అమెరికాలో భార్య హత్య, భర్త ఆత్మహత్య! | Indian Man And His Pregnant Wife Sudden Deceased In America | Sakshi
Sakshi News home page

అమెరికాలో భార్య హత్య, భర్త ఆత్మహత్య!

Published Thu, Apr 30 2020 1:18 PM | Last Updated on Thu, Apr 30 2020 2:07 PM

Indian Man And His Pregnant Wife Sudden Deceased In America - Sakshi

న్యూజెర్సీ: అమెరికాలోని జెర్సీ న‌గ‌రంలో భార‌త సంత‌తి గ‌ర్భిణీ స‌హా ఆమె భ‌ర్త‌ శ‌వ‌మై తేలిన దారుణ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళితే.. గ‌రీమా కొఠారి(35), మ‌న్‌మోహ‌న్ మాల్‌(37) భార్యాభ‌ర్త‌లు. ప్ర‌స్తుతం గరీమా ఐదు నెల‌ల గర్భవతి. కాగా ఏప్రిల్ 26న‌ ఉద‌యం వీరిద్ద‌రూ  విగ‌త‌ జీవులుగా క‌నిపించారు. కొఠారిని ఇంట్లో దారుణంగా హ‌త్య చేయ‌గా, మోహ‌న్ మాల్ హ‌డ్స‌న్ న‌దిలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వీరి మృతికి గ‌ల కార‌ణాలు తెలియరాలేదు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుండ‌గా వీరిద్ద‌రూ జెర్సీలో ‘నుక్కాడ్’ రెస్టారెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు. రెస్టారెంట్ ఉద్యోగులు సైతం వీరిది మంచి జంట అని పేర్కొన్నారు. కొఠారి అనుభ‌వ‌జ్ఞురాలైన చెఫ్ కాగా, మోహ‌న్ స్నేహ‌పూర్వ‌కంగా మెదిలేవాడ‌ని వారు గుర్తు చేసుకున్నారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన మోహ‌న్..  కొలంబియా ‌యూనివ‌ర్సిటీలో మాస్ట‌ర్‌ డిగ్రీ అభ్య‌సించ‌డం కోసం అమెరికా వెళ్లాడు. (స్నేహితులు తనతో మాట్లడం లేదని..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement