
వరంగల్: బీరు బాటిళ్లలో స్పూన్లు కనిపించడంతో మందుబాబులు కంగుతున్న సంఘటన గిర్నిబావిలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా జరిగిన ఓ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులు కలిసి మద్యం సేవిస్తున్నారు. ఓ బాటిల్‌లో స్పూన్ మొత్తం ఉండగా.. మరో బాటిల్‌లో సగం విరిగిన స్పూన్ కనిపించింది.
దీంతో ఆందోళన చెందిన మందుబాబులు స్థానికంగా తాము కొనుగోలు చేసిన మద్యం షాపు వద్దకు వెళ్లి యజమానిని నిలదీశారు. అయితే బాటిల్‌లో ఉన్న స్పూన్ బయటికి రావడం లేదు. ఖాళీ బాటిల్ తయారు చేసే క్రమంలోనే అందులో చేరి ఉంటుందని, అది గమనించకుండా మద్యం నింపారని గుర్తించారు. కేఎఫ్ లైట్ కంపెనీకి చెందిన బీర్లు కావడంతో షాపు యజమాని వాటిని వాపస్ తీసుకుని రెండు బాటిళ్లు మళ్లీ ఇచ్చాడు. ఈ ఘటనను సదరు కంపెనీ దృష్టికి తీసుకెళ్తామని షాపు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment