spoon
-
బంజారాహిల్స్: గొంతులోకి జారిన స్పూన్.. తీవ్రగాయమై చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: నోట్లొ స్పూన్ పెట్టుకొని ఆడుకుంటున్న చిన్నారికి ప్రమాదవశాత్తు స్పూన్ కొన గొంతును కోయడంతో తీవ్రంగా రక్తస్రావమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్లో నివసించే రవికుమార్‌కు రాజేష్‌కుమార్(2), అనిరుధ్ (అయిదు నెలలు) అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు రాజేష్‌కు చిన్నప్పటి నుంచి విటమిన్ “కే’తో బాధపడుతూ తీవ్రమైన వ్యాధిని ఎదుర్కొంటున్నారు. ఈ నెల 18వ తేదీన రాజేష్ ఓ టేబుల్ స్పూన్‌ను నోట్లో పెట్టుకొని ఆడుకుంటుండగా దాని కొసభాగం గొంతు ప్రాంతంలో కోసుకుపోయి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. వెంటనే తండ్రి నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జైలు మరుగుదొడ్డిలో సొరంగం: అచ్చం ‘జులాయి’ సినిమాలో మాదిరి
జెరూసలెం: కరుడుగట్టిన నేరస్తులు ఉండే జైలు అది. వారిని బంధించిన జైలు చుట్టూ భారీ బందోబస్తు ఉంటుంది. అయితే ఇవన్నీ తమనేం చేయవని నేరస్తులు, దొంగలు నిరూపించారు. చిన్న వస్తువుదొరికితే చాలు వాటితో ఎలాగైనా తప్పించుకోగలరని చేసి చూపించారు. ఒక చిన్న చెంచాతో జైలు గోడలను తవ్వేసి బయట వరకు సొరంగం తవ్వేశారు. ఆ సొరంగ మార్గం నుంచి జైలు నుంచి బయటకు వచ్చారు. జులాయి సినిమాలో బ్రహ్మానందం ఒక ప్లేటును వంచి గోడను తవ్వేందుకు ప్రయత్నించడం నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. ది శాశంక్ రిడంప్షన్ అనే హాలీవుడ్ సినిమాలో మాదిరి ఈ ఘటన ఇజ్రాయెల్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని గిల్బోవా జైలు ఉంది. ఆ జైలులో కరుడుగట్టిన నేరస్తులను బందీగా ఉంచుతారు. ఆ జైలు లోపల, బయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయినా కూడా ఆరుగురు ఖైదీలు భదత్రా దళాల కళ్లు గప్పి జైలు నుంచి పారిపోయారు. వారు పారిపోయేందుకు వాడిన ఒకటే ఆయుధం ‘తుప్పుపట్టిన చెంచా. వారు బందీగా ఉన్న జైలు గదిలోని మరుగుదొడ్డిలో ఖైదీలు తుప్పుపట్టిన చెంచాతో సొరంగం తవ్వకం మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా అలా చేశారని సమాచారం. చివరకు సొరంగం పూర్తవడంతో సోమవారం ఆ ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. జైలు నుంచి పొలాల వెంట పారిపోతుండగా రైతులకు కనిపించారు. జైలు నుంచి పరారయ్యారని గుర్తించి వెంటనే జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు జైలులో గాలించగా ఆరుగురు పరారయ్యారని గుర్తించారు. పారిపోయిన వారిలో మాజీ మిలిటెంట్ నాయకుడు ఉన్నాడు. మిగతా ఐదుగురు గాజాకు చెందిన ఇస్లామిక్ జిహాద్‌కు చెందినవారుగా అధికారులు తెలిపారు. పారిపోయినవారంతా పాలస్తీనా వైపు వెళ్లి ఉంటారని అధికారులు చెబుతున్నారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి నఫ్తాలీ బెనెట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఖైదీలు పారిపోవడం భద్రతా లోపాలను ఎత్తి చూపింది. మరికొందరు పారిపోకుండా అప్రమత్తమైన అధికారులు మిగతా 400 మంది ఖైదీలను మరో చోటకు మార్చినట్లు సమాచారం. -
ఈ స్పూన్ ఖరీదు రూ. 2 లక్షలా..!
కొందరిని అదృష్టం ఎలా తలుపు తడుతుంది అనేది చెప్పలేము?. తాజాగా అలాంటి ఒక సంఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. ఒక వ్యక్తి ఇటీవల లండన్ వీధుల్లో అమ్మకానికి ఉంచిన పాత నలిగిన సన్నని, పొడవైన హ్యాండిల్ స్పూన్ ను కేవలం 90 పైసలు పెట్టి కొన్నాడు. తర్వాత దానిని ఆన్ లైన్ వేలం వేయడం వల్ల అతనికి 2 లక్షల రూపాయలు వచ్చాయి. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇప్పుడు మనం దాని గురుంచి తెలుసుకుందాం. ఈ వ్యక్తి "ఐకియా తరహా స్టోర్ లో స్పూన్ ను 90 పైసలకు కొనుగోలు చేశాడు. అయితే, అది చూడాటానికి అరుదైన మధ్యయుగానికి చెందిన స్పూన్ లాగా ఉంది. ఈ పేరు తెలియని వ్యక్తి సోమర్సెట్ దేశంలోని క్రూకెర్నే నగరానికి చెందిన లారెన్స్ వేలం దారుల వద్దకు వచ్చి వేలం కోసం స్పూన్ ను ఆన్ లైన్ లో నమోదు చేశాడు. లారెన్స్ అనే కంపెనీ తమ పోర్టల్ ద్వారా పురాతన కాలానికి చెందిన వస్తువులను విక్రయానికి పెడుతుంది. ఇందులో వేలానికి ఉంచిన వస్తువులను ప్రముఖ నిపుణులు పరిశీలించి వాటిని వేలానికి పోర్టల్ ఉంచుతుంది. అలాగే, ఈ స్పూన్ ను లారెన్స్ వేలం పాటదారుల వెండి నిపుణుడు అలెక్స్ బుచర్ ఈ 5 అంగుళాల స్పూన్ ను పరిశీలించి ఇది 13వ శతాబ్దం చివరి నాటి వెండి స్పూన్ అని కనుగొని దానిని రూ.51,712 వద్ద వేలానికి ఉంచాడు. కొద్ది రోజుల తర్వాత దని దాని బిడ్ పెరుగుతూనే ఉంది. చివరకు బిడ్ ముగింపులో స్పూన్ ను రూ.1,97,000కు విక్రయించారు. పన్నులు, అదనపు ఛార్జీలతో కలిపి పురాతన స్పూన్ విలువ రూ.2 లక్షలు దాటింది. -
ఈ స్పూన్ సెల్ఫీలు తీస్తుంది గురూ..!
ఇది.. సెల్ఫీల యుగం.. ప్రతి సన్నివేశాన్ని, స్టైల్ ను, సీన్ ను, ఒక్కటేమిటి.. ఏ కొత్తదనం కనిపించినా సెల్ఫీగా మలచడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది.. అయితే ఈ సెల్ఫీ.. ఇప్పుడు స్టిక్ నుంచి స్పూన్ కు చేరింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలనుకున్న వారికి ఇప్పుడు అందుబాటులో సెల్ఫీ స్పూన్లు కూడ మార్కెట్లోకి వచ్చేశాయ్.. స్టిక్ కు స్పూన్ అమర్చిన కొత్త పరికరం (సెల్ఫీ స్పూన్) ఇప్పుడు మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. స్పూనుకు 30 అంగుళాల స్టిక్‌ను కలిపి తయారు చేసిన ఈ స్పూన్.. సెల్ఫీ ప్రియులను ఆకట్టుకుంటోంది. టిఫిన్ తింటూ ఎవరికి వారు అందంగా ఫొటోలను తీసుకునేందుకు వీలుగా న్యూయార్క్‌కు చెందిన సినామన్ టోస్ట్ క్రంచ్ ఈ పరికరాన్ని పరిచయం చేసింది. జనరల్ మిల్స్ బ్రాండ్ రూపొందించిన ఈ కొత్త సెల్ఫీ స్టిక్‌లో ఎప్పటికప్పుడు తీసిన ఫొటోలను పోస్ట్ చేసే అవకాశం ఉంది. సెల్ఫీ స్పూన్ ను వాడాలనుకునేవారు ముందుగా తమ స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయాలి. అందులోని వైట్ రిమోట్లో కనిపించే గ్రే బటన్ ను నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్లోనే కాక ఐవోఎస్ డివైజ్‌లో కూడా ఫొటోలు సేవ్ అవుతాయి. దీంతో ఎప్పటికప్పుడు తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేయడం కూడా సులభం అవుతుందట.