చలికాలం రాగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దీంతో జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి వివిధ వ్యాధుల బారిన పడటం సాధారణంగా. అలాగే చల్లని వాతావరణం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని, ఆర్థరైటిస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయని కూడా నమ్ముతారు. అయితే ఇందులో నిజమెంత? చలికాలానికి, మోకాళ్ల నొప్పులకు సంబంధం; మరి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో మన జీవన పరిస్థతులకనుగుణంగానే శారీరక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. జర్నల్ సెమినార్స్ ఇన్ ఆర్థరైటిస్ , అండ్ రుమాటిజంలో ప్రచురించిన 2024 అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పులు నేరుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ , ఇతక కీళ్ల నొప్పులను పెద్దగా ప్రభావితం చేయవని వెల్లడించింది.
అయితే చల్లని వాతావరణం కీళ్లను గట్టిపరుస్తుంది ,రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, చిన్న కదలికలను కూడా కష్టతరం చేస్తుంది. తక్కువ తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు గౌట్ మంట ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయని అధ్యయనం కనుగొంది. ఆర్థరైటిస్‌తో బాధపడే వ్యక్తులు శీతాకాలంలో వాతావరణ ఒత్తిడి మార్పు వల్ల కీళ్ళు సాధారణం కంటే ఎక్కువగా ఉబ్బి, నొప్పి పెరగడానికి దారితీస్తుందని తేలింది.తక్కువ బారోమెట్రిక్ పీడనం శరీరంలోని కణజాలాలు నరాలపై ఒత్తిడిని పెంచుతుంది.
మరి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి?
వింటర్ సీజన్‌లో శారీరక శ్రమ తగ్గడం వల్ల ఎముకల మధ్య కదలిక తగ్గిపోతుంది. దీంతోపాటు విటమిన్ డి లోపం కూడా కీళ్ల నొప్పులకు మరో కారణం.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కండరాలు దృఢంగా ఉండే వ్యాయామాలను ఎంచుకోవాలి.
వేడి నీటి కొలనులో ఈత కొట్టడం లేదా ఇంట్లోనే సైక్లింగ్ చేయడం వంటి తక్కువ-ప్రభావ వ్యాయామాలు ఉత్తమం.
ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా, కదలిక ఉండేలా చూసుకోండి. .
యోగ, ధ్యానం లాంటివి చేయాలి. కీళ్లలో నొప్పినుంచం ఉపశమనం కలిగే , దృఢత్వాన్ని పెంచే ఆసనాలు తెలుసుకొని ఆచరించాలి.
చలికాలం కదా అశ్రద్ధ చేయకుండా, తగినంత నీరును తాగాలి.
చలికాలం వచ్చిందంటే వృద్ధులకే కాదు, యుక్తవయస్సులో ఉన్నవారిలో కూడా కొంతమందికి మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి
రక్త ప్రసరణ మెరుగుపరచడానికి , దృఢత్వాన్ని తగ్గించడానికి వెచ్చని బట్టని ధరించాలి. వేడి నీటి స్నానం మంచిది.
నొప్పి ఉన్న ప్రదేశంలో ఉపశమనం కోసం హీట్ ప్యాడ్‌లను వాడవచ్చు.
కీళ్ల నొప్పులకు మరో చక్కటి ఉపశమన ప్రక్రియ మసాజ్. ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
నువ్వుల నూనె, కొబ్బరి నూనె, లేదా కొన్ని ఆయుర్వేద తైలాలతో పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
నోట్: శారీరకంగా చురుకుగా ఉండటం, హీట్ థెరపీ, చక్కటి ఆహారం ద్వారా చాలావరకు సమస్యలనుంచి తప్పించుకోవచ్చు. దీంతో పాటు సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు
Comments
Please login to add a commentAdd a comment