ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం

Published Wed, Jan 31 2024 1:18 AM | Last Updated on Wed, Jan 31 2024 12:50 PM

- - Sakshi

రాప్తాడు రూరల్‌: వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం జంబులదిన్నె కొట్టాల నివాసి రాజేష్‌ నాయక్‌ (32), రుద్రంపేట పంచాయతీ పరిధిలోని చంద్రబాబు కొట్టాలుకు చెందిన ఎస్‌.ఆంజనేయులు స్నేహితులు. ఇద్దరికీ వివాహమైంది. ఇద్దరూ చంద్రబాబు కొట్టాలులోనే స్థిర నివాసం ఏర్పరుచుకుని ఆటో డ్రైవర్లుగా జీవనం సాగించేవారు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రాజేష్‌ నాయక్‌ను వదిలి భార్య వెళ్లిపోయింది. అనంతరం రాజేష్‌ నాయక్‌ ఆటో డ్రైవింగ్‌ వదిలేసి జిలేబి మాస్టర్‌గా పనిచేస్తూ తరచూ ఆంజనేయులు ఇంటికి రాకపోకలు సాగించసాగాడు. ఈ నేపథ్యంలోనే ఆంజనేయులు భార్యతో సన్నిహితం పెరిగింది. వీరిద్దరి వ్యవహారంపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు ఎలాగైనా రాజేష్‌ నాయక్‌ను కడతేర్చాలని అనుకున్నాడు.

సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిశారు. బైకులో తిరుగుతూ ఫూటుగా మద్యం తాగారు. అప్పటికే పక్కా ప్రణాళికతో ఉన్న ఆంజనేయులు సరైన ప్రాంతం కోసం పలుచోట్ల తిప్పాడు. అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ నందమూరి నగర్‌ వెనుక ఉన్న సీవీరామన్‌ జూనియర్‌ కళాశాల నుంచి కట్టకిందపల్లికి వెళ్లే మార్గంలో నిర్జన ప్రదేశానికి చేరుకోగానే రాజేష్‌ నాయక్‌పై కత్తితో దాడి చేశాడు.

పొట్ట, ఛాతి భాగాల్లో దాదాపు 15 సార్లు కత్తితో బలంగా పొడవడంతో రాజేష్‌నాయక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి ఆంజనేయులు ఉడాయించాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు రాజేష్‌నాయక్‌ మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. హతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందజేసి, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement