నా వయసు 50 ఏళ్లు. ఇటీవల కొంతకాలంగా మోకాళ్లనొప్పుల తో బాధపడుతున్నాను. దీనికి హోమియోలో చికిత్స ఉందా?
మోకాళ్ల నొప్పులు రావడానికి అధిక బరువే మొదటి కారణం. దేహం తాలూకు బరువు వివిధ దశల్లో కీళ్ల మీద పడుతుంది. నడిచేటప్పుడు ఆ బరువు నాలుగు రెట్లు అధికమై మోకాళ్ల మీద పడుతుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్ల మీద పడే భారం 6 నుంచి 7 రెట్లు అధికంగా ఉంటుంది. కీళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు కానీ... కీలు దెబ్బతిన్నప్పుడు మాత్రం సమస్యలు వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
లక్షణాలు:
►కూర్చుని లేచే సమయంలో ఇబ్బంది∙కీలు బిగుసుకుపోవడం
►లేచేటప్పుడు, కదిలించేటప్పుడు, నడిచేటప్పుడు మోకాలి నుంచి శబ్దం
►మోకాలిపై వాపు, నొక్కితే నొప్పి ఎక్కువవుతుంది.
►నొప్పి మూలంగా మెట్లు ఎక్కడం, దిగడంలో ఇబ్బంది.
హోమియో చికిత్స: మోకాలి నొప్పులను దూరం చేయడంలో హోమియో మందులు ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఇతర వైద్య విధానాల్లో తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కానీ హోమియో చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
డా‘‘ కె. రవికిరణ్,
మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్
చర్మంపై పొలుసుల్లా రాలుతున్నాయి!
నా వయసు 45 ఏళ్లు. ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా?
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇది సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు.
లక్షణాలు:
►చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది.
►కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై కూడా మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి.
►తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురవుతారు.
ఇటీవలి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది మరింత అధికం అవుతుంది. కాబట్టి ఒత్తిడిని దూరంగా ఉంచుతూ, పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి.
చికిత్స: రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను బట్టి వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా హోమియోలో జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స ఉంది.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment