
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నోట్లొ స్పూన్ పెట్టుకొని ఆడుకుంటున్న చిన్నారికి ప్రమాదవశాత్తు స్పూన్ కొన గొంతును కోయడంతో తీవ్రంగా రక్తస్రావమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌లో నివసించే రవికుమార్‌కు రాజేష్‌కుమార్(2), అనిరుధ్ (అయిదు నెలలు) అనే ఇద్దరు కుమారులున్నారు.
పెద్ద కొడుకు రాజేష్‌కు చిన్నప్పటి నుంచి విటమిన్ “కే’తో బాధపడుతూ తీవ్రమైన వ్యాధిని ఎదుర్కొంటున్నారు. ఈ నెల 18వ తేదీన రాజేష్ ఓ టేబుల్ స్పూన్‌ను నోట్లో పెట్టుకొని ఆడుకుంటుండగా దాని కొసభాగం గొంతు ప్రాంతంలో కోసుకుపోయి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. వెంటనే తండ్రి నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.