Hyderabad Physicist Finally Solved 161 Year Old Riemann Hypothesis In Mathematics - Sakshi
Sakshi News home page

161 ఏళ్ల గణిత చిక్కుముడి.. రుజువు చేస్తే 7.4 కోట్లు

Published Tue, Jun 29 2021 11:38 AM | Last Updated on Tue, Jun 29 2021 4:45 PM

Hyderabad Physicist Finally Solved 161 Year Old Riemann Hypothesis In mathematics - Sakshi

హైదరాబాద్‌: సున్నా గణిత ప్రపంచాన్ని మలుపు తిప్పింది. ప్రాచీన ఈజిప్ట్, మెసపటోమియా, చైనాల్లోనూ శూన్య భావన ఉన్నప్పటికీ దానికి ప్రత్యేకంగా గుర్తులేమీ వినియోగించలేదు. సున్నా అవసరం అయిన చోట ఖాళీగా వదిలేసేవారు. భారతీయులు మాత్రమే తొలిసారి శూన్య భావనకు ఒక అంకెను ఆవిష్కరించారు. అక్కడ నుంచి గణితశాస్త్రంలో ఎన్నో కొత్తకొత్త మార్పులు వచ్చాయి. అలాగే గణితశాస్త్రంలో రీమన్‌ హైపోథీసిస్‌ ఓ అపరిష్కృత సిద్ధాంతం.. 161 ఏళ్లుగా అది చిక్కుముడిగానే మిగిలిపోయింది. ఏ గణిత శాస్త్రవేత్త దాన్ని పరిష్కరించే సాహసం చేయలేకపోయారు. అలాంటి సిద్ధాంతాన్ని హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కుమార్‌ ఈశ్వరన్‌ పరిష్కరించి చూపించారు.

రీమన్‌ హైపోథీసిస్‌ అంటే ఏమిటి?
రీమన్‌ హైపోథీసిస్‌ పాథమికంగా.. ప్రధాన సంఖ్యలను లెక్కించడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతిలో పెద్ద సంఖ్యలను సృష్టించవచ్చు. అమెరికన్‌ గణిత శాస్త్రజ్ఞుడు స్టీఫెన్‌ స్మాల​ పరిష్కరించని మొదటి 10 గణిత సమస్యల్లో  రీమన్‌ హైపోథీసిస్‌ టాప్‌లో ఉంటుంది. 

ఇక జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కార్ల్‌ ఫ్రెడ్రిచ్‌ గెస్‌ ఒక పరిశోధన వ్యాసంలో ఒక సంఖ్యకు దిగువన దాదాపుగా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో గణించే సూత్రాన్ని రాశారు. అది శాస్త్రపరీక్షలో నిలబడలేదు. మరో ప్రఖ్యాత జర్మనీ గణితశాస్త్రవేత్త జార్జ్‌ ఫ్రెడ్రిచ్‌ బెర్న్‌హార్డ్‌ రీమన్‌ (1826-1866) ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి ‘జెటా ఫంక్షన్‌’ సాయంతో ప్రధాన సంఖ్యల సంఖ్యను గుర్తించవచ్చని ప్రతిపాదించారు. ‘జెటా ఫంక్షన్‌ శూన్యస్థానాలు x = 1/2 అనే రేఖ మీద గుమిగూడి ఉంటాయి’ అని రీమన్‌ ప్రతిపాదించారు. దీనినే రీమన్‌ దత్తాంశం (రీమన్‌ హైపోథీసిస్‌) అని పిలుస్తారు.

రుజువు చేస్తే 1 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.7.4 కోట్లు)
అయితే ఇది వాస్తవమని రుజువు కాకపోవడంతో 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన ‘క్లే మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌’ అనే సంస్థ రీమన్‌ సిద్ధాంతాన్ని రుజువు చేసినవారికి మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7.4 కోట్లు) బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ సిద్ధాంతాన్ని కుమార్‌ ఈశ్వరన్‌ రుజువు చేశారు. ఈ సంస్థ గతేడాది జనవరిలో ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది గణిత నిపుణులు కుమార్‌ ఈశ్వరన్‌ సిద్ధాంతాన్ని సమీక్షించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది మే 16న నిపుణుల కమిటీ సమావేశమై కుమార్‌ ఈశ్వరన్‌ ఆధారాలు రీమన్‌ దత్తాంశాన్ని నిరూపిస్తున్నాయని ప్రకటించింది.

చదవండి: 
Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట!
ఫ్లిప్‌కార్ట్‌ ధమాకా సేల్‌: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement