
పాతకాలం విమానం కూలి పైలట్ మృతి
న్యూయార్క్: రెండో ప్రపంచ యద్ధ సమయంలో సేవలందించిన పీ-47 థండర్ బోల్ట్ విమానం కూలిన ఘటనలోఒకరు మృతి చెందారు. పాత కాలంనాటికి చెందిన ఈ చిన్న విమానం న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నదిలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్ మృతి చెందాడు. పీ-47 థండర్ బోల్ట్లో ఒక్కరు మాత్రమే కూర్చొనే సామర్థ్యం ఉంది.
ఫార్మింగ్ డేల్లో ఎయిర్ పోర్టు నుంచి మూడు విమానాలు విన్యాసాల సాధన కోసం బయలుదేరాయి. అయితే అందులోని ఒక విమానంలో నుంచి ముందుగా పొగలు వచ్చి ఆ తర్వాత యూ అకారంలో తిరిగి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మిగిలిన రెండు విమానాలు క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుకున్నాయి. జోన్స్ బీచ్లో మరో వారంలో 75 వ వార్షికోత్సవ వేడుకలు జరుగనున్నాయి. బెత్పేజ్ ఎయిర్ షోలో పీ- 47 పాల్గొనాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.