physicist
-
‘దైవ కణం’ ఉందన్న శాస్త్రవేత్త... కన్నుమూశాడు!
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు. విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడే ‘హిగ్స్ బాసన్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న తన ఇంట్లో మరణించినట్లు స్కాటిష్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. హిగ్స్ బాసాన్ సిద్ధాంతానికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్‌తో కలిసి హిగ్స్ నోబెల్ అవార్డు అందుకున్నారు. యాభై ఏళ్లుగా స్కాటిష్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిగ్స్ మరణంతో భౌతిక శాస్త్ర ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందనడంలో సందేహం లేదు. హిగ్స్ గొప్ప అధ్యాపకుడని, యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ మహనీయుడని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీటర్ మాథిసన్ అన్నారు. అతని దార్శనికత, ఊహా ప్రపంచం మన విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయని, వేలాది మంది శాస్త్రవేత్తలు అతని రచనల నుంచి ప్రేరణ పొందారని పేర్కొన్నారు. హిగ్స్ బాసన్ సిద్ధాంతం అంటే ఏమిటి? సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం ఓ మహా విస్ఫోటంతో ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు చాలామంది అంగీకరించే సిద్ధాంతం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎలా జరగింది? అణువులు, పరమాణువులు ఎలా పుట్టుకొచ్చాయి? ఆ తరువాతి క్రమంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పాడ్డాయి అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశం. 1964లో పీటర్ హిగ్స్ మరో ఐదుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వ ఆవిర్బావ క్రమానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణాలన్నింటికీ ద్రవ్యరాశిని సమకూర్చే కణం ఒకటి ఉందని ఆయన ప్రతిపాదించారు. విశ్వవ్యాప్తమైన ఒక క్షేత్రంలో (హిగ్స్ ఫీల్డ్)లో కదులుతూ ఈ బోసాన్ ఇతర కణాలకు ద్రవ్యరాశిని అందిస్తుందన్న ప్రతిపాదనపై హిగ్స్తోపాటు అనేక ఇతర శాస్త్రవేత్తలూ చాలా పరిశోధనలు చేశారు. అయినప్పటికీ ఈ కణం ఉనికి స్పష్టం కాకపోవడంతో దీన్ని ‘దైవ కణం’ అని పిలిచేవారు కూడా. ఈ దైవ కణం ఉనికిని గుర్తించేందుకు స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఓ భారీ పరిశోధన ఒకటి చేపట్టారు శాస్త్రవేత్తలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో భూగర్భంలో నిర్మించిన ప్రయోగశాలల ద్వారా అసలు ఈ హిగ్స్ బాసాన్ కణం ఉందా? లేదా? నిర్ధారించేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజరేటర్ కూడా ఉన్న ఈ ప్రయోగశాలలో రెండు ఫొటాన్లను కాంతి వేగంతో పరుగెత్తించి ఢీకొట్టించడం ఫలితంగా అతిసూక్ష్మ సమయంపాటు ఏర్పడే మహా విస్ఫోట కాలం నాటి పరిస్థితులను విశ్లేషించడం ద్వారా బాసాన్ ఉనికిని 2012లో నిర్ధారించగలిగారు కూడా. -
వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?
ఈ డిజిటల్ ప్రపంచంలో దేని గురించి అయినా సమాచారం కావాంటే వెంటనే గూగుల్‌లో సర్చ్ చేస్తాం. ఔనా! వెంటనే ముందుగా వికీపీడియా ఆ తర్వాత మిగతా సైట్ల నుంచి దానికి సంబంధించిన సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తాయి. కానీ వికీపీడియా ప్రతిదాని గురించి సమాచారం ఇచ్చింది గానీ మహిళా శాస్త్రవేత్తల ప్రొఫైల్స్‌ను చాలా తక్కువగానే అందించింది. ఆ లోటు భర్తి చేసేలా మహిళా శాస్రవేత్తలు బయోగ్రఫీని వికీపీడియాలో ఉంచి అందరికీ తెలిసిలే చేసింది. ఈ రంగంలో మహిళలు ఎక్కువమంది వచ్చేలా ఇన్ఫర్మేషన్ ఉంచింది ఓ మహిళా. ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారా? అని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఎవరామె? ఎలా ఆ ఇన్ఫర్మేషన్ని సేకరించింది? బ్రిటన్‌కి చెందిన జెస్సికా వేడ్ తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో భౌతిక శాస్త్ర విభాగం మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత అందులోనే పీహెచ్డీ పూర్తి చేసింది. అప్పుడే ఆమెకు మహిళలు పీహెచ్డీ దాక వచ్చే వాళ్లే అరుదని అర్థమైంది. ఆ తర్వాత ఆమె భౌతిక శాస్త్రవేత్తగా, టెలివిజన్లు, సోలార్ ప్యానెల్లు వంటి ఆప్టికల్ ఎలక్ట్రానిక్ పరికరాలను మరింత శక్తిమంతంగా పనిచేసేలా కార్బన్-ఆధారిత సెమీ-కండక్టర్లను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేస్తుంది. తన పరిశోధనలకు సంబంధించి 15 మంది విస్తృత బృందంలో ఓ ఐదుగురు వ్యక్తుల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తుండగా అందులో తన తోపాటు మరొక మహిళా శాస్త్రవేత్త తప్పించి మిగతా అంతా పురుషులే. అప్పుడే ఆమెకు అస్సలు మహిళా శాస్త్రవేత్తలు ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న మెదిలింది. దీనికి తోడు వికీపీడియాలో కూడా మహిళా శాస్త్రవేత్తల గురించి ఆశించినంత స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతగా లేకపోవడం ఆమెను బాధించింది. అసలు దీనికి ప్రధాన కారణంగా తల్లిదండ్రలని ఆమెకు అనిపించింది. ఎందుకంటే ఏదో రకంగా డిగ్రీ సంపాదించి సెటిల్ అయితే చాలనుకుంటారు. పైగా వారే ఈ రంగంలోకి రానివ్వకుండా అడ్డకుంటున్నట్లు గమనించింది. ఆ జిజ్క్షాశ జెస్సికాను మహిళా శాస్త్రవేత్తల ఇన్ఫర్మేషన్ని వికీపీడియాలో ఉంచే ప్రాజెక్టును చేపట్టాలే చేసింది. ఇలా సుమారు వెయ్యికిపైగా మహిళా శాస్త్రవేత్తల ప్రొఫెల్స్‌ను అందించింది. ఇప్పటి వరకు ఆమె స్వయంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) తదితన నేపథ్యాలలో పనిచేస్తున్న అనేక మంది మహిళా శాస్త్రవేత్తలే కాకుండా ఉనికిలో లేని మహిళా శాస్త్రవేత్తలకు సంబంధించిన బయోగ్రఫీని కూడా ఉంచింది. సైన్సు వంటి రంగాల్లో మహిళలు లేరంటూ గగ్గోలు పెట్టడం కాదు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించి వారిని ఆన్లైన్లో కనపడేలా చేయాలి. దీన్ని చూసైనా యువత ఈ రంగాల్లో రావడానికి ఆయా మహిళా శాస్త్రవేత్తలను ఆదర్శంగా ఎంచుకోవచ్చు లేదా అందుకు దోహదపడొచ్చు అనే లక్ష్యంతోనే ఇలా శోధించి మరీ రాస్తున్నాను అని చెప్పుకొచ్చింది జెస్సికా. ఒక్కో ప్రొఫైల్ అందించాలంటే కొన్ని గంటల సమయం పడుతున్నప్పటికీ పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు కూడా సమానంగా ఉండాలనే ఎజెండాతోనే తాను ఇలా చేస్తున్నట్లు తెలిపింది. ఈ కృషికిగాను జెస్సికాను వికీపీడియా ఎన్నో అవార్డులు, పతకాలతో సత్కరించింది. (చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు) -
సైన్స్ ఆగిపోయిన సమయాన ..
ఆపిల్ చెట్టు నుంచి పండు కిందపడిపోతుందని అందరికీ తెలుసు... కానీ అది కిందనే ఎందుకు పడాలి..? అని అడిగిన వాడు సర్ ఐజాక్ న్యూటన్. ఉత్తమమైన ప్రశ్న వేస్తే సారవంతమైన పరిష్కారాలు బయటికి వస్తాయి. భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని, అంతరిక్షం లో గ్రహాల కదలికలకు సంబంధించిన విషయాలను ప్రతి పాదించిన ఆయన అఖండ మేధావి, గణిత, భౌతిక శాస్త్రవేత్త. ‘‘అంతరిక్షం లో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి... అన్న విషయాన్ని ఆకర్షణ సిద్ధాంతం ప్రతి పాదన చేస్తుందనీ, కానీ అక్కడ గ్రహాలు పెట్టిన వారు ఎవరు? అలా పెట్టి వాటిని నియమబద్ధమైన రీతిలో ఇంత వేగంతో ఇలానే కదలాలని నియంత్రిస్తున్నది ఎవరు? ...అన్న విషయాన్ని చెప్పదు’’ అని కూడా ఆయన అన్నారు అందుకే పెద్దలు..‘‘ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది’’ అంటూంటారు. ఉన్న విషయాన్నే కనుక్కొని ప్రతిపాదిస్తే డిస్కవరీ, సృష్టిలో ఇతః పూర్వం లేని విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకుంటే ఇన్వెన్షన్. ఈ రెండింటి ద్వారా నిరూపణచేస్తూ వెడుతుంది సైన్స్. కానీ ఆ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ వేదాంతం ప్రారంభం అవుతుంది. అదే న్యూటన్ మాటల్లో తెలుస్తున్నది. మంట పైకే రావాలి, కిందకుపోతే ఎవరికీ పనికిరాదు. నీరు కిందకు పోకుండా పైకి వెడితే సృష్టి నిలబడదు. గాలి దానంతట అది కదులుతూ పోతుంటుంది. సముద్రాలు భూమిని పూర్తిగా ముంచెత్తకుండా ఒక హద్దు దగ్గరే ఆగిపోతుంటాయి... ఇవి కంటికి కనిపించే విషయాలే అయినా ఎవరు వాటిని అలా నియంత్రిస్తున్నారు లేదా ఏ శక్తి వాటిని అలా శాసిస్తున్నది అన్న విషయం ఈ భౌతిక నేత్రానికి కనపడేది కాదు. మొగ్గ పువ్వు అవుతుంది. పరిమళం వెదజల్లుతుంటుంది. పువ్వు పిందె అయింది, పిందె కాయ అయింది, కాయ పండు అయింది, గుజ్జు రసమయింది, బాగా పండిన తరువాత చెట్టుకున్న ముచ్చెను వదిలి కిందపడిపోతున్నది.. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో చుక్కలు... ఇవన్నీ మనకు కనపడేవే... కానీ వాటిని చక్కగా నియమబద్ధంగా చేసి మనకు చూపుతున్న ఆ శిల్పి ఎవరు? ఆయన మాత్రం కనపడడు. మరి ఆయనను చూడాలని ఉందా!!! ఒక్కటే మార్గం. భక్తి. దీని ద్వారా భారతదేశం సృష్టి రహస్యాలను విప్పి చూపింది... ఎప్పటినుంచో చూపుతూ వస్తున్నది... అందుకే సనాతనమయింది. వేదం ప్రమాణం గా నిర్ణయింపబడింది. అది ఎవరో రచించినది కాదు.. అది ఈశ్వర వాక్కు. భగవద్గీత కూడా అంతే... అందుకే సర్వజనాదరణ ΄పొందింది. సైన్స్ పరిమితులను గురించి న్యూటన్ నిజాయితీగా చెప్పినా గొప్ప మాట చెప్పడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ... నీటిని ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా, దాహం తీరుస్తుంది... అలా తీర్చడం దాని లక్షణం. సైన్స్ అందుకోలేని లేదా విప్పి చెప్పలేని విషయాలను ఆధ్యాత్మికత జన సామాన్యానికి సుళువుగా అందిస్తుంది భక్తి అనే మాథ్యమం ద్వారా. -
కాలంలో ప్రయాణం సాధ్యమేనా?
టైమ్ ట్రావెల్ అసాధ్యమేమీ కాదు. అదో ఇంజనీరింగ్ సమస్య. అంతే! – ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మైకియో కాకు చేజారితే మళ్లీ దొరకనిది కాలమని అందరికీ తెలుసు. కానీ టైమ్ ట్రావెలే గనక నిజంగా సాధ్యమైతే? చేజారిన క్షణాలను మళ్లీ చవిచూడవచ్చు. సైన్స్ ఫిక్షన్‌గా, కవుల కల్పనగా భాసించిన కాల ప్రయాణం సాధ్యమేనంటున్నారు సైంటిస్టులు! గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తే బాగుండని అనుకోని వాళ్లుండరు. కానీ నిజజీవితంలో అది సాధ్యమయ్యేది కాదని అందరికీ తెలుసు. అయితే ఇంతవరకు మనిషి కల్పనలో భాగమైన టైమ్ మిషన్ ఇక ఎంతమాత్రం కల్పన కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇకపై ఎవరైనా కాలంలో వెనక్కు పయనించవచ్చంటున్నారు. ‘ఆహా! ఎంత శుభవార్త’అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. కాలంలో వెనక్కు పయనించడం సాధ్యమే కానీ అది ఏ టైమ్‌లైన్‌లోకి అన్నది మాత్రం ఎవరూ చెప్పలేరని వివరిస్తున్నారు. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది కదా! ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే ఐన్‌స్టీన్ స్పేస్ అండ్ టైమ్ సూత్రం నుంచి కొత్త సిద్ధాంతం వరకు గుర్తు చేసుకోవాలి. రెండు సమస్యలు ఐన్‌స్టీన్ ప్రకారం స్థలకాలాదులు వాస్తవాలు కావు. అవి సాపేక్షాలు. అసలు ఆ రెండూ కలిసి స్పేస్టైమ్గా కూడా ఉంటాయి. ఈ సిద్ధాంతం ఆధారంగా పలువురు సైంటిస్టులు కాల ప్రయాణానికి సంబంధించిన సూత్రాలు రూపొందించారు. కానీ ఆచరణలో ఇవన్నీ విఫలమయ్యాయి. సూత్రాల వైఫల్యానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. టైమ్ మిషన్ నిర్మించడానికి నెగిటివ్ ఎనర్జీ (డార్క్ మ్యాటర్) కావాలి. కానీ మన చుట్టూ ఉన్న ప్రతిదీ పాజిటివ్ ఎనర్జీతో తయారైనదే. అలాంటప్పుడు టైమ్ మిషన్ కోసం నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసుకురావాలన్నది మొదటి ప్రశ్న. క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం నెగిటివ్ మ్యాటర్‌ను స్వల్పకాలం పాటు స్వల్ప పరిమాణంలో సృష్టించవచ్చు. కాలంలో ప్రయాణానికి అసలు సమస్య టైమ్ కన్సిస్టెన్సీ పారడాక్స్ (కాల స్థిరత్వ విరోధాభాసం). అంటే భూతకాలంలో ఒక సంఘటనలో మార్పు వస్తే దాని ప్రభావం వర్తమానంపై కూడా పడుతుంది. అదే సమయంలో వర్తమానంలో అప్పటికే వచ్చిన మార్పు భూతకాలం తాలూకు సదరు మార్పును జరగనీయకుండా ఆపుతుంది. మరింత సరళంగా చెప్పాలంటే మీరు టైమ్ మిషన్‌లో ఐదు నిమిషాలు వెనక్కువెళ్లి అక్కడ అదే టైమ్ మిషన్‌ను ధ్వంసం చేశారనుకోండి, అలాంటప్పుడు మీకు ఐదు నిమిషాల తర్వాత టైమ్ మిషన్ వాడే అవకాశమే ఉండదు. అలా టైమ్ మిషన్ వాడే అవకాశమే లేనప్పుడు మీరు ఐదు నిమిషాల గతంలోకే వెళ్లలేరు. దాన్ని ధ్వంసం చేయనూ లేరు. అంటే ఏకకాలంలో టైమ్ మిషన్ ఉంటుంది, ఉండదు కూడా. ఇదే కాల ప్రయాణంలో ఎదురయ్యే రెండో పరస్పర విరుద్ధ వాస్తవాల సమస్య. – నేషనల్ డెస్క్, సాక్షి పరిష్కారాలున్నాయి రకరకాల పారడాక్స్ల దృష్ట్యా కాల ప్రయాణం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చారు ప్రముఖ సైంటిస్టు స్టీఫెన్ హాకింగ్. టైమ్ ట్రావెల్ నిజమైతే ఈపాటికి భవిష్యత్ మానవులు మన దగ్గరికి వచ్చేవారన్నది ఆయన అభిప్రాయం. కానీ వీటన్నింటికీ సరికొత్త సమాధానం ఉందంటున్నారు ప్రస్తుత పరిశోధకులు. ఐగార్ డిమిట్రివిక్ నొవికో అనే సైంటిస్టు ప్రకారం మనం భూతకాలంలోకి వెళ్లవచ్చు, కానీ అక్కడ ఎలాంటి మార్పులూ చేయలేం! అంటే భూతకాలంలో ప్రేక్షకులుగా మాత్రమే ఉండగలుగుతాం. అలాంటప్పుడు పారడాక్స్ల సమస్యే రాదు. అయితే పారడాక్స్ సమస్యకు అతి ముఖ్య పరిష్కారం మల్టిపుల్ హిస్టరీలు లేదా మల్టిపుల్ టైమ్‌లైన్స్ అంటారు నవీన శాస్త్రవేత్తలు. దీని ప్రకారం భూతకాలంలోకి వెళ్లవచ్చు. మార్పులూ చేయవచ్చు. కానీ ఆ మార్పులు ప్రస్తుత టైమ్‌లైన్‌లో ప్రతిబింబించవు. మీరు చేసిన మార్పులతో కొత్త టైమ్‌లైన్ స్టార్టవుతుంది. అంటే ఒక ఘటనకు అనేక చరిత్రలుంటాయి. ఈ సిద్ధాంతాన్ని పై ఉదాహరణకు అన్వయిస్తే మీరు ఐదునిమిషాల గతంలోకి వెళ్లేది మీ ప్రస్తుత టైమ్‌లైన్‌లోకి కాదు. అది మరో కొత్త టైమ్‌లైన్. అక్కడ మీరు టైమ్ మిషన్ ధ్వంసం చేసిన తర్వాతి పరిణామాలతో టైమ్‌లైన్ కొనసాగుతుంది. అంటే మీ ఐదు నిమిషాల భూతకాల ప్రయాణం తర్వాత మీకు రెండు చరిత్రలుంటాయి. ఒకటి ప్రస్తుతమున్నది, మరోటి మీరు సృష్టించినది. అయితే మన విశ్వంలో ఇలా అనేక టైమ్‌లైన్స్ ఉండటం సాధ్యమేనా? అంటే క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. ఫైనల్‌గా... ‘టైమ్ ట్రావెల్ సాధ్యమే. కానీ దీనివల్ల టైమ్‌లైన్స్ మారతాయి’అన్నది ప్రస్తుత సైంటిస్టుల సిద్ధాంతం. ఇది ప్రాక్టికల్‌గా నిరూపితమవ్వాలంటే ఒక రియల్ టైమ్ మిషన్ నిర్మాణం జరగాలి. అంతవరకు ఈ సిద్ధాంత రాద్ధాంతాలు నడుస్తూనే ఉంటాయి. -
161 ఏళ్ల గణిత చిక్కుముడి.. రుజువు చేస్తే 7.4 కోట్లు
హైదరాబాద్: సున్నా గణిత ప్రపంచాన్ని మలుపు తిప్పింది. ప్రాచీన ఈజిప్ట్, మెసపటోమియా, చైనాల్లోనూ శూన్య భావన ఉన్నప్పటికీ దానికి ప్రత్యేకంగా గుర్తులేమీ వినియోగించలేదు. సున్నా అవసరం అయిన చోట ఖాళీగా వదిలేసేవారు. భారతీయులు మాత్రమే తొలిసారి శూన్య భావనకు ఒక అంకెను ఆవిష్కరించారు. అక్కడ నుంచి గణితశాస్త్రంలో ఎన్నో కొత్తకొత్త మార్పులు వచ్చాయి. అలాగే గణితశాస్త్రంలో రీమన్ హైపోథీసిస్ ఓ అపరిష్కృత సిద్ధాంతం.. 161 ఏళ్లుగా అది చిక్కుముడిగానే మిగిలిపోయింది. ఏ గణిత శాస్త్రవేత్త దాన్ని పరిష్కరించే సాహసం చేయలేకపోయారు. అలాంటి సిద్ధాంతాన్ని హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కుమార్ ఈశ్వరన్ పరిష్కరించి చూపించారు. రీమన్ హైపోథీసిస్ అంటే ఏమిటి? రీమన్ హైపోథీసిస్ పాథమికంగా.. ప్రధాన సంఖ్యలను లెక్కించడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతిలో పెద్ద సంఖ్యలను సృష్టించవచ్చు. అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ స్మాల పరిష్కరించని మొదటి 10 గణిత సమస్యల్లో రీమన్ హైపోథీసిస్ టాప్‌లో ఉంటుంది. ఇక జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడ్రిచ్ గెస్ ఒక పరిశోధన వ్యాసంలో ఒక సంఖ్యకు దిగువన దాదాపుగా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో గణించే సూత్రాన్ని రాశారు. అది శాస్త్రపరీక్షలో నిలబడలేదు. మరో ప్రఖ్యాత జర్మనీ గణితశాస్త్రవేత్త జార్జ్ ఫ్రెడ్రిచ్ బెర్న్‌హార్డ్ రీమన్ (1826-1866) ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి ‘జెటా ఫంక్షన్’ సాయంతో ప్రధాన సంఖ్యల సంఖ్యను గుర్తించవచ్చని ప్రతిపాదించారు. ‘జెటా ఫంక్షన్ శూన్యస్థానాలు x = 1/2 అనే రేఖ మీద గుమిగూడి ఉంటాయి’ అని రీమన్ ప్రతిపాదించారు. దీనినే రీమన్ దత్తాంశం (రీమన్ హైపోథీసిస్) అని పిలుస్తారు. రుజువు చేస్తే 1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.7.4 కోట్లు) అయితే ఇది వాస్తవమని రుజువు కాకపోవడంతో 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన ‘క్లే మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్’ అనే సంస్థ రీమన్ సిద్ధాంతాన్ని రుజువు చేసినవారికి మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.4 కోట్లు) బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ సిద్ధాంతాన్ని కుమార్ ఈశ్వరన్ రుజువు చేశారు. ఈ సంస్థ గతేడాది జనవరిలో ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది గణిత నిపుణులు కుమార్ ఈశ్వరన్ సిద్ధాంతాన్ని సమీక్షించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది మే 16న నిపుణుల కమిటీ సమావేశమై కుమార్ ఈశ్వరన్ ఆధారాలు రీమన్ దత్తాంశాన్ని నిరూపిస్తున్నాయని ప్రకటించింది. చదవండి: Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట! ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు -
దేవుడు లేడు.. విధీ లేదు
లండన్: ‘అసలు దేవుడే లేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. మన తలరాతను ఎవరూ నిర్ణయించరు. దీనివల్ల నాకు తెలిసిందేమంటే స్వర్గమనేది లేదు. మరణానంతరం జీవితం లేదు. కేవలం మనం కోరుకోవడం వల్లే మరణానంతరం కూడా జీవితం ఉంటుందని అనుకుంటున్నాం. వీటిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సైన్స్ ముందు ఇలాంటివన్నీ తేలిపోతాయి’ అని దివంగత విఖ్యాత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తన చివరి పుస్తకంలో పేర్కొన్నారు. ‘బ్రీఫ్ ఆన్సర్స్ టు బిగ్ క్వశ్చన్స్’ పేరిట తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని జాన్ ముర్రే అనే సంస్థ ప్రచురించింది. ‘నా లాంటి వికలాంగులు దేవుడి శాపానికి గురయ్యారని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. కానీ ఇలాంటి నమ్మకాల్ని ప్రకృతి ధర్మాలు వివరిస్తాయని భావిస్తున్నా’ అని ‘ఈజ్ దేర్ గాడ్?’ అనే చాప్టర్లో హాకింగ్ వ్యాఖ్యానించారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాదిరిగా తాను కూడా ‘దేవుడు’ అనే పదాన్ని ఓ వ్యక్తికి కాకుండా ప్రకృతి ధర్మాలకు ఆపాదిస్తానని చెప్పారు. ఈ శతాబ్దం చివరి నాటికి దేవుడి మనుసులో(ప్రకృతిలో లోతుల్లో) ఏముందో తెలిసిపోతుందని అన్నారు. ఈ విశ్వం అందరికీ ఒకటేనని, దాన్ని సృష్టించేందుకు దేవుడు అక్కర్లేదని చెప్పారు. హాకింగ్ ఆలోచనలు, హాస్య చతురత, సిద్ధాంతాలు, రచనల్ని పొందుపరచిన ఈ పుస్తకాన్ని ఆయన వారసత్వ సంపదగా భావిస్తామని ఆయన కూతురు ల్యూసీ అన్నారు. ఈ పుస్తకం రాయల్టీ హక్కుల ద్వారా సమకూరే ఆదాయంలో కొంత భాగం మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్, స్టీఫెన్ హాకింగ్ ఫౌండేషన్‌కు వెళ్తాయి. -
ఈ గీతతో సముద్రం మీదే ప్రయాణం..
ఈ చిత్రంలో ఎరుపు రంగు గీతను చూశారా. ఈ గీత ఆకారం చూడటానికి అనేక వంపులు ఉన్నట్టు ఉంది కదా. అయితే నిజానికిది అచ్చంగా నిలువు గీత. అదేంటీ గీత అన్ని వంకరలు ఉంటే నిలువు గీత అంటారేంటీ అనుకుంటున్నారా.. నిజంగానే ఇది నిలువు గీతే.. ఎందుకంటే మన భూమి గోళాకారంలో ఉండటం వల్ల దానిమీద నిలువు గీసినా ఈ చిత్రంలోని మ్యాప్‌లో కనిపించినట్టుగా అనేక వంకరలు వస్తుంది. అలాగే మ్యాప్‌పై పెద్ద సరళ రేఖ గీసినా.. భూమి మీదకి వచ్చేసరికి అనేక వంకరలు వస్తుంది. ఈ గీతకు మరో విశిష్టత ఉంది. ఈ గీతను పట్టుకుని వెళితే.. ఎక్కడా భూమిపై అడుగు పెట్టకుండా కేవలం సముద్ర మార్గం గుండా ప్రయాణించవచ్చు. ఎందుకంటే ఇది సముద్ర మార్గం గుండా ప్రయాణించే అతిపెద్ద సరళ రేఖ. ఈ రేఖను ఐదేళ్ల క్రితం జార్జీయాకు చెందిన పాట్రిక్ అండర్సన్ అనే వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మ్యాప్‌పై రేఖను గీశాడు. అయితే ఇది సరైనదా.. కాదా కనుక్కునేందుకు గాను ఇటీవల ఐర్లాండ్‌లోని భౌతిక శాస్త్రవేత్త రోహన్, ఇండియన్ ఐబీఎంలో పనిచేస్తున్న ఇంజనీర్ కుశాల్ ముఖర్జీలు అల్గారీథమ్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని ఉపయోగించి మ్యాప్‌పై గీసిన ఈ రేఖ సరైనదని వారు కనుగొన్నారు. బలూచిస్తాన్‌లో మొదలయ్యే ఈ అతిపెద్ద సముద్ర ప్రయాణం అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ అట్లాంటిక్, పసిఫిక్, సౌత్ బేరింగ్ సముద్రాల మీదుగా సాగి రష్యాలోని కమ్చట్కా తీర ప్రాంతంలో ముగుస్తుంది. ఈ మొత్తం ప్రయాణం 32 వేల కిలోమీటర్లు ఉంటుంది. -
కాలిఫోర్నియా యూనివర్సిటీకి భారతీయుడి భారీ విరాళం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన భౌతికశాస్త్రవేత్త మణి భూమిక్.. కాలిఫోర్నియా యూనివర్సిటీకి 11 మిలియన్ డాలర్లను(సుమారు రూ. 74 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ప్రకృతి సూత్రాల పరిశోధన కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికోసం భూమిక్ ఈ భారీ విరాళాన్ని అందజేశారు. యూనివర్సిటీ చరిత్రలో ఇదే అతిపెద్ద విరాళమని ఛాన్సలర్ గినే బ్లాక్ తెలిపారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పరిశోధన కేంద్రం ‘భూమిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ థిరీటికల్ ఫిజిక్స్’ను మణి భూమిక్ నిర్వహిస్తున్నారు. కంటికి వాడే లేజర్ చికిత్స అభివృద్ధి చేయడంలో భూమిక్‌ది కీలక పాత్ర. పశ్చిమబెంగాల్లోని ఓమారుమూల గ్రామంలో ఆయనకు ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. చిన్నప్పుడు పూరి గుడిసెలో పెరిగిన భూమిక్ నాలుగు మైళ్లు నడిచి స్కూల్‌కు వెళ్లేవాడు. 1958లో కోల్‌కతా యూనివర్సిటీలో పీజీ, ఖరగ్‌పూర్ నుంచి ఐఐటీ భౌతికశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. 1959లో 3 డాలర్లతో అమెరికాకు వెళ్లిన భూమిక్ 1961లో జిరాక్స్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్‌లో లేజర్ సైంటిస్టుగా చేరాడు. 2011లో భారత ప్రభుత్వం మణి భూమిక్‌ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.