hudson river
-
నదిలో గణిత మేధావి మృతదేహం
న్యూయార్క్: భారత మూలాలున్న గణిత మేధావి షువ్రో బిశ్వాస్ (31) అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆయన మృతదేహాన్ని హడ్సన్ నదిలో కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. హింస జరిగినట్లు తమకే ఆధారాలు లభించలేదని తెలిపారు. క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పని చేస్తున్న బిశ్వాస్ మానసిక సమస్యలతో బాధప డుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. వైద్యులకు చూపించేందుకు తాము ప్రయత్నించామని, అయితే బిశ్వాస్ ప్రవర్తనతో అది కష్టసాధ్యమైందని ఆయన సోదరుడు బిప్రోజిత్ తెలిపారు. బిశ్వాస్ చాలా మంచి వాడని, తెలివైనవాడని తెలిపారు. బిశ్వాస్ నివసిస్తున్న భవనంలోని పలువురు దీనిపై స్పందించారు. లిఫ్టులో కత్తితో గాయపరచుకొని రక్తం చిందించడం, అక్రమంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, భవనంలో బుల్లెట్లను పడేయడం వంటివి చేశాడని పోలీసులకు తెలిపారు. ఇక్కడ చదవండి: విషాదం నింపిన అమెరికా పర్యటన.. కొడుకు ముందే తండ్రి మృత్యువాత రక్తపు మడుగులో భార్యాభర్తలు.. బాల్కనీలో ఏడుస్తూ చిన్నారి -
అమెరికాలో భార్య హత్య, భర్త ఆత్మహత్య!
న్యూజెర్సీ: అమెరికాలోని జెర్సీ నగరంలో భారత సంతతి గర్భిణీ సహా ఆమె భర్త శవమై తేలిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గరీమా కొఠారి(35), మన్మోహన్ మాల్(37) భార్యాభర్తలు. ప్రస్తుతం గరీమా ఐదు నెలల గర్భవతి. కాగా ఏప్రిల్ 26న ఉదయం వీరిద్దరూ విగత జీవులుగా కనిపించారు. కొఠారిని ఇంట్లో దారుణంగా హత్య చేయగా, మోహన్ మాల్ హడ్సన్ నదిలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుండగా వీరిద్దరూ జెర్సీలో ‘నుక్కాడ్’ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. రెస్టారెంట్ ఉద్యోగులు సైతం వీరిది మంచి జంట అని పేర్కొన్నారు. కొఠారి అనుభవజ్ఞురాలైన చెఫ్ కాగా, మోహన్ స్నేహపూర్వకంగా మెదిలేవాడని వారు గుర్తు చేసుకున్నారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన మోహన్.. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ అభ్యసించడం కోసం అమెరికా వెళ్లాడు. (స్నేహితులు తనతో మాట్లడం లేదని..) -
న్యూయార్క్‌లో హాడ్సన్ నదిలో కుప్పకూలిన హెలికాప్టర్
-
నదీతీరంలో మది పులకించే విందు
పాతనీ, కొత్తనీ కలిపి సరికొత్తగా సృష్టించడం ఇప్పటి ట్రెండ్. పాత నిర్మాణాలను అలాగే ఉంచేస్తారు, ఆ నిర్మాణాలకు ఏ మాత్రం భంగం కలగకుండా కొత్త నిర్మాణాలను వాటికి జోడిస్తారు. న్యూయార్క్‌లో ఇలాంటిదే ఒక సరికొత్త నిర్మాణం... రెస్టారెంట్‌గా కనువిందు చేయబోతోంది. పసందైన విందునీ ఇవ్వబోతోంది. గాల్లో తేలినట్టుందే... ఒళ్లు తూలినట్టుందే.. పాట గుర్తొస్తోందా? ప్రియురాలి కోసం హీరో పాడిన ఆ పాట సంగతేమోగానీ... ఈ ఫొటోలో కనిపిస్తున్న అద్దాల గదిలోకి వెళితే మాత్రం ఒళ్లు తూలినట్టు కావడం ఖాయం. ఎందుకంటే ఇది భూమికి 800 అడుగుల ఎత్తులో ఉంటుంది కాబట్టి. న్యూయార్క్ మహానగరంలో హడ్సన్ నది తీరంలో త్వరలో ఏర్పాటు కానున్న హైటెక్ రెస్టారెంట్ డిజైన్ ఇది. బిగ్‌ఫుట్ డెవలపర్స్ అనే సంస్థ దీన్ని నిర్మించనుంది. పాతకాలపు గ్లెన్వుడ్ విద్యుత్ కేంద్రం భవనాన్ని అలాగే ఉంచి, దాని పొగ గొట్టాల మధ్యలో ఈ భారీ సైజు గాజు గదిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పొగగొట్టాల నుంచి ఉక్కు తీగల ద్వారా వేలాడే ఈ హోటల్ నాలుగు గోడలూ అద్దాలే. అంతేకాదు.. 44 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పు ఉండే ఈ రెస్టారెంట్‌ను చేరుకోవాలంటే ఒక పొగ గొట్టం మధ్యభాగం నుంచి ఓ గాజు బ్రిడ్జిపై వెళ్లాల్సి ఉంటుంది. ఇక రెస్టారెంట్ మధ్యభాగంలో పచ్చగా కనిపిస్తోందే.. అది ఈ హోటల్ తాలూకు వంటగది. ఉపరితలంపై పచ్చటి మొక్కలు ఏర్పాటు చేస్తారు అంతే. ఒకవైపు నది, ఇంకోవైపు ఆకాశహర్మ్యాల వెలుగులు ఉన్న ఈ రెస్టారెంట్లో ఒకసారికి దాదాపు 48 మంది కూర్చుని విందారగించవచ్చు. ఇది వినూత్నమైన అనుభూతి మిగులుస్తుందనడంలో సందేహం లేదుగానీ... నేలవైపున చూస్తే మాత్రం హార్ట్‌బీట్ పెరిగిపోవడం గ్యారంటీ! -
పాతకాలం విమానం కూలి పైలట్ మృతి
న్యూయార్క్: రెండో ప్రపంచ యద్ధ సమయంలో సేవలందించిన పీ-47 థండర్ బోల్ట్ విమానం కూలిన ఘటనలోఒకరు మృతి చెందారు. పాత కాలంనాటికి చెందిన ఈ చిన్న విమానం న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నదిలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్ మృతి చెందాడు. పీ-47 థండర్ బోల్ట్‌లో ఒక్కరు మాత్రమే కూర్చొనే సామర్థ్యం ఉంది. ఫార్మింగ్ డేల్లో ఎయిర్ పోర్టు నుంచి మూడు విమానాలు విన్యాసాల సాధన కోసం బయలుదేరాయి. అయితే అందులోని ఒక విమానంలో నుంచి ముందుగా పొగలు వచ్చి ఆ తర్వాత యూ అకారంలో తిరిగి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మిగిలిన రెండు విమానాలు క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుకున్నాయి. జోన్స్ బీచ్‌లో మరో వారంలో 75 వ వార్షికోత్సవ వేడుకలు జరుగనున్నాయి. బెత్‌పేజ్ ఎయిర్ షోలో పీ- 47 పాల్గొనాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
హడ్సన్ నదిపై నిర్మించనున్న పార్కు ఊహాచిత్ర
న్యూయార్క్‌లోని హడ్సన్ నదిపై నిర్మించనున్న పార్కు ఊహాచిత్రమిది. నీటిపై తేలియాడే పార్కు అన్నమాట. పుట్టగొడుగు షేపులో ఉండే 300 కాంక్రీట్ దిమ్మెలతో ఏర్పాటు చేసే ప్లాట్‌ఫాంపై ఈ పార్కును నిర్మించనున్నారు. 2.7 ఎకరాల్లోని ఈ పార్కులో మూడు ఓపెన్ ఎయిర్ థియేటర్లతోపాటు షాపింగ్ ప్లాజా ఉంటుంది. మొత్తం వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పార్కు నిర్మాణం 2016లో ప్రారంభమవుతుంది. **