knee pains
-
చలికాలంలో కీళ్ల నొప్పులా? ఇవిగో ది బెస్ట్ టిప్స్!
చలికాలం రాగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దీంతో జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి వివిధ వ్యాధుల బారిన పడటం సాధారణంగా. అలాగే చల్లని వాతావరణం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని, ఆర్థరైటిస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయని కూడా నమ్ముతారు. అయితే ఇందులో నిజమెంత? చలికాలానికి, మోకాళ్ల నొప్పులకు సంబంధం; మరి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో మన జీవన పరిస్థతులకనుగుణంగానే శారీరక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. జర్నల్ సెమినార్స్ ఇన్ ఆర్థరైటిస్ , అండ్ రుమాటిజంలో ప్రచురించిన 2024 అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పులు నేరుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ , ఇతక కీళ్ల నొప్పులను పెద్దగా ప్రభావితం చేయవని వెల్లడించింది.అయితే చల్లని వాతావరణం కీళ్లను గట్టిపరుస్తుంది ,రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, చిన్న కదలికలను కూడా కష్టతరం చేస్తుంది. తక్కువ తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు గౌట్ మంట ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయని అధ్యయనం కనుగొంది. ఆర్థరైటిస్‌తో బాధపడే వ్యక్తులు శీతాకాలంలో వాతావరణ ఒత్తిడి మార్పు వల్ల కీళ్ళు సాధారణం కంటే ఎక్కువగా ఉబ్బి, నొప్పి పెరగడానికి దారితీస్తుందని తేలింది.తక్కువ బారోమెట్రిక్ పీడనం శరీరంలోని కణజాలాలు నరాలపై ఒత్తిడిని పెంచుతుంది.మరి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి?వింటర్ సీజన్లో శారీరక శ్రమ తగ్గడం వల్ల ఎముకల మధ్య కదలిక తగ్గిపోతుంది. దీంతోపాటు విటమిన్ డి లోపం కూడా కీళ్ల నొప్పులకు మరో కారణం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కండరాలు దృఢంగా ఉండే వ్యాయామాలను ఎంచుకోవాలి.వేడి నీటి కొలనులో ఈత కొట్టడం లేదా ఇంట్లోనే సైక్లింగ్ చేయడం వంటి తక్కువ-ప్రభావ వ్యాయామాలు ఉత్తమం.ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా, కదలిక ఉండేలా చూసుకోండి. .యోగ, ధ్యానం లాంటివి చేయాలి. కీళ్లలో నొప్పినుంచం ఉపశమనం కలిగే , దృఢత్వాన్ని పెంచే ఆసనాలు తెలుసుకొని ఆచరించాలి. చలికాలం కదా అశ్రద్ధ చేయకుండా, తగినంత నీరును తాగాలి. చలికాలం వచ్చిందంటే వృద్ధులకే కాదు, యుక్తవయస్సులో ఉన్నవారిలో కూడా కొంతమందికి మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి , దృఢత్వాన్ని తగ్గించడానికి వెచ్చని బట్టని ధరించాలి. వేడి నీటి స్నానం మంచిది.నొప్పి ఉన్న ప్రదేశంలో ఉపశమనం కోసం హీట్ ప్యాడ్లను వాడవచ్చు.కీళ్ల నొప్పులకు మరో చక్కటి ఉపశమన ప్రక్రియ మసాజ్. ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.నువ్వుల నూనె, కొబ్బరి నూనె, లేదా కొన్ని ఆయుర్వేద తైలాలతో పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నోట్: శారీరకంగా చురుకుగా ఉండటం, హీట్ థెరపీ, చక్కటి ఆహారం ద్వారా చాలావరకు సమస్యలనుంచి తప్పించుకోవచ్చు. దీంతో పాటు సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు -
వాకింగ్ చేస్తే మోకాళ్లు అరిగిపోతాయా?
ఆర్థరైటిస్ కారణంగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు తాము వాకింగ్ చేస్తే తమ మోకాళ్లు మరింతగా అరిగిపోతాయని అపోహపడుతుంటారు. ఇది వాస్తవం కాదు. నిజానికి మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ అంత బాగా రక్తప్రసరణ అవుతుంటుంది. దాంతో కీళ్లకు పోషకాలు బాగా అందడమే కాకుండా కండరాలూ, ఎముకలు బాగా బలపడతాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారే కాకుండా, మధ్యవయసుకు వచ్చిన ఆరోగ్యవంతులందరూ వెంటనే వాకింగ్ మొదలుపెట్టడం మంచిది. సైక్లింగ్ వల్ల మోకాళ్లు మరింత అరుగుతాయనుకుంటారు కానీ ఒంటి బరువు పడకపోవడంతో సైక్లింగ్ కూడా మంచిదే. శరీరం బరువు మోకాళ్ల మీదా, తమ కాళ్ల మీద పడదు కాబట్టి స్విమ్మింగ్ కూడా మంచి ఎక్సర్సైజ్. పైగా స్విమ్మింగ్‌లో కేవలం మోకాళ్లకే కాకుండా ఒంటికంతటికీ మంచి వ్యాయామం సమకూరుతుంది. -
అందుకే ఆడవాళ్లకు ఎక్కువగా కీళ్లనొప్పులు.. తేలిగ్గా తీసుకోవద్దు
చలికాలం వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు,ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. చాలామందికి చలికాలంలో కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు చలికాలంలో కీళ్ల నొప్పుల నుండి, ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. చలికాలంలో వాతావరణంలోని చల్లదనానికి కీళ్లమధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్ కుచించుకుపోతుంది. చర్మం, కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే చాలామందికి చలికాలంలో కీళ్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లలో రక్తహీనత కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కీళ్ల నొప్పులను తేలిగ్గా తీసుకోకూడదు. చలికాలంలో వచ్చే సాధారణ కీళ్ల నొప్పులను తగ్గించడానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడదు. అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడుస్తుండాలి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ వ్యాయామాలు లాంటివి ఉపయోగపడతాయి. కీళ్ల అరుగుదల, కీళ్లవాతం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు చలికాలంలో డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. కీళ్లు మరీ వీక్‌గా ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు క్యాల్షియం, విటమిన్ డి మాత్రలు వేసుకోవచ్చు. ఇక వీటితో పాటు చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్–డి, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కీళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు మందపాటి బట్టలు వేసుకోవాలి. శరీరాన్ని చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్–డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మరీ మంచిది.చలికాలంలో మనకు తెలియకుండానే తక్కువ నీటిని తీసుకుంటాం కాబటి బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. దానివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అందువల్ల అది గుర్తుంచుకుని కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరం డీ హైడ్రేట్ కాకుండా తగినంత నీటిని తాగడం మంచిది. -
మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? సర్జరీ చేయాల్సిన పనిలేదు
ఎంతోకాలంగా మోకాలినొప్పితో బాధపడుతున్నారా? ఫిజియో థెరపీ, స్టారాయిడ్ ఇంజెక్షన్లు, సర్జరీ వంటివన్నీ ట్రై చేశాక కూడా ఎలాంటి ఫలితం లేదా? అయితే ఈ వార్త మీకోసమే. ఎలాంటి సర్జరీ లేకుండానే మీ నొప్పిని తగ్గించేందుకు డ్యూక్ యూనివర్సిటీ నేతృత్వంలోని ఓ అధ్యయన బృందం ఒక హెడ్రైజెల్ను తీసుకొచ్చారు. ఇది మోకాలి నొప్పులను త్వరగా నయం చేస్తుందట. ఈరోజుల్లో కీళ్లనొప్పుల సమస్య సర్వసాధారణం అయిపోయింది. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్లలో ఈ సమస్య మరీ అధికంగా ఉంటోంది. దీనికి కారణం ఆర్థరైటిస్. దీన్నే కీళ్ళవాపు వ్యాధి అంటారు. అనారోగ్య జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మోకాలి సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పటికీ కీళ్లనొప్పులకు శాశ్వత పరిష్కారం లేదు. మెట్లు ఎక్కాలన్నా, పరిగెత్తాలన్నా, ఎక్కువసేపు నడవాలన్నా మోకాలి నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. కీళ్లు బలహీనంగా మారడం వల్ల మోకాలు లోపలి కణజాలం దెబ్బతింటుందని, దీని వల్ల లోపల cartilage (మృదులాస్థి) అరిగిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కాస్త లెగ్ స్ట్రెచ్ చేసినా, మూమెంట్ ఇచ్చినా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. విపరీతంగా బరువు ఉండటం, సరైన వ్యాయామం శరీరానికి లేకపోవడం, శరీరానికి కావాల్సిన విటమిన్ డి3 లేకపోవడం వంటివన్నీ మోకాలి నొప్పికి కారణాలు. కొందరు నొప్పి భరించలేక శస్త్రచికిత్సల బాట పడుతున్నారు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నారు డ్యూక్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఎందుకంటే సెల్యూలోజ్ ఫైబర్‌తో తయారుచేసిన ఓ హైడ్రోజెల్‌తో మోకాలి నొప్పులను తగ్గించవచ్చని వెల్లడించారు. ఈ హైడ్రోజెల్‌ను పాలిమర్‌తో తయారుచేశారు. సెల్యూలోజ్ ఫైబర్ యోక్క పలుచని షీట్లను తీసుకొని వాటిని పాలీ వినైల్ ఆల్కహాల్ కూడిన పాలిమర్‌తో అనుసంధానం చేసి ఓ జిగట లాంటి జెల్‌ను రూపొందించారు. సెల్యూలోజ్ ఫైబర్ కొల్లాజిన్ ఫైబర్‌లా పనిచేస్తాయని డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తమ పరిశోధనలో వెల్లడించారు. ఇది cartilage కంటే ధృడంగా ఉంటుందని తెలిపారు. కాళ్లను ముందుకి, వెనక్కి స్ట్రెచ్(సాగదీసినప్పుడు) హైడ్రోజెల్ మోకాలి నొప్పిని పట్టి ఉంచుతుంది. హైడ్రోజెల్ ఉన్న ఇంప్లాట్తో కీళ్ల నొప్పి చాలావరకు తగ్గిపోతుందని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. దీనికోసం సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గతంలో హైడ్రోజెల్‌లను రూపొందించడానికి జెల్లోని స్ఫటికాలను ఉత్పత్తి చేయడానికి ఫ్రీజ్-థా ప్రక్రియను ఉపయోగించారు. కానీ తాజా అధ్యయనంలో ఎనియలింగ్ అనే హీట్ ట్రీట్మెంట్ని ఉపయోగించారు. ఫలితంగా కీళ్లలో వచ్చే ఒత్తిడిని రెండు రెట్లు ఎక్కువగా తట్టుకునే శక్తిని కలిగి ఉన్నట్లు తెలిపారు. -
మోకాళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి
మన పెద్దవాళ్లు వృద్ధాప్యంలో కూడా ఎంతో బలంగా ఉండేవారు.. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా వారిలో కూడా శరీర సమస్యలు వస్తున్నాయి. చాలా మంది వృద్ధుల్లో మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. దీంతో పాటు ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డ యువతలో కూడా ఇవే సమస్యలు వస్తున్నాయి. మోకాళ్లనొప్పుల కారణంగా నడవడానికి చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలకు కూడా దారి తీయొచ్చు. మోకాళ్ల నొప్పులను తట్టుకోలేక చాలామంది పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి నివారణిలను ఆశ్రయిస్తుంటారు. వీటివల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి. అందువల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సహజ చిట్కాలను తెలుసుకుందాం. ఆర్థరయిటీస్, ఆస్టో ఆర్థరయిటీస్, రుమటాయిడ్ ఆర్థరయిటీస్ వంటి కొన్ని రకాల అనారోగ్య కారణాలతో పాటు సరైన దినచర్యను పాటించకపోవడం, తీసుకునే ఆహారాల్లో తగినన్ని పోషకాలు లేకపోవడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని ఆ తర్వాత ఈ సమస్యల నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలను అన్వేషిద్దాం. కలబంద ఆయుర్వేద నిపుణులు కలబందను ఔషధంగా భావిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలారకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నొప్పి ప్రభావిత ప్రాంతంలో ప్రతిరోజు అలోవెరా జెల్‌ను అప్లై చేసి సున్నితంగా మర్ధన చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ల వాపులు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. పసుపు పసుపు యాంటీ బాక్టీరియల్‌గా పని చేస్తుంది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని అన్నిరకాల వ్యాధులకు వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు పసుపును వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిని వినియోగించే ముందు ఒక బౌల్ తీసుకుని అందులో ఆవాల నూనెను వేసి.. ఒక టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అల్లం అల్లం మోకాళ్ల నొప్పుల నివారణకు ఉపయోగించే మందులలో అల్లాన్ని బాగా ఉపయోగిస్తారు. కొన్ని అల్ల ముక్కలను తీసుకుని వాటిని గ్లాసు నీళ్లలో వేసి బాగా మరగబెట్టాలి. మనం తీసుకున్న నీటి పరిమాణం సగానికి తగ్గిందని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్ మీదినుంచి దింపి గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టి తాగాలి. రుచికి తేనె, నిమ్మరసం వంటివి కలుపుకోవచ్చు. కర్పూర తైలం తీవ్ర మోకాళ్ల నొప్పుల కారణంగా బాధపడేవారు కర్పూరం నూనెను కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్నిరకాల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీనిని వినియోగించాలనుకునేవారు ముందుగా కర్పూరం నూనె తీసుకుని బౌల్లో పోసుకుని గోరువెచ్చగా చేయాలి. ఆ తర్వాత ఈ నూనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా తీవ్ర మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చింతగింజల పొడి మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పులు తగ్గాలంటే కాస్తంత చింతగింజల పొడిని వేడినీళ్లలో వేసి బాగా మరగబెట్టి వడకట్టి తాగుతుండాలి. అలాగే దీనిలో పాలు కలపకుండా బెల్లం పొడి వేసి పాయసంలా చేసుకుని కూడా తాగచ్చు. నల్లేరు కాడలతో తయారు చేసిన పచ్చడిని, బెండకాయలను, గోరుచిక్కుడు కాయలను ఆహారంలో విరివిగా ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి సహజ ఉపశమనం లభిస్తుంది. ఏదైనా గాయం వలన కానీ మెడికల్ కండిషన్ వలన కానీ మీరు రోజూ చేసే పనులన్నీ బట్టి కానీ మోకాళ్ళ నొప్పులు సహజంగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా మోకాళ్ల నొప్పులు ఉంటే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే అల్లం, పసుపు బాగా పనిచేస్తాయి. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో అల్లం, పసుపు వేసి 15 నిమిషాల పాటు ఆ నీటిని మరిగించండి. తర్వాత ఈ జ్యూస్ తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే కనక హీట్, కోల్డ్ కంప్రెస్ అంటే కాపడం పెట్టవచ్చు. హీట్ కంప్రెస్‌ని నొప్పి ఎక్కువ ఉంటే మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఇంకా నొప్పి కలుగుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడే వాళ్ళకి వేడినీటి కాపడం బాగా పనిచేస్తుంది. ఆటలు సమయంలో గాయాలైనప్పుడు కోల్డ్ కంప్రెసర్ బాగా తోడ్పడుతుంది. ఎప్సం సాల్ట్‌ని స్నానం చేసే నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ఒక గ్లాసు నీళ్లలో వేసుకుని తాగితే మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు తాగితే చాలా చక్కగా ఈ చిట్కా పనిచేస్తుంది. బరువు నియంత్రణ సాధ్యమైనంత వరకు మన వెయిట్ మానేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ బరువు పెరగడం వల్ల మోకాళ్ల పైన భారం పడి, మోకాళ్ళ నొప్పులు పెరిగే అవకాశం ఉంది. అందుకని బరువుని మేనేజ్ చేసుకుంటూ మోకాళ్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు. -
ఏ వయసులో మోకాళ్ళ సర్జరీ చేసుకుంటే త్వరగా కోలుకుంటారు ..!
-
Knee pain: మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా..
మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం చేస్తే... వారి మోకాలి కీళ్లు మరింతగా అరిగిపోయి, నొప్పులు పెరుగుతాయేమోనని చాలమంది అపోహ పడుతుంటారు. మరీ ఎక్కువ భారం పడకుండా, మరీ ఎక్కువగా శారీరక శ్రమ లేని వ్యాయామంతో మోకాళ్ల నొప్పులను అదుపులో పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈదే సమయంలో మోకాళ్లపైనే కాదు... అసలు శరీరంపై ఎలాంటి భారం పడదు. కాబట్టి ఈత అన్నింటికంటే మంచి వ్యాయామం. అంతేకాదు... మోకాళ్ళ నొప్పులతో, మరీ ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు కాస్తంత ఎక్కువగా నడిస్తే మోకాలి కీళ్లు అరిగిపోతాయనే మరో అపోహా ఉంది. ఇది నిజం కాదు. మోకాలి కీలు ప్రాంతంలో నేరుగా రక్తప్రసరణ జరగదు. అందుకే ఆ కీలు దగ్గర కదలికలు ఎంతగా ఉంటే అక్కడంత సమర్థంగా రక్తప్రసరణ ఉంటుంది. దాంతో కీళ్లకు పోషకాలు అందడమే కాక, కండరాలు, ఎముకలూ బలపడతాయి. కొంతమంది సైక్లింగ్ వల్ల మోకాళ్ల నొప్పులు మరింత పెరుగుతాయని అనుకుంటుంటారు. సైక్లింగ్‌లో దేహం బరువు మోకాళ్లపై పడదు. కాబట్టి అది కూడా మంచి వ్యాయామమే. ఇప్పుడిప్పుడే మధ్యవయసులోకి వస్తున్న/రాబోతున్నవారు మోకాళ్ల నొప్పులు రాకముందే వాకింగ్ చేయడం మేలు. అవి మోకాలికి శ్రమ కలిగించనంత మేరకే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అప్పటికే మోకాళ్లనొప్పులు మొదలై ఉంటే స్విమ్మింగ్ మంచిది. సైక్లింగ్ కూడా చేయవచ్చు. అయితే ఇలాంటి వ్యాయామాలు మొదలుపెట్టే ముందర ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి ప్రారంభించడం వల్ల వారిలో ఉన్న అపోహలు తొలగడమే కాకుండా... వారి వారి వ్యక్తిగత ఆరోగ్యపరిస్థితి ని అనుసరించి డాక్టర్లు మరికొన్ని సూచనలూ ఇస్తారు. ఇది వాళ్లకు మరింత మేలు చేస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. -
అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!
కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సేల్స్‌గర్ల్స్‌ను అన్నేసి గంటలు నిలబడి డ్యూటీ చేయించడాన్ని నిరోధించాయి. కేరళలో ‘రైట్ టు సిట్’ ఉద్యమం మొదలయ్యాక వచ్చిన మార్పు ఇది. దేశంలో కోట్లాది మంది స్త్రీలు సేల్స్ గర్ల్స్‌గా 8 నుంచి 12 గంటలు నిలబడి పని చేస్తున్నారు. వారికి కూచునే హక్కు ఉంది. ఆ హక్కు ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంది. మాలతి (20) హైదరాబాద్ అమీర్‌పేటలో సేల్స్ గర్ల్. ఉదయం 9 గంటలకు క్లాత్ షోరూమ్‌లో డ్యూటీ ఎక్కుతుంది. తిరిగి రాత్రి 9కి డ్యూటీ దిగుతుంది. మధ్యలో అరగంట లంచ్ విరామం. మిగిలిన సమయం? అంతా నిలబడి ఉండటమే. కస్టమర్లు ఉన్నా లేకున్నా ఆమె నిలబడే ఉంటుంది. కూచోవడానికి వీల్లేదు. ఎందుకంటే కూచోవడానికి అక్కడ కుర్చీలు గానీ స్టూల్స్‌గాని ఉండవు. బద్దకానికి అలవాటు పడతారని లేదా కూచుని సుఖపడతారని షాప్ వాళ్లు వారిని కూచోకుండా స్టూల్స్ తీసేస్తారు. మాలతి నిలబడే ఉంటుంది. నిలబడి... నిలబడి... నిలబడి... ఆమెకు కూచునే హక్కు లేదా? జయవాణి (35) నెల్లూరులో ప్రయివేట్ టీచర్. క్లాస్‌రూమ్‌లో నిలబడే పాఠం చెప్పాలి. బ్లాక్‌బోర్డ్ దగ్గర కుర్చీ కానీ టేబుల్ కానీ ఉండవు. టీచర్లు తాము ఇచ్చే జీతానికి ప్రతి నిమిషం రెక్కలు ముక్కలు చేసుకోవాలనుకున్న ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు చాలా కాలంగా క్లాస్ రూముల్లో కుర్చీలు తీసేశాయి. పాఠం ఎగ్గొట్టి టీచర్లు విశ్రాంతి తీసుకుంటారనో కునుకు తీస్తారనో వారి అనుమానం కావొచ్చు. అయితే క్లాసుకు క్లాసుకు మధ్య గ్యాప్ ఇస్తారా? స్టాఫ్‌రూమ్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోనిస్తారా? రోజులో దాదాపు 4 నుంచి 6 క్లాసులు చెప్పాల్సి ఉంటుంది. ప్రతి క్లాసు నిలబడి చెప్పి చెప్పి జయవాణికి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. కాని ఏమిటి చేయడం. ఆమె నిలబడి చెప్పాల్సిందే. కూచుని పాఠం చెప్పే హక్కు ఆమెకు లేదా? నిలబడటం పనిలో ఒక భాగం కావచ్చు. కాని నిలబడి ఉండటమే పని కాబోదు. కారాదు. మనిషి కేవలం నిలబడి మాత్రమే పని చేయడు. మధ్యలో విశ్రాంతి కావాలి. కూచోవాలి. కాని కూచుని పని చేయడాన్ని దేశంలో అనధికారికంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో తొలగించి చాలాకాలం అయ్యింది. బట్టల దుకాణాలు, నగల దుకాణాలు, ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో, ప్రయివేటు పాఠశాలలు... ఒకటేమిటి ప్రయివేటు రంగంలో ఎక్కడ వీలైతే అక్కడ నిలబడి పని చేయించడం ఆనవాయితీ అయ్యింది. ఇంకా దారుణం ఏమంటే కూచుని కనిపిస్తే, తోటి ఉద్యోగులతో కబుర్లు చెప్తూ కనిపిస్తే కొన్ని షాపుల్లో ‘ఫైన్’ వేస్తారు. షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గర్ల్స్ చేత, సేల్స్ బాయ్స్ చేత ఎంత ఊడిగం చేస్తారో వారిని ఎలా నిలబెట్టి పని చేయిస్తారో తమిళంలో ‘షాపింగ్ మాల్’ అనే సినిమా చూపించింది. కేరళలో కదలిక దేశంలో బట్టల షోరూమ్‌లలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది సేల్స్‌గర్ల్స్‌గా/సేల్స్‌మెన్‌గా ఉపాధి పొందుతున్నారని ఒక అంచనా. వీరిలో దాదాపు 70 శాతం యువతులు, స్త్రీలు ఉంటారు. వీరందరూ రోజుకు 8 నుంచి 12 గంటలు నిలబడి పని చేయాలని షోరూమ్‌ల యజమానులు అన్యాపదేశంగా సూచిస్తారు. కస్టమర్లు ఒకరి వెంట ఒకరుగా రావడం వల్లగాని లేదా స్టూల్స్ లేకపోవడం వల్లగాని వీరు కూర్చునే వీలు లేదు. నీరసం ఉన్నా, పిరియడ్స్‌లో ఉన్నా, నిలబడే శక్తి లేకున్నా వీరు నిలబడి ఉండాల్సిందే. దీని వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అరికాళ్లు, మోకాళ్లు బాధిస్తున్నాయి. దాంతో 2018లో ‘రైట్ టు సిట్’ అని కూచునే హక్కు కోసం అక్కడ కొంతమంది సేల్స్ గర్ల్స్ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి డిమాండ్‌లో సబబును గ్రహించింది. 2019 జనవరిలో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో పని చోట ఉద్యోగులందరూ తప్పనిసరిగా కూచునే ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ‘కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ను సవరించింది. దేశంలో ప్రయివేటు ఉద్యోగుల కూచునే హక్కుకు హామీ పలికిన తొలి రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది. ఇప్పుడు తమిళనాడులో మొన్నటి సెప్టెంబర్ 13న తమిళనాడు అసెంబ్లీలో కూడా ప్రయివేటు ఉద్యోగుల కూచునే హక్కుకు హామీ ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘తమిళనాడు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ – 1947’ను సవరించింది. ఏ షాప్ అయినా షోరూమ్ అయినా ప్రయివేటు ఉపాధి స్థలం అయినా ఉద్యోగులు కూచునే ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని యజమానులను ఈ సవరణ ఆదేశిస్తుంది. కూచుంటే ఎక్కడ యజమాని తిడతాడో అని భయపడాల్సిన అవసరం ఇక మీదట లేదు. రెండు రాష్ట్రాలే... మిగిలిన దేశంలో? అయితే ఇది మొదలు మాత్రమే. దేశంలో ఇంకా ఎంతో కదలిక రావాల్సి ఉంది. ఆయా ప్రభుత్వాలు ఈ సమస్యను గుర్తించాల్సి ఉంది. ఉద్యోగిని నిలబెట్టి ఉంచడం ఆ ఉద్యోగి ఆత్మగౌరవానికి భంగం కలిగించడం. అవమానించడం. బాధించడం. అనవసర శ్రమకు, ఒత్తిడికి గురి చేయడం. గౌరవంతో కూడిన పని చేసే హక్కు, గౌరవాన్ని పొందుతూ పని చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అని అంటాం. కాని వందలాది దుకాణాల్లో వేలాది సేల్స్ ఉమెన్, రిసెప్షనిస్ట్స్, టీచర్లు, ఇతర ప్రయివేటు ఉద్యోగులు ఎందుకు నిలుచుంటున్నారో... అంత నిలబడాల్సిన అవసరం ఏమిటో ఆలోచించాల్సి ఉంది. అవును. ‘కూచుని పని చేసే హక్కు’ ప్రతి ఒక్కరికీ ఉంది. చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా? -
మోకాళ్ల నొప్పులా.. ఈ పనులు చేయకండి
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో చాలామంది తాము ఎక్కువగా నడుస్తూ ఉంటే మోకాళ్ళు మరింతగా అరిగిపోతాయేమోనని, దాంతో నొప్పులు మరింతగా పెరుగుతాయేమోనని అపోహపడుతుంటారు. వాస్తవానికి ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి మన మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే, ఆ భాగంలో అంతగా రక్తప్రసరణ జరుగుతుంది. అలా రక్తప్రసరణ పెరగడం వల్ల కీళ్లకు మంచి పోషణ అందుతుంది. రాబోయే కాలం అనువైన సమయం... కొద్దిరోజుల్లోనే చలికాలం ముగియబోతోంది. చలి క్రమంగా తగ్గిపోయి ఉదయం వేళ, సాయంత్రం పూట నడకకు ఆస్కారం ఇచ్చే వాతావరణం... అంటే... అంతగా చలీ, అంతగా వేడీ లేని మంచి వాతావరణం మరో రెండు నెలలూ ఉండబోతోంది. అందుకే వీలైతే వెంటనే రోజుకు కొంతసేపు నడకకు కేటాయించండి. పది నిమిషాలు వ్యవధితో మొదలు పెట్టి క్రమంగా 40 – 60నిమిషాల వరకూ వాకింగ్ సమయాన్ని పెంచుతూ పొండి. నడక వల్ల మీ మోకాళ్లపై మీ దేహభారం పడుతుందని అనిపిస్తే...ఒకే చోట కూర్చుని చేసే సైక్లింగ్ కూడా చేయవచ్చు. నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడే ఉపకరణాలివి... మోకాలిలో నొప్పులు లేకుండా ఉండటానికి / నొప్పులు తగ్గడానికి నీ గార్డులు, క్రేప్ బ్యాండేజీలు, మోకాళ్ల వద్ద బిగుతుగా ఉంచే సపోర్టింగ్ సాక్స్, చిన్న బ్రేసెస్ ఇలాంటి కొన్ని ఉపకరణాలను అవసరమైన వారికి ఆర్థోపెడిక్ నిపుణులు సూచిస్తారు. అయితే పనుల్లో భాగంగా మోకాలిపైన భారం పడుతున్న సమయంలో మాత్రమే వీటిని ధరించాలి. లేదా డాక్టర్ సూచనలకు అనుగుణంగా మాత్రమే వీటిని ఉపయోగించాలి. ఈ పనులు చేయకండి... మోకాళ్ల నొప్పులున్నవారు ఇక్కడ పేర్కొన్న పనులేవీ చేయకూడదు. అవేమిటంటే... ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం వద్దు. ఎగుడు–దిగుడుగా ఉండే నేలపై నడవద్దు. నడక వ్యాయామం సమయంలోనూ సమతలంగా ఉండే నేలపైనే నడవండి. నేలపై కాళ్లు రెండూ మడత వేసుకుని కూర్చోవడం / లేవడం (స్కాటింగ్) చేయకండి. గొంతుక్కూర్చొని బరువైన వస్తువలేవీ ఎత్తకండి. నొప్పులు తగ్గకపోతే... పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటున్నా... నడక మొదలుపెట్టిన వారం లేదా రెండు వారాల్లో తగ్గకపోయినా ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించండి. వారు మీ మోకాళ్ళను ఎక్స్–రే తీసి, అవి ఏ మేరకు అరిగాయి అన్న విషయం తెలుసుకుంటారు. దాన్ని బట్టి మీకు ఎలాంటి వైద్య చికిత్స అవసరమో నిర్ణయిస్తారు. అవసరాన్ని బట్టి మందులతోపాటు ఫిజియోథెరపీని కూడా సూచించవచ్చు. ఫిజియోథెరపీలో కండరాలు, ఎముకలు గట్టిపడి వాటి కదలికలు మెరుగుపడతాయి. ఫిజియో అంటే మళ్లీ వ్యాయామాలే. కాబట్టి ఈ సారి క్రమంగా మీ నొప్పులు తగ్గుతూ మళ్లీ వ్యాయామం వైపునకు మళ్లే అవకాశం ఉంటుంది. -
పసుపుతో మోకాళ్ల నొప్పులు దూరం..
న్యూఢిల్లీ: భారత దేశంలో విస్తృతంగా ప్రజలందరు ఉపయోగించే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందే. పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ పదార్ధం ఉండడం ద్వారా అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పసుపుతో బ్యాక్టేరియా, వైరల్ ఇన్‌ఫైక్షన్స్ తగ్గుతాయని మనకు తెలిసు. కానీ మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సైతం తగ్గుతాయని ఆస్ట్రేలియాలోని టాస్మానియా విశ్వవిద్యాలయానికి చేసిన అధ్యయనంలో తేలింది. కాగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 70 మందిని కొన్ని వారాల పాటు పరీక్షించగా, బాధితులకు ఉపశమనం కలిగిందని తెలిపారు. అన్నల్ మెడిసిన్, జర్నల్ ఆఫ్ మెడిసిన అధ్యయన సంస్థలు సైతం పసుపుతో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని దృవీకరించాయి. భారత సంస్కృతిలోనే మెజారిటీ రోగాలకు పసుపును విరివిగా వాడేవారు. కానీ గత కొంత కాలంగా అల్లోపతి మందులను ఎక్కువగా వాడుతున్నారు. తాజాగా యాంటీ వైరల్ జబ్బులకు పసుపు ఎంత మేలు చేస్తోందో ఆయుర్వేద నిపుణులు తెలియజేయడంతో ప్రస్తుతం పసుపును విరివిగా వాడుతున్నారు. అయితే గతంలో కొందరు అల్లోపతి వైద్యులు కేవలం ఇంటి చిట్కాలకే ఉపయోగపడుతుందని భావించేవారు. కానీ విదేశీయుల అధ్యయనంలో కూడా పసుపు ద్వారా మోకాళ్ల నొప్పులు తగ్గనున్నట్లు తేల్చడం దేశ ఆయుర్వేధానికి ఎంతో ప్రయోజనకరం. పసుపును ఉపయోగించే విధానాలు -పసుపును పదార్ధాల రూపాల్లోనే కాకుండా మాత్రల రూపంలో కూడా ఉపయోగించవచ్చు -సాధారణంగా మన భారతీయుల వంటలలో పసుపును విరివిగా వాడుతుంటారు. పసుపులో లభించే కర్కుమిన్ పదార్ధం వల్ల ఎంతో లాభం -పాలలో పసుపును వేసి త్రాగితే అనేక రోగాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. -అదే విధంగా పసుపుతో కలిపిన టీ త్రాగినా ఆరోగ్య పటిష్టతకు ఎంతో లాభమని నిపుణులు సూచిస్తున్నారు. -
సైక్లింగ్ వల్ల మోకాళ్లు మరింత దెబ్బతింటాయా?
అపోహ : మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు సైక్లింగ్ చేయడం వల్ల ఆ నొప్పులు మరింత పెరుగుతాయి. వాస్తవం : సైక్లింగ్ ఎక్సర్సైజ్ వల్ల లేదా సైకిల్ తొక్కడం వల్ల మోకళ్లు మరింత దెబ్బతింటాయని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని మోకాళ్ల నొప్పుల నివారణకు అది మంచి వ్యాయామం. మామూలు సైకిల్ తొక్కినా, లేక ఒకేచోట స్థిరంగా ఉండే ఎక్సర్సైజ్ సైకిల్ తొక్కినా మీ బరువు మీ శరీరంపై పడదు. కాబట్టి మోకాళ్లపై శరీరం బరువు చాలా తగ్గిపోతుంది. సైక్లింగ్‌లో పెడల్ తొక్కడం వల్ల మోకాళ్లు బాగా కదిలి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక ఈత (స్విమ్మింగ్)లో కూడా శరీరం బరువు మోకాళ్లపై ఏమాత్రం పడదు కాబట్టి అది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. -
మోకాళ్ల నొప్పులు మళ్లీ రానే రావు...
నా వయసు 50 ఏళ్లు. ఇటీవల కొంతకాలంగా మోకాళ్లనొప్పుల తో బాధపడుతున్నాను. దీనికి హోమియోలో చికిత్స ఉందా? మోకాళ్ల నొప్పులు రావడానికి అధిక బరువే మొదటి కారణం. దేహం తాలూకు బరువు వివిధ దశల్లో కీళ్ల మీద పడుతుంది. నడిచేటప్పుడు ఆ బరువు నాలుగు రెట్లు అధికమై మోకాళ్ల మీద పడుతుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్ల మీద పడే భారం 6 నుంచి 7 రెట్లు అధికంగా ఉంటుంది. కీళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు కానీ... కీలు దెబ్బతిన్నప్పుడు మాత్రం సమస్యలు వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు: ►కూర్చుని లేచే సమయంలో ఇబ్బంది∙కీలు బిగుసుకుపోవడం ►లేచేటప్పుడు, కదిలించేటప్పుడు, నడిచేటప్పుడు మోకాలి నుంచి శబ్దం ►మోకాలిపై వాపు, నొక్కితే నొప్పి ఎక్కువవుతుంది. ►నొప్పి మూలంగా మెట్లు ఎక్కడం, దిగడంలో ఇబ్బంది. హోమియో చికిత్స: మోకాలి నొప్పులను దూరం చేయడంలో హోమియో మందులు ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఇతర వైద్య విధానాల్లో తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కానీ హోమియో చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ చర్మంపై పొలుసుల్లా రాలుతున్నాయి! నా వయసు 45 ఏళ్లు. ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇది సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు. లక్షణాలు: ►చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ►కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై కూడా మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ►తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురవుతారు. ఇటీవలి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది మరింత అధికం అవుతుంది. కాబట్టి ఒత్తిడిని దూరంగా ఉంచుతూ, పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను బట్టి వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా హోమియోలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స ఉంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
తొమ్మిది పదుల యువకుడు
పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెం రూరల్: ఆవేశ పడితే బీపీ.. శారీరక వ్యాయామం లేకపోతే సుగర్.. కాస్త ఎక్కువగా నడిస్తే కీళ్ల నొప్పులు.. ఇవి నేటి ఆధునిక మానవుడిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు. కానీ వీటికి భిన్నంగా పట్టణంలోని రెండో వార్డుకు చెందిన కవల కృష్ణమూర్తి(91) నిలుస్తున్నారు. తొమ్మిదో తరగతి చదివిన కృష్ణమూర్తి తొమ్మిది పదుల వయస్సు పైబడినప్పటికీ తన పనులు తాను చేసుకుంటూనే కళ్లజో డు లేకుండా వార్తా పత్రికలు చదవడం విశేషం. వయస్సు పైబడే కొలదీ వచ్చే బీపీ, సుగర్, కీళ్లనొప్పులు వంటివి ఏమీ ఆయన దరి చేరలేదు. వయస్సు పైబడినప్పటికీ నిత్య యవ్వనుడిగానే ఆయనను పేర్కొనవచ్చు. తన ఆరోగ్య రహస్యంపై ఆయనను ప్రశ్నిస్తే మాత్రంఇలా చెప్పుకొచ్చారు. ఆహారం విషయంలో సమయ పాలన పాటించడం, ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడమే కారణమంటున్నారు. ఆయన ప్రస్తుత దినచర్య విషయానికొస్తే... ఉదయం రెండు ఇడ్లీలు తిని తొమ్మిది గంటలకు ఇంటి వద్ద బయల్దేరి నెమ్మదిగా అదే వార్డు యర్రా నారాయణస్వామి మున్సిపల్ పాఠశాల ఆవరణలోని గ్రంథాలయానికి రావడం వార్తా దినపత్రికలను చదవడం. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం5 గంటలకు భోజనం. ఇదే ఆయన ఆహార పట్టిక. తొమ్మిది పదుల వయస్సు పైబడిన వృద్ధాప్యంలోనూ కనీసం కళ్లజోడు కూడా లేకుండా వార్తాపత్రికలను మొదటి నుంచి చివరి పేజీ అక్షరం వదలకుండా అవలీలగా చదివేస్తారు. ఈ వయస్సులో కనీసం బీపీ, సుగర్, కీళ్లనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఆయన దరి చేరకపోవడం విశేషం. -
చర్మం పొట్టుగా రాలుతోంది!
నా వయసు 28 ఏళ్లు. రెండు మూడు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతోంది. ఎన్ని మందులు వాడినా తాత్కాలికమైన ఉపశమనమే ఉంది. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. దీనికి హోమియోలో మందు ఉందా? – రాజేశ్, మంచిర్యాల మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సొరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సొరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసు వారికైనా రావచ్చు. కారణాలు : వంశపారంపర్యం లేదా అధిక ఒత్తిడి ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు సొరియాసిస్‌కు ప్రధాన కారణం. లక్షణాలు: ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది lకేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి lతలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు చూడటానికి కూడా బాగాలేక మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. వ్యాధి ఉన్నప్పుడు... ఆధునిక జీవన శైలి వల్ల వంశపారంపర్యంగా ఈ వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావిడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సొరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది. ఛాతీ నొప్పి... సమస్య ఏమిటి? నా వయసు 38 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టును కలిసి గుండె సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా? – నవీన్‌కుమార్, నల్లగొండ మీరు తెలిపిన వివరాలు, పేర్కొన్న లక్షణాలను బట్టి మీకు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్ డిసీజ్’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్ డిసీజ్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారు కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్ష ణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటి నుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. నా వయసు 40 ఏళ్లు. నెల రోజులుగా కడుపులో మంట, నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రతించాను. పరీక్షల్లో కడుపులో చిన్న పుండు ఉందని తేలింది. అల్ట్రాసౌండ్‌లో పిత్తాశయంలో రాయి ఉన్నట్లుగా వచ్చింది. ఈ సమస్య మందులతో తగ్గుతుందా, ఆపరేషన్ అవసరమా? – టి. రవి, వరంగల్ సాధారణంగా వయసు పెరిగేకొద్దీ పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్‌లో) రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నంతమాత్రాన ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రాళ్ల వల్ల తరచూ నొప్పి వస్తుంటే అప్పుడు గాల్‌బ్లాడర్‌ను తొలగించాల్సి ఉంటుంది. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు యాసిడ్ పెప్టిక్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీకు వచ్చే నొప్పి పిత్తాశయానికి సంబంధించినది కాదు. కాబట్టి మీరు భయపడాల్సిందేమీ లేదు. ఒకసారి వైద్యుడిని సంప్రతించి తగిన చికిత్స తీసుకోండి. -
ఇది కీళ్లనొప్పుల కాలం!
చలికాలంలో కీళ్లనొప్పులు మరీ ఎక్కువవుతాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎండాకాలంలోలా ఈ సీజన్లో సూర్యరశ్మి ఎక్కువగా తగిలే అవకాశం ఉండదు. దాంతో ఆటోమేటిగ్గా ఎముకలకు కావాల్సిన విటమిన్–డి కూడా తగ్గడం లాంటి అనేక కారణాలు దీనికి దోహదపడతాయి. ఆ నొప్పులు తగ్గాలంటే కొన్ని మార్గాలివి... ఈ సీజన్లో ఆరుబయట కాకుండా వీలైతే ఇన్డోర్ వ్యాయామాలు చేయండి. శీతకాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామాలు, తగినంత శారీరక శ్రమ మంచి మార్గం. మన కీళ్లలో ఎప్పుడూ కదలికలు ఉండేలా చేసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్య నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. ∙ఇంట్లో పనులు చేయడం... అంటే ఇల్లు శుభ్రం చేయడం, వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం వంటివి. ∙ఇన్డోర్ స్విమ్మింగ్ ∙ఇంట్లోనే తేలికపాటి మ్యూజిక్కు డాన్స్ చేయడం. ∙ఆఫీసులో లేదా మీరు వెళ్లిన చోట లిఫ్ట్‌కు బదులు మెట్లనే ఉపయోగించడం. ∙టీవీ చూస్తున్నప్పుడు కూర్చునే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం. నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని సూచనలు... ⇔ ఈ సీజన్లో వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. చాలామంది చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతారు. ఒంటిని వెచ్చబరచుకోడానికి దోహదం కాఫీ, టీ వంటివి ఎక్కువగా తాగేస్తారు. పైగా దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది. ఈ అన్ని కారణాలతో శరీరంలో నీళ్లు, లవణాల పాళ్లు తగ్గుతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. ⇔ ఈ సీజన్లో రూమ్ హీటర్లు వాడే సౌకర్యం ఉన్నవారు తమకు తెలియకుండానే శరీరంలోని ద్రవాలను కోల్పోతారు. అందుకే ఈ సీజన్లో అందరూ నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ⇔ మోకాళ్లపై ఎలాంటి భారం పడకుండానే మంచి వ్యాయామాన్ని చేకూర్చే ఈదడం వంటి ప్రక్రియలు ఈ సీజన్లో చాలా మంచిది. అయితే స్విమ్మింగ్‌పూల్‌లో బాగా చల్లటి నీళ్లుంటే మళ్లీ అది నొప్పులను పెంచేందుకే దోహదం చేయవచ్చు. అందుకే ఒకింత వేడిగా ఉండే నీళ్లు ఉండే పూల్స్‌లో ఈత మంచిది. పైగా ఆ వేడినీటి ప్రభావంతో (వార్మ్ బాత్ కారణంగా) కీళ్లనొప్పులూ బాగా తగ్గుతాయి. అయితే ఈత తర్వాత నేరుగా చల్లటి వాతావరణంలో వెళ్లకండి. పూల్ నుంచి బయటకు వచ్చాక ముందుగా కాసేపు బయటివాతావరణానికి మిమ్మల్ని మీరు అడ్జెస్ట్ చేసుకోండి. ఆ తర్వాతే బయటి వాతావరణంలోకి ప్రవేశించండి. ⇔ డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్స్ వాడండి. ఒకవేళ మీరు ఆస్టియో ఆర్థరైటిస్ రోగులైతే చలి మీ జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్లు వాడండి. అలాగే ఆహారంలో అది ఎక్కువగా ఉండే వెన్న, పాలు వంటి పదార్థాలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోండి. ⇔ ఈ సీజన్లో మీకు దెబ్బలు తగలకుండా చూసుకోండి. బయటకు వెళ్తున్నప్పుడు మంచి షూస్ ధరించడం, వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ–ప్యాడ్స్ వంటివి ధరించండి. ⇔ ఈ సూచనలు పాటిస్తున్నా మీ కీళ్ల నొప్పులు ఎంతకూ తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి తగిన మందులు వాడాలి. ఇలా ఈ సీజన్లో కీళ్లనొప్పుల నుంచి, కండరాల నొప్పుల నుంచి వీలైనంత రక్షణ పొందవచ్చు. -
'ఇంజెక్షన్లతో మోకాళ్ల నొప్పులు తగ్గవు'
ఖమ్మం: 'మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే మేమిచ్చే ఇంజక్షన్లను వాడండి. కొద్ది గంటల్లోనే నొప్పులు మాయమవుతాయి' బాపతు ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) విజ్ఞప్తి చేసింది. మోకాళ్ల నొప్పులకు చికిత్స పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ.. అనుమతిలేని ఉత్ప్రేరకాలను పేషెంట్లకు ఇంజెక్ట్ చేస్తున్నవైనాన్ని ఐఎంఏ ఖమ్మం జిల్లా శాఖ వెలుగులోకి తెచ్చింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పెద్దకూరపల్లిలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోన్న ఆసుపత్రిలో ఈ నకిలీ ఇంజెక్షన్ల వ్యవహారం కొనసాగుతోంది. అత్యవసర సమయాల్లో.. అదికూడా ఆర్థోపెడిక్ పర్యవేక్షణలో ఇచ్చే 'హైడ్రో కార్టిజం' ఇంజెక్షన్ ను యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. సదరు సంస్థ ప్రచారాన్ని నమ్మి ఆదిలాబాద్, కరీంగనగర్, వరంగల్, నల్లగొండ, పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు చెందిన వందలాదిమంది పేషెంట్లు ఇప్పటికే ఈ ఇంజెక్షన్లను తీసుకున్నట్లు తెలిసింది. బుధవారం సదరు ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఐఎంఏ ప్రతినిధులు.. పేషెంట్లకు వాస్తవాలను వివరించేప్రయత్నం చేశారు. ఉత్ప్రేరకాల ఇంజెక్షన్‌తో తాత్కాలికంగా మోకాళ్లనొప్పులు తగ్గినట్లు అనిపించినా దీర్ఘకాలికంగా దుష్ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షుడు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.