
ఆర్థరైటిస్ కారణంగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు తాము వాకింగ్ చేస్తే తమ మోకాళ్లు మరింతగా అరిగిపోతాయని అపోహపడుతుంటారు. ఇది వాస్తవం కాదు. నిజానికి మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ అంత బాగా రక్తప్రసరణ అవుతుంటుంది. దాంతో కీళ్లకు పోషకాలు బాగా అందడమే కాకుండా కండరాలూ, ఎముకలు బాగా బలపడతాయి.
ఆర్థరైటిస్‌తో బాధపడేవారే కాకుండా, మధ్యవయసుకు వచ్చిన ఆరోగ్యవంతులందరూ వెంటనే వాకింగ్ మొదలుపెట్టడం మంచిది. సైక్లింగ్ వల్ల మోకాళ్లు మరింత అరుగుతాయనుకుంటారు కానీ ఒంటి బరువు పడకపోవడంతో సైక్లింగ్ కూడా మంచిదే. శరీరం బరువు మోకాళ్ల మీదా, తమ కాళ్ల మీద పడదు కాబట్టి స్విమ్మింగ్ కూడా మంచి ఎక్సర్‌సైజ్. పైగా స్విమ్మింగ్‌లో కేవలం మోకాళ్లకే కాకుండా ఒంటికంతటికీ మంచి వ్యాయామం సమకూరుతుంది.