Married Man Killed Widow Woman, After She Forces Him To Marry Her In Gujarat - Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోమని అడిగినందుకు... గొంతు కోసి చంపేశాడు!

Published Mon, Dec 13 2021 11:37 AM | Last Updated on Mon, Dec 13 2021 1:28 PM

Man slit Paramours Throat After She Pressured Him To Marry Her - Sakshi

Man slit Paramours Throat : అక్రమ సంబంధాలు కారణంగా ఎన్ని కుటుంబాలు నాశన మవుతున్నాయో మనం చూస్తునే ఉన్నాం. కానీ వివాహేతర సంబంధాలు కారణంగా వారి సంతానం తప్పుదోవలో ప్రయాణించి జీవితాలను బలి చేసుకున్న ఉదంతాలు కోకొల్లలు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అచ్చం అలానే ఒక వితంతువు వివాహేతర సంబంధం కారణంగా అసువులు బాసింది.

(చదవండి: పాత కార్లు, సైకిల్‌ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!

అసలు విషయంలోకెళ్లితే...లందాపురా గ్రామ సమీపంలో హంస పర్మార్ (32)  అనే వితంతువు శైలేష్ వాఘేలా అనే వివాహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆమె తనను పెళ్లి చేసుకోమని వాఘేలాని ఒత్తిడి చేస్తుంది. ఈ మేరకు  వాఘేలాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండటంతో అందుకు అంగీకరించ లేదు. ఈ క్రమంలో ఆమె వాఘెలా పై మరింతగా తనను పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తీసుకువచ్చింది.

దీంతో వాఘేలా కాలువ వద్ద కలుద్దాం అని పర్మార్‌ని పిలిచి గొంతు కోసి చంపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు స్థానికులు సావ్లి తాలూకాలోని కాలువ సమీపంలో ఒక మహిళ హత్యకు గురైందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక నిందుతుడు మంజుసర్ నివాసి  శైలేష్ వాఘేలాగా గుర్తించి అరెస్టు చేశారు.

(చదవండి: రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement