![ఒబామాకు గొంతునొప్పి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41418016745_625x300.jpg.webp?itok=b7YIkJWv)
ఒబామాకు గొంతునొప్పి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆయనకు గొంతునొప్పి రావడంతో ఆదివారం బెతస్దాలోని వాల్టెర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే గ్యాస్ సంబంధిత సమస్యతో ఒబామా బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. గ్యాస్ సమస్య వల్ల తరచుగా త్రేన్పులు వస్తుండటంతో గొంతు నొప్పి సంభవించినట్లు వైద్యులు చెప్పారు.