throat
-
పెరుగుతోన్న చలి తీవ్రత.. రోగాల బారిన పడకుండా ఉండాలంటే..
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. అయితే చలిగాలులు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. ఈ సీజన్లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలిగాలులు శరీరంలోకి వెళ్లడంతో వైరస్లు మరింత వృద్ధి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలితీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.సమస్యలు.. ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.లక్షణాలు.. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు.. చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. ఎవరైనా వాతావరణాన్ని అంచనా వేసుకుని బయటకు రావాలి. మరీ చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ము ఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్హేలర్లను వాడుతుండాలి.ఎవరికి ఇబ్బంది.. చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు వేడివేడిగా సరైన ఆహారం తీసుకోవాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. చలిగాలులు ఉన్నప్పుడు చిన్నారులను బయట తిప్పకూడదు. ఎక్కువరోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చలిగాలుల్లో ఆరు బయట పనిచేసే కార్మికులు, వీధుల్లో గడిపే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలి.చదవండి: ఈ డివైజ్‌తో మొటిమలలు, మచ్చలు ఇట్టే మాయం..!కారణాలు.. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వైరస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వైరస్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది.వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి.. చలికాలంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. విపరీతమైన చలికి జాగ్రత్తలు తీసుకోకపోతే, అవయవాల్లో గాయాలై మరణాలు సంభవించవచ్చు. – డాక్టర్ ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్, టీజీఎంఎస్ సభ్యుడు -
గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి!
అనుకోకుండా, ఊహించని పరిణామాలు అద్భుతాలుగా నిలుస్తాయి. ఈ అద్భుతాల్లో మహాఅద్భుతాలు మరికొన్ని ఉంటాయి. అలాంటి అద్భుతం కమ్..షాకింగ్ లాంటి ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆలస్యం చేయకుండా వివరాలను తెలుసుకుందాం పదండి!అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన 20 ఏళ్ల నర్సింగ్ అసిస్టెంట్ కాట్లిన్ యేట్స్(Katelyn Yates)కు కూడా నమ్మలేని అనుభవం ఎదురైంది. గొంతు నొప్పిగా ఉండటంతో ఒకరోజు ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఎక్స్‌రే తీయించుకోమని సలహా ఇచ్చారు. అయితే ఎక్స్‌రేకి వెళ్లి ముందు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని కూడా సూచించారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఎక్స్‌రేలు ప్రమాదకరం. రేడియేషన్ పిండానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున ముందుగానే గర్భంతో లేమనే నిర్ధారణ అవసరం. ఇక్కడే కాట్లిన్సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యే విషయం తెలుసుకుంది. అదీ కూడా నమ్మశక్యంగాని విధంగా కాట్లిన్ గర్భవతి అని తేలింది. ఇందులో ఆశ్చర్యం ఏముందు అనుకుంటున్నారా? ఆమె గర్బంలో పెరుగుతోంది ఏకంగా నలుగురు. ముందు షాకైనా, ఏప్రిల్ ఫూల్స్ డే కదా.. డాక్టర్ జోక్ చేస్తున్నారులే అని లైట్ తీసుకుంది కేట్లిన్. చివరికి విషయం తెలిసి మురిసి పోయింది.కానీ పిల్లలకు జన్మనివ్వడానికి చాలా కష్టపడింది. అయితే ఆమె భర్త జూలియన్ బ్యూకర్ కేట్లిన్కు పూర్తిగా సపోర్ట్ అందించాడు. ధైర్యం చెప్పాడు. ఎందుకంటే కాట్లిన్‌కు ప్రీక్లంప్సియా అనే అరుదైన వ్యాధి వచ్చింది. ఇది ప్రమాదకరమైన అధిక రక్తపోటుకు కారణమయ్యే తీవ్రమైన పరిస్థితి. ఫలితంగాఆమెకు రక్తపోటు పెరిగి, కాలేయం, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. ఒక దశలో ఆమె శ్వాస అందక ఇబ్బంది పడింది. దీంతో కేవలం 28 వారాలు , 4 రోజులలో, వైద్యులు సిజేరియన్ చేసి నాలుగురు పిల్లలకు ప్రసవం చేశారు. ఎలిజబెత్ టేలర్, జియా గ్రేస్ , ఐడెంటికల్ ట్విన్స్‌గా మాక్స్ ఆష్టన్ , ఇలియట్ రైకర్ జన్మించారు. నెలలు నిండకుండానే పుట్టడంతో ఎలిజబెత్ కేవలం ఒక పౌండ్, రెండు ఔన్సులు, మాక్స్ బరువు రెండు పౌండ్లు, ఆరు ఔన్సులు మాత్రమే ఉన్నారు. తరువాత నాలుగు నెలల్లో బాగా పుంజుకుని బరువు పెరగడంతో కెట్లిన్, ఆమె భర్త జూలియన్ బ్యూకర్ సంతోషంలో మునిగిపోయారు. ఒకేసారి నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదు అన్నారు ఆసుపత్రి గైనకాలజిస్ట్ మెఘనా లిమాయే. ఇదీ చదవండి : 50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్ -
ఓ వ్యక్తి గొంతులో అసాధారణ పరిస్థితి..కంగుతిన్న వైద్యులు
పలువురు వింతగొలిపే సమస్యలతో బాధపడుతుంటారు. ఒక్కోసారి అవి వైద్య పరిజ్ఞానానికే అందని విధంగా ఉంటాయి కూడా. అలాంటి వింతైన సమస్యతో బాధపడుతున్నాడు 52 ఏళ్ల వ్యక్తి. అయితే అనుహ్యంగా ఓ దురలవాటుకి దూరంగా ఉండటంతో అతని సమస్యను పరిష్కరించడాని వైద్యులకు మార్గం సుగమమయ్యింది. ఇంతకీ అతను ఎలాంటి అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడంటే..52 ఏళ్ల ఆస్ట్రియన్ అనే వ్యక్తి చాలా అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను కొన్ని రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెరగని దగ్గు, తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్ప్రతిలో చేరాడు. అక్కడ వైద్యులు బ్రోంక్స్కోప్తో జరిపిన వైద్య పరీక్షల్లో..ఆ వ్యక్తి గొంతులోని పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఊహించని రీతిలో అక్కడ జుట్టు పెరగడం చూసి గందరగోళానికి గురయ్యారు. నిజానికి ఆ వ్యక్తికి పదేళ్ల వయసులో ట్రాకియోటోమీ చేయించుకున్నాడు. ట్రాకియోటోమీ అంటే.. మెడ వెలుపలి నుంచి శ్వాసనాళంలోకి (విండ్‌పైప్) ఓపెనింగ్ సృష్టించడం ద్వారా ఊపిరితిత్తులకు గాలి, ఆక్సిజన్ చేరుకోవడంలో సహాయపడే ప్రక్రియ.ట్రాకియోటోమీ ఉన్న వ్యక్తి ఓపెనింగ్‌లో చొప్పించిన ట్రాకియోటోమీ ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటాడు. దీని కారణంగా అతని శ్వాసనాళంలో ఓపెనింగ్ ఉంటుంది. అక్కడ అతని చెవి నుంచి తీసిన చర్మం, మృదులాస్థితో అంటుకట్టుట పద్ధతిలో ఆ ఓపెనింగ్‌ని స్థిరీకరించేలా చేశారు వైద్యులు. సరిగ్గా ఆ ప్రాంతంలో అసాధారణ రీతిలో వెంట్రుకలు పెరగడం మొదలయ్యింది. అవి ఏకంగా ఆరు నుంచి తొమ్మిది వరకు.. సుమారు రెండు అండుళాల మేరు పొడవుగా ఉన్నాయి. అందువల్ల అతని గొంతు బొంగరుపోయి, దగ్గు వంటి సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ వెంట్రుకలను తొలగంచే ప్రక్రియ చేపట్టారు. ఇలా సదురు వ్యక్తి 14 ఏళ్ల పాటు ఆస్పత్రిని సందర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అతడే తనకున్న ధూమపానం దురలవాటుకి దూరంగ ఉంటూ ఉండటంతో అనూహ్యంగా వాటి పెరుగుదల తగ్గింది. వైద్యులు కూడా అతడిలో వచ్చిన సానుకూల మార్పుకి అనుగుణంగా ఎండోస్కోపిక్ ఆర్గాన్ ప్లాస్మా కోగ్యులేషన్ అనే కొత్త విధానానంతో జుట్టు పెరుగుదల శాశ్వతంగా చెక్కుపెట్టారు. ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తుంటే.. మనకున్న దురలవాట్లే మనలను అనారోగ్యం పాలు జేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ . (చదవండి: ఇలాంటి జిమ్ సెంటర్లకి వెళ్లకపోవడమే మేలు...!) -
హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి..
నోట్లో ఉన్న ఆహారాన్ని నమిలాక మింగివేసే ప్రక్రియ చాలా సులువుగా జరుగుతున్నట్లు అనిపిస్తుందిగానీ, నిజానికి ఇదొక సంక్లిష్ట ప్రక్రియ. ఇందులో నోరు, జీర్ణవ్యవస్థ తాలూకు కండరాలూ, నరాలు ఇవన్నీ పాలుపంచుకుంటాయి. కొన్నిసార్లు కొన్ని అంతరాయాలూ, అవాంతరాలతో గుటక వేసే ఈ ప్రక్రియ కష్టమవుతుంది. ఇలా మింగడం కష్టమయ్యే కండిషన్‌ను ‘డిస్ఫేజియా’ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, దానికి పరిష్కారాలేమిటి అనే అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. గుటక వేసే ప్రక్రియ ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది. అవి.. ఓరల్ ఫేజ్.. ఓరల్ ఫేజ్‌లో నోట్లో ఆహారాన్ని నమలడం లేదా చప్పరించడం జరుగుతుంది. అలా ఆహారాన్ని గొంతులోకి పంపడానికి సిద్ధం చేసే దశ వరకు ఓరల్ ఫేజ్ అంటారు. ఇందులో నోరు, నాలుక, పెదవులు, దంతాలు పాలుపంచుకుంటాయి. ∙ఇక ఫ్యారింజియల్ ఫేజ్ అంటే... తిన్నది కాస్తా గొంతు దగ్గర్నుంచి ఆహార నాళంలోకి చేరే దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఎపిగ్లాటిస్ పొర విండ్ పైప్‌ను మూసుకుపోవడం వల్ల ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఆహారనాళంలోకే వెళ్తుంది. ∙ఈసోఫేజియల్ ఫేజ్ దశలో ఆహారం ఈసోఫేగస్ అనే పైప్ ద్వారా ఆహారనాళంలోకి చేరుతుంది. అక్కడి నుంచి కడుపులోకి వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మింగడం అనేది చాలా సులువుగా మన ప్రమేయం లేనట్టుగా జరిగినట్లు అనిపించినా, నిజానికి మింగడం అన్నది మన సంకల్పంతోనే జరుగుతుంది. గుటక వేయడంలో సమస్యలూ... కారణాలు ఫ్యారింజియల్ ఫేజ్.. గుటక వేసే దశలైన ఓరల్, ఫ్యారింజియల్, ఈసోఫేజియల్ దశల్లో ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా మింగడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డిస్ఫేజియా’ అంటారు. ఒక్కోసారి జీర్ణ వ్యవస్థను నియంత్రించే నరాల సమస్య వల్ల కూడా గుటక వేయడం సాధ్యం కాకపోవచ్చు. గుటక వేయలేకపోడానికి మరికొన్ని కారణాలు.. ఈసోఫేజియల్ ఫేజ్.. మరీ చిన్న పిల్లల్లో... తల్లిపాలు తాగడంలో ఇబ్బందులు, మరికాస్త పెద్ద పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో శరీరాన్ని బిగబట్టడం; నమలలేకపోవడం, తినడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. తినే సమయంలో దగ్గు రావడం లేదా పొలమారడం ∙తరచూ వాంతులు చేసుకోవడం ∙నోటి నుంచి ముక్కు నుంచి చొల్లు కారడం ∙గాలి తీసుకోవడానికీ, తినడానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం తరచూ నెమ్ము లేదా శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడటం ∙గొంతు గరుకుగా మారడం లేదా గొంతులోంచి గాలి రావడం ఇక పెద్దవయసువారిలో.. తల, మెడ, ఆహార వ్యవస్థ, శ్వాసకోశవ్యవస్థలో కండరాలూ, వాటిని నియంత్రించే నరాల సమస్యతో మింగడం కష్టం కావచ్చు. ఇందుకు దారితీసే పరిస్థితుల్లో కొన్ని.. గొంతు లేదా తల భాగంలో దెబ్బ తగలడం మెదడువాపు, పక్షవాతం వంటి జబ్బులు వెన్నుపూసకు గాయం కావడం అల్జైమర్స్ మతిమరపుతో గుటకవేయలేకపోవడం మల్టిపుల్ స్కి›్లరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్, వయసు పైబడటంతో వచ్చే సమస్యలు గొంతు లేదా తలకు సంబంధించిన క్యాన్సర్‌తో మింగలేకపోవడం కొన్ని రకాల అనారోగ్యాలకు శస్త్రచికిత్స చేయడం వల్ల మింగలేకపోవడం కారణమేదైనప్పటికీ గుటక వేయలేని పరిస్థితితో పాటు నోటి నుంచి అదేపనిగా చొల్లు కారడం, తినేటప్పుడు విపరీతంగా దగ్గురావడం, గొంతు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు.. బాధితుల లక్షణాలను బట్టి.. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన పరీక్షలు; నోటి పరీక్షలు, స్వరపేటికకు సంబంధించిన పరీక్షలు; నరాలకు సంబంధించిన లోపాలను తెలుసుకోడానికి సీటీ స్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై హెడ్ అండ్ నెక్ వంటి పరీక్షలు అవసరం. వీటితో పాటు మాడిఫైడ్ బేరియమ్ స్వాలో టెస్ట్; వీడియో ఫ్లోరోస్కోపీ, ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్వాలోయింగ్ (ఫీస్) / ట్యూబ్ ఇవాల్యుయేషన్ వంటివి అవసరాన్ని బట్టి చేయించాల్సి రావచ్చు. చికిత్స.. సమస్య ఏ కారణంతో వచ్చిందనే అంశంపై చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పక్షవాతం లేదా యాక్సిడెంట్ వంటి కేసుల్లో సర్జరీతో పరిస్థితిని చక్కదిద్దాల్సి రావచ్చు. (ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు ఆహారం గుటకవేయలేని పరిస్థితి ఉంటే రైల్స్ ట్యూబ్ ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తారు). ఈసోఫేజియల్ దశలో వచ్చే సమస్యలకు ఈసోఫేజియల్ డయలేషన్, స్టెంట్ ప్లేస్మెంట్ చికిత్సలు చేయాల్సి రావచ్చు. ఓరల్, ఫ్యారింజియల్ దశల్లో వచ్చే సమస్యలను స్వాలోయింగ్ థెరపీ వంటి చికిత్స అవసరం పడవచ్చు. క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యల్లో దాని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స, మందులతో చికిత్స వంటి రకరకాల చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. — డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్. -
మహిళపై షాప్కీపర్ దౌర్జన్యం.. గొంతు పట్టుకుని..
లండన్‌లోని పెక్హోమ్లో దుకాణాదారుడు ఓ నల్లజాతి మహిళపై అమానవీయంగా ప్రవర్తించాడు. మహిళను గొంతు పట్టుకుని విచక్షణ రహితంగా దాడి చేశాడు. హెయిర్ షాప్‌లో ఇంతకు ముందు తీసుకున్న వస్తువులకు రీఫండ్ చేసే అంశంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం షాప్ కీపర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెక్హోమ్లోని రే లేన్‌లో హెయిర్ అండ్ కాస్మెటిక్స్ దుకాణం ఉంది. షాప్‌లోకి ఓ నల్లజాతీయురాలు వచ్చి దుకాణాదారుడితో ఏదో మాట్లాడుతోంది. ఇంతకు ముందు తీసుకున్న వస్తువులపై రీఫండ్ విషయంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దుకాణాదారుడు నిగ్రహం కోల్పోయాడు. మహిళ గొంతు పట్టుకుని దాడి చేశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Context: A Black woman in Peckham was refused a refund for hair extensions and went to take something as a personal compensation. She was refused exit and started violently hitting the shop owner before he proceeded to STRANGLE her. pic.twitter.com/OEYZinoAOH — ᴼᴹᴳ ᶥᵗˢ Adàeze (@nubianbarbieeee) September 12, 2023 సదరు దుకాణాదారుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. నల్లజాతీయురాలిపై దాడి చేసినందుకు ఆ షాప్ ముందు నిరసనకు దిగారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దోషులకు కఠినంగా శిక్ష విధిస్తామని హామి ఇచ్చారు. ఇదీ చదవండి: వీడియో: తెలుగు విద్యార్థి జాహ్నవి మృతిపై అధికారి వెకిలి కామెంట్లు, ఆలస్యంగా బయటకు.. -
పిల్లల్లో పొరబోయిందా?.. గొంతులో ఏదైనా ఇరుక్కుందా..?
పిల్లలు తినే సమయంలో వారి గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొర పోయిందని పెద్దలు అంటుంటారు. తిన్న ఆహారం కిందికి కదలడం కోసం తలపై తడుతుంటారు. కానీ గొంతులో ఇరుక్కున్న ఆహారంగానీ లేదా నాణెంలాంటి వస్తువుగానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే వాయునాళంలోకి పోతే చాలా ప్రమాదం. ఇలా ఆహారం ఇరుక్కున్నా లేదా ఏదైనా వస్తువు గొంతులో ఇరుక్కున్నా హాస్పిటల్‌కు వెళ్లేలోపు ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించాలి. పిల్లల నోరు బాగా తెరిపించి, నాలుక బాగా చాపేలా చేసి, గొంతులోకి వేళ్లుపోనిచ్చి చేతికి ఏదైనా తగులుతుందేమో చూడాలి. తగిలితే వెంటనే బయటకు తీసేయాలి. ∙పిల్లాడి వెనక పెద్దలెవరైనా నిల్చుని, వారి రెండు చేతుల్నీ పొట్టచుట్టూ బిగించి, అకస్మాత్తుగా చేతుల్తో పట్టుబిగుస్తున్నట్లుగా కదిలించాలి. ఇది క్రమపద్ధతిలో (రిథమాటిక్‌గా) చేస్తుండాలి. దాంతో పొట్ట దగ్గర ఒత్తిడి పెరిగి, గొంతులో ఇరుక్కున్నది బయటకు రావచ్చు. దీన్ని హీమ్లిచ్ మెనోవర్ అంటారు. ఇదే గనక చాలా చిన్నపిల్లల్లో / పసిపాపల్లో చేయాల్సి వస్తే... పెద్దలు కుర్చీలో కూర్చుని, చిన్నారులు తలకిందులుగా ఉండేలా, వాళ్లను తమ కాళ్లపైన బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టాక, చిన్నారుల వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి కలిగేలా నొక్కాలి. ఇది ఎలా జరగాలంటే... చిన్నారుల నడుము నుంచి వారి రెండు భుజాల మధ్య ప్రాంతంలో మృదువుగా ఒత్తిడి కలిగేలా కదిలిస్తుండాలి. ఇది కూడా క్రమపద్ధతిలో (రిథమాటిక్‌గా) చేయాలి. ఒకవైపు పొట్ట మీద పెద్దల కాళ్ల ఒత్తిడీ, మరోవైపు వీపు మీద చేతుల ఒత్తిడి కారణంగా గొంతులో అడ్డు పడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ∙ప్రథమ చికిత్సగా ఇవి చేస్తూ... వీలైనంత త్వరగా పిల్లల్ని హాస్పిటల్‌కు తరలించాలి. ఈ ప్రక్రియలతో గొంతులో ఇరుక్కున్నవి బయటకు వస్తే సరి. లేదంటే హాస్పిటల్లో అవసరాన్ని బట్టి ఎండోస్కోప్ వాడి, ఇరుక్కున్న పదార్థాన్ని డాక్టర్లు బయటకు తీస్తారు. (చదవండి: చిన్నారులను వేధించే పిన్‌వార్మ్ / థ్రెడ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అంటే...? ) -
వృద్ధులను వేదించే గొంతులోని కఫం సమస్యకు..ఇలా చెక్ పెట్టండి!
వయసు మళ్లాక వచ్చే సమస్యలు అన్నిఇన్ని కావు. ఏది తినాలన్న భయం. పైగా ఏది అంత తొందరగా జీర్ణం కాదు. దీంతో అన్ని జావా, సూప్ మాదిరిగా తీసుకుంటుంటారు. ఘన పదార్థాలు తీసుకోనే అవకాశం లేకపోవడం, ఇతరత్ర సమస్యలు కారణంగా గొంతులో కఫం పేరుకుని ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు ఆయుర్వేద నిపుణుల నవీన్ నడిమింటి. వీటిని వృద్ధులే కాక ఎవ్వరైనా వాడొచ్చని అంటున్నారు. గొంతు కఫాన్ని నివారించే మార్గం.. ఆయుర్వేదిక్ షాప్ లో మాసికాయ అని ఉంటుంది. అది తీసుకువచ్చి బుగ్గని పెట్టి చప్పరిస్తూ ఉంటే ఆ రసం మన కడుపులో దిగి కఫం అనేది పూర్తిగా తొలిగిపోతుంది ఈ మాసికాయ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక్కసారి వాడి చూడండి వామాకు, తులసాకు,తమలపాకుని రోజు తిన్న మంచి ఫలితం ఉంటుంది. మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి. ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి. రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. ఐతే వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి. --ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: మీనియర్స్ డిసీజ్ అంటే..!) -
తుమ్ము వస్తే.. ఆపుకుంటున్నారా!ఇక అంతే సంగతులు
తుమ్ములు రావడం సర్వసాధారణం. కొంతమంది త్ముమ్మడానికి సిగ్గుపడి ఆపుకుంటుంటారు. మీటింగ్ సమయంలో లేదా ఏదైనా సీరియస్ కార్యక్రమంలో చాలామంది తుమ్ము వస్తున్నా ఏదోలా ఆపేస్తారు. ఇలా ఆపడం వల్ల ఒక్కొసారి ప్రాణాంతకం అవుతుంది. ముక్కు నరాలు చిట్లడం వంటివి జరగుతాయి కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చేసి ఏకంగా గొంతునే కోల్పోయాడు. అసలు తమ్మును ఆపొచ్చా! ఆపితే ఇక అంతేనా!..దాని గురించే ఈ కథనం. 34 ఏళ్ల బ్రిటీష్ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మేందుకు సిగ్గుపడి నాసికా రంధ్రాలను గట్టిగా అదిమి, నోటిని కూడా మూసేశాడు. దీంతో ఒక్కసారిగా ముక్కు లేదా నోటి నుంచి గాలి వెళ్లే మార్గం లేక గాలి బుడగల రూపంలో ఛాతిపై ఒత్తిడి చూపడంతో మెడ చుట్టు ఉన్న నరాలు పొంగి పగలిపోయే స్థితికి వచ్చేశాయి. ఆ తర్వాత గొంతులో రంధ్రం ఏర్పడి ఇక మింగే అవకాశం లేకుండా పోయింది. ఇక నెమ్మది నెమ్మదిగా స్వరాన్ని కూడా కోల్పోయాడు. గొంతులో రంధ్రం ఎలా ఏర్పడిందంటే.. గొంతులో ఉండే ఫారింక్స్ అంత సులభంగా చీలిపోదు. పదేపదే వాంతులు, దగ్గు లేదా బాహ్య గాయం కారణంగా మాత్రమే చీలీపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి విషయంలో గాలి బయటకు వెళ్లే మార్గం లేక గాలి బుడగలు అతని ఛాతీలోని కణజాలం, కండరాలలో స్థిరపడటం ప్రారంభించాయి. దీంతో మెడ అంతటా పాపింగ్, పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు వైద్యులు. ఇది తమకే చాలా షాకింగ్ అనిపించిందన్నారు. గొంతులోని పక్కటెముక నొప్పితో పాటు అతని గొంతు ప్రాంతంలో ఇన్ఫెక్షన్ కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం అతనికి ఫీడింగ్ ట్యూబ్ ఏర్పాటు చేశామని, దాని సాయంతో ఆహారం తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. యాంటీబయోటిక్స్ మందులతో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడని అన్నారు వైద్యులు. Em caso raro, homem rompe garganta e tem dificuldade para falar após segurar espirro https://t.co/KyYpmX91A0 #G1 pic.twitter.com/7h9ApBJUvW — g1 (@g1) January 16, 2018 అసలు ఎందుకు తుమ్ము వస్తుందంటే.. ధూళి, పుప్పొడి, పోగ వంటి ఇతరత్ర కణాలు నాసికా రంధ్రంలోకి ప్రవేశించి చికాకు కలిగించడంతో తుమ్ము రావడం జరుగుతుంది. ముక్కులోని డెస్ట్ క్లియర్ చేసేందుకు శరీర ధర్మంగా వచ్చేదే ఈ తుమ్ము అని వైద్యులు చెబుతున్నారు. ఇది ముక్కుకి బాక్టీరియా, బగ్‌ల దాడి నుంచి రక్షణ ఇచ్చే ఒక సాధనం లాంటిది. మనం తుమ్మగానే కొద్దిపాటి తేమతో కూడిని గాలి బయటకు బలంగా వస్తుంది. దీని వల్ల గాల్లోకి సూక్ష్మ జీవులు ఈజీగా రిలీజ్ అవుతాయి. దీని కారణంగానే ఫ్లూ వంటి కొన్ని రకాల అంటువ్యాధులు ఈజీగా వ్యాప్తి చెందుతాయి. అందుకే కాస్త చేయి అడ్డుపెట్టుకుని తుమ్మండి అని చెబుతుంటారు. అదేపనిగా వచ్చే తుమ్ములతో చాలా ఇబ్బంది ఉంటుంది. కొన్ని రకాల సీజన్లలో మరి ఎక్కువగా ఉంటుంది. గట్టిగా తుమ్మితే ఒక్కొసారి ముక్కు నుంచి రక్తం కారడం కూడా జరగుతుంది. చాలావరకు తుమ్ములు ఆందోళన కలిగించేవి కాకపోయిన తుమ్మును ఆపుకోకుండా ఉంటేనే మంచిదంటున్నారు వైద్యులు. తుమ్ము అనేది మానవ శరీర ధర్మం. గనుక పదిమందిలో తుమ్మేందుకు సిగ్గుపడి, లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవద్దు అని అంటున్నారు వైద్యులు. ఇది అందరికీ కామన్ కాబట్టి లేనిపోని రిస్క్‌లు కొని తెచ్చుకోకండి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: కడుపులో కణితి.. ఇలాంటివి ప్రాణాంతకమా? కాదా?) -
చిన్నారి ప్రాణం తీసిన పునుగులు.. ఆసుపత్రికి తరలించేలోపే
సాక్షి, సిరిసిల్ల: ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వారి ఇంటి దీపం ఆరిపోయేలా చేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ ఉసురుతీసింది. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం కేంద్రంలో క్రాంతి కుమార్ అనే 13 నెలల బాలుడు మృతి చెందాడు. గొంతులో పునుగులు ఇరుక్కోవడంతో అతడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, శ్వాస ఆడకపోవడంతో అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన క్రాంతి.. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు. కొమురం భీమ్ జిల్లా కౌటాల మండలం వెల్డండి గ్రామానికి చెందిన మారుతి, కవితల సంతానం క్రాంతి కుమార్. రెండేళ్ల నుంచి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వివాహేతర సంబంధం.. నిర్జన ప్రదేశానికి పిలిచి.. కత్తితో..
కర్ణాటకాలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధంపై వచ్చిన కలహాలతో ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతును కోసేశాడు. అనంతరం బాధితుని గొంతు నుంచి రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితున్ని విజయ్‌గా గుర్తించారు. నిందితుడు మరేశ్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పలుమార్లు తగాదా కూడా జరిగింది. ఆ అంశంపై చర్చించడానికి బాధితున్ని విజయ్ నిర్జన ప్రదేశానికి పిలిచాడు. వాగ్వాదంలో విచక్షణ కోల్పోయిన నిందితుడు.. మరేశ్ గొంతును కత్తిరించాడు. అనంతరం పక్కనే కూర్చుని రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఓ బాటసారి వీడియో తీసి పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: కారు పార్క్ చేసిన మహిళ.. ఒక్కసారిగా వరద రావడంతో.. -
Medak: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మహిళ మృతి
సాక్షి, మెదక్ : చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన సంతోషి(30) అనే మహిళ కూలి పనుల కోసం వలస వచ్చింది. ముసాయిపేట్ మండలం కొప్పులపల్లి గ్రామ శివారులో ని ఇటుక బట్టీలలో పని చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం తూప్రాన్ సంతకు వెళ్లిన మహిళ.. మద్యం సేవించి ఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లో చికెన్ వండుకుని తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు -
కావలిలో దారుణం.. చిన్నారి గొంతు కోసిన సైకో
కావలి రూరల్(నెల్లూరు జిల్లా): పాఠశాల నుంచి ఇంటికి వచ్చి ఆడుకుంటున్న మూడో తరగతి బాలిక (8)ను గంజాయి మత్తులో ఖాదర్‌బాషా (30) అనే వ్యక్తి గొంతు కోసిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో కలకలం రేపింది. గురువారం రెండో పట్టణ ఎస్సై మాల్యాద్రి తెలిపిన వివరాల మేరకు.. కావలి వెంగళరావునగర్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. బాలిక తండ్రి కొయ్య పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలిద్దరినీ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఈ క్రమంలో మూడో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె పాఠశాల నుంచి వచ్చాక ఇంటి ముందు ఆడుకుంటోంది. ఇదే సమయంలో గంజాయి మత్తులో ఉన్న తుఫాన్‌నగర్‌కు చెందిన ఖాదర్‌బాషా అటుగా వెళుతూ బాలికను పిలిచి బ్లేడ్‌తో కిరాతకంగా గొంతుకోశాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పరుగున బయటకు వచ్చి చూశారు. చికిత్స నిమిత్తం బాలికను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. అక్కడే ఉన్న నిందితుడు ఖాదర్‌బాషా తానే బాలిక గొంతు కోశానని తల్లిదండ్రులకు చెప్పి పరారవుతుండడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మాల్యాద్రి తెలిపారు. కాగా బాలికకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఆమె గొంతుకు కట్లు వేసి ఇంటికి పంపారు. చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది! -
మెడలో గుచ్చుకున్న త్రిశూలం.. అలాగే 65 కి.మీ. ప్రయాణించి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మెడలోకి గుచ్చుకున్న త్రిశూలంతో ఓ వ్యక్తి ఏకంగా 65 కిలోమీటర్లు ప్రయాణించాడు. కళ్యాణి ప్రాంతానికి చెందిన భాస్కర్ రామ్‌కు గత వారం కోల్‌కతాలోని నీలరతన్ సర్కార్ మెడికల్ కాలేజీలో అత్యవసర శస్త్ర చికిత్స జరిగింది. మెడకు త్రిశూలం గుచ్చుకున్న ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో త్రిశూలం వ్యక్తి మెడకు కుడివైపు నుంచి గుచ్చుకొని ఎడమ వైపుకు బయటకు దిగింది. గొంతు దగ్గర ఇరుక్కుపోయిన త్రిశూలాన్ని బయటకు తీసేందుకు అతను కళ్యాణి ప్రాంతం నుంచి కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీకి 65 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. గొంతు దగ్గర చిక్కుకున్న త్రిశూలంతో యువకుడు నవంబర్ 28 తెల్లవారుజామున తమ వద్దకు వచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 30 సెంటిమీటర్ల పొడవున్న త్రిశూలం గుచ్చుకొని, మెడపై రక్తం కారుతున్న స్థితిలో రామ్‌ని చూసిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు పేర్కొన్నారు. అయితే భాస్కర్ రామ్ ప్రాణాలతో బయటపడడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్రిశూలం శరీర అవయవాలు, సిరలు,ధమనులను డ్యామెజ్ చేయకపోవడంతో ఈ కేసు మెడికల్ వండర్‌గా భావిస్తున్నారు. అంతర్గతంగా కూడా పెద్దగా నష్టం జరగలేదని వైద్యులు తెలిపారు. కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు త్రిశూలాన్ని తొలగించేందుకు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. కంటి-ముక్కు-గొంతు(ఈఎన్టీ)స్పెషలిస్ట్ డాక్టర్,అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ప్రణబాసిస్ బంద్యోపాధ్యాయ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. కొన్ని గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో చివరకు రోగి మెడ నుంచి త్రిశూలాన్ని తొలగించారు. గాయంతో అంత దూరం ప్రయాణం చేసినప్పటికీ రామ్ తనకు ఎలాంటి నొప్పి లేదని చెప్పాడని వైద్యులు వెల్లడించారు. అంతేగాక ఆపరేషన్ ముందు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాధితుడికి త్రిశూలం ఎలా గుచ్చుకుందనే దానిపై స్పష్టత లేదు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ త్రిశూలాన్ని శ్రీ రామ్ తన ఇంట్లోని దేవుని బలిపీఠంపై ఉంచారని, తరతరాలుగా ఈ చారిత్రక త్రిశూలాన్ని పూజిస్తూ వస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ వ్యక్తితో భాస్కర్ రామ్‌కు చిన్న వాగ్వాదం జరిగిందని, దీంతో అతడు త్రిశూలంతో దాడి చేయడంతో భాస్కర్ రామ్ మెడ వెనుక భాగంలో గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆప్‌కు ఎదురుదెబ్బ.. స్పందించిన కేజ్రీవాల్ -
వరంగల్‌లో విషాదం.. బాలుడిని చంపేసిన ‘చాక్లెట్’
సాక్షి, వరంగల్ జిల్లా: చాక్లెట్ గొంతులో ఇరుక్కుని వరంగల్ జిల్లాలో ఓ బాలుడు మరణించాడు. కంగర్‌సింగ్ తన ఎనిమిదేళ్ల కుమారుడు సందీప్‌ను స్కూల్ దగ్గర దించి.. ఇటీవలే విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్ ఇచ్చాడు. సందీప్ చాక్లెట్ తీసుకుని పాఠశాల మొదటి అంతస్తులోని తన తరగతి గదికి వెళ్లాడు. చాక్లెట్ తింటూ క్లాస్‌రూమ్‌లోనే సృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం తండ్రికి సమాచారం అందించడంతో కంగర్ సింగ్ స్కూల్‌కు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న సందీప్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేదు. ఊపిరి అందక సందీప్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్ వరంగల్‌లో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్ షాపును ఆయన నిర్వహిస్తున్నారు. చదవండి: క్యాన్సర్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? ఎవరికి మేలు.. -
ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఆవకాయ పచ్చడి అంటే నోరూరని వారు ఎవరుంటారు. అలాంటి ఆవకాయ పచ్చడి ఒక మహిళను ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. అసలేం జరిగిందంటే....ఇంగ్లాండ్‌కి చెందిన 57 ఏళ్ల మహిళ ఆవకాయ పచ్చడి వేసుకుని తింటున్నప్పుడూ పొరపాటున ఆవకాయ బద్ద గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె హుటాహుటినా ఇంగ్లాంగ్లోని ఎప్పమ్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులకు అసలు విషయం చెప్పి తాను తినలేకపోతున్నాను, మింగలేకపోతున్నానని వివరించింది. ఐతే వైద్యలు ఒక మెత్తని ఫ్రూట్ ఎలా ఇరుక్కుంటుందని కొట్టిపారేశారు. కానీ ఆ మహిళ తనకు చాలా ఇబ్బందిగా ఉందనడంతో.. ఆమెను పరీక్షించి చొంగకార్చుకునే అలావాటు ఉందని అందువల్ల మింగ లేకపోతుందని తేల్చి చెప్పారు. గొంతులో ఎలాంటిది ఇరుక్కోలేదని, గ్యాస్టిక్ సమస్య ఉన్నా ఇలానే ఉంటుందని అన్నారు వైద్యులు. ఒకవేళ నొప్పి మరింత ఎక్కువగా ఉంటే రమ్మని చెప్పి ఆ మహిళను పంపించేశారు. ఆ తర్వాత సదరు మహిళ కేవలం నాలుగు రోజుల్లో మళ్లీ ఆస్పత్రికి వచ్చి జాయిన్ అయ్యింది. ఈసారి ఆమె మరింత నొప్పితో మాట్లాడలేని స్థితికి చేరుకుంది. దీంతో వైద్యులు వెంటనే సీటీ స్కాన్‌చేసి చూడగా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎందుకంటే స్కానింగ్‌లో ఆవకాయబద్ద గొంతులో గుచ్చుకోవడంతో అన్నవాహికలో నీరు చేరడం, ఛాతీలో గాలి ఉండటం వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి గొంతులో ఇరుక్కున్న ఆవకాయబద్దను తొలగించారు. ఒక వారంపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండి చికిత్స తీసుకుంది. ఐతే ఆమె ఈ విషయమై ఆస్పత్రి ట్రస్ట్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో ట్రస్ట్ ఎలాంటి పళ్లు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలో వివరంగా ఒక జాబితా ఇవ్వాలని సదరు ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. ఇది చాలా హాస్యస్పదమైన విషయం, ఎందుకంటే ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా సంభవించేవి అని డాక్టర్ రిచర్డ్ జెన్నింగ్స్ అన్నారు. సాధారణంగా మాంసం తింటే అందులోని ఎముకలు గట్టిగా ఉంటాయి కాబట్టి గుచ్చుకోవడం లేదా ఇరుక్కునే అవకాశం ఉంటుందని చెప్పగలం గానీ ఫలానా పండు వల్ల ఇలా జరుగుతుందని ఎలా చెప్పగలం అని అన్నారు. (చదవండి: చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష) -
బంజారాహిల్స్: గొంతులోకి జారిన స్పూన్.. తీవ్రగాయమై చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: నోట్లొ స్పూన్ పెట్టుకొని ఆడుకుంటున్న చిన్నారికి ప్రమాదవశాత్తు స్పూన్ కొన గొంతును కోయడంతో తీవ్రంగా రక్తస్రావమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్లో నివసించే రవికుమార్‌కు రాజేష్‌కుమార్(2), అనిరుధ్ (అయిదు నెలలు) అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు రాజేష్‌కు చిన్నప్పటి నుంచి విటమిన్ “కే’తో బాధపడుతూ తీవ్రమైన వ్యాధిని ఎదుర్కొంటున్నారు. ఈ నెల 18వ తేదీన రాజేష్ ఓ టేబుల్ స్పూన్‌ను నోట్లో పెట్టుకొని ఆడుకుంటుండగా దాని కొసభాగం గొంతు ప్రాంతంలో కోసుకుపోయి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. వెంటనే తండ్రి నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉల్లి ముక్క.. ఆపస్మారక స్థితిలో..
హిందూపురం(అనంతపురం జిల్లా): 9 నెలలో చిన్నారి గొంతులో ఉల్లి ఇరుక్కుపోయి ఊపిరాడకుండా చేసింది. తల్లిదండ్రులకు కొన్ని గంటలపాటు ప్రాణాలు నిలవకుండా చేసింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చాకచక్యంగా ఉల్లి ముక్కను తొలగించడంతో ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. రొద్దం మండలం కలిపి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు (9 నెలల చిన్నారి) శనివారం ఆడుకుంటూ ఉల్లిపాయ ముక్కను మింగేశాడు. చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య అది గొంతులో అడ్డుపడి ఊపిరి ఆడకపోవడంతో పిల్లాడు ఆపస్మారకస్థితిలో పడిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన పట్టణానికి చేరుకుని పలు ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లినా చేరి్పంచుకోలేదు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, సూపరింటెండెంట్ డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో డాక్టర్లు అమరేష్, వెంకట రమణనాయక్, వాహిద్ పిల్లాడికి చికిత్స నిర్వహించారు. ఉల్లి ముక్కను బయటకు తీశారు. తమ బిడ్డకు ఏమౌతుందోనని అప్పటివరకూ తల్లడిల్లిన హృదయాలు దీంతో ఉపశమన పొందాయి. తమ ఇంట ఉగాది సంతోషం నింపారంటూ డాక్టర్లు, వైద్యసిబ్బంది రాజు, నిర్మలమ్మ, సత్తి, తదితరులకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
బాలుడిని బలి తీసుకున్న కొబ్బరి ముక్క
చెన్నై: గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని మూడున్నరేళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పొన్నేరి సమీపంలోని పాక్కం గ్రామానికి చెందిన వసంత్‌కు మూడు న్నరేళ్ల కొడుకు సంజీశ్వరన్ ఉన్నాడు. ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని ముక్కలు చేసి ఉంచారు. అక్కడే ఆడుకుంటున్న సంజీశ్వరన్ ఆ కొబ్బరి ముక్కలను తిన్నాడు. అవి గొంతులో ఇరుక్కుపోవడంతో స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపాలైవనం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నాడు. -
తలనొప్పి, గొంతులో గరగరా? అయితే వెంటనే..
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారిగా తలనొప్పా?.. లేక గొంతులో గరగరా?.. లక్షణం ఏదైతేనేం వెంటనే కోవిడ్ పరీక్ష చేయించండి. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి అత్యంత వేగంగా జరుగుతోంది. ఈ వేరియంట్‌తో చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదు. అదలా ఉంచితే.. లక్షణాలు ఉన్న వారు వెంటనే పరీక్ష చేయించి జాగ్రత్తలు పాటించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. ప్రస్తుతం మూడో దశ కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. ఒమిక్రాన్ సోకితే ఒకట్రెండు రోజుల్లోనే ఒక్కసారిగా తలనొప్పి రావడం, గొంతులో గరగర అనిపించడం, తీవ్ర ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైలక్షణాలతో పాటు జ్వరం వచ్చిన వారిలో ఎక్కువ మంది పాజిటివ్‌గా తేలడం గమనార్హం. పాజిటివ్‌గా తేలితే జాగ్రత్తలివే.... ప్రస్తుతం కోవిడ్ సోకినట్లు పరీక్షలో నిర్ధారిస్తే వెం టనే ఐసోలేషన్‌కు వెళ్లిపోవాలి. ప్రత్యేక గదిలో వారం రోజుల పాటు ఉండాలి. బాధితుడికి ఉన్న లక్షణాల ఆధారంగా వైద్యులు సూచించిన మేర మందులు వేసుకోవాలి. మూడు పూటలా పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. కోవిడ్ సోకిన వ్యక్తితో పాటు సేవలందించే కుటుంబ సభ్యులు కూడా ఎన్–95 మాస్కు ధరించాలి. ప్రస్తుత సీజన్ లో వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తిలో సగటున ఒక రోజు నుంచి మూడు రోజుల్లో లక్షణాలు బయటపడుతున్నాయి. ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం, గొం తులో గరగర లాంటి లక్షణాలు 2,3 రోజులు ఉం టుండగా... జ్వరం, తలనొప్పి లక్షణాలు మాత్రం ఒక రోజులోనే తగ్గుముఖం పడుతున్నాయి. ♦లక్షణాలు లేని వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. ♦ఇక కోవిడ్ వ్యాప్తి చెందిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన 60 ఏళ్లు పైబడిన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్లు తప్పక నిర్ధారణ పరీక్ష చేయించాలి. ♦డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన సమయంలో వైరస్ సోకిన వ్యక్తికి నాలుగు నుంచి ఐదు రోజుల్లో లక్షణాలు బహిర్గతం కాగా... ఇప్పుడు ఒకరోజు నుంచి మూడు రోజుల్లో బయటపడుతున్నాయి. రెండోసారి పరీక్ష అవసరం లేదు.. కోవిడ్ వచ్చిన తర్వాత ఐసోలేషన్‌లో 7 రోజులు ఉండాలి. ఎనిమిదో రోజు ఎలాంటి నిర్ధారణ పరీక్షలు లేకుండా సాధారణ స్థితికి వచ్చి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఎన్–95 మాస్కులు ముక్కు, నోరు కవర్ అయ్యేలా ధరించడం మంచిది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి. గుమిగూడే ప్రదేశాల నుంచి దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు వాడటంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల -
గొంతులో ఏదైనా ఇరుక్కుపోయిందా? పొరబోయిందా?
పలకాబలపాలతో బడికి పోయే వయసులోనూ, అంతకంటే చిన్నప్పుడు ఆడుకునే ఈడులో తెలిసీతెలియక చేసే పనులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు... కొందరు చిన్నారులు ముక్కులో బలపం/చిన్నచాక్పీస్/చిన్న పెన్సిల్ వంటివి పెట్టుకుని, అది లోనికి వెళ్లేలా పీల్చడం లాంటి పనులు చేస్తుంటారు. మరికొందరు నాణేలను నోట్లో పెట్టుకుని మింగడం వల్ల అవి గొంతులో ఇరుక్కుని బాధపడుతుంటారు. గొంతులో ఇరుక్కునే చిన్నవస్తువులు ఇంకా ఎన్నో! ఆహారం అలా ఇరుక్కుంటే పొరబోయిందంటూ మన ఇళ్లలోని పెద్దలు అంటుంటారు. అలా జరిగినప్పుడు కాసేపు బాధగా ఉండి... అది బయటకు తన్నేసినట్లుగా ఒక్కోసారి ముక్కులోంచి కూడా వస్తుంటుంది. ఇలా గొంతులో బయటి వస్తువులు ఇరుక్కున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ప్రథమచికిత్సలను తెలుసుకుందాం. ముక్కు... నోరు... ఈ రెండింటికీ కొంత దూరం. కానీ గొంతులో రెండిటి మార్గం కాసేపు ఒకటే. ఆ తర్వాత గాలి... విండ్‌పైప్ ద్వారా ఊపిరితిత్తుల్లోకీ, ఆహారం ఫుడ్‌పైప్ ద్వారా కడుపులోకి వెళ్తుంది. గొంతులో గ్లాటిస్ అనే చోట ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన విండ్‌పైప్, ఆహారం తీసుకెళ్లే ఈసోఫేగస్ ఈ రెండూ మార్గాలూ ఒకేచోట ఉంటాయి. అయితే... ఇక్కడే ఎపిగ్లాటిస్ అనే పొర ఉండి... మనం గాలిని పీల్చుకుంటున్న సమయంలో విండ్‌పైప్ మాత్రమే తెరచి ఉండేలా చూసి... ఆహారనాళాన్ని మూసి ఉంచుతుంది. అలాగే ఆహారాన్ని మింగుతున్నప్పుడు ఆహారనాళమే తెరచి ఉండేలా చూసి, విండ్‌పైప్‌ను మూసేస్తుంది. (చదవండి: బరువు తగ్గడానికి పాలు ఒక గొప్ప మార్గం...) అయితే ఒక్కోసారి మనం ప్రధానంగా నీళ్లూ లేదా ద్రవాహారాలు (కొన్నిసార్లు అన్నం వంటి ఘనాహారాలు కూడా) తీసుకునే సమయంలో అవి పొరబాటున విండ్వైప్లోకి వెళ్లిపోతాయి. దాంతో ఓ రక్షణాత్మకమైన చర్యలా... ఊపిరితిత్తుల్లోంచి గాలి ఫోర్స్‌గా బయటకు చిమ్ముకొచ్చినట్లుగా వస్తూ... ఆ పదార్థాలను బలంగా బయటికి నెట్టేస్తుంది. అలాగే చిన్నపిల్లలు తమ గొంతులో ఉండే పైప్ కంటే పెద్ద సైజులో ఉండే వస్తువులను తీసుకున్నప్పుడు అవి గొంతులోకి ఇరుక్కుపోతాయి. అప్పుడూ బలంగా దగ్గు, గాలి వచ్చినా... ఆ ఘన పదార్థలు గట్టిగా ఉండటంతో బయటకు నెట్టలేకపోతాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... గొంతులో ఇరుక్కోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► నాలుగేళ్ల లోపు పిల్లలకు పెద్ద క్యారట్ ముక్కలు, పెద్దగా ఉండే నట్స్, బాగా గట్టిగా ఉండే చాక్లెట్లు, పెద్ద గింజలుండే పండ్లను పెట్టకూడదు. ఒకవేళ తినిపిస్తే... వాటిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేశాక మాత్రమే ఇవ్వాలి లేదా క్యారట్ వంటి వాటిని తురిమి ఇవ్వాలి. వాటిని మెత్తగా నమిలి తినమని పిల్లలకు చెప్పాలి. ► చిన్నపిల్లల చేతికి ఏవైనా బొమ్మలు ఇచ్చినప్పుడు వాటిని పిల్లలు విరగొట్టడం చాలా సాధారణం. ఒకవేళ అలా జరిగినా వాటి విడిభాగాలు నోట్లోకి ప్రవేశించేంత చిన్నవిగా ఉండని బొమ్మలనే ఇవ్వాలి. అంటే వాటి విడిభాగాలు నోట్లోకి దూరనంత పెద్దగా ఉండాలన్నమాట. చిన్న చిన్న పూసల్లాంటి విడిభాగాలతో ఉండే బొమ్మలను పిల్లలకు ఇవ్వడం సరికాదు. అలాంటి వాటితో పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దలు తప్పకుండా పక్కనే ఉండాలి. (గీరిన ముద్రలు మీ చర్మంపై ఉన్నాయా... అయితే ఇలా చేయండి!) ► పిల్లల ఉయ్యాలపై వేలాడదీసే రంగులరాట్నం వంటి బొమ్మలు వాళ్ల చేతికి అందనంత ఎత్తులో అమర్చాలి. ► పిల్లలు బెలూన్ ఊదేటప్పుడు పక్కన పెద్దలు తప్పక ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ► చిన్నారులు తమ మెడలోని చైన్లను నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉన్నందున... బాగా సన్నటి చైన్లను, నెక్లేస్లను పిల్లల మెడలో వేయకూడదు. ► చిన్న పిల్లలు ఆడుకోడానికి నాణేలు, కాసులు ఇవ్వడం సరికాదు. గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి.. ► ఏదైనా వస్తువు మింగిన చిన్నారి బాగా గట్టిగా దగ్గుతున్నా / గట్టిగా ఏడుస్తున్నా / మాట్లాడగలుగుతున్నా వారికి అడ్డు చెప్పకండి. గట్టిగా దగ్గడం వల్లనే మింగిన వస్తువులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ► పిల్లలు చాలా బలహీనంగా దగ్గుతున్నా / ఊపిరితీస్తున్నప్పుడు సన్నటి శబ్దం వస్తున్నా / ఏడుపుగాని, మాటగాని, గొంతులోంచి వచ్చే శబ్దంగాని చాలా బలహీనంగా ఉన్నా... వారు మింగిన వస్తువు గొంతులో బలంగా ఇరుక్కుపోయిందని తెలుసుకోవాలి. వస్తువు మింగిన చిన్నారి వయసు ఏడాదికి పైబడి ఉన్నప్పుడు వారికి ‘హీమ్లిచ్ మెనోవర్’ అనే ప్రథమ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఏడాది లోపు పిల్లలకు... ► మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టిప్పుడు చిన్నారి తల కిందివైపునకు ఉండేలా చూడాలి. చేతులతో వీపుపై అకస్మాత్తుగా, బలంగా ఒత్తిడి కలిగించాలి. ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను నడుము భాగం నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలించాలి. మన కాళ్ల ఒత్తిడికీ, చేతుల ఒత్తిడికీ పిల్లల పొట్ట ముడుచుకుపోవడం వల్ల... ఇరుక్కున్న వస్తువు పైకి ఎగబాకి, బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మనం కలిగించే ఒత్తిడి పిల్లలను గాయపరచనంత మృదువుగా మాత్రమే ఉండాలి. ► చిన్నారులు ఏదైనా వస్తువు మింగినప్పుడు వాళ్ల పొట్టపై రుద్దకూడదు. దానివల్ల పొట్టలోపల గాయాలయ్యే అవకాశం ఉంది. ► ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వనప్పుడు చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ► మింగిన వస్తువు పిల్లల నోటి నుంచి బయటకు వచ్చే వరకు తినడానికి గాని, తాగడానికి గాని ఏమీ ఇవ్వవద్దు. తలపై తట్టకండి... ► గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొర పోయిందని, ఎవరో తలచుకుంటున్నారని అంటుంటారు. మనం తిన్న ఆహారం కిందికి కదలడానికి వీలుగా తలపై తడుతుంటారు. అయితే ఆ ఆహారం... కడుపులోకి దారితీసే ఆహార నాళంలోకి కాకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన వాయునాళంలోకి పోతే ప్రమాదం. కాబట్టి ఆ ఆహారం బయటకు రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలి. గొంతులోకి రాగానే ఊసేయమని చెప్పాలి. అంతే తప్ప తలపై తట్టకూడదు. ► గొంతుకు ఏదైనా అడ్డం పడిందేమోనని అనుమానించినప్పుడు పిల్లలు తమ నాలుకను బాగా చాపేలా ప్రోత్సహించి, వేళ్లను గొంతులోకి పోనిచ్చి మన స్పర్శకు ఏవైనా తగులుతున్నాయేమో చూడాలి. వేళ్లకు ఏదైనా తగులుతుంటే మునివేళ్లతో వాటిని బయటకు తీసేయాలి. ఎలా తీస్తారు? ► పిల్లలు సహకరిస్తే... డాక్టర్లు లారింగోస్కోప్తో గొంతులో ఇరుక్కున్న పదార్థాన్ని తీసివేస్తారు. ఒకవేళ సహకరించకపోతే వారికి అనస్థటిక్ డాక్టర్ సహకారంతో కొద్దిగా మత్తు ఇచ్చి తొలగివంచవచ్చు. ► లారింగోస్కోప్ చేసి బల్బ్ ఉన్న ఎండోట్రాకియల్ ట్యూబ్ అనే దాని సహాయంతోగానీ లేదా బ్రాంకోస్కోప్ అనే పరికరం సహాయంతగానీ ఇరుక్కున్నదాన్ని తీసివేయవచ్చు. హీమ్లిచ్ మెనోవర్ ఎలా? ► గొంతులో ఏదైనా ఇరుక్కుని బాధ పడుతున్నప్పుడు చిన్నారి వెనకవైపున మనం నిల్చోవాలి. మన రెండు చేతులను పిల్లల పొట్ట చుట్టూ బిగించి అకస్మాత్తుగా పట్టుబిగిస్తున్నట్లుగా ఠక్కున కదిలించాలి. క్రమంగా ఆ పట్టును... పొట్టపై కింది భాగం నుంచి పై వైపునకు కదల్చాలి. ఇలా చేయడం వల్ల పొట్టలోపల ఒత్తిడి పెరిగి, అది క్రమంగా పైభాగానికి కదిలి అడ్డుపడిన పదార్థాన్ని బయటకు నేట్టేసే అవకాశం ఉంటుంది. దీన్నే హీమ్లిచ్ మెనోవర్ అంటారు. - డాక్టర్ జి. గంగాధర్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, విజయవాడ. -
పెళ్లి చేసుకోమని అడిగినందుకు... గొంతు కోసి చంపేశాడు!
Man slit Paramours Throat : అక్రమ సంబంధాలు కారణంగా ఎన్ని కుటుంబాలు నాశన మవుతున్నాయో మనం చూస్తునే ఉన్నాం. కానీ వివాహేతర సంబంధాలు కారణంగా వారి సంతానం తప్పుదోవలో ప్రయాణించి జీవితాలను బలి చేసుకున్న ఉదంతాలు కోకొల్లలు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అచ్చం అలానే ఒక వితంతువు వివాహేతర సంబంధం కారణంగా అసువులు బాసింది. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!! అసలు విషయంలోకెళ్లితే...లందాపురా గ్రామ సమీపంలో హంస పర్మార్ (32) అనే వితంతువు శైలేష్ వాఘేలా అనే వివాహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆమె తనను పెళ్లి చేసుకోమని వాఘేలాని ఒత్తిడి చేస్తుంది. ఈ మేరకు వాఘేలాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండటంతో అందుకు అంగీకరించ లేదు. ఈ క్రమంలో ఆమె వాఘెలా పై మరింతగా తనను పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో వాఘేలా కాలువ వద్ద కలుద్దాం అని పర్మార్‌ని పిలిచి గొంతు కోసి చంపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు స్థానికులు సావ్లి తాలూకాలోని కాలువ సమీపంలో ఒక మహిళ హత్యకు గురైందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక నిందుతుడు మంజుసర్ నివాసి శైలేష్ వాఘేలాగా గుర్తించి అరెస్టు చేశారు. (చదవండి: రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!) -
ప్రేమించలేదని బాలిక గొంతు కోసేశాడు
సాక్షి, సూర్యాపేట: ప్రేమించలేదని ఓ దుండగుడు బాలిక గొంత కోసిన దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నేరెడుచర్లలో ఓ బాలికతో తనను ప్రేమిస్తున్నట్లు బాల సైదులు అనే వ్యక్తి తెలిపాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో గత కొంత కాలంగా ప్రేమ పేరుతో తనని వేధిస్తూ వచ్చాడు. ఎంతకీ తాను ఒప్పుకోలేదనే కోపంతో బాలిక గొంతు కోసేశాడు. ఈ ఘటన అరబిందో కాలేజ్ సమీపంలో జరిగింది. దాడిలో బాలికకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం.. -
ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కొని
మైసూరు: కాయిన్ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని ఆయురహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ (4) తన అవ్వ ఇంటి వద్ద ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్‌ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. చదవండి: ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏం జరిగిందంటే? చదవండి: వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు -
చాక్లెట్ అనుకుని గణేశ్ విగ్రహాన్ని మింగేసింది..
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): చాక్లెట్ అనుకుందో ఏమో ఓ చిన్నారి చిన్నపాటి గణేశ్ విగ్రహాన్ని మింగేసింది. తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారి ప్రాణపాయం నుంచి తప్పించుకుంది. బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ ప్రాంతంలో ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో చిన్నపాటి వినాయక విగ్రహం కనిపించకపోవడంతో అనుమానం తలెత్తింది. వెంటనే తమ మూడేళ్ల చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్సరే తీసి పొట్టలో లోహపు విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఎండోస్కోపి ద్వారా చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేకుండా విగ్రహాన్ని బయటికి తీశారు. తల్లిని తరిమేసిన కసాయి మండ్య: ఆస్తి కోసం తన రెండో కుమారుడు దౌర్జన్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని కేఆర్ పేట తాలూకా ఆనేగోళ గ్రామానికి చెందిన కమలమ్మ మీడియా ముందు మొరపెట్టుకుంది. తన భర్త బతికుండగా రెండో కుమారుడు మంజునాథ్‌కు ఇంటి ముందు ఉన్న స్థలాన్ని రాసిచ్చాడని, అయినా ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూడా ఇవ్వాలని దౌర్జన్యం చేసి తనను గెంటేశాడని బోరున విలపించింది. -
గొంతు కోసిన భర్త.. కనికరించిన భార్య
యడ్లపాడు (చిలకలూరిపేట): క్షణికావేశంలో ఓ యువకుడు తన భార్య గొంతును బ్లేడ్‌తో కోసిన ఘటన మండలంలోని బోయపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫోపుల్ గనున్, రీటా దంపతులు కొద్దికాలం కిందట మండలానికి వలస వచ్చారు. బోయ పాలెం గ్రామంలోని ఓ నూలుమిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం వివాహమైన వారి మధ్య ఇటీవల కలహాలు మొదలయ్యాయి. తనను లెక్కచేయడం లేదన్న అక్కసుతో గనున్ భార్య రీటాపై ఆదివారం బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. స్థానికులు గమనించి అతన్ని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. యడ్లపాడు ఎస్ఐ పైడి రాంబాబు సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి బాధితురాలు రీటాను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంత జరిగినా తన భర్తపై ఫిర్యాదు చేయనని, స్టేషన్‌కు తీసుకెళ్లకుండా అతడిని విడిచి పెట్టాలని ఎస్ఐను రీటా కోరడం గమనార్హం. చదవండి: టీడీపీ నేతల దాడి: ఇద్దరి పరిస్థితి విషమం కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరితే ఇల్లు దోచేశారు