చర్ల: మాంసం తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలంలో చోటు చేసుకుంది. తేగడ గ్రామానికి చెందిన నిట్టా జ్యోతి(50) ఆదివారం ఇంట్లో మాంసాహారం భుజిస్తుండగా ఓ ఎముక గొంతులో ఇరుక్కొని ఇబ్బంది పడింది. కడుపులోకి జారుతుందేమోనని చూసింది. అయినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం భద్రాచలంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు ఆమెను తరలించారు. ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని పొందవచ్చని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మంగళవారం తీసుకు వెళ్లారు.
అక్కడ పరీక్షించిన వైద్యులు బుధవారం రాత్రి ఆమెకు ఆపరేషన్ చేస్తుండగా గొంతులో తీవ్ర రక్తస్రావమైంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున జ్యోతి మృతి చెందింది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలుఉన్నారు.
గొంతులో ఎముక ఇరుక్కొని..
Published Fri, Sep 30 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
Advertisement