mathematician
-
గణిత మేధావి.. తెలివితో 14 సార్లు లాటరీ గెలిచి..
లెక్కలు అనగానే చాలామందికి బాల్యం నుంచే భయం ఏర్పడుతుంది. అంకెలను చూసే సరికి కొంతమందిలో వణుకు పుడుతుంది. అయితే గణితం సాయంతో పలు విషయాల్లో విజయం సాధించవచ్చని తెలిస్తే వారిలోని భయం తొలగిపోతుంది. రొమేనియాకు చెందిన ఒక గణిత మేధావి లెక్కలతో లాటరీలలోని లాజిక్కును పట్టేసి, ఏకంగా 14 సార్లు లాటరీ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.డైలీ స్టార్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం రొమేనియా నివాసి స్టెఫాన్ మాండెల్ గణిత శాస్త్రజ్ఞుడు. అతని జీతం భారత కరెన్సీతో పోలిస్తే ఏడు వేలు. అది అతని కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. దీంతో స్టెఫాన్ మాండెల్ తన జీవితాన్ని తక్షణం మార్చుకోవాలని, గణితాన్ని తెలివిగా ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అంకెలను ఉపయోగించి ఒక సూత్రాన్ని సిద్ధం చేశాడు. దాని సాయంతో లాటరీలను గెలుచుకుంటూ వచ్చాడు.స్టెఫాన్ స్వయంగా ప్రత్యేక అల్గారిథమ్‌ను సృష్టించాడు. పలు పరిశోధనలు సాగించిన అనంతరం ‘సంఖ్యల ఎంపిక’కు అల్గారిథమ్‌ను సిద్ధం చేశాడు. దానికి ‘కాంబినేటోరియల్ కండెన్సేషన్’ అనే పేరు పెట్టాడు. తాను ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నప్పటికీ, వాటికి అయ్యే ఖర్చు జాక్‌పాట్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని స్టెఫాన్ కనుగొన్నాడు. దీంతో లాటరీని దక్కించుకునేందుకు అధికంగా లాటరీ టిక్కెట్లు కొని జాక్‌పాట్ గెలిచేందుకు వివిధ కాంబినేషన్లను సిద్ధం చేసేవారు. ఇది క్లిక్ అవడంతో స్టెఫాన్ లాటరీలను సొంతం చేసుకుంటూ వచ్చాడు.తరువాత స్టెఫాన్ లాటరీ సిండికేట్‌ను ఏర్పాటు చేశాడు. దీనిలో చేరినవారు స్టెఫాన్ సూచనలతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలా వారు గెలుపు అవకాశాలను పెంచుకుంటారు. ఈ సిండికేట్‌కు లాటరీలో వచ్చే భారీ మొత్తాన్ని సభ్యులంతా పంచుకునేవారు. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో స్టెఫాన్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.స్టెఫాన్ మాండెల్ తాను కనుగొన్న లెక్కల సూత్రం ఆధారంగా మొత్తం 14 సార్లు లాటరీని గెలుచుకున్నాడు. తరువాతి కాలంలో యూకేలోనూ తన లాటరీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే అతని సిండికేట్‌పై దర్యాప్తు సంస్థల కన్నుపడింది. దీంతో పెద్దమొత్తంలో టిక్కెట్లు కొనడంపై నిషేధం విధించారు. దీంతకితోడు స్టెఫాన్‌పై పలు కేసులు నమోదు కావడంతో న్యాయపోరాటం కోసం లెక్కకు మించినంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో తాను కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకుని 1995లో తాను దివాలా తీసినట్లు స్టెఫాన్ ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం స్టెఫాన్ తన స్నేహితులతో పాటు వనాటు ద్వీపంలో నివసిస్తున్నాడు. యూనిలాడ్ నివేదిక ప్రకారం స్టెఫాన్ 1960-70ల కాలంలోనే లాటరీలలో రూ. 200 కోట్లకుపైగా మొత్తాన్ని గెలుచుకున్నాడు. -
పారిభాషిక పదాలు.. సృష్టించుకోవాలి!
ఖగోళ శాస్త్రం వంటివాటిల్లో పరిశోధనలు చేస్తూనే బ్రహ్మ గుప్తుడు లాంటి భారతీయ గణిత మేధావులు ప్రపంచానికి సున్నా (0) ను అందించారు. సున్నా (0) విలువ కూడా భారతీయ గణిత వేదవేదాంగ సాహిత్యవేత్తే కనిపెట్టాడు. అయితే అది ఇంకా వెలుగులోకి రాలేదు. దీనికి కారణం గణితం, భౌతిక, రసాయనిక జీవ శాస్త్రాదులను బాగా కప్పివేసిన ఆధ్యాత్మిక, జ్యోతిష్య సంబంధ భావజాలం. ఆ ముసుగును తీసి భారతీయ గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాదుల తేజాన్ని ప్రయోగశాలలో చూపించాలన్న ఆసక్తితో ముందుకు వెళ్ళేవారికి ఇక్కడ సరైన ఆదరణ లభించడం లేదు.సమస్త విజ్ఞానం మన వేదాలలోనే ఉందని మన ఆధ్యాత్మిక, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్తలు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా... ప్రయోగ శాలలో నిలవని విజ్ఞానం తుదకు అజ్ఞానంగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రయోగశాలలో నిలవాలని తపించే భారతీయ వేదవేదాంగ శాస్త్రాలలో నిపుణులైనవారికి ఆర్థిక శక్తి లేమి అడ్డు వస్తోంది. కాస్త సైన్స్ చదువుకున్నవారు ఆధ్యాత్మిక జ్యోతిష్యాదులను అడ్డు పెట్టుకొని మాట్లాడే మాయగాళ్ళను సూడో సైన్స్గాళ్ళు అంటే, వీరు వారిని మరో విధంగా వెక్కిరిస్తారు. ఈ చర్చోపచర్చలు కాలక్షేపానికి తప్ప మరెందుకూ పనికిరావు. భారతీయ వేదవేదాంగ పురాణేతిహాసాలలో ఏ శాస్త్రం ఎంత ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ యా విషయాల గురించి మాట్లాడటానికి తగినంత పారిభాషిక (టెర్మినాలజీ) పదజాలం లేదన్నది అక్షర సత్యం.వేదవేదాంగ పురాణేతిహాసాల విజ్ఞానం కథా రూపంలో ఉంటుంది. కథా భాష, ప్రయోగ శాల భాష ఒక రీతిన ఉండదు. ఉదాహరణకు రాజకుమారి ఉద్యానవనంలో చెలికత్తెలతో ఆడుకుంటోంది. ఆకాశంలోని పక్షుల వరుసలను చూసింది. మొదటి వరుసలో ఒకటి, రెండవ వరుసలో రెండు ఇలా... పదవ వరుసలో పది! మొత్తం పక్షులు ఎన్ని అంటే అందరి పప్పులు ఉడికాక రాజకుమారి 55 అని సమాధానం చెబుతుంది.n(n+1/2) అనే ఆధునిక గణిత సూత్రం రాజకుమారికి తెలియకపోవచ్చును. అయితే వేగంగా 10+(9+1=10)+(8+2=10)+(7+3=10)+(6+4=10) +5=55 అని నోటితో గణించే మేధ రాజకుమారికి ఉండి ఉండవచ్చు. పదికి దగ్గరకు వచ్చి కూడికలు, తీసివేతలు వంటివి చేస్తే లెక్క సులభం అవుతుంది అని ఆమెకు తెలిసి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ రాజకుమారి మేధను సూత్ర బద్ధం చేస్తే, భారతీయ గణితం అందరికీ అర్థమవుతుంది. అయితే సూత్ర బద్ధం చేయడానికి కావలిసినంత టెర్మినాలజీని మనవారు మనకు అందించలేదన్నది నిజం. టెర్మినాలజీ లేకుండా ఆధ్యాత్మికతతో, జ్యోతిష్యాది గణింపుతో ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు.మన వేదవేదాంగ పురాణేతిహాసాల శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి కావల్సినంత టెర్మినాలజీని మనం పెంచుకోవాలంటే... మన పండితులు చాంధస భావాలకు అతీతంగా, అసూయాద్వేషాలకు అతీతంగా మెలగాలి. రేపటి తరానికన్నా మన శాస్త్రవిజ్ఞానాన్ని తెలిపే టెర్మినాలజీని పెంచే దిశగా పోయేటందుకు ఇంగ్లిష్ మీడియం వైపునకు వెళ్ళాలంటే కొందరు తెలుగు భాషాభిమానులకు కోపం వస్తుంది. మన సంప్రదాయం, మన పద్యం, మన ఛందస్సు అంటూ ఆవేశ పడిపోతారు.నిజమే... కొన్ని వందల ఏళ్ళ నుండి మన ఛందస్సులో కొందరు మహా కవులు, కవులు పద్యాలు రాస్తున్నారు. సంతోషమే. కానీ అదే ఛందస్సులో కంప్యూటర్‌కు చెందిన ద్విసంఖ్యా మానాది గణితాంశాలు ఉన్నాయని ఎందరికి తెలుసు? పోనీ కొందరికి తెలుసు అనుకుందాం. తెలిసినవారు ఆ యా అంశాలను ప్రయోగశాల వద్ద ఎంత మేర సక్సెస్ చేశారు? వారికి తెలిసినదానిని ఎంత మంది గణిత సూత్రాలుగా మలచారు?రేపటి తరమన్నా ఇంగ్లిష్ మీడియం వైపు నకు వెళ్ళి మన వేదాంగాదులలో ఉన్న విజ్ఞాన ఛాయలకు చక్కని టెర్మినాలజీ తయారుచేస్తే, మనం పశ్చిమ దేశాల కంటే ముందే ఉంటాము. మాతృభాష లోనే ఈ పని చెయ్యవచ్చు కదా అని కొందరు అనవచ్చు. అది సాధ్యం కాని పని. ఎందుకంటే మన మాతృభాషా పదజాలం కొంచెం ముందుకు వెళితే అది ఆధ్యాత్మికతలో కూరుకుపోతుంది. లేదా ఖగోళం, జ్యోతిషం అంటూ కాలక్షేపం చేస్తుంది.ఇంగ్లిష్ మీడియం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డేరింగ్ స్టెప్ వేశారు. దానిని అలాగే కొనసాగించాలి. ఛందస్సు కేవలం పద్యాలు రాసుకోవడానికి పుట్టింది కాదనీ, అందులో ద్విసంఖ్యా మాన గణితం, ఇంకా ఆధునిక గణితంలోకి ప్రవేశించని ఉదాత్తానుదాత్తాదుల గణితం ఉందనీ రేపటి తరమన్నా గమనించాలి.రెండు రెళ్ళు ఆరు అన్నది సాహిత్యంలో చెప్పుకోవడానికి ఆహ్లాదంగా ఉండవచ్చు. కానీ రెండు రెళ్ళు నాలుగు అన్నది నిజం. ఆ నిజం మాటున ఉన్న సైన్స్, మాథ్స్ వైపు వెళ్ళాలంటే ఆయా భారతీయ సబ్జెక్టులకు సరిపడ టెర్మినాలజీ తప్పక ఉండాలి.అభిప్రాయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు, వ్యాసకర్త విశ్రాంత ఉపాధ్యాయులు, 9849448947 -
ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ సీఆర్ రావు కన్నుమూత
ఏయూ క్యాంపస్/డాబాగార్డెన్స్: ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త డాక్టర్ సీఆర్ రావు (102) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 1920 సెపె్టంబర్ 10న కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళిలో కల్యంపూడి రాధాకృష్ణా రావు (సీఆర్ రావు) తెలుగు కుటుంబంలో జన్మించారు. తర్వాత ఏపీలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో ఆయన బాల్యం గడిచింది. విశాఖలోని ఏవీఎన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 1940లో ఏయూలో గణిత శాస్త్రం అభ్యసించారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎంఏ స్టాటస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇండియన్ స్టాటస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. అక్కడ పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయన 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. 477 పరిశోధన పత్రాలను సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్ స్టాటస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. భారత స్టాటస్టిక్స్ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఎన్ఎస్ భటా్నగర్ పురస్కారాన్ని కూడా సీఆర్ రావు అందుకున్నారు. ఆయన 2020 సెప్టెంబర్ 10న 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. స్టాటస్టిక్స్‌లో నోబెల్ అంతటి గౌరవం సీఆర్ రావుకు 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు గాను ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటస్టిక్స్–2023 అవార్డును అందజేశారు. 102 ఏళ్ల వయసులో ఈ ఏడాదే ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1945లో కోల్‌కతా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. ఆయన చేసిన కృషి..ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటస్టిక్ ఫౌండేషన్ తెలిపింది. -
ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు కన్నుమూత
వాషింగ్టన్: ప్రఖ్యాత భారత్–అమెరికన్ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102) అమెరికాలో కన్నుమూశారు. రాధాకృష్ణారావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. స్టాటిస్టిక్స్ రంగంలో సీఆర్ రావు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కాగా సీఆర్ రావుకు ఇటీవలె ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్’ను 2023 సంవత్సరానికి గాను రాధాకృష్ణారావు ఈ ఏడాది మే1 ఆయనకు ఈ అవార్డును అందుకున్నారు. 1945లో కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ఇదే గాక భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. With a heavy heart, we share the news of the passing of Prof. C R Rao, a true luminary in the field of statistics. #crrao #statistics #statistician #profcrrao #rao #datascience #R #python #omshanti pic.twitter.com/phwDdg6HZA — Statistics for You (@statistics4you) August 23, 2023 ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ.. కల్యంపూడి రాధాకృష్ణారావు 1920 సెప్టెంబరు 10న కర్ణాటకలోని హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో విద్యాభ్యాసం సాగింది. ఆంధ్ర విశ్వావిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో ఎంఎస్సీ చేశారు. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎంఏ డిగ్రీ అందుకున్నారు. ఇంగ్లండ్‌లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ చేశారు. 1965లో కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి డీఎస్సీ డిగ్రీ స్వీకరించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, తర్వాత కేంబ్రిడ్జిలోని ఆంత్రోపాలాజికల్ మ్యూజియంలో సేవలందించారు. పలు భారత, విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణ రావు గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. నిండు నూరేళ్లు జీవించిన ఈ అపర సరస్వతీ పుత్రుడు గణిత, గణాంక శాస్త్ర రంగాలలో చేసిన కృషి నిరూపమానం. 75 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల పిన్న వయసులో కోల్‌కతా మ్యాథమెటికల్… pic.twitter.com/Kbyca0cWyU — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 23, 2023 -
C R Rao: తెలుగోడికి స్టాటిస్టిక్స్ నోబెల్ అవార్డు, 102 ఏళ్ల వయసులో ఘనత
ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావు (102) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు సీఆర్ రావును వరించింది. సాధించడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన గొప్ప వ్యక్తి సీఆర్ రావు. వయస్సు అనేది కేవలం ఒక నెంబర్ అని మాత్రమే చెప్పే.. రాధాకృష్ణారావు.. జీవితంలో ఎన్నో సాధించి ఐకాన్‌గా నిలిచారు. 62 ఏళ్లకు కూతురి దగ్గర ఉండేందుకు అమెరికా వెళ్లిన రావు, 70 ఏళ్ల వయస్సులో పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. ఆయనకు 75 ఏళ్లున్నప్పుడు అమెరికా ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. 82 ఏళ్ల వయస్సులో రావు వైట్ హౌజ్ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ మెడల్ ఫర్ సైన్స్ అవార్డు అందుకున్నారు. 102 ఏళ్ల వయస్సులో స్టాటిస్టిక్స్ నోబెల్ అందుకుంటున్నారు. సీఆర్ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలోని తెలుగు కుటుంబంలో పుట్టారు. ఏపీలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, కోల్‌కతా యూనివర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ పూర్తి చేశారు. (చదవండి: ‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్) ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డును అందజేస్తారు. 2019లో అమెరికాకు చెందిన ప్రొఫెసర్ బ్రాడ్లీ ఎఫ్రాన్, 2021కి అమెరికాకు చెందిన ప్రొఫెసర్ Emerita Nan Laird లకు అందజేశారు. (చదవండి: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది!) 2023కి సీఆర్ రావుకు అవార్డు అందనుంది. భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. -
K.Balagopal: మానవ హక్కుల వకీలు
అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి, రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం, మానవీయతా సుగుణం వంటి లక్షణాలన్నింటినీ తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కుల ఉద్యమాలకు ఆయన దశ–దిశని నిర్దేశించి వెన్నుదన్నుగా నిలిచారు. బాలగోపాల్ మధ్య తరగతి పండిత కుటుంబంలో 1952, జూన్ 10 నాడు నాగమణి, పార్థనాథశర్మ దంపతులకు జన్మించారు. అయినా ఆయన నిరంతరం పేద, దళిత, గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన గణితశాస్త్ర విద్యార్థి అయినా... చరిత్ర, తత్వశాస్త్రం, అర్థశాస్త్రాలను విస్తృతంగా అధ్యయనం చేసి సమాజ పోకడలను సునిశితంగా పరిశీలించారు. రాజ్యాంగంలో హక్కుల అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నా నిరంకుశ ప్రభుత్వాల అణచివేత విధానాల వల్ల పౌరులు ఆయా హక్కులు పొందలేకపోవడాన్ని చూసి చలించిపోయారు. బాలగోపాల్ వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎమ్మెస్సీ అప్లైడ్ మాథ్స్ని అభ్యసించి అక్కడే డాక్టరేట్ చేస్తున్న క్రమంలో రాడికల్ విద్యార్థి సంఘం కార్యకలాపాలను చూస్తూ వాటికి ప్రభావితులయ్యారు. కమ్యూనిస్టులు వాస్తవాన్ని అతిశయం చేసి చెప్తారని మొదట్లో నమ్మిన బాలగోపాల్... కమ్యూనిస్టులు తమ విశ్వాసాల కోసం ప్రాణాలు పణంగా పెట్టడాన్ని గమనించి ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టుల పట్ల తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. రాడికల్ విద్యార్థి సంఘం నాయకులు సూరపనేని జనార్ధన్ ఎన్కౌంటర్, జన్ను చిన్నాలు హత్యా సంఘటనల తర్వాత ప్రజల కోసం ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేయాలని బాలగోపాల్ బలంగా నిర్ణయించుకొని 1981లో ‘ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం’లో చేరారు. వరంగల్ రాజకీయ పరిస్థితులు లెక్కల మేధావిగా ఉన్న బాలగోపాల్‌ని హక్కుల కార్యకర్తగా తీర్చిదిద్దాయి. 1983లో ఖమ్మంలో జరిగిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర రెండవ మహాసభలో ఆయన ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తాను చేస్తున్న గణితశాస్త్ర అధ్యాపక ఉద్యోగం ఉద్యమాలకు అడ్డు రావడంతో ఆ ఉద్యోగాన్ని సైతం తృణీకరించి పూర్తికాలపు హక్కుల కార్యకర్తగా మారారు. బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చి హక్కుల ఉద్యమంలో నూతన ఒరవడితో ఉద్యమించారు. కానీ కాల క్రమంలో తానే తీర్చిదిద్దిన పౌర హక్కుల సంఘం నుండి ఆయన వైదొలిగి 1998, అక్టోబర్ 11 నాడు ‘మానవ హక్కుల వేదిక’ను స్థాపించారు. బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న సమయంలో బెంగళూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వివేకానంద న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ డిగ్రీని అభ్యసించారు. 1997లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా తన పేరుని నమోదు చేయించుకున్నారు. ఆయన న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించక పూర్వమే చట్టాలు, న్యాయశాస్త్రంలో ఉన్న ఆనుపానులు, తర్కాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడం వల్ల... పెద్దగా సీనియర్ న్యాయవాదుల అవసరం రాలేదు. కాని చట్టం పని విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రొసీజర్ విధానంలో ఆయన సీనియర్ న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దగ్గర సలహాలు తీసుకొని ఆ ప్రకారం ముందుకు సాగారు. బాలగోపాల్ ప్రధానంగా హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో బాధితుల పక్షం నిలబడి చట్ట ఫలితాలను వారికి అందించారు. దళితులు, గిరిజనులు, కార్మికులు, ఉద్యోగులు, భూవివాదాలకు సంబంధించిన అన్ని కేసులను ఆయన వాదించారు. అలాగే లేబర్ కోర్ట్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటిటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటిటివ్ ట్రిబ్యునల్, లేబర్ కమిషన్ ఆఫీసుల కేసులను కూడా ఆయన వాదించారు. నక్సలైట్లకు సంబంధించి అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లను వేసి సబంధిత వ్యక్తులను కోర్టులకు హాజరుపరిచేలా నిరంతర కృషి చేశారు. చుండూరు హత్యాకాండ కేసులో బాలగోపాల్ బాధిత దళితులకు అండగా నిలబడి హైకోర్టులో అత్యున్నత వాదనలు వినిపించి దళిత హక్కులకు బాసటగా నడిచారు. అదేవిధంగా ‘షెడ్యూల్డ్ ట్రైబల్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్’ని అమలు చేయడం కోసం గిరిజనులు చేసిన పోరాటానికి ఆయన బాసటగా నిలిచారు. కోర్టులో ఆ చట్టాన్ని గెలిపించడంలో అసామాన్యమైన కృషి చేశారు. ఈ చట్టం ద్వారా గిరిజనులకు 2009లో భూములు పంచబడ్డాయి. బాలగోపాల్ చేపట్టిన ముఖ్యమైన కేసులలో అత్యంత ముఖ్యమైన కేసు ఎన్కౌంటర్ల కేసు. ‘పోలీసులకు ప్రాణం తీసే హక్కు లేదనీ, పోలీసులు ఎన్కౌంటర్ల నుండి తప్పించుకోవడానికి వీలు లేదనీ, పోలీసులపై కూడా హత్యాచారం కింద కేసులు పెట్టవచ్చ’నీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఆయన బలమైన వాదనలు వినిపించి ‘పోలీసులపై కూడా న్యాయ విచారణని జరిపించాలి’ అనే తీర్పుని తీసుకురాగలిగారు. ఆ తీర్పు రావడం వెనకాల బాలగోపాల్ 30 ఏళ్ల నిర్విరామ కృషి ఉంది. అనేక హక్కుల సంఘాలు మిళితమైన ఈ కేసులో బాలగోపాల్‌తో పాటు కేజీ కన్నాభిరాన్, బొజ్జా తారకం తదితరులు తమ వాదనలు వినిపించారు. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) హక్కుల నిరాదరణకు గురైనప్పుడు ప్రజలు చైతన్యంతో గొంతెత్తి ప్రశ్నిస్తే హక్కులు అమలు కాబడుతాయని బాలగోపాల్ విశ్వసించారు. ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన 2009, అక్టోబర్ 8 నాడు తుది శ్వాస విడిచినా ‘చెరగని హక్కుల స్ఫూర్తి’గా వెలుగొందుతున్నారు. (క్లిక్ చేయండి: మంచి అడుగే... మార్పులు అవసరం) - జె.జె.సి.పి. బాబూరావు పరిశోధక విద్యార్థి (అక్టోబర్ 8న కె.బాలగోపాల్ వర్ధంతి) -
చైతన్య భారతి: డిగ్రీ లేని మేధావి
తల్లి గారి ఊరైన కుంభకోణంలో రామానుజన్ హైస్కూలులో చదువుకుంటున్న రోజుల్లోనే జి.ఎస్. కార్ పుస్తకం ‘ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ మేథమెటిక్స్’ ని అధ్యయనం చేసేశారు! కళాశాలలో చదివిన సమయంలోనే లెక్కల్లో మునిగిపోయి, ఇతర సబ్జెక్టులను నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఆయన పట్టభద్రులు కాలేకపోయారు. దాంతో మద్రాసు విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్న ఆయన కల కలగానే మిగిలిపోయింది. ఆయన తల్లి 1909లో తొమ్మిదేళ్ల అమ్మాయి జానకీ అమ్మాళ్తో ఆయనకు పెళ్లి నిశ్చయం చేయడంతో బతుకు తెరువు కోసం ఆయన ప్రయత్నించవలసి వచ్చింది. మద్రాసు పోర్ట్ ట్రస్టులో అకౌంట్స్ గుమాస్తాగా ఉద్యోగం లభించింది. అదృష్టవశాత్తూ పోర్ట్ ట్రస్ట్ చీఫ్ అకౌంటెంట్ ఎస్.నారాయణ రావు ఒక గణితవేత్త. గణితంలో రామానుజన్ ప్రతిభను పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ సర్ ఫ్రాన్సిస్ స్ప్రింగ్ దృష్టికి తీసుకెళ్లారు. రామానుజన్ అప్పటికే రాబట్టిన గణిత సూత్రాల విలువను నిగ్గు తేల్చడానికి వాటిని ఇంగ్లండ్‌లోని గణిత నిపుణుల దృష్టికి తీసుకెళ్లాలని మద్రాసులోని గణిత వేత్తలు ఆయనను ప్రోత్సహించారు. కానీ పట్టభద్రుడు కూడా కాని రామానుజన్ రాతలను చాలామంది నిర్లక్ష్యంగా అవతల పారేశారు. కనీసం ఆయనకు జవాబు కూడా ఇవ్వని వారెందరో. అయితే కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజ్‌కి చెందిన సుప్రసిద్ధ గణిత ఆచార్యులు జి.హెచ్. హార్డీ మాత్రం రామానుజన్ రాసి పంపిన 120 గణిత సూత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. వాటిన సలు అతను ఎలా రాబట్టాడో కూడా ఆయనకు అంతుచిక్కలేదు. తదుపరి అధ్యయనం కోసం కేంబ్రిడ్జికి రావాలని రామానుజన్ని హార్డీ ఆహ్వానించారు. గణితంలో పట్టభద్రుడైనా కాని రామానుజన్‌కి కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ప్రవేశం కల్పించడానికి హార్డీ, ఆయన సహోద్యోగి జె.ఇ.. లిటిల్‌వుడ్ ప్రత్యేకంగా కృషి చేశారు. రామానుజన్ విదేశాలకు వెళ్లడానికి మతపరమైన ఆచారాలు అడ్డు వచ్చాయి. చివరకు రామానుజన్ 1914 లో కేంబ్రిడ్జ్ చేరుకున్నారు. ఆయన పరిశోధన కొత్త పుంతలు తొక్కింది. 1916 లో రామానుజన్‌కి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పట్టా ప్రదానం చేసింది. తరువాత 1919లో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా చేసింది. బహుశా ఆహారం విషయంలో అశ్రద్ధ, నిరంతర పరిశోధనల వల్ల కావచ్చు, ఆయనకు క్షయ వ్యాధి సోకింది. 1919లో భారతదేశానికి తిరిగి వచ్చిన రామానుజన్ మరుసటి ఏడాదే కుంభకోణంలో కన్ను మూశారు. రామానుజన్ తన నోట్ పుస్తకాలలో రాసుకున్న సూత్రాలు ఎంతోమంది గణిత పరిశోధకుల మెదడుకు మేత కల్పించాయి. – మోహన్ శ్రీఖండే, మేథమెటిక్స్ ప్రొఫెసర్ (చదవండి: చైతన్య భారతి: సమ్మిళిత శాస్త్రజ్ఞుడు... జీవశాస్త్ర పితామహుడు) -
ఆమె... అగణిత మేధావి
గణితశాస్త్రంలో డెబ్భై యేళ్లుగా ప్రపంచానికి అంతుపట్టకుండా ఉన్న అత్యంత క్లిష్టమైన జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్‌కు పరి ష్కారం సూచించారు 32 ఏళ్ల నీనా గుప్తా. అందుకుగాను ఆమె 2021 డిసెంబర్లో, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్ ప్రైజ్’ పురస్కారానికి ఎంపికయ్యారు. కోల్‌కతాలో జన్మించిన నీనా గుప్తా , బెతున్ కళాశాల నుండి గణిత శాస్త్ర ఆనర్స్‌లో పట్టా తీసుకున్నారు. ఇప్పుడు తాను పాఠాలు బోధిస్తున్న ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐ) సంస్థ నుంచే పీహెచ్డీ తీసుకున్నారు. తన పరిశోధనలకు గాను ఆమె ఇప్పటికే డజను అవార్డులు పొందారు. 40 ఏళ్ల లోపు ఉండే యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన రామానుజన్ అవార్డును ఇటీవలే నీనా గుప్తాకు ఇచ్చారు. అకడమిక్ రంగంలో గౌరవనీయమైన అవార్డును గెలుచుకున్న నాల్గవ భారతీయురాలు ఆమె. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె అఫైన్ ఆల్జీబ్రాక్ జ్యామితిలో, కమ్యుటేటివ్ ఆల్జీబ్రాలో చేసిన అత్యుత్తమ కృషికి, ప్రత్యేకించి అఫైన్ స్పేస్‌ల కోసం జారిస్కీ రద్దు సమస్యపై కనిపెట్టిన పరిష్కారం కోసం ఈ విశిష్ట బహుమతిని అందుకున్నారు. జారిస్కీ రద్దు సమస్యకు ఆమె చూపిన పరిష్కారం తనకు గతంలోనే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ 2014 యంగ్ సైంటిస్ట్స్ అవార్డును సంపాదించి పెట్టింది. 2019లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకున్నారామె. గణితం అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది అని వేద గణితం చెబుతుంది. సంఖ్యామానానికి పట్టుగొమ్మ అయిన సున్నా ఆవిష్కరణే దీనికి నిదర్శనం. ఇది ప్రపంచ గణిత శాస్త్రా నికి భారతీయుల అద్భుత కానుక. గణితం కష్టం కాదు. ఇతర సబ్జెక్టులులాగా దీన్ని కంఠస్థం చేయలేరు. మీకు గణిత భావనపై స్పష్టత ఉంటే, మీరు కూడా క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించగలరు. ప్రాక్టీస్ కీలకం, అది మినహా వేరే మంత్రం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 32 ఏళ్ల నీనా గుప్తా. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. తనకు పదేళ్ల వయసులోనే గణితశాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. పదమూడేళ్లు నిండేసరికల్లా ఎస్.ఎల్. లోనీ... త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను ఆపోశన పట్టడమే కాకుండా సొంతంగా సిద్ధాం తాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ, అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించారు. శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగపడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్–తీటా ఫంక్షన్స్‌పై చేసిన పరిశో ధనలు చాలా ప్రసిద్ధమైనవి. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాసన్ రామానుజన్ పేరు మీద ఉన్న ‘రామానుజన్ అవారు’్డ నీనా గుప్తాకు రావడం పట్ల దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు. డాక్టర్ టి. నాగయ్య వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ మొబైల్ : 97012 75354 (నేడు జాతీయ గణిత దినోత్సవం) -
161 ఏళ్ల గణిత చిక్కుముడి.. రుజువు చేస్తే 7.4 కోట్లు
హైదరాబాద్: సున్నా గణిత ప్రపంచాన్ని మలుపు తిప్పింది. ప్రాచీన ఈజిప్ట్, మెసపటోమియా, చైనాల్లోనూ శూన్య భావన ఉన్నప్పటికీ దానికి ప్రత్యేకంగా గుర్తులేమీ వినియోగించలేదు. సున్నా అవసరం అయిన చోట ఖాళీగా వదిలేసేవారు. భారతీయులు మాత్రమే తొలిసారి శూన్య భావనకు ఒక అంకెను ఆవిష్కరించారు. అక్కడ నుంచి గణితశాస్త్రంలో ఎన్నో కొత్తకొత్త మార్పులు వచ్చాయి. అలాగే గణితశాస్త్రంలో రీమన్ హైపోథీసిస్ ఓ అపరిష్కృత సిద్ధాంతం.. 161 ఏళ్లుగా అది చిక్కుముడిగానే మిగిలిపోయింది. ఏ గణిత శాస్త్రవేత్త దాన్ని పరిష్కరించే సాహసం చేయలేకపోయారు. అలాంటి సిద్ధాంతాన్ని హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కుమార్ ఈశ్వరన్ పరిష్కరించి చూపించారు. రీమన్ హైపోథీసిస్ అంటే ఏమిటి? రీమన్ హైపోథీసిస్ పాథమికంగా.. ప్రధాన సంఖ్యలను లెక్కించడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతిలో పెద్ద సంఖ్యలను సృష్టించవచ్చు. అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ స్మాల పరిష్కరించని మొదటి 10 గణిత సమస్యల్లో రీమన్ హైపోథీసిస్ టాప్‌లో ఉంటుంది. ఇక జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడ్రిచ్ గెస్ ఒక పరిశోధన వ్యాసంలో ఒక సంఖ్యకు దిగువన దాదాపుగా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో గణించే సూత్రాన్ని రాశారు. అది శాస్త్రపరీక్షలో నిలబడలేదు. మరో ప్రఖ్యాత జర్మనీ గణితశాస్త్రవేత్త జార్జ్ ఫ్రెడ్రిచ్ బెర్న్‌హార్డ్ రీమన్ (1826-1866) ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి ‘జెటా ఫంక్షన్’ సాయంతో ప్రధాన సంఖ్యల సంఖ్యను గుర్తించవచ్చని ప్రతిపాదించారు. ‘జెటా ఫంక్షన్ శూన్యస్థానాలు x = 1/2 అనే రేఖ మీద గుమిగూడి ఉంటాయి’ అని రీమన్ ప్రతిపాదించారు. దీనినే రీమన్ దత్తాంశం (రీమన్ హైపోథీసిస్) అని పిలుస్తారు. రుజువు చేస్తే 1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.7.4 కోట్లు) అయితే ఇది వాస్తవమని రుజువు కాకపోవడంతో 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన ‘క్లే మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్’ అనే సంస్థ రీమన్ సిద్ధాంతాన్ని రుజువు చేసినవారికి మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.4 కోట్లు) బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ సిద్ధాంతాన్ని కుమార్ ఈశ్వరన్ రుజువు చేశారు. ఈ సంస్థ గతేడాది జనవరిలో ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది గణిత నిపుణులు కుమార్ ఈశ్వరన్ సిద్ధాంతాన్ని సమీక్షించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది మే 16న నిపుణుల కమిటీ సమావేశమై కుమార్ ఈశ్వరన్ ఆధారాలు రీమన్ దత్తాంశాన్ని నిరూపిస్తున్నాయని ప్రకటించింది. చదవండి: Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట! ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు -
గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ వర్ధంతి..
శ్రీనివాస రామానుజన్ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధ గణిత మేధావుల్లో ఒకరు. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన రామానుజన్ చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ గణితంపైనే కేంద్రీకరించడంతో ఎఫ్.ఎ. పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. ఆ తర్వాత మద్రాస్‌లోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరి గణిత సమస్యలను సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవాడు. రామానుజన్ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు. 1913లో మద్రాస్ వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి నివ్వెరపోయారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్టీకి పంపాడు. మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ రామానుజ¯Œ ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్‌కు వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి. వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986–87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. హార్డీ స్కేలుపై వందకు వంద పాయింట్లు పొందిన ఏకైక గణిత శాస్త్రవేత్త రామానుజనే. ఆయన తర్వాత ఆ లోటును మరో శాస్త్రవేత్త భర్తీ చేయలేకపోడం విచారకరం. – ఎమ్.రామ్‌ప్రదీప్, తిరువూరు (నేడు ఎస్. రామానుజన్ వర్ధంతి) -
నదిలో గణిత మేధావి మృతదేహం
న్యూయార్క్: భారత మూలాలున్న గణిత మేధావి షువ్రో బిశ్వాస్ (31) అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆయన మృతదేహాన్ని హడ్సన్ నదిలో కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. హింస జరిగినట్లు తమకే ఆధారాలు లభించలేదని తెలిపారు. క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పని చేస్తున్న బిశ్వాస్ మానసిక సమస్యలతో బాధప డుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. వైద్యులకు చూపించేందుకు తాము ప్రయత్నించామని, అయితే బిశ్వాస్ ప్రవర్తనతో అది కష్టసాధ్యమైందని ఆయన సోదరుడు బిప్రోజిత్ తెలిపారు. బిశ్వాస్ చాలా మంచి వాడని, తెలివైనవాడని తెలిపారు. బిశ్వాస్ నివసిస్తున్న భవనంలోని పలువురు దీనిపై స్పందించారు. లిఫ్టులో కత్తితో గాయపరచుకొని రక్తం చిందించడం, అక్రమంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, భవనంలో బుల్లెట్లను పడేయడం వంటివి చేశాడని పోలీసులకు తెలిపారు. ఇక్కడ చదవండి: విషాదం నింపిన అమెరికా పర్యటన.. కొడుకు ముందే తండ్రి మృత్యువాత రక్తపు మడుగులో భార్యాభర్తలు.. బాల్కనీలో ఏడుస్తూ చిన్నారి -
పెళ్లయ్యాక ‘సున్నా’ కావద్దు
స్త్రీలు వివాహం అయ్యాక తమకు వచ్చిన విద్యలను, చదువును ‘సున్నా’ చేసేస్తారు... సున్నా చేయడానికా మనం ఇంత కష్టపడి చదివింది అంటారు డాక్టర్ మంగళా నార్లికర్. లెక్కలు అనగానే అందరికీ శకుంతలా దేవి గుర్తుకొస్తారు. కాని లెక్కల్లో అద్భుత ప్రతిభ కనపరిచి పిల్లలకు లెక్కలు సులువు చేయడానికి విస్తృతంగా సరదా లెక్కల పుస్తకాలు రాసి గణిత మేధావిగా గుర్తింపు పొందారు డాక్టర్ మంగళ. ఇదంతా ఆమె పెళ్లయ్యాకే చేశారు. 1970లలోనే నేను ఈ పని చేశాను... కాని నేటికి చాలామంది స్త్రీలు పెళ్లయ్యాక అన్నీ ముగిసినట్టే అని భావించడం బాధాకరం అంటున్నారామె. 77 ఏళ్ల ఈ లెక్కల చుక్క పరిచయం. ‘లెక్కలు మగవాళ్ల సబ్జెక్ట్ అని అంటారు. లెక్కల మాష్టార్లందరూ మగవారే. కాని లెక్కలకు ఆన్సర్ సాధిస్తున్నవారు పురుషులా స్త్రీలా అనేది పట్టదు. సబ్జెక్ట్ ఎవరికైనా ఒకటే. నేను లెక్కల్లో వెరవక విజయం సాధించాను. అలాగే కుటుంబం కూడా మగవాడి సొంతం అనుకుంటారు. కాని నేను నా ఉనికిని చాటుకున్నాను’ అంటారు డాక్టర్ మంగళా నార్లికర్. 77 ఏళ్ల ఈ గణిత మేధావి ప్రస్తుతం పూణెలో నివసిస్తున్నారు. కాని విశ్రాంతిగా మాత్రం లేరు. ఈ లాక్డౌన్ కాలంలో టాబ్‌ను వాడటం తెలుసుకుని యూనివర్శిటీ విద్యార్థులకు స్పెషల్ ఆన్లైన్ క్లాసులు చెబుతుంటారు. స్పెషల్ లెక్చర్లు ఇస్తుంటారు. ‘నా దాహం తీరలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాల్సిందే’ అంటారామె. మంగళా నార్లికర్ భర్త జయంత్ నార్లికర్ ప్రఖ్యాత సైంటిస్ట్. గురుత్వాకర్షణపై ఆయన మరో శాస్త్రవేత్తతో కలిసి ఒక విలువైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నిజమే. ఆయన గొప్పవాడే. కాని ఆయన ఇంట్లో అంతే గొప్ప గణిత మేధావి ఉంది. ఆమె తన మేధావితనం చాటుకోవడానికి 1970ల కాలంలోనే ప్రయత్నించి విజయం సాధించింది. తల్లి ఆదర్శం మంగళా నార్లికర్ది పూణె. ఆమె కుటుంబం చదువుకు బాగా విలువిచ్చేది. అయితే మంగళా పుట్టిన కొద్దికాలానికే తండ్రి కేన్సర్‌తో మరణించాడు. ఆ సమయంలో మంగళ తల్లి వయసు 21 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. ‘మా అమ్మను అందరూ ఇంకో పెళ్లి చేసుకోమన్నారు. మరికొందరు ఆడవాళ్లు చేయదగ్గ పని టీచరు కావడమే కనుక అలాంటి పని వెతుక్కోమన్నారు. కాని మా అమ్మ పట్టుదలగా డాక్టర్ అయ్యింది. మమ్మల్ని మా అమ్మమ్మ వాళ్ల దగ్గర ముంబైలో వదిలి ఆమె ఆ డిగ్రీ సాధించి మమ్మల్ని చదివించింది. స్త్రీ తలుచుకుంటే సాధించగలదు అని నాకు స్ఫూర్తి ఇచ్చింది. నేను కూడా బాగా చదువుకుని ఎం.ఏలో మేథ్స్ చేసి గోల్డ్‌మెడల్ సాధించాను’ అంటారు మంగళ. పెళ్లికి ముందు ఆమె ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్’ లో రీసెర్చ్ అసోసియేట్‌గా పని చేశారు. అయితే 1966లో ఆమె వివాహం జయంత్ నార్లికర్తో జరిగింది. జయంత్ కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నారు. పెళ్లయ్యాక అక్కడే ఉద్యోగానికి భార్యను తీసుకెళ్లారు. అక్కడ మూడేళ్లు ఉండే ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం, వంట చేయడం తప్ప మంగళ వేరే ఏమీ చేయలేకపోయారు.. కొన్ని ట్యూషన్లు చెప్పడం తప్ప. కాని వాళ్లు అక్కడి నుంచి 1980 లో తిరిగి ఇండియాకు వచ్చే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఒక స్నేహితురాలు ‘ఎందుకే పెళ్లికి ముందు ఎగిరెగిరి చదివావు. పెళ్లి తర్వాత అంతా ఇలా వదులుకొని బతడానికా’ అంది. ఆ మాటలు ఆమెలో సంచలనం రేపాయి. ‘నేను భారత్‌కు రాగానే తిరిగి ఉద్యోగం చేస్తానన్నాను. నా భర్త అడ్డు చెప్పలేదు. ముంబైలో మేము కాపురం పెట్టగానే మా అత్తామామలు మా దగ్గరకు వచ్చేశారు. ఇంటి పని, పిల్లల పని, అత్తామామల పని.. అసలు పని లేని క్షణం లేదు.. కాని అంత పని మధ్యలోనే నేను ఉద్యోగం చేశాను.. ఇంకో పాపకు జన్మనిచ్చాను.. పిహెచ్డి చేశాను... గొప్పగా ఉద్యోగం కూడా చేశాను. పనులు పెరిగితే మనకు ఎంత శక్తి ఉందో తెలుస్తుంది’ అంటారామె. పిల్లల పుస్తకాలు మంగళా నార్లికర్ గణితంలో కీలక శాఖలైన కాంప్లెక్స్ అనాలిసిస్, అనలిటిక్ జామెట్రీ, నంబర్ థియరీ, ఆల్జీబ్రాలలో విశేష కృషి చేశారు. యూనివర్సిటీలు ఆమె చేత క్లాసులు చెప్పించేవి. అదే సమయంలో మరో విశేషం జరిగింది. ఆమె తన దగ్గర పని చేసే పని మనిషి పిల్లలకు లెక్కలు నేర్పిస్తున్నప్పుడు వారిని నవ్విస్తూ సరదా ఉదాహరణలతో పాఠం చెబుతుంటే వారికి తొందరగా లెక్కలు వస్తున్నట్టు ఆమె గ్రహించారు. ‘లెక్కలంటే కష్టంగా ముఖం పెట్టే పిల్లల కోసం పుస్తకాలు రాయాలన్న ఆలోచన అప్పుడు వచ్చింది’ అన్నారామె. ఆమె మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణ సంస్థ ‘బాలభారతి’తో కలిసి పిల్లల కోసం విశేషంగా సులభ లెక్కల పుస్తకాలు రాశారు. అవి అందరు పిల్లలకు అందాలని తను రాసిన ప్రతి పుస్తకం కేవలం పది రూపాయల ధర మాత్రమే ఉండాలన్న షరతు పెట్టారు. ఆ తర్వాత బాలభారతి డైరెక్టర్ అయ్యి పాఠాలలో సులభ పద్ధతులు ప్రవేశపెట్టారు. ‘పెళ్లయ్యాక కుటుంబం అనే ప్రపంచం వస్తుంది స్త్రీకి. కాని కెరీర్ అనే ప్రపంచం కూడా కావాలంటే ఆ రెండు ప్రపంచాలను నిర్వహించుకోగల సామర్థ్యం ఉండాలి. ఆ సామర్థ్యం కోసం ప్రయత్నించండి. అంతే తప్ప సున్నాలా మారకండి’ అంటారు డాక్టర్ మంగళా నార్లికర్. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ముగ్గురూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. మంగళ తన భర్త జయంత్‌తో కలిసి పూణెలో వాకింగ్‌కు వస్తే దారిన వెళ్లే వారు గౌరవంగా నమస్కారం పెడతారు. అయితే ఆ నమస్కారం ఒక్కరికి కాదు. ఇద్దరికీ. దానిని పొందే హక్కు ప్రతి స్త్రీకి ఉంది. జయంత్ నార్లికర్, మంగళా నార్లికర్ – సాక్షి ఫ్యామిలీ -
మానవ కంప్యూటర్
సాక్షి, కడప : కడప జిల్లాకు చెందిన లక్కోజు సంజీవరాయశర్మ గొప్ప గణిత మేధావిగా పేరు గాంచారు. దేశ, విదేశీయుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందినవారు. 1907 నవంబర్ 28న జన్మించారు. పుట్టుకతోనే చూపులేదు. అంధుడు పుట్టాడని పెంచడం కష్టమని.. గొంతు పిసికి దిబ్బలో పూడ్చేయాలని మంత్రసాని సలహా ఇచ్చింది. మరికొందరు మహిళలు పురిటి బిడ్డ నోట్లో వడ్ల గింజలు వేశారు. అయినా ఆ పసివాడు చావలేదు సరికదా.. చక్కగా ఆరోగ్యంగా ఎదిగాడు. ప్రపంచం ఈర్ష్యపడే స్థాయికి పేరుగాంచారు. ఆ రోజులలో బ్రెయిలీ లిపి లేకపోవడంతో సంజీవరాయ శర్మ చదువుకునేందుకు వీలు కాలేదు. అక్క బడికి వెళ్లి వచ్చాక ఇంటి వద్ద పాఠాలను గట్టిగా చదువుతుంటే విని గుర్తు పెట్టుకునేవాడు. అలా ఆయనకు మామూలు పాఠాలతోపాటు గణితం బాగా వచ్చింది. అందులో అపార జ్ఞానం సాధించారు. అతని బాల్య దశలోనే తండ్రి చనిపోయారు. తల్లే పెంచింది. పల్లెల్లో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు తదితర అంశాలను సంజీవరాయశర్మ క్షణాల్లో చెప్పేవారు. రైతులు ఈ సాయానికి గానూ ఆయనకు అంతో.. ఇంతో డబ్బు ఇచ్చేవారు. ఆ వయసులోనే వయొలిన్ పట్ల ఆకర్షితుడై వాయించడం నేర్చుకున్నారు. తర్వాత వయొలిన్ వాయించడం జీవితంలో ఒక భాగమైంది. గణితంలో ప్రజ్ఞ సాహిత్యంలో కవులు అవధానాలు చేయడం తెలిసిందే. అంటే 8 మంది వరుసగా ప్రశ్నలు వేస్తుంటే ఆయా అంశాలకు వెంట వెంటనే పద్యాల రూపంలో జవాబు చెప్పాలి. అలాగే గణితంలో కూడా అవధానం ఉంది. లక్కోజు సంజీవరాయ శర్మ గణితంలో అవధానాలు చేయడంలో దిట్టగా మారారు. పుట్టిన తేదీ, సంవత్సరం, ప్రదేశం, సమయం చెప్పగానే ఆయన దానికి సంబంధించిన తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చెప్పేసేవారు. దాంతోపాటు క్లుప్తంగా జాతకాన్ని కూడా తెలిపేవారు. అలా ఆయన దేశమంతటా మొత్తం 6 వేల గణిత అవధానాలు చేశారు. వేలాది మంది కూర్చున్న సభలో నిమిషానికి 20, 30 కష్టమైన లెక్కలకు అడిగిన వెంటనే సమాధానాలు చెప్పేవారు. ప్రశ్న అడగ్గానే వయొలిన్‌ను కొద్దిగా పలికించి వెంటనే సమాధానం చెప్పేవారు. ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అని అడిగితే దైవ దత్తంగా వచ్చిందని బదులిచ్చేవారు. ప్రపంచంలోనే గణితం విషయంలో బెంగళూరుకు చెందిన శకుంతలాదేవి కంప్యూటర్ను ఓడించిందంటారు. అలాంటి శకుంతలాదేవినే ఓడించిన గొప్ప వ్యక్తి లక్కోజు సంజీవరాయశర్మ. ఎంత పెద్ద లెక్క అడిగినా కూడా క్షణాల్లో బదులిచ్చేవారు. గౌరవ పురస్కారాలు గణితంలో లక్కోజు గొప్పతనం తెలిసి.. దేశమంతటా ఎందరో గొప్పవాళ్లు ఆయన అవధానాలకు వెళ్లేవారు. మరికొందరు పెద్దలు ప్రత్యేకంగా అవధానం చేయించి విని ఆశ్చర్యపోయేవారు. 1959లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఢిల్లీలో లక్కోజుతో గణిత అవధానాన్ని ఏర్పాటు చేయించి, తిలకించారు. ఆ కార్యక్రమానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా హాజరయ్యారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 1996లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తొలిసారిగా 1928లో గణిత అవధానం చేశారు. 1995 వరకు దేశమంతటా 6 వేల ప్రదర్శనలు ఇచ్చారు. 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ప్రధాన ఆకర్షణగా నిలిచి వందలాది లెక్కలకు బదులిచ్చారు. 19 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అప్పట్లో ఆయన సతీమణి వయసు 9 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. 1994 జనవరి 5న ఆమె శ్రీకాళహస్తిలో ఉండగా మరణించారు. సంజీవరాయశర్మ హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1997 డిసెంబర్ 2న కన్నుమూశారు. ప్రపంచం మొత్తాన్ని తన అద్భుతమైన గణిత విద్యతో ఆకట్టుకున్న గొప్ప వ్యక్తి ఇంత వరకు ఈ భూమిపై మరొకరు పుట్టలేదని.. ప్రపంచంలోని గణిత మేధావులంతా ఎంతో ప్రశంసించారు. -
మగనిత తత్వవేత్త
‘గే’ సెక్స్‌కు శిక్షగా రాళ్లతో కొట్టి చంపే చట్టాన్ని తెచ్చిన బ్రూనై దేశ సుల్తాన్ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తాజా పరిస్థితుల్లో.. ఎల్జీబీటీ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) హక్కులపై చర్చ మరింత విస్తృతం అయింది. ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి జీవించి ఉండగా ‘గే’ల హక్కులపై ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ అనే పుస్తకం రాయడానికి ఆమెను ప్రేరేపించిన అంశాలు కూడా మనదేశంలో ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మూడు సంవత్సరాల వయసున్న చిన్నారి శకుంతల తండ్రితో కలిసి సర్కస్ సెంటర్లో కూర్చొని ఉంది. ఆమె చుట్టూ కళాకారులు, జంతువులు ఉన్నా ఆమె దృష్టంతా తన ముందర ఉన్న కార్డుల మీదే ఉంది. వాటినే పరిశీలిస్తోంది ఆ అమ్మాయి. శకుంతల తండ్రి సంప్రదాయ కన్నడ కుటుంబంలో జన్మించారు. సర్కస్‌లో పనిచేయాలనే కోరికతో ఇంటి నుంచి పారిపోయి, సర్కస్ కంపెనీలో చేరారు. అక్కడ ఆయన తాడు మీద నడిచాడు, సింహాలను ఆడించాడు, బంతులను చేతులలోకి మార్చుకుంటూ ఆడాడు. తర్వాత సర్కస్ షో పూర్తయింది. టెంట్లన్నీ తీసేశారు. అప్పుడు ఆయన కాలక్షేపం కోసం కుమార్తె ముందు పేక ముక్కలతో రకరకాల మ్యాజిక్కులు చేయడం ప్రారంభించారు. అయితే, అమ్మాయి చిన్నపిల్లనీ, ఆ మ్యాజిక్కులు అర్థం చేసుకునే వయస్సు కాదనీ అనుకున్నాడు. కాని ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ఆటను తన జ్ఞాపకశక్తితో గెలుచుకుంది శకుంతల. అది చూడగానే, శకుంతల పుట్టుకతోనే గణిత శాస్త్రంలో మేధావి అని, అంకెలను బాగా గుర్తుపెట్టుకోగలదని అర్థం చేసుకున్నాడు. ఆమెకు లభించిన వరాన్ని గుర్తించి, ఇక సర్కస్‌లో పని మానేసి, కూతురిలోని నైపుణ్యాన్న వెలికి తీసుకురావాలనుకున్నారు. రోడ్డు షోలు ప్రారంభించారు, పెద్ద పెద్ద అంకెలను ఆమె ఏ విధంగా గుర్తు పెట్టుకుంటోందో తెలియచేయడం ప్రారంభించారు. ఐదు సంవత్సరాల వయసు వచ్చేనాటికే శకుంతల ఎన్నో లెక్కలను అవలీలగా చేసేసేది. తన ఆరో ఏట మైసూరు విశ్వవిద్యాలయంలో పెద్ద ప్రదర్శన ఇచ్చింది శకుంతల. 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో 13 స్థానాల రెండు అంకెలను కేవలం 28 సెకన్లలో భాగించి, 26 స్థానాల అంకెను అవలీలగా చెప్పేసింది శకుంతల. ఈ ప్రశ్నను కంప్యూటర్ చేత అడిగించారు. అదీ అలాగే చూపించింది! అంతే.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నారు శకుంతల. దానితో పాటు హ్యూమన్ కంప్యూటర్‌గా ప్రసిద్ధి చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధి చెందిన శకుంతల హోమో సెక్సువాలిటీ హక్కుల కోసమూ పోరాడారు. ఆ సంగతి చాలా కొద్దిమందికే తెలుసు. ఎందుకు మళ్లారు?! 1960 మధ్య ప్రాంతంలో, లండన్‌లో ప్రొఫెసర్లు, పరిశోధకుల ఎదుట మేథమేటికల్ స్కిల్స్ ప్రదర్శించి, భారతదేశానికి తిరిగి వచ్చారు శకుంతల. కోల్‌కత్తాలో ఐఏఎస్‌గా పనిచేస్తున్న పరితోష్ బెనర్జీని వివాహం చేసుకున్నారు. వారి జంట చూడముచ్చటగా ఉంది అనుకున్నారు అందరూ. అయితే కొద్దికాలానికే బెనర్జీ హోమో సెక్సువల్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 21వ శతాబ్దంలోనూ ఇది పెద్ద విషయమే. మరి అప్పట్లో పెద్ద దుమారమే కదా. తాను ఒక ‘గే’ని వివాహం చేసుకున్నానని తెలుసుకున్న శకుంతలకు ప్రపంచం తల్లకిందులైపోయింది. ఈ విషయం మీద కఠినంగా ప్రవర్తించకుండా, తను బాధపడకుండా, హోమోసెక్సువాలిటీ గురించి చదవడం ప్రారంభించారు. గే కమ్యూనిటీ హక్కుల గురించి తెలుసుకున్నారు. మరికొందరు హోమోలను కలిసి, వారి మనోగతాన్ని, అనుభవాలను తెలుసుకుని, ఆ వివరాలను భద్రంగా పొందుపరిచారు, సమాజం నుంచి వారు ఏం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు, వారు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారో గ్రహించారు. ‘గే’ హక్కుల ఐపీసీ సెక్షన్ 377ను 2018లో తీసుకువచ్చారు కాని శకుంతల ఈ విషయం గురించి 1977లోనే గొంతు విప్పారు. ‘గే’తత్వాలు, జీవన విధానాలు, జీవిత అవసరాల మీద తాను చేసిన పరిశోధనను, ఇంటర్వ్యూలను కలిపి ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ పేరున పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ పుస్తకం ద్వారా వారి సమస్యలను, ఇబ్బందులను వెలుగులోకి తీసుకురావడం శకుంతల ఉద్దేశం. అయితే అప్పట్లో ఆమె రచించిన పుస్తకానికి పెద్దగా స్పందన రాలేదు. కాని కాలంలో వచ్చిన మార్పుల కారణంగా, ఇప్పుడు ఈ పుస్తకాన్ని హోమో సెక్సువల్స్ మీద రాసిన మొట్టమొదటి పుస్తకంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాను అందుకున్న మిగతా పురస్కారాలతో పాటు, హోమో సెక్సువల్స్ గురించి ముందుగా స్పందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు శకుంతల. ‘‘నేను మనిషిని కావడమే ఈ పుస్తకం రాయడానికి నాకున్న అర్హత. ఇటువంటివారి పట్ల సానుభూతి చూపటం, భరించటం సరికాదు, వారిని అంగీకరించాలి’ అంటారు శకుంతల. ‘‘విలక్షణంగా ఉండటం ధర్మవిరుద్ధం కాదు. వీరి దగ్గరకు ఎవ్వరినీ రానీయకుండా చేయకూడదు. ఇటువంటి జీవన విధానం కూడా సృష్టిలో భాగమే. దీనిని ఎవ్వరూ వ్యతిరేకించకూడదు’ అంటారు శకుంతల. జయంతి భర్తతో విడాకులు ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’.. పుస్తకంగా వచ్చిన తరవాత రెండు సంవత్సరాలకు శకుంతల తన భర్త బెనర్జీ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత శకుంతల తనకు ఇష్టమైన గణితశాస్త్రం గురించి ప్రచారం చేస్తూ, విద్యార్థులకు లెక్కలు సులువుగా అర్థమయ్యేందుకు అనువుగా పుస్తకాలు రాశారు. శకుంతలాదేవి సంప్రదాయ విద్య నేర్వకపోయినా, తనకు సంక్రమించిన విద్య ద్వారా నైపుణ్యాన్ని పెంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా లెక్కలలో ఆరితేరిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. -
పైథాగరస్గారి మతం
క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దానికి చెందిన పైథాగరస్ గణితవేత్తగా సుప్రసిద్ధుడు. ఆయన ప్రతిపాదించిన గణిత సూత్రాలను ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పటికీ చదువుకుంటున్నారు. ఖగోళ శాస్త్రంలోను, సంగీతంలోను అతడికి ఘనమైన ప్రావీణ్యమే ఉండేది. అరిస్టాటిల్, ప్లాటో వంటి తత్వవేత్తలపై ప్రభావం చూపిన పైథాగరన్, ఒక చిత్ర విచిత్ర విలక్షణ మతాన్ని కూడా స్థాపించాడు. అప్పట్లో ఈ మతాన్ని అనుసరించేవారు ఎందరుండే వారో తెలియదు గానీ, ఇప్పుడైతే ఇది ఉనికిలో లేదు. ఆయన ప్రతిపాదించిన ఆచారాల ప్రకారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీన్స్ తినరాదు. రాచబాటలపై పాదచారులు నడవరాదు. పొయ్యిపై నుంచి పాత్రను తీసేశాక, దాని గుర్తు పొయ్యిబూడిదపై లేకుండా చూసుకోవాలి. ఇళ్ల పైకప్పుల కింద పక్షులు గూళ్లు పెట్టకుండా చూసుకోవాలి.. ఇలాంటి వింతాచారాలను తెలుసుకుంటే ఈ మతం ఎందుకు అంతరించిందో అర్థంకావడం లేదూ! -
'బ్యూటిఫుల్ మైండ్' దుర్మరణం
ఆర్థిక శాస్త్ర గమనంలో మేలి మలుపులాంటి గేమ్ థియరీని ప్రతిపాదించి, అటుపై నోబెల్ సహా ఎన్నెన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్న ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జాన్ నాష్ (87) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన ప్రయాణిస్తోన్న ట్యాక్సీ అదుపుతప్పి బోల్తా పడటంతో నాష్ సహా ఆయన భార్య ఆలిసియా (82) ఘటనా స్థలంలోనే మరణించినట్లు న్యూజెర్సీ పోలీసులు తెలిపారు. 2002లో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డును పొందిన 'ఎ బ్యూటిఫుల్ మైండ్' చిత్రం జాన్ నాష్ జీవితం ఆధారంగా నిర్మించిందే కావటం విశేషం. 1928, జూన్ 13న జన్మించిన నాష్.. 1958లో స్కిజోఫ్రీనియా రుగ్మతకు గురై ఆశ్చర్యకరమైన రీతిలో కోలుకుని మళ్లీ పూర్వపు మేధాశక్తిని సంపాదించాడు. నాష్ ప్రతిపాదించిన సిద్ధాంతం 'నాష్ సమతాస్థితి' గా ప్రసిద్ధి చెందింది. 1994లో మరో ఇద్దరు గేమ్ థియరీ ప్రతిపాదకులతో కలిసి ఉమ్మడిగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు నాష్. మరణానికి ముందు వరకు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో బోధకుడిగా పనిచేశారు. జాన్ నాష్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 'తన అసాధారణ ప్రతిభతో గణిత శాస్త్రానికి అద్భుత సేవలందించిన నాష్ కలకాలం గుర్తుండిపోతారు' అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన జీవితగాథ 'బ్యూటిఫుల్ మైండ్' లో లీడ్ రోల్ వేసిన హాలీవుడ్ హీరో రస్సెల్ క్రో.. జాన్ నాష్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నా హృదయం కూడా వారితోనే వెళ్లిపోయింది' అని క్రో ట్విట్టర్లో సంతాపం వ్యక్తం చేశారు. -
అగణిత శాస్త్రశీలుడు...
మంజుల్ భార్గవ్... ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో గణిత విభాగం ప్రొఫెసర్... అత్యుత్తమ ‘ఫీల్డ్స్ మెడల్’ అందుకున్న మొట్టమొదటి భారతీయ గ ణిత శాస్త్రవేత్త. ‘నంబర్ థియరీ’ ఆవిష్కరణ వెనుక భారతీయ సంప్రదాయ గణితశాస్త్రవేత్తల శ్రమ ఉందనే సంప్రదాయవాది... గణిత శాస్త్రవేత్తలైన హేమచంద్రుడు, బ్రహ్మగుప్తులకు ఏకలవ్య శిష్యుడు... సంస్కృత పద్యకావ్యాలలో ఉండే లయ, గణిత శాస్త్ర సూత్రాల నుంచి లెక్కలను సులభంగా అర్థం చేసుకోవచ్చని చెప్పిన మంజుల్ భార్గవ్ గురించి... కెనడాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్న మంజుల్ భార్గవ్ సంస్కృతభాషలో విరచితమైన గణిత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. రెండు వందల ఏళ్లుగా ఎవరికీ అంతుచిక్కకుండా ఉన్న ఒక నంబర్ థియరీ పజిల్‌ను పరిష్కరించారు. ఏడో శతాబ్దపు గణిత శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుడు రాసిన సిద్ధాంతాలపై పట్టు సంపాదించారు మంజుల్. వాటిని సూత్రీకరిస్తూనే నంబర్ థియరీ పజిల్ పరిష్కరించారు. ఆయన కృషికి గుర్తింపుగా ఆయనను ఫీల్డ్స్మెడల్ అవార్డు వరించింది. గణితశాస్త్రంలో ఇచ్చే ఈ పురస్కారం, ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్‌తో సమానం. కెనడా దేశ పౌరసత్వం ఉన్నప్పటికీ, ఆయన భారతీయుడు. చిన్న నాటి నుంచి సంప్రదాయమంటే ఇష్టపడే మంజుల్ భార్గవ్ తల్లి గణితశాస్త్రవేత్త. ఆవిడకు సంగీతం, భాషా శాస్త్రాలలో ప్రవేశం ఉంది. అందువల్ల భార్గవ్‌కు సాహిత్యం, ముఖ్యంగా సంస్కృత కావ్యాలు చదివే అవకాశం వచ్చిందనీ, సంగీతం మీద అభిరుచి పెరిగిందనీ అంటారు. ‘‘నాకు తబలా అంటే చాలా చాలా ఇష్టం. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలలో ఉండే లయను ఇష్టపడతాను. నా మొదటి సంగీత గురువు మా అమ్మ. ఆవిడ సంగీతం పాడతారు, తబలా వాయిస్తారు’’ అని చెప్పే భార్గవ్‌కు మూడు సంవత్సరాల వయసప్పుడు తల్లి, తబలాలోని బేసిక్ సౌండ్ ఎలా వాయించాలో నేర్పారు. ఎంత ప్రయత్నించినా భార్గవ్ నోటి నుంచి చిన్న శబ్దం కూడా బయటకు రాలేదు. భార్గవ్‌తో పాటు అతనిలో తబలా నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా పెరగడంతో... జైపూర్‌లోని పండిట్ ప్రేమ్ ప్రకాశ్ దగ్గర తబలా విద్య కొంత నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ దగ్గర మెలకువలు నేర్చుకున్నారు. మంజుల్ భార్గవ్ తాతగారు పరోక్షంగా భార్గవ్‌కు గురువు. ఆయన సంస్కృత పండితుడు, చరిత్ర కారుడు. ఆయన బాల్యం నుంచే భార్గవ్‌కు ప్రాచీనన గణితశాస్త్రం నేర్పారు. నాటి గణితకారులంతా వారిని వారు కవులుగా చెప్పుకున్నారే కాని, గణిత శాస్త్రవేత్తలుగా చెప్పుకోలేదనీ, భాషావేత్తలయిన పాణిని, పింగళ, హేమచంద్ర, నారాయణ... వీరు కవిత్వం చదివి, అద్భుతమైన గణిత సూత్రాలను ఆవిష్కరించిన విషయాన్ని తాతగారు తనకు చెప్పేవారని భార్గవ్ అంటారు. ఆయన చెప్పిన ఎన్నో కథలు భార్గవ్‌లో కొత్త ఆలోచనలకు పునాదులు వేసింది. గణితం లయాత్మకమని భార్గవ్ చెబుతారు. సంస్కృత భాషలో లయను గురులఘువులు సూచిస్తాయి. గురువును రెండు మాత్రల కాలంలో, లఘువును ఒక మాత్ర కాలంలో పలుకుతాం. ఎన్ని గురు లఘువులు కలిస్తే ఎనిమిది లయలు ఏర్పడతాయని ఎవరినైనా అడిగితే, కొందరు నాలుగు గురువులు కలిస్తే అనవచ్చు. మరికొందరు మూడు లఘువులు, రెండు గురువులు, ఒక లఘువు కలిస్తే వస్తుందనవచ్చు. క్రీ.పూ. 500 - 200 కాలంలో పింగళుడు తన చండశాస్త్రంలో దీనిని ఎంతో చక్కగా వివరించారని భార్గవ్ అంటారు. ‘డైజీ’ పూలను తన గురువుగా భావిస్తారు. ఈ పువ్వుకి 34 రెక్కలు ఉంటాయి. అంటే ఎనిమిది లయలన్నమాట. ఇటువంటి ఎన్నో అంశాలను భార్గవ్ సంస్కృత సాహిత్యం చదువుతూ తెలుసుకోవడం ప్రారంభంచారు. అలా సంస్కృత గణిత సాహిత్యాన్ని భార్గవ్ తన వశం చేసుకోగలిగారు. ఇంతటి అత్యున్నత పురస్కారాన్ని చేజిక్కించుకోగలిగారు. - డా. వైజయంతి నోబెల్ బహుమతి గణితశాస్త్ర విభాగానికి ఇవ్వరు. అందువల్ల గణితంలో అత్యున్నత గౌరవంగా ‘ఫీల్డ్స్ మెడల్’ ను బహూకరిస్తారు. సాధారణంగా ఈ బహుమతిని అమెరికా, రష్యా, ఫ్రెంచి, ఇంగ్లండ్ దేశస్థులు గెలుచుకుంటారు. ఇంతవరకు ఈ నాలుగు దేశాలకు 38 మెడల్స్ వచ్చాయి. ఈ బహుమతిగా 15 వేల డాలర్లు ఇస్తారు. ఈ మొత్తం నోబెల్లో సరిగ్గా పదో వంతు. శ్రీనివాస రామానుజన్ అధ్యయనం చేసిన అంశంలో మంజుల్ ప్రతిభ చూపడం విశేషం. మంజుల్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో ‘గాస్’ శాస్త్రవేత్త చూపిన పరిష్కారాన్ని మరింత సరళం చేశారు. నాలుగేళ్లకోసారి భారతదేశానికి వచ్చినప్పుడు తాతయ్య, అమ్మమ్మలతో ఆరునెలలు గడిపేవారు. ఆ సమయంలో సంస్కృతం, తబలా నేర్చుకునేవారు. తబలా వాదనలోనూ, సంస్కృత శ్లోక పఠనంలోనూ ఉండే లయ పూర్తిగా గణితాత్మకమే అంటారు మంజుల్. అమెరికాలో పెరిగినా, ఇంట్లో మాత్రం భారతీయ వాతా వరణం, భారతీయ భోజనం. నా చిన్నతనంలో మార్టిన్ గార్డెనర్ రాసిన ‘మేథమేటిక్స్ మ్యాజిక్ అండ్ మిస్టరీ’ పుస్తకం చదివి ఆ ఫన్ను ఎంజాయ్ చేశాను. గురువులకు, లెక్కలంటే భయపడే విద్యార్థులకు లెక్కలలో ఆసక్తి కలగడానికి వీలుగా మూడు సూచనలిచ్చాను... లె క్కలను శాస్త్రీయ పద్ధతిలో కాకుండా రకరకాల కళల ద్వారా తెలియచెప్పాలి. అంటే పజిల్, బొమ్మలు, మ్యాజిక్, కవిత్వం, సంగీతం... వీటన్నిటినీ లెక్కల తరగతి గదిలోకి తీసుకురావాలి. విద్యార్థులకు లెక్కలు నేర్పే విధానం యాంత్రికంగా ఉండకూడదు. వాళ్లకి వాళ్లుగా ఆలోచించేలా ఉండాలి. లెక్కలంటేనే ఉత్సాహంగా సృజనాత్మకంగా పరిష్కరించాలి. అందుకోసం విద్యార్థులంతా కలిసి కొత్త కొత్త వాటిని కనుక్కోవాలి, కలిసి పని చేయాలి. ఈ మూడు సూత్రాలను అనుసరించి గురువులు లెక్కలు నేర్పితే, గురువులకే కాదు విద్యార్థులకు కూడా లెక్కలంటే భయం పోతుంది. చదువును ఆడుతూపాడుతూ నేర్చుకుంటే, కొత్తకొత్త ఆవిష్కరణలకు నాంది ఏర్పడుతుంది. అంతేకాని చదువును చూడకూడదు. - మంజుల్ భార్గవ్