ఈ డిజిటల్ ప్రపంచంలో దేని గురించి అయినా సమాచారం కావాంటే వెంటనే గూగుల్‌లో సర్చ్ చేస్తాం. ఔనా! వెంటనే ముందుగా వికీపీడియా ఆ తర్వాత మిగతా సైట్‌ల నుంచి దానికి సంబంధించిన సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తాయి. కానీ వికీపీడియా ప్రతిదాని గురించి సమాచారం ఇచ్చింది గానీ మహిళా శాస్త్రవేత్తల ప్రొఫైల్స్‌ను చాలా తక్కువగానే అందించింది. ఆ లోటు భర్తి చేసేలా మహిళా శాస్రవేత్తలు బయోగ్రఫీని వికీపీడియాలో ఉంచి అందరికీ తెలిసిలే చేసింది. ఈ రంగంలో మహిళలు ఎక్కువమంది వచ్చేలా ఇన్ఫర్మేషన్ ఉంచింది ఓ మహిళా. ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారా? అని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఎవరామె? ఎలా ఆ ఇన్ఫర్మేషన్‌ని సేకరించింది?
బ్రిటన్‌కి చెందిన జెస్సికా వేడ్ తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో భౌతిక శాస్త్ర విభాగం మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత అందులోనే పీహెచ్‌డీ పూర్తి చేసింది. అప్పుడే ఆమెకు మహిళలు పీహెచ్‌డీ దాక వచ్చే వాళ్లే అరుదని అర్థమైంది. ఆ తర్వాత ఆమె భౌతిక శాస్త్రవేత్తగా, టెలివిజన్‌లు, సోలార్ ప్యానెల్‌లు వంటి ఆప్టికల్ ఎలక్ట్రానిక్ పరికరాలను మరింత శక్తిమంతంగా పనిచేసేలా కార్బన్-ఆధారిత సెమీ-కండక్టర్‌లను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేస్తుంది. తన పరిశోధనలకు సంబంధించి 15 మంది విస్తృత బృందంలో ఓ ఐదుగురు వ్యక్తుల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తుండగా అందులో తన తోపాటు మరొక మహిళా శాస్త్రవేత్త తప్పించి మిగతా అంతా పురుషులే.
అప్పుడే ఆమెకు అస్సలు మహిళా శాస్త్రవేత్తలు ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న మెదిలింది. దీనికి తోడు వికీపీడియాలో కూడా మహిళా శాస్త్రవేత్తల గురించి ఆశించినంత స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతగా లేకపోవడం ఆమెను బాధించింది. అసలు దీనికి ప్రధాన కారణంగా తల్లిదండ్రలని ఆమెకు అనిపించింది. ఎందుకంటే ఏదో రకంగా డిగ్రీ సంపాదించి సెటిల్ అయితే చాలనుకుంటారు. పైగా వారే ఈ రంగంలోకి రానివ్వకుండా అడ్డకుంటున్నట్లు గమనించింది.
ఆ జిజ‍్క్షాశ జెస్సికాను మహిళా శాస్త్రవేత్తల ఇన్ఫర్మేషన్‌ని వికీపీడియాలో ఉంచే ప్రాజెక్టును చేపట్టాలే చేసింది. ఇలా సుమారు వెయ్యికిపైగా మహిళా శాస్త్రవేత్తల ప్రొఫెల్స్‌ను అందించింది. ఇప్పటి వరకు ఆమె స్వయంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) తదితన నేపథ్యాలలో పనిచేస్తున్న అనేక మంది మహిళా శాస్త్రవేత్తలే కాకుండా ఉనికిలో లేని మహిళా శాస్త్రవేత్తలకు సంబంధించిన బయోగ్రఫీని కూడా ఉంచింది. సైన్సు వంటి రంగాల్లో మహిళలు లేరంటూ గగ్గోలు పెట్టడం కాదు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించి వారిని ఆన్‌లైన్‌లో కనపడేలా చేయాలి.
దీన్ని చూసైనా యువత ఈ రంగాల్లో రావడానికి ఆయా మహిళా శాస్త్రవేత్తలను ఆదర్శంగా ఎంచుకోవచ్చు లేదా అందుకు దోహదపడొచ్చు అనే లక్ష్యంతోనే ఇలా శోధించి మరీ రాస్తున్నాను అని చెప్పుకొచ్చింది జెస్సికా. ఒక్కో ప్రొఫైల్ అందించాలంటే కొన్ని గంటల సమయం పడుతున్నప్పటికీ పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు కూడా సమానంగా ఉండాలనే ఎజెండాతోనే తాను ఇలా చేస్తున్నట్లు తెలిపింది. ఈ కృషికిగాను జెస్సికాను వికీపీడియా ఎన్నో అవార్డులు, పతకాలతో సత్కరించింది.
(చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment