టాబ్లెట్స్‌ వేసుకున్నా తలనొప్పి తగ్గడం లేదా? అయితే ఇలా చేయండి | Remedies To Get Rid Of Headaches Naturally | Sakshi
Sakshi News home page

టాబ్లెట్స్‌ వేసుకున్నా తలనొప్పి తగ్గడం లేదా? అయితే ఇలా చేయండి

Published Sat, Jun 17 2023 11:32 AM | Last Updated on Fri, Jul 14 2023 4:38 PM

Remedies To Get Rid Of Headaches Naturally - Sakshi

తలనొప్పి..ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని సాధరణంగా వేధించే సమస్య ఇది. ఒత్తిడి సహా అనేక కారణాల వల్ల తలనొప్పి రావొచ్చు. కొన్నిసార్లు గంటల సమయం నుంచి రోజుల వరకు తలనొప్పి వేధిస్తుంటుంది. తల పగిలిపోయినట్లు అనిపించే ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలామంది నొప్పి నివారణ బామ్‌లు, పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సులభంగా, ఇంటి చిట్కాలతోనే తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

  • నీటిని తగినంత తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి రోజుకు 8-10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.
  • కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట. 
  • బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, బాదం వంటి డైఫ్రూట్స్‌ను గుప్పెడు తింటే తలనొప్పి తగ్గుతుందట. 
  • మెగ్నీషియం లోపంతో కూడా తలనొప్పి వేధిస్తుంది. అందుకని మెగ్నీషియం సప్లిమెంట్స్‌ తీసుకోవాలి.
  • మంచినీటిలో ధనియాలు, చక్కెర కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • గంధం చెక్కను అరగదీసి నుదిటిపై రాయడం ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
  • నిత్యం క్రమం తప్పకుండా 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో పాటు వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.
  • ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • అల్లం ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీని తాగడం వల్ల ఇన్‌స్టెంట్‌ రిలీఫ్‌ లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement