
షువ్రో బిశ్వాస్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటో
న్యూయార్క్: భారత మూలాలున్న గణిత మేధావి షువ్రో బిశ్వాస్ (31) అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆయన మృతదేహాన్ని హడ్సన్ నదిలో కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. హింస జరిగినట్లు తమకే ఆధారాలు లభించలేదని తెలిపారు. క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పని చేస్తున్న బిశ్వాస్ మానసిక సమస్యలతో బాధప డుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు.
వైద్యులకు చూపించేందుకు తాము ప్రయత్నించామని, అయితే బిశ్వాస్ ప్రవర్తనతో అది కష్టసాధ్యమైందని ఆయన సోదరుడు బిప్రోజిత్ తెలిపారు. బిశ్వాస్ చాలా మంచి వాడని, తెలివైనవాడని తెలిపారు. బిశ్వాస్ నివసిస్తున్న భవనంలోని పలువురు దీనిపై స్పందించారు. లిఫ్టులో కత్తితో గాయపరచుకొని రక్తం చిందించడం, అక్రమంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, భవనంలో బుల్లెట్లను పడేయడం వంటివి చేశాడని పోలీసులకు తెలిపారు.
ఇక్కడ చదవండి:
విషాదం నింపిన అమెరికా పర్యటన.. కొడుకు ముందే తండ్రి మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment