రికవరీ సూట్‌ ఫైల్‌ చేసుకోవచ్చు..! | Law Advice: What Is tThe CPC Section For Recovery Suits | Sakshi
Sakshi News home page

రికవరీ సూట్‌ ఫైల్‌ చేసుకోవచ్చు..!

Published Wed, Mar 12 2025 10:35 AM | Last Updated on Wed, Mar 12 2025 10:35 AM

Law Advice: What Is tThe CPC Section For Recovery Suits

దుబాయ్‌లో ఉండే ఒక వ్యక్తికి 12 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాను. అతను భారతీయుడే. కానీ తిరిగి చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా, స్టేషన్‌కు వచ్చి సెటిల్‌ చేసుకొని ‘7 లక్షల రూపాయలు కడతాను, అంతకుమించి ఇవ్వలేను’ అని అందరిముందూ ఒప్పుకున్నాడు. మూడు లక్షలు ఇచ్చాడు. నాలుగు లక్షలకి చెక్కు రాసి ఇచ్చాడు. కానీ ఇంతవరకు డబ్బులు ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ తిరిగి దుబాయ్‌కి వెళ్ళిపోయారు. ‘ఎప్పుడిస్తారు అని అడిగితే కేసులు పెట్టుకోండి మా దగ్గర డబ్బులు లేవు’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఐదులక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేసిన రసీదు మా దగ్గర ఉంది. ఇదేమైనా సాక్ష్యంగా పనికొస్తుందా? ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటారు?
– చిరంజీవి, మచిలీపట్నం

రెండు సంవత్సరాల క్రితం చెక్కు ఇచ్చారు అని చెప్పారు కానీ అది పోస్ట్‌డేటెడ్‌ చెక్కా లేక డేటు వేయకుండా ఇచ్చారా అనే విషయాన్ని చెప్పలేదు. ఒకవేళ చెక్కు మీద డేటు వేసి ఉంటే, ఆ డేటు నుంచి మూడు నెలల గడువులోగా చెక్కును డిపాజిట్‌ చేసి, అది చెల్లకపోతే చెక్‌ బౌన్స్‌ కేసు వేసుకోవచ్చు. 

అలాంటి వీలు ఉందో లేదో చూసుకోండి. లేనిపక్షంలో సివిల్‌ కోర్టును ఆశ్రయించి రికవరీ సూట్‌ ఫైల్‌ చేసుకోండి. అప్పు తీసుకున్న నాటినుండి లేదా ఆ లావాదేవీ జరిగిన తేదీ నుంచి మూడు సంవత్సరాలలోగా కేసు వేసుకోవాల్సి ఉంటుంది. దగ్గర్లోని లాయర్‌ను సంప్రదించి మీ వద్ద ఉన్న సాక్ష్యాలను, చెక్కును చూపించి ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి.

నేను ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటూ ఆ అపార్ట్‌మెంట్‌ కోశాధికారిగా బాగోగులు చూస్తున్నాను. మా దాంట్లో ఒక ఓనర్‌ మెయింటెనెన్స్‌ కట్టడం లేదు. బకాయి పెరిగి΄ోతోంది. ఎన్నిసార్లు అడిగినా ఎదో సాకు చెప్తూ డబ్బు ఇవ్వడం లేదు. గట్టిగా అడిగితే అసలు ఇవ్వనని కరాఖండిగా చెప్తున్నాడు. అతని నుంచి మెయింటెనెస డబ్బులు రాబట్టడం ఎలా?
– గోవిందరాజు, హైదరాబాద్‌

మీ అపార్ట్‌మెంట్‌ సొసైటీల చట్టం కింద రిజిస్టర్‌ అయిందా లేదా అనే విషయాన్ని మీరు చెప్పలేదు. ఒకవేళ కోపరేటివ్‌ సొసైటీస్‌ చట్టం కింద రిజిస్టర్‌ అయి ఉంటే, సదరు కమిషనర్‌ ముందు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సొసైటీ రిజిస్ట్రేషన్‌ చట్టం, 2001 చట్టం కింద రిజిస్టర్‌ చేసుకుని ఉంటే... 

సెక్షన్‌ 23 ప్రకారం, ఆర్బిట్రేషన్‌ ద్వారా లేదా సివిల్‌ కోర్టును ఆశ్రయించడం ద్వారా మీ బకాయిలను వసూలు చేసుకోవచ్చు. బకాయిలు చెల్లించేంతవరకు సదరు ఓనరు ఇల్లు అమ్మడానికి వీలు లేదు అనేటటువంటి ఆర్డర్‌ కూడా పొందవచ్చు.  

(చదవండి: జాగ్రత్త పడకుంటే విడాకులే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement