంచుతాయి. అందుకే పాదాల ఆరోగ్య పరిరక్షణే అందరి ప్రథమ ప్రాధాన్యం కావాలి. డాక్టర్ కె.సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
గొంతులో ఎముక ఇరుక్కొని..
చర్ల: మాంసం తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలంలో చోటు చేసుకుంది. తేగడ గ్రామానికి చెందిన నిట్టా జ్యోతి(50) ఆదివారం ఇంట్లో మాంసాహారం భుజిస్తుండగా ఓ ఎముక గొంతులో ఇరుక్కొని ఇబ్బంది పడింది. కడుపులోకి జారుతుందేమోనని చూసింది. అయినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం భద్రాచలంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు ఆమెను తరలించారు. ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని పొందవచ్చని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మంగళవారం తీసుకు వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బుధవారం రాత్రి ఆమెకు ఆపరేషన్ చేస్తుండగా గొంతులో తీవ్ర రక్తస్రావమైంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున జ్యోతి మృతి చెందింది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలుఉన్నారు. -
నేను ఎముకని!
ఆనంద్ ఆరడుగులుంటాడు. ఆజానుబాహువుగా పెరిగాడు. అతనికి ఆ రూపం,ఆ ఆకృతి ఇచ్చింది ఎవరనుకున్నారు? మేమే... అంటే అతని ఎముకలం! మేము ఏమేం చేస్తామో, ముందుగా ఇక్కడ క్లుప్తంగా చెబుతాం. అవేమిటంటే... ఆనంద్ నడవడానికి అతని శరీరంలోని సున్నిత అవయవాల రక్షణకు, శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడతాం. అంతేకాదు... అతని రక్తం కోసం రసాయనాలు, ఎంజైములు మాలోనే ఉత్పత్తి అవుతాయి. అలాగే ఆనంద్ శరీరానికి కావలసిన కాల్షియం వంటి లవణాలకు గిడ్డంగిలా ఉపయోగపడతాం. ఇవన్నీ ఎలా చేస్తామో ఇప్పుడు వివరంగా చెబుతాను. మేము మొత్తం 206 సభ్యులం, అతని శరీరంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆకృతిలో ఉండి, ఒక ఎముకలగూడును తయారు చేసి అతని శరీరానికి అవసరమైన చట్రంలా ఉంటాం. దానిపై అతను మళ్లీ పైపై అందాలు దిద్దుకుంటాడనుకోండి. మా 206 మందిలో అతి చిన్నవాడి పేరు - స్టేపిస్, వాడు చెవి మధ్యలో ఉండి వినికిడికి సహాయపడతాడు. ఇక అతి పొడవైన వాడు తొడ ఎముక. ఆనంద్ పుట్టినప్పుడు మా సంఖ్య 300కు పైమాటే. అప్పుడు మేము మెత్తగా కూడా ఉండి కొంచెం వంగుతుంటాము. బహుశ ఆనంద్ అతని తల్లి గర్భం నుంచి అందువల్లనే సులువుగా బయటకు రాగలిగాడు. తరువాత ఆనంద్‌కు 18 సంవత్సరాలు వచ్చేసరికి మాలో పక్కపక్కనే ఉన్న కొంతమంది సభ్యులు ఒకరితో ఒకరు కలిసిపోయి పరిమాణం పెరుగుతుంది కానీ మా సంఖ్య 206కు తగ్గుతుంది. తల దగ్గర పెట్టెలా... ఛాతీ దగ్గర పంజరంలా... తలలో మేము పలుచగా, కాని చాలా గట్టిగా ఉండి ఆనంద్ పుర్రెను ఒక పెట్టెలా తయారు చేస్తాము. దానిలో మెదడును దాచి దానికి రక్షణ కలిగిస్తాం. అలాగే 12 జతల పక్కటెముకలతో ఆనంద్‌కు అందమైన, విశాలమైన ఛాతీ ఇచ్చాం. దానిలో ఆనంద్ గుండెను, ఊపిరితిత్తులను దాచి, వాటికి రక్షణ కల్పిస్తాం. ఆనంద్ నిటారుగా నిలబడడానికి అతని కాళ్లు ఎంత అవసరమో, అంతే పని అతని వెన్నెముక కూడా చేస్తుంది. మొన్నటికి మొన్న ప్రపంచ యోగా రోజున చక్కగా ఆసనాలు వేసి మనకు చూపించాడు కదా! అతను అలా మెలికలు తిరుగుతూ, వంగడానికి సాయపడింది వెన్నులో ఉన్న మా సభ్యులే. అతడి వెన్నులో మావాళ్లు 33 మంది పూసల రూపంలో ఉంటారు. సంఖ్య ఎక్కువైనా సమష్టి బాధ్యతలు ఇక ఆనంద్ చేతిలోను, పాదంలోను మావాళ్లు చాలామందే ఉంటారు. మేమంతా భిన్నమైన పరిమాణం, ఆకారాలలో ఉండి సున్నితమైన పనులు చేస్తుంటాం. మీకు ఇప్పుడు ఓ సందేహం రావచ్చు. ఆనంద్ శరీరంలో మేము ఇంతమంది ఉన్నప్పుడు మేం ముక్కలు ముక్కలుగా కాకుండా సమష్టిగా ఎలా ఉంటామని? అది ఎలాగంటే, మమ్మల్ని ఒక దానితో ఒకదాన్ని కలుపుతూ గట్టి తాళ్లు (లిగమెంట్స్) ఉంటాయి. అంటే ఏ ప్రమాదాలోనైనా ఈ తాళ్లు తెగిపోతే మేము విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం... మాలో మేము ఒకదానితో మరొకటి జతకలిసే చోటును ఏమంటారో తెలుసా మీకు? అదేనండి ‘కీలు’. మీకు ఉన్న కదలిక అంతా వచ్చేది ఈ కీలు వల్లనే. నేనెలా రూపొందానంటే...? ఇక నేను ఎలా తయారయ్యానో చెబుతాను. కొలాజెన్ అనే మాంసకృత్తుల తాళ్లతో తయారైన సూక్ష్మమైన వల ఉంటుంది. ఆ వలలో కాల్షియం, పాస్ఫరస్ వంటి అనేక లవణాలు బందీలై, వలకు గట్టిదనం ఆపాదిస్తాయి. మాకు ఆ గట్టిదనంలో కూడా కొంత మెత్తదనం ఉంటుంది. మేము పిల్లల శరీరంలో ఉన్నప్పుడు బాగా వంగగలం. కానీ ఆనంద్ పెద్దవాడు. అలాంటప్పుడు మాకు వంగే శక్తి తగ్గి, కొంత పెళుసుగా మారుతాం. ఎముకలలో ఈ పదార్థంలో (ఆస్టియోబ్లాస్ట్), ఆస్టియోక్లాస్ట్ అనే కణజాలం ఉంటుంది. మొదటి కణాలు నిరంతరం ఎముకను కరిగిస్తూ ఉంటాయి. నాలోని పదార్థం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇప్పుడు నాలో ఉన్న మాంసకృత్తులు, లవణాలలోని 10 శాతం వచ్చే ఏడాది ఉండవు. సరికొత్తవి వచ్చి చేరతాయి. కాని ఆనంద్‌కు సుమారు 35 సం॥వచ్చేవరకు వచ్చే ఎముక పదార్థం ఎక్కువ, కరిగిపోయేది తక్కువ. అంటే మేము బలంగా లావుగా తయారవుతాం. కానీ తరువాత కరిగేది ఎక్కువ. కొత్తగా వచ్చి చేరేది తక్కువ. 50 ఏళ్లు పైబడ్డ తర్వాత ముఖ్యంగా ఆడవారిలో రుతుస్రావం ఆగిపోయిన తర్వాత కరిగిపోయే మరింత ఎక్కువ అవుతుంది. అప్పుడే అస్థిహీనత (ఆస్టియోపోరోసిస్) వస్తుంది. అప్పుడు మాలోని మాంసకృత్తులు, లవణాలు మొత్తంగా తగ్గి ఎముక తేనెపట్టులోని ఖాళీ గదుల్లా తయారవుతుంది. మరి దీనిని తగ్గించాలంటే ఏమి చేయాలి? ఆనంద్ ఎప్పుడూ కష్టపడి, బరువు పనులు చేస్తుండాలి. అదేపనిగా శరీరానికి విశ్రాంతి ఇవ్వకూడదు. పొగతాగరాదు. కష్టేఫలి. నేనో అద్భుతమైన గిడ్డంగిని... ఇక నేను చేసే గిడ్డంగి పని గురించి చెబుతాను. ఆనంద్ శరీరంలోని కాల్షియం, ఇతర లవణాలు సుమారు ఒక కిలో వరకూ నాలో దాచి ఉంచుతాను. ఆనంద్ తిన్న ఆహారంలో కాల్షియం, విటమిన్-డి సాయంతో నాలోకి తీసుకుని భద్రపరుస్తాను. ఒకవేళ రక్తంలో కాల్షియం తగ్గిందనుకోండి. అప్పుడు ఆనంద్ మెడలో ఉన్న పారా థైరాయిడ్ గ్రంథి ఆదేశాల మేరకు తగినంత కాల్షియంను రక్తంలోకి పంపిస్తాను. ఈ పని నేను ప్రతిక్షణం చేస్తూనే ఉంటాను తెలుసా! అప్పట్లో పిండికట్లు... ఇప్పుడు లోహపు ప్లేట్లు ఏదైనా ప్రమాదంలో మేము విరిగామనుకోండి, పూర్వం అయితే అందరికీ పిండికట్టు కట్టి నెలల తరబడి విశ్రాంతి ఇచ్చేవారు. కాని ఇప్పుడు అలాకాదు. లోహపు బద్దీలు, ఊచలు, తీగలు, మొదలైనవి ఉపయోగించి మా విరిగిన ముక్కల్ని కలిపి, రెండవ రోజు నుండే మాచేత మరల పని చేయిస్తున్నారు ఈ ఎముకల డాక్టర్లు. పని చేయడానికి మొరాయిస్తే ఫిజియోథెరపిస్టులను పెట్టి మరీ చేయిస్తారు. కాని డాక్టర్లకు తెలీని ఓ రహస్యం మేము ఇంక దాచిపెట్టాం. విరిగిన తర్వాత ఒక్కొక్కసారి మేము ఎందుకు అతుక్కోమో డాక్టర్లకు మేము చెప్పం. ఇక చివరగా పాపం మన ఆనంద్ జీవితం అంతా కాలుగాలిన పిల్లిలా తిరిగి మా ఎముక చివర్లను అంటే కీళ్లను అరగదీశా డనుకోండి లేదా కీళ్లవాతం వచ్చి కీళ్లు అరిగిపోయాయనుకోండి. పూర్వం అయితే ఆనంద్ పిల్లలు అతనికి రిటైర్మెంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ ఎముకల డాక్టర్లు అరిగిపోయిన కీలు పొర తీసేసి, మరో కొత్త పొర వేసి, కీలును మళ్లీ పనిచేసేలా చేస్తున్నారు. కాలు చేయి మళ్లీ కదిపేలా చూస్తున్నారు. సోమరిగా ఉంటే... ఆనంద్ ఇప్పుడు ఏ పనీ, వ్యాయామం చేయకుండా సోమరిపోతులా తయారయ్యాడు అనుకుందాం. అప్పుడు ఆనంద్‌కు 60 లేదా 70 సం॥దాటిన తర్వాత చాలా సులువుగా మణికట్టు ఎముక, వెన్నెముక వంటి ఎముకలు విరుగుతాయి. చాలావరకు తుంటి ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా పూర్వపురోజుల్లో సౌకర్యాలు లేక వాళ్ల కాళ్లకు ఇసుక మూటలు కట్టి కదిలేసేవారు. ఇటువంటి సందర్భాల్లో ఊపిరితిత్తుల సమస్యలు, వీపుపైన పుండ్లు మొదలైనవి వచ్చి రోగి చనిపోవడానికి కారణమయ్యేవి. మితిమీరితే ముప్పు... ఒక్కొక్కసారి ఈ తయారీ కేంద్రాలు అతిగా పనిచేసి అవసరం లేనన్ని రక్తకణాలను పుట్టిస్తుంటాయి. దానినే లుకేమియా వ్యాధి అంటారు. దీనివల్ల మాకు చెడ్డపేరు వస్తుంది కూడా! అప్పుడు డాక్టర్లు మందులతో మాలో ఉన్న ఎముక మజ్జను, మొత్తం రక్తం తయారీ కేంద్రాలను నాశనం చేస్తారు. తరువాత ఆనంద్ శరీరానికి సరిపడే మరో వ్యక్తిలోని ఎముక మూలుగ కణాలను ఆనంద్ రక్తంలోకి ఎక్కిస్తారు. ఆ కణాలకు మేము ఆశ్రయం కల్పించి, మాలో ఉన్న మజ్జ ఖాళీస్థలంలో అవి పెరగడానికీ, మంచి రక్తం పుట్టించడానికి అవకాశం కల్గిస్తాం. ఒక్కొక్కసారి మాలోని మజ్జ తప్పు లేకపోయినా మాకే చివాట్లు పడతాయి. ఎందుకంటే కొన్ని రకాల రొమ్ము, థైరాయిడ్, ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎవరికీ తెలియకుండా మాలో ప్రవేశించి మమ్మల్ని నాశనం చేస్తాయి. మమ్మల్ని బలహీన పరచడం వల్ల, ఏ చిన్న దెబ్బ తగలకపోయినా మేము విరిగిపోతుంటాయి. ఎముక మధ్యన ఉండే మూలుగలో నిమిషానికి 18 కోట్ల ఎర్రరక్తకణాలు ఉత్పత్తి అవుతుంటాయి. అయితే ఆ ఎర్రరక్తకణాలను స్థిరంగా ఉంచడం కోసం పాత కణాలను నశింపజేయడానికి ప్లీహం (స్ప్లీన్) తోడ్పడుతూ ఉంటుంది. డాక్టర్ ఎన్. సోమశేఖర్‌రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -
అది అంత మంచి సూచన కాదు..!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. నెల రోజుల క్రితం నుంచి నా కాళ్ల ఎముకల్లో రాత్రివేళల్లో నొప్పి ఎక్కువగా వస్తోంది. దాంతో డాక్టర్‌ను సంప్రదించి యాంటీబయాటిక్ మందులు తీసుకున్నాను. అయినా ఎలాంటి ఫలితమూ లేదు. దీనికి చికిత్స సూచించండి. - రఘునందన్‌రావు, ఆదిలాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. రాత్రివేళల్లో ఎముకల నొప్పి రావడం అంత మంచి సూచన కాదు. దీన్ని ఎముక క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎముక క్యాన్సర్లు నొప్పితో గాని, నొప్పి లేకుండా గాని కణుతులను గుర్తిస్తారు. అయితే మృదుకణజాలంలో క్యాన్సర్ సోకినప్పుడు ఆ కణితిలో నొప్పి ఉండకపోవచ్చు. కానీ గట్టిగా ఉండే ఎముక కణజాలంలో క్యాన్సర్ ఉంటే మాత్రం అది నొప్పి, వాపుతో కనిపించవచ్చు. ఎముక క్యాన్సర్ సాధారణంగా రక్తం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. క్యాన్సర్ ట్యూమర్ ఏర్పడినప్పుడు దాని చుట్టూ కొంత భాగం వరకు వాపు ఉంటుంది. అది వ్యాపించకుండా ఉండటం కోసం శరీరంలోని రక్షణ వ్యవస్థ దాని చుట్టూ ఒక చిన్న పొరను ఏర్పరుస్తుంది. అలాగే ఆ చుట్టూ ఉన్న భాగాన్ని రియాక్టివ్ జోన్ అంటారు. క్యాన్సర్ మొదటి స్థాయిలో ఉన్నవారికి శస్త్రచికిత్స చేసి ఆ భాగాన్ని తీసివేసే సమయంలో ఈ రియాక్టివ్ జోన్ వరకు ఉన్న కణాలను తొలగిస్తారు. కాబట్టి క్యాన్సర్ దుష్ర్పభావాలు మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఎముకను పూర్తిగా తొలగించి ప్రోస్థెసిస్... అంటే కృత్రిమ ఎముక లేదా రాడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎముకను పూర్తిగా శుభ్రం చేసి, అక్కడికక్కడే ఎముకకు రేడియేషన్ అందించి, తిరిగి దాన్ని అమర్చుతారు. దాన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియేషన్ థెరపీ అంటారు. చాలామంది ఎముకల్లో నొప్పి, వాపు అనగానే మసాజ్ చేయిస్తుంటారు. అది చాలా ప్రమాదకరం. ఇలా మసాజ్ చేయించడం వల్ల రక్తసరఫరా పెరిగి క్యాన్సర కణాలు మరింత త్వరగా ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. నొప్పి, వాపు కనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నాకు కుడి అరచేయి, మణికట్టు భాగాల్లోనూ, వేళ్లలోనూ చాలా నొప్పిగా ఉంది. కొన్ని సందర్భాల్లో చేయి తిమ్మిర్లుగా కూడా ఉంటోంది. కొన్నిసార్లు నా చేత్తో ఏదీ ఎత్తలేకపోతున్నాను. దాంతో జీవితం దుర్భరమవుతోంది. నాకు థైరాయిడ్ సమస్య, డయాబెటిస్ కూడా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - పి. సుధారాణి, విశాఖపట్నం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే రుగ్మతతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. చాలామంది దీన్ని కంప్యూటర్ను విస్తృతంగా వాడటం వల్ల వచ్చిన సమస్యగా భావిస్తుంటారు. అయితే దీని దాఖలాలు 20వ శతాబ్దారంభం నుంచీ కనిపిస్తున్నాయి. కార్పల్ టన్నెల్ అనేది మణికట్టులో ఉండే ఒక సన్నటి ద్వారం. దీని నుంచే అరచేతిలోకి వేళ్లలోకి మీడియన్ నెర్వ్ అనే నరం ప్రవేశిస్తుంది. ఇక మన వేళ్లను వంచడానికి ఉపయోగపడే టెండన్స్కు కూడా ఇదే ద్వారం నుంచి వెళ్తాయి. ఈ టన్నెల్ మన బొటనవేలి అంత వైశాల్యంతో ఉంటుంది. దీని చుట్టూరా కార్పల్ అనే ఎముకలూ, ఫెక్సార్ రెటినాకులమ్ అనే లిగమెంట్లు ఉంటాయి. మణికట్టులో మీడియన్ నర్వ్ మీద ఒత్తిడి పడితే అది చెయ్యి బలహీనంగా అనిపించడానికీ, తిమ్మిర్లకూ కారణమవుతుంది. మీడియన్ నర్వ్ అటు స్పర్శజ్ఞానంతో పాటు కదలిలకూ ఉపయోగపడుతుంది. అది బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలితో పాటు కొంతవరకు ఉంగరపు వేలికీ వెళ్తుంది. ఆయావేళ్ల కదలికలకు అది తోడ్పడుతుంది. అందుకే దాని మీద మణికట్టు భాగంలో ఒత్తిడి పడితే ఈ వేళ్ల పైనా ప్రభావం పడుతుంది. టన్నెల్‌ను రూపొందించేలా మణికట్టులోని ఎముకల పైపొరతో పాటు కందెన (లూబ్రికేషన్)లా పనిచేయాల్సిన సైనోవియమ్ పొర వాపు వల్ల మీడియన్ నరంపై ఒత్తిడి పడుతుంది. ప్యాకేజీ పరిశ్రమల్లో పనిచేసే వారిలో ఇది చాలాఎక్కువ. రోగిని పరిశీలించడంతో ఎలక్ట్రోఫిజియాలజీ పరీక్షల ద్వారా కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేయవచ్చు. మణికట్టు ఎముకలను కదలకుండా పట్టి ఉంచే పట్టీలు వేయడం లేదా కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. పని మధ్యలో అప్పుడప్పుడూ మణికట్టుకు విశ్రాంతి ఇస్తుండటం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. రెండు నెలల నుంచి నా చర్మం మీద పొలుసులు పొలుసులుగా పొట్టురాలుతూ, దురదతో కూడిన తెలుపు, ఎరుపు రంగు మచ్చలు, దద్దుర్లు వస్తున్నాయి. డాక్టర్లు సోరియాసిస్ అన్నారు. మందులు వాడినా ఫలితం చాలా తక్కువ. సంపూర్ణంగా నయమవడానికి ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - రామచంద్రయ్య, విజయవాడ ఆయుర్వేదంలో చర్మరోగాలన్నీ ‘కుష్ఠ’ అనే పేరు మీద వర్ణితమయ్యాయి. మీ లక్షణాలను బట్టి చూస్తే అది ‘కిటిభ’కుష్ఠం అనే చర్మరోగంగా కనిపిస్తోంది. ఈ కింది సలహాలు పాటిస్తూ, సూచించిన మందుల్ని ఒక నెల పాటు వాడి పరిస్థితిని సమీక్షించుకోండి. ఉప్పు, పులుపు, కారాలని త్యజిస్తూ తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని, విశేషంగా ద్రవాహారాన్ని తీసుకోవాలి డయాబెటిస్ వంటి ఇతర వ్యాధులుంటే వాటిని అదుపులోకి తెచ్చుకోవాలి మద్యం, పొగతాగే అలవాట్లను విసర్జించాలి ఎలాంటి మానసిక ఉద్వేగాలకూ తావీయకూడదు. రెండుపూటలా పదేసి నిమిషాలు ప్రాణాయామం విధిగా చెయ్యాలి అతిశీతల వాతావరణానికి దూరంగా ఉండాలి. ఔషధాలు : త్రిఫలాచూర్ణం 5 నుంచి 10 గ్రాములు ప్రతిరాత్రి నీళ్లతో గంధక రసాయనం (మాత్రలు): ఉదయం 2, సాయంత్రం 2 (ఖాళీ కడుపున)లఘుసూతశేఖర రస (మాత్రల) రెండేసి మూడు పూటలా ఖదిరారిష్ఠ, మహామంజిష్టాద్యరిష్ట ద్రావకాలు: రెండేసి చెంచాలు ఒక గ్లాసుతో కలిపి, సమానంగా నీళ్లు కలిపి మూడుపూటలా తాగాలి మహామరీచాది తైలంకానీ దూర్వాది తైలంగానీ, పైపూతకు మూడు పూటలా వాడాలి. గృహవైద్యం : ఉసిరికాయ (ఆమలకీ) రసం రెండు చెంచాలు + పసుపు ఒక గ్రాము కలిపి తేనెతో, రెండుపూటలా సేవించాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
రహస్య ప్రేమికుడు
డిసెంబర్, 1948... గ్రీస్... సమయం సాయంత్రం ఆరున్నర కావస్తోంది. శీతాకాలం కావడంతో అప్ప టికే బాగా చీకట్లు ముసురుకున్నాయి. చలి ఎముకల్ని కొరకడం మొదలుపెట్టింది. ‘‘ఈ యేడు చలి చంపేసేలా ఉంది. పగలూ లేదు, రాత్రీ లేదు. ఒకటే వణుకు’’... వేడి వేడి కాఫీని చప్పరిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ బఖోస్. ‘‘అవున్సార్... రక్తం గడ్డ కట్టేసేలా ఉంది’’... వంతపాడాడు అసిస్టెంట్ ఫోటిస్. ఇద్దరూ శీతాకాలపు చలి గురించి చర్చలు జరుపుతుంటే స్టేషన్లోకి దూసుకొచ్చిందో యువతి. ఆమెను చూడగానే ఇద్దరూ మాటలు ఆపారు. ‘‘సర్... నాకు మీ సాయం కావాలి’’... పరుగు పరుగున వచ్చిందేమో, ఆయాసంతో మాటమాటకీ మధ్య ఒగర్పు వినిపించింది. ‘‘తప్పకుండా... ముందు మీరిలా వచ్చి కూర్చోండి’’ అన్నాడు బఖోస్. ఆమె వచ్చి కూచుంది. మంచినీళ్లు ఇవ్వమని లేడీ పోలీసుకు సైగ చేశాడు బఖోస్. ఆమె గ్లాసుతో నీళ్లు తెచ్చి ఆ యువతికి అందించింది. ఆమె కాదనకుండా అందుకుని గటగటా తాగేసింది. కాస్త మామూలయ్యాక అడిగాడు బఖోస్... ‘‘చెప్పండి. ఎవరు మీరు? ఏంటి సమస్య?’’ ‘‘నా పేరు అలాలా సర్. మీరు... మీరు ఒక వ్యక్తిని కనిపెట్టాలి.’’ ‘‘ఎవరతను?’’ ‘‘నాకు కాబోయే భర్త.’’ ‘‘ఏమయ్యాడు? కనిపించడం లేదా?’’ ‘‘అవును సర్. రోజూ ఇంటికి వచ్చేవాడు. కానీ వారం రోజులుగా పత్తా లేకుండా పోయాడు. ఏమయ్యాడో తెలియడం లేదు. త్వరలో మేం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంతలో ఇలా అయ్యింది. నాకు చాలా భయంగా ఉంది సర్.’’ ‘‘అతగాడు మిమ్మల్ని మోసం చేసి పోలేదు కదా?’’ ఫోటిస్ అన్న మాటకి అలాలాతో పాటు ఇన్స్పెక్టర్ బఖోస్ కూడా చివ్వున తల తిప్పి చూశాడు. తను నోరు జారానన్న విషయం అర్థమై తలదించుకున్నాడు ఫోటిస్. ‘‘సారీ... మీరు చెప్పండి’’ అన్నాడు బఖోస్. ‘‘తనకేమయ్యిందో తెలియడం లేదు సర్. ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని భయంగా ఉంది. తనకేదైనా అయితే నేను, నా కడుపులో బిడ్డ ఏమైపోవాలి!’’... కన్నీళ్లు ఉబికి వచ్చాయి అలాలా కళ్లలో. నిట్టూర్చాడు బఖోస్. ‘ప్రేమ చాలా దూరం తీసుకెళ్లిందన్నమాట. ఇప్పుడు అతడికేదైనా అయినా, అతడు మోసం చేసి వెళ్లిపోయివున్నా ఈమె పరిస్థితి ఏమిటి’ అనుకున్నాడు మనసులో. పైకి మాత్రం... ‘‘కంగారు పడకండి. నేను కనిపెడతాను అతడెక్కడున్నాడో. నాకు తన ఫొటో, వివరాలు ఇవ్వండి’’ అన్నాడు. ‘‘తన పేరు గాబ్రియెల్ సర్. సైనికుడు. వయసు ముప్ఫైకీ ముప్ఫై అయిదుకీ మధ్య ఉంటుంది. ఆరడుగులు ఉంటాడు. అందంగా కూడా ఉంటాడు. మంచివాడు’’... చివరి మాటను ఒత్తి పలికింది. నవ్వుకున్నాడు బఖోస్. ఆ నవ్వుకి అర్థం తెలియలేదు అలాలాకి. అయినా అడిగే ధైర్యం చేయలేకపోయింది. ‘‘అతడి ఫొటో ఇవ్వండి’’ అన్నాడు బఖోస్. ‘‘లేదు సర్’’ అంది దిగులుగా. ‘‘ఒక్కటి కూడా లేదా? అతడి బిడ్డకు తల్లి కూడా కాబోతున్నారు. కనీసం ఫొటో అయినా లేకపోవడం...’’ తల దించుకుందామె. ‘‘ఏం చెప్పమంటారు సర్! తన ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. తను నా దగ్గర లేనప్పుడు వాటిని చూసుకునేదాన్ని. అతడు కనిపించకుండా పోయిన తర్వాత వాటిని తీసి చూస్తే...’’ సగంలో ఆగిపోవడం చూసి... ‘‘ఏమయ్యింది?’’... అడిగాడు బఖోస్. ‘‘మీరే చూడండి’’ అంటూ ఫొటోలు అందించింది అలాలా. వాటిని చూసిన బఖోస్ అదిరిపడ్డాడు. తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. ఫొటోల్లో మనిషి ఆకారం ఉంది. కానీ మనిషి లేడు. అలాలాతో కలిసి తీయించుకున్న ఫొటోలో అలాలా ఉంది, పక్కన మాత్రం అతడి నీడ తప్ప రూపం లేదు. ‘‘ఏంటిది?’’ అన్నాడు షాక్ తిన్నట్టుగా. ‘‘అదే నాకూ అర్థం కావడం లేదు సర్’’ అంది అమాయకంగా. ఏం మాట్లాడాలో తెలియలేదు బఖోస్కి. ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత అన్నాడు... ‘‘ఫొటో లేకుండా కనిపెట్టడం కష్టం. కనీసం అతడి అడ్రస్ అయినా చెప్పండి.’’ తెలియదన్నట్టు పెదవి విరిచింది అలాలా. ఏం చేయాలో తోచలేదు బఖోస్కి. ‘‘మీకు మళ్లీ కబురు చేస్తాను. ప్రస్తుతానికి వెళ్లి రండి’’ అంటూ ఆమెని పంపేశాడు. తర్వాత చాలాసేపు ఆ ఫొటోలనే చూస్తూండిపోయాడు. కెమెరాలో లోపం ఉంటే ఇద్దరూ పడకూడదు. ఒకరు పడి, ఇంకొకరు పడకపోవడమేంటి? పోనీ నిజంగా కెమెరా లోపమే అనుకుందామన్నా... అవన్నీ ఒక్కసారి తీసిన ఫొటోలు కావు. మరి ప్రతిసారీ ఒకే సమస్య ఎలా వస్తుంది? ఆలోచించీ ఆలోచించీ బుర్ర వేడెక్కిపోయింది బఖోస్కి. చివరికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే సైనికాధికారి ఆఫీసులో గాబ్రియెల్ అన్న సైనికుడి గురించి వాకబు చేశాడు. అలాంటివాళ్లెవరూ ఆ దేశ సైన్యంలో లేరని తెలిసింది. దాంతో ఆ వ్యక్తెవరన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. ‘‘ఏమిటిది మేడమ్?’’... అవాక్కయ్యి అడిగాడు బఖోస్. ‘‘ఫొటోలు సర్’’... అందామె మెల్లగా. ‘‘ఫొటోలు సరే. వీటిలో మనిషేడి?’’... అన్నాడు అయోమయంగా. ‘‘అదే నాకూ అర్థం కావడం లేదు సర్. మొదట ఉండేవాడు. ఇప్పుడు నా జీవితంలోంచే కాదు, ఫొటోల్లోంచి కూడా మాయమైపోయాడు. ఇదెలా జరిగిందో తెలియడం లేదు సర్.’’ ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో అర్థం కాక తల పట్టుకున్నాడు బఖోస్. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం అలాలా కూడా ఇలాంటి ఫొటోలే తెచ్చింది. ఇప్పుడీమె కూడా అలాంటివే తెచ్చి చూపిస్తోంది. ఏమిటీ వింత? ‘‘చూడండి మిసెస్ కొరినా... కొద్ది నెలల క్రితం ఇలానే ఓ యువతి వచ్చింది. తన ప్రియుణ్ని కనిపెట్టమంది. మనిషే లేని ఫొటోలు ఇచ్చింది. ఇప్పటి వరకూ ఆ మిస్టరీ వీడలేదు. ఇప్పుడు మళ్లీ మీరొచ్చారు. ఏం జరుగుతోందో నాకేమీ అర్థం కావడం లేదు.’’ బఖోస్ అలా అనగానే ఏడుపందుకుందామె. ‘‘నేనొక విధవను సర్. భర్త పోయాక ఒంటరిగా బతుకుతున్నప్పుడు హెబర్ నాకు పరిచయమయ్యాడు. తనో సైనికుడు. మనసున్నవాడు. నన్ను పెళ్లి చేసుకుని నాకో జీవితాన్ని ఇచ్చాడు. సంతోషంగా ఉన్న సమయంలో కనిపించకుండా పోయాడు. తనెక్కడున్నా తీసుకురండి సర్.’’ ఆమె కన్నీళ్లు చూసి జాలి వేసినా ఏమీ చెప్పగలిగే స్థితిలో లేడు బఖోస్. అందుకే కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఏదో చెప్పి ఆమెను పంపేశాడు. అతడికి తెలుసు... ఈ కేసు తాను ఛేదించలేనని. అనుకున్నట్టుగానే ఛేదించలేకపోయాడు. ఎందుకంటే... అసలలాంటి వ్యక్తే లేడు కాబట్టి! అవును. అతడు లేడు. రాడు. ఎందుకంటే అతడు మనిషి కాదు... ఓ ఆత్మ! రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీసు దేశంలో ఒక సైనికుడి ఆత్మ సంచలనం సృష్టించింది. వరుసగా కొందరు యువతులు ప్రేమించినవాడు కనిపించడం లేదనో, భర్త మాయమయ్యాడనో ఆవేదన చెందసాగారు. కొన్ని కేసులు పోలీసుల దృష్టికి కూడా వెళ్లాయి. అందరూ చెప్పింది ఒకటే కథ. ఓ సైనికుడు తమకు అనుకోకుండా పరిచయమయ్యాడు. తమ మనసుకు దగ్గరయ్యాడు. కొందరినైతే పెళ్లాడాడు. కొందరిని పెళ్లాడకుండానే ప్రేమబంధంతో ముడివేసుకున్నాడు. కొన్నాళ్లు వారితో గడిపిన తర్వాత ఉన్నట్టుండి కనిపించకుండా పోయేవాడు. అతడేమైపోయాడో తెలియక ఆ యువతులు అల్లాడిపోయేవారు. అతడి కోసం ఎక్కడెక్కడో వెతికేవారు. కానీ ఎవరికీ అతడి జాడ తెలిసేది కాదు. అతడితో పాటే అతడి గురుతులూ చెరిగిపోయేవి. చిత్రాల్లో అతడి రూపం పోయి నీడ మిగిలేది. దాంతో అతడు ఎవరు అనేది ఎవరికీ తెలియకుండా పోయింది. అయితే చివరకు చిత్రకళ తెలిసిన ఒక యువతి అతడి రూపాన్ని చిత్రించడంతో... ఆ రొమాంటిక్ సైనికుడు ఎవరో తెలిసివచ్చింది. కానీ అతడి వివరాలు అందరినీ వణికించాయి. ఎందుకంటే... ఆ యువతులందరికీ పరిచయమ్యేనాటికే ఆ వ్యక్తి ప్రాణాలతో లేడు కాబట్టి! అతడు గ్రీసు దేశపు సైనికుల్లో ఒకడు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధం ముగిసిన తర్వాత తన ప్రియురాలి దగ్గరకు పయనమయ్యాడు. త్వరలో జరగబోయే తమ పెళ్లి కోసం కొన్న దుస్తులు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు. కానీ దారిలో శత్రువుల చేతికి చిక్కాడు. వాళ్లు అతణ్ని బంధించారు. వారం రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. కాబోయే భార్య తనకోసం ఎదురుచూస్తూ ఉంటుందని, తనను విడిచిపెట్టమని బతిమాలినా వాళ్లు వినలేదు. కర్కశంగా అతడి ప్రాణాలు తీసేశారు. అతడే దెయ్యమయ్యాడని, ప్రియురాలికి దూరమైన బాధతో విధవలైన ఒంటరి మహిళలు, ఒంటరిగా ఉండే యువతులకు దగ్గరయ్యేవాడనే కథనాలు అప్పట్లో వినిపించాయి. అయితే ఇది ఎంతవరకూ నిజమో ఎవరూ నిర్ధారించి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే... ఒక ఆత్మ మనిషితో ఎలా కాపురం చేస్తుంది, ఎలా గర్భవతుల్ని చేస్తుంది అన్నది అందరిలోనూ తలెత్తిన పెద్ద సందేహం. పోనీ ఇదంతా భ్రమ అని కొట్టి పారేద్దాము అంటే... మరి ఆ యువతుల్ని మోసం చేసిన సైనికుడు ఎవరు అన్నది ఇంకో పెద్ద సందేహం. నివృత్తి చేసేవాళ్లెవరూ లేక, ఈ సందేహాలు నేటికీ సందేహాలుగానే మిగిలిపోయాయి. ఆ గ్రీకు సైనికుడి కథ... చరిత్రలో ఓ పెద్ద మిస్టరీగా నిలిచిపోయింది! - సమీర నేలపూడి ఓ యువతి వేసిన చిత్రం ఆధారంగా గ్రీకు సైనికుడి కథ బయటకు వచ్చింది. దాన్ని బట్టి వెతికితే ఈ చిత్రం వెలికి వచ్చింది. ఇతడే దెయ్యమైన ఆ సైనికుడు అని చాలామంది అన్నారు. అయితే అది చనిపోయిన సైనికుడి ఫొటోనే అని చెప్పగలం కానీ, అతడు దెయ్యమై అమ్మాయిలను మోసగించాడా లేదా అన్నది తాము చెప్పలేమని ఆర్మీ అధికారులు అన్నారు. దాంతో ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి, ఆ దెయ్యం ఒక్కరేనా అన్న విషయం ఎప్పటికీ నిర్ధారణ కాలేదు! -
మాంసం తింటే ఎముకలు మెళ్లో కట్టుకు తిరగాలా...
ఒక ఊళ్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ప్రతి చిన్నదానికీ ఆర్భాటం చేసేవాడు. రోజూ మాంసం తెచ్చి వండించేవాడు. రోజూ ఎందుకండీ అని భార్య అంటే... చెప్పింది చెయ్యమంటూ ఆమె మీద అరిచేవాడు. పైగా తాము రోజూ విందు ఆరగిస్తామని అందరికీ తెలిసేలా చేయడానికి మాంసంలోని ఎముకలను అందరూ చూసేలా పారబోసేవాడు. కొన్నాళ్లకు ఆ ఊళ్లోవాళ్లు పెంచుకునే కోళ్లను ఎవరో ఎత్తుకెళ్లటం మొదలుపెట్టారు. వరుసగా అందరి కోళ్లనూ ఎత్తుకెళ్లేసరికి అందరూ కలిసి సదరు వ్యక్తి ఇంటిమీద పడ్డారు. నేను మాంసం కొని తెచ్చుకుంటున్నాను, మీ కోళ్లు ఏమయ్యాయో నాకు తెలీదు అని ఎంత చెప్పినా నమ్మలేదు సరికదా చితక బాదేశారు. కుయ్యో మొర్రో అంటున్న అతడిని చూసి...‘మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్లో వేసుకుని తిరిగితే ఇలానే ఉంటుంది’ అంది భార్య. ఆ మాటే తర్వాత సామెతయ్యింది. -
భాషణం: సూపు తాగితే సాఫీగా గొంతు దిగాలి
Make no bones about it.ఇదొక ఇడియమ్. నానుడి. విషయాన్ని నేరుగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా, సంకోచం లేకుండా చెప్పడమని దీని అర్థం. మన వాడుకలో ‘కుండ బద్దలు కొట్టడం’. ఈ మాట 14, 15 శతాబ్దాల మధ్య ఇంగ్లండ్‌లో పుట్టిందని చెబుతారు. ఎలా పుట్టిందనేదానికి ఒక కథ ఉంది. ఎముకల సూప్ తయారు చేసేటప్పుడు అందులో ఎముక ముక్కలు ఉండిపోకుండా, జాగ్రత్తగా వడగడతారు. సూప్ అనేది మెత్తగా, సాఫీగా గొంతు దిగాల్సిన పదార్థం. అలాంటిది సూప్‌లో ఎముకలు వస్తే, తాగేటప్పుడు అవి గొంతుకు అడ్డం పడితే ఇంకేమైనా ఉందా? అందుకే సూప్‌ని సూప్‌లా తెమ్మనడానికి make no bone about itఅనే వారట. కాలక్రమేణ ఈ వ్యక్తీకరణ ‘ఉన్నదున్నట్టు చెప్పడం’ అనే అర్థానికి ప్రత్యామ్నాయం అయింది. ఈ వాక్యాలు గమనించండి. 1. He made no bones about how bad he thought the food was. 2. She makes no bones about her dislike of her husband. ఇలాగే ఛౌ్ఛ అనే మాటతో మరికొన్ని పదబంధాలు ఉన్నాయి. Have a bone to pick with (someone)అంటే ఒక విషయంపై వాదనకు సిద్ధమవడం. (I have got a bone to pick with you, - you have been using my shaver again). ఇక ఖీౌ ్టజ్ఛి ఛౌ్ఛ అంటే... పూర్తిగా, మొత్తంగా, చివరవరకు... అని అర్థం. 1) I was chilled to the bone after waiting so long for the bus.బస్సుకోసం ఎదురు చూసి, చూసి నడుములు పడిపోయాయని. 2) I have cut my expenses to the bone. ఖర్చులు పూర్తిగా తగ్గించుకున్నాడని. అలాగే bone up అనే మాట ఉంది. అంటే సంసిద్ధం కావడం. She bone up on economics before applying for the job. ఆౌ్ఛ ఝ్ఛ్చ అంటే ఎరువు. ఎముకల పొడి కలిపి తయారుచేసే ఈ ఎరువును మొక్కలు ఏపుగా పెరగడానికి పాదుల్లో వేస్తారు. Funny boneఅంటే మోచేయి ఎముకకు కాస్త పక్కగా ముడిపెలా బయటికి పొడుచుకొచ్చినట్లు ఉండే ఏముక భాగం. ఈ భాగానికి చిన్న ఒత్తిడి తగిలినా షాక్ కొట్టినట్లు ఉంటుంది. Rag and bone manఅంటే వీధుల్లో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని తక్కువ ధరకు కొంటూ తిరిగే వ్యక్తి. పాత బట్టలు, పాత ఫర్నీచరు... ఇలా. Bone dry అంటే... పూర్తిగా ఆరిపోవడం లేదా ఎండిపోవడం. Bone lazy అంటే... పరమ సోమరి. Close to the bone అంటే... resque and indecent.మొరటుగా, అసభ్యంగా. Resqueని ‘రిస్కే’ అని పలకాలి. కొందరు వేసే జోక్‌లు మొరటుగా, అసభ్యం గా ఉంటాయి. నవ్వురాకపోగా, షాక్‌కు గురవుతాం. ఇబ్బందిగా పీలవుతాం. అలాంటివాటిని close to the bone jokes అంటారు. (His jokes are rather close to the bone). గిౌటజు డౌఠట జజీజ్ఛటట ౌ్ట ్టజ్ఛి ఛౌ్ఛ అంటే.. రెక్కలు ముక్కలు చేసుకోవడం. (She worked her fingers to the bone to provide a home and food for eight children.)A bone of contention అంటే... ఇద్దరు, లేదా అంతకంటే ఎక్కుమంది వ్యక్తుల మధ్య ఎడతెగని తీవ్రమైన వాదనకు కారణమైన అంశం. ఉదా: రాష్ట్ర విభజన అంశం ఇప్పుడు మన రాజకీయనాయకుల ఛౌ్ఛ ౌజ ఛిౌ్ట్ఛ్టజీౌ. ఈ వాక్యం చూడండి. We have fought for so long that we have forgotten what the bone of contention is.వాళ్లెవరో వాదులాడుకునీ, కునీ, కునీ... అసలెందుకు వాదులాడుకుంటున్నారో మర్చిపోయారట! చాలా సందర్భాలలో ఇలాగే విషయం పక్కన పడి, చివరికి వాదులాటే మిగులుతుంది. Point the bone... మధ్య, ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాలలోని ఆదిమజాతుల నుంచి ఈ మాట వచ్చిందంటారు. వారి మతాచార్యుడు ‘కడిచ్చా’ (kaditcha) తన ఆధీనంలోని గూడేలలో ఏదైనా పాపపు కార్యం జరిగినప్పుడు దోషి ఎవరో తీర్పు చెప్పేందుకు ఒక ఎముక పుల్లను సంకేతంగా చూపిస్తాడట. అలా ఏ వ్యక్తి వైపు చూపుతాడో ఆ వ్యక్తికి శిక్ష పడినట్లే. అలా ఆదిమ జాతుల నుంచి... ఆధునాతన ప్రపంచంలోకి ఈ విధానం pointing the boneఅనే వ్యక్తీకరణగా ప్రవేశించిందంటారు. దీనర్థం అంతాన్ని సూచించడం. అంతుచూస్తానని బెదిరించడం కూడా.