Sore throat
-
2 గర్భసంచులు.. 2 రోజులు..2 ప్రసవాలు
అమెరికా మహిళ అరుదైన రికార్డు అద్భుతాలకే అద్భుతంగా చెప్పదగ్గ ఈ ఉదంతం అమెరికాలో జరిగింది. అలబామాకు చెందిన కెల్సీ హాచర్ అనే 32 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో డిసెంబర్ 19న యూనివర్సిటీ ఆఫ్ అలబామాలోని బర్మింగ్‌హాం ఆస్పత్రి (యూఏబీ)లో చేరింది. 10 గంటల పురిటి నొప్పుల తర్వాత సాధారణ కాన్పులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పురిటి నొప్పులు మాత్రం అలాగే కొనసాగాయి. మరో 10 గంటల తర్వాత సిజేరియన్ ద్వారా మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అబ్బురపరిచింది. కెల్సీకి రెండు గర్భసంచులుండటం, రెండింట్లోనూ ఒకేసారి గర్భధారణ జరగడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. మహిళల్లో ఇలా రెండు గర్భసంచులుండే ఆస్కారమే కేవలం 0.3 శాతమట! వారిలోనూ రెండింట్లోనూ ఒకేసారి గర్భం ధరించే ఆస్కారమైతే 10 లక్షల్లో ఒక్క వంతు మాత్రమేనట! అరుదైన ఈ జంట అద్భుతాలు రెండూ కలిసి రావడంతో కెల్సీ ఇలా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది!! తొలి మూడు కాన్పులు సాధారణమే... కెల్సీకి రెండు గర్భసంచులు ఉన్నట్టు 17వ ఏట బయట పడింది. కానీ పెళ్లి తర్వాత తొలి కాన్పుల్లోనూ సాధారణంగా ఒక్కొక్కరే పుట్టారు. ఈసారీ అలాగే జరగనుందని నెల తప్పినప్పుడు కెల్సీ అనుకుందట. ‘‘కానీ అల్ట్రా సౌండ్ చేయిస్తే రెండు గర్భసంచుల్లోనూ పిండాలున్నట్టు తెలిసి చెప్పలేనంత థ్రిల్‌కు లోనయ్యా. అసలలాంటిది సాధ్యమని మొదట నమ్మకమే కుదర్లేదు’’ అని సంబరంగా చెప్పుకొచ్చిందామె! అక్కణ్నుంచి కెల్సీ తన అసాధారణ జంట గర్భధారణ గాథను ఇన్‌స్టాగ్రాంలో రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచి్చంది. చూస్తుండగానే నెలలు నిండటం, ఆస్పత్రిలో చేరడం, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు పాపాయిలకు జన్మనిచ్చి రికార్డులకెక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ అరుదైన కాన్పుల కోసం ఆస్పత్రి డబుల్ ఏర్పాట్లు చేయడం విశేషం! డబుల్ మానిటరింగ్, డబుల్ చారి్టంగ్ మొదలుకుని కాన్పు కోసం రెండింతల సిబ్బందిని నియమించడం దాకా అన్నీ ‘రెట్టింపు స్పీడు’తో జరిగాయి. ఇద్దరు పాపాయిలూ గర్భంలో ఆరోగ్యంగా పెరిగినట్టు కాన్పు చేసిన వైద్య బృందానికి సహ సారథ్యం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ‘‘ఒకే గర్భసంచిలో రెండు పిండాలు పెరిగిన బాపతు సాధారణ గర్భధారణ కాదిది. పిల్లలిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్లలో మాదిరిగా ఎవరి గర్భసంచిలో వారు స్వేచ్ఛగా ఎదిగారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘డిసెంబర్ 19న రాత్రి 7.45 గంటలకు తొలి పాప పుట్టింది. 10 గంటల పై చిలుకు పురిటి నొప్పుల తర్వాత డిసెంబర్ 20న ఉదయం 6.10 గంటలకు సిజేరియన్ చేసి రెండో పాపను బయటికి తీశాం. ఇంతటి అరుదైన ఘటనకు సాక్షులుగా నిలిచామంటూ మా వైద్య బృందమంతా కేరింతలు కొట్టాం’’ అని వివరించారు. పిల్లల బుల్లి రికార్డు...! నవజాత శిశువులు కూడా రికార్డుల విషయంలో తమ తల్లికి ఏ మాత్రమూ తీసిపోలేదు. వేర్వేరు గర్భసంచుల్లో పెరగడమే గాక ఏకంగా వేర్వేరు పుట్టిన రోజులున్న అత్యంత అరుదైన కవలలుగా రికార్డులకెక్కారు. అంతేకాదు, వీరు ఎవరికి వారు వేర్వేరు అండం, వీర్య కణాల ఫలదీకరణ ద్వారా కడుపులో పడటం మరో విశేషం! ఇలాంటి కవలలను ఫ్రాటర్నల్ ట్విన్స్‌గా పిలుస్తారని ప్రొఫెసర్ రిచర్డ్ తెలిపారు. మొత్తానికి రికార్డులు సృష్టించడంలో తల్లికి తీసిపోమని పుట్టీ పుట్టగానే నిరూపించుకున్నారంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు! బంగ్లా మహిళ బంపర్ రికార్డు! ఇలాంటి అరుదైన ‘జంట జననాలు’ అత్యంత అరుదే అయినా అసలు జరగకుండా పోలేదు. 2019లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటన దీన్ని తలదన్నేలా ఉండటం విశేషం! రెండు గర్భసంచుల్లోనూ గర్భం దాలి్చన ఓ మహిళ తొలి కాన్పు తర్వాత ఏకంగా నెల రోజుల తర్వాత రెండో పాపాయికి జన్మనిచ్చిందట! ఆ పురుళ్లు పోసిన వైద్యుడు అప్పట్లో ఈ వింతను బీబీసీతో పంచుకున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దగ్గు, గొంతు నొప్పికి ఆయుర్వేదంలో పరిష్కారాలేంటీ?
ఆయుర్వేద చికిత్సలో తులసి ప్రధానమైంది. పొడి దగ్గు కోసం తులసి టీ తరచుగా తీసుకోవచ్చు. దగ్గును వదిలించుకోవడానికి మరియు కఫాన్ని తగ్గించడానికి, అలాగే అలెర్జీలు, ఉబ్బసం లేదా ఊపిరితిత్తుల వ్యాధి వల్ల కలిగే దగ్గు లక్షణాలను మెరుగుపరచడంలో తులసి సహాయపడుతుంది. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకున్నట్లయితే, జలుబు వల్ల కలిగే గొంతు నొప్పి, దగ్గు వంటి బాధలు తగ్గుతాయి. అల్లంలో ఉప్పు కలిపి పొంగించిన ఇంగువను కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకుని మింగితే కూడా నొప్పి తగ్గుతుంది. కఫంలో అప్పుడప్పుడు రక్తం కనిపించడం, గొంతు నొప్పి కఫంలో రక్తం వస్తే అది శరీరంలో అధిక వేడిని సూచిస్తున్నట్టు అర్థం. అలాగే గొంతు నొప్పి కూడా వేడి వల్ల వస్తుంది. కఫంలో రక్తం ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా పల్మనరీ ఎంబోలిజం వంటి తీవ్రమైన అంతర్లీన వైద్య పరిస్థితిని ఇది తెలుపుతుంది. ఆయుర్వేదంలో పరిష్కారమేంటీ? చిటికెడు నీళ్ళలో పసుపు వేసి మరిగించి ఆ ఆవిరిని రోజుకి పదిసార్లు పట్టాలి. పాలు, మిరియాలు పొడి పసుపు కలిపి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగితే రిలీఫ్ ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే తులసి ఆకుల రసం తేనేతో కలిపి తీసుకుంటే త్వరగా జలుబూ గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి. జలుబు లేకపోయినా రాత్రి పొడి దగ్గు వస్తే ఎలా తగ్గించాలి? శరీరంలో నీరు సరిపోక ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా దగ్గు వస్తుంది. దగ్గు అప్పటికప్పుడు వెంటనే తగ్గదు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత రిలీఫ్ ఉంటుంది. - ఉప్పు,నీళ్ళు గొంతు దాకా పుక్కిలించడం - మిరియాల కషాయం (రుచించడం కోసం కొంత బెల్లం కూడా కలపవచ్చు) - గోరు వెచ్చటి నీళ్లలో తేనె, నిమ్మరసం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సమస్య నివారణ కోసం దప్పిక వేసినప్పుడల్లా అశ్రద్ధ చేయకుండా కావలసినన్ని నీరు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. అదే పనిగా తేన్పులు.. ఏం చెయ్యాలి? జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువైనప్పుడు తేన్పు వచ్చినప్పుడు గాలితో పాటు ఆమ్లం గొంతు వరకు వస్తుంది. దానితో గొంతు మంటగా మారుతుంది. - ఆహారంలో మసాలాలు తక్కువగా ఉపయోగించాలి. సాత్వికాహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి. రాత్రి పూట గొంతులో మంట ఎందుకు వస్తుంది? ఈ సమస్య వచ్చింది అంటే మీకు ఎసిడిటీ లేదా ఆసిడ్ రిఫ్లెక్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. - రాత్రి పూట మసాలాలు, బాగా కారం, ఘాటు ఉన్న పదార్థాలు తగ్గించండి. - వీలుంటే 7, 8 గంటలకు ముందే రాత్రి భోజనం పూర్తి చేయాలి - దాని వల్ల గొంతు సాఫీగా ఉంటుంది. ఇబ్బంది రాదు. - డా. నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు -
గొంతు నొప్పి చాలా రోజుల నుంచి ఉందా? కారణాలు ఇవే
గొంతు నొప్పి ఉంటే చాలు, దానికి జలుబుకు ఆపాదించుకొని యాంటీబయాటిక్స్ మింగుతుంటారు. కొంతమందిగాని అది సరైన పద్ధతి కాదు. గొంతు నొప్పికి కారణాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే.. 1. అంగిటి_ముల్లు (టాన్సిలైటిస్) జలుబుకు కారణమైన వైరస్ క్రిములు గొంతు నొప్పిని కూడా కలిగించే అవకాశం ఉంది. బయట వాతావరణం నుంచి ఇన్ఫెక్షన్లు శరీరంలోనికి ప్రవేశించేటప్పుడు గొంతు లోపల ఇరుపక్కలా ఉండే టాన్సిల్స్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ను వైరస్ క్రిముల వల్లనే రావాలని లేదు; బ్యాక్టీరియా వాళ్ళ కూడా వస్తుంటాయి. అటువంటి సందర్భాలలో టాన్సిల్స్ మీద చీముతో కూడిన తెల్లని పొక్కులు కనిపిస్తాయి. తీవ్రస్థాయిలో జ్వరం వస్తుంది. ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. దీనిని 'కాంచనార గుగ్గులు' వంటి గ్రంథులమీద పని చేసే మందులతో చికిత్స అందించాల్సి ఉంటుంది. అసలు టాన్సిల్స్ అనేవి లేకపోతే వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తే ఉండదు. అనే భావనతో కొంతమంది టాన్సిలెక్టమీ కోసం డాక్టర్ మీద ఒత్తిడి తీసుకువస్తుంటారు కానీ ఇది సరైన భావన కాదు. టాన్సిల్ అడ్డుగా కనుక లేకపోతే ఇన్ఫెక్షన్ నేరుగా శరీరంలోకి ప్రవేశించి గుండె మొదలైన ముఖ్యమైన అవయవాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో పరిష్కారాలు : 1. పటిలను (పావు చెంచా) వేడి నీళ్ళలో (కప్పు) వేసి గొంతుకు తగిలేలా పుక్కిట పట్టాలి. 2. త్రిఫలాచూర్ణం (చెంచాడు) నీళ్ళలో వేసి కషాయం కాచి పుక్కిట పట్టాలి. 3. వెల్లుల్లిని ముద్దుచేసి, రసం పిండి కొద్దిగా వేడి చేయాలి. దీనికి తేనె కలిపి కాటన్ బడ్ తో టాన్సిల్స్ పైన ప్రయోగించాలి. 4. పసుపు, మిరియాల చూర్ణాలను (చిటికెడు) వేడి పాలతో తీసుకోవాలి. ఔషధాలు: కాంచనార గుగ్గులు, లఘుమాలినీవసంత రసం, తాళీసాది చూర్ణం, త్రిభువన కీర్తిరసం, ఇరిమేదాది తైలం, చంద్రప్రభావటి, శుభ్రవటి, వాసాకంటకారిలేహ్యం, కఫకేతురసం, తుండికేరి రసం. గ్లాండ్యులర్_జ్వరం: ఎప్ స్టీన్ - బార్ వైరస్ వల్ల కలిగే గ్లాండ్యులర్ ఫీవర్ లో దీర్ఘకాలం పాటు టాన్సిల్స్ వాపు ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన కొత్తలో టాన్సిల్స్ నొప్పి మొదలై చాలా రోజుల పాటు ఏ మందులకూ లొంగకుండా అలాగే ఉండిపోతుంది. దీనితోపాటు ఎడతెగని ఒళ్లు నొప్పులు, నీరసం, అనుత్సాహం వంటి శారీరక లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనిని అశ్వగంధ, విష్ణుప్రియ వంటి 'ఇమ్యునో మాడ్యులేటింగ్' మూలికలతో చికిత్సించాల్సి ఉంటుంది. ఔషధాలు: అశ్వగంధాదిలేహ్యం, అమృతప్రాశఘృతం, చ్యవనప్రాశాలేహ్యం, కూష్మాండలేహ్యం, నారాసింహఘృతం, విదార్యాదిఘృతం, సుకుమారరసాయనం. గొంతులో ఆహారేతర పదార్ధం: కొంతమంది మాంసాహారం తినేటప్పుడు అలవాటుగా బొమికలను కూడా తింటుంటారు. ఒకవేళ వీటిని సరిగా నమలకుండా కనుక తిన్నట్లయితే అవి గొంతు లోపల గుచ్చుకొని గాయమై నొప్పిని కలిగించే అవకాశం ఉంది. అలాగే, కొన్ని సందర్భాల్లో బొమికల ముక్కలు, చేపలముళ్లు గొంతులో ఇరుక్కొని నొప్పిని కలిగించే అవకాశం ఉంది. వైద్య సహాయంతో వీటిని తొలగించాల్సి ఉంటుంది శ్వాసకోశ సంబంధ ఎలర్జీలు (ఈసినోఫీలియా): కొంతమందిలో ఏ ఇన్ఫెక్షనూ లేకపోయినప్పటికీ గొంతు నొప్పి వస్తుంటుంది. ఎలర్జీలు దీనికి ప్రధానమైన కారణం. సిగరెట్ పొగ, పాత పుస్తకాల వాసన, దుమ్ము, ధూళీ అవసరాలని మించి మాట్లాడటం వంటి కారణాల మూలంగా ఎలర్జీ ఏర్పడి గొంతు లోపలి మ్యూకస్ పొర ఇరిటేట్ అవుతుంది. తత్కారణంగా గొంతునొప్పి వస్తుంది. కారణాలను జాగ్రత్తగా తరచి చూసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఔషధాలు: దశమూలారిష్టం, ఏలాది చూర్ణం, కర్పూరాది చూర్ణం, కస్తూర్యాది గుటిక, కస్తూరి మాత్రలు, మకరధ్వజ మాత్రలు, స్వచ్ఛంద భైరవ రసం, తాళీసాది చూర్ణం, బాహ్యప్రయోగాలి - చంద్రకళా లేపం, రాస్నాది చూర్ణం, కర్పూరాది తైలం. ఆమ్లపిత్తం (ఎసిడిటి /హార్ట్ బర్న్): అజీర్ణం, ఎసిడిటి, గ్యాస్ వంటి కారణాల వల్ల అమాశయంలో ఉండాల్సిన ఆమ్ల పదార్ధం అన్న నాళిక ద్వారా గొంతులోనికి ఎగదన్ని అక్కడ నొప్పినీ, మంటనూ కలిగించే అవకాశం ఉంది. దీనికి ఆయుర్వేద శాస్త్రం సూచించిన 'ఆమ్లపిత్త హర చికిత్సలు" చేయాల్సి ఉంటుంది. టీ, కాఫీ, సిగరెట్ల వంటి వాటిని మానేసి పాలు వంటి సాత్వికాహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. 1. ఆహారం కొద్దిమొత్తాలలో తినాలి. 2. కారం, పులుపు, మసాలాలు తగ్గించాలి. 3. ధూమపానం మద్యపానాలు పనికిరావు. 4. బరువు తగ్గాలి. 5. ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి. ఆయుర్వేదంలో సలహాలు : 1. పిల్లిపీచర గడ్డలను పొడిచేసి, అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 2. ఉసిరికాయ పెచ్చులను పొడిచేసి అరచెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవాలి. 3. అతి మధురం వేరును పొడిచేసి పావు చెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకోవాలి. 4. తిప్పసత్తును రేగు గింజంత మోతాదుగా చన్నీళ్లతో లేదా తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఔషధాలు: సంశమనీవటి, అవిపత్తికర చూర్ణం, ధాత్రీలోహం, కామధుఘరసం, శంఖ భస్మం, సూతశేఖర రసం, ప్రవాళ పంచామృతం, సుకుమార ఘృతం. కంటసుధరకవటి ఉపయోగాలు : గొంతు నొప్పి , జలుబు, దగ్గు, గొంతులో గరగర, గురక రావటం డా.నవీన్ నడిమింటి, హోమియో వైద్యులు -
రాజ్‌పుత్‌ది హత్యే..!
న్యూఢిల్లీ: గొంతు నులమడం వల్లనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపించారు. తాను పంపిన సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యం దారుణమన్నారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. జూన్ 14న ముంబైలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ ఉరివేసుకుని చనిపోయి కనిపించారు. ఈ మృతికి కారణమంటూ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ బాలీవుడ్– డ్రగ్స్ సంబంధాలపైవిచారణ వరకు వచ్చింది. -
గొంతు నొప్పికి వైద్యులు చెప్పిన కారణం తెలిస్తే..
టోక్యో : జలుబు, గొంతు నొప్పి పట్టి పీడిస్తుంటే ఓ మహిళ వైద్యానికి ఆస్పత్రికి వెళ్లగా అక్కడ డాక్టర్లు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యానికి గురయ్యింది. గొంతునొప్పికి మందులు ఇస్తారని ఆశించిన మహిళకు వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. మహిళ నొప్పికి కారణం ఆమె గొంతులో సజీవంగా ఉన్న పురుగు ఉందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా కంగుతింది. ఈ ఆశ్చర్యకర సంఘటన జపాన్‌లో చోటుచేసుకుందిం. ది అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ హైజీన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. టోక్యోకు చెందిన 25 ఏళ్ల మహిళ ఇటీవల జపాన్ రాజధాని సెయింట్ లూకాస్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేసుకుంది.తరచూ తలనొప్పి: యువతి మెదడులో.. జపానీస్ వంటకం షాషిమి(చేపలు, లేదా ఇతర మాంసాన్ని చిన్న ముక్కులుగా కోసి పచ్చివి తినడం) తిన్న తర్వాత తన గొంతులో నొప్పి మొదలైందని వైద్యులకు తెలిపింది. దీంతో సదరు మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె గొంతులో 1.5 అంగుళాల పొడవైన, 1 మి.మీ వెడల్పున్న పురుగు ఉన్నట్లు తెలిపారు. అనంతరం చికిత్స చేసి దానిని తొలగించగా అది ఇంకా సజీవంగానే ఉండటం గమనార్హం. అదృష్టవశాత్తు పురుగును తొలగించిన తరువాత మహిళా ఆరోగ్య పరిస్థితి కుదుట పడినట్లు వైద్యులు తెలిపారు. పురుగుకి డీఎన్ఏ పరీక్ష చేయగా అది ఎర్రటి వానపాముగా గుర్తించారు. ఇది పచ్చి మాంసం తినేవారికి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. (మూడు కళ్లతో బాబు: నిజమేనా?) (ఈ వింత చూశారా? 50 లక్షల్లో ఒకరికి ఇలా జరుగుతుందట) -
నేనే బాగున్నాను
అదొక రంగురంగుల పక్షి. అందమైన దాని రూపాన్ని చూసి, తియ్యనైన దాని గొంతును విని ముచ్చటపడి దాన్ని ఒక పంజరంలో పెట్టారు. ఒక గిన్నెలో నీరు, మరో గిన్నెలో ధాన్యపు గింజలు వేసి ఉంచారు. పంజరం లోపలే అది కూర్చునేందుకు చిన్న పీట వేశారు. అయితే, ఆ పక్షి ఇవేమీ గమనించే స్థితిలో లేదు. బయట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న మరో పక్షి మీదనే దాని దృష్టంతా. దాన్ని చూస్తూ, ‘నాకు ఈ పంజరమే ప్రపంచం, ఇక్కడ నాకు ఊపిరి సలపడం లేదు’ అన్న బాధ! దాంతో ఆ పక్షిపై ఈరా‡్ష్య భావాన్ని పెంచుకుంది. ఇంకొక వైపు బయట ఉన్న పక్షి.. ‘ఈ పంజరంలో బంధించి ఉన్న పక్షి ఎంత సుఖంగా ఉంది! దీనికి తిండీ నీరు సంపాదించుకునే కష్టం లేదు. గాలివానల భయం లేదు. వేటాడే పక్షుల నుంచి తప్పించుకునే శ్రమ లేనే లేదు. నాకు మాత్రం ఎప్పుడూ ఆహారం సంపాదించుకోవడం, నీరు తాగడం గురించిన ఆలోచనే. గాలి వానల్లో ఎంతో కష్టంగా ఉంటుంది. చాలాసార్లు గద్దల్లాంటి పక్షుల నుండి రక్షించుకోవటం కష్టమైపోతుంది..’ అని ఆలోచించి తనకు తాను బాధపడుతూ పంజరంలోని పక్షిపైన ఈర‡్ష్య పడసాగింది. విషయమేంటంటే అవి రెండూ తనకన్నా మరో పక్షే ఎక్కువ సుఖంగా ఉన్నట్లు భావిస్తున్నాయి. ఒకవేళ రెండింటి ఆలోచనలు మార్పు చెందితే.. పంజరంలో ఉన్న పక్షి ‘నేను ఎంత సుఖంగా ఉన్నాను. నాకైతే అన్నీ పంజరంలోనే దొరుకుతున్నాయి. కాని పాపం తిండి, నీరు వెదుక్కునే అవస్థ, ప్రతికూల వాతావరణ బాధ, వేటగాళ్ల నుంచి పొంచి ఉండే ప్రమాదం బయట తిరిగే పక్షికి ఎప్పుడూ తప్పవు కదా!’ అని ఆలోచిస్తే బయటి పక్షి మీద అసూయ చెందదు. బయటి పక్షి.. ‘నేనెంత సుఖంగా, స్వేచ్ఛగా ఉన్నాను! ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎపుడంటే అప్పుడు వినువీధిలో హాయిగా ఎగరగలను. కానీ, పాపం! ఆ పంజరంలోని పక్షికి ఈ సుఖం ఎప్పటికీ ఉండదు. అస్తమానం దీని ప్రపంచం ఆ పంజరమే కదా!’ అని ఆలోచిస్తే పంజరంలోని పక్షిపై దానికి ఈర్ష్య బదులు సానుభూతి కలుగుతుంది. వాటి ఆలోచనలలో ఈ విధమైన మార్పు వస్తే రెండింటి దృక్పథమూ మారిపోతుంది. మన ఆలోచనలు కూడా ఇక్కడి ఆ పక్షులకన్నా విభిన్నం ఏమీ కాదు. అందరూ తమ తమ పరిస్థితులను అనుకూలంగా, అదృష్టంగా భావిస్తూ, ఇతరుల గురించి సానుభూతిగా ఆలోచిస్తూ, వారి మంచి కోరుకోవడంలోనే తృప్తి, సంతృప్తి ఉన్నాయి. – డి.వి.ఆర్. -
ఫారింజైటిస్...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. నాకు గత కొంతకాలంగా గొంతు పచ్చి చేసి పుండులా ఏర్పడటంతో తీవ్రమైన గొంతునొప్పి వస్తోంది. ఆహారం మింగే సమయంలో ఇబ్బందిగా ఉంటోంది. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినా జలుబు చేసినప్పుడు, తెల్లవారుజామున చల్లటి వాతావరణాన్ని ఎదుర్కొన్న ప్రతిసారీ సమస్య తిరగబెడుతోంది. గత చలికాలంలో నాకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండేది. అయితే పగటివేళ ఎండ ఎక్కువగానే ఉంటున్నా... ఇప్పుడు ఉదయం పూట చలికి తిరిగినప్పుడు సమస్య మళ్లీ మళ్లీ వస్తోంది. హోమియో చికిత్స ద్వారా మళ్లీ తిరగబెట్ట విధంగా పూర్తిగా నయం చేసేలా సలహా ఇవ్వగలరు. – సంతోష్మోహన్, నిజామాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు ఫ్యారింజైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గొంతు వెనక భాగాన్ని ఫ్యారింగ్స్ అంటారు. ఈ భాగానికి ఇన్ఫెక్షన్ రావడాన్ని ఫ్యారింజైటిస్ లేదా సోర్ థ్రోట్ అంటారు. సాధారణంగా ఈ వ్యాధి ఒక వారం రోజలలో తగిపోతుంది. కానీ సరైన చికిత్స అందించకుండా తరచూ ఈ వ్యాధికి గురవుతున్నట్లయితే చెవి ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్, కిడ్నీ సంబంధింత వ్యాధులు (గ్లోమరులోనెఫ్రైటిస్), రుమాటిక్ ఫీవర్ వంటి వాటికి దారితీయవచ్చు ఒక్కోసారి శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం కూడా ఉంది. కారణాలు: ►ఈ వ్యాధి 90 శాతం కేసుల్లో వైరస్ వల్ల కలుగుతుంది. జలుబు, ఫ్లూ, మీజిల్స్, మోనోనూక్లియోసిస్, చికన్పాక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సమస్యకు కారణం కావచ్చు. ►మరికొంత మందిలో ఇది బ్యాక్టీరియా వల్ల కూడా కావచ్చు. కోరింతదగ్గు, కొన్ని స్టెఫలోకోకస్ సూక్ష్మజీవులు, డిఫ్తీరియా వంటి బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ►ఈ ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తి దగ్గడం లేదా తుమ్ముడం చేసినప్పుడు ఆ తుంపిర్ల ద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియా గాల్లోకి చేరి, తద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపించే అవకాశం ఉంది. ►పొగతాగడం, పరిశుభ్రత పాటించకపోవడం, వ్యాధికి గురైన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వంటి అంశాల వల్ల ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. ► కొన్ని అలర్జీలు, గొంతుకండరాలు ఒత్తిడికి గురికావడం, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు, గొంతు, నాలుక లేదా లారింగ్స్లో కణుతులు ఏర్పడటం వల్ల కూడా గొంతు నొప్పి కలుగుతుంది. లక్షణాలు: ► ఫ్యారింజైటిస్ ముఖ్యలక్షణాల్లో గొంతునొప్పి, మింగేటప్పుడు నొప్పిగా ఉండటం చాలా ముఖ్యమైనవి. మిగతా లక్షణాలు ఇన్ఫెక్షన్కు కారణమైన బ్యాక్టీరియా లేదా వైరస్ మీద ఆధారపడి ఉంటాయి. ► వైరల్ ఫ్యారంజైటిస్ : గొంతునొప్పితో పాటు గొంతులోపలి భాగం ఎర్రగా మారడం, ముక్కు కారణం లేదా ముక్కుదిబ్బడ, పొడిదగ్గు, గొంతు బొంగురుపోవడం, కళ్లు ఎర్రబారడం, చిన్న పిల్లల్లో విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లలో నోటిలో, పెదవులపై పుండ్లలా ఏర్పడటం కూడా సంభవిస్తుంది. ► బ్యాక్టీరియల్ ఫ్యారంజైటిస్ : దీనిలో కూడా గొంతు పచ్చిగా ఉండటం, మింగే సమయంలో నొప్పి కలగడం, గొంతు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లతో పోలిస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో లక్షణాల తీవ్రత ఎక్కువ. ► పైన పేర్కొన్న లక్షణాలతో పాటు జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, టాన్సిల్స్ వాపు, వాటి చుట్టూ తెల్లటి పొర ఏర్పడటం, గొంతుకు ముందుభాగంలోని లింఫ్‌గ్రంథుల వాపు వంటి లక్షణాలు గమనించవచ్చు. ► ఇదే సమస్య పిల్లల్లో వస్తే... కొంతమంది చిన్నపిల్లల్లో వికారం, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలూ కనిపించవచ్చు. చికిత్స: ఒంట్లోని రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు సూక్ష్మజీవుల వల్ల ఫ్యారింజైటిస్ వస్తుంది. జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో రోగి శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి లక్షణాలు, కారణాలు, వాతావరణంలోని మార్పుల ఆధారంగా చికిత్స చేయవచ్చు. హోమియో విధానంలో చికిత్సతో ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్స్ వాడితే కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు. కానీ హోమియో విధానంలో సమస్య మళ్లీ తిరగబెట్టకుండా చికిత్స చేయడం సాధ్యమే. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
గొంతునొప్పితో గుండెకూ చేటు!
కౌన్సెలింగ్ మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఇటీవల వాడు గొంతు నొప్పి అంటుంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. అక్కడి డాక్టర్లు పరీక్షలు చేసి అది రుమాటిక్ ఫీవర్ అని, ఇదొక రకం గుండె సమస్య అని చెప్పారు. చూడటానికి జలుబు లా చిన్న సమస్యగా అనిపించే ఇది గుండె సమస్య లాంటి పెద్ద సమస్య ఎలా పరిణమించింది? దయచేసి వివరించండి. – గోపాల్‌రావు, హైదరాబాద్ గొంతునొప్పికీ....గుండె జబ్బుకూ సంబంధం ఉంటుందన్న మాట వినడానికే కాస్త నమ్మకం కలిగించేదిగా లేదు కదా. అయితే చిన్నారులకు బాగా జలుబు చేసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా పరిగణించకూడదు. ఎందుకంటే అది కొందరిలో జలుబు, గొంతునొప్పితో వ్యక్తమయ్యే ఆ లక్షణాలు స్ట్రెప్టోకోకస్ పీయోజెన్స్ వల్ల టాన్సిలైటిస్కూ, ఆ తర్వాత రుమాటిక్ ఫీవర్కూ దారి తీసే అవకాశం ఉంది. ఈ రుమాటిక్ ఫీవర్ సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా 5 – 10 ఏళ్ల పాటు రుమాటిక్ ఫీవర్ కొనసాగితే, అది గుండె వాల్వ్స్పై దుష్ప్రభావం చూపి గుండెకు నష్టం చేస్తుంది. దీనికి తొలి దశలో యాంటీబయాటిక్స్‌తో చాలా చాలా చిన్నదైన తగిన చికిత్స అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్‌కూ దారితీయవచ్చు. చికిత్స అందించినప్పటికీ చాలా మంది చిన్నారులకు వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం కూడా పడవచ్చు. అలాగే రక్తం పలుచబార్చే మందులు జీవితాంతం వాడాల్సి రావచ్చు. ఇలాంటి వారిలో ఆడ పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు ప్రెగ్నెన్నీ వస్తే అది కూడా ఒక సమస్యగా పరిణమించవచ్చు. అందుకే గొంతునొప్పితో జలుబును పోలి ఉండే ఒక మామూలు సమస్యనూ చిన్న సమస్యగా పరిగణించకూడదు. మీరు చెప్పిన అంశాలను బట్టి ఇది ఇంకా చాలా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మీరు వెంటనే దగ్గర్లోని గుండె నిపుణులను సంప్రదించండి. డాక్టర్ కృష్ణప్రసాద్, చీఫ్ కార్డియోవాస్క్యులర్ థొరాసిక్ సర్జన్ అండ్ డైరెక్టర్,మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
గొంతు క్యాన్సర్‌కు కోతలేని ఆధునిక రోబోటిక్ చికిత్స
థ్రోట్ కేన్సర్ కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. రెండేళ్ల కిందట ఆమె గొంతులో... అంటే కొండనాలుక భాగంలో ఒక చిన్న గడ్డలా ఏర్పడింది. ఆహారం తినలేక తీవ్రమైన నొప్పితో బాధపడతూ ఉండేది. ఒక హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు పరీక్షించి ‘గొంతు క్యాన్సర్’ అని చెప్పారు. రేడియో థెరపీ చేస్తామంటూ చెప్పారు. అయితే చికిత్స చేయించాక కూడా ఏమీ తగ్గలేదు. సమస్య పునరావృతమైంది. అదేమంటూ మేం వెళ్లి అడిగాం. కానీ వాళ్లేమీ పట్టించుకోలేదు. మా అమ్మాయి అవస్థ చూడలేకపోతున్నాం. పెళ్లికావాల్సిన వయసులో ఆమెకు వచ్చిన ఈ సమస్య మమ్మల్ని చాలా మానసిక వేదనకు గురిచేస్తోంది. దయచేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి. - మాధవి, హైదరాబాద్ మీరు చెబుతున్న విషయాలను బట్టి మీ అమ్మాయికి వచ్చిన సమస్యను అక్కడి డాక్టర్లు చక్కగానే గుర్తించారుగానీ అవసరమైన చికిత్సను మాత్రం అందించలేకపోయారని తెలుస్తోంది. మీ అమ్మాయికి వచ్చిన క్యాన్సర్ చాలా అరుదైనది. దీనికి అవసరమైన ఆధునిక ఉపకరణాలు, వైద్య సదుపాయాలు ఉన్న పెద్ద సెంటర్లో చికిత్స చేయించడం అవసరం. మీ అమ్మాయి గొంతులో ఏర్పడ్డ క్యాన్సర్ గడ్డకు అక్కడి వైద్యులు తమకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో చేసిన చికిత్స... ఆమె సమస్యను పూర్తిగా తగ్గించలేకపోయిందని మీరు రాసిన దాన్ని బట్టి తెలుస్తోంది. అలాగే ఇప్పుడు ఆమెకు సర్జరీ లాంటి విధానాలు అవలంబించినా గొంతు దగ్గర గాటు, గీత పడతాయి కాబట్టి భవిష్యత్తులో ఆ మచ్చ అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. మీ అమ్మాయి పెళ్లీడుకు వచ్చిందని అంటున్నారు కాబట్టి అలాంటి సమస్యలేమీ లేకుండా ఉండేలా అత్యాధునికమైన వైద్యప్రక్రియను అవలంబించాల్సి ఉంటుంది. మీ అమ్మాయి గొంతు క్యాన్సర్‌కు అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్డ్ ‘డావిన్స్డ్ రోబో’ సర్జరీ విధానం చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. ఇది మీ అమ్మాయి సమస్యను సమూలంగా, శాశ్వతంగా నిర్మూలిస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ చికిత్స ప్రక్రియలో వైద్యులు రోబోటిక్ పరికరాలను నోటి ద్వారా పంపిస్తారు. దానికి కెమెరా అనుసంధానమై ఉంటుంది. ఇది 180 డిగ్రీల పరిమాణంలో తిరుగుతూ ట్యూమర్ ఉన్న స్థానాన్ని 3డి విజన్‌లో బయట ఉన్న స్క్రీన్‌పై స్పష్టంగా చూపెడుతుంది. రోబోటిక్ పరికరాలను నియంత్రిస్తున్న డాక్టర్... ట్యూమర్‌ను సమూలంగా తొలగించగలుగుతారు. అలాగే దాని చుట్టుపక్కల క్యాన్సర్‌కు సంబంధించి ఇతరత్రా చిన్న చిన్న ట్యూమర్లు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని కూడా ఈ రోబోటిక్ పరికరం ద్వారా సులువుగా గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో వైద్యులు ఆ క్యాన్సర్ ట్యూమర్లను సమూలంగా, శాశ్వతంగా నిర్మూలించగలుగుతారు. ఈ నూతన చికిత్సా విధానాన్ని ‘ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ’ అని అంటారు. మీ అమ్మాయి సమస్యకు ఇది చాలా సురక్షితమైన చికిత్స ప్రక్రియ అని కచ్చితంగా చెప్పవచ్చు. మీరు ఎంతమాత్రమూ ఆందోళన చెందవద్దు. మీ అమ్మాయి సమస్యకు సర్జరీతో సంపూర్ణ చికిత్స అందుబాటులోనే ఉంది. గొంతు క్యాన్సర్‌కు సంబంధించిన ట్యూమర్ ముదరకముందే, ఇతర భాగాల్లోకి వ్యాపించకముందే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అమ్మాయికి సరైన చికిత్సను అందించండి. డా జగదీశ్వర్‌గౌడ్ గజగౌని, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఎన్నో ఆరోగ్య సమస్యలకు మందు... దానిమ్మ ఆయుర్వేదం కౌన్సెలింగ్ నాకు రక్తం తగ్గిందని చెబితే కొంతమంది స్నేహితులు దానిమ్మపండు తినమని చెప్పారు. దీని అన్ని వయసుల వారు తినవచ్చా? ఆయుర్వేదంలో దీని ప్రాముఖ్యత తెలియజేయండి. - బంటీ సింగ్, హైదరాబాద్ దానిమ్మ పండును సంస్కృతంలో దాడిమః అంటారు. దీనికి చాలా పర్యాయ పదాలున్నాయి. కొన్ని ముఖ్యమైనవి... దంతబీజ, రక్తబీజ, రక్తపుష్ప, సునీల, నీలపత్ర, శుకవల్లభ, కుచఫల. వృక్షశాస్త్రంలో దీనిని ప్యూనికా గ్రనేటం అంటారు. గుణాలు, ప్రయోజనాలు: దానిమ్మ పండు అరుచిని పోగొట్టి నాలుకకు రుచిని పెంచుతుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది. ఆకలిని పుట్టించి, జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది. దప్పికను, శరీరంలోని మంటను పోగొడుతుంది. బలకరం. పుష్ఠికరం, శుక్రకరం, గొంతు గరగర, మంట, నొప్పి, నీళ్ల, జిగట విరేచనాలు తగ్గిస్తుంది. గుండెజబ్బులను నివారిస్తుంది. జ్వరహరం కూడా. భావప్రకాశ గ్రంథంలోని శ్లోకం: ‘‘....త్రిదోషఘ్నం, తృట్ దాహ జ్వరనాశనం; హృత్ కంఠ ముఖ రోగఘ్నం; తర్పణం శుక్రలం, గ్రాహీ, మేధాబలప్రదం; దీపనం రుచ్యం...’’ చికిత్సకోసం వాడే భాగాలు: బెరడు పువ్వులు పిందెలు పండు తొక్క పండు గింజల రసం ఆకులు వేరు మీద పట్ట బెరడు కషాయం: తాగితే నీళ్ల, జిగట విరేచనాలు తగ్గుతాయి. కషాయంతో కడిగితే వ్రణాలు (పుండ్లు) త్వరగా మానిపోతాయి. బెరడు చూర్ణం: ఒక చెంచా చూర్ణం, ఒక చెంచా తేనె కలిపి నాకితే కోరింత దగ్గు తగ్గుతుంది. లేత పిందెలు: తియ్యని పెరుగులో మెత్తగా నూరి ఒక చెంచా సేవిస్తే చంటిపిల్లల విరేచనాలు తగ్గుతాయి. కాయ: మెత్తగా దంచి, పైన పట్టువేస్తే, స్త్రీలలో రొమ్ములు పెరుగుతాయి. పువ్వులు: నీడలో ఎండించి, మెత్తగా పొడిచేసి తేనెతో సేవిస్తే బొంగురుపోయిన గొంతు బాగుపడుతుంది. కంఠరోగాలు శమిస్తాయి. ఆకులు: దంచిన ముద్దను కనురెప్పలపై ఉంచితే కండ్లకలక తగ్గుతుంది. పండు మీది తొక్క: తొక్కను దంచి రసం తీసి, తేనెతో కలిపి నాకిస్తే గర్భిణులకు వాంతులు తగ్గుతాయి. తొక్కను నోటిలో నములుతూ రసాన్ని మింగుతుంటే దగ్గు తగ్గుతుంది. వేరు మీద పట్ట: కషాయం కాచుకుని తాగితే (4 చెంచాలు, రోజుకి రెండుసార్లు) కడుపులోని క్రిములు (నట్టలు) నశిస్తాయి. దీనితో కడిగితే యోనివ్రణాలు తగ్గి తెల్లబట్ట, మంట, దురద తగ్గుతాయి. పండ్లగింజలు:రసాన్ని సేవిస్తే నెత్తురుపట్టి పుష్టి కలుగుతుంది. పచ్చకామెర్లు తగ్గుతాయి. ఛాతీలో నొప్పి తగ్గుతుంది. పండ్ల గింజలను ఎండబెట్టి... దంచి కషాయం కాచుకోవాలి. సుమారు 6 చెంచాల) ద్రవ్యాన్ని 300 మిల్లీలీటర్ల నీళ్లలో సగం నీళ్లు ఇగిరేలా కాచి వడగట్టాలి. ఆ నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగితే... గుండెధమనుల్లో గడ్డకట్టిన రక్తం కరిగి రక్తప్రసరణ సాఫీ అవుతుంది. ఇటీవల చాలామంది వైద్యులు... ఎమర్జెన్సీ లేని రోగులకు ఈ కషాయాన్ని 3 నుంచి 6 నెలల పాటు వాడితే మంచి ఫలితాలు కనబడ్డాయి. రక్తంలోని అధిక చెడు కొవ్వులు కూడా తగ్గిన దాఖలాలున్నాయి ఛాతీ ప్రాంతంలో నొప్పి, ఆయాసం తగ్గి, తేలికగా నడవటం సాధ్యమవుతుంది ఆహార విహారాలలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. అప్పుడే ఫలితాలు బాగుంటాయి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్ ముక్కులో ఏదో అడ్డంకి... ఎందుకిలా? ఇఎన్‌టి కౌన్సెలింగ్ నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి పరిష్కారం తెలపండి. - జ్ఞానసుందర్, ఒంగోలు ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను కలవండి. వైద్య పరీక్షలు చేయించాక, వ్యాధి నిర్ధారణ ముందుగా జరగాల్సిన పని. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
హెల్త్‌టిప్స్
పడిశం, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గాలంటే టీ మరిగేటప్పుడు చిన్న అల్లం ముక్కను చితక్కొట్టి వేసి కనీసం ఒక నిముషం మరిగించి తాగితే ఉపశమనం ఉంటుంది. ఈ టీని రోజుకు రెండుసార్లు తాగవచ్చు. పడిశానికి తోడు సైనస్ సమస్య బాధిస్తుంటే అర లీటరు నీటిని మరిగించి అందులో చిటికెడు పసుపు వేసి ఆవిరి పట్టాలి. ఉదయం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి చేస్తే పడిశం త్వరగా తగ్గుతుంది. గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు కలిపి రోజుకు రెండు- మూడుసార్లు గార్గిలింగ్ చేస్తే (గొంతులో పోసుకుని గరగరలాడించడం) గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. -
ఈఎన్టీ కౌన్సెలింగ్
నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కూడా ట్యూషన్స్ ఎక్కువగా చెబుతుంటాను. ఇటీవల నా గొంతు బొంగురుగా ఉంటే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాను. ‘వోకల్ నాడ్యుల్స్’ వచ్చాయని అన్నారు. ఇవి ఎందుకు వస్తాయి. నాకు తగిన పరిష్కారం చెప్పండి. - నజీర్అహ్మద్, ఒంగోలు వృత్తిపరంగా గొంతును అధికంగా ఉపయోగించేవారిలో అత్యధికుల్లో వచ్చే సమస్య వోకల్ నాడ్యూల్స్. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్ నాడ్యూల్స్ వల్ల స్వరపేటికలోని రెండు అర్థభాగాలూ పూర్తిగా మూసుకుపోవు. దాంతో స్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్ వాయిస్) లోపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాటపూర్తిగా పెగలకుండా... లోగొంతుకతో వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అంతేకాదు... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్ కార్డ్స్ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్ కార్డ్స్ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దానివల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. మీరు ఈఎన్టీ నిపుణులను, స్పీచ్ థెరపిస్ట్‌లను కలవండి. మీ నాడ్యూల్స్ మరీ ఎక్కువ పరిమాణానికి పెరిగితే అవసరమైతే శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది. డాక్టర్ ఈసీ వినయకుమార్ హెచ్ఓడి అండ్ ఇఎన్‌టి సర్జన్ అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్ -
ఒబామాకు గొంతునొప్పి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆయనకు గొంతునొప్పి రావడంతో ఆదివారం బెతస్దాలోని వాల్టెర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే గ్యాస్ సంబంధిత సమస్యతో ఒబామా బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. గ్యాస్ సమస్య వల్ల తరచుగా త్రేన్పులు వస్తుండటంతో గొంతు నొప్పి సంభవించినట్లు వైద్యులు చెప్పారు.