
యూకేకు చెందిన డ్యానియల్లె అనే మహిళ తనకున్న ప్రత్యేక ‘ప్రతిభ’తో ప్రజలను అవాక్కు చేస్తోంది. ఎముకలు, పుర్రె, పళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపే క్లీడోక్రేనియల్ డిస్‌ప్లేసియా (సీసీడీ) అనే అరుదైన జన్యు సంబంధ పరిస్థితితో పుట్టిన డ్యానియల్లే.. తనకున్న లోపాన్నే అవకాశంగా మార్చుకుంది. సాధారణ శరీరాకృతితో పుట్టిన మనుషులకు సాధ్యంకాని రీతిలో విన్యాసాలు చేసి చూపుతూ అందరి మన్ననలు పొందుతోంది. ఇంతకీ ఆమె చేస్తున్న ఆ విన్యాసాలు ఏమిటో తెలుసా?
తన రెండు భుజాలను పరస్పరం తాకేలా చేయడమే! అంటే చేతులను లోపలకు ముడుస్తూ మొండేన్ని నిలువుగా రెండు భాగాలుగా కలిపిందన్నమాట!! ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? తన రెండు భుజాల వద్ద ఎముకలు (కాలర్ బోన్స్) లేకపోవడం వల్లే తాను ఈ ట్రిక్‌ను చేయగలుగుతున్నట్లు డ్యానియల్లే తెలిపింది. ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఈ తరహా జన్యు లోపం ఉంటుందని.. అలాంటి అదృష్టం తనకు లభించిందని గర్వంగా చెబుతోంది డ్యానియల్లే. తన ‘ట్రిక్’లను నెటిజన్లకు చూపుతూ వారి మన్ననలు పొందుతోంది.
చదవండి: ‘నోరె’ళ్లబెట్టే రికార్డు! 4 మెక్‌డొనాల్డ్స్ చీస్ బర్గర్లను అవలీలగా..
Comments
Please login to add a commentAdd a comment