Recovery Act
-
రికవరీ సూట్ ఫైల్ చేసుకోవచ్చు..!
దుబాయ్‌లో ఉండే ఒక వ్యక్తికి 12 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాను. అతను భారతీయుడే. కానీ తిరిగి చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా, స్టేషన్‌కు వచ్చి సెటిల్ చేసుకొని ‘7 లక్షల రూపాయలు కడతాను, అంతకుమించి ఇవ్వలేను’ అని అందరిముందూ ఒప్పుకున్నాడు. మూడు లక్షలు ఇచ్చాడు. నాలుగు లక్షలకి చెక్కు రాసి ఇచ్చాడు. కానీ ఇంతవరకు డబ్బులు ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ తిరిగి దుబాయ్‌కి వెళ్ళిపోయారు. ‘ఎప్పుడిస్తారు అని అడిగితే కేసులు పెట్టుకోండి మా దగ్గర డబ్బులు లేవు’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆన్లైన్లో ఐదులక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన రసీదు మా దగ్గర ఉంది. ఇదేమైనా సాక్ష్యంగా పనికొస్తుందా? ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటారు?– చిరంజీవి, మచిలీపట్నంరెండు సంవత్సరాల క్రితం చెక్కు ఇచ్చారు అని చెప్పారు కానీ అది పోస్ట్‌డేటెడ్ చెక్కా లేక డేటు వేయకుండా ఇచ్చారా అనే విషయాన్ని చెప్పలేదు. ఒకవేళ చెక్కు మీద డేటు వేసి ఉంటే, ఆ డేటు నుంచి మూడు నెలల గడువులోగా చెక్కును డిపాజిట్ చేసి, అది చెల్లకపోతే చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. అలాంటి వీలు ఉందో లేదో చూసుకోండి. లేనిపక్షంలో సివిల్ కోర్టును ఆశ్రయించి రికవరీ సూట్ ఫైల్ చేసుకోండి. అప్పు తీసుకున్న నాటినుండి లేదా ఆ లావాదేవీ జరిగిన తేదీ నుంచి మూడు సంవత్సరాలలోగా కేసు వేసుకోవాల్సి ఉంటుంది. దగ్గర్లోని లాయర్‌ను సంప్రదించి మీ వద్ద ఉన్న సాక్ష్యాలను, చెక్కును చూపించి ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి.నేను ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటూ ఆ అపార్ట్మెంట్ కోశాధికారిగా బాగోగులు చూస్తున్నాను. మా దాంట్లో ఒక ఓనర్ మెయింటెనెన్స్ కట్టడం లేదు. బకాయి పెరిగి΄ోతోంది. ఎన్నిసార్లు అడిగినా ఎదో సాకు చెప్తూ డబ్బు ఇవ్వడం లేదు. గట్టిగా అడిగితే అసలు ఇవ్వనని కరాఖండిగా చెప్తున్నాడు. అతని నుంచి మెయింటెనెస డబ్బులు రాబట్టడం ఎలా?– గోవిందరాజు, హైదరాబాద్మీ అపార్ట్మెంట్ సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయిందా లేదా అనే విషయాన్ని మీరు చెప్పలేదు. ఒకవేళ కోపరేటివ్ సొసైటీస్ చట్టం కింద రిజిస్టర్ అయి ఉంటే, సదరు కమిషనర్ ముందు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం, 2001 చట్టం కింద రిజిస్టర్ చేసుకుని ఉంటే... సెక్షన్ 23 ప్రకారం, ఆర్బిట్రేషన్ ద్వారా లేదా సివిల్ కోర్టును ఆశ్రయించడం ద్వారా మీ బకాయిలను వసూలు చేసుకోవచ్చు. బకాయిలు చెల్లించేంతవరకు సదరు ఓనరు ఇల్లు అమ్మడానికి వీలు లేదు అనేటటువంటి ఆర్డర్ కూడా పొందవచ్చు. (చదవండి: జాగ్రత్త పడకుంటే విడాకులే..!) -
సాగు.. ఇక బహుబాగు
గజ్వేల్: వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆరునెలలుగా ఈ పథకం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట దొరికింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈమేరకు కొత్త మార్గదర్శకాలను రూపొందించి జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ వ్యవసాయరంగంలో యాంత్రికీకరణ కీలకంగా మారింది. ప్రతి ఏటా జిల్లాలో 6 లక్షల హెక్టార్లకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. పురాతన పద్ధతులకు క్రమంగా స్వస్తి పలుకుతున్న రైతులు, అధునాతన యంత్రాల వాడకంపై దృష్టి సారించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఈ విధానం అనివార్యమవుతోంది. దీంతో యాంత్రీకరణ పథకానికి మోక్షం ఎప్పుడు లభిస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తాజాగా కొన్నిరోజుల క్రితం పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపిక ఎలా అంటే... కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం యాంత్రికీకరణ పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేయనున్నారు. ఈ కమిటీలో జేడీఏ, హార్టికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్, ఆత్మ పీడీ, డ్వామా పీడీ, డీఆర్డీఏ పీడీతో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, నాబార్డు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో వ్యవసాయాధికారి, డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డ్వామా ఏపీఓ, ఎంపీడీఓ, తహశీల్దార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసి 50 శాతం సబ్సిడీపై పరికరాలను అందించనున్నారు. ఈసారి హార్వెస్టర్, రొటోవేటర్, శ్రీవరిసాగు యంత్రం, ట్రాక్టర్లు వంటి భారీ యంత్రాలను కూడా సబ్సిడీపై అందించడానికి ప్రభుత్వం సంకల్పించింది. రైతులు ఈ పథకానికి మీ-సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు అందజేస్తే మండల స్థాయి కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. సబ్సిడీపై పరికరాలు పొంది గతంలో ఇతరులకు అమ్ముకొని యాంత్రికీకరణను అభాసుపాలు చేసిన ఘటనల నేపథ్యంలో ఈ దుస్థితిని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం రికవరీ యాక్ట్ సైతం ప్రయోగించబోతోంది.