వాతావరణంలో మార్పులు మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రధానంగా శీతాకాలంలోచల్లగాలులు, మంచు ప్రభావంతో జలుబు, జ్వరం, అలెర్జీ,గొంతు నొప్పి లాంటి సమస్యలకు దారి తీస్తాయి. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడతాయి. మరి ఇలాంటి సమస్యలకు ఇంటి వైద్యం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా గొంతు నొప్పి వేధిస్తుంది. దీంతో పాటు, కళ్లు, ముక్కులలో కూడా దురదగా ఉంటుంది. మరి ఈ గొంతు గరగరను, ఎలర్జీతో బాధపడుతోంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఉపశమనం కోసం పాటించాల్సిన చిట్కాలు తెలుసుకుందామా.
చలికాలంలో పిల్లలు, పెద్ద వయసు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.చలికాలంలో అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలి. జలుబు, ఫ్లూ, తలనొప్పి, సైనసైటిస్, దగ్గు వంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా గొంతు చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా గొంతులో గరగర, మింగుతున్నప్పుడు ఇబ్బంది లాంటి సమస్యలు అన్ని రకాల వయస్సుల వారిలోనూ తలెత్తుతుంటాయి.
బయటికి వెళ్లినపుడు శరీరం వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి.
చెవులలోకి చల్లగాలి వెళ్లకుండా, స్కార్ఫ్‌లు, మఫ్లర్లను ధరించాలి.
వేడి వేడి పదార్థాలను తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తాజాగా వంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఫ్రిజ్‌లోంచి తీసిన వంటకాలను అలానే తినకుండావేడి చేసుకుని తినాలి.
కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు లాంటి చల్లని పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. గొంతు సమస్య ఉన్నప్పుడు పూర్తిగా దూరం పెట్టాలి.
గోరు వెచ్చటి నీటిని తాగటం మంచిది. సూప్స్, పండ్ల రసాలను తాగటంవల్ల కూడా గొంతులో ఇబ్బందిగా ఉంటే తగ్గిపోతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు టమిన్ సి నిండిన పండ్లను తినాలి. వీటిల్లో యాంటీ హిస్టమైన్ ఉంటుంది. నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి లాంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే డాక్టర్ సలహా మేరకు యాంటీ హిస్టమైన్ ట్యాబ్లెట్ల రూపంలో కూడా వాడవచ్చు.
ఉపశమనం కోసం
అల్లం,శొంఠి,మిరియాలు, కొద్దిగా తులసి దళాలు వేసి కషాయంలా చేసుకొని తాగాలి.
గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు వేసి తాగాలి. ఇలా చేస్తే గొంతులో గరగర మాయమవుతుంది.
కొద్దిగా అల్లం, దాల్చిన చెక్క ముక్క కలిపి చేసిన టీ తాగాలి. ఇలా పొద్దున్న, సాయంత్రం చేస్తే ఫలితం ఉంటుంది.
అల్లాన్ని మెత్తగా నూరి, టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగినా మంచి ఫలితం ఉంటుంది.
పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి, రుచికి కొద్దిగా తేనె, లేదా బెల్లం కలుపుకొని తాగవచ్చు.
అల్లం, తులసి ఆకులు నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి నోటిలో పుకిలిస్తే మంచిది.
అల్లం, తులసి, వామ్ము ఆకులు వేసి మరగించిన టీని తాగితే గొంతు నొప్పి, జలుబుకు మంచి ఉపశమనం లభిస్తుంది.
ఇవి పిల్లలకు కూడా కొద్ది మోతాదులో తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇవీ చదవండి: అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ
తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?
నోట్ : తరచుగా జలుబు, జ్వరం, గొంతు నొప్పి, మింగడంలో సమస్యలొస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. చిన్న పిల్లల్లో అయితే టాన్సిల్స్, అడినాయిడ్స్ లాంటి సమస్యలేమైనా ఉన్నాయోమో గుర్తించి మందులును వాడాలి
Comments
Please login to add a commentAdd a comment